ఆలస్యమైన శాశ్వత దంతాలు 18001...भारत
వైబ్రియానిక్స్ క్యాంపు సమయంలో ఒక ఎనిమిదేళ్ల బాలిక చాలా దిగులుగా ప్రాక్టీషనర్ ను కలసి తనకు 2 సంవత్సరాల క్రితం దవడ ముందు వైపు వైభాగపు కోత ఏర్పడక పోవడంతో శాశ్వత దంతాలు బయటికి రాలేదని చెప్పింది. అల్లోపతి మందులు సంవత్సరం పాటు వాడినా ఫలితం లేకుండా పోయింది. తోటి పిల్లలు ఆమెను ఎగతాళి చేయడం మరింత బాధ కలిగిస్తోంది. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆశతో కూడిన భరోసా కల్పిస్తూ ప్రాక్టీషనర్ 2022 డిసెంబర్ 21న క్రింది రెమిడీ అందించారు:
CC9.4 Children's diseases* + CC10.1 Emergencies + CC11.6 Tooth infections + CC12.2 Child tonic...TDS
సరిగ్గా నెల తర్వాత తదుపరి శిబిరంలో గత రెండు సంవత్సరాలుగా ఆందోళన కలిగించిన రెండు చిగుళ్లలో కోత ఏర్పడి దంతాలు ఏర్పడు తున్నాయనే శుభవార్తను తెలపడానికి బాలిక ఉత్సాహంగా ప్రాక్టీషనర్ వద్దకు వచ్చి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
*ప్రాక్టీషనర్ కు ఈ కొంబో ను జోడించాలని అంతరంగం నుండి బలంగా అనిపించింది!