ప్రాక్టీషనర్ల వివరాలు 18001...भारत
ప్రాక్టీ షనర్ 18001…ఇండియా BA డిగ్రీ కలిగిన ఈ ప్రాక్టీషనర్ హోమియోపతిని కూడా అభ్యసించారు. సాయి కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తూ తనకు ఏడేళ్ల వయసులో 1976 లో తన తండ్రి మొదటి సారి పుట్టపర్తి దర్శించారు.
10 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో కలిసి ప్రశాంతి నిలయానికి వెళ్ళినప్పుడు తొలిసారిగా వీరు స్వామి దర్శనం పొందారు.
2000 సంవత్సరం నుండి పుట్టపర్తి లో ద్వైవార్షిక సేవాదళ్ డ్యూటీకి మార్చిలో ఎనిమిది రోజులు, మరియు డిసెంబర్ లో పది రోజులు స్వచ్ఛందంగా హాజరు ఔతున్నారు. 11 సంవత్సరాల కాలం పాటు పుట్టపర్తి మరియు వైట్ ఫీల్డ్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం టెలీ మెడిసిన్ టెక్నీషియన్ గా వారానికి రెండుసార్లు సేవ చేశారు. తన సమితిలో ఆధ్యాత్మిక సమన్వయకర్తగా మరియు బాల వికాస్ గురువుగా కూడా పనిచేశారు. ఆమె మదర్ థెరీసా లెప్రసీ సెంటర్లో 2012 వరకు, తరగతులు నిలిపే వరకు 11 సంవత్సరాలు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చారు. ఆమెకు సేవ మరియు వాలంటీరు గా చేయడం పట్ల మక్కువ కారణంగా అవకాశం దొరికినప్పుడల్లా వృద్ధాశ్రమాలను సందర్శించడం, వైద్య శిబిరాలకు హాజరవడం, తన స్వస్థలంలో రథయాత్ర సమయంలో నారాయణ సేవ చేయడం, గురునానక్ జయంతి మరియు గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్థానిక గురుద్వారాలో కూడా సేవ చేస్తూ ఉండేవారు. మృదువుగా ఉండే బొమ్మలు తయారుచేయడం, అల్యూమినియం ఫాయిల్ పెయింటింగు, తోటపని, బేకింగ్ మరియు వంట చేయడం ఆమె హాబీలు.
2002లో వైబ్రియానిక్స్ కోర్సు తన తండ్రి నుండి తెలుసుకున్నారు, వివరాలు తెలుసుకునేందుకు ఆశ్రమంలో ఉన్న డాక్టర్ అగర్వాల్ గారిని కూడా కలిశారు కానీ ఆ సమయంలో ఆమెకు వైబ్రియానిక్స్ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మహమ్మారి సమయంలో ఒక వార్తాలేఖ చదవడం ద్వారా ప్రేరణ పొంది వైబ్రియానిక్స్ ద్వారా తను మరింత ఎక్కువమంది పేద ప్రజలకు ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సేవ చేయవచ్చనే ఆలోచన ఆమెలో కలిగించింది. ఆమె ఆన్లైన్ కోర్సు కోసం దరఖాస్తు చేసారు. డిసెంబర్ 2021లో AP అయ్యారు.
వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడంలో ఆమె అద్భుతమైన విజయాన్ని సాధించారు. 2022 మేలో ఆటిజం తో బాధ పడుతున్న 8 ఏళ్ల అబ్బాయికి చికిత్స చేశారు. అతనికి మాట లేదు, హైపర్ ఆక్టివ్, మరియు నిద్రలేమితో బాధపడుతూ ఉన్న కారణంగా తనకి ఒక సంవత్సరం వయసు నుండి అర్ధరాత్రి తన తల్లిని ఇబ్బంది పెట్టేవాడు. తల్లి తన శిశువును ఊరకుండ బెట్టటానికి మొబైల్ ఫోను ఇవ్వడం వల్లనే ఈ సమస్యలన్నీ పుట్టుకొచ్చాయని భావించారు. ఆమె అతనికి : #1. CC12.2 Child tonic + CC15.5 ADD & Autism + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities + CC18.2 Alzheimer’s disease and #2. CC15.6 Sleep disorders. ఇచ్చారు. నెల తర్వాత అతను ఇప్పుడు మొదటిసారి మాట్లాడుతున్నాడని ప్రవర్తన మెరుగుపడిందని రాత్రంతా నిద్రపోతున్నాడని తల్లి నివేదించారు.
మరొక సందర్భంలో గత 15 సంవత్సరాలుగా ఏ విధమైన మందుల నుండి ఉపశమనం లేకుండా మలములో అధిక శ్లేష్మంతో బాధపడుతున్న బంధువు ఆమెను సంప్రదించారు. అతనికి CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.5 Ulcers + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders. ఇచ్చారు. నాలుగు వారాల్లోనే సమస్య పూర్తిగా సర్దుమణిగింది.
మరొక సందర్భంలో చేతులు మరియు మెడపై చిన్న తెల్లటి కురుపులు ఉన్న 12 ఏళ్ళ బాలికకు చికిత్స చేశారు. మూడు నెలల పాటు అల్లోపతి హోమియోపతి చికిత్సలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రాక్టీషనర్ ఆమెకు CC10.1 Emergencies + CC21.2 Skin infections + CC21.8 Herpes + CC21.11 Wounds & Abrasions ఇచ్చారు.
