ప్రాక్టీషనర్ల వివరాలు 02493 & 02858...Syria
సిరియాలో సాయి వైబ్రియోనిక్స్ సేవలో చురుకుగా పాల్గొంటున్న ముగ్గురు వైద్య సహోదరులను వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ల బృందంగా ప్రొఫైల్ చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ చిన్న సమూహం యొక్క నాయకుడు 17 సంవత్సరాలుగా వైబ్రియోనిక్స్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఇటీవలే అతను స్వామి ఫోల్డు లోనికి తీసుకువచ్చిన దంపతుల జంట, రోగుల భారాన్ని వహించడంలో గణనీయమైన భాధ్యత తీసుకున్నారు.
ప్రాక్టీషనర్ 02493…సిరియా ఇప్పటి వరకూ 12 సార్లు స్వామిని సందర్శించిన ఈ దంతవైద్యుడు, మొట్టమొదట 2003 లో తన మొదటి దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి అతను అరబిక్ ప్రపంచంలో స్వామి సందేశాన్ని మరియు బోధలను ప్రచారం
చేస్తున్నారు. అతను తన ఉపన్యాసాలు, పుస్తకాలు, సభలు, ధ్యాన శిబిరాలు, వైద్య శిబిరాలు మరియు అనేక ఇతర కార్యకలాపాల ద్వారా ప్రజలలో అవగాహన పెంచడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు, నిజం చెప్పాలంటే అక్షరాలా ప్రపంచంలోని ఒక చీకటి ప్రాంతంలో కాంతి రేఖల కోసం పోరాడుతూనే ఉన్నారు. అంకిత భావంతో పనిచేసే ఈ ప్రాక్టీషనరు మరియు అతని సాయి బృందం దార్ అల్ సలాం (శాంతి నివాసం) అనే ఒక చక్కటి సాయి సెంటర్‌ను స్థాపించి ఇక్కడ వారు రోగులకు చికిత్స చేయడమే కాకుండా, అల్పాదాయ ఆర్ధిక వనరులు కలిగిన వారికి అవసరమైన కిరాణా సామగ్రి మరియు దుస్తులను పంపిణీ చేస్తారు, పర్యావరణ పరంగా అవసరమైన సూచనలు కూడా అందిస్తారు. దయ మరియు ప్రేమాభిమానాలతో మతపరమైన వ్యత్యాసాలను పట్టించుకోకుండా, వివక్ష లేకుండా మానవ విలువలను బోధిస్తారు.
అతను సేవాదళ్ గా పనిచేస్తున్న పుట్టపర్తి జనరల్ హాస్పిటల్‌లోని వైద్యులలో ఒకరి నుండి వైబ్రియోనిక్స్ గురించి మొదటి సారి తెలుసుకున్నారు. 2004 లో తన తదుపరి ప్రశాంతి నిలయం సందర్శనలో వైబ్రో శిక్షణ పొందారు. అప్పటినుండి అతను సమస్యల సుడిగుండముగా ఉండే సిరియా!లో స్థిరంగా మరియు ధైర్యంగా సేవలను అందిస్తున్నారు. తను అన్ని స్థాయిలలో స్వామి నుండి పొందుతున్న అపార కరుణ మరియు వైబ్రియానిక్స్ సాధనంగా పొందుతున్న ఆనందం మరియు ప్రగాఢ సంతృప్తి గురించి తెలుపుతూ ఉంటారు. వైబ్రియోనిక్స్ అభ్యసించడం మరియు తనను తాను స్వామికి ఉపకరణంగా భావించి తాను అంతర్లీనంగా పొందుతున్న ప్రేమను ప్రసరింప జేయడం గురించి తెలియజేస్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తముగా ఉన్న దివ్యప్రేమ సాధకుల సమాజంతో కలిసి పనిచేసే ఒక సభ్యుడిగా ఉంటూ ఆ దివ్యశక్తి చేత అందరూ బలోపేతం అవుతూ వృద్ధి చెందాలని భావిస్తున్నారు.
