Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 11622...India


ప్రాక్టీషనర్ 11622…ఇండియా మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ, ఫార్మసీ లో గ్రాడ్యుయేషన్ కలిగిఉన్న ఈ ప్రాక్టీషనర్ ఒక ఫార్మా పరిశ్రమకు బ్రాండ్ బిల్లింగ్ మరియు ప్యాకేజీ మెటీరియల్ను అందించడంలో మద్దతుగా ఉంటూ పురోభివృద్ధి కరమైన వ్యాపారాన్ని నడుపుతున్నారు. 1998లో ఒక పనిమీద శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు(ఆ సమయంలో అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది) ఒక అదృశ్య శక్తి తనను నిరంతరం కాపాడుతూ ఉన్నట్లు భావించారు. అక్కడ ఆయన సందర్శించిన పలువురు వైద్యుల ఇళ్ళు మరియు క్లినిక్ లలో స్వామి వారి ఫోటోలు చూశారు. భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కావాలని ఆశిస్తూ అతను బృందావనం (బెంగళూరు లో స్వామివారి ఆశ్రమం) సందర్శించారు. పాద నమస్కారం ప్రసాదించడం ద్వారా స్వామి ప్రేమతో వీరిని తన ఫోల్డ్ లోనికి తీసుకున్నారు.

అప్పటి నుంచి ఈ సాధకుడు సాయి సంస్థ కార్యకలాపాల్లో ఆనందంగా పాల్గొంటూ 2018 నుండి జిల్లా సేవా సమన్వయకర్తగా సేవలు అందిస్తున్నారు. వీరు క్రమం తప్పకుండా సేవాదళ్ గా సేవచేస్తు ప్రశాంతి నిలయం లో జరిగిన అనేక సాయి కార్యక్రమాలకు పోస్టర్లను  రూపొందించడం మరియు ముద్రించే పని చేపట్టారు. 2019 ప్రారంభంలో అతను వైట్ ఫీల్డ్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైబ్రియానిక్స్ క్లినిక్ కోసం పోస్టర్ ను డిజైన్ చేశారు. అదే వీరు వైబ్రియానిక్స్ వైద్యం గురించి మొదటిసారి వినడం ఆ తరువాత వెంటనే దాని వైపు ఆకర్షింపడి మరింత సేవ చేయడానికి దీన్ని ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకున్నారు. తనంతట తాను శిక్షణా కార్యక్రమంలో  పేరు నమోదు చేసుకుని 2020 ఫిబ్రవరిలో AVP గా మరియు ఆరు నెలల తర్వాత VP గా అర్హత సాధించారు. వీరు  ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో సేవలు అందిస్తూ ప్రాంతీయ కోఆర్డినేటర్ గా ప్రశాంతినిలయంలో సేవ చేసే వారికి IB పంపిణీ  చేయడంలో చురుకుగా పాల్గొంటున్నారు.

 రెండు సంవత్సరాల ప్రాక్టీస్ లో అతను అనేక అద్భుత సంఘటనలు చూసారు. ఒకసారి ఒక సాయి భక్తురాలు తనకు మరియు తన కుటుంబానికోసం IB(ఇమ్యూనిటీ బూస్టర్) అడిగారు. ఆమె దాన్ని స్వీకరించిన రోజు షిరిడి బాబా ఆమెకు కనిపించి తనకు అమృతాన్ని(దైవ మధువును) ఇచ్చి దాన్ని ఇతరులకు ఇవ్వమని కోరినట్టుగా ఆమెకు ఒక అందమైన కల వచ్చింది. షిరిడి సాయిబాబా వైబ్రియానిక్స్ ను అమృతంతో సమానం చేసారు!

