Practitioner Profile 01180...Bosnia
చికిత్సా నిపుణుడు 01180…బోస్నియా, క్లిష్టమైన ధీర్గకాల వ్యాధులకు మరియు సాధారణంగా వచ్చే రోజువారి రోగ సమస్యలకు, గత 17 సంవత్సరాలుగా చికిత్సను అందచేస్తున్నారు. వైబ్రో చికిత్స అభ్యసించడంలో ధీర్గకాల అనుభవమున్న ఈ నిపుణుడకు హోమియోపతి చికిత్సా విధానంలో కూడా నైపుణ్యముంది. ఇతను నూతన హోమియోపతి వైద్యులకు ఆధునిక హోమియోపతి పై శిక్షణనిచ్చే ఒక అధ్యాపకుడు. ఈ కారణంగా ఇతనికి రోగనిర్ధారణ చేసే మరియు చికిత్సనిచ్చే ప్రవీణత ఉంది.
1999లో, చికిత్సా నిపుణుడి యొక్క సొంత ఊరిలో, డా.జే.కే.అగ్గర్వాల్ దంపతులచే నిర్వహించబడిన శిక్షణా శిబిరంలో మొట్టమొదటి సారిగా ఇతనికి వైబ్రియానిక్స్ చికిత్సా విధానం గురించి తెలుసుకొనే అవకాశం కలిగింది. తక్షణమే ఇతనికి వైబ్రియానిక్స్ తో ఒక గట్టి సంభంధం ఉన్నట్లుగా భావన కలిగింది. అప్పటినుండి ఇతను వైబ్రియానిక్స్ సేవను తన మతముగాను, అభిరుచిగాను మరియు తన జీవితంగాను భావిస్తున్నారు. వైబ్రియానిక్స్ మరియు హోమియోపతి పై జ్ఞ్యానాన్ని పెంచుకొనే నిమిత్తమై, ఇతను అనేక సంవత్సరాలు, ఈ రెండు చికిత్సా విధానాల పై అధ్యయనం చేసారు. ఇతను రోగులకు కేవలం వైబ్రో చికిత్సను మాత్రమే అందచేస్తున్నారు. అనేక సంవత్సరాలు తీవ్ర అధ్యయనం మరియు కృషి చేసినప్పటికీ, ఇంకా వైబ్రియానిక్స్ మందుల పై పూర్తి అవగాహన కలగలేదని ఇతను భావిస్తున్నారు. అయితే, చికిత్స కొరకు ఇతని వద్దకు రోగులు అధిక సంఖ్యలో రావడం మరియు వారందరికీ సంపూర్ణ అర్పనా భావంతో సేవను అందచేయడం, ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని ఇతను భావిస్తున్నారు. స్వామీ ఇతనిని ఒక శిక్షకుడిగా సేవ చేయడానికి అవకాశం ఇవ్వడం ద్వారా అవసరమైన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించారని అభిప్రాయపడ్డారు.
ఇతను, వైబ్రియానిక్స్ లో విజయాన్ని సాధించడానికి రెండు ప్రధాన మార్గదర్శక సూత్రాలున్నాయని భావిస్తున్నారు: క్షమా భావన మరియు దైవ రక్షణ కోసం ప్రార్థన. తన సొంత జీవితంలో క్షమాబుద్ధి కలిగియుండడం మరియు రోగులను ఈ సద్భావాన్ని ఆచరించమని భోధన చేయడం ద్వారా దివ్యత్వంతో తనకున్న సంబoదాన్ని మరింత బలపరచడానికి సహాయపడిందని ఇతను నమ్ముతున్నారు. ఈ దివ్య సాధన వ్యక్తి యొక్క గుండెలో సంభవించే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా, మీరు నిశ్శబ్దముగా ఉంటూ అందరితో/అంతటితోను ఒక మానసిక అనుసంధానం ఏర్పరచుకోవాలి - మీలో దుష్ట భావాలను కలుగ చేసిన ప్రతియొక్క వ్యక్తి, జంతువు, సంస్థ మరియు ప్రతియొక్క సంఘటనతోను ఈ అనుసంధానాన్ని ఏర్పర్చుకోవాలి. మనసులోనే మీరు ప్రతియొక్క వ్యక్తిని క్షమాపణ కోరాలి మరియు వారిని మీరు క్షమించాలి. అదే సమయంలో మీరు వారి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి. మీరు వారికి విముక్తులను చేయడంతో పాటు వారి నుండి విముక్తి కోరాలి.
