హెర్పెస్ జోస్టర్ (సర్పి) 02493...Syria
45 ఏళ్ల మహిళకు పొత్తికడుపుపై ఎర్రటి దద్దుర్లు వచ్చాయి, అవి కొన్ని రోజుల తర్వాత భరించలేని బాధాకరంగా మారాయి. దద్దుర్లు ఉన్న ప్రాంతంలో దురద మరియు మండుతున్న అనుభూతి ఉండి ఈ ప్రాంతం తాకడానికి కూడా ఇబ్బందిగా ఉంది. 2018 ఏప్రిల్ మధ్యలో ఇది హెర్పెస్ జోస్టర్(సర్పి) గా వైద్యుని చేత గుర్తించబడింది. ఆమె ఒక నెల పాటు అల్లోపతి మందులు తీసుకున్నారు కానీ నొప్పిలో ఏమాత్రం ఉపశమనం కలగక పోగా తీవ్రం కావడంతో ప్రత్యామ్నాయ చికిత్స కోసం ఆమె ముందుకు వచ్చారు. ఒకసారి ప్రాక్టీషనరు చేసిన వైబ్రియోనిక్స్ ఉపన్యాసానికి ఆమె హాజరయ్యే అవకాశం కలిగింది. వెంటనే ఆమె 2018 మే 18 న వారిని సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది.
CC15.1 Mental & Emotional tonic + CC21.8 Herpes…TDS
రెండు వారాల్లో, నొప్పిలో గణనీయమైన మెరుగుదల కలగడంతో వైబ్రియోనిక్స్ యొక్క ప్రయోజనకరమైన ప్రభావంతో ఆమె స్పూర్తి పొంది అల్లోపతి మందులు తీసుకోవడం మానేసారు. మరో రెండు వారాల తరువాత, నొప్పిలో 75% ఉపశమనం ఏర్పడింది. సెప్టెంబర్ 20 నాటికి, ఆమె పరిస్థితి పూర్తిగా సాధారణమైంది. నవంబర్ చివరలో నివారణను ఆపే ముందు మోతాదును BD కి మరియు మరో నెల తరువాత OD కి తగ్గించారు. ఆమె అప్పటి నుండి బాగానే ఉంది మరియు వైబ్రియోనిక్స్ పై మరిన్ని ఉపన్యాసాలకు హాజరుకావడం ప్రారంభించారు. చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా ఆమె ప్రాక్టీషనరును సంప్రదించసాగారు.
సంపాదకుని వ్యాఖ్య : సర్పి యొక్క మంట చాలా బాధకారంగా ఉండి బలహీన పరుస్తుంది. అంతేకాకుండా దద్దుర్లు తగ్గిన తరువాత కూడా చాలా నెలలు కొనసాగుతుంది.