లైమ్ వ్యాధి , బాల్యంలో ఏర్పడ్డ గాయం 03546...France
2017 మే 22 న 43 సంవత్సరాల వ్యక్తి లైమ్ వ్యాధి చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.వీరికి జ్ఞాపక శక్తి లోపము,తలపోటు,గొంతు నొప్పి మరియు కడుపు నొప్పి గత నలుగు సంవత్సరాలుగా ఉన్నాయి. వీరికి కీళ్ళ నొప్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే దానివలన వీరు ఇంట్లోనే ఉండిపోవలసి వస్తోంది. ఐతే రక్త పరీక్షలలో దీని విషయం ఏమీ తెలియలేదు కానీ డాక్టర్లు ఇది ఒక మానసిక రుగ్మత అని చెప్పారు.
ప్రాక్టీషనర్ పేషంటు ను తను ఇవ్వబోయే చికిత్స రెండు విధానాలలో ఉంటుందని సూచించారు. ఒకటి క్లెన్సింగ్ రెమిడి తీసుకోవడం ద్వారా వ్యాది లక్షణాలు ఉధృతమై తర్వాత వ్యాధి మెల్లిగా నెమ్మదిస్తూ వస్తుందని చెప్పారు. ఎందుకంటే బాల్యంలో ఇతను ఒక అక్కరకు రాని శిశువుగా తల్లిదండ్రుల ద్వేషానికి గురి అవుతూ తరుచుగా దెబ్బలు తింటూ ఆత్మహత్యా యత్నాలు చేస్తూ ఉండేవాడని తెలిసింది. కనుక క్లెన్సింగ్ తగిన రెమిడి అని భావించి దానిని ఇవ్వడం జరిగింది.
# 1. CC17.2 Cleansing...TDS
ప్రాక్టీ షనర్ తనకు ప్రతీ రోజు ఎలాఉందో చెప్పమని పేషంటు ను కోరారు.మొదటి రెండు రోజులు వ్యాధి లక్షణాలు పెరిగి నట్లు అనిపించింది. ఐనప్పటికీ పేషంటు రెమిడి TDS గా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మరునాటి నుండి వ్యాధి తగ్గడం ప్రారంభమయ్యి 7 రోజులలో పూర్తిగా తగ్గిపోయింది.ఐనప్పటికీ డోసేజ్ మరో నలుగు వారాలు కొనసాగించారు.
జూన్ 27 న అతని బాల్యములోకలిగిన మానసిక గాయానికి చికిత్స చేయాలని భావించి ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు.
# 2. CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders...TDS