ప్రాక్టీషనర్ల వివరాలు 02814...India
ప్రాక్టీషనర్ 02814...ఇండియా పెర్సనల్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేసి ఇ ఉద్యోగవిరమణ పొందిన వీరు సైన్స్ లో డిగ్రీ తోపాటు ఫార్మకాలజీ లో డిప్లమా కూడా పొందారు. 1968 లో తన తండ్రి స్నేహితుడి నుండి స్వామి ఫోటోలు అందుకున్నప్పుడు స్వామి గురించి మొదటిసారిగా విన్నారు. తర్వాత అతను ప్రతీరోజూ బాబాను ప్రార్థించడం ప్రారంభించి 1972 స్వామి దర్శనం పొందడం అదృష్టంగా భావిస్తున్నారు. తర్వాత అతను సత్య సాయి సేవా సంస్థలలో చురుకైన సేవాదళ్ సభ్యుడు అయ్యారు. రాష్ట్ర సమన్వయకర్తగానూ, హర్యానా & చండీఘర్ రాష్ట్రాలకు ప్రశాంతి సెక్యూరిటీ PS సభ్యునిగా, బాలవికాస్ జోనల్ కోఆర్డినేటర్ గా, డిజాస్టర్ మేనేజ్మెంట్ లోనూ మరియు అధ్యాత్మిక, విద్య, సేవా విభాగాల అధ్యాపక బృందంలో ఫేకల్టీ మెంబరుగా పనిచేశారు నాలుగు జిల్లాలకు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్న వీరు ఇటీవల కోవిడ్ పరిస్థితి కారణంగా రెండింటిని వదులుకున్నారు. పుట్టపర్తిలో తన ఆశ్రమ విధులు పూర్తి చేసిన తర్వాత 2011 మార్చి 23 న స్వామి కేవలం సేవాదళ్ కు మాత్రమే ఇచ్చిన చివరి ఆశీర్వాదం సందర్భంలో దానిని అందుకోవడం తన అదృష్టంగా ప్రాక్టీషనరు భావిస్తున్నారు.
2010 మే నెలలో రిషికేశ్ లో జరగబోయే AVP శిక్షణ కోసం నిర్దేశించిన ఒక ప్రకటన వారు చూసారు. వెంటనే దాని కోసం సైన్ చేసి మూడు రోజుల కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత AVP అయ్యి 54CC బాక్సుతో తన అభ్యాసం ప్రారంభించారు. 2010 అక్టోబర్లో పుట్టపర్తిలో తన రెగ్యులర్ సేవ కోసం వెళ్లినప్పుడు అతను VP శిక్షణా కార్యక్రమంలో చేరి కొత్తగా విడుదల చేసిన 108CC బాక్సును కూడా అందుకున్నారు. అర్హత దృష్ట్యా అకాలంగా అనిపించినప్పటికీ ఈ ప్రాక్టీషనరు యొక్క నిబద్ధత మరియు అంకితభావమునకు మెచ్చి డాక్టర్ అగర్వాల్ వీరిని ఉన్నత శ్రేణికి దరఖాస్తు చెయ్యమని సూచించగా 2011 మార్చిలో SVP అయ్యారు. వైబ్రియానిక్స్ లో పురోగతి సాధించాలనే వారి సంకల్పం ఎంత బలీయమైనది అంటే సీనియర్ స్థాయిలో కేవలం నాలుగు నెలల ప్రాక్టీస్ అనంతరం జూలై 2011 లో AVP టీచర్ అయ్యారు.
2009 నుండి అల్లోపతి ఔషధం తీసుకుంటున్న అధిక రక్తపోటు వ్యాధి నివారణ కోసం ప్రాక్టీషనరు తనకు తానే మొదటి పేషంటు అయ్యారు. 2010 జూన్ లో CC3.3 High Blood Pressure (BP) తీసుకోవడం ప్రారంభించారు. ఆరు నెలలలో తను అల్లోపతి వైబ్రియానిక్స్ రెండింటిని మానివేసినప్పటికీ ఆ తరువాత 5 సంవత్సరాల వరకూ వారి బిపి సాధారణ స్థితిలోనే ఉంది. తరువాత బి.పి పెరగడం ప్రారంభమయ్యే సరికి క్రిందటి రెమిడీకి CC3.5 Arteriosclerosis జోడించడం ద్వారా మరో రెండేళ్లపాటు అదుపులో ఉంచగలిగారు. ఆ తర్వాత వీరికి రక్తపోటు నియంత్రణ కోసం స్వల్పంగా ఆలోపతి మందు అవసరం అయ్యింది. 18 సంవత్సరాల వయసునుండే సైనస్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా దీర్ఘకాలిక తలనొప్పి, ఛాతీ ఇన్ఫెక్షన్, మరియు జ్వరము కలగసాగాయి. ప్రాక్టీషనరు 2010 జులై నుంచి CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic తీసుకోవడం ప్రారంభించారు. కేవలం మూడు నెలలలోనే ఈ సమస్య పూర్తిగా నయం అయ్యింది. 2009లో జరిగిన ఒక ప్రమాదంలో స్నాయువు దెబ్బతినడంతో అది మెడ నొప్పికి కారణమైంది. ఒక సంవత్సరం ఆలోపతి చికిత్స తీసుకున్నప్పటికీ నొప్పి మరియు స్పాండిలైటిస్ నిరంతరాయంగా కొనసాగాయి కానీ CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine తో చికిత్స ప్రారంభించిన రెండు నెలల్లోనే ఈ సమస్యలు అదృశ్యమయ్యాయి. ఈ రెమిడీల యొక్క సామర్ధ్యము స్వయంగా అనుభవించడం వలన వీరి విశ్వాసము రాయి వలె ధృఢంగా బలపడింది.
