ప్రాక్టీషనర్ల వివరాలు 18004...भारत
ప్రాక్టీషనర్ 18004…ఇండియా BA డిగ్రీని కలిగిన ఈ ప్రాక్టీషనర్ 2001 నుండి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. వీరు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌లోని మారుమూల జిల్లాలో నివసిస్తున్నారు, ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు
ప్రభుత్వం నిర్వహించే సింకోనా తోటలలో పని చేస్తారు.
1996లో వీరు బాబా గురించి మొదటిసారిగా తనకు లభించిన రెండు పుస్తకాల ద్వారా - “నర నారాయణ గుహ ఆశ్రమం” మరియు “బాబా యొక్క అద్భుతాలు” తెలుసుకున్నారు. అతను డిసెంబర్ 1997లో పుట్టపర్తిలో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు సాయిని మొదటిసారిగా వర్చువల్ దర్శనం చేసుకున్నాడు. 2000 లో ప్రశాంతి నిలయంలో శిక్షణ పొంది బాలవికాస్ ఉపాధ్యాయుడయ్యారు. 2001లో అతని గ్రామంలో సాయి భజన బృందం ఏర్పడింది మరియు అప్పటి నుండి అతను క్రియాశీల సేవాదళ్‌గా కొనసాగుతున్నారు. అతను ప్రస్తుతం సమితి సేవా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు, అలాగే ప్రక్కనే ఉన్న గ్రామంలో బాలవికాస్ బోధిస్తున్నారు.
డాక్టర్ అగర్వాల్ వైబ్రియానిక్స్ గురించి మాట్లాడుతున్న యూట్యూబ్ వీడియోను చూసిన తర్వాత, దీని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగింది. కొన్ని వార్తాలేఖలను కూడా చదివి, ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ప్రజలు ఎంత అద్భుతంగా నయమయ్యారో చూసి ఆశ్చర్యపోయారు! ఆ సమయంలో అస్వస్థతతో ఉన్న తన భార్యకు చికిత్స చేయించుకోవాలని, తాను కూడా ప్రాక్టీషనర్‌గా మారాలని స్ఫూర్తి పొందారు.
ఇంగ్లీషు మరియు హిందీ భాషలలో అతనికి పట్టు లేకపోవడం, మరియు వైద్య పరిజ్ఞానం పూర్తిగా లేకపోవడం వల్ల అతను శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి మొదట్లో సంశయించారు. తన మారుమూల గ్రామంలో ఇంటర్నెట్ కనెక్షన్ దయనీయంగా ఉన్నందున అతను ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావడం గురించి కూడా భయపడ్డారు. గడువు ముగిసిన మూడు నెలల తర్వాత, అతను తన దరఖాస్తు ఫారమ్‌ను ఎంపిక బృందానికి పంపడానికి ప్రయత్నించగా అది అమలు కావడంలో విఫలమైందని సందేశం వచ్చింది. మనకు అనేక సందేహాలు ఉండవచ్చు, అమలుకావడంలో అనేక అడ్డంకులను ఎదురుకావచ్చు. కానీ భగవంతుని సంకల్పాన్ని ఏ శక్తి ఆపలేదు. అతనిని ఆశ్చర్యపరిచే విధంగా, అతని తన దరఖాస్తు ఆమోదించబడిందని మరియు ప్రాక్టీషనర్ కావడానికి మొదటి మెట్టును క్లియర్ చేసినట్లు నిర్ధారణను అందుకున్నారు! అతను డిసెంబర్ 2021లో APకి అర్హత సాధించారు.
వీరు వైబ్రియానిక్స్ పరీక్ష కోసం చదువుతున్నప్పుడు, స్వామి అనేక సందర్భాలలో తన సర్వవ్యాపకత్వము గురించి అతనికి అనేక నిదర్శనాలు ఇచ్చారు; ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి వీరి కుమారుడు పాల కుండను అధిక మంటపై ఉంచి దాని గురించి మరచిపోయాడు, కానీ అ తరువాత అద్భుతం జరిగినట్లుగా గ్యాస్ స్టవ్, తక్కువ మంటలో ఉన్నట్లు కనుగొనబడింది. మరో సందర్భంలో, ఇంట్లో ఎవరూ చేయనప్పటికీ,ఎలక్ట్రిక్ కెటిల్ యొక్క మెయిన్ స్విచ్ ఆఫ్ చేయబడిందని అతని భార్య గుర్తించారు. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సెలవుపై వెళ్లినప్పుడు, ఇరుగుపొరుగు వారు తాళం వేసి ఉన్న వీరి ఇంటిలోపల ఎవరో నడుస్తున్నట్లు వెలుగునీ, నీడనీ చూశామని తెలిపారు. వారు తిరిగి వచ్చిన తరువాత చూస్తే ఇల్లు తాము విడిచిపెట్టినప్పుదు ఎలా ఉందో అ విధంగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత, ప్రాక్టీషనరు తాము దూరంగా ఉన్నప్పుడు స్వామి వారి ఇంటికి కాపలాగా ఉన్నారని నిర్ధారించుకున్నారు.
