చికిత్సా నిపుణుల వివరాలు 11968...India
నేను AMIE పూర్తిచేసుకుని చిన్మయ విద్యాలయంలో లైబ్రేరియన్ గా తొమ్మిది సంవత్సరాలు పని చేశాను. గత సంవత్సరం హైదరాబాద్ నుండి వెళ్ళిన తర్వాత స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న ఒక సాయి కుటుంబంతో సన్నిహితం అవడానికి మరియు వైద్య శిబిరాలలో పాల్గొనడానికి అవకాశం లభించింది. ఇది నా జీవితంలో గొప్ప మార్పు ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా హైదరాబాదులోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలో పనిచేస్తున్న నేను, గురుగావ్ రావడమనేది నా జీవితంలో మిగిలి పోయిన సేవను పూర్తి చేసుకొనే చక్కని అవకాశం.
ఈశిబిరాలలో, నేను సీనియర్ ప్రాక్టీషనర్ 11483...ఇండియాచూశాను. అలోపతి వైద్యం తో పాటు వైబ్రియానిక్స్ చికిత్స చేస్తూ రోగులకు మార్గదర్శకత్వం వహిస్తూ అనేక విధాలుగా వారికి సహాయపడుతూ ఉన్నారు. ప్రాథమికంగా నేను ఎంతో ఆశ్చర్యపడడమే కాదు ఒక విధంగా మైమరచిపోయాను. చికిత్స చేయబడిన ఈ రోగులంతా చక్కగా రోగ నివారణ పొందడం చూసి, ఆహా ఏమిటి దేవుని ఆశీర్వాదం అని నేను ఆశ్చర్యపోయే దానిని. నాలో కూడా అందరికీ సహాయపడాలని మరియు వారు పొందే ఆనందం యొక్క మూలం కావాలని ఆత్రుత కలిగింది. ఢిల్లీ NCR కోఆర్డినేటర్ కి పరిచయం చేసి నన్ను వైబ్రియానిక్స్ కోర్సు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేసిన ఈ చికిత్సా నిపుణురాలికి కృతజ్ఞురాలిని. చికిత్సా నిపుణుల మార్గదర్శకత్వంలోఆన్లైన్ కోర్సు పూర్తి చేసుకుని 2014 ఏప్రిల్ నుండి వైబ్రియానిక్స్ సేవ చేస్తున్నాను.
ఈ సందర్భంగా రెండు చికిత్సా అనుభవాలను మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
#1. మొదటి అనుభవం వ్యసనానికి సంబంధించినది. నేను చికిత్స చేసిన రోగుల్లో 36 ఏళ్ళ వ్యక్తి పొగాకు మరియు పాన్ లేదా కిళ్లీ అలవాటును పోగొట్టుకోవాలని భావించాడు. ఇది అతను యుక్తవయసు నుండి అలవాటయింది. ఇది చాలా ఎక్కువ కాలం నుంచి ఉన్న దురలవాటు కనుక, అతనికి నేను కౌన్సిలింగ్ చేశాను మరియు దీని యొక్క దుష్ఫలితాలు గురించి అతనికి వివరించాను. ఆ తర్వాత అతనికి క్రింది నివారణ ఇచ్చాను:
CC15.1 Mental and Emotional tonic + CC15.3 Addictions...TDS
పదిహేను రోజులపాటు నివారణ తీసుకొనవలసిందిగా అతనికి చెప్పినప్పటికీ, చికిత్స తీసుకున్నరెండు రోజులకే ఆ వ్యక్తి పొగాకు మరియు పాన్ పై తన కోరికను కోల్పోయి రెండింటినీ పూర్తిగా తీసుకోవడం మానేసాడు. నివారణ మరొక వారం పాటు కొనసాగించమని కోరాను. అనంతరం మోతాదును ఒక వారం పాటు OD కి తగ్గించబడింది. అతను 100% పూర్తిగా దురలవాటు నుండి దూరం అయ్యాడు.
#2. రెండవ అనుభవం నా వ్యక్తిగతమైనది. ఒకసారి నాకు ఋతు రక్తస్రావం ఇరవై రెండు రోజులు ఆలస్యంగా రావడమే కాకుండా నిరంతర రక్తస్రావం అవుతూ ఉన్నప్పుడు, నాకు నేను ఈ విధంగా చికిత్స చేసుకున్నాను:
CC8.1 Female tonic + CC8.6 Menopause + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic…TDS
నివారణ తీసుకున్న రెండు రోజుల తర్వాత నాకు కొంచెం మెరుగుదల కనిపించినది. మూడవ రోజు అదే మాత్రలను నీటిలో కరిగించి ఔషధాన్ని నీటి రూపంలో తీసుకున్నప్పుడు ఎంతో అద్భుతమైన ప్రభావాన్ని చూపించింది. రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది. నేను మరొక రోజు నీటిలో నివారణ తీసుకోవడం కొనసాగించాను. ఆపై ముందు జాగ్రత్తగా మరో రెండు రోజులు TDS గా తీసుకున్నాను.