ప్రాక్టీషనర్ అన్ని సమయాల్లో వైబ్రియానిక్స్ సేవ కోసం అందుబాటులో ఉంటారు. పగటిపూట వారి రోగుల నుండి టెలిఫోన్ ద్వారా విచారణలు స్వీకరిస్తారు. సాయంత్రం సమీపంలోని ఆలయంలో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతూ రెమిడీలు ఇస్తారు. పేషంట్లకు మరునాడు ఇవ్వడం కోసం ముందటి రాత్రి వారు రెమిడీలను సిద్ధం చేస్తారు. ప్రాక్టీషనర్ గత పదేళ్లలో 22 వేలకు మందికి పైగా అనేక రకాల ఆరోగ్య సమస్యల కోసం చికిత్స చేశారు. గ్రామీణ సేవా కార్యక్రమంలో మరియు సాయి ఆర్గనైజేషన్ నిర్వహించే వైద్య శిబిరాల్లో వైబ్రియానిక్స్ ను ప్రవేశపెట్టడంలో వీరు ముఖ్య పాత్ర పోషించారు. ప్రశాంతి సేవకోసము మరియు సేవాదళ్ కి వైబ్రియానిక్స్ రెమిడీలు ఇచ్చే సేవ కోసం వీరు సంవత్సరానికి 2-3 సార్లు ప్రశాంతి నిలయం సందర్శిస్తారు. ప్రశాంతి నిలయం విధుల్లో ఉన్న కొద్దిమంది సేవకులు ప్రతీ వేసవి లోనూ డెంగ్యూ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. 2019లో రెండు వారాల పాటు CC9.3 Tropical diseases 2100 మందికిపైగా సేవాదళ్ కి ఇచ్చారు. ఆ సంవత్సరంలో ఒక్క కేసు కూడా కనిపించలేదు 2020 మార్చి నుండి మే నెల వరకూ 4500 ఆశ్రమ సందర్శకులకు, మరియు తన నివాస పట్టణము మరియు సమీప గ్రామాలలో 5000 మందికిపైగా ప్రజలకు IB ఇచ్చారు.
ఈ ప్రాక్టీషనరు 2001 నుండి మల్టిపుల్ స్కె లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న 50 సంవత్సరాల మహిళ యొక్క కేసు గురించి వివరించాలనుకుంటున్నారు. ఆమె గత పదేళ్లుగా స్టెరాయిడ్స్ తో సహా అనేక అలోపతి మందులను తీసుకుంటూ ఉన్నారు. ఆగస్టు 2011 ఆగష్టులో ప్రాక్టీషనరును సందర్శించినప్పుడు ఆమె హీమోగ్లోబిన్ మరియు కాల్షియం లోపం వలన పెళుసుగా ఉండే గోర్లు అలాగే నిద్రలేమి మరియు తిమ్మిరితో బాధ పడుతున్నారు. ఇది స్టెరాయిడ్ల దుష్ప్రభావమని ఆమె భావించారు. ఈ లక్షణాల ఆధారంగా రెమిడీలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఆమె పరిస్థితి నెమ్మదిగా మరియు స్థిరంగా మెరుగుపడడం ప్రారంభించింది. 2016 ఫిబ్రవరిలో మాత్రమే 80% మెరుగ్గా ఉందని ఆమె తెలియజేశారు. అందువలన డాక్టరు స్టెరాయిడ్లను నిలిపి వేశారు. ఆ తర్వాత వ్యాధి నివారణ చాలా వేగంగా జరిగింది. రెమిడీ యొక్క మోతాదు తగ్గించడం ప్రారంభించి 2016 డిసెంబర్ నాటికి వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా విముక్తి పొందడంతో రెమిడీ ఆపివేయడం జరిగింది. నాలుగు సంవత్సరాల తర్వాత ఆమెతో చివరిసారి మాట్లాడిన సందర్భంలో తన అనారోగ్య సమస్యల అన్నింటి నుండి విముక్తి పొందినట్లు చెప్పారు.