స్వామి యొక్క అపార అనుగ్రహంతో పునీతమైన హృదయంతో వారు ఇలా వాస్తున్నారు."ప్రాక్టీషనర్లుగా మనము పూర్తి విశ్వాసాన్ని పెంపొందించుకుంటే, ఒక స్పర్శతో, ఒక మాటతో లేదా ప్రేమమయ వీక్షణతో రోగులకు స్వస్థత చేకూర్చగలమని నేను పూర్తిగా నమ్ముతున్నాను." రోగులకు చికిత్స చేసేటప్పుడు, ఈ ప్రాక్టీషనరు వ్యాధికి గల కారణాన్ని అంచనా వేసే సమగ్ర విధానాన్నిపాటిస్తూ అవసరం మేరకు కౌన్సిలింగ్ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై సలహాలను కూడా ఇస్తూ ఉంటారు. ఒక చక్కని ఉదంతాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. 32 ఏళ్ల మహిళ తన భర్తతో సమస్యల కారణంగా ఏర్పడిన ఆందోళన వలన ఎనిమిది నెలలుగా కడుపు నొప్పి మరియు విరేచనాలతో బాధపడుతున్నారు. ఐబిఎస్ అని నిర్ధారణ అవడంతో ఆమెకు ఫైబర్ సప్లిమెంట్స్ సూచించబడ్డాయి కానీ ఇవి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుందనే ఆమె భయాలను తొలగిస్తూ ఈ వైద్య ప్రక్రియలో తన భర్తపట్ల ఉన్న వ్యతిరేక భావం తొలగించుకొని అతనిని అంగీకరించడం ద్వారా ఆమె ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ప్రాక్టీషనరు ఆమెకు వివరించి చెప్పారు. అలాగే ఆమె తీసుకునే కాఫీలో ఉన్న కెఫిన్ ప్రేగుల చలనాన్ని ప్రేరేపిస్తున్నందున తను కాఫీ తీసుకోవడం 2-3 కప్పుల నుండి రోజుకు ఒకకప్పుకు తగ్గించాలని ఆమెకు సూచించారు. CC4.6 Diarrhoea + CC15.1 Mental & Emotional tonic, తో ఆమె 6 వారాల్లో వ్యాధి నుండి ఉపశమనం పొందారు. ఆమె అభ్యాసకుడిని కలిసినప్పుడల్లా సమస్యలనుండి ఉపశమనం మరియు జీవితానికి కొత్త అర్ధం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు.
తమ సాయి సెంటరు వారు ఉంటున్న ప్రాంతంలో శాంతి, ప్రేమ మరియు అహింసను వ్యాప్తి చేయడానికి ఒక బృహత్తరమైన సాయి వైబ్రియోనిక్స్ వైద్య సాధనంగా రూపుదిద్దుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక పెద్ద సాయుధ సైనిక బృందం నగరంపై దాడి చేసి 35 మంది డెనిజెన్లను అరెస్టు చేయాలని భావించినప్పుడు ఒక భయానక ఘటన తటస్థించింది. సాయుధ బలగం వారి కేంద్రానికి చేరుకున్నప్పుడు, అతను "స్వామి మా కేంద్రాన్ని అపారమైన వైబ్రో మెషీన్‌గా ఉపయోగించుకుంటున్నారు నేను కూడా దీనిలో ఒక అంతర్భాగమే” అని భావించారు. ఒక గంటలోపు ఎవరూ గాయపడకుండా సమస్య పరిష్కరించబడింది. మొత్తం సైనిక బృందం అనుకోకుండా ఉపసంహరింపబడింది!
చివరిగా ప్రాక్టీషనర్ ఈ ప్రేరణాత్మక భావనతో ముగిస్తున్నారు. "వైబ్రియోనిక్స్ సేవ భిన్నత్వంలో ఏకత్వాన్ని గ్రహించడానికి మరియు అనుభవించడానికి, ప్రతి ఒక్కరితో ఏకత్వాన్ని అనుభూతి చెందడానికి మరియు ప్రతిదీ ఆ దైవ సంకల్పమే అని ధృఢంగా విశ్వసించడానికి నాలో పరివర్తన కలిగించి హృదయాన్ని విస్తరింప జేసింది. " ప్రేమపూర్వక సేవ ఇవ్వడం ద్వారానే స్వీకరించ గలుగుతుందని, నిజానికి ఇచ్చేదీ స్వీకరించేది ఒకటే అనే అద్బుతమైన సత్యాన్ని వీరు గ్రహించారు. .
పంచుకున్న కేసులు :
ప్రాక్టీషనర్స్ 02858…సిరియా ఒక ENT స్పెషలిస్ట్ మరియు అతని ఫార్మసిస్ట్ భార్య, 2003 లో ప్రాక్టీషనర్02493.ద్వారా మొదట స్వామి గురించి తెలుసుకున్నారు. ప్రతి వేసవిలో భారతదేశం నుండి తిరిగి వచ్చే తమ దేశపు చిన్న బృందమును కలవడానికి వారి
పర్యటన వివరాలను వినడానికి, స్వామి గురించి మరింత తెలుసుకోవడానికి మరియు స్వామి దర్శనం యొక్క వీడియోలను చూడడానికి అలా తమ ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి ఎంత అసహనంతో ఎదురుచూస్తూ ఉండేదో వారికి ఇప్పటికీ వారి స్మృతులలో పదిలంగా ఉన్నాయి. ఈ తీర్థయాత్రల గురించి వారు చెప్పే ప్రతీ విషయమూ వీరిలో ఎంత ఆసక్తి నింపేదో వీరి శ్రీమతి గుర్తుచేసుకుంటున్నారు. నిజంగా స్వామి కథల ద్వారా వీరు అమృతాన్నే గ్రోలేవారు. చివరగా వీరి బృందానికి 2012 లో ప్రశాంతినిలయాన్ని సందర్శించే అవకాశం లభించింది. ఆర్థిక పరిమితులు ఉన్నందున కొద్దిమంది మాత్రమే ఈ యాత్ర చేయగలిగారు. స్వామి ఇటీవలే తమ దేహ పరిసమాప్తి చేసినప్పటికీ, ఆశ్రమంలో ఉన్నప్పుడు, వారి ఉనికి "శాశ్వత శాంతి, ప్రేమ మరియు ఆనందం రూపంలో వ్యక్తమవుతూ ఆ ప్రదేశం అంతా కంపిసృన్నట్లు వీరు అనుభూతి పొందారు."
ఒకసారి ఈ బృందం యొక్క నాయకుడు వీరిని డాక్టర్ అగర్వాల్ గారిని కలవడానికి తీసుకు వెళ్ళగా అంతర్యుద్ధం తో అస్థవ్యస్థంగా ఉన్న సిరియా నుండి అటువంటి సమయంలో వచ్చిన ఈ ఆరోగ్య నిపుణులను ఆనందంగా ఆదరించారు. వారికి వైబ్రియోనిక్స్ నేర్చుకునే అవకాశం లభించింది. భర్త వెంటనే కోర్సులో పేరు నమోదు చేసుకున్నారు. ఐతే ఇది ఒక అరుదైన అవకాశం అయినప్పటికీ ఇద్దరు చిన్న కుమార్తెలకు సంరక్షణ అవసరం మరియు మరొక బిడ్డ కడుపులో ఉండడం కారణాల చేత భార్య కొంత సంకోచించారు. వైబ్రియోనిక్స్ యొక్క ప్రయోజనాలను ఆమె అప్పటికే అనుభవించి ఉండడం కారణము చేత "వచ్చే వేసవిలో నేను కోర్సు చేస్తాను” అని అగర్వాల్ గారికి చెప్పారు. డాక్టర్ అగర్వాల్ తన “ప్రస్తుత సమయం యొక్క గణ్యత “ద పవర్ ఆఫ్ నౌ ” గురించి ఉటంకిస్తూ, భవిష్యత్తులో ఆమె ఎలా రాగలదని భావిస్తున్నారో ఖచ్చితంగా చెప్పవలసిందిగా అడిగారు. సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా వారు ఈ సందేహం వ్యక్తం చేసారు. ఒక సంవత్సర కాలం ఆమె తన నెల వారీ బహిష్టు ముందు 7-10 రోజులు అసహనం, ఆతృత, విచారము, నీరు చేరడం, రొమ్ములో నొప్పి, తలపోటు వంటి వాటితో బాధపడ్డారు. నొప్పి నివారణలు మరియు వేదనా నివారణలు ఎక్కువగా వాడడం వలన వాటికి బానిస అవుతాననే భయంతో వీటిని ఆపివేసి చివరికి తన ఆత్మ సంతృప్తి మేరకు కోర్సు తీసుకున్నారు. సహజమైన మార్గాలతో వైద్యం చేయాలన్న ఆమె చిరకాల స్వప్నం చివరకు నెరవేరిందని గ్రహించినప్పుడు అపారమైన కృతజ్ఞతతో నిండిపోయారు.
