చికిత్సానిపుణులవివరాలు 02840...India
ప్రాక్టీషనర్ 02840...ఇండియా కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందిన వీరు గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక కళాశాలలో అకౌంటెన్సీ మరియు మైక్రోసాఫ్ట్ యుటిలిటీస్ విషయాలను బోధిస్తున్నారు. ఇదే కాకుండా గత ఎనిమిది సంవత్సరాలుగా వీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ఫ్యాకల్టీ గ్రూపులో సభ్యులుగా కూడా ఉన్నారు. 2016లో వీరు అకౌంటెన్సీలో డాక్టరేట్ పొందారు. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహించటంతో పాటు తనతో ఏకీభవించే మనస్తత్వం గల వ్యక్తులతో పాఠశాలలు మరియు కళాశాలలలో వృత్తి మరియు వ్యక్తిత్వ వికాసం పై ఉచితంగా ఈ లెర్నింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను కళాశాలలో చదివే రోజుల నుండే సేవాభావం పట్ల మక్కువ ఉన్న వీరు భారతదేశంలో గ్రామీణ అభివృద్ధికోసం జాతీయ సామాజిక సేవా కార్యక్రమంలో చురుకైన పాత్ర నిర్వహించడం వలన పురస్కారాలను కూడా పొందారు. బాల్యము నుండి శిరిడి సాయి భక్తులయినప్పటికీ 2010లో స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవా కార్యక్రమాలలో వీరి యొక్క అంకుల్ పాల్గొనడం చూసి ప్రేరణ పొంది 2011లో సేవాదళ్ సభ్యురాలిగా చేరారు. కొద్దిరోజుల తర్వాత పుట్టపర్తిలో ఒక వ్యాధికి నివారణ తీసుకోవడానికి తన బంధువులతో కలిసి వచ్చినప్పుడుస్వామి చెప్పిన మాటలు “మీరు జబ్బుపడిన వ్యక్తిని, నిరాశకు గురైన వ్యక్తిని, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చూసినప్పుడు అదే మీ సేవా క్షేత్రం” అన్నవాక్యాలనుచూసి ప్రేరణ పొంది ఆమె వైబ్రియానిక్స్ కోర్సులో ప్రవేశం పొందారు. డిసెంబర్ 2011లో AVP అయ్యారు. వీరుAVP గా అర్హత సాధించిన వెంటనే ఆమెకు ఇవ్వబడిన 108 సిసి బాక్స్ లోని కొన్ని బాటిళ్ళమూతలపై విభూతి ఉండటం చూసి వైబ్రియానిక్స్ పట్ల ఆమెకు ఉన్నవిశ్వాసం బలపడింది. గత ఎనిమిది సంవత్సరాల సాధనలో ఆమె స్వామి యొక్క ఉనికిని అనేక విధాలుగా అనుభవించారు. ఉదాహరణకు స్వామి ఫోటోలపై కనిపించే విభూతి మరియు వైబ్రియానిక్స్ శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకమైన సువాసన వంటి అనుభూతులను పొందారు.
వీరు ఇప్పటివరకు 2,600 మంది రోగులకు చికిత్స చేశారు. వీరు చికిత్స చేసిన వాటిలో ఆమ్లత్వం, రెటినోపతి, రుతు సమస్యలు వంధ్యత్వం, మైగ్రేన్, వత్తిడి, ఉబ్బసం, దీర్ఘకాలిక దగ్గు, ఫంగల్ ఇన్ఫెక్షన్, మరియు బొల్లి వంటి వ్యాధులు ఉన్నాయి. వీరి అనుభవంలోమెట్రో నగరాల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉండే పరిస్థితులు మరియు భారీ ట్రాఫిక్ లో విస్తృతంగా ప్రయాణం చేయడం వంటి సమస్యలు కారణంగా మానసిక అశాంతికి గురి అవుతున్న నేపథ్యంలో రోగులకు ఇచ్చే నివారణలకు CC15.1 Mental & Emotional tonicకలపడం ద్వారా చికిత్స వేగవంతం అవుతుందని మీరు తెలుసుకున్నారు. వీరు ఎల్లప్పుడూ తన వెల్ నెస్ కిట్టును వెంట తీసుకువెళుతూ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు మరియు వచ్చేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది రోగులకు చికిత్స చేశారు. ఒకసారి రైలులో తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి మూర్ఛరావడంతో ఆమె తదుపరి స్టేషన్లో దిగి కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లే వరకు ప్రతీ పది నిమిషాలకు CC10.1 Emergenciesఇచ్చారు. తర్వాత వైద్యుడు సకాలంలో ప్రధమ చికిత్స చేయడాన్ని ప్రశంసించారని ఆ పేషెంటు తరువాత ఈమెకు తెలియజేశారు.
సేవ పట్ల ఈమెకు గల శ్రద్ధ మరియు సంసిద్ధత సహాయం చేసే వైఖరి ఎంతోమంది పేషెంట్లను ఈమె వైపు ఆకర్షితులయ్యే విధంగా చేసింది. అట్టివారిలో ఈమె యొక్క విద్యార్థులు మరియు కార్యాలయ సహచరులే ఎక్కువగా ఉన్నారు. ఆమె నిరంతరం సేవ చేయడానికి తగినంత మంది పేషెంట్లను పంపిస్తూ ఉండమని నిత్యమూ స్వామికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కేసు సంక్లిష్టంగా ఉన్నప్పుడు మరియు ఏనివారణ ఇవ్వాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు అంతర్యామి అయిన భగవంతుడు యొక్క మార్గదర్శకత్వం లో సమాధానం స్పష్టంగా లభిస్తుందని ఆమె తెలియజేస్తున్నారు. వైబ్రియానిక్స్ నివారణలు తీసుకోవడం గురించి ఎవరైనా భయపడుతూ సంశయంతో ఆమెను కలుసుకుంటే ఆమె వారి ఇంట్లో పెంచుకొనే మొక్కలకు నివారణలు అందిస్తారు. క్రమంగా వారిలో మార్పు వచ్చి తమంత తాముగా నివారణ తీసుకోవడం ప్రారంభించేలా చేస్తారు.
ఈ వైబ్రియానిక్స్ సేవ తనను ఎల్లప్పుడూ సంయమన స్థితిలో ఉండేటట్లు రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించేలా ఇంకా ఆమె సహచరులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఏదైనా తప్పుచేసినా క్షమించేస్వభావం అలవాటు చేసిందని పేర్కొంటున్నారు. ఈ అభ్యాసకురాలు తను స్వామి చేతిలో ఒక ఉపకరణం అనీ, స్వామి చెప్పిన మానవసేవయే మాధవ సేవ మరియు అందర్నీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి అనే ఆదేశాన్ని నెరవేర్చడం తన ప్రధాన బాధ్యతగా విశ్వసిస్తున్నారు. ఒక అభ్యాసకుడికి నూరు శాతం విశ్వాసం ఉండి ప్రేమ మరియు కృతజ్ఞతాభావంతో చేసేప్రార్థనకి ఫలితాలు అద్భుతంగా ఫలిస్తాయని ఆమె అభిప్రాయం.