ప్రాక్టీషనర్ల వివరాలు 03599 & 02726...USA
ప్రాక్టీషనర్స్ 03599 & 02726…USA అమెరికా లోని హోస్టన్ కి చెందిన ఈ జంట ఒక టీం గా కలిసి సేవ చేస్తున్నారు. భర్త కెమికల్ ఇంజినీరుగా భారతదేశంలోని వివిధ ప్రభుత్వ యాజమాన్య సంస్టల లోనూ, మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేసి అనంతరం యునైటెడ్
స్టేట్స్ కి వెళ్లినప్పుడు అక్కడ కూడా పనిచేశారు. 2019 నుండి అతను ప్రోబొనో సంస్థకు అధ్యక్షుడిగా పనిచేస్తూ కోచింగ్ మరియు కెరీర్ గైడెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యర్ధులు వారి కలలను సహకారం చేసుకోవడంలో సహాయం చేస్తున్నారు. అతను ప్రస్తుతం ప్రాజెక్టు మేనేజ్మెంట్ ను బోధిస్తున్నారు అంతేకాక 50 మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కమ్యూనికేషన్ మరియు స్వీయ నిర్వహణ పద్ధతులలో మార్గదర్శకత్వం వహిస్తున్నారు. వీరి శ్రీమతి B. Sc మరియు MBA డిగ్రీ కలిగి ఉండి పదవీ విరమణ వరకు వివిధ పరిశోధన ప్రయోగశాలలో పనిచేశారు. ఆమెకు బాలివికాస్ పట్ల మక్కువ, భజనలు పాడటం కవిత్వం రాయడం అంటే చాలా ఇష్టం.
1999లో భర్త విదేశీ అసైన్మెంట్ కోసం జపాన్ లోని యోకో హోమాలో పోస్ట్ చేయబడినప్పుడు ఈ జంట సాయిబాబా ఫోల్డ్ లోకి వచ్చారు. వారి నాలుగున్నర సంవత్సరాల కుమారుడిని భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు అలవాటు చేద్దామనే ప్రయత్నంలో వారానికి ఒకసారి బాలవికాస్ తరగతులు నిర్వహించే ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని చూశారు. వారు మొదటిసారి సాయి కేంద్రాన్ని సందర్శించినప్పుడు వారి కుమారుడు నేరుగా స్వామివారి పీఠం వద్దకు వెళ్లి స్వామివారి పాదాలకు నమస్కరించాడు. సాయి మరియు వారి కుమారుని మధ్య ఉన్న ఈ లోతైన అనుబంధం బాలవికాస్ గురువు వారి ఆధ్యాత్మిక మార్గదర్శి గా మరియు స్వామి వారి జీవితానికి కేంద్ర బిందువుగా మారి ఈ కుటుంబం సాయి వైపు ప్రయాణం ప్రారంభించింది. వారు యోకో హోమాలో నారాయణ సేవలో చురుకుగా పాల్గొనడమేకాక హ్యూస్టన్ లో కూడా నారాయణ సేవ కొనసాగించారు. వీరి శ్రీమతి 13 ఏళ్లు SSE టీచరుగా, నాలుగేళ్లు ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. భర్త SSE టీచరుగా, సేవా కోఆర్డినేటర్ గా, వైస్ ప్రెసిడెంటుగా, సాయి ఆర్గనైజేషన్ సెంటర్ లో ప్రెసిడెంట్ గా వివిధ హోదాలలో పని చేసారు. వీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సర్టిఫైడ్ సేవా వాలంటీర్ కూడా. ఈదంపతులు వైద్య శిబిరాలు మరియు ఆహార పంపిణీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, నర్సింగ్ హోమ్ లో కూడా సేవ చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ వైద్య పద్ధతుల పట్ల ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండే వీరి శ్రీమతి 2007లో వైబ్రియానిక్స్ గురించి విన్నప్పుడు ప్రాక్టీషనర్ గా మారడానికి ప్రేరణ పొందారు. 2007లోనే పుట్టపర్తిలో AVPగా శిక్షణ పొందారు. ఆ తర్వాత AVP గా మరలా శిక్షణ పొంది కొంతకాలం తర్వాత 2021లో VP అయ్యారు. అనేక సందర్భాల్లో వైబ్రియానిక్స్ యొక్క శక్తిని ప్రత్యక్షంగా చూసిన భర్త తన శ్రీమతితో పాటు పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అతను 2020లో AVP, 2021లో VP మరియు 2023లో SVP అయ్యారు.
