Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మైగ్రేన్ / పార్శ్వపు నొప్పి 11622...India


43 ఏళ్ల మహిళకు ఐదేళ్ల క్రితం తరుచుగా తీవ్రమైన పార్శ్వపు నొప్పి దీనితో పాటు బిగ్గరగా ఉండే శబ్దం మరియు చుట్టూ ప్రకాశవంతమైన కాంతి వంటి ఇంద్రియ సంబంధిత అవరోధాలు భరించలేని స్థితి ప్రారంభం అయ్యింది. ఆమె దాదాపు వారానికి రెండుసార్లు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతీ సారి నాలుగు గంటలు చొప్పున లేదా కొన్నిసార్లు రాత్రంతా ఉంటూ ఆమె నిద్రకు భంగం కలిగిస్తున్నది. గత నాలుగు సంవత్సరాలుగా ఆమె ప్రతి రోజూ ఫ్లూనారాజిన్  అల్లోపతీ మందు తీసుకుంటున్నారు మరియు ఇది ఆమెకు పూర్తి ఉపశమనం కలిగిస్తున్నది, అయితే ఆమెకు ఈ మందు మానేయాలని ఉంది. ఆమె దాన్ని ఆపడానికి మూడు సార్లు ప్రయత్నించారు కానీ ఒక నెల తర్వాత మైగ్రేన్ మరింత తీవ్రతతో తిరిగి రాసాగింది. కాబట్టి 2020 ఏప్రిల్ 15న ఆమె ప్రాక్టీషనరును  సంప్రదించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల సమస్యల కారణంగా ఒత్తిడికి గురై ఉన్నారు, వారికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:  

CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic…TDS   

 రోగి అల్లోపతి మందులు కూడా తీసుకోవడం కొనసాగించారు, రెమిడీ తీసుకున్న పది రోజుల తర్వాత ఆమె ఒత్తిడికి గురికాలేదు ఆమె మనస్సు ప్రశాంతంగా మరియు రిలాక్స్ గా ఉండసాగింది, అయినప్పటికీ మైగ్రేన్ వస్తుందనే భయంతో ఫ్లూనారాజిన్ ఆపాలి అనిపించలేదు. ఇదే సమయంలో ఆమె భర్త మరియు పిల్లలువైబ్రియానిక్స్ చికిత్స తీసుకొని మెరుగయ్యారు. ఆరు నెలల్లో ఆమె తగినంత విశ్వాసాన్ని పొంది ఫ్లూనారాజిన్ ఆపడానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. దీనిని ఆపిన ఒక నెల తర్వాత మైగ్రేన్ మళ్ళీ రాలేదని 2021 జనవరి 15న ఆమె సంతోషంగా తెలియజేశారు. 2021 ఏప్రిల్ నాటికి క్రమంగా OD కి ఆ తరువాత జూలై పూర్తిగా ఆపివేయ బడింది. 2022 నాటికి ఆమె బాగానే ఉన్నారు, సమస్య పునరావృతం కాలేదు.