ఈ ప్రాక్టీషనర్ తన కుటుంబం మరియు అతని గ్రామంలోని ప్రజలకు చికిత్స చేయడం ద్వారా ప్రారంభించారు, కానీ క్రమంగా 'అద్భుత నివారణల' కథలు పొరుగు గ్రామాలకు వ్యాపించి త్వరలోనే వీరి క్లినిక్ రోగులతో కిక్కిరిసిపోవడం ప్రారంభమయ్యింది. కొన్నిసార్లు రోజుకు 250 వరకు కేసులు చూడవలసి వచ్చేది. తనది ఫుల్ టైమ్ జాబ్ ఐన కారణంగా అతను కొన్నిసార్లు రోగులను అర్థరాత్రి వరకు చూడవలసి వచ్చేది. చివరకు రోగుల ప్రవాహాన్ని నియంత్రించమని స్వామిని ప్రార్థించడంతో ఇప్పుడు అతను ప్రతి రోగికి తగిన సమయాన్ని కేటాయించగలుగుతున్నారు. వైద్య పరిభాషలో ఎటువంటి పరిజ్ఞానం లేకుండా, అతను రోగి యొక్క రిపోర్టులను అర్థం చేసుకోగలుగు తున్నారు. అదే సమయంలో సరైన కాంబో ఇవ్వడానికి మార్గదర్శకత్వం వహించమని స్వామిని గాఢంగా ప్రార్దిస్తారు. తరువాత, రోగి లక్షణాలను ఆన్‌లైన్‌లో వెతుకుతున్నప్పుడు, ప్రతి సందర్భంలోనూ స్వామి సరైన కాంబో ఇచ్చేందుకు మార్గనిర్దేశం చేసినట్లు అతను కనుగొన్నారు! కొంతకాలం తరువాత వీరు ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక వైద్య కోర్సుకు హాజరయ్యారు, అంతేకాక వివిధ వ్యాధులపై ఆన్‌లైన్ వీడియోలు, రిపోర్టులు మరియు స్కాన్‌లు ద్వారా వ్యాధిపై అవగాహన పెంచుకున్నారు.
వివిధ రకాల జబ్బులకు చికిత్స చేయడంలో అతను అద్భుతమైన విజయాన్నిసాధించారు. 60 ఏళ్ల వృద్ధురాలు ఐదేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ మెట్లు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బంది పడేవారు, వైబ్రో రెమెడీ యొక్క ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చి మెట్లపైకి, క్రిందికి సులభంగా మరియు నొప్పి లేకుండా వెళ్ళగలిగేవారు. ఒక్క డోస్‌తో అద్భుత వైద్యం!
రెండు మూత్ర పిండాల వైఫల్యము, పోస్ట్-సి-సెక్షన్ తో ఉన్న32 ఏళ్ల మహిళకు ప్రాక్టీషనర్ చికిత్స చేశారు. ఆమె క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండడంతో డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆమె రెండు రౌండ్ల డయాలసిస్ చేయించుకున్నారు కానీ, అదే స్థితిలో ఉన్న మరొక రోగి చనిపోవడాన్ని చూసి, ఆమె ప్రాణ భయంతో చికిత్సను నిలిపివేసారు. ఇలా నిర్ణయించు కోవడానికి ఆర్థిక పరిమితి కూడా ఒక కారణమైంది. ఒక నెల తర్వాత, రోగి యొక్క భర్త ప్రాక్టీషనర్‌ను సంప్రదించి తన భార్యకు మూత్రంలో రక్తంతో కూడిన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ UTI, మైకము, ఆమె ముఖం మరియు పాదాలలో తిమ్మిరి, వొళ్ళునొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి మరియు మలబద్ధకం గురించి చెప్పారు. ఆమెకు #1. CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.4 Kidney failure…6TD. ఇవ్వబడింది. మర్నాడు ప్రాక్టీషనర్ సందర్శనాకు వెళ్ళి ఆమెకు అదనపు కొంబోలు ఇచ్చారు: #2. CC3.7 Circulation + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue; #3. CC4.4 Constipation + CC4.8 Gastroenteritis and #4. CC3.3 High Blood pressure (BP) + CC12.4 Autoimmune diseases. మూడు వారాల తర్వాత, రోగి ఆమె పొత్తికడుపులో తీవ్రమైన నొప్పిని గురించి తెలిపారు, మరో రెండు రోజుల తర్వాత మూత్రవిసర్జన సమయంలో ఒక మాంసపు ముద్ద వంటి పదార్ధాన్ని విసర్జించారు. ఆ తర్వాత ఆమె కడుపు నొప్పి తగ్గింది. రెండు నెలల్లోనే, క్రియాటినిన్ మరియు యూరియా దాదాపు సాధారణ స్థాయికి వచ్చాయి మరియు రోగి ఇంటి చుట్టూ కొన్ని దైనందిన పనులు చేయడానికి సరిపోయేంత శక్తి చేకూరినట్లు అనుభూతి చెందారు! రెండు నెలల క్రితమే ఆశలు పూర్తిగా కోల్పోయిన ఆ దంపతులు సాధకుడికి, స్వామి పట్ల కృతజ్ఞతతో నిండిపోయారు.
