వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 2 సంచిక 2
March 2011
"మీరు దేవుని యొక్క సేవకుడుగా ఉన్నప్పుడు, సర్వశక్తులు మరియు ఆనందం మీకివ్వబడతాయి. ఒక యజమాని వలె ఉండడానికి ప్రయత్నిస్తే, మీ చుట్టూ ఉన్నవారిలో అసూయ, ద్వేషం, కోపం మరియు దురాశను కలిగించినవారవుతారు. మీరు దేవుని చేతిలో ఉన్న ఒక సాధనమని భావించండి. దేవుని మిమ్మల్ని తీర్చిదిద్ది ఒక సాధనముగా ఉపయోగించనివ్వండి."
-సత్య సాయి బాబా
"సేవను అత్యుత్తమమైన సాధనగా భావించండి (ఆధ్యాత్మిక క్రమశిక్షణ). ఇది మీరు దక్కించుకున్నట్టు వంటి ఒక గొప్ప అవకాశం. మీరు చేసే ధ్యానం లేదా జపం కంటే, ఈ పెద్ద సమావేశాలకు మధ్య మీరు చేసే సేవ, మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కాని, మీరు చేసే సేవ ద్వారా ఈ ప్రపంచంలో పరివర్తన తీసుకు రావచ్చని అనుకోవద్దు. సేవ యొక్క అసలైన విలువ మీలో కలిగే పరివర్తన. సేవను ఒక సాధన వలె చేయండి. అప్పుడు మీరు వినయపూర్వకంగాను ఆనందంగాను ఉండగలరు. మీరు ఇతరులను అభివృద్ధిపరచుతున్నామని గర్వపడవద్దు, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి".
-సత్య సాయి బాబా
"మానవులకు దేవుని మార్గాలు అర్ధం కావు. ఒక ప్రత్యేక కార్యక్రమం ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒక నిర్దిష్ట సమయంలో ఎందుకు జరుగుతుందని వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? దేవునికి మాత్రమే సర్వము ఎరుక. కాని మానవులు చెడుగా మాట్లాడడం లేదా తీర్మానించడం వంటివి చేస్తుంటారు. ఉదాహరణకు ఇక్కడ ఎవరైనా అనారోగ్యంతో మరణిస్తే (ప్రశాంతి నిలయం). ఎవరైనా మరణాన్ని తప్పించుకోగలరా? అవతార మూర్తులు కూడా వారు వచ్చిన కార్యక్రమం పూర్తవ్వగానే భౌతిక రూపాన్ని విడిచిపెడతారు. మీకు కావాల్సిన వారు మరణించారని దేవునిపై నమ్మకం కోల్పోవడం అవివేకము".
-సత్య సాయి బాబా