చికిత్సా నిపుణుల వివరాలు 11520...भारत
ప్రాక్టీషనర్ 11520...ఇండియా క్లినికల్ సైకాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాలలో ఉత్తీర్ణత సాధించిన ఈ ప్రాక్టీషనర్ కార్పోరేట్ రంగంలో కన్సల్టెంట్ గా ఉన్నారు. వీరు ఎక్కువ సమయం తమ ఇంటి నుండే తన కెరీర్ కు చెందిన పనులు చేస్తూనే గృహ బాధ్యతలను కూడా నిర్వహిస్తూ సమతుల్యం చేసుకుంటూ ఉన్నారు. ఒక ఆసక్తికరమైన పరిణామం 2012 లో వీరిని సాయివైబ్రియోనిక్స్ ద్వారా స్వామి ఫోల్డ్ లోనికి వచ్చేలా చేసింది. 2008 లో వీరి భర్తకు ప్రమాదంలో హిప్ జాయింట్ విరిగి దాదాపు వికలాంగు డిని చేసింది. వీరి భర్త అలోపతి, హొమియోపతీ, ఆయుర్వేదం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో వైద్య విధానాలు ప్రయత్నిoచారు కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ఇట్టి స్థితిలో ఈమె ప్రాక్టీషనర్02860,ద్వారా 2011లో సాయి వైబ్రియోనిక్స్ మందులను ప్రయత్నం చేసారు. 6 నెలలలోనే వీరి భర్త వాకర్ సహాయంతో తనంత తాను నడవగలిగే స్థితికి చేరుకున్నారు. సంవత్సరంలోనే వాకర్ సహాయం కూడా లేకుండా సమతల ప్రదేశంలో నడవడం ప్రారంభించారు. ఈ అద్భుత పరిణామం వీరిలో స్వామి పట్ల కృతజ్ఞతను పెంచి తన జీవితాంతం వైబ్రియోనిక్స్ ద్వారా స్వామి సేవ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చేలా చేసింది.
వీరు 2012 డిసెంబర్ లో AVP గానూ, 2013 ఫిబ్రవరి లో VP గానూ, 2015 ఫిబ్రవరి లో SVP గానూ శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరి భర్తకు మరొకసారి చీల మండల వద్ద ప్రమాదం జరిగి ఎడమవైపు కాలిలో లిగ్మెంటు పాడవడం, వాపు రావడం జరిగింది. ప్రాక్టీషనర్ కేవలం వైబ్రో మందుల మీదనే ఆధారపడి తానే స్వయంగా భర్తకు చికిత్స చేసారు. దీనితో కేవలం 25 రోజులలో వీరి భర్తకు స్వస్థత చేకూరింది. ఈ సంఘటన వైబ్రియోనిక్స్ పట్ల మరియు స్వామి పట్ల వీరి విశ్వాసాన్ని మరింత పెంచాయి.
ఈ ప్రాక్టీషనర్ 2012 డిసెంబర్ నుండి 3300 మంది పేషంట్లకు విజయవంతంగా చికిత్స నందించారు. ముఖ్యంగా వెరికోజ్ వీన్స్ , UTI, కండరాల వాపు, భుజాలు బిగదీసుకు పోవడం, ఎముకలు విరగడం, కిడ్నీలో రాళ్లు, చర్మ వ్యాధులు, శ్వాస సంబంధమైన సమస్యలు, క్రుంగుబాటు, ఇంకా జలుబు, దగ్గు, జ్వరం మొదలగు వ్యాధులతో బాధపడే పేదవారు, నిర్భాగ్యులకు వీరు ఎంతో సేవ చేసారు. వీరి అనుభవం ప్రకారం తన అంతః చేతన (స్వామి ప్రేరణ) ద్వారా ఏదో ఒక రెమిడి బాటిల్ కానీ, కార్డు కానీ తీసి రెమిడి ఇచ్చినప్పుడు అది చాలా వేగంగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరు తరుచుగా విజయవంతమైన రోగచరిత్రలను వార్తాలేఖలకు పంపిస్తూ ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు వార్తాలేఖలను చదవడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు.
ఈ ప్రాక్టీషనర్ తన ఇంట్లోనే పెరుగుతున్న మొక్కలకు వైబ్రియానిక్స్ రెమిడిలు ఉపయోగించడం అంటే చాల ఇష్టపడతారు. ముఖ్యంగా CC1.2 Plant tonic + CC15.1 Mental & Emotional tonic. ఉపయోగించడం ద్వారా ఈ మొక్కలన్నీ తమ చుట్టూ పక్కల ఇళ్ళలో ఉన్నవాటికంటే పచ్చగా ఆరోగ్యంగా ఉన్నట్లు గ్రహించారు. వేసవిలో ఉష్ణోగ్రత 48°C ఉన్నప్పుడు కూడా పైన సూచించిన రెమిడి వలననే ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉన్నట్లు వీరు తెలుసుకున్నారు. పైన పేర్కొన్న రెమిడి తో పాటు CC18.1 Brain disabilities ను కలిపి మొక్కలను తరలించడానికి లేదా కొత్త మొక్కలు నాటడానికి ముందు మొక్కల పైన, భూమి పైన స్ప్రే చేయడం ద్వారా తొలగిస్తారు. మొక్కలతో పాటు పక్షులు జంతువులకు కూడా తన గార్డెన్ లో ఆహారము మరియు నీరు అందించడం ద్వారా తన ప్రేమను వీరు చాటుకుంటున్నారు. వీటికోసం కుండలలో మట్టి పాత్రలలో ప్రతీరోజు నీరు నింపి ఆ నీటిలో తను AVP, ఐనప్పటి నుండీ CC1.1 Animal tonic + CC15.1 Mental & Emotional tonic వేయడం మొదలు పెట్టారు. ఆశ్చర్యకరంగా ఈ పక్షులు జంతువుల సంఖ్య రోజురోజుకూ పెరగ సాగింది. (ఫోటోలు చూడండి).
భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా వైబ్రో సేవను నిర్వర్తించడం తనకు అమితమైన ఆనందాన్ని అందిస్తోందని ప్రాక్టీషనర్ చెపుతున్నారు. ఈ విధానము ద్వారా తన ఆత్మవిశ్వాసము పెరగడమే కాక భగవంతుని పట్ల భక్తి కూడా పెరిగిందని వీరు భావిస్తున్నారు. భగవంతుని పట్ల విశ్వాసము, భక్తి, పవిత్రమైన హృదయము తో సేవ చేస్తే రోగికి నయం కాకపోవడం అంటూ ఉండదని వీరి అనుభవం ద్వారా తెలుసుకున్నారు. " ప్రతీ కుటుంబము సాయి వైబ్రియానిక్స్ యొక్క ఫలాలు అందుకొని ఆనందంగా ఉండాలి!” అని స్వామికి వీరు నమ్రతతో నివేదిస్తున్నారు.
పంచుకున్న కేసులు: