Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

Vol 3 సంచిక 3
May/June 2012


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ప్రజలు వైబ్రియానిక్స్ శిక్షణను స్వీకరించడానికి చూపించే ఉత్సాహాన్ని చూసి హృదయపూర్వక ఆనందం కలుగుతోంది. గత నెలలో భారతదేశం నుండి సర్టిఫికేట్ పొందిన ఉపాధ్యాయులు నాగపూర్ మరియు జబల్ పూర్ లో రెండు AVP వర్క్ షాప్ లు నిర్వహించారు. ఒక్కొక్క వర్క్ షాప్ లో 18 మంది కొత్త అభ్యాసకులకు శిక్షణ ఇచ్చారు, మరియు నూతన అభ్యాసకులు తమ విలువైన అభిప్రాయాన్ని అందించారు. సాయి వైబ్రియానిక్స్  కుటుంబము లోనికి చేరిన ఈ కొత్త  సాధకుల తమ సేవా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు అభినందిస్తూ ఇది విజయ వంతం కావాలని మేము కోరుకుంటున్నాము.

ఎనిమిది మంది అభ్యాసకులు కోసం ఇటీవల లండన్లో సీనియర్ ప్రాక్టీషనర్ SVP వర్క షాప్ నిర్వహించారు. వారు అలాంటి అద్భుతమైన ఫలితాలను పొందారు వారు జూనియర్ ప్రాక్టీస్ చేసిన కేవలం సంవత్సరం తర్వాత SVPలు కావడానికి ఆసక్తిగా ఉన్నారు. అందరూ అధిక మార్కులుతో (91-98 శాతం) ఉత్తీర్ణత సాధించారు, మరియు మరింత సేవ చేయడానికి సంకల్పం చేసుకున్నారు! ఈ నెలలో మరొక వర్క్ షాప్ లండన్ లో జరగాల్సి ఉంది. ఇది సుశిక్షితులైన మా సర్టిఫైడ్ టీచర్ చేత నిర్వహించబడుతుంది. ఇప్పుడు ఈ విశ్రాంత అధ్యాపకురాలు అద్భుతమైన ఫలితాలతో తన పూర్తి సమయం వైబ్రీయానిక్స్ సేవ చేస్తోంది. ఆమె ఒక వైద్య శిబిరం సియెరా లియోన్ లో నిర్వహించి గత వారం తిరిగి వచ్చింది. అక్కడ 7రోజుల్లో 306 మంది రోగులకు చికిత్స చేసి నలుగురికి JVP గా మారడానికి శిక్షణ కూడా ఇచ్చారు.

ఉపాధ్యాయ శిక్షణ కోర్సు తీసుకోవడానికి తగిన అనుభవం ఉన్న SVP లు అందరిని మేము ప్రోత్సహిస్తున్నాము. తద్వారా ఆయా రాష్ట్రాల్లో శిక్షణా శిబిరాలు మరియు పునశ్చరణ తరగతులు నిర్వహించవచ్చు. దాని గురించి ఆలోచించండి. అలాగే JVP లు  సీనియర్ VP లుగా దరఖాస్తు చేసుకోవడానికి స్వాగతిస్తున్నాం.

అనేక సందర్భాల్లో వైబ్రియానిక్స్ గురించి స్వామి నుండి నేరుగా ఆదేశాలు మరియు సలహాలను అందుకున్నాను. అవి మరపురాని అద్భుత అనుభవాలు. 2005 జనవరి 19న ఒక ఇంటర్వ్యూలో స్వామి మీ దయతో క్యాన్సర్ మరియు ఎయిడ్స్ కూడా నయం అవుతున్నాయి అని చెప్పినప్పుడు స్వామి మాట్లాడుతూ “మీరు ప్రేమతో చికిత్స చేసినప్పుడు అందరూ స్వస్థత పొందుతారు” అన్నారు. ఈ ఇంటర్వ్యూ దాదాపు ఒక దశాబ్దం ముందు నేను 2000-3000 మంది రోగులకు చికిత్స పూర్తి చేసిన సంఘటనను జ్ఞప్తికి తెస్తోంది.

