చికిత్సా నిపుణుల వివరాలు 10831...India
ప్రాక్టీషనర్10831…India పశువైద్య శాస్త్రంలో విశ్వవిద్యాలయ పట్టా కలిగిన వీరు ఒక ప్రభుత్వ సంస్థలో పశువైద్య నిపుణుని గానూ అలాగే అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసరు గా 37 సంవత్సరాల సుదీర్ఘ భోధనా అనుభవం గడించిన తరువాత 2002లో పదవీ విరమణ చేసారు. వీరు 1985 నుండే స్వామి భక్తులుగా ఉన్నప్పటికీ 2003 నుండి చురుకైన సేవాదళ్ సభ్యునిగా ఉంటూ ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రశాంతి నిలయం సేవకు వెళ్ళేవారు. 2009 సెప్టెంబర్ లో ఒక మిత్రుని ద్వారా వీరు వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకొన్నారు. స్వామి అనుగ్రహంతో ఆ తరువాత నెలలోనే మహారాష్ట్ర లోని సోలాపూర్ లో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని AVP అయ్యారు. అప్పుడున్న నిబంధనల ప్రకారం వీరికి 54CC కాంబో బాక్సు ఇవ్వడం జరిగింది.
ప్రారంభంలో చాలా తక్కువమంది పేషంట్లు రావడం వలన వీరు నిరాశకు గురై స్వామిని ప్రార్ధించారు. త్వరలోనే పేషంట్ల ప్రవాహము ప్రారంభమవడమే కాక కొందరు మానసిక వికలాంగులు చికిత్స తీసుకోవడం ప్రారంభించారు. అనంతరం వీరికి ఒక పెద్ద కర్మాగారములో వర్కర్లకు చికిత్స చేసే అవకాశము లభించింది. దినసరి కూలీలు కనుక వీరికి చికిత్స కోసం సెలవు దొరకడం కష్టం, దొరికినా వైద్య ఖర్చు భరించడం చేతకాదు. అటువంటి వారికి చికిత్స చేసే అవకాశం వచ్చినందుకు వీరు ఎంతో అనందించేవారు. 2010 నుండి దగ్గరలో ఉన్న షిరిడీ బాబా మందిరంలో ప్రతీ గురువారము ఉదయము, సాయంత్రము చికిత్స చేసే అవకాశము వీరికి లభించింది. 2011 జనవరిలో వీరు VPగా ఉత్తీర్ణత పొంది 108CC బాక్సు తీసుకున్న తరువాత వీరి ప్రాక్టీసు ఆకాశమే హద్దుగా పెరగ సాగింది. వీరికి దగ్గరలో ఉన్న గోశాలలోని గోవులకు వారానికి రెండు సార్లు చికిత్స చేయడం ప్రారంభించే సరికి గోమాత పూజ కోసం అక్కడికి వచ్చే వారు కూడా వీరివద్ద చికిత్స తీసుకోవడం ప్రారంభించారు.
2014 ఏప్రిల్ నుండి ప్రశాంతి నిలయంలో మగవారి సేవాదళ్ భవనంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చే సేవాదళ్ కోసం క్రమం తప్పకుండా నిర్వహింపబడే వైబ్రో వైద్యశిబిరం లో రెగ్యులర్ గా సేవ చేసే అద్భుతమైన అవకాశం వీరికి లభించడం వీరి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు. ఈ సేవా నిర్వహణ కోసం వీరు సుమారు 15 రోజులు పుట్టపర్తిలోనే ఉంటూ ఉదయం నుండి సాయంత్రం వరకూ వైబ్రియోనిక్స్ రెమిడిలు ఇస్తూ ఉంటారు. తన గురువు దైవమైన స్వామి చెంత సేవ చేసుకునే భాగ్యం కలుగుతున్నందుకు ఈ సేవ చాలా ప్రత్యేకమైనదిగా వీరు భావిస్తున్నారు. అనేక ప్రాంతాలనుండి వచ్చే అనేక సంస్కృతులతో కూడిన సేవాదళ్ ను చూడడం వలన ఇది వీరి అవగాహనను ఇనుమడింపజేసిందని వీరు భావిస్తున్నారు. వీరి పేషంట్లలో అనేకమంది అలోపతి డాక్టర్లు కూడా ఉండడం వలన ఈ చికిత్సా ఫలితాలు చూసిన తరువాత వీరు తమ పేషంట్లకే కాక, బంధువులు, స్నేహితులను కూడా వైబ్రో చికిత్స తీసుకోవలసిందిగా సూచించడమే కాక రోగుల మెడికల్ రిపోర్టులను విశ్లేషణ చేయటం లో సహకారాన్ని అందిస్తున్నారు. ప్రాక్టీషనర్ స్వతహాగా వెటర్నరీ డాక్టర్ కావడం వలన పేషంటు యొక్క వ్యాధుల గురించి త్వరగా అవగాహన చేసుకొని సత్వరమే వారికి చికిత్స నందించేందుకు అవకాశము కలుగుతోంది.
