అదనపు సమాచారం
Vol 2 సంచిక 1
January 2011
అధ్బుతమైన దోసకాయ
ఈ సమాచారం అనేక వారాల క్రితం జరిగిన న్యూయార్క్టైమ్స్వారి " స్పాట్లైట్ఆన్దిహోమ్" సిరీస్లో, సాధారణ సమస్యలును పరిష్కరించడానికి సృజనాత్మక మరియు కొత్తమార్గాలను అన్వేషించడంలో బాగంగా ప్రచురింపబడింది.
1. దోసకాయలలో మనకు ప్రతి రోజు కావాల్సిన విటమిన్లు చాలా ఉన్నాయి. కేవలం ఒక దోసకాయ విటమిన్బి 1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B5, విటమిన్ B6, ఫోలిక్యాసిడ్, విటమిన్సి, కాల్షియం, ఇనుము, పొటాషియం, జింక్, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్కలిగి ఉంటుంది .
2. మధ్యాహ్నం అలసిపోతున్న ఫీలింగ్ ఉందా? కేఫ్ఫిన్కలిగి ఉన్న సోడాను వదిలిపెట్టండి మరియు ఒక దోసకాయను తీసుకోండి. ఇది B విటమిన్లు మరియు పిండి పదార్థాలుకు మంచి మూలం. అందువలన కొన్ని గంటల పాటు శక్తి నివ్వగల సామర్ద్యం దోసకాయకుంది.
3.స్నానం తర్వాత మీ బాత్రూమ్ అద్దంను పొగమంచు కప్పేసిందా? అద్దంను ఒక దోసకాయ ముక్కతో రుద్దడం ప్రయత్నించండి. ఇది పొగమంచు తొలగించడానికి మంచి ఉపాయం మరియు స్పా వంటి సువాసన కూడా అందిస్తుంది.
4. మీ పూల మొక్కలను క్రిములు పురుగులు నాశనం చేస్తునాయా? కొన్ని దోసకాయ ముక్కలను ఒక ఫాయ్టిన్లో (pie tin) వేసి వాటిదగ్గర ఉంచండి. మీ తోట క్రిమి కీటక రహితంగా తయారవుతుంది. దోసకాయలో ఉన్న రసాయనాలు అల్యూమినియంతో చర్య జరిపి మనుషులు గ్రహించలేని, కాని క్రిమికీటకాలను తరిమి కొట్టే ఒక వాసనను వెదజల్లుతుంది.
5. బయటకు లేదా ఈత కొలనుకు వెళ్ళే ముందు సెల్యులిట్cellulite తొలగించడానికి ఒక వేగవంతమైన మరియు సులువైన మార్గం గురించి ఆలోచిస్తున్నారా? కొన్ని నిమిషాలు మీ సమస్య ప్రాంతం వెంట ఒక లేదా రెండు దోసకాయ ముక్కతో రుద్ది ప్రయత్నించండి. దోస కాయలో ఉన్న పైటో కెమికల్రసాయనాలు మీ చర్మం యొక్క కొల్లజేన్ను గట్టి పరిచి మీ చర్మం బిగుతుగా మరియు సెల్యులిట్కన పడకుండా ఉండేట్టు చేస్తాయి. ఇది చర్మం మీద మడతలకు కూడా అద్బుతంగా పనిచేస్తుంది!!!
