సాధకుని వివరములు 11587...India
ప్రాక్టిషనర్ 11587…ఇండియా వీరు లేబర్ వెల్ఫేర్ మరియు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యూయేట్ పట్టా కలిగి ఉన్నారు. వీరు ఆధ్యాత్మిక చింతన గల కుటుంబంలో జన్మించి బాల్యం నుండి సమాజసేవలో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. వీరు నివసిస్తున్న తమ పరిసర ప్రాంతాల్లో క్రమంతప్పకుండా జరుగుతున్న భజనల ద్వారా 1974లో స్వామి వైపు ఆకర్షితులు అయ్యారు. వీరు 1979లో బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత పుట్టపర్తి మరియు వైట్ ఫీల్డ్ లో వీరికి లభించిన స్వామి యొక్క అద్భుత దర్శనాలు వీరిని మంత్రముగ్ధులను చేశాయి. క్రమంగా వీరు సెలవలలో మరియు ప్రత్యేక సందర్భాలలో సాయి సంస్థలో జరిగే సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. 2001లో పదవి విరమణ చేసిన తరువాత పూర్తిగా సాయి సంస్థ కార్యక్రమాల్లో మునిగిపోయారు.
జ్యోతిష శాస్త్రంలో వీరికి గల అభిరుచి వలన గత 30 సంవత్సరాలుగా ఉచితసేవలు అందించేలా చేసింది. చిన్నతనంలోనే కోల్పోయినటువంటి తండ్రిగారి నుంచి వీరు ఈ జ్యోతిష శాస్త్రంలోపరిజ్ఞానాన్ని పొందారు. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల పరిష్కారాల కోసం తనను సంప్రదించే ప్రజలకు సహాయం చేయాలని తపనతో వీరు నడిపించ పడ్డారు. వీరు రికీ అనే చికిత్సా పద్ధతి కూడా నేర్చుకున్నారు. వీరు1993- 94లో హోమియోపతిలో ఒక కోర్సు చేశారు కానీ ఇంట్లో పరిస్థితుల కారణంగా పరీక్షకు హాజరు కాలేదు. వీరు తన అల్లుడి ద్వారా స్ఫూర్తి పొంది వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుని మార్చి 2017 వర్క్ షాప్ కు హాజరు కావడం కోసం ఆన్లైన్ ఈ కోర్సు పూర్తి చేశారు. అయితే అదే వర్క్ షాప్ కు హాజరు కావాలసి ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు వీరి అల్లుడు మరణించడంతో భావోద్వేగ పరంగా ఏర్పడిన ఈ విషాదాన్ని తట్టుకుని 2017 జులై లోఎ.వి.పి. కోర్సు పూర్తి చేశారు. ఫిబ్రవరి 2018 లో వి.పి గా అయ్యారు. అప్పటి నుండి ఇతర చికిత్సా విధానాలు అన్నింటినీ వదిలి వైబ్రో వైద్యం మాత్రమే చేస్తున్నారు. దానితోపాటు తను నేర్చుకున్నజ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సలహాలు కూడా ఇస్తూనే ఉన్నారు.
ఎ.వి.పి. అయిన వెంటనేవీరు తన సాధారణ సందర్శనలో భాగంగా ఒక సంవత్సరం పాటు తనకుమారుని వద్ద అమెరికాలో ఉన్నారు. ప్రారంభంలో వీరికి భారతీయ పరిచయస్తులతో సహా స్థానిక నిర్వాసితులకు వైబ్రో వైద్యాన్ని పరిచయం చేయడం దుర్భరంగా ఉండేది. వీరియొక్క మెంటర్ 10375మరియు యు.ఎస్. &కెనడా కోఆర్డినేటర్01339యొక్క మార్గదర్శకత్వంలో 120 మంది రోగులకు చికిత్స చేయగలిగారు.
2018 జూన్ లో భారతదేశం వచ్చారు. అప్పటినుండీ తనను ఇంటివద్ద సందర్శించే రోగులకు రెమిడీలు ఇవ్వటంతో పాటు దూరంగా ఉన్నటువంటి పేషెంట్లకు పోస్టు ద్వారా కూడా వీరు మందులు పంపిస్తున్నారు. వీరికి దగ్గరలో ఉన్న రెండు ఆధ్యాత్మిక కేంద్రములతో పాటు ఒక గ్రామాన్ని కూడా సందర్శిస్తూ అక్కడ ప్రతీ వారం రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. వీరు విజయవంతంగా చికిత్స చేసిన కేసులలో అజీర్ణం, జలుబు, దగ్గు, మరియు జ్వరం వంటి వ్యాధులు అలాగే దీర్ఘకాలిక జీర్ణకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ లు, పంటి నొప్పులు మరియు తీవ్రమైన కీళ్ల నొప్పులు కూడా ఉన్నాయి. వీరు తయారు చేసిన చెవిలో వేసే చుక్కల మందు ద్వారా పది రోజులుగా బాధపడుతున్న టినిటస్ వ్యాధి నాలుగు రోజుల్లో CC5.3 Meniere’s disease, one drop in 30 ml of olive oil…BDఇవ్వడం ద్వారా తగ్గిపోయింది. వీరు క్యాన్సర్ పేషెంట్లు తమ బాధను పోగొట్టుకునే విధంగానూ ఆస్త్మా రోగులు మరియు మైగ్రేన్ బాధితులు తమ యొక్క బాధలను తగ్గించుకునే విధంగానూ ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. రోగులు రీఫిల్ కోసం మరలా మరలా అభ్యాసకులను సందర్శిస్తూ ఉన్నట్లయితే ఎంతోమందికి ఈ చికిత్సా విధానం ద్వారా లబ్ధి చేకూరుతుంది అని భావిస్తున్నారు. చాలా మంది రోగులు వైబ్రియానిక్స్ మందులు తీసుకున్న తర్వాత గణనీయమైన ఉపశమనం లభించినప్పటికీ ఆ తర్వాత నివారణలను కొనసాగించడానికి ముందుకు రావడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వీరు భారతదేశం తిరిగి వచ్చినప్పటి నుంచి సుమారు 275 మంది రోగులకు చికిత్స చేశారు.
ఎ.వి.పి. వర్క్ షాప్ లో ఇచ్చిన సూచన మేరకు వీరు ఎక్కడికి వెళ్ళినా వెల్నెస్ కిట్టును తనతో పాటు తీసుకొని వెళుతుంటారు. ఇది వారికి ఆత్మ విశ్వాసం మరియు ఎప్పుడయినా ఎదురయ్యే అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవాల్సిన బాధ్యతను వీరికి గుర్తు చేస్తుంది. వీరు ఎప్పటికప్పుడు వార్తాలేఖలను చదువుతూ తనకు తెలిసిన విషయాలను నవీనీకరిగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే అభ్యాసకుల డేటాబేస్ను నవీనికరించే జట్టులో కూడా వీరుచురుకైన సభ్యుడిగాఉన్నారు. వైబ్రియానిక్స్ ద్వారా తన సాధనను మెరుగుపరచుకోవడానికి సువర్ణ అవకాశం కల్పించిన స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. తను వేసే ప్రతీ అడుగులోనూ స్వామి చేత మార్గనిర్దేశం చేయబడుతున్నట్లుగా వీరు భావిస్తున్నారు. అలాగే తన మెంటర్ యొక్క సమయానుకూల మార్గదర్శకత్వం అభ్యాసకుడుగా తన ఎదుగుదలకు కారణమైందని పేర్కొంటున్నారు. వైబ్రియానిక్స్ తనలో అన్ని స్థాయిల్లో పరివర్తన తెచ్చిందని వీరు భావిస్తున్నారు. రోగులకు చికిత్స చేయడానికి ముందు వీరు భగవంతుని ప్రార్ధిస్తూ ఓపిగ్గా ప్రేమగా వారు చెప్పే విషయాలను వింటారు. రోగుల పట్ల మనం కనబరిచే ప్రేమ మరియు కరుణ ఒక విధమైన మాయాజాలం సృష్టిస్తుందని అది రోగి యొక్క సమస్యను లేదా రుగ్మతను సగ భాగం మాయమయ్యేలా చేస్తుందని వీరు భావిస్తున్నారు. తన దగ్గరకు వచ్చే రోగులకు సరైన ఆహారం, తగినంత మంచినీరు తీసుకోవాలని సమయానుకూలంగా నిద్రపోవాలని చెప్పటం మాత్రం మరిచిపోరు. ఇలా చెప్పడం ద్వారా వారు త్వరగా కోలుకుంటారని వీరి భావన.
పంచుకున్న కేసులు :