ఈ ప్రాక్టీషనర్ జంట తమ రోగులకు అల్లోపతి మందులతో పాటు సానుకూల ఆలోచన మరియు భావోద్వేగ సంరక్షణతో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో వైబ్రియోనిక్స్ లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. చికిత్స అనేది శరీరము, మనస్సు మరియు ఆత్మ అనే మూడు స్థాయిలలో ఉంటుందని వారు కనుగొన్నారు. ఇది వారి జీవితంలో ఒక ప్రకాశవంతమైన కొత్త అధ్యాయాన్ని తెరిచి, వైబ్రియోనిక్స్ ద్వారా స్వామి మరియు వారి మిషన్‌తో నిరంతర సాన్నిహిత్యాన్ని అనుభవించేలా చేసింది.
సిరియాకు తిరిగివచ్చిన ఈ జంట తమ సాయి సెంటర్‌లో ఒక బృందంగా పనిచేస్తూ సంక్షోభం నెలకొన్న ఈ విపత్కర సమయంలో చాలా మంది రోగులకు చికిత్సను మరియు వారి సహాయ సహకారాలను అందించారు. ఈ సరళమైన మరియు పూర్తి ఉచితముగా చేసే చికిత్సను ఎంతో మంది ప్రజలు, ముఖ్యంగా యుద్ధకాల పేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఎంతో మెచ్చుకుని బహిరంగంగా తమ కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి సంప్రదాయ ఔషధం వారి రోగులలో చాలా మంది విషయంలో విఫలమైంది. ఈ జంట వారి కుమార్తెలు చాలా చిన్నవయస్సులో ఉన్నప్పటి నుండి కూడా తలనొప్పి, కడుపు నొప్పి, జలుబు లేదా జ్వరం యొక్క ఏదైనా సంకేతాన్ని చూపించిన వెంటనే వారికి నీటిలో రెమిడీలు ఇవ్వగానే వారు అరగంటలో ఉపశమనం పొందేవారు. మానసిక రుగ్మతలతో ముఖ్యంగా సమకాలీన సిరియన్ సమాజంలో తరుచూ వేధింపులకు గురి అయ్యే మహిళల విషయంలో CC15.1 Mental & Emotional tonic లేదా CC15.2 Psychiatric disorders తో అద్భుత విజయాలను సాధించారు.
