Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ ప్రొఫైల్ 03542...UK


ప్రాక్టీషనర్ 03542…యు.కె. వీరు యు.కె లో నిర్మాణరంగ పరిశ్రమలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన నిర్మాణరంగ ఇంజినీరు. 2017ముందు వరకు వీరు ఒక అంతర్జాతీయ నిర్మాణరంగ సంస్థలో టెక్నికల్ డైరెక్టరుగా ఉన్నారు. బాల్యము నుండి ఆధ్యాత్మిక మార్గానికి మొగ్గు చూపిస్తూ ఉన్నప్పటికీ, వీరికి 42 సంవత్సరాల వయసు వచ్చే వరకు హృదయంలో ఒక రకమైన గందరగోళాన్ని అనుభవించారు.‘సత్య సాయి బాబా ద మ్యాన్ ఆఫ్ మిరకిల్స్’ పుస్తకం చదివిన తరువాత అదే సంవత్సరం జూన్ 1996లో వారు స్వామిని దర్శించారు. మొదటి దర్శనం లోనే అతనికి స్వామి మీద నమ్మకం కుదిరింది. ఈ దర్శనంతో ప్రేరణ పొంది వీరు తమ ఇంట్లోనే భజన చేయడం ప్రారంభించారు. క్రమేణా అది సాయి భజన కేంద్రంగా మారి ఇప్పటికీ అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ కేంద్రం అనేక సందర్భాల్లో స్వామి చేత ఆశీర్వదింపబడి విభూతి, అమృతము మరియు లింగము ఏర్పడడం వంటి లీలలు జరిగాయి. వీరికి చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలనే కోరిక నెరవేరే అవకాశం 2016 ఫిబ్రవరిలో ఒక యూట్యూబ్ వీడియో ద్వారా సాయివైబ్రియానిక్స్ వైద్యం గురించి తెలుసుకొన్నప్పుడు వచ్చింది. పదవీ విరమణ దగ్గరవుతున్న సందర్భంలో, వీరు మరియు వీరి శ్రీమతి వైబ్రియానిక్స్ లో చేరడం ఎంతో ఆనందాన్ని చేకూర్చింది. వీరు 2016 జూన్ లోAVP అయ్యారు. అదే సందర్భంలో ఆరు నెలలుగా దగ్గుతో బాధపడుతూ అల్లోపతి మందులు తీసుకున్నా ఉపశమనం కలుగలేదు. వీరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ, కేవలం రెండు మోతాదుల వైబ్రియానిక్స్ నివారణతో అతని దగ్గు అదృశ్యమైపోయి పునరావృతం కాలేదు. దీనితో వైబ్రియానిక్స్ మీద మరింత  ఆత్మ విశ్వాసంతో సేవ చేయడానికి నిర్ణయించుకున్నారు. 2018 నవంబర్లో SVP గా అర్హత పొంది, నెల తర్వాత, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు, భారతదేశం నుండి వీరి తెచ్చుకుంటున్నవిభూతి భరిణలో ఒక అందమైన శివలింగం వ్యక్తమయింది.

ఈ అభ్యాసకుడు ఇప్పటివరకు 170 మందికి పైగారోగులకు చికిత్స చేశారు. వారిలో కొంత మందికి గణనీయమైన ఉపశమనం కలుగగా చాలామందికి పూర్తి స్వస్థత చేకూరింది. చికిత్స చేసిన కేసులలో అధికరక్తపోటు, సిరలు ఉబ్బు, మలబద్ధకం, విరోచనాలు, వాంతులు, పెద్దప్రేగు శోథ, కాలేయం చెడిపోవడం, చెవి రుగ్మతులు, హైపోథైరాయిడ్, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియాసిస్, జలుబు, ఫ్లూ, పంటి నొప్పి, మూత్రపిండాల సంక్రమణ, నిద్రలేమి, ఒత్తిడి, నిరాశ, మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్, ఆస్త్మా, మరియు చర్మ వ్యాధులుఉన్నాయి. తన తోటలోని మొక్కలకు వైబ్రియానిక్స్ నివారణలను వాడడం ద్వారా పచ్చ ఈగలు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు దూరమయ్యాయి. 78 ఏళ్ల మహిళకు ఆమె ఎడమ కాలు స్నాయువులు రెండున్నర నెలలుగా నిరంతరం నొప్పితో ఇబ్బంది పెడుతూ అల్లోపతి మందులు వాడినప్పటికీ, ఉపశమనం కలగని కేసు విషయంలో వైబ్రో నివారణల ద్వారా అద్భుతంగా స్వస్థత పొందిన ఉదంతాన్ని అభ్యాసకుడు మనతో పంచుకుంటున్నారు. కలలో స్వామి మార్గదర్శకత్వం చేసిన సూచన మేరకు ఈ పేషంటు 2018 మే 17న అభ్యాసకుడుని సందర్శించారు. తన ఇంట్లో వారం వారం జరిగే భజన ప్రారంభించడానికి ముందు అభ్యాసకుడు రోగికి మొదటి మోతాదు ఇచ్చారు. భజన అనంతరం ఆమె తనను తాను నమ్మలేక ఆశ్చర్య ఆనందాలతో తనకు ఏమాత్రం నొప్పి లేదని పూర్తిగా నయమయ్యిందని చెప్పారు. అయితే నివారణ కొనసాగించాలని అభ్యాసకుడు ఆమెకు సూచించారు అయినప్పటికీ ఆమె ఒక నెల తర్వాత, నివారణ బాటిల్ వాడకుండా అలాగే తీసుకువచ్చి మొదటి మోతాదుతోనే ఆమె నొప్పులు పూర్తిగా అదృశ్యమవడంతో వాటిని వాడే అవసరం రాలేదని చెప్పారు. అది పునరావృతం కాలేదు!

అలాగే 30 ఏళ్ల టాంజానియాకి చెందిన వ్యక్తి, మెదడులో రక్తస్రావం కారణంగా తీవ్రమైన ప్రసంగ లోపం లేదా మాట రాక పోవడం, అవయవాల పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు మింగడానికి అసమర్థత ఏర్పడిన సంక్లిష్టమైన కేసు గురించి అభ్యాసకుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరి ఆరు నెలల చికిత్స తీసుకున్నప్పటికీ కూడా, అతని పరిస్థితి మెరుగుపడే సంకేతాలు కనిపించక పోవడంతో చాలా నిరాశాజనకమైన స్థితిలో 2019 ఫిబ్రవరి లో ఇంటికి తీసుకువచ్చారు. రోగి  కుటుంబసభ్యుల యొక్క అభ్యర్థన మేరకు 2019 మార్చి 22న, అభ్యాసకుడు SM12 Brain and Paralysis రెండు గంటల నిరంతరాయంగా బ్రాడ్ కాస్టింగ్ చేశారు (108CC బాక్సు ఉపయోగించేటట్లయితే CC18.1 Brain disabilities ఇవ్వవచ్చు). ఆ తర్వాత అభ్యాసకుడు రోగి యొక్క మూత్రాశయ ఇన్ఫెక్షన్, మధుమేహం, బిపి మరియు కొలెస్ట్రాల్ కు మందులు జోడించి బ్రాడ్ కాస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా చేసిన 1-3 నెలల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయిరోగి తన అవయవాలను కొద్దిగా కదిలించ కలిగే స్థితి ఏర్పడింది. అలాగే శ్వాస చక్కగా తీసుకోగలగడం, ఆహారం మింగ గలిగే పరిస్థితి ఏర్పడింది. మరొక ఆరు నెలల తర్వాత ఆ రోగి తన అవయవాలను బాగా కదిలించగలిగి స్వయంగా ఆహారం తినగలిగే స్థితి ఏర్పడింది. అయితే పూర్తి చైతన్యం ఇంకా కలగ వలసి ఉంది. ఈ కేసు నుండి ప్రేరణ పొందిన అభ్యాసకుడు, తరచూ బ్రాడ్కాస్టింగ్ ద్వారా చికిత్స పొందుతున్నారు.

వీరి యొక్క అనుభవంలో, ఆందోళన మరియు వత్తిడితో జీవించే వారికి CC15.1 Mental & Emotional tonic ను నివారణలకు చేర్చడం వల్ల రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటోంది. మరియు CC12.4 Autoimmune diseases  జోడించడం వలన ఇది దీర్ఘకాలిక అలర్జీలు, లైమ్ వ్యాది మరియు మలబద్ధకం వంటి వ్యాధుల నివారణను వేగవంతం చేసింది.

వీరి రోగులలో చాలామంది వైబ్రియానిక్స్ నివారణలను వారి రోగాలకు మాత్రమే కాకుండా ముందస్తు నివారణగా కూడా తీసుకుంటూ ఉంటారు. వీరు అల్లోపతి మందుల యొక్క దుష్ప్రభావాన్ని తొలగించడానికి వాటిని పోటెన్టైజ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ అభ్యాసకుడు తనతో ఎప్పుడు వెల్నెస్ కిట్టును తీసుకువెళుతూ తను ప్రయాణించేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మందికి చికిత్స చేయడం జరిగింది.

అభ్యాసకుడు తన ప్రతిరోగికి సంప్రదింపుల విషయంలో తగిన సమయం కేటాయించి శ్రద్ధతో మరియు కరుణ, ప్రేమలతో వారి వివరాలు వింటారు. ఇదివారు అందించిన సేవలకు విలువ నిచ్చి హృదయపూర్వకంగా చేయవలసిన, చేయకూడనివి శ్రద్ధగా వారు అనుసరించేలాచేస్తుంది. సాయి వైబ్రియానిక్స్ తనను సానుభూతి వ్యక్తంచేసే వ్యక్తిగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వీరు తన అంతరాత్మ అయిన దైవం మార్గనిర్దేశం మేరకు ప్రతీరోగితో వ్యవహరిస్తూ ఉంటారు. వీరు స్వామి నుండి అనేక విధాలుగా అనుగ్రహం పొందినందుకు కృతజ్ఞత వ్యక్తంచేస్తూ వైబ్రియానిక్స్ విషయంలో ముఖ్యంగా యు.కె. లో దీని అభివృద్ధికి తనవంతు పాత్రను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

పంచుకున్న కేసులు :