Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 10354...भारत


ప్రాక్టీషనర్ 10354…ఇండియా కెమికల్ ప్లాంట్ రూపకల్పనలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగిన ఈ ప్రాక్టీషనర్ కెమికల్  ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. ప్రసిద్ధ ఐటీ కంపెనీలో 25 సంవత్సరాల సేవ అనంతరం 2012లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి గత ఆరు సంవత్సరాలుగా బెంగుళూరులో తన అభిరుచి మేరకు నిర్మాణ రంగం మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారమును కొనసాగిస్తున్నారు.

2002లో అతను అధికారిక పోస్టింగ్ మేరకు మస్కట్ లో ఉన్నప్పుడు అతని స్నేహితుడు వీరిని సాయి భజనకు తీసుకువెళ్ళగా అది వీరికి చాలా నచ్చింది. సాయిబాబాపై పుస్తకాలు చదువుతూ స్వామిని దేవుడిగా గ్రహించడం ప్రారంభించారు. కేవలం సంవత్సరంలోనే వారిలో ఎంతో మార్పు కలిగి వారు ఎక్కడ పనిచేసినప్పటికీ సత్యసాయి సేవాసంస్థ యొక్క అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. మహారాష్ట్ర సేవా బృందంలో సభ్యుడిగా వార్షిక సేవ కోసం పుట్టపర్తిని సందర్శించడం కూడా ప్రారంభించారు. 2008లో, పూనే సాయిబృందం వారి ద్వారా స్ఫూర్తి పొందిన, అనేక మందితోపాటు వీరుకూడా సాయి వైబ్రియానిక్స్  కోర్సులో ప్రవేశం పొందారు.

2008 డిసెంబర్లో AVP గా మరియు 2009 అక్టోబర్ లో VP గా అర్హత సాధించిన తర్వాత వీరు పూనే మరియు చుట్టుప్రక్కల ఆరోగ్య శిబిరములలో పాల్గొనడం ప్రారంభించి  ఒక సంవత్సరం పాటు అనేక మంది రోగులకు చికిత్స చేశారు. తరువాత, ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా, అతను కొన్ని సంవత్సరాల పాటు వెైబ్రియానిక్స్ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించ లేకపోయారు. 2018 లో, తన అభ్యాసాన్ని తిరిగి సక్రియం చేయాలనే కోరికతో, డాక్టర్ అగర్వాల్ సూచించిన విధంగా ఆన్లైన్ కోర్సు చేశారు, మరియు జ్ఞాన పరిపుష్టి కోసం 2018 జులైలో పుట్టపర్తిలో జరిగిన AVP వర్క్ షాపుకు హాజరయ్యారు.

తర్వాత నెల నుండి, వీరు ప్రతీ గురువారం ఉదయం బెంగళూరులోని షిర్డీసాయి ఆలయంలో రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత అతను మరొక ప్రాక్టీషనర్ 11597 తో కలసి మరొక షిరిడిసాయి ఆలయంలో సాయంత్రం వేళ సేవ చేయడం ప్రారంభించారు. అక్కడ వారిద్దరు కలసి నగరం నుండి మరియు నగరానికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాలనుండి వచ్చే 60-70 మంది రోగులకు చికిత్స అందించటం ప్రారంభించారు. రోగులు తమ వ్యాధులనుండి మెరుగు పడుతుండడంతో రోగుల సంఖ్య పెరగడం మరియు వారు అనేక మంది ఇతరులకు సూచించడంతో గురువారం శిబిరాలకు వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగింది. ప్రాక్టీషనర్ ఇదంతా కూడా వైబ్రియానిక్స్ యొక్క శక్తి మరియు దేవాలయాల్లో ఉండే సానుకూల దృక్పథం లేదా దివ్య వైబ్రేషన్ కారణంగా పేర్కొంటున్నారు. 2020 ఫిబ్రవరి 21న, శివరాత్రి పర్వదినాన తెల్లవారుఝాము వరకు రోగులకు చికిత్స చేసారు. వీరు ప్రతీ నెల చివరి ఆదివారం మారుమూల ప్రాంతాల్లో జరిగే సాయి సంస్థ యొక్క వైద్య శిబిరాలలో  కూడా క్రమం తప్పకుండా సేవలందిస్తున్నారు.  

కొంతమంది రోగులకు శిరిడి సాయిబాబా వారు కలలో కనిపించి తన వద్దకు వెళ్ళమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ ప్రాక్టీషనర్ వెల్లడించారు. ఉదాహరణకు :   

ఈ ప్రాక్టీషనర్ ఇప్పటివరకు నాలుగు వేల మందికి పైగా రోగులకు చికిత్స చేసారు. అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి వ్యాధుల నుండి అనేకమంది రోగులు గణనీయంగా మెరుగు పడ్డారు. మూలశంఖ, గ్యాస్ట్రిక్ సమస్యలు, సక్రమంగా లేని బాధాకరమైన మెన్సెస్, పాలి సిస్టిక్ ఓవరీ సిండ్రోం (PCOD), రక్త క్యాన్సరు, జుట్టు రాలడం, పార్శ్వపు నొప్పి, కిడ్నీలలో రాళ్ళు, హే ఫీవర్, శ్వాస సమస్యలు, మూర్ఛ, మోకాళ్లు మరియు కండరాల నొప్పులు మరియు అలర్జీల నుండి అనేకమంది ఉపశమనం పొందారు.  

ప్రాక్టీషనర్ కొన్ని ఆసక్తికరమైన సందర్భాలను పంచుకుంటున్నారు:

గత రెండు సంవత్సరాలుగా ఇద్దరు మహిళలు 3-4 సార్లు గర్భస్రావములు కలుగగా ఐదు నెలల వైబ్రో చికిత్స తర్వాత వారు సాధారణ కాన్పుతో ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిచ్చారు.  

కండరాల నొప్పి, కాలిన గాయాలు, పగిలిన మడమలు, సంక్రమణకాని పుండ్లు, చర్మo పై దద్దుర్ల విషయంలో గోళీలతోపాటు, త్వరగా ఉపశమనం పొందడానికి, చర్మం పై పూతగా రాయడం కోసం విభూతితో కలిపిన  పెట్రోలియం జెల్లీతో రెమిడీ తయారు చేసి ఇస్తారు. జుట్టు సమస్యలు మరియు బట్టతల కోసం కొబ్బరినూనెలో కలిపి ఇచ్చిన రెమిడి రోగులకు ఎంతో సహాయపడింది. పిల్లలకు CC12.2 Child tonic + CC17.3 Brain & Memory tonic రెండు నెలలు ఇచ్చిన తర్వాత పిల్లలు చదువులో బాగా రాణించారు. 9 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగించిన పిల్లలు చదువు, క్రీడలు మరియు సాధారణ ప్రవర్తనలో కూడా రాణించారు. 2019 లో డెంగ్యూ మహమ్మారి విస్తరించిన సమయంలో 150 కుటుంబాలకు చెందిన 250 మంది రోగులకు CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases ఇవ్వగా వీరున్న ప్రాంతంలో వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీ వ్యాధి సోకలేదు. మార్చి 2020 నుండి కొత్త కరోనా వైరస్ కోవిడ్-19 నివారణగా పరిశుభ్రతపై సూచనలతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ పేరుతో పిలువబడే రెమిడీని 300 కుటుంబాలకు ఇచ్చారు.  

తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో రోగులకు చికిత్స చేయడానికి ప్రాక్టీషనర్ వెల్నెస్ కిట్టును విస్తృతంగా ఉపయోగిస్తారు. అతను రోగుల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రెమిడీలకు మరికొన్ని రెమిడీలను జోడించడం ద్వారా మెరుగైన సంస్కరణలను చేసారు. రోగుల వయస్సు మరియు పరిస్థితిని బట్టి ప్రాక్టీషనర్ తన రోగులకు సలహా ఇస్తారు. వీరు ఇచ్చే సలహా ముఖ్యంగా మంచి నీరు, తాజా కూరగాయలు, మరియు పండ్లను తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించడం, రోజువారి నడక మరియు అన్నింటికంటే మించి భగవంతుని పాదాలచెంత సమస్యలను విడిచిపెట్టడం వంటి విషయాల గురించి ఉంటుంది.   వీరి అనుభవంలో సమగ్రమైన విధానం వేగంగా నయం చేస్తుంది మరియు దీర్ఘకాలిక వ్యాధులు పునరావృతమయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది.

వీరికి తన వైబ్రోఅభ్యాస ప్రక్రియలో అతని భార్య వారాంతపు మరియు వాయిబ్రి క్యాంపు లకు మద్దతు ఇస్తారు. రోగులను క్యూ లో పంపడం నోటిలో మొదటి మోతాదు ఇవ్వడం, జాగ్రత్తలు వివరించడంతో పాటు ఆరోగ్య చిట్కాలు ఇవ్వడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాక్టీషనర్ తాను స్వామి చేతిలో ఒక పనిముట్టు అని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారు. స్వామి బోధించిన “మానవసేవయే మాధవ సేవ” అనే లక్ష్యానికి అనుగుణంగా మానవాళికి వినయం మరియు అంకితభావంతో సేవ చేయడమే అతని జీవితం లక్ష్యమని వివరిస్తున్నారు.

 పంచుకున్న కేసులు: