చర్మము పై ఎలర్జీ 18001...भारत
26 ఏళ్ల మహిళ ముఖంపై తీవ్రమైన చర్మపు దద్దుర్లు ఏర్పడి ఎరుపుదనం, కొంచం వాపు మరియు దురదతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం బ్యూటీ పార్లర్ కు వెళ్లిన వెంటనే ఈ దద్దుర్లు బయటపడ్డాయి. వైద్యులు సూచించిన అల్లోపతి మాత్రలు మరియు లేపనం ఉపయోగించడం ప్రారంభించారు కానీ ఇవి పాక్షిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చాయి, అదికూడా తాత్కాలికంగానే ఉంది. ఈ చికిత్స సమయంలో హోమియోపతి ప్రయత్నించారు కానీ ఉపశమనం లభించలేదు. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న వెంటనే ఆమె ఇతర చికిత్సలు పిలిపివేయాలని నిర్ణయించుకున్నారు, ఎందుకంటే ఒక వారంలో ఆమె వివాహ వేడుకకు హాజరు కావలసి ఉన్నందున సత్వర పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు.
2022 జనవరి 27న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC8.1 Female tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.11 Wounds & Abrasions...ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకు అనంతరం 6TD, బాహ్య అనువర్తనం కోసం నీటితో …BD
మూడు రోజులలో రోగిని ఆశ్చర్య, ఆనందానికి గురి చేస్తూ ఎరుపు, వాపు, దురదలలో 50% మెరుగుదల కనిపించింది, అలాగే ఇతర లక్షణాలు కూడా తగ్గాయి, చర్మం సాధారణ స్థితికి వచ్చింది. బాహ్య అనువర్తనం ఆపి నోటి ద్వారా తీసుకునే రెమిడీని తగ్గించడం ప్రారంభించారు. ఎలాంటి ఆందోళన లేకుండా పెళ్లికి హాజరవుతున్నందుకు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నోటి ద్వారా తీసుకునే రెమిడి ఫిబ్రవరి 16న ఆపివేయబడింది, 2023 నవంబర్ నాటికి ఎటువంటి పునరావృతం లేదు.