పంటలకు చికిత్స: కందిచేను, బత్తాయి, ప్రత్తితోటలు 11279...India
అభ్యాసకుడు ఇలా వ్రాస్తున్నారు:జూన్ 2012 లో, నా మొదటి ప్రయోగం మా భజన మండలిలో, హర్మోనియం మాస్టారునాటిన 100 చదరపు అడుగుల కందిచేనుపైన (లక్ష్మీ నివారణగింజ) జరిగినది. ఈ చేనులో, పుష్పించే కందిమొక్కలను పురుగులు తింటున్నట్లు నేను గమనించేను. నేను ఇటీవల విబ్రియోనిక్స్లో కోర్సు చేశానని, పురుగుల నివారణలు ఉన్నాయని చెప్పాను. స్థానిక ప్రజలు ఇప్పటికే మనుషులపట్ల విజయవంతమైన వైబ్రియోనిక్స్ వైద్యం శక్తిని చూస్తున్నారు కానీ మొక్కలు కోసం అన్నది కొత్తవిషయం. హర్మోనియం మాస్టారు తన కందిచేనుపై విబ్రోని ప్రయత్నించటానికి నన్ను అనుమతించారు. దీని ప్రకారం నేను సిద్ధపడ్డాను:
CC1.2 Plant tonic + CC21.7 Fungus, లీటర్ నీటిలో ఈ మందు 4చుక్కలు కలపాలి.
పైవిధంగా కలిపిన నీటిని, ఒక ప్లాస్టిక్ బాల్చీలో 15 లీటర్ల నీటితో కలిపి, 15 ఆగష్టున,నేను స్వయంగా ‘సాయి రామ్, సాయి రామ్’ అని జపిస్తూ, ప్లాస్టిక్ చేతి పంపుతో విబ్రోనీటిని పిచికారీ చేసితిని. ఆ రాత్రితోనే పురుగులు పోయినవి. తరువాత, మేము చీమలు కూడా ఈ మొక్కల పైకి పోవటంలేదని కనుగొన్నాము. అత్యధికమైన పంట పండినది.
నా 2వ ప్రయోగం నా స్వంత 2ఎకరాల, 550 బత్తాయి చెట్లుగల తోటమీద చేసితిని. ఇది 4 వ సం.రం (2011) నా తోట మీది ఫలసాయం. నెలకొకసారి చొప్పున(జూన్ 11, జూలై 11, ఆగస్టు 11) మొక్కలు పుష్పించిన కాలంలో మూడు సార్లు మొక్కలు పైన అదే మిశ్రమాన్ని బాగా పిచికారీ చేసితిని. బాగా ఖరీదగుటవల్ల, నేను యితర పురుగుమందులను ఉపయోగించలేదు. ఆ ఏడు, నాకు రూ. 3.5 లక్షలు బత్తాయిలపై వచ్చింది. తదుపరి 2012 లో కూడా నేను నెల వ్యవధిలో, పుష్పించే సీజన్లో 3సార్లు పైన చెప్పిన అదేమిశ్రమాన్ని పిచికారీ చేసితిని. బత్తాయిలపై రూ. 3 లక్షలు వచ్చింది. గత సంవత్సరం (2013) లో నేను బత్తాయిలను రూ. 3.75 లక్షలకు అమ్మితిని.
నేను చెప్పబోయే విషయం యేమిటంటే, మందు జల్లుతున్నప్పుడు (పిచికారీచేస్తున్నప్పుడు) నేను మాట్లాడకుండా,‘సాయిరాం, సాయిరాం”అని నిశ్శబ్దంగా ప్రార్థించాను. నేను విబ్రో ప్రయోగం విజయవంతమగుటకు ఇదే చాలా ముఖ్యంగా భావిస్తున్నాను.
పైన చెప్పిన కాంబో పరిహారం ఉపయోగించిన 3వ కేసుతో ముగిస్తాను. నేను 2012 లో 1ఎకరంలో,26 క్వింటాల్ (1 క్వింటాల్=100 కేజీ) బ్రహ్మపత్తి మొక్కలను పెంచేను. జూన్ 1-2 న నేను పత్తిగింజలను నాటి, పైని చెప్పిన కాంబో పరిహారం వారానికొకసారి చొప్పున జల్లుచు, జూలైలో 5 సార్లు పిచికారీ చేసేను. కేవలం విబ్రో మందు తప్ప, ఏ యితర పురుగుమందులు ఉపయోగించలేదు. నా పరిసరాల పొలాలలో ఒక ఎకరానికి 5-6 క్వింటాల్ మాత్రమే ఉత్పత్తి అయ్యింది. అందువల్ల నా పొరుగువ్యక్తి తన పొలాలలో విబ్రోని పిచికారీ చేయమని అడిగాడు. నేను వెంటనే అంగీకరించాను మరియు అతని పంట కూడా బాగా దిగుబడి పెరిగింది.