చికిత్సా నిపుణుల వివరాలు 03522...मॉरीशस
ప్రాక్టీషనర్ 03522…మారిషస్ వీరు గత పదహారు సంవత్సరాలుగా మారిషస్ కు చెందిన ఒక ఏవియేషన్ సంస్థ లో నిపుణుడిగా పనిచేస్తున్నారు. వీరు చిన్నప్పటినుండి సాయి భక్తులు కావడంతో సాయి సంస్థకు చెందిన అనేక సేవా కార్యక్రమాలలలో పాల్గొంటూ ఉండేవారు. డాక్టర్ అగర్వాల్ మరియు శ్రీమతి హేమ శీర్షికతో కూడిన సోల్ జర్న్స్ వీడియోలు చూసిన తరువాత సాయి వైబ్రియోనిక్స్ చికిత్స యొక్క గొప్పతనం వీరు తెలుసుకున్నారు. ఈ స్పూర్తితో వెంటనే వైబ్రియోనిక్స్ వెబ్సైట్ కు శిక్షణ కోసం అప్లై చేసి ఇ కోర్సు అనంతరం శిక్షణ కూడా పూర్తిచేసారు. 2015 లో AVP గానూ మరియు 2016 జూన్ లో VP గానూ అయ్యారు.
సాక్షాత్తు భగవంతుని చేత ఆశీర్వదించబడిన ఈ వైద్యవిధానం లో ప్రాక్టీషనర్ కావడం తన అదృష్టంగా భావిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి నిస్సహాయులకు సాయి సభ్యుడిగా సహాయం చేయగలిగే భాగ్యం కలగడంతో తన చిరకాల వాంఛ నెరవేరిందని తెలుపుతున్నారు. అద్భుతమైన 108CC బాక్సు ద్వారా ఒక ప్రాక్టీషనర్ గా రోగులకు నిస్వార్ధ సేవ చేయడం చాలా పెద్ద భాద్యత అని వీరి భావన. గొంతు మంట నిమిత్తం ఆంటీబయోటిక్ తీసుకుంటున్న 37 సంవత్సరాల వ్యక్తికి వచ్చిన నీళ్ళ విరోచనాల సమస్య సరియైన రెమిడి ద్వారా 24 గంటలలో నివారణ కావడం వైబ్రియానిక్స్ పైన తనకున్న విశ్వాసాన్ని పెంచిందని వీరు తెలుపుతున్నారు.
ఎక్కువమంది పేషంట్లు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకుండా తమ అనారోగ్య సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలకోసం ఎదురుచూస్తారు తప్ప తమ జీవన విధానము మార్చుకొనుటకు, రోగాలకు మూలకారణం గా ఉన్న అనారోగ్యకరమైన అలవాట్లను దూరం చేసుకొనుటకు ఆసక్తి చూపరు. కనుక రోగులకు తమ జీవన శైలిని మార్చుకొనడానికి తమ సంక్షేమం కొరకు వారిలో మార్పు తీసుకురావడానికి హితవు చెప్పడం అభ్యాసకుడికి చాలా పెద్ద బాధ్యత. అలాగే వారిలో నమ్మకాన్ని పెంపొందించి సక్రమంగా వైబ్రో నివారణులను వాడేలా చేయడం కూడా అభ్యాసకుడికి ఒక గురుతరమైన బాధ్యత. మరొక మాటలో చెప్పాలంటే ఇది ఒక గొప్ప సాధన కూడా.
మనలో ఉన్న దివ్యత్వమే అన్ని జీవరాసులలోనూ ఉందని భావించి సర్వులయందు భగవంతుని చూడగలిగితే మన ప్రేమ విశాలమవుతుందని వీరి భావన. ప్రేమకు ఎంతో శక్తి ఉందని అది రోగుల భావోద్వేగాల పైన ఎంతో ప్రభావం చూపి సత్వర రోగనివారణ కల్పిస్తుందని భావిస్తున్నారు. వీరు తన పేషంట్లకు మిగతా రెమిడిలతో పాటు CC15.1 Mental & Emotional tonic కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రెమిడి సత్వర ఉపశమనానికి రోగానివరణకు సహకరిస్తుందని వీరు అనుభవంలో తెలుసుకున్నారు.
పేషంట్లను చూడడంతో పాటు వీరు మన మిషన్లో పనిచేస్తూ మొదటి అంతర్జాతీయ వైబ్రో కాన్ఫెరెన్స్ పుస్తకాన్ని ఫ్రెంచ్ భాష లోనికి అనువదించారు. ఈ వైబ్రో విధానము తనకు హృదయంతో పనిచేయడం నేర్పడం తో పాటు ఆధ్యాత్మిక బాటలో పురోగమించడానికి ఎంతో సహకరించిందని ప్రాక్టీషనర్ భావిస్తున్నారు. ఈ సాధనలో ‘’మనం ఎంతమంది పేషంట్లను చూసాము అనే దానికన్నా ఎలా చూసాము అనేదే కొలమానం’’ అని వీరు భావిస్తున్నారు.
పంచుకున్న కేసులు :