పోలిసిస్టిక్ ఒవెరియన్ డీసీజ్ PCOD 02858...Syria
44 సంవత్సరాల మహిళ గత 3 నెలలుగా క్రమ రహితమైన నెలసరి బహిష్టు, అధిక రక్తస్రావము, గడ్డము మరియు ముఖం మీద వెంట్రుకలు రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు అండాశయాలలో తిత్తులతో పాటు PCOD సమస్య ఉన్నట్లు గుర్తించ బడింది. గైనకాలజిస్ట్ ఆమెను హార్మోన్ చికిత్స చేయించుకోవలసిందిగా సూచించారు. ఆలోపతి మందుల దుష్ప్రభావాల గూర్చి తెలిసిఉండడం మూలాన ఆ మందులు వాడడం లేదా శస్త్ర చికిత్స చేయించుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె తన స్నేహితురాలు ఆందోళన, భయం నిమిత్తం వైబ్రియానిక్స్ చికిత్స తీసుకొని విజయవంతంగా తగ్గించుకోగలగడం గురించి తెలుసుకున్నారు. అందుచేత వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆమెకు 2017 ఆగస్ట్ 30 వ తేదీన, క్రింది రెమిడీ ఇవ్వబడింది.
CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent...TDS
వైబ్రో రెమిడీ తీసుకున్న తరువాత మొదటి నెలసరి బహిష్టు సరియైన సమయనికే వచ్చింది కానీ రక్తస్రావం కాస్త ఎక్కువగానే ఉంది. రెండవ నెలసరి సమయానికి రావడమే కాక రక్తస్రావం సాధారణ స్థితికి చేరుకుంది. అల్ట్రాసోనిక్ పరీక్షలో ఆమె అండాశయాలలో తిత్తులు పూర్తిగా అదృశ్యమైనట్లు నిరూపణ అయ్యింది. మోతాదు అక్టోబర్ 30 వరకు TDS గా కొనసాగించి అనంతరం క్రమంగా తగ్గిస్తూ డిసెంబర్ 11 నాటికి ఆపివేయడం జరిగింది. రెండు నెలల తరువాత ఆమె తనకు అంతా సాధారణ స్థితిలోనే ఉందని గడ్డము మరియు ముఖంలో వెంట్రుకలు పూర్తిగా అదృశ్యమయ్యాయని తెలిపారు. సంవత్సరం తరువాత కూడా వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు.