చికిత్సా నిపుణులు 11958...India
చికిత్సా నిపుణురాలు 11958...భారతదేశం కేరళ ఆరోగ్య సేవకవర్గములో, నేత్ర నిపుణురాలుగా ఉద్యోగం చేసి రిటయిర్ అయిన ఈమె, ప్రస్తుతం ఒక ప్రయివేట్ వైద్య కళాశాలలో ఉపాధ్యాయురాలుగా తన సేవలను అందజేస్తున్నారు.1962 నుండి ఈమె సాయి బాబా భక్తురాలు. డా.అగ్గర్వాల్ యొక్క సోల్జర్నస్ భేటీ ద్వారా ఈమెకు వైబ్రియానిక్స్ గురించి తెలియడం జరిగింది. ప్రత్యామ్నాయ చికిత్సలు పై ఆశక్తి మరియు వివిధ రకముల వ్యాధులకు చికిత్సను అందించాలన్న కోరిక ఉన్న ఈమెకు, వెంటనే సాయి వైబ్రియానిక్స్ చికిత్సా విధానంలో శిక్షణ పొందే అవకాశం కలిగింది. స్వామి స్వయంగా ఈ చికిత్సా విధానమును దీవించడమే కాకుండా రోగులను నయం చేసేది తామేనని రూఢిపర్చడం, ఈమెకు వైబ్రియానిక్స్ పై ప్రత్యేక ఆకర్షణను కలిగించాయి. 2015 జులై నుండి ఈమె వైబ్రో చికిత్సా నిపుణురాలుగా తమ సేవలను అందజేస్తున్నారు.
సేవను అందించే అవకాశాలు పుష్కలంగా కలిగి ఉన్న కేరళ సత్యసాయి అనాథాశ్రమ సంస్థచే నిర్వహించబడే సాయిగ్రామం ఆవరణలో ఈమె నివసిస్తున్నారు. ఒక అనాధాశ్రమం, వృద్ధాశ్రమం, ఒక పాఠశాల, మానసికరుగ్మతలున్న పురుషులకు ఒక గృహం వంటి వివిధ స్థాపనములు ఉన్న ఈ ఆవరణలో, ఈమె నెలవారీ శిబిరాలు నిర్వహించండంతో పాటు రోగులకు ప్రత్యేక సంప్రదింపులు మరియు అత్యవసర సంరక్షణను కూడా అందజేస్తున్నారు. వృద్దాశ్రమ నివాసితులకు ఈమె క్రమం తప్పకుండా, గులాబీ నీటిలో వైబ్రియానిక్స్ మందులను కలిపిన కంటిచుక్కలను ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ చికిత్సా నిపుణురాలు జంతువులకు, ముఖ్యంగా ఆవులకు ఏర్పడిన వివిధ గాయాలకు చికిత్సను ఇవ్వడంతో పాటు ప్రసవానంతర సంరక్షణకు సంబంధించిన చికిత్సను కూడా అందజేస్తున్నారు. ఇటువంటి అత్యుత్తమమైన సేవా కార్యక్రమంలో స్వామి తనను ఎంపిక చేసింనందుకు ఈమెకు ఎంతో ఉత్సాహంగా ఉంది!
వైబ్రియానిక్స్ సంరక్షణలో ఉన్న రోగుల యొక్క ముఖాలలో కలిగే ఉల్లాసాన్ని ఈమె పలుమార్లు గమనించారు. ఈ చికిత్స ద్వారా ఈమె అలెర్జీ మరియు ఆర్త్రైటిస్ (కీళ్లవ్యాధి) రోగులకు చికిత్సను అందించి విజయవంతమైన ఫలితాలను పొందింది. నయమయ్యే అవకాశం చాలా తక్కువని వైద్యులచే నిరూపణ చేయబడిన ఒక మ్యాకులర్ డిస్ట్రాఫి (కంటి కండరాల బలహీనత) రోగికి వైబ్రియానిక్స్ ద్వారా దృష్టి గణనీయంగా మెరుగుపడింది. ఈమె అనుభవంలో ఇది యొక్క అద్భుతమైన సంఘటనని ఈమె భావిస్తున్నారు. 'పరీక్ష/ ఎక్జామ్ " కాంబో CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic ద్వారా ఈమె పిల్లల్లో మెరుగైన అభ్యసించే సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతను గమనించారు. పిల్లలకు అద్భుతమైన రీతిలో సహాయపడే మరొక కాంబో: CC4.1 Digestion tonic + CC12.2 Child tonic మౌఖికంగా తీసుకోవడంతో పాటు వైబ్రియానిక్స్ మందులను పై పూతగా ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభించాయని ఈమె అనుభవం ద్వారా తెలుపుతున్నారు.
చికిత్సా నిపుణురాలు11276 తో పాటుగా ఈమె, అమృతానందమయి ఆశ్రమంలో నెలవారీ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈమె యొక్క సేవ క్రమంగా పెరిగి, ప్రస్తుతం ఒక నెలలో సుమారు 100 రోగులకు చికిత్సను అందజేస్తున్నారు. అప్పుడప్పుడు అల్లోపతి వైద్యం కోరుతు ఆశపత్రిలో ఈమెను సంప్రదించే రోగులకు, ముఖ్యంగా అల్లోపతి వైద్యం ద్వారా నయంకావడానికి అవకాశాలు లేని సందర్భాల్లో, వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోమని ఈమె సలహా ఇస్తున్నారు. శ్వాసకోశ మరియు చర్మం సంబంధిత ఎలర్జీలు, ఎపిలెప్సి (మూర్ఛరోగము, కంటి చూపు క్షీణత, సెబేషియస్ తిత్తి, కీళ్ల వాపు, గాల్ స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు), సున్నితమైన పళ్ళు/దంతములు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, సన్ (ఎండ) ఎలర్జీలు, చర్మకీలములు, మొటిమలు, అతిరోమత్వం వంటి సమస్యలకు ఒక సంవత్సరంలో ఈమె విజయవంతంగా చికిత్సను అందించారు. అంతేకాకుండా, అనేక జంతువులు మరియు మొక్కలకు ఈమె చికిత్సను అందించారు. దూరంలో ఉన్న రోగులకు మరియు కుటుంభ సభ్యులకు ఈమె వైబ్రో మందులను తపాలు ద్వారా పంపిస్తున్నారు.
సంపూర్ణ అంకిత భావం మరియు హృదయపూర్వక ప్రార్థనలతో పాటు రోగులకు చికిత్సను అందించిన సమయంలో, అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని ఈమె నమ్మకం. ఈ అవగాహన ఈమెను మరింత వినయపూర్వకమైన వ్యక్తిగా మార్చింది. స్వామి యొక్క సాధనంగా తనను భావిస్తు, చికిత్స కొరకు ఈమెను సంప్రదించే ప్రతి యొక్క రోగిలోను భగవంతుడను చూస్తున్నారు మరియు వైబ్రియానిక్స్ సేవను అందించే అవకాశం కలిగినందుకు ఈమె ఎంతో ఆనందిస్తున్నారు.
పంచుకుంటున్న రోగ చరిత్రలు