ప్రాక్టీషనర్ల వివరాలు 03576...UK
ప్రాక్టీషనర్ 03576…యు.కె. 2006 నుండి ఈమె లాయరుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. 2014 ఏప్రియల్ లో టర్కీలో ఒక విహార యాత్ర లో ఉన్నప్పుడు ఒక భారతీయ కుటుంబం నుండి షిరిడి బాబా వారి గురించి మొదటిసారి విన్నారు. అది ఆమెలో ఎంతో ఆసక్తిని రేకెత్తించగా 2014 లోనే రెండుసార్లు షిర్డి పర్యటన చేసారు. 2015 ప్రారంభములో వీరు మధ్యవర్తి ద్వారా ఒక స్వామిని దర్శించారు. ఆ సమయంలో స్వామి మీటింగ్ లో ఉండడం వలన మధ్యవర్తి వారి సందేశం మాత్రమే వినిపించారు.భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశ్రమానికి వెళ్ళమని ఆ సందేశం ద్వారా వీరిని ప్రోత్సహించారు. ఈ ప్రయాణానికి తగిన డబ్బు తన వద్ద ఉండడంతో (షిరిడి వెళ్లడంలో విమానాలు ఆలస్యంగా బయల్దేరిన కారణంగా విమానయాన సంస్థలు ఆమెకు తిరిగి డబ్బు చెల్లించాయి) 2015 మార్చిలో ఆమె పుట్టపర్తికి మొదటి యాత్ర చేసి చేశారు. తిరిగి వచ్చేటప్పుడు ఆమె తన జీవితాన్ని మార్చే ఒక చక్కని కల కనడం, ఆ కలలో ఆమె యొక్క అనేక ప్రశ్నలకు స్వామి సమాధానం ఇవ్వడంతో ఆమె పూర్తి శాఖాహారి గానూ మరియు మత్తుపదార్ధాల వ్యసనానికి దూరంగా ఉండే అవకాశం కల్పించింది. ఆమె తన పరిసరాల్లో జరిగే అనేక సాయికార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం ప్రారంభించారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే “నేను స్వామి వైపు కొన్ని అడుగులు మాత్రమే వేశాను కానీ స్వామి నాకు ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచారు. స్వామి నన్ను ఓదార్చడానికి, తన యొక్క ఉనికిని నిరూపించుకోవడానికి అద్భుతమైన లీలలు ఒకదాని తరువాత మరొకటి ప్రదర్శించడంతో వారి పట్ల నా విశ్వాసం ఒక్కరాత్రిలో పెరిగిపోయింది. స్వామి పట్ల నాకున్న సందేహాలు అన్నింటినీ వారు తొలగించారు”
స్వామి 90వ జన్మ దినోత్సవ వేడుకల కోసం ఆమె మళ్లీ పుట్టపర్తిని సందర్శించి వైద్య శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సేవ తోనే ఎక్కువకాలం కొనసాగాలని అంతర్వాణి నుండి బలమైన పిలుపు వినిపించింది. ఇది ఆమెను పార్ట్ టైం పనిలో కనీస వేతనంతో కమ్యూనిటీ కేర్ వర్కర్ గా పనిచేయడానికి పురికొల్పింది. అంతేకాక ఆమె ప్రతీ వారాంతంలో చిత్తవైకల్యం గల రోగులకోసం పనిచేయడం ప్రారంభించారు, ఐతే న్యాయవాదిగా పూర్తి సమయం ఉద్యోగంలో కొనసాగారు. మన హృదయం నుండి ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక వింటాడు అనే బైబిల్ వాక్యము వలన ప్రభావితురాలై చర్చిలలోని స్వస్తత గదుల పట్ల ఆకర్షితురాలయ్యారు. ఇది ఆమెను బాధలలో ఉన్న కుటుంబసభ్యులు, మరియు స్నేహితుల కోసం క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవిధంగా ప్రేరేపించింది. ఎంత కష్టమైనా సరే ఈ ప్రార్ధనలు ఆమె హృదయపూర్వకంగా చేసారు. ఇతరులకు సహాయం చేయడానికి మరొక మార్గం కోసం స్వామికి చేసిన ప్రార్ధన నేపథ్యంలో సాయి వైబ్రియానిక్స్ ఆమె జీవితంలో అభివ్యక్తమయింది. అకస్మాత్తుగా ఏర్పడిన కొన్ని ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవిస్తూ రెమిడీ తీసుకున్న వెంటనే ఇవి అదృశ్యమయ్యే సరికి వైబ్రేషనల్ హీలింగ్ పై 100% విశ్వాసం స్థిరపడింది. అందుచేత ఈ అనారోగ్యాలు ఆమె జీవితంలోకి వైబ్రియానిక్స్ ను తీసుకురావడానికి ఒక సాకు మాత్రమే అని ఆమె భావిస్తున్నారు.
