Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఉబ్బసం 02840...India


48 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి గత 14 సంవత్సరాలుగా ఆస్తమా భాధనుండి ఉపశమనం పొందటానికి రోజుకి ఒకసారి    ఇన్హేలర్ ఉపయోగించేవారు. కానీ, గత 2సంవత్సరాలుగా ఇన్హేలర్ ఉపయోగించడం రోజుకు మూడుసార్లుకు పెరిగింది. మెట్లు ఎక్కేటప్పుడు, భోజనం చేసిన తరువాత లేదా కొంతదూరం నడచినా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండేది. 2018సెప్టెంబర్ మొదటి భాగంలో అతని ఆరోగ్యం మరింత క్షీణిచడంతో కొన్ని రోజులు ఆసుపత్రిపాలు అయ్యారు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అతనికి ఊపిరితిత్తులలో ఒక మోస్తరు అడ్డంకి ఉన్నట్లు సూచింప బడడంతో దానికి అల్లోపతీ మందులు తీసుకున్నారు.

అల్లోపతీ మందులు పెద్దగా ఉపశమనం ఇవ్వకపోటంతో వాటి మీద ఆధారపడడం ఇష్టంలేక, అతను 2018సెప్టెంబర్ 25న ప్రాక్టీషనర్ ను సందర్శించారు. ఈ క్రింది రెమెడీ ఇవ్వడమైనది:

CC15.1 Mental &Emotional tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthmaattack…ప్రతి10 నిమషాలకు ఒక సారి ఒక గంట పాటు తరువాత 6TDఅతను 3 రోజుల తరువాత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు వ్యవధి 30% తగ్గినట్లుగానూ ఇప్పుడు కొంచెం తేలికగా శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక వారం తరువాత అతను శ్వాస తేలికగా తీసుకుంటున్నట్లు మరియు ఇన్హేలర్ వాడటం మానేసినట్లు తెలియజేశారు. అందువల్ల మోతాదుని TDS కి తగ్గించబడింది. మరో వారం తరువాత అతను శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలడం, మెట్లు ఎక్కగలడం మరియు భోజన అనంతరం ఆయాసం లేకుండా నడవగలగడం   వంటివి చేయగలిగారు. మోతాదుని BDకి తగ్గించి రోగి సౌకర్యార్ధం 6 నెలలపాటు కొనసాగించారు.2019ఏప్రియల్ 10న తీసుకున్న టెస్ట్ రిపోర్టులు అతని ఊపిరితిత్తులలో ఎటువంటి అవరోధం లేకుండా చక్కగా ఉన్నట్లు తెలియజేశాయి. అప్పటినుండి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు, అందువల్ల మోతాదుని OD కి, 6 నెలల తరువాత 2019అక్టోబర్ 10 నాటికి OW కి తగ్గించారు. ముందస్తు నివారణా చర్యగా, అతనికి CC12.1 Adult tonic  ఒక నెలపాటు, తరువాత నెలCC17.2 Cleansing…TDS ఇలా సంవత్సరంపాటు ఇచ్చారు.

సంపాదకుని సూచన :CC19.1 Chest tonic అవసరం లేదు ఎందుకంటే ఇది CC19.2 మరియు CC19.3 రెండింటిలోను ఉంది.