Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు

Vol 3 సంచిక 3
May/June 2012


"నేను మీకోసం ఒక ఒక సందేశాన్ని అందిస్తున్నాను, అదే ప్రేమ సందేశం. ప్రేమయే దేవుడు, దేవుడే ప్రేమ. ప్రేమ ఉన్నచోట దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తాడు. వీలైనంత ఎక్కువమందిని ప్రేమించండి. మరింత గాఢంగా ప్రేమించండి; మరియు  ప్రేమను సేవగా మార్చండి. సేవను ఆరాధనగా మార్చండి; ఇదే అత్యున్నత ఆధ్యాత్మిక సాధన." 
- శ్రీ సత్య సాయి బాబా, సత్య సాయి వాణి, వాల్యుము 5, చాప్టర్ 17

 

 

 

“సాధారణంగా, మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకుంటాడు; ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను దుఃఖాన్ని మరియు బాధను కోరుకోడు! ఆనందం మరియు సంతోషాన్ని తన శ్రేయోభిలాషులుగా దుఃఖాన్ని మరియు బాధను తన ప్రత్యక్ష శత్రువులుగా భావిస్తాడు. ఇది చాలా తప్పు. ఒకరి సంతోషంగా ఉన్నప్పుడు, దుఃఖం తనకోసం ఎదురుచూస్తూనే ఉందని గ్రహించాలి; ఆనందాన్ని కోల్పోతున్నామేమో  అనే బాధ మనిషిని సుఖంగా ఉండనివ్వదు. ముఖము- విచారణ, విచక్షణ, అంతః పరిశీలన మరియు తప్పు  చేయడాన్ని నిరోధించే దిశగా మనిషిని నడిపిస్తుంది. దుఃఖము మనిషిని సోమరితనం నుంచి, అతిశయం నుంచి దూరం చేస్తుంది. ఆనందము మనిషిని తను మనిషిగా చేపట్టవలసిన బాధ్యతల నుంచి దూరం చేస్తుంది. గర్వం పెరిగేలా చేస్తుంది తద్వారా అనేక పాపాలకు వడి గట్టేలా చేస్తుంది. దుఃఖము మనిషిని నిరంతరం జాగరూకత మరియు  శ్రద్ధ వహించే విధంగా చేస్తుంది.”

“కాబట్టి, దుఃఖమే నిజమైన స్నేహితుడు; ఆనందం మన విలువను తగ్గిస్తూ నీతిబాహ్యమైన కోరికలు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఇదే నిజమైన శత్రువు. వాస్తవానికి, దుఃఖము మన కన్నులను తెరిపించి; శ్రీయ పరివర్తనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది మనిషిని కొత్త అనుభవాలు విలువలతో కూడిన కొత్త అనుభవాలను అందుకునేలా చేస్తుంది. ఆనందము మనిషిని జ్ఞానాత్మకమైన అనుభవాలకు దూరంచేసి మొరటి వానిగా మారుస్తుంది. కనుక, దుఃఖాలను, వేదనలను నిజమైన స్నేహితులుగా భావించాలి; లేదా కనీసం అవి మనకు శత్రువులు కాదు అని భావించాలి. దుఃఖాన్ని, సుఖాన్ని భగవంతుని ఆశీస్సులుగా భావించినప్పుడు మనిషి ముక్తి పొందటానికి మార్గం సుగమం అవుతుంది."

"ఇది ప్రాథమిక అజ్ఞానం అని తెలుసుకోలేరు. అజ్ఞానం ఉన్న వ్యక్తి అంధుడు; వాస్తవానికి ఆనందం మరియు దుఃఖం ఒక అంధుడు మరియు అతనికి ఎల్లప్పుడూ తోడుగా వచ్చే మరియొక దృష్టి కలిగిన వాడుతో సమానం. ఒక యజమాని అందుడిని తన ఇంటి లోనికి ఆహ్వానిస్తే అతనితో పాటు దృష్టి ఉన్న వాడు కూడా లోపలికి వస్తాడు ఎందుకంటే వారు ఇద్దరూ విడదీరాని వారు. అలాగే ఆనందము మరియు దుఃఖము విడదీయరానివి. కేవలం ఒక్కటే కావాలని మనం కోరుకోవడం సాధ్యం కాదు. అంతేకాకుండా దుఃఖము ఆనందం యొక్క విలువను పెంచుతుంది. నువ్వు దుఃఖాన్ని అనుభవించిన తర్వాతే ఆనందం యొక్క విలువను కనుగొనగలుగుతావు”. కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్పి ద్వంద్వత్వం యొక్క అల్పతను అర్థం చేసుకునేలా చేశాడు.”
- శ్రీ సత్య సాయి బాబా, గీతావాహిని