మరో కేసులో తన మొదటి వివాహం అనంతరం ఇద్దరు పిల్లలతో కూడిన 31 ఏళ్ల మహిళ తన రెండవ భర్తతో గర్భం దాల్చలేకపోయింది. ప్రాక్టీషనర్ ఆమెకు CC8.4 Ovaries & Uterus + CC8.5 Vagina & Cervix + CC8.7 Menses frequent…TDS.అందించారు. ఒక నెల తర్వాత ఆమె భర్త ఆమెకు వాంతులు కోసం ఒక ఔషధాన్ని తీసుకొనడానికి వచ్చారు, CC8.9 Morning sickness వారికి ఇవ్వబడింది. పది నెలల తర్వాత ఆమె ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చారు!
దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, దీర్ఘకాలిక గౌట్, రొమ్ము కణితులు, అనారోగ్య సిరలు, సయాటికా, గ్యాస్ట్రిక్ అల్సర్లు మరియు లివర్ సిస్ట్‌లకు చికిత్స చేయడంలో ప్రాక్టీషనర్ అద్భుతమైన ఫలితాలను పొందారు. వైబ్రో చికిత్స ప్రారంభించిన తొమ్మిది రోజుల తర్వాత ఒక రోగి 3 మిమీ మూత్రపిండ రాయిని విసర్జించాడు. దీర్ఘకాలిక గౌట్‌తో బాధపడుతున్న తన రోగులందరూ వైబ్రో చికిత్స ప్రారంభించిన తర్వాత భరించలేని నొప్పిని అనుభవించడాన్ని ప్రాక్టీషనర్ గమనించారు. తీవ్రమైన పులౌట్ కారణంగా కొందరు కొంబో ఆపేస్తారు, అయితే పట్టుదలతో నొప్పి భరించినవారు దాదాపుగా ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో నయమయ్యారు. మధుమేహం మరియు BP ఉన్న అతని రోగులలో కొందరు వారి అల్లోపతి మందులను నిలిపివేసారు మరియు గత ఒక సంవత్సరం నుండి వైబ్రియానిక్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మూత్రపిండాలు, గుండె, వెన్నెముకకు సంబంధించిన సమస్యలకు CC3.7 Circulation చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రాక్టీషనర్ కనుగొన్నారు.
2022 లో, ప్రాక్టీషనర్ ఒక్కరే 1400 మంది రోగులకు చికిత్స అందించారు మరియు 500 IB బాటిళ్లను కూడా పంపిణీ చేశారు! అతను ఇప్పుడు వారానికి మూడుసార్లు రోగులను చూస్తూ వారానికోసారి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేయడం తనకు 'గేమ్ ఛేంజర్' అని ఆయన తెలిపారు. అతను తన నిస్వార్థ సేవతో వందలాది మంది ప్రజల అభిమానాన్ని పొందడమే కాక ఈ చికిత్స పూర్తిగా ఉచితం అంటూ అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు. వైబ్రోను అభ్యసించడం అతని స్వంత వ్యక్తిగత సాధనను తీవ్రతరం చేయడంలో సహాయపడింది. ప్రాక్టీషనర్ ఎల్లప్పుడూ రెమిడీలు సిద్ధం చేస్తున్నప్పుడు ప్రార్ధించడమే కాక తన రోగుల సంక్షేమం కోసం అదనంగా ప్రతీరోజూ లిఖిత జపం మరియు రుద్రం జపిస్తారు. 2025లో స్వామి శత జయంతి సందర్భంగా, ఈ శ్లోకాల నుండి వచ్చే ప్రకంపనలు వైబ్రో కాంబోలను మరింత ప్రభావవంతం చేసేలా చేయడం వల్ల సాధకులందరూ నేర్చుకుని స్వామికి రుద్రం సమర్పించాలని ఆయన సూచించారు. ఆత్మ-సాక్షాత్కారానికి మరియు, సేవ యొక్క ఆనందంలో మునిగి పోవ్ఆడానికి, సాయి వైబ్రియానిక్స్ మార్గమును సుగమం చేసిందని వీరు భావిస్తారు. ప్రాక్టీషనర్ నిరంతరం తన చుట్టూ స్వామి ఉనికిని అనుభవిస్తారు.
ఉదహరించిన కేసులు :