అందరిని క్షమించే ఈ సాధనను చేసే రోగులలో, ఆరా (కాంతిమండలం) లో ఏర్పడే మార్పులను ఇతను చూడగలుగుతున్నారు. ఈ సాధనను చేయడం ద్వారా అనేక రోగులకు అనేక అద్భుతమైన అనుభూతులు కలిగాయి. క్షమించే సాధనను చేసిన తర్వాత తమ కోరికలు తక్షణమే అనుకూలమైన నిశ్చితమైన అనుభూతులుగా వెల్లడిస్తున్నాయని అనేక మంది రోగులు నిర్ధారించి చెబుతున్నారు. అసాధ్యమైన సమస్యలకు పరిష్కారం అతి సులభంగా లభిస్తోంది. " నేను ముందున్న మనిషిని కాదు ; ఎల్లప్పుడూ నేను ఏ విధంగా ఉండాలని అనుకున్నానో, అదే విధంగా ఉంటున్నాను" అని కొందఱు రోగులు తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఈ మార్పుల కారణంగా వారు వేగంగా కోలుకుంటున్నారు.
చికిత్సా నిపుణులకు ఇతనొక సిఫార్సు చేస్తున్నారు: సేవా సమావేశాన్ని ప్రారంభించే ముందుగా, తమను దివ్య కాంతితో కప్పమని దైవానికి నిశబ్దంగా ప్రార్థన చేయాలి లేదా ఫిల్లిస్ క్రిస్టల్ పద్ధతి ప్రకారం తామొక బంగారు సిలెండరులో ఉన్నట్లుగా ఊహించుకోవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు, వివిధ రోగాలు మరియు ఇతర సమస్యలతో వారిని సంప్రదించే రోగుల ప్రతికూలమైన కంపనాలు లేదా శక్తుల ప్రభావం చికిత్సా నిపుణుల పై పడకుండా ఉంటుంది.
ఈ చికిత్సా నిపుణుడు తన యౌవనం నుండి ఆత్మజ్ఞానంతో కూడిన ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నారు. చిన్న వయసులోనే, కుడి చేతిలో మరియు కాలిలో కదలికను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న కారణంగా మరియు వ్యక్తిగత జీవితంలో అనేక నష్టాలను ఎదుర్కొన్న కారణంగా దైవానికి మరింత ధగ్గెరయ్యారు. ఒక వ్యక్తిగత ఇంటర్వ్యూ తో పాటు అనేక సార్లు స్వామీ యొక్క దర్శనం ముఖాముఖిగా ఇతనికి లభించింది. కొన్ని నిమిషాల పాటు కొనసాగిన పాదనమస్కారం సమయంలో, ఇతనికి, విశ్వంతో ఒకటిగా ఉన్నట్లు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. స్వామి యొక్క ఉనికి నిరంతరం ఇతని జీవితంలో ఉన్న కారణంగా ఇతను నిర్విరామంగా వైబ్రియానిక్స్ సేవను అందించగలుగుతున్నారు.
ఇతను 4000 పైగా రోగులకు వైబ్రో సేవనందిoచియున్నారు మరియు క్రిందివ్వబడిన అనేక రోగ సమస్యలకు విజయవంతంగా చికిత్సనిచ్చారు : గుండె మరియు రక్త నాళాలకు సంభందించిన వ్యాధులు, నొప్పి, వాపు మరియు కొవ్వు వంటి కాలేయ సమస్యలు; సంతానలేమి, గర్భాశయ ద్వారంలో, పొత్తికడుపులో, అండాశయంలో వాపు వంటి ఆడవారి మరియు మొగవారి జననమండలములకు సంభందించిన సమస్యలు ; తలనొప్పి మరియు మైగ్రేనులు, అధిక మరియు తక్కువ రక్తపోటు, తల నొప్పులు పిల్లలలో ప్రవర్తనా సంభందించిన సమస్యలు, విద్యార్థుల్లో ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం మరియు పాఠాలు నేర్చుకోవడంలో సమస్య; మూత్రపిండంలో వాపు మరియు రాళ్ళు; ఆహారం మరియు సిగరెట్ వ్యసనాలు; జ్ఞ్యాపకశక్తి నశించడం మరియు మెదడుకు సరైన రక్తప్రసరణ లేకపోవడం; ఎముకలకు సంభందించిన సమస్యలు, బోలు ఎముకల వ్యాధి, సియాటికా, కీళ్ళ వాతం, మోకాలి మరియు నడుము కీళ్ళ సమస్యలు; చర్మ రోగాలు- ఎనుగుగజ్జి, పుండ్లు, చర్మకీలములు, బొబ్బలు, మాంసగ్రంథులవాపు.
