ప్రాక్టీషనర్ల వివరాలు 11573...India
ప్రాక్టీషనర్ 11573...ఇండియా భగవాన్ బాబావారు వీరి జీవితం లోనికి ఒక అనూహ్యమైన మార్గంలో ప్రవేశించే నాటికి వీరు చాలా చిన్నవయసులో ఉన్నారు. ఆ వయసులో వీరి కుటుంబం ఒక ఘోరమైన ప్రమాదంలో చిక్కుకోగా, అందులో వీరి తండ్రి మరియు ఇతను
అద్భుతంగా తప్పించుకున్నారు, కానీ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో నాస్తికుడు ఐన వీరి తండ్రి ఆమె రక్షింపబడడం కోసం హృదయ పూర్వకంగా ప్రార్థించగా బాబా దర్శనం లభించింది. తల్లి ప్రాణాలతో బయటపడిందని ఈ సంఘటన కుటుంబము మొత్తాన్ని స్వామివారి ఒడిలోకి తెచ్చిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రాక్టీషనరు మరియు అతని తోబుట్టువులు చిన్న వయస్సు నుండే సేవను ప్రారంభించి, స్థానికంగా మరియు పుట్టపర్తిలో సేవాదళ్ గా పనిచేశారు.
1996 లో వీరి తల్లిదండ్రులు ఇద్దరూ ఐదు నెలల వ్యవధిలో క్యాన్సర్‌తో మరణించడం ఖరీదైన అల్లోపతి చికిత్సకు ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి వీరికి మార్గనిర్దేశం చేయడంలో కీలకమైనది. అనేక సంవత్సరాలుగా, వీరు సమయం మరియు అవకాశము చిక్కినప్పుడల్లా, ఆయుర్వేదం, ప్రాణాయామం, ధ్యానం, సూర్య బింబము పై దృష్టి సారించడం, మొదలైన వాటి ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై స్నేహితులకు మరియు పరిచయస్తులకు ఉచిత సలహాలను అందించసాగారు. అయినప్పటికీ, వీరికి సంతృప్తి కలుగలేదు, ఎందుకంటే ఈ మార్గంలో పురోగతీ లేదు, సేవను కొనసాగించనూ లేనిస్థితి.2014 డిసెంబర్ లో, తన తోటి సాయి భక్తుడి నుండి వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు, తక్షణమే దానిని భగవంతుని పిలుపుగా గుర్తించారు. పర్యవసానంగా, తను కోర్సులో చేరి 2015 ఏప్రిల్ లో AVP గా అర్హత సాధించారు, మరియు 2016 మార్చిలో VP గా పదోన్నతి పొందారు.2016 డిసెంబర్ 31 న SVP కోసం తన అధికారిక దరఖాస్తును సమర్పించారు. మరుసటి రోజు జనవరి 1 న , వీరి కుమార్తె స్వామికి ప్రసాదం సమర్పిస్తున్న సందర్భంలో వీరి అపార్ట్‌మెంట్ పైకప్పు మొత్తం పెద్ద నీటి బిందువులతో కప్పబడి ఉండటం గమనించారు. పై కప్పు లీక్ అవుతుందేమో అని ఆందోళన చెంది తనిఖీ చేయడానికి ఒక ప్లంబర్‌ను పిలిపించారు. కానీ ఎటువంటి లీక్ కనుగొనబడలేదు, అంతేకాక తను నివశిస్తున్న రెండు స్వంత అపార్ట్‌మెంట్‌లలోనూ, పైన మరియు దిగువన ఎలాంటి సమస్య లేదు. అప్పుడే అది స్వామి అనుగ్రహించిన అమృతం (దివ్యఅమృతం) అనివారు గ్రహించారు. తను SVP కి దరఖాస్తు చేసుకున్నందుకు ప్రతిస్పందనగా స్వామి అందించిన ఒక గొప్ప ఆశీర్వాదంగా భావించారు. ఈ రోజు వరకు కూడా, ఈ అమృత బిందువులు గోడలపైకి జాలువారుతున్న గుర్తులు ఉన్నాయి. 2017 నవంబర్ లో వారు SVP కోర్సును పూర్తి చేసారు, మరుసటి సంవత్సరం, వైబ్రియోనిక్స్ సేవకు పూర్తి సమయం కేటాయించడం కోసం ముందస్తు పదవీ విరమణ పొందారు.