 దీర్ఘకాలిక IBS మరియు గ్లూటెన్ లేదా మైదా అసహనంతో బాధపడుతున్న 81 ఏళ్ల మహిళకు చికిత్స చేస్తున్న ప్రయత్నంలో వీరు  అద్భుతమైన విజయాన్ని సాధించారు. అల్లోపతీ ఆమెకు పనిచేయలేదు. వీరు ఆమెకు: CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC12.1 Adult tonic…TDS. ఇచ్చారు. ఒక వారం తర్వాత పేషెంట్ కుమార్తె ఉత్సాహంగా తన తల్లి ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా తనకు నచ్చినది తింటున్నదని అతనికి తెలిపారు. అప్పటినుండి రోగి సాధారణ ఆహారం తీసుకుంటూ ఉన్నారు. ఒకసారి అతను తన ఇంటి పని మనిషికి CC11.3 Headaches అందించినప్పుడు ఆమె కేవలం ఒక వారం వ్యవధిలో రీఫిల్ కోసం తిరిగి వచ్చిందని కనుగొన్నారు. ఆమెను విచారించగా తనకు చాలా ఏళ్లుగా ఉన్న వ్యాధి మూడు రోజులలో తగ్గిపోయిందని అందుచేత తన చుట్టుపక్కల తల నొప్పితో బాధపడుతున్న వారికి ఆమె ఈ రెమిడీ ని పంచుతున్నట్లు అతనికి చెప్పారు. రోగి యొక్క నిస్వార్ధ సేవా భావం ప్రాక్టీషనరును మరింత ఉత్సాహంతో సేవ చేయడానికి ప్రేరేపించింది.

వైబ్రియానిక్స్ సేవ కోసం సాయి కేంద్రానికి బయలు దేరుతున్నప్పుడు అతని భార్య కారు డోరులో తన బొటనవేలు ఇరుక్కు పోయినప్పుడు వైబ్రియానిక్స్ యొక్క సమర్ధత గురించి అతనికి వ్యక్తిగత అనుభవం కలిగింది. ఆమెకు షాక్ మరియు నొప్పితో ఊపిరి సలపలేదు. ప్రాక్టీషనర్ వెంటనే ఆమె నోటిలో CC10.1 Emergencies మరియు CC18.5 Neuralgia ఒక మోతాదు వేసారు.  కొన్ని నిమిషాల్లోనే ఆమె చాలా మెరుగైన అనుభూతిని పొంది తమ ప్రయాణం కొనసాగించారు. క్లినిక్ లో అతను: CC3.2 Bleeding disorders + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue తయారు చేసి ఇవ్వగా ఆమె దానిని తరచూ తీసుకొనసాగారు, రెండు గంటలలో వాపు తగ్గింది. ఆమె ఎంతగా కోలుకున్నారంటే ఆ తర్వాత నాలుగు గంటల పాటు రెమిడీస్ సిద్ధం చేయగలిగారు.

ప్రాక్టీషనర్ 15 సంవత్సరాలకు పైగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చాలా మంది రోగులను దృష్టిలో ఉంచుకుని అతను “సాయి అభయం”(భయం యొక్క కారణాలు తొలగించడం): CC3.1 Heart tonic + CC7.1 Eye tonic + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing + CC18.1 Brain disabilities + CC 21.11 Wounds & Abrasions. అనే కోంబోను తయారు చేసారు. మధుమేహం వంటి ఏదైనా జీవనశైలి వ్యాధికి ఈకాంబో ను మిళితం చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు.

రోగులతో సంభాషించడం తనకు తానుగా పనిచేయడానికి, సహనం, ఓపిక, మరియు మనస్సు కంటే హృదయంతో ఎక్కువ పని చేయడం నేర్పిందని ప్రాక్టీషనర్ అంగీకరిస్తారు. రోగితో సంభాషించే ప్రతీ అవకాశం స్వామి గురించి ఆలోచించే అవకాశం గానూ, రోగికి రెమిడీ తయారుచేసి ఇవ్వడం స్వామిని ప్రార్ధించడానికి ఒక అవకాశం గానూ భావిస్తారు. కనుక వైబ్రియానిక్స్ కు ఎక్కువ  సమయం కేటాయించడం ద్వారా భవిష్యత్తును మార్చే ఈ మిషన్ కు సహకరించడం ద్వారా స్వామి వారి దివ్య ప్రేమను అనుభవించాలని ఆయన ప్రాక్టీషనర్లు అందరినీ కోరుతున్నారు.

పంచుకున్నకేసులు