ప్రాక్టీషనరుగా ఉత్తీర్ణత పొందడానికి ఆమె చేసిన ప్రయాణం అవరోధలతో కూడి ఉంది. ఆమెకు ఒక సంవత్సరం తర్వాత ప్రయత్నించమని సలహా కూడా ఇవ్వబడింది. సాధారణ పరిస్థితిలో ఈ నిర్ణయాన్ని అంగీకరించి దీని నుండి వైదొలగడం జరిగి ఉండేదేమో కానీ దీని కోసం తీవ్రంగా ప్రయత్నించవలసిందిగా ఆమెకు స్వామి నుండి బలమైన సందేశం వచ్చింది. పర్యవసానంగా 2019 ఫిబ్రవరిలో AVP గా అర్హత సాధించారు. వెనక్కి తిరిగి చూస్తే ఈ లీల ఆమె అహాన్ని తొలగించి మానవతను తీర్చిదిద్దడానికి స్వామి ప్రణాళికలో ఇదంతా ఒక భాగమని ప్రాక్టీషనరు భావిస్తున్నారు. ఆ తరువాత త్వరలోనే 2019 సెప్టెంబరులో VP అయ్యారు.
గత రెండేళ్లలో ఆమె 100కు పైగా రోగులకు గుండె సమస్యలు, ఆమ్లత్వం, మధుమేహం, అధిక రక్తస్రావం మరియు క్రమరహిత ఋతుకాలాలు, ప్రొస్టేట్ సమస్యలు, అఫెసియా, మూర్ఛ, ఆస్టియో ఆర్థరైటిస్ మరియు కోవిడ్-19 వంటి వివిధ రకాల వ్యాధులకు విజయవంతంగా చికిత్స చేసారు. CC15.1 Mental & Emotional tonic, అనేది ప్రజలను శాంతియుతంగా చేసి సానుకూల ప్రశాంతత ద్వారా వారి ప్రతికూల ఆలోచనలను తొలగింపజేసి చికిత్స ప్రారంభ మయ్యేందుకు తోడ్పడే అద్భుతమైన రెమిడీ అని వీరు తెలుసుకున్నారు. ఆమె తోటపనిపై కొత్త ప్రేమైక విధానం కనుగొని మొక్కలను సంరక్షించడమువలన ఇంటికి చక్కని ఆకర్షణ రావడముతో ఆనందంగా ఉంటుందని తెలుసుకున్నారు. మొక్కలు ఆరోగ్యంగా మరియు కీటకాలు మరియు ఇతర వ్యాధుల నుండి విముక్తి కలిగించడానికి ప్రతిరోజూ మొక్కలపై స్ప్రే చేయడానికి CC1.1 Animal tonic + CC1.2 Plant tonic ను ఈమె ఉపయోగిస్తారు. మొక్కలను వేరొక చోటికి మార్పిడి చేయడానికి ప్లాన్ చేసినా లేదా అవి అసంతృప్తిగా ఉన్నట్లు అనిపించినా CC15.1 Mental & Emotional tonic జతచేస్తారు. ఆమె CC1.1 Animal tonic ను మరొక విధంగా కూడా విజయవంతంగా ఉపయోగించారు. ఆరేళ్ల బాలిక మూడేళ్లపాటు అల్లోపతి చికిత్సలో ఉన్నప్పటికీ తన కడుపులో నట్టలను (టేప్ వార్మ్స్) వదిలించుకో లేకపోయింది. ప్రాక్టీషనరు 2019 సెప్టెంబర్ లో ఆమెకు అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం ప్రారంభించారు. పాపకు ఇతర సమస్యలు తొలగిపోయాయాయి కానీ నట్టలు కొనసాగాయి. 2020 జూన్ 30న ఇదివరకటి రెమిడీకి CC1.1 Animal tonic జోడించారు. ఐదు రోజుల్లో పురుగులు బయటకు వచ్చాయి. 2021 మార్చిలో తొమ్మిది నెలల తర్వాత కూడా ఆమె ఇప్పటికీ వాటి నుంచి ఇబ్బంది పడలేదు.