ఈ రోజు వరకు, వీరు 4500 మంది రోగుల వైవిధ్యమైన వ్యాధులకు చికిత్స అందించారు, ముఖ్యంగా క్యాన్సర్లు మరియు కణితులు, జీర్ణ రుగ్మతలు, స్త్రీ సమస్యలు, జ్వరాలు & అంటువ్యాధులు, నోరు మరియు తలకు సంబంధించిన సమస్యలు, SMJ సమస్యలు మరియు చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో 90% పైగా విజయాన్ని సాధించారు. వైబ్రియోనిక్స్ యొక్క ఆశావాహ ధృక్పధం మరియు దాని ఫలితంగా మానవజాతి సంక్షేమం గురించి అవగాహన ప్రజలలో పెరుగుతూ ఉండడంతో గరిష్ట సంఖ్యలో వ్యక్తులను చేరుకోవడానికి ఈ ప్రాక్టీషనరును ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ స్పూర్తే వీరి జిల్లాలో స్థానిక సాయి కేంద్రాల నుండి భక్తులు చురుకుగా పాల్గొనడంతో నెలవారీ శిబిరాలను ప్రారంభించడానికి దారితీసింది, మొట్టమొదటి క్యాంప్ 2016 జనవరి16 న వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ఒక బిజీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో జరిగింది. ఈ క్యాంపు ప్రాక్టీషనరు మరియు ఇతర వాలంటీర్లకు మొదటి అనుభవం ఐనప్పటికీ, వారు 8 గంటల వ్యవధిలో అన్ని వయసులకు చెందిన 80 మంది రోగులకు సేవలు అందించారు. ఇంతకంటే హృదయ పూర్వక సంతృప్తి నిచ్చేది ఇంకేమీ కావాలి?, రీఫిల్ కోసం వచ్చే రోగుల శాతం నిరంతరం పెరుగుతూనే ఉంది. ప్రతీ శిబిరంలోనూ, ఈ ప్రాక్టీషనరు స్వామి తాలూకు ఉనికిని అనుభవిస్తూ ఇది వీరిని ఎంతో ఆనందింప చేసేది. ఒక గుర్తింప దగిన కేసు ఏమిటంటే 60 ఏళ్ల వ్యక్తి కాలిపైన కాలిన గాయములతో రాగా CC10.1 Emergencies + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.4 Stings & Bites + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions, తో నెల రోజులలోనే 80% కోలుకోవడం, అతి త్వరలోనే పూర్తిగా కోలుకోవడం జరిగింది. వీరి అనుభవంలో 15 ఏళ్ల ఆస్తమా కేసుతో సహా కేవలం సింగిల్-డోస్ తోనే వ్యాధి నివారణ జరిగిన అనేక సందర్భాలను ని వేదిస్తున్నారు. ఒక సంవత్సరం నుండి చెవి నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి కేవలం ఒక డోస్‌తోనే వ్యాధి అదృశ్యమయ్యింది. వీరి పుట్టపర్తి సందర్శనల సమయంలో, ఇట్టి తక్షణ నివారణల కథలు విన్న తర్వాత భక్తులు వీరు సేవాదళ్ భవనంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు చికిత్స కోసం చుట్టుమూగేవారు. క్యాంపులలో రెమిడీల కోసం వచ్చే ప్రజలందరి అవసరాలు తీర్చడానికి తన వద్ద తగినంత సామాగ్రి లేదని స్వామిని వేడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ స్వామి ఎప్పుడూ తనకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. క్యాంప్ పరిస్థితులలో, సాధారణంగా జీర్ణక్రియ, SMJ, శ్వాసకోశ, చర్మం మరియు మానసిక సమస్యల కోసం త్వరగా మరియు సులభంగా పంపిణీ చేయడానికి ఎక్కువ కోంబోలు ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి. 2016 సెప్టెంబర్-అక్టోబర్ లో, ఢిల్లీలో చికున్‌గున్యా వ్యాప్తి సమయంలో, వీరు 150 కి పైగా కుటుంబాలకు ముందస్తు నివారణ కోసం రెమిడీ అందించి అద్భుతమైన ఫలితాలను పొందారు.