6. హ్యాంగోవర్లేదా భయంకరమైన తలనొప్పి నివారించడానికి ఉపాయం కావాలా? అయితే పడుకొనే ముందు కొన్ని దోసకాయ ముక్కలు తిని పొద్దున్నే తాజాగా తల నొప్పి లేకుండా నిద్రలేవండి. దోసకాయాలలో తగినంత చక్కెర, విటమిన్ B మరియు ఎలెక్ట్రోలైట్స్ ఉంటాయి !! ఇవి శరీర సమతుల్యతను మరియు కోల్పోయిన అవసరమైన పోషకాలు తిరిగి మనకు లబించేల చేస్తాయి
7.మధ్యాహ్నం లేదా సాయంత్రం వేసే చిరు ఆకలి పోగొట్టుకోవాలని ఉందా? దోసకాయలును శతాబ్దాలుగా యూరోపియన్వ్యాపారులు, వేటగాళ్ళు మరియు యాత్రికులు శీఘ్ర భోజనం కోసం ఉపయోగించేవారు
8. ఒక ముఖ్యమైనస మావేశo లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకలిగి మరియు మీరు మీ బూట్లు మెరుగు పరచేందుకు తగిన సమయం లేదు అని బాధపడుతున్నారా? షూ మీద తాజాగా కోసిన దోసకాయ ముక్కతో రుద్ది ప్రయత్నించండి. దీని రసాయనాలు గొప్ప మెరుపును అందించటంతో పాటు నీటిని కూడా అంటకుండా చేస్తాయి
9. తలుపు లేదా కిటికీ శబ్దం చేస్తూ తెరుచుకుంటూ ఉందా మరియు WD-40, ఇంటి నునె లేదా? ఒక దోసకాయ ముక్క తీసుకోండి మరియు సమస్యాత్మక కీలు మీద రుద్దండి. చిటికెలో శబ్దం మాయం!
10. ఒత్తిడిలో ఉన్నారా మరియు ముఖ, శరీర మర్దన కోసం లేక స్పా సందర్శించడానికి సమయం లేదా? మొత్తం దోసకాయ కోసి మరిగే నీటి కుండలో వేయండి. దోసకాయ నుండి విడుదలయ్యే రసాయనాలు మరియు పోషకాలు వేడి నీటితో చర్య జరిపి ఆవిరిలో విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసుకు స్వాంతన చేకూర్చే చక్కని సువాసన అందిస్తాయి. ముఖ్యంగా బాలింతలకు మరియు పరీక్షల సమయంలో కళాశాలవిద్యార్థులుకు !
11. అప్పుడే వ్యాపార లావాదేవీలు పూర్తి చేసి భోజనం ముగించి గమ్లేదామింట్లేదని తెలుసుకున్నారా? ఒక దోసకాయ ముక్క తీసుకోండి మరియు మీ నాలుకతో మీ నోటి కప్పుపై బాగాన్ని 30 సెకన్ల పాటు అదిమి ఉంచండి. దోసకాయలో ఉన్న పైటో కెమికల్రసాయనాలు చెడు శ్వాస కలిగించే మీ నోటిలోని బ్యాక్టీరియాను చంపుతాయి.
12. మీ సింక్లు లేదా స్టెయిన్లెస్స్టీల్శుభ్రంచేయడానికి హరిత మార్గం గురించి ఆలోచిస్తున్నారా? ఒక దోసకాయ ముక్క తీసుకోండి మరియు మీరు శుభ్రం చేయడానికి కావలసిన ఉపరితలo మీద రుద్దండి. ఇది సంవత్సరాల తరబడి ఉన్న జిడ్డును వదిలించడమే కాకుండా తళతళలాడే మెరుపును, మీ చేతులకు వ్రేళ్ళకు ఎ మాత్రం హాని కలగకుండా ఇస్తుంది .
13. కలాన్ని ఉపయోగిస్తూ ఏదైనా పొరపాటు చేసారా? అయితే దోసకాయ ముక్కపై పొర తీసేసి మెల్లగా ఆ కలం రాతపై రాయండి. గోడలును అలంకరించేందుకు పిల్లలు ఉపయోగించిన క్రేయాన్స్మరియు గుర్తులపై కూడా ఇది అద్బుతంగా పని చేస్తుంది !!
ఒక విశిష్ట దీవెన: కళ్ళద్దాల లీల
అనా ఒక అంకిత బావం గల విబ్రియో అబ్యాసకురాలు. ఆవిడ తరచుగా పుట్టపర్తి చుట్టుప్రక్కల గ్రామాలను సందర్శించి అక్కడి రోగులకు వైద్యం అందిస్తుండేది. ఈ మధ్యనే ఆవిడ ఒక గ్రామంలో చాల మంది కంటి చూపు సమస్యతో బాధపడుతునట్లు గమనించింది. ఆవిడ వైద్యం వారికి ఉపయోగపడుతున్నా 27 మందికి కళ్ళద్దాలు వాడవలసిన అవసరం ఉన్నట్లు కానీ వారికి అవి కొనగలిగే ఆర్దిక స్తోమత లేనట్లు ఆవిడ గుర్తించింది .