మరొక కేసు విషయంలో కిడ్నీఉన్న ప్రాంతంలో నొప్పితో సహా బహుళ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 70 ఏళ్ల మహిళకు ప్రాక్టీషనర్ చికిత్స చేస్తూ ఉన్నారు. 2020 జనవరి 2 న అల్ట్రాసౌండ్ స్కాన్ ఆమె మూత్రపిండం పైన గడ్డ ఉన్నట్లు వెల్లడించింది. కాబట్టి ఆమె CC2.3 Tumours & Growths జోడించారు. జనవరి 28 న CT స్కాన్ చేసినప్పుడు కణితి లేనట్టు రిపోర్టు వచ్చింది.
ప్రాక్టీషనర్ తన ప్రార్థన గదిలో 108CC పెట్టి ఉంచుతారు. రెమిడీలు తయారు చేసేటప్పుడు స్వామి యొక్క బలమైన మార్గదర్శక ఉనికిని ఎల్లప్పుడూ అనుభవిస్తారు. చాలా మంది రోగులు సంప్రదింపులు జరిపిన వెంటనే ఇంకా రెమిడీ ఇవ్వక ముందే ఉపశమనం పొందడం ప్రారంభమైనట్లు తెలియుజేసారు. ప్రార్థనతో పాటు రెమిడీ ఇచ్చినప్పుడు వ్యాధి నివారణ త్వరగా ఉంటుందని ఆమె కనుగొన్నారు. తన ఇంట్లో ఫోటోల నుండి విభూతి మరియు తేనె రావడం దైవిక ఉనికికి నిదర్శనమని ఆమె భావిస్తున్నారు. ఆమెకు స్వామితో మాట్లాడే అలవాటు ఉండడంతో రోగులకు వైద్యం చేసేటప్పుడు ఎల్లప్పుడూ స్వామి సహాయం తీసుకుంటారు. రోగులు వారి వ్యాధులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇవ్వడం మరిచిపోయిన అనేక సందర్భాల్లో వారి రోగ నివారణకు స్వామి ఆమెకు మార్గనిర్దేశం చేసేవారు. వ్యాధి నివారణ తరువాత ఆమె రోగులకు దీనిని ప్రస్తావించినప్పుడు వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడం మర్చిపోయామని ధృవీకరించేవారు.
