చికిత్సా నిపుణులు 11276...India
చికిత్సా నిపుణులు 11276...భారతదేశం త్రివేండ్రమ్ లో NIIT (ఒక ప్రముఖ IT శిక్షణ సంస్థ) అధినేతయైన ఈమె, ఇరవై సంవత్సరాలుగా స్వామి భక్తురాలు. ఈమె 2010 నుండి వైబ్రియానిక్స్ సేవను అందిస్తున్నారు. అంతకముందు ఈమెకు అల్లోపతి చికిత్సలు మరియు వ్యాధుల గురించి నేర్చుకోవాలన్న ఆశక్తి ఉండేది కాదు. ఆమె మాటల్లో " ఒక శిల్పి ఒక రాయిని, అందమైన శిల్పంగా చెక్కినట్లు" క్రమంగా వివిధ అనుభవాల ద్వారా స్వామి ఆమెలో పరివర్తనను తీసుకు వచ్చారు. గతంలో ఈమె రేకి మరియు సాయి సంజీవని వంటి చికిత్సలను అభ్యసించేవారు. 2006లో, ఒక స్నేహితురాలు ద్వారా వైబ్రియానిక్స్ గురించి పరిచయం ఏర్పడినప్పటికీ 2010లో కేరళలో నిర్వహించబడిన ఒక వైబ్రియానిక్స్ శిక్షణా శిబిరంలో ఈమె శిక్షణ పొందింది. ఒక సంవత్సరం తర్వాత ఈమె తదుపరి స్థాయియైన VP స్థాయికి అర్హత పొందింది. ఆ సమయంనుండి స్వామి యొక్క సాధనంగా నిస్వార్థ సేవను అందిస్తోంది.
ప్రారంభంలో, పుస్తకాల్లో ఉన్న నియమాల అనుసారం ఈమె తన వైబ్రో సాధనను చేసినట్లుగా అంగీకరిస్తున్నారు. కాలక్రమేణా ఈమెలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా అంతర్వాణిని స్పష్టంగా వినగలిగే జ్ఞ్యానం పెరిగింది. భగవంతుడి చేతుల్లో సాధనంగా పని చేసినప్పుడు అహం తగ్గుతుందని ఈమె భావిస్తున్నారు. రోగుల ఆరోగ్య స్థితిలో మెరుగుదల కనిపించిన సమయంలో ఈమె స్వామి యొక్క దీవెనలను మాత్రమే చూస్తుంది. అద్భుతమైన రీతులలో వ్యాధులు నయంకావడాన్ని దగ్గర నుండి చూసిన సమయంలో, ఈమెలో మరింత ప్రేరణ ఏర్పడి నిస్వార్థ సేవను అందించేందుకు మరింత బలాన్ని అందజేస్తోంది. వైబ్రియానిక్స్ సేవ ఫలితంగా తనలో ఆధ్యాత్మిక పురోగతి ఏర్పడుతున్నట్లుగా ఈమె భావిస్తున్నారు.
గత ఒక సంవత్సరం నుండి చికిత్సా నిపుణులు11958 తో కలిసి ప్రతి నెల మూడు వైబ్రో శిబిరాలను నిర్వహించే అవకాశాలతో ఈమె ఆశీర్వదించబడింది. దీని ద్వారా ఈమెకు ఈ చికిత్సా విధానం గురించి మరింత నేర్చుకునేందుకు మరియు ఇతరులతో తన అనుభవాలను పంచుకునేందుకు అనుకూలంగా ఉంది. మొక్కలు మరియు జంతువులకు చికిత్సను అందించడం ద్వారా ఈమెకు మరింత ఆనందం కలుగుతుంది. ఈమె ఒక అద్భుతమని భావిస్తున్నటువంటి ఒక సంఘటనను ఇక్కడ పంచుకుంటున్నారు. ఈమె పాల్గొన్న మొట్టమొదటి శిబిరం ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం నాడు జరిగిందని ఈమె ఆ నాడు గ్రహించలేదు. ఆ శిబిరంలో మందుల కొరకు సుమారు వంద మంది వేచియుండగా, డయాబెటిస్ కు సంబంధించిన మందు సీసా ను (CC6.3 Diabetes) ఈమె అరచేతిలో పట్టుకొని ఉండగా విరిగిపోవడం జరిగింది. వెంటనే ఈ మందు యొక్క కొన్ని చుక్కలను భద్రపరచి ఒక పెద్ద సీసాలోకి ఈమె తీసుకున్నారు. ఇది భగవంతుడి యొక్క కృప మాత్రమే అని ఈమె పూర్తిగా విశ్వసిస్తున్నారు. అప్పటి నుండి ఈమె వద్దకు వచ్చే డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని (పెద్ద సీసా యొక్క ఆవశ్యకతను సూచించే విధంగా) మరియు వారందరికీ పూర్తిగా నయంకావడం ఆశక్తికరమైన విషయమని ఈమె చెబుతున్నారు.
క్రమంగా ఈమె ఉబ్బు నరాలు (వెరికోస్ వెయిన్స్) వంటి సమస్యలకు వైబ్రియానిక్స్ చికిత్సతో పాటుగా వేపాకులు, పసుపు మరియు తులసాకులు మరిగించిన నీటితో గాయాలను కడగడం వంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా మరింత వేగంగా ఈ వ్యాధి నయమవుతున్నట్లుగా ఈమె తెలుపుతున్నారు. చర్మ రోగాలకు స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో వైబ్రో మందులను కలపి ఇవ్వడం ద్వారా సఫిలితాలు మరింతగా లభిస్తాయని ఈమె అనుభవంతో తెలుసుకున్నారు.
స్వామి దివ్య హస్తాల్లో ఒక వినమ్ర సాధనంగా తనను భావిస్తున్న ఈమె, తన జీవితంలో జరిగేటివన్నీ స్వామి యొక్క సంకల్పం మాత్రమేనని భావిస్తున్నారు. ప్రతి ఒక చికిత్సా నిపుణులకు స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని ఈమె విశ్వాసం. అయితే, శరణాగతి భావంతో సేవను అందించడం ప్రధానమని ఈమె చెబుతున్నారు.
పంచుకుంటున్న రోగ చరిత్రలు