Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చికిత్సా నిపుణుల వివరాలు 11483...India


అభ్యాసకురాలి11483…ఇండియా అనుభవాలు: గురుగావ్, హర్యానా,ఇండియా

ప్రాక్టీషనర్ 11483..ఇండియా  నేను గురుగావ్ లో నివసిస్తున్నాను నేను సైన్స్ లో పట్టభద్రురాలిని. 2011 జూన్ నుండి,    నేను వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ గా  ఉన్నాను. నేను 2012 డిసెంబర్లో SVP అయ్యాను. ఇప్పటివరకు నేను 2500 మంది రోగులకు చికిత్స అందించాను. నేను విజయవంతంగా చికిత్స చేసిన వాటిలో డిప్లో పియా లేదా ద్వంద్వ దృష్టి, ఎముకలు విరుగుట, గ్యాంగ్రీన్. లేదా రాచపుండు, నిరపాయ కణుతులు, ఆస్తమా, లుకోడెర్మా లేదా గజ్జి, మడమలో పుండ్లు, వంధ్యత్వము, లుకోరియా లేదా బ్లడ్ క్యాన్సర్, గాల్స్టోన్స్ లేదా పిత్తాశయంలో రాళ్ళు, సైనస్ ఇన్ఫెక్షన్లు, పార్శ్వపు నొప్పి, తామర వంటి చర్మ వ్యాధులు ఇంకా క్యాన్సర్ రోగులకు యాంటీ కీమోథెరపీ వంటి చికిత్సలు చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు.

నేను ఈ సేవ చేయడం ప్రారంభించిన నాటినుండి ఎంతో కరుణ, వినయం, ఓపిక పెరిగి నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. నేను ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతాను అని తెలుసుకున్నాను. నేను చికిత్స చేస్తున్న రోగులలో ఒక రకమైన గౌరవం ప్రేమ రోగుల కళ్ళల్లో వ్యక్తమవుతూ ఉండగా చూశాను అదే నన్నునడిపిస్తుంది. నేను ఈ సేవ చేసేటప్పుడు ఒక రకమైన దివ్య భావము నాలో నెలకొంటోంది. ఇదే నన్ను స్వామికి దగ్గర చేరుస్తుంది.

గురుగావ్ లో ప్రతి పక్షం రోజులకు మాకు వైద్యశిబిరాలు జరుగుతూ ఉంటాయి ఇందులో ప్రాక్టీషనర్ లు మరియు అల్లోపతి     వైద్యులు కూడా వస్తూ ఉంటారు. అక్కడ నుండి దీర్ఘకాలిక రోగాలు గల రోగులను తదుపరి తనిఖీ కోసం ఆసుపత్రులకు తీసుకు వెళ్తారు. అక్కడ చేయించిన పరీక్షలకు అనుగుణంగా అలోపతి  మందులతో పాటు వైబ్రో మిశ్రమాలను కూడా ఇస్తారు. మా వైద్య శిబిరాల్లో లేత వయసులో ఉన్న ఇద్దరు రోగులకు సంబంధించిన  రెండు కేసులను గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

#1 5 సంవత్సరాల బాలుడు రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతనికి  తీవ్రమైన గాయాలు అయ్యాయి కుట్లు కూడా వేశారు. పది రోజుల తర్వాత డాక్టరు అతను ఎడమ చెయ్యి పనిచేయడం లేదని తెలుసుకున్నారు. కనుక అబ్బాయిని MRI స్కానింగ్ చేయించుకోమని సలహా ఇచ్చారు. ఆ అబ్బాయికి క్రింది నివారణ ఇచ్చాను:
CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC18.5 Neuralgia...TDS

మరుసటి రోజు డాక్టర్ చెకప్ కోసము వచ్చి, బాలుడి చెయ్యి అంతకు ముందు రోజు కంటే 50 శాతం మెరుగ్గా ఉండటం గమనించి  MRI స్కానింగ్ అవసరం లేదని చెప్పారు. రోగిని డిశ్చార్జ్ చేశారు. రెండు రోజుల తర్వాత బాలుడు చేతిని నయం చేయడానికి  చేయాల్సిన ఫిజియోథెరపీ వ్యాయామాల గురించి వివరించడానికి నేను బాలుని తండ్రిని సంప్రదించినప్పుడు అబ్బాయికి 100% నయం అయింది కాబట్టి ఫిజియోథెరపీ అవసరం లేదని తెలిపారు.