కామర్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంబీఏ డిగ్రీ మరియు సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్‌గా పని అనుభవం వీరిని అనేక అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లకు అద్భుతంగా సరిపోయేలా చేసింది. ఈ ప్రాక్టీషనరు తన సీనియర్ల నుండి అపారమైన ప్రేమ, మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలు పొందడం తన అదృష్టంగా భావిస్తున్నారు. డాక్టర్ అగర్వాల్ ఒకసారి వీరితో “సేవ చెయ్యాలంటే రెండు విషయాలు చాలా ప్రధానం - సమయము మరియు భక్తి అవి రెండూ నీకు ఉన్నాయి” అన్నారు. ఈ ప్రోత్సాహ పూరిత వాక్కులు తనతో పదిలంగా ఉంచుకొని గత ఐదు సంవత్సరాలుగా, వీరు అనేక అడ్మిన్ విధులు నిర్వహిస్తూ వచ్చారు; కొన్నింటిని ప్రస్తావించడం కోసం, మెంటరింగ్(కొత్త ప్రాక్టీషనర్లకు మార్గదర్శకత్వం), డేటాబేస్ నవీకరణ, ప్రాంతీయ సమావేశాలను నిర్వహించడం, AVP మాన్యువల్ యొక్క హిందీ అనువాదాలలో సహాయం చేయడం, భూగోళము పై శాంతిని నెలకొల్పడానికి తలపెట్టిన ప్రపంచ శాంతి హీలింగ్ ప్రక్రియ భారత దేశంలో ప్రారంభించేటట్లు చేయడం, కొత్త వెబ్‌సైట్ అభివృద్ధికి సహాయపడటం, మరియు విషూచిక పరిశోధన ప్రాజెక్ట్‌లో పాల్గొనడం. వీటిలో ప్రతీ ఒక్కటి వీరికి ఒక అభ్యాస అనుభవం కల్పించింది. 2016 ప్రారంభంలో, వీరు నెలవారీ నివేదికల కోసం ఫాలో అప్ సేవను చేపట్టారు. ఈ అడ్మిన్ సేవ వీరిని వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు మానవ మనస్తత్వశాస్త్రంపై అంతర్దృష్టితో కూడిన ప్రయాణం చేయిస్తుందని మొదట్లో గ్రహించలేదు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, అతను ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు. ఇది వీరి జీవితంలో ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకునేలా చేసింది: "వ్యక్తులు మరియు పరిస్థితులతో వ్యవహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది ప్రేమతో సాధించడం, అప్పుడు ఎవరైనా ఏదైనా లక్ష్యాన్ని సాధించవచ్చు". ఈ విషయంలో అకుంఠిత దీక్షతో చేసిన వీరి నిరంతర ప్రయత్నాలు ఎంతగానో ఫలించాయి, డిసెంబర్ 2016 నాటికి వీరి జాబితాలో ఉన్న ప్రాక్టీషనర్లు అందరూ గడువు తేదీకి ఒక రోజు ముందే వారి నెలవారీ నివేదికలను సమర్పించసాగారు.
