Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

కాళ్లలో న్యూరాల్జియా 11622...India


73 ఏళ్ల మహిళ గత 6 నెలలుగా మోకాళ్లు మరియు పిక్కలలో నొప్పి మంట మరియు జలదరింపుతో ప్రారంభమై అది క్రమంగా పాదం వరకూ ప్రసరిస్తున్నట్లు ప్రత్యేకించి కుడి కాలిలో మరింత ఇబ్బందితో బాధపడుతున్నారు. ఆమె కూర్చున్న స్థానం నుంచి లేచినప్పుడు నొప్పి ఆమె కాలిలో ఎక్కువవుతూ కొద్దిదూరం నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు ఆమె నొప్పి నివారిణి తీసుకోగానే అది తగ్గుతుంది. ఆ విధంగా ఒక నెల తీసుకున్నారు. ఆ తర్వాత నొప్పి నివారణ మాత్రలు తీసుకోవడంతోపాటు కొన్ని వారాలపాటు ఫిజియోథెరపీ కూడా తీసుకున్నారు అయితే ఉపశమనం ఎప్పుడూ తాత్కాలికమే. ఆ తర్వాత ఆమెకు నీరోబియాన్ అనే మందు ప్రతీ నెలలో పక్షం రోజుల పాటు అలా నాలుగు నెలల పాటు తీసుకున్నారు కానీ ఎలాంటి మెరుగుదల లేక సమస్య కొనసాగింది. ఆమె 2020 మార్చి 3వ తేదీన ప్రాక్టీషనరును సందర్శించగా వారికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC10.1 Emergencies+ CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue...TDS 

పది రోజుల్లో ఆమె మోకాలి మరియు పిక్కల నొప్పి నుంచి 70% ఉపశమనం పొందారు, కానీ మండుతున్న అనుభూతి కొనసాగింది.  నెల తర్వాత ఏప్రిల్ 12వ తేదీన ఆమె నొప్పులు 90% తగ్గాయి అయితే మంట మరియు జలదరింపు కొనసాగింది. ఆమెకు తీవ్రమైన వెన్ను నొప్పి ఏర్పడింది. మోతాదు మూడు రోజుల పాటు 6TD కి పెంచి తరువాత TDS గా కొనసాగించారు. ఏప్రిల్ 30 నాటికి వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గి ఆమె 100% మెరుగ్గా ఉన్నట్లు భావించారు. మోతాదు 15 రోజులకు BD కి తరువాత OD కి తగ్గించబడింది 18 నెలల తర్వాత 2022 జనవరి నాటికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటూ యింటినెన్స్ డోసేజ్ OD గా కొనసాగించడాన్ని ఎంచుకున్నారు.