అనా వారికి తను కేవలం విబ్రియో వైద్యం మాత్రమే అందిచగలని కళ్ళద్దాలు సమకుర్చలేనని తెలిపింది . అనా మరియు ఆమె భర్త వారిని వదలివెళుతుండగా ఆ రోగులు తను ఈసారి తమ దగ్గరికి వచ్చేటప్పుడు కళ్ళద్దాలు తీసుకురావల్సిందిగా ప్రాదేయపడ్డారు. అనా భర్త సరదాగా స్వామి ఏమి చేస్తారో చూద్దామన్నారు.
కొన్ని వారముల తరువాత ఒక మిత్రుడు అనా మరియు ఆమె భర్తను చూడడానికి వచ్చారు. అతను కొంత సందిగ్దంలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఇండియా బయలుదేరి వచ్చే ముందు ఎవరో వ్యక్తి వచ్చి కళ్ళద్దాలు కల డబ్బా ఇచ్చి, వాటిని తనతో పాటు ఇండియా తీసుకెళ్లమని అక్కడ అవసరం ఉన్నవారికి వాటిని ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. అయిష్టంగానే ఈ మిత్రుడు వాటిని పుట్టపర్తి తీసుకు వచ్చి వాటిని స్వామికి ఇవ్వాలని ప్రయత్నిస్తే స్వామి వాటిని వద్దనారు. ఆవిధంగా ఆకాశం నుంచి క్రిందపడ్డట్లుగా కళ్ళద్దాల డబ్బా అనా మరియు ఆమె భర్త వడిలో పడినట్లైంది!
అనా మరియు ఆమె భర్త ఈ కళ్ళద్దాల డబ్బాను తమ తదుపరి గ్రామ సందర్శన సందర్బంగా తీసుకేళ్ళారు. వారు కనీసం కొన్ని కళ్ళద్దాలైనా కొంత మందికి సరిపోగలవని బావించారు. గ్రామస్తులు చాల సంతోషంగా ఆ డబ్బా చుట్టుచేరారు. ఒక వ్యక్తి ఒక కళ్ళద్దాని తీసుకొని పెట్టుకోగా అవి తనకు సరిపోలేదు. అనా అతనికి ఇంకొకటి ఇవ్వగా అవి సరిగ్గా సరిపోయింది.ఇంకొక వ్యక్తి వచ్చి మొదటి కళ్లద్దాలను పెట్టుకోగా అవి సరిగ్గా సరిపోయింది. ఆ విధంగా ఒక్కొకరు తమకు సరిపోయే కళ్ళద్దాల కోసం వెదికి చూడగా ఆశ్చర్యంగా, అద్బుతంగా అందరికి తమ కంటి చూపుకి సరిపడా అద్దాలు చక్కగా దొరికాయి. ఒక కళ్ళజోడు మిగిలిపోగా అనా ఇక తిరిగి వెళ్ళడానికి సిద్దపడుతుండగా ఒక మహిళ పరిగెడుతూ వచ్చి తనకు కూడా కళ్ళద్దాలు కావాలనగా ఆ చివరి కళ్ళజోడు కూడా అద్బుతంగా ఆవిడకు సరిపోయింది.
ప్రతి గ్రామస్తునికి తనకు చక్కని కంటి చూపుకు సరిపడా కళ్ళజోళ్ళు దొరికాయి మరియు అన్ని కళ్ళజోళ్ళు ఉపయోగపడ్డాయి. ఈ దివ్యమైన లీల,కార్యం,సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయిన సత్య సాయి దేవుడు తప్ప ఇంకెవరు చేయగలరు?
జై సాయిరామ్!