వైబ్రో అభ్యాసకుల వివరాలు 03546...France
ప్రాక్టీషనర్ 03546…France, ఉద్యోగ విరమణ పొందిన 67-సంవత్సరాల ఈ ప్రాక్టీషనర్ కు 1982.నుండి బాబావారి గురించి తెలుసు. 2016,జూన్ నెల లోనే వీరు AVP గా శిక్షణ తీసుకున్నప్పటికీ వీరు వైబ్రియోనిక్స్ కు కొత్త కాదు. ప్రశాంతి ఆశ్రమంలో వీరి సహపాటి,క్రిస్టమస్ గీతాల గాయని ఐన , ప్రాక్టీషనర్02667…యుకె , వీరికి జలుబుకు వైబ్రో రెమిడి ఇచ్చినప్పటి నుండీ వైబ్రియోనిక్స్ గురించి తెలుసు. వీరు ప్రాక్టీ షనర్ కాక ముందు నుండే ప్రశాంతి నిలయం వెళ్లినప్పుడల్లా వీరి స్నేహితులకు జలుబు నిమిత్తం వైబ్రో రెమిడి బాటిళ్ళు తీసుకువచ్చి ఇచ్చేవారు.
ఇన్ని సంవత్సరాలుగా వైబ్రో చికిత్స గురించి తెలుసుకోకపోయినందుకు ప్రాక్టీ షనర్ పశ్చాత్తాప పడుతున్నారు. ఐతే వీరు ఇప్పటివరకూ రోగ నిరోధానికి విభూతి పైనే ఆధారపడ్డప్పటికీ 2015 లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీరికి విపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్ కి చూపించగా వీరి అండాశయం వద్ద పెద్ద కణితి ఉందని చెప్పారు. దీనిని తొలగించడం కోసం శస్త్ర చికిత్సకు ప్రయత్నించగా డాక్టర్లకు ఈ కణితి కనబడలేదు. మరింత లోతుగా అధ్యయనం చేయగా ఈమె చిన్నప్రేగు బయట కణితి ఉందని ఇంకా గర్భాశయంలో చిన్న చిన్న గడ్డలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం మరొక సర్జెరీ చేయించుకోవలసిందిగా డాక్టర్లు సూచించారు. ఇదే సందర్భంలో దైవసంకల్ప వశాత్తూ వీరి మిత్రుడు పుట్టపర్తిలో మొదటి వైబ్రో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందుకోవడం జరిగింది. సర్జెరీ చేయించుకొనే ఆలోచనలో ఉన్న ఈమె ఆ ఆలోచన విరమించుకొని ఇది బాబా సంకల్పముగా భావించి వైబ్రో చికిత్స కోసం పుట్టపర్తి వెళ్ళాలని అనుకున్నారు. పుట్టపర్తి లో ఉన్నప్పుడు వీరు చక్కగా కోలుకోవడం వలన మరో అనివార్య మైన శస్త్ర చికిత్స చేయించుకోకుండానే అద్భుతంగా కోలుకున్నారు. ఈ అనుభవం వీరిని హృదయపుర్వాకంగా డాక్టర్ అగ్గర్వాల్ గారి ఆధ్వర్యంలో వైబ్రియోనిక్స్ లో శిక్షణ తీసుకోవడానికి పురిగొల్పింది.ఐతే వీరికి ఆంగ్ల భాషా ప్రావీణ్యత లేకపోవడం వలన మొదట సాధ్యం కాలేదు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆశ్రమంలో ఉన్న ఒక ఫ్రెంచ్ కోఆర్డినేటర్ త్వరలోనే ప్రెంచ్ భాషలో శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నట్లు చెప్పడంతో ఎంతో ఆనందించారు.
అలా తన కల సాకారం ఔతున్న ఆనందంలో ఫ్రాన్సు చేరుకున్నారు. ఆ సమయంలో గర్బవతి గా ఉన్న వీరికోడలిని సాధారణ కాన్పు నిమిత్తం వైబ్రో రెమిడి లు వేసుకోవలసిందిగా సూచించారు.ఎందుకంటే ఈమెకు మొదటి కాన్పు సిజేరియన్ అయ్యింది. ఈ ప్రాక్టీషనర్ ఊర్లో ఉంటున్న 30 ఏళ్ల అనుభవం గల మంత్రసాని వీరి కోడలికి సాధారణ కాన్పు కావడం చూసి ఇది భగవంతుడు చేసిన ఒక అద్భుతమైన లీల అని ఆశ్చర్య పోయింది. ఈ ఆనుభవం తో వీరి కోడలు పాలు రావడానికి కూడా వైబ్రో రెమిడిలు తీసుకోని 18 నెలలు తన రెండవ సంతానానికి పాలు ఇవ్వడం జరిగింది. మొదటి కాన్పు అనంతరం ఈమె కేవలం 15 రోజుల వరకూ మాత్రమే ఇచ్చి విపరీతమయిన నొప్పి రావడం తో తన బిడ్డకు పాలు ఇవడం మానేసారు.