వారంలో ఒకరోజు సాయంత్రం రోగుల యొక్క ఫోన్ కాల్స్ కోసం సమయాన్ని కేటాయిస్తూ వారాంతంలో రెమిడీలను సిద్ధం చేస్తారు. మిగిలిన సమయంలో ఆమె రోగుల అభ్యర్థులను స్వీకరిస్తూ వారితో సంక్షిప్త ఫోన్ సందేశాల ద్వారా సమాచారం అందిస్తూ ఉంటారు. అన్ని అత్యవసర కేసులకు ఈమె ప్రాధాన్యత ఇస్తూ స్టాంపులు అంటించిన కవర్లు రెమిడీలు పంపించడానికి సిద్ధంగా ఉంచుకుంటారు. క్రమంతప్పకుండా సమావేశాలకు హాజరు కావడం ఆమెను వైబ్రియానిక్స్ ప్రపంచంతో దగ్గర కావడానికి, కష్టమైన కేసులను చర్చించడానికి, సీనియర్ల నుండి నేర్చుకోవడానికి అవకాశాన్ని అందిస్తోంది. శారీరకంగా వ్యక్తమయ్యే ముందు వ్యాధి ఈతరిక్ దేహంలో కనిపిస్తుందని మనకు బాగానే ఉన్నట్లు అనిపించినప్పటికీ కూడా అది సూక్ష్మశరీరంలో కొనసాగుతూ ఉంటుందని అందువల్ల చికిత్స అకస్మాత్తుగా ఆపకుండా ఉండడం ముఖ్యం అని ఆమె తెలుసుకున్నారు. ఈ అవగాహన ఆమె తన సొంత జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు రోగులకు మరింత సానుకూలమైన జీవన విధానాన్ని అవలంబించడంలో సలహా ఇవ్వడానికి తోడ్పడింది.
ఇతర ప్రాక్టీషనర్ల కోసం ఆమె వద్ద ఒక చిట్కా ఉంది. రోగుల రికార్డులను సమగ్రముగా నిర్వహించడం సమయాన్ని ఆదా చేయడంతో పాటు రోగులకు రెమిడీలు సూచించే టప్పుడు పాత రికార్డులను వెతకడంలో ఉన్న ఇబ్బందిని నివారిస్తుంది. సేవా గంటలు పూర్తిచేయడానికి మరియు పూర్తయిన కేసులను ప్రచురణ కోసం సమర్పించడంలో కూడా సహాయపడుతుంది. మరొక చిట్కా ఏమిటంటే మనం ప్రతీ ఒక్కరికీ సహాయం చేయడానికి ఆసక్తి కనబరచినా సహాయం తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా ఉంటారు. అటువంటి సందర్భాలలో వారి కోసం ప్రార్థించడం స్వామికి శరణాగతి చెయ్యడం మరియు ఇతర రోగుల కోసం ఆ సమయాన్ని సేవను మళ్ళించడం మంచిది.
ఆమె తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రార్ధన కోసం, స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను చదవడం, సానుకూల ప్రమాణములను లేదా అఫిర్మేషన్స్ వినడం, రోగులతో ఈ అభ్యాసనాన్ని పంచుకోవడం కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. ప్రాపంచిక విషయాల పట్ల ఆమె ధృక్పథం పూర్తిగా మారిపోయింది. మన అంతర్గత ఆలోచనలు మరియు భావాలు ప్రతిబింబమే బాహ్య ప్రపంచం అని ఆమె గ్రహించగలిగారు. గతంలో ఆమెను ఆందోళనకు గురిచేసిన బాధ కలిగించే సంఘటనలు, అంచనాలు, మరియు నిరాశలను తన మనో ధృక్పధం నుండి తొలగించుకోవడం నేర్చుకున్నారు. వైబ్రియానిక్స్ ప్రాక్టీషనరుగా అర్హత సాధించడం తన అధ్యాత్మిక పురోగతికి అంతర పరివర్తనకు స్వామి ఆమెకు ఇచ్చిన ఉత్తమ అవకాశమని నమ్ముతున్నారు. ఇతరులకు సహాయం చేయగలగడంలో స్వామికి ఒక సాధనంగా ఉండగలిగె స్థితిలో ఉంచడం తన అదృష్టంగా భావిస్తున్నారు.
పంచుకున్న కేసు