స్వామి వారి సేవను ఆశీర్వదించిన అందమైన అనుభవాన్ని వారు ఇలా వివరిస్తూన్నారు. ఒకసారి వారు ఒక SVP సహకారంతో తమ 108CC బాక్స్ ను రీచార్జి చేస్తూ సాయి నామాన్ని జపిస్తున్నప్పుడు తమ టేబుల్ పై ఉన్న ఎలెక్ట్రిక్ బల్బు నిరంతరం దానికదే వెలిగి ఆరుతూ ఉండటం గమనించారు. రీ చార్జి పూర్తికాగానే అలా వెలగడం దానంతట అదే ఆగిపోయింది. స్వామి సర్వవ్యాపకత్వం గురించి ఈ నిస్సందేహమైన లీలతో వారు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. స్వామి దయకు సంబంధించిన మరో సందర్భంలో వీరి శ్రీమతి UK లో అలోపతి వైద్యుడు గా పనిచేస్తున్న తమ సోదరుడు 2020లో కోవిడ్ మహమ్మారి ఉదృతంగా ఉన్న సమయంలో పేషంట్లను సందర్శించ వలసిన పరిస్థితి కొనసాగుతూ ఉండేది. అతని కుటుంబానికి IB తీసుకువెళ్ళి ఇద్దామని ఆమె అంతరంగికంగా ప్రేరేపింప బడి సోదరుని అడుగగా ఆమెను అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తూ అతను అంగీకరించాడు, మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారికి తమ ఇంటి నుండి అరగంట డ్రైవింగ్ దూరంలోనే వారికి IBని అందించగల మరొక ప్రాక్టీషనర్ను వారు కనుగొన్నారు. వారు రెమిడీ పొందిన మరుసటి రోజు సోదరుడు కోవిడ్ లక్షణాల బారిన పడ్డాడు. ఈ విషయం విని ఆమె తన ప్రార్థనా మందిరానికి పరిగెత్తి స్వామిని జాగ్రత్తగా చూసుకోమని హృదయపూర్వకంగా వేడుకోగా ఆమె సోదరుడు బాగుంటాడని స్వామి స్పందించారు. ఆమె సోదరుడు కోలుకోవడానికి రెండు వారాలు పట్టింది కానీ తన ప్రాణం కాపాడిన క్రెడిట్ అంతా తన సోదరికే ఇచ్చారు!
2023 మార్చి లో 30 ఏళ్ల పురుషునికి IBS(పేగు ప్రకోపము) నిర్ధారణ అయ్యి, లూజ్ మోషన్ సమస్య తో వారిని సంప్రదించారు. అతను చిన్నతనం నుండి జీర్ణ సమస్యల చరిత్ర కలిగి ఉన్నారు, మరియు ఆరు సంవత్సరాల క్రితం కామెర్ల వ్యాది సోకిన అనంతరం అతను అధికత్రేనుపు, ఉబ్బరం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడ్డారు. అలోపతి చికిత్సలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది #1. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…6TD, #2. IB and #3. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic. రెండు వారాల్లో రోగి మెరుగయ్యారు, ఆ తర్వాత ఆరు నెలల్లో ఎటువంటి లక్షణాలు పునరావృతం కాలేదు.
ఈ ప్రాక్టీషనర్ల జంట CC17.2 Cleansing మరియు CC12.1 Adult tonic చాలా శక్తివంతమైన రెమిడిలుగా గుర్తించారు. భర్తకు దశాబ్ద కాలంగా ఉన్న తీవ్రమైన పుప్పొడి ఎలర్జీ ఈ రెమిడీలను ప్రత్యామ్నాయంగా ఒకేసారి తీసుకోవడం ద్వారా నాలుగు నెలల్లో పూర్తిగా మాయమైంది. ఇది జరిగి 8 సంవత్సరాలు అయ్యింది. కోవిడ్ కలిగించిన సంక్లిష్టత వల్ల కోలుకోవడం కష్టంగా ఉన్న ఆరుగురు వృద్ధ రోగుల్లో IB + Covid Recuperation ఉపయోగించగా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడమే కాక వారందరూ సాధారణ స్థితిని పొందారు. అలాగే కనీసం 10 రోజులుగా కోవిడ్ తో బాధపడుతున్న మరో నాలుగు కేసుల్లో పై రెమిడి త్వరగా కోలుకోవడానికి దారితీసింది.