వీరు హైదరాబాద్ లో ఉన్నప్పుడు షిర్డీ బాబా మందిరంలో సేవను, గోశాల లో సేవను కొనసాగిస్తూనే సంవత్సరానికి రెండు సార్లు ప్రశాంతి నిలయంలోనే బసచేసి సేవచేసుకుంటున్నారు. అలాగే ప్రశాంతి నిలయం యొక్క పారిశుధ్య నిర్వహణా సేవ బృందంలో సభ్యునిగా ఉంటూ తమ సేవలు కొనసాగిస్తున్నారు.
వీరు తాత్కాలిక వ్యాధుల తో బాధపడుతున్న పేషంట్లకు చికిత్స చేసే నిమిత్తం వెల్ నెస్ కిట్ ను ఎప్పుడూ తన వెంట ఉంచుకుంటారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటనను మనతో పంచుకుంటున్నారు. వీరు పుట్టపర్తి లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గేట్ వద్ద సేవలో భాగంగా నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక కుక్క కుంటుతూ మూలుగుతూ కనిపించింది. వీరు వెంటనే Move Well కొమ్బో ను ఒక కప్పు నీళ్ళలో వేసి సమయము ప్రకారం చూసుకుంటూ నాలుగుసార్లు త్రాగించారు. అరగంటలో ఆ కుక్క కుంటకుండా నడుచుకుంటూ హాయిగా వెళ్ళిపోయింది.
పునరావృతమవుతున్న చర్మవ్యాధులు, శ్వాస సంబంధితమైన వ్యాధులు, ఆందోళన వంటివాటికోసం తమ పేషంట్లకు CC17.2 Cleansing ను సూచిస్తున్నారు. అలాగే తన అనుభవం ద్వారా సోరియాసిస్, పార్కిన్సన్ వ్యాధి ఇంకా కారణాలు తెలియని వ్యాధులకు కూడా CC12.4 Autoimmunediseases అద్భుతంగా పనిచేస్తోందని కనుగొన్నారు.
వీరు 108CC బాక్సు తో సేవ చేయడం తనకెంతో సంతృప్తి నిస్తోందని కనుక SVP గా ప్రమోషన్ తీసుకునే ఆలోచన తనకు లేదని భావిస్తున్నారు. ఐతే కొన్ని రకాల మానసిక వ్యాధుల నిమిత్తం తన సీనియర్లు తయారు చేసి ఇచ్చిన రెమిడిలను ఎప్పుడూ తన వెంట ఉంచుకుంటారు. ఆత్మవిశ్వాసం లేకపోవడం, పెంకితనం, దురాలోచనలు, నిరాశాపూరిత వైఖరులు, విపరీతమైన ఆందోళనలు భయాలు, కుంగుబాటు వంటి వాటికి అద్భుతమైన రీతిలో వీరు చికిత్సనందించడం జరిగింది. ఈప్రాక్టీషనర్, వైబ్రియోనిక్స్ తనను ‘’సేవ’’ అనే పదానికి నిజమైన అర్ధం తెలుసుకునేలా చేసి తన హృదయాన్ని మరింత దయాపూరితంగా చేసిందని అభిప్రాయం పడుతున్నారు. ఇందువలన పేషంట్ల బాధలు అర్ధం చేసుకోవడానికి వారితో ప్రేమతో మాట్లాడడానికి భగవంతుని పట్ల పూర్తి శరణాగతి భావంతో మెలగడానికి దోహద పడిందని భావిస్తున్నారు. ఎవరికైనా జీవితాంతం అవసరమైన వారికి సేవ చెయ్యాలనే కోరిక ఉన్నట్లయితే వారికి వైబ్రియోనిక్స్ కు మించిన సదవకాశం లేదు అని దృఢంగా చెబుతున్నారు!