అభ్యాసకురాలి వివరాలు 11574...India
అభ్యాసకురాలు11574...ఇండియా కంప్యుటర్ శాస్త్రంలో పీ హెచ్ డీ చేసిన ఈమె ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిధ్యాలయoలో భోదిస్తోంది. 2015 ఏప్రిల్ లో అభ్యాసకుల శిక్షణ పొందింది.
ఈమెకున్న చర్మ సమస్యకు చికిత్సనిచ్చి నయంచేసిన సహోద్యోగి అయిన అభ్యాసకురాలు02859...ఇండియా ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుంది. సుమారు రెండేళ్ళ క్రితం ఈమె, మొహం మీద తీవ్ర మొటిమలతో భాధపడేది. ముఖంపై చర్మమంతా వాచిపోయి ఎర్రగా కనపడేది. ఈ సమస్య క్రమంగా ఆమె మెడ మరియు వీపు మీద కూడా వ్యాపించింది. ఆ సమయంలో, ఈమె ఏ విధమైన లేపనం లేదా మందు ఉపయోగించకుండా వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవడం ప్రారంభించింది. రెండు డోసులు తీసుకోవడంతో ఈమె ముఖం మీదున్న ఎరుపు తగ్గి ఉపశమనం కలిగింది. మరో రెండు నెలలలో ఈమెకు ఆశ్చర్యం కలిగేలా మొటిమలు తగ్గి, చర్మం పూర్తిగా నయమైంది. ఈ చికిత్స వల్ల దుష్ప్రభావాలు ఉండవని తెలిసి ఈ శిక్షణ పొందాలన ఆసక్తి, ఈమెలో మరింత పెరిగింది. కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలలో కూడా నివారణ కలిగిస్తున్న ఈ చికిత్సా విధానాన్ని అభ్యసించే అవకాశం పొందడం తన అదృష్టమని భావిస్తోంది. ఇప్పటివరకు ఈమె చికిత్స ఇచ్చిన కేసులలో కొన్ని: మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మొటిమలు మరియు జుట్టు రాలడం వంటి సమస్యలు.
అభ్యాసం ప్రారంభించిన కొత్తలో ఈమె, చికిత్స ఫలితాల గురించి చాలా ఆత్రుత పడేది. ఆమె పేషంట్లు వచ్చి వాళ్లకు నివారణ కలిగిందన్న శుభవార్త ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉండేది. కాలక్రమేణా ఈ విషయంలో ఈమెకున్న అవగాహన పెరిగి ప్రతి సారి స్వామిని సరియైన మందును ఎంచుకోవడంలో తనకి సహాయపడమని ప్రార్థించి, ఆపై ఫలితాల విషయంలో నిర్లిప్తంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. వైబ్రియానిక్స్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని మరింత ఎక్కువగా సేవ చేయాలన్నది ఈమె కోరిక.
ఇక్కడ ఈమె CC1.2 Plant tonic యొక్క అద్భుతమైన స్వస్థతా మహిమను మరియు వైబ్రియానిక్స్ సేవ చేయడం వలన తాను పొందిన సంతోషాన్ని మనతో పంచుకొంటున్నారు. ఈమె వ్రాస్తున్నారు: 2015 ఏప్రిల్ 5న 108 కంబో వైబ్రో కిట్ నాకు ఇవ్వబడింది. ఈ అమూల్యమైన కిట్ ను ఇంటికి తీసుకు వెళుతుండగా, మా మెట్లమీద కుండీలో వాడిపోయిన ఒక షాల్మియా మొక్క మీద నా దృష్టి పడింది (ఎడమ పక్క ఉన్న ఫోటో చూడండి). గత రెండు రోజులగా ఆ మొక్కకు నీళ్ళు పోయలేదు. ఈ మొక్కే నా మొదటి పేషంట్ అని అనిపించి, వెంటనే ఒక లీటర్ నీళ్ళలో ఒక చుక్క CC1.2 Plant tonic కలిపి మొక్కకు పోసాను. మర్నాడు ఉదయానికల్లా మొక్క చైతన్యవంతంగా మరియు బలంగా కనిపించింది. (కుడి పక్క ఫోటో చూడండి).
వైబ్రో మందు ఒక టమాటో మొక్క మీద కూడా సానుకూల ప్రభావం చూపింది. ఈ మొక్క 4 ఇంచీలు పెరిగాక CC1.2 Plant tonic…OW ఇవ్వడం ప్రారంభించాను. 3 నుండి 4 అడుగులు పెరిగాక కాయలు కాసాయి. మందుయొక్క మోతాదును పెంచి, రోజు విడిచి రోజు మొక్కకు వైబ్రో టానిక్ ఇచ్చాను. కొద్ది రోజులలో 9 టమాటాలు, ఆపై మరో ఐదు టమాటాలు పండాయి. ఇవి ఎంతో రుచికరంగా ఉన్నాయి.
అంతే కాకుండా జీవం కోల్పోతున్న ఒక వేప మొక్కను కాపాడేందుకు CC1.2 Plant tonic ను ఉపయోగించాను. దీని ఆకులు గోధుమ రంగులో మారి రాలి పోతున్నాయి. ఈ మొక్కకు CC1.2 Plant tonic ఇవ్వడంతో పాటు మొక్కను ప్రేమతో హత్తుకునేదాన్ని. రెండు వారాల వరకు ఈ మొక్క పరిస్థితిలో మెరుగు కనపడలేదు. పదిహేనో రోజున ఒక కొమ్మనుండి ఆకుపచ్చని చిగురులు రావడం చూసి చాలా సంబరపడ్డాము. (క్రింద ఉన్న ఫోటోను చూడండి). ఆ మొక్క చిగురించడం చూడగానే కొత్తగా పుట్టిన శిశువును చూసినంత ఆనందం కలిగింది.
నర్సరీ నుండి తెచ్చిన ఒక సున్నితమైన బేర్ మొక్కను పునరుద్ధరించాలని CC1.2 Plant tonic ఉపయోగించాను. తగినంత సూర్యకాంతి మరియు నీరు పోసినప్పటికి ఈ మొక్క ఎండిపోయింది. నేను మొక్కకు ఒక వారం వరకు ప్రతి రోజు CC1.2 Plant tonicను ఇవ్వడం ప్రారంభించాను. ఆపై వారానికి మూడు సార్లు ఇస్తూ వచ్చినప్పటికీ మెరుగు ఏర్పడలేదు. అయనా నేను మొక్కకు వైబ్రో టానిక్ను ఇవ్వడం ఆపలేదు. ఇరవై రోజుల తర్వాత ఎండిపోయిన కొమ్మ అడుగు భాగం నుండి చిగురు రావడం మొదలైంది (కుడి పక్క ఫోటోను చూడండి). మేము ఈ మొక్కకు "ఆశ" అని పేరు పెట్టాము. వైబ్రోతో ఈ మొక్క క్రమంగా కోలుకుంటోంది.