#2. మా  వైద్య శిబిరానికి వచ్చిన 15 ఏళ్ల బాలుడు గత రెండు సంవత్సరాలుగా సోరియాసిస్ తో బాధపడుతూ ఉన్నాడు.      హోమియోపతి  అలోపతి వంటి వివిధ రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ పరిస్థితి మెరుగు కాలేదు. నేను క్రింది నివారణ నోటిలోనికి తీసుకోవడానికి మరియు నీటితో బాహ్యంగా అనువర్తింప చేయవలసిందిగా సూచించాను:
CC21.2 Skin infection + CC21.10 Psoriasis...TDS

పదిహేను రోజుల తర్వాత, వైద్య శిబిరంలో నేను అతన్ని మళ్ళీ పరీక్షించాను. సోరియాసిస్ విషయంలో 60%   మెరురుగుదల కనిపించడంతో అబ్బాయి  చాలా సంతోషంగా ఉన్నాడు. పై నివారణ మరో రెండు వారాల పాటు తిరిగి  ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి 90% మెరుగుపడింది. కనుక బాలుడు వైబ్రియానిక్స్ పూర్తిగా నయం అయ్యేవరకు  కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.  

వ్యక్తిగత వృత్తాంతము 

నేను నా వ్యక్తిగత అనుభవాన్ని జోడించాలని అనుకుంటున్నాను. నేను  కొద్ది మంది క్షయ రోగులకు చికిత్స చేస్తూ ఉండే   దానిని. నేను వారిని చెకప్ కోసం తీసుకు వెళ్ళిన ప్రతీసారి, వైద్యులు వారిలో ఎవరూ వికారం, వాంతులు మరియు మంట గురించి ఫిర్యాదు చేయడంలేదని ఆశ్చర్యపోయేవారు. వీరికి LFT (కాలేయ పనితీరు పరీక్ష) నివేదికలు ఎల్లప్పుడూ నార్మల్ గానే  ఉండేవి. ఇప్పుడు చెప్పబోయే పేషెంట్ 45 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ. ఆమె ఊపిరితిత్తుల్లో చాలా స్వల్ప భాగం మినహా మిగతా భాగమంతా వ్యాధి సోకి పాడైపోయింది. ఆమె అలోపతి చికిత్స తీసుకున్న రెండు మూడు రోజుల తర్వాత అనుకోకుండా తీవ్రమైన వికారం, వాంతులు మరియు మంట ఏర్పడ్డాయి. అప్పుడు వైబ్రయానిక్స్ చికిత్స ప్రారంభించేసరికి ఆమె దుష్ప్రభావాల నుండి ఉపశమనం లభించింది. ఒక నెల తర్వాత నేను ఆమెను చెకప్ కోసం డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళాను. ఆమెకు రెండవసారి ఎక్సరే తీయగా నివేదికల ఫలితం నమ్మశక్యం కాకుండా ఉంది.  ఆమెకు ఊపిరితిత్తులలో చాలా స్వల్ప భాగం తప్ప మిగతాదంతా నార్మల్ గా ఉంది. వైద్యు డు ఆమెను ఈ అలోపతి మందులతో నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. ఆమె నన్ను చూపిస్తూ “ఈ మేడం కొన్ని మాత్రలు ఇచ్చారు అప్పటినుండి నాకే సమస్యలు లేవు అని చెప్పింది”.  

   గురు గావ్ గ్రూపు పరిచయం

నేను ఇప్పుడు మా గురుగావ్  వైబ్రియానిక్స్  సమూహం లో పనిచేస్తున్న ఇతర అభ్యాసకులను పరిచయం చేయాలనుకుంటున్నాను. మరియు వారి అనుభవాలు పంచుకోవడానికి వారిని ఆహ్వానిస్తున్నాను.