అభ్యాసకుని సంక్షిప్త పరిచయం
నా పేరు నాందేవ్ రౌత్. నా స్వగ్రామం మహారాష్ట్రలోని నాగపూర్ నుండి దాదాపు 50 కి. మీ దూరంలోనున్న ఒక చిన్నగ్రామం ధవళపూర్. నేను 1954 లో పశువులశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసాను, కొంతకాలం ప్రభుత్వ పనిని నిర్వహించి, విడిచిపెట్టి, నేను గ్రామంలోనే వుండి, మా సొంతవ్యవసాయాన్ని అభివృద్ధిచేయాలనే నాతండ్రి ప్రగాఢ కోరికపై, నేను రైతు అయ్యాను. మహారాష్ట్రలోని విదర్భప్రాంతంలో రైతుల దుస్థితి గూర్చి మీకు తెలుసు. ఇది జాలిగొలిపే విధంగా ఉంటుంది. తమ రుణాలను చెల్లించలేని కారణంగా అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు. విద్యావంతుడగుటచే, నేను శాస్త్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపాను కాని పురుగుమందులు, శిలీంధ్రాలు, ఎరువులు ఉపయోగించుట చాలా ఖరీదైన పద్దతి. ఇంతవరకు పంట పూర్తిగా ప్రకృతిపై ఆధారపడింది.
2009 లో, నాగపూర్ లోని సత్యసాయి మెడికేర్ ప్రాజెక్ట్ వారు, మా గ్రామంలో వారి ఉచిత మెడికేర్ కార్యక్రమాన్ని ప్రారంభించిరి. అల్లోపతి, విబ్రోమందులు రెండూ ఉచితంగా ఇవ్వబడ్డాయి. మాకు అలోపతి మందుల ప్రయోజనాలు తెలుసు కానీ ఈ కొత్త విబ్రియోనిక్స్, ముఖ్యంగా వుబ్బసం, కీళ్ళనొప్పులు, చర్మవ్యాధులతో బాధపడుతున్న రోగులకు అద్భుతమైన చికిత్స చేస్తున్నది.
ఆంబులెన్స్తో వచ్చిన విబ్రో వైద్యులు ఈ విబ్రోనివారణలు మొక్కలపై, జంతువులపై కూడా ఉపయోగించవచ్చని నాకు చెప్పారు. స్థానిక కోఆర్డినేటర్ ప్రోత్సాహం, మద్దతుతో నేను నాగపూర్ లో, డాక్టర్ నాంద్, శ్రీమతికమలేష్ అగర్వాల్ వద్ద విబ్రియోనిక్స్ శిక్షణ కోర్సు చేసేను. నా నెలవారీ విబ్రోనివేదికలలో, మొక్కలకు, పంటపొలాలకు విబ్రోనిక్స్ మందులు వాడిన కేసులు వున్నవి. నేను ప్రతినెల 4-5 జంతువులకు చికిత్స చేస్తాను. [ఎడిటర్ యొక్క గమనిక: మేము తరువాత అదనపు నివేదికలను ప్రచురించనున్నాము] భగవాన్ శ్రీ సత్య సాయిబాబా దయవల్ల, ధవల్పూర్ లో సేంద్రీయ వ్యవసాయంలో విజయం సాధించి, విబ్రోనిక్స్ ఉపయోగంతో, అధిక దిగుబడి లభించినందున ప్రజల అభిమానాన్ని చూరగొనే అవకాశం నాకు లభించినది. జై సాయి రామ్.