ఈ సందర్భంగా వారు మనతో కొన్ని కేసులను భాగస్వామ్యం చేస్తున్నారు.33 ఏళ్ల యువతి సంవత్సర కాలంగా ప్రి మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కారణంగా చికాకు, ఆందోళన, నీరు చేరుట(ఒడెమా), ఛాతీలో నొప్పి, తలపోటు వంటివి ఆమె నెలసరికి 7-10 రోజుల ముందు నుండి కలుగుతూ ఉండడంతో ఎంతో బాధపడుతున్నారు. అలోపతి నొప్పి నివారణలు, ఆందోళన నివారణలు 6 నెలల పాటు కొనసాగించి వాటికి అలవాటు పడడం జరుగుతుందేమో అనే భయంతో ఆపివేయడం జరిగింది. ఆమెకు CC8.6 Menopause + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic, తో చికిత్స ప్రారంభించిన మొదటి పీరియడ్ లోనే 70-80% ఉపశమనం పొందారు. ఆమె పూర్తి నివారణ కోసం 6 నెలలు చికిత్స కొనసాగించారు. మరొక కేసు విషయంలో 35 ఏళ్ల మహిళ 54 సంవత్సరాల వ్యక్తిని వివాహం చేసుకొని ఒక సంవత్సర కాలంగా వేచి చూసి తనకి ఇక పిల్లలు పుట్టరేమో అని భయపడుతూ ఉండేవారు. CC8.1 Female tonic + CC15.1 Mental & Emotional tonic వాడిన కొద్ది రోజులకే ఆమెకు ఉపశమనం కలగడంతో పాటు నెల లోపే గర్భం దాల్చింది.
ఈ ప్రాక్టీషనర్లు సాధారణంగా రోగుల చికిత్సకోసం తమని సంప్రదించినప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి యొక్క ప్రయోజనాలను చర్చిస్తారు. 40 ఏళ్ల వ్యక్తికి మూడేళ్లుగా తీవ్రమైన మలబద్ధకం ఉంది. అతను ప్రతి 3 నుండి 4 రోజులకు అసంపూర్తి మల విసర్జన తో పాటు కడుపు నొప్పి మరియు ఉబ్బరం కూడా కలిగి ఉన్నారు. పరిమిత ఉపశమనం కలిగించే భేదిమందులపై ఆధారపడటానికి అతను ఏమాత్రం ఇష్టపడలేదు. సమతుల్య ఆహారం, సమయానికి భోజనం తినడం, తగినంత నీరు తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రాక్టీషనర్లు అతనితో చర్చించారు. CC4.4 Constipation + CC4.10 Indigestion + CC12.1 Adult tonic, తీసుకున్న రెండు రోజుల తరువాత మలవిసర్జన సమయంలో నొప్పి తక్కువ ఉండడం, ఒక వారం తరువాత ఎటువంటి నొప్పి లేకుండా మల విసర్జన చేయ గలగడం ఏర్పడింది. మోతాదును 6 నెలలలో క్రమంగా OW కి తగ్గించడంతో అతను పూర్తిగా కోలుకున్నాడు. సంవత్సరం తరువాత అతనిని సంప్రదించినపుడు, రోగపునరావృతం లేకుండా చక్కగా ఉన్నాడు.
రోగులకు హృదయపూర్వకంగా సహాయం చేయాలనే ఆకాంక్షతో వైబ్రియానిక్స్ తో పనిచేసేటప్పుడు స్వామికి శరణాగతి చేయడం ద్వారా సానుకూల ఆలోచనల శక్తిని అనుభవిస్తున్నట్లు ఈ ప్రాక్టీషనర్లు కనుగొన్నారు. రోగుల వ్యధలను జాగ్రత్తగా వినడం అనే విధానం నేర్చుకోవడం ద్వారా వారు చికిత్స చేసే ప్రక్రియలో ఆశ మరియు సహాయాన్ని పునరుద్ధరించే ప్రోత్సాహకరమైన పదాలను రోగులకు అందించ గలిగారు. స్వామి మిషన్ లో పాల్గొనడం వారిని ప్రజలకు దగ్గర చేసి మరింత కరుణ మరియు అవగాహన కలిగించింది. చివరిగా ఈ జంట స్వామికి వారి హృదయాలను పరిశుద్ధ పరుచు కోవడానికి, తద్వారా వారి ఆత్మను అధ్యాత్మిక ప్రయాణంలో స్థిరంగా ముందుకు తీసుకు వెళ్లడానికి సహాయ పడినందుకు స్వామికి మరియు వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పంచుకున్న కేసులు :
- పెరిన్నియల్ అలెర్జిక్ రినిటీస్ (శాశ్వత నాసికా శ్లేష్మ పొర అలెర్జీ)
- పోలిసిస్టిక్ ఒవెరియన్ డీసీజ్ PCOD