ఈ అద్బుత మైన లీలలు వీరిని వీరి కుటుంబం యావత్తూ (పిల్లలు,వారిపిల్లలు) వైబ్రియోనిక్స్ రాయబారులుగా మార్చివేసినవి. ఇప్పుడు వీరి యొక్క స్నేహితులు వారి పిల్లలు యాంటిబయోటిక్స్ కన్నా వైబ్రో రెమిడిలనే కావాలని కోరుతున్నారు.ఇప్పుడు వీరందరికీ దంత చికిత్స తో పనిలేదు అత్యంత బాధాకరమైన బోవేల్ చికిత్సను నిస్సహాయంగా అనుభవించే అవసరమే లేదు.వీరంతా ఇప్పుడు ఆనందంతో ,నమ్మకంతో వైబ్రియానిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.అందుకే ప్రాక్టీషనర్ దృష్టిలో వైబ్రియానిక్స్ భగవంతుడుకి ,పేషంట్ లకు మధ్య అనుసంధానమేర్పరిచే ఒక దివ్య ఉపకరణం
ప్రాక్టీ షనర్ పిల్లలలో చిగుళ్ళ మంటలు,,పేనుకొరుకుడు, జన్యు పరమైన ఎపిడెర్మో లైసిస్ బుల్లోసావ్యాధి,నత్తిగా మాట్లాడడం,జలుబు, కీటకాలు కుట్టినందువల్ల వచ్చే వ్యాధులు,శిశు వ్యాధులు,ఆందోళన,మానసిక రుగ్మతలు,క్యాన్సరు, అధిక పాళ్ళలో ఉన్న కొవ్వు గ్రంధులుగా ఏర్పడడం, అంటువ్యాధులు,వికారము,జీర్ణకోశ సమస్యలు,,జలుబు, అధిక బరువు,సోరియాసిస్,కణుతులు,తల వెంట్రుకల సమస్యలు,మధుమేహము,జుట్టు రాలిపోవడం,మూత్రపిండాల సమస్యలు, ప్రోస్త్రేట్ సమస్యలు, ఇటువంటి సమస్య లెన్నింటినో నయం చేసారు. ఐతే ఈ రెమిడి లను ఉచితంగా అందించడం వలన వీటి విలువ చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు అని ప్రాక్టీ షనర్ వాపోతున్నారు. ఫ్రాన్సు సోషలిస్ట్ దేశము అవడాన అక్కడి పౌరులు ఆరోగ్యము నిమిత్తము తమ సొంత సోమ్మేమీ ఖర్చు చేయరు. అందువలన ప్రభుత్వం ద్వారా అందే అలోపతి మందులు ఎక్కువగా వాడడం జరుగుతోంది. ఎప్పుడయితే ఈ మందుల దుష్ప్రభావము వలన సమస్యలు ఎదుర్కొంటారో అప్పుడే ఇతర ప్రత్యామ్నాయ వైద్యవిధానం వైపు దృష్టి సారిస్తారు.
వీరు శాకాహారి కనుక తన వద్దకు వచ్చే పేషంట్లకు కూడా దీని ఫలితాలు తెలుపుతూ శాకాహారమే తినమని ప్రోత్సహిస్తారు. వైబ్రియానిక్స్ భవిష్యత్తులో అందరికీ ఆమోదయోగ్యమైన వరప్రసాదిని గా కొనియాడబడుతుందని వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి ఉదాత్తమైన ,ఉత్తమ మైన మార్గంలో తాను ఉన్నందుకు, ఉంచినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నారు.ఈ విధానము వలన తన ఆలోచనా సరళిలో మార్పు వచ్చి దివ్యమైన .భవ్యమైన మార్గంలో ప్రయాణించ గలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పంచుకున్న కేసులు :