ఒకరోజు నేను నా రోగి రికార్డుల నోట్ బుక్ దర్శనానికి తీసుకు వెళ్ళాను. వెంటనే నాకు ఇంటర్వ్యూ లభించింది ఈ చికిత్స చాలా అద్భుతంగా ఉందని మరియు అందరూ స్వామి దయతో మెరుగవుతున్నారని  నేను స్వామికి చెప్పడానికి ఉవ్విళ్లూరుతున్నాను.    ఆ రోజు ఇంటర్వ్యూ గదిలో చాలామంది ఉన్నారు, మరియు నేను పుస్తకాన్ని నా పక్కన నేలపై ఉంచాను ఇంటర్వ్యూ ముగింపుకు చేరుకుంటోంది. నా ఉత్సాహమంతా నిరాశగా మారిపోతోంది. అదే సమయంలో స్వామి అగర్వాలా నీ పక్కనే నేల పైన ఉన్న పుస్తకం ఏమిటి అని అడిగారు. ఇక నా ఉత్సాహం ఎలా ఉందో మీరు ఊహించుకోవచ్చు. నా ఉత్సాహానికి హద్దులే లేవు. నేను మోకాళ్ళపై వంగి స్వామికి ఆ పుస్తకాన్ని చూపించడానికి ప్రయత్నించాను. ఒక్కొక్క పేజీ స్వామికి చూపిస్తూ ఎంతో ఆనందకరమైన ఉత్సాహంతో “స్వామీ చూడండి ఈ అద్భుతమైన వైబ్రియానిక్స్ మందులతో ఈ పేషెంట్లు అందరూ కూడా స్వస్థత పొందారు” అని చెపుతూ ఉంటే స్వామి ఎంతో ఆనందంతో తన ముఖం మీద చిరునవ్వులు చిందిస్తూ మీరు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ఈ రోగులందరూ బాగుపడుతూ ఉండడం నాకు తెలుసు కానీ అది మీ ఔషధాలవల్ల కాదు నేను మీ రోగులందరి వ్యాధులను నయం చేస్తున్నాను అని చెప్పారు. ఈ ఒక్క వాక్యం నన్ను భూమిపైకి అణచివేసింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆ సమయంలో ఇంటర్వ్యూ గది నుండి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పారిపోవాలని కూడా అనుకున్నాను. సర్వజ్ఞుడైన స్వామి నా అహం కారము చాలా ఎత్తుకు పెరిగి ఉన్నదని గ్రహించారు కాబోలు ఒక్క స్ట్రోక్ తో దానిని నేల మీదకు తీసుకువచ్చారు. నేను ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. అహంకారం ఎంతో సూక్ష్మమైనది అనీ అది మనకు తెలియకుండానే మనలో ప్రవేశిస్తుందని గ్రహించాను.

ఈ రెండు సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మన వద్దకు వచ్చే రోగులను ప్రేమతో చికిత్స చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వైద్యం చేయడంలో ప్రేమ చాలా ముఖ్యమైన అంశం. ప్రేమ ఎంతో శక్తివంతమైనది, ఎటువంటి అడ్డంకులు లేనిది కనుక ఎన్నో అద్భుతాలను చేస్తుంది! యాదృచ్ఛికంగా మన రికార్డులలో ఇటువంటి ప్రేమ ద్వారా స్వస్థత పొందిన కేసుల గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ప్రతీ రోగికి చికిత్స చేసే ముందు మనలో అహంకారం చొరబడకుండా చూడమని స్వామిని ప్రార్థిద్దాం ఎందుకంటే రోగం నయం చేయగలిగే ఏకైక వ్యక్తి స్వామియే. మనము  కేవలం నిమిత్తమాత్రులము, స్వామి చేతిలో పనిముట్లు మాత్రమే. అక్కడ స్వామియే డాక్టరు.

ప్రేమతో సాయి సేవలో మీ

జిత్ కె అగర్వాల్