శస్త్ర చికిత్సానంతరం రోగులకు ఎంతో అవసరమైన మద్దతును ఇతను అందచేస్తున్నారు. గమనించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, రోగులు మరియు వైద్యులు ఆశలను వదులుకున్న అనేక సందర్భాలలో, ఈ చికిత్సా నిపుణుడు విజయవంతమైన చికిత్సను అందచేసారు. ఇతనికి అద్భుతమైన ఫలితాలు లభించడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి: మొట్టమొదటిగా ఇతని ఊహాజ్ఞ్యానం, రెండవది, హోమియోపతిలో ఇతనికి ఉన్న పరిజ్ఞ్యానం. ఇతను 108CC పెట్టెలో ఉన్న మిశ్రమాలను కూడా ఇదే నైపుణ్యంతో ఉపయోగిస్తున్నారు.
ఎంచుకున్న కొన్ని 108CC మిశ్రమాలను కలపడం ద్వారా సిద్ధం చేయబడిన కొన్ని వ్యాధులకు సంభందించిన ప్రత్యేక మిశ్రమాలు; వీటి ద్వారా ఈ చికిత్సా నిపుణుడు కొన్ని అసాధారణమైన ఫలితాలను పొందారు.
1. ఊపిరితిత్తుల కాన్సెర్: CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC3.2 Bleeding disorders + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC17.2 Cleansing + CC19.1 Chest tonic + CC20.1 SMJ tonic + CC21.1 Skin tonic…6TD
శ్వాసకోశములో కాన్సెరున్న ఒక రోగికి శస్త్రచికిత్స తర్వాత కాన్సెర్ తిరిగి శోకింది. పైనివ్వబడిన మిశ్రమాల ద్వారా నాలుగు నెలల్లో రోగికి కాన్సెర్ వ్యాధి పూర్తిగా నయమై పోయింది. అంతేకాకుండా రోగి పొగ త్రాగడం వ్యసనాన్ని మానేశాడు. అనేక సంవత్సరాల తర్వాత ఆ రోగి ఇప్పటికి ఆరోగ్యంగా జీవిస్తున్నాడు.
2. ప్రోస్త్రేట్ గ్రంధి కాన్సెర్: #1. CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC3.1 Heart tonic + CC3.2 Bleeding disorders + CC4.2 Liver & Gallbladder tonic + CC6.3 Diabetes + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.2 Kidney & Bladder infections + CC14.1 Male tonic + CC14.2 Prostate + CC14.3 Male infertility + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC15.6 Sleep disorders + CC17.2 Cleansing + CC18.3 Epilepsy + CC19.7 Throat chronic + CC20.4 Muscles & Supportive tissue + CC21.2 Skin infections + CC21.7 Fungus…6TD ఒక సంవత్సరం వరకు ( 60 ఏళ్ళు దాటిన మొగవారికి మూడేళ్ళ వరకు). ఆపై #2. CC14.1 Male tonic…TDS రెండేళ్ళు.
3. గుండె జబ్బులు: CC3.1 Heart tonic + CC3.2 Bleeding disorders + CC3.4 Heart Emergencies + CC3.6 Pulse irregular + CC6.3 Diabetes + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC18.3 Epilepsy + CC19.1 Chest tonic + CC20.4 Muscles & Supportive tissue + CC21.2 Skin infections…6TD అల్లోపతి మందులతో పాటు.
మెరుగుదల ఏర్పడిన తర్వాత, అల్లోపతి మందుల యొక్క మోతాదును క్రమంగా తగ్గించాలి. ఒక మోతాదు అల్లోపతి మందుకు బదులుగా ఒక మోతాదు SR543 Agaricus Mus 200C తీసుకోవాలి (అల్లోపతి మందు పూర్తిగా ఆపెంత వరకు). వైద్య పరీక్షలు గుండె స్వస్థతను నిర్ధారించిన తర్వాత, ఈ మిశ్రమాల యొక్క మోతాదును TDSకి తగ్గించాలి. గుండె యొక్క స్వస్థత రెండవ సారి నిర్ధారించిన తర్వాత రోగి CC3.1 Heart tonic…OD నివారణ కొరకు తీసుకోవాలి.
4. పిత్తాశయములో రాళ్ళు: CC4.2 Liver & Gallbladder tonic + CC4.7 Gallstones…6TD రెండు నెలల
తర్వాత 80 ఏళ్ళ వయసు పైనున్న రోగులకు కూడా సత్ఫలితాలు లభించాయి.
5. థైరాయిడ్ బుడిపెలు: #1. CC2.3 Tumours & Growths + CC3.2 Bleeding disorders + CC4.2 Liver & Gallbladder tonic + CC6.1 Hyperthyroid (or CC6.2 Hypothyroid) + CC6.3 Diabetes + CC9.2 Infections acute + CC13.1 Kidney & Bladder tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC19.1 Chest tonic + CC19.7 Throat chronic + CC20.4 Muscles & Supportive tissue + CC21.2 Skin infections + CC21.8 Herpes…6TD. #2. SR268 Anacardium 30C…TDS
బుడిపెలు తొలగి పోయాయని వైద్యుడు రూఢిచేసిన తర్వాత, ఈ చికిత్స మరొక నెల రోజులు కొనసాగించాలి…TDS. రోగి అల్లోపతి మందులను తీసుకుంటున్న సందర్భంలో, ఒక మోతాదు అల్లోపతి మందుకు బదులు ఒక మోతాదు SR543 Agaricus Mus 200C తీసుకుంటూ క్రమముగా అల్లోపతి మందును పూర్తిగా ఆపివేయాలి.
పది సంవత్సరాలకు పైన థైరాయిడ్ బుడిపెల కోసం హార్మోన్ చికిత్స తీసుకున్న తర్వాత బుడిపెలు పెరుగుతున్న రోగులకు ఇతనిచ్చిన చికిత్స ద్వారా సమస్య తొలగింది. పైనివ్వబడిన మందులను తీసుకున్న తర్వాత, బుడిపెలు పూర్తిగా తొలగిపోవడమే కాకుండా, జీవితాంతం హార్మోన్లను తీసుకోవాలని వైద్యుల చే చెప్పబడిన రోగులు కూడా అల్లోపతి మందులను తీసుకోవడం పూర్తిగా నిలిపేశారు.
6. ఫ్లూ జ్వరం, రొంప, వాపు: CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases… తరచుగా (ప్రతి 10 లేదా 15 నిమిషాలు)
ఉపశమనం కలిగిన తర్వాత, క్రమముగా 6TD కి తగ్గించాలి, ఆపై TDS కి, చివరిగా OD కి తగ్గించాలి. ఈ ప్రక్రియ మొత్తం పదిహేను రోజుల వరకు కొనసాగాలి. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు, జ్వరం తగ్గే వరకు ప్రతి ఐదు లేదా పది నిమిషాలకు ఒకసారి ఒక డోస్ ఇవ్వాలి. ఇతని చికిత్సా అభ్యాసంలో ఒక బాలుడికి మాత్రము జ్వరం తగ్గడానికి మూడు గెంటలు పట్టింది; ఇతర కేసులలో అంతకన్నా తక్కువ సమయం పట్టింది. పైనివ్వబడిన కలయిక ద్వారా జంతువులకు కూడా విజయవంతంగా చికిత్సనివ్వడం జరిగింది.
7. నోటిలో పొక్కులు: CC11.5 Mouth infections + CC15.2 Psychiatric disorders + CC21.1 Skin tonic + CC21.11 Wound & Abrasions…6TD
ఒక రోగికి ప్రతి వసంత మరియు శరదృతువులో నోటి లోపల మరియు బయట పొక్కులు వచ్చేవి. పైనివ్వబడిన మందును తీసుకోవడంతో పొక్కులు ఒక వారం రోజులలో తొలగిపోయాయి. బాక్టీరియా లేదా వైరల్ అంటువ్యాధి నుండి నివారణ కొరకు ఈ మందులను మరో రెండు వారాల వరకు TDS మోతాదులో తీసుకోవడం జరిగింది.
8. అధైర్యస్థితి/నరాల బలహీనత, కుంగిపోవడం, వ్యాకులత: CC3.1 Heart tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions + CC15.5 ADD & Autism + CC17.2 Cleansing + CC18.2 Alzheimer's disease + CC19.2 Respiratory allergies + CC20.1 SMJ tonic...6TD together with prescribed dosage of allopathic medicine.
రోగి యొక్క పరిస్థితి నిలకడగా ఉన్నప్పుడు, ఒక మోతాదు అల్లోపతి మందుకు బదులు ఒక మోతాదు SR543 Agaricus Mus 200C ఇవ్వడం ప్రారంభించాలి. ఈ ప్రక్రియను క్రమముగా పదిహేను రోజుల వరకు కొనసాగించాలి. చికిత్సా నిపుణుడు సలహా పై, ఈ విధానం అనుసరించడం ద్వారా 50కి పైన రోగులు (17 నుండి 65 ఏళ్ళు వయసు గల రోగులు), ఒక వారం నుండి ఆరు నెలల సమయంలో పూర్తిగా కోలుకున్నారు.
ఈ వ్యక్తులు ప్రస్తుతం అల్లోపతి మందులను తీసుకోవడం లేదు. ఈ చికిత్సా నిపుణుడి దృష్టిలో వైబ్రియానిక్స్ ద్వారా సేవనందించడానికి మూడు ప్రధాన లక్షణాలు అవసరం: సేవ చేయాలని ఒక బలమైన కోరిక, ఔదార్యము మరియు జ్ఞానం. ఈ అంశాల్లో ఏయోక్క అంశం లేకపోయినా, రోగులు నయంకావడానికి మూలకారణమైన స్వచ్చమైన ప్రేమ మీ నుండి వెలువడడానికి అవకాశముండదు.