బ్రాడ్ కాస్టింగ్ (చికిత్సా కంపనాల ప్రసారం) చేసే బాధ్యత ఇవ్వబడడంతో ఇది వీరిని స్వామికి దగ్గరగా తీసుకు వెళ్లడానికి మరియు స్వామితో దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడింది. స్వచ్ఛమైన ప్రేమతో ఈ సేవ చేస్తే 95% కంటే ఎక్కువ విజయవంతమైన ఫలితాలను పొందవచ్చని వీరు కనుగొన్నారు. చాలా మంది ప్రాక్టీషనర్లు, బ్రాడ్ కాస్టింగ్ యొక్క నిజమైన సామర్థ్యాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు. ఈ మహమ్మారి సమయంలో, వీరు సుమారు 100 కోవిడ్ -19 రోగులకు ప్రసారం చేసి అద్భుత ఫలితాలు పొందారు. 2020 జనవరి లో వీరు వైబ్రియోనిక్స్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ అయ్యారు, మరియు IASVP డైరెక్టర్ నాయకత్వంలో ఇమ్యునిటీ బూస్టర్ (IB) అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఆరుగురు ఇతర SVP లతో కూడిన ప్రాజెక్ట్ ద్వారా 2020 మార్చి నుండి IB అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. (ఇప్పటి వరకు IB గ్రహీతల సంఖ్య 487,089).
వ్యక్తిగతంగా, వీరు ప్రతీరోజూ 'హార్ట్‌ఫుల్‌నెస్' ధ్యానాన్ని అభ్యసిస్తారు, దీనిలో స్వామికి హృదయపూర్వక ప్రార్థనలు జరుగుతాయి, ఫలితంగా మనస్సును దాటి హృదయం నుండి ప్రేమ ప్రకంపనలు పంపబడతాయి. లోలోపల జరుగుతున్న సంఘర్షణ పరిష్కారానికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగకరంగా ఉందని వీరు కనుగొన్నారు; దీనికీ అదనంగా 'క్షమాపణ టెక్నిక్' కూడా చేర్చి దీనిలో సంవత్సరాలుగా తనను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని తనతో సహా జాబితా చేసి స్వామి నుండి క్షమాపణ కోరి ఆ జాబితాను కాల్చివేయడం. ఇది వీరికి తక్షణ ఉపశమనాన్ని విడుదలను ఇస్తుంది. ఈ పద్ధతులు రోగుల సేవ చేసే సమయంలో సుదీర్ఘ కాలం దృష్టి పెట్టడానికి ప్రత్యేకించి ప్రసార సమయంలో ఏకాగ్రత నిల్పడానికి వీరికి సహాయం చేసాయి. 2017 లో స్వామి జన్మదినం సందర్భంగా, పుట్టపర్తిలో ఉన్నప్పుడు, అతను తన మూలాధార చక్రం ఆక్టివేషన్ అయినట్లు భావించారు, తద్వారా పరిసరాలపై మరింత అవగాహన, భవిష్యత్తుపై మరింత విశ్వాసం మరియు స్వామితో సాన్నిహిత్యం అనుభవించారు.
ఒక ప్రాక్టీషనరుగా, వీరు స్వామి మార్గదర్శకత్వం మరియు దయతో మానవాళికి సేవ చేసే అవకాశాన్ని పొందినందుకు అదృష్టంగా భావిస్తున్నారు. దీని ద్వారా వీరు భౌగోళిక సరిహద్దులకు మించి రోగులకు చికిత్స చేయగల సామర్ధ్యం చేకూరినట్లు భావిస్తారు. స్వామి యొక్క సరళమైన మరియు గాఢమైన సూక్తి ‘అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి’ మరియు ‘ఎల్లప్పుడూ సహాయపడండి, ఎవ్వరినీ బాధించ వద్దు’ ఈ ప్రాక్టీషనరుకు మార్గదర్శకత్వం మరియు స్ఫూర్తినిస్తూ తన ఉదారత మరియు సామర్ధ్యాలను ఉపయోగించు కోవడానికి ఎప్పుడు పిలిచినా తన ఆకట్టుకునే సేవను విస్తరిస్తూనే ఉంటారు.
భాగస్వామ్యము వహించిన కేసులు :