విజయవంతమైన ఫలితాలు కలగడంతో రోగులు ప్రాక్టీషనర్లుగా మారి ఈ సేవలను చేపట్టడానికి ప్రేరేపించిన మరో రెండు కేసులను వీరు వివరించారు. ఒకటి వివాహమై 12 సంవత్సరాల తర్వాత పిల్లలు లేని వివాహిత జంట యొక్క సమస్య. విశ్వాసంతో భర్త CC14.3 Male infertility మరియు భార్య CC8.1 Female tonic 16 నెలలు తీసుకున్నతరువాత భార్య గర్భం దాల్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ఈ జంట ప్రాక్టీషనర్లుగా శిక్షణ పొందారు. రెండవ కేసులో 13 ఏళ్ల బాలుడు మార్చి 2012 మార్చిలో గాయం కారణంగా చెవిలో కర్ణభేరికి చిల్లులు ఏర్పడి చెవి పోటుతో బాధపడుతూ ఆరు వారాలు తీసుకున్న అల్లోపతి మందులు సహాయం చేయకపోవడంతో శస్త్రచికిత్స చేయవలసి ఉందని వైద్యులు సలహా ఇచ్చారు. అతనికి CC5.2 Deafness + CC10.1 Emergencies + CC21.11 Wounds & Abrasions ఇవ్వబడింది. 2012 అక్టోబర్లో వారు ENT వైద్యుని సంప్రదించినప్పుడు శస్త్ర చికిత్స లేకుండా చెవి పూర్తిగా నయం కావడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తన కుమారుని వ్యాధి పూర్తిగా నివారణ కావడం చూసి తండ్రి AVP శిక్షణ పొంది చురుకైన ప్రాక్టీషనరుగా కొనసాగుతున్నారు.
ఈ ప్రాక్టీషనరు స్వామి యొక్క దివ్యవాణి “నీవు నా పని చెయ్యి, నేను నీ పని చేస్తాను” పై పూర్తి విశ్వాసం ఉంచి మిషనరీ ఉత్సాహంతో వైబ్రియానిక్స్ ను సాధన చేస్తున్నారు. అనేక సందర్భాలలో వీరు ఇట్టి భరోసాను అనుభవించారు. ఒకసారి తన స్వస్థలానికి మూడు గంటల దూరంలో ఉన్న వైద్య శిబిరంలో సేవ పూర్తి చేసిన తర్వాత పేషంట్లు ఎక్కువగా ఉండి బాగా ఆలశ్యం కావడంతో తన ఇంటికి తిరిగి రావడానికి లాస్టు బస్సు మిస్సయ్యానని అనుకున్నారు. కానీ బస్టాండ్ చేరుకునేసరికి బస్సు ఇంకా అక్కడే ఉందని కనుగొని ఇది స్పష్టంగా స్వామి దయ అని భావించారు. మరోసారి అదే వైద్య శిబిరానికి తన తదుపరి సందర్శనలో సేవను ఒక గంట ముందుగానే ముగియడంతో ప్రాక్టీషనరు బస్టాండుకు దగ్గరగా ఉన్న ఒక ఆలయం వద్ద బస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా లాస్ట్ బస్ వచ్చి వీరి ముందు ఆగింది. అందుబాటులో ఉన్న చివరి సీటు దొరకడంతో బాగా అలసిపోయిన తనకు మూడు గంటలు బస్సులో నిలబడి ప్రయాణం చేసీ అవస్థను నివారించింది.
ప్రాక్టీషనరు తన జీవితము అంతర్గత దైవత్వంతో నిరంతరం సన్నిహితంగా ఉండటానికి స్వామి యొక్క మార్గదర్శకత్వంపై ఆధారపడ్డారు. ఇది వీరికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప జేసింది. చికిత్స ద్వారా పూర్తి స్వస్థత చేకూరిన రోగులు ఆర్థికపరంగా లేదా ఇతరత్రా తిరిగి చెల్లించాలని అనుకున్నప్పుడు ప్రాక్టీషనరు స్వామి ఉచితంగా మరియు పరోపకారంగా చేస్తున్న అనేక ప్రాజెక్టుల గురించి చెబుతారు. ఇది వారిని స్వామి యొక్క దైవిక మిషన్ లో భాగం కావడానికి ప్రోత్సహిస్తుందని ప్రాక్టీషనర్ విశ్వసిస్తున్నారు. నిస్వార్థ సేవలో నిమగ్నమవడం ఈ ప్రాక్టీషనరుకు అపారమైన ఆనందాన్ని ఇస్తోంది.
పంచుకున్న కేసులు