15 రోజుల తర్వాత కురుపుల లోపల చీము ఏర్పడడం ప్రారంభమై అవి చాలా నొప్పిగా మారాయి. ప్రాక్టీషనర్ మౌఖిక నివారణ తో పాటు వేడి నీటి కాపడం పెట్టమని సిఫార్సు చేసారు. క్రమంగా చీము కారడం ప్రారంభమై రెండు నెలలలో చర్మం పూర్తిగా సాధారణమైంది.
జాయింట్ నొప్పుల కోసం క్రింది కొంబోతో ముందుకు వచ్చి CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine, ఈ కొంబో కొబ్బరి లేదా ఆవాల నూనెలో ఉపయోగించినప్పుడు అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. చార్ధామ్ యాత్రకు వెళుతుండగా ఉత్తర కాశీలో ఆమె ఒక పదునైన రాయిపై పడిపోవడంతో అది తన రెండు మోకాళ్ళను తీవ్రంగా గాయపరిచింది. పైన పేర్కొన్న కాంబోను ప్రతి పది నిమిషాలకు ఒకసారి చొప్పున ఒక గంట పాటు తీసుకొని ఈ కోంబోను ఆలీవ్ నూనెలో తను మోకాళ్ళపై కూడా రాసారు. ఆశ్చర్యకరంగా ఆమెకు నొప్పి అదృశ్యమై ఎటువంటి సమస్య లేకుండా తీర్థయాత్ర పూర్తి చేయగలిగారు.
ఒక అల్లోపతీ డాక్టరు కుమార్తెగా ఆమె వ్యాధి నుండి కోలుకున్న రోగుల చిరునవ్వులను మరియు వారి ముఖాలలో వ్యక్తమయ్యే అపారమైన ఆనందాన్ని నిరంతరం ఆస్వాదించేవారు. కాబట్టి ఆమెలో డాక్టర్ కావాలనే ఆకాంక్ష ఉదయించింది. ఈ చిరకాల స్వప్నాన్ని స్వామి నెరవేర్చినందుకు ఇది స్వామి ఆశీర్వాదంగా ఆమె భావిస్తున్నారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రతికూల ఆలోచనలపై ఎప్పుడూ దృష్టి పెట్టకూడదని మరియు ఏ వ్యాధిని నయం చేయలేనిదిగా పరిగణించకూడదని ఆమె గ్రహించారు. స్వామికి శరణాగతి చేసి అనుకూల దృక్పథంతో మరియు పూర్తి విశ్వాసంతో రెమెడీలు ఇస్తే ఫలితాలు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి.
కొత్త ప్రదేశాలలో వైద్య శిబిరాల కోసం ఆమె ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటారు. 2023 ఫిబ్రవరిలో పుట్టపర్తికి నివాసం మార్చినప్పటికీ ఈ ప్రాక్టీషనర్ పశ్చిమ బెంగాల్లో కోల్కతాలోని తాన ఇంటికి సమీపంలో ఉన్న మూడు వేర్వేరు ప్రదేశాల్లో
త్రైమాసిక వైబ్రో క్యాంపులను నిర్వహించడం కొనసాగిస్తూనే ఉన్నారు. పుట్టపర్తికి తిరిగి వచ్చే ముందు జార్ఖండ్ లోని ఒక నిరుపేద గ్రామంలో రెండు ప్రదేశాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. పుట్టపర్తిలో ఉన్నప్పుడు వైబ్రియానిక్స్ యొక్క సామర్ధ్యా న్ని ప్రత్యక్షంగా అనుభ వించిన ఆ గ్రామానికి చెందిన ఒక సేవాదళ్ పిలుపుమేరకు ఈ సేవ ప్రారంభమైంది. రోగులకు ఫాలో అప్ సంప్రదింపుల కోసం ఆమె మొబైల్ యాక్సెస్ అందిస్తున్నారు. అంతేకాక ఆశ్రమాన్ని సందర్శించే స్థానిక భక్తుల ద్వారా రోగులకు రెమిడీలు పంపుతూ ఉంటారు, అది సాధ్యం కానప్పుడు ఆమె రెమిడి బాటిళ్ళను కొరియర్ లో పంపుతుంటారు. వారానికి రెండుసార్లు SVIRT కార్యాలయంలో క్లినిక్ మరియు ఈశ్వరమ్మ గ్రామం మరియు బ్రాహ్మణపల్లి లో క్లినిక్ క్రమం తప్పకుండా నిర్వహించే ప్రాక్టీషనర్ల బృందంలో ఆమె కూడా ఒక సభ్యురాలు. ఆమె పుట్టపర్తి లో ఉన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోని మందిరంలో కొత్త క్లినిక్ లో ప్రతీ ఆదివారం వాలంటీర్ గా సేవలు అందిస్తారు, అదనంగా పుట్టపర్తిలో ఉన్న తన అపార్ట్మెంట్ నుండి కూడా రోగులను చూస్తారు.
తన రోగుల ఆశీర్వాదబలమే తన సేవను విస్తరించడానికి అదనపు శక్తి అందించిందని భావిస్తున్నారు. మానవసేవే మాధవసేవ అనే స్వామి వాక్కుతో ఆమె జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నారు.
పంచుకున్న కేసులు :