అన్ని సమస్యలు మనస్సు నుండే ఉత్పన్నమవుతాయి అనే సూత్రం ఆధారంగా ఈ జంట CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disorders రెమిడిని సిద్ధం చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగుల జీవిత భాగస్వామి లేదా కుటుంబసభ్యులకు మానసిక స్వాంతన ఇవ్వడం కోసం మొదట తమ పైనే అనేక నెలలు ప్రయత్నం చేసి ఆ ఫలితంతో వారు దాన్ని కనీసం 50 మంది రోగులపై విజయవంతంగా ఉపయోగించారు. తీవ్రమైన డిప్రెషన్ విషయంలో కూడా ఈ రెమిడి చాలా బాగా పనిచేసింది.
ఈ దంపతు లిద్దరూ ఎల్లప్పుడూ ఏదైనా సేవా అవకాశం కోసం నిరంతరం ఎదురు చూస్తూ వారి వల్ల ప్రయోజనం పొందగల ఎవరికైనా వీరి సహాయం అందిస్తారు. రోగులతో సంప్రదింపులు మరియు రెమిడీ తయారీ సమయంలో స్వామి వారితోనే ఉన్నట్లు వారు భావిస్తారు. తమ వంతు కృషి చేసి వారు స్వామిని ప్రార్థించి ఫలితాన్ని స్వామికి సమర్పించుకుంటూ ఉంటారు. ఎందుకంటే తాము నిమిత్త మాత్రుల మని నయం చేసేది స్వామీనే అనే భావన వీరిని ప్రశాంతతను అనుభవింప చేస్తుంది. ఆలోచనలు వ్యాధిని నయం చేయడంలో సహాయపడతాయని లేదా ఒక అవరోధంగా కూడా ఉంటాయని వారు గ్రహించారు కనుక ప్రేమ మరియు దైవిక ఆలోచనలతో నిండిన హృదయం ఆవశ్యక మైనదని వీరు భావిస్తారు.
వీరి శ్రీమతి వైబ్రియానిక్స్ ప్రారంభించినప్పుడు స్వామి తనకు ప్రసాదించిన ఆశీర్వాదబలం యొక్క శక్తిని ఆమె గ్రహించలేదు, ఇప్పుడు ఈ సేవ తమ జీవితానికి అర్థం మరియు ప్రయోజనాన్ని అందించిందని వారు తెలియ జేస్తున్నారు. వాస్తవానికి గతంలో భారత దేశం లోని డెహ్రాడూన్ లో సీనియర్ సిటిజన్ కమ్యూనిటీలో నివసిస్తున్న సందర్భంలో తోటి నివాసితులు మరియు సిబ్బంది అనేక మందికి వైబ్రియానిక్స్ చికిత్స చేసారు. వైబ్రియానిక్స్ అభ్యాసం వారు వారి అంతర్గత ప్రయాణంలో స్వామి వైపు ముందుకు సాగడానికి సహాయపడింది, విశ్వాసం, కృతజ్ఞత, వినయం మరియు అంగీకారానికి సంబంధించిన పాఠాలు నేర్పింది. వారు తమ అనుభవాలను పంచుకోవడానికి లేదా ఇతర ప్రాక్టీషనర్ల నుంచి సంక్లిష్టమైన కేసులపై సలహాలు తీసుకోవడానికి ఏదైనా బాధ్యత తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
ప్రతి ప్రాక్టీషనర్ తమ ప్రియమైన ప్రభువు చేత ఎంపిక చేయబడిన వారే అని శ్ర్రీమతి విశ్వేసిస్తారు. కనుక ప్రాక్టీషనర్లు దీన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఇట్టి సువర్ణ అవకాశాన్నిఅందించిన స్వామికి కృతజ్ఞతతో ఉండాలి. తనును డాక్టర్ చేయాలని కోరుకున్న తల్లిదండ్రుల కలలను స్వామి నెరవేర్చారని భావించిన భర్త మనం ఎల్లప్పుడు మన చర్యలపై మాత్రమే దృష్టి సారించాలని, ఫలితాన్ని ఆశించే వారుగా ఉండరాదని ఎందుకంటే దైవిక చర్యలు మన ఊహకు అందని విధంగా ఉంటాయని తన తోటి ప్రాక్టీషనర్లకు సూచిస్తున్నారు.
పంచుకున్న కేసుల వివరాలు :