ప్రాక్టీషనర్ల వివరాలు 11529...India
ప్రాక్టీషనర్11529 హిందీ లో మాస్టర్స్ డిగ్రీ కలిగిన ఈ గృహిణి 2006 లో కాలిఫోర్నియాలోని సాయి ఆధ్యాత్మిక విద్య (SSE)తరగతులకు ఈమె ఇద్దరు కుమార్తెలు హాజరు కావడం ప్రారంభించినప్పటి నుండి స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు. ప్రొఫెషనల్ కూచిపూడి నర్తకి కావడంతో 2007 లో ఈశ్వరమ్మ దినోత్సవ ప్రదర్శన కోసం పిల్లలకు డాన్స్ నేర్పించడానికి ఆమెను ఆహ్వానించారు. ఆ తర్వాత ఆమె సాయి సెంటర్ కు క్రమం తప్పకుండా హాజరు కావడం ప్రారంభించి సేవా కార్యక్రమాల్లో పాల్గొనసాగారు. 2010లో బెంగళూరుకు వెళ్ళిన తర్వాత ఆమె వైట్ ఫీల్డ్ లోని జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో సేవాదళ్ గా సేవ చేయడం ప్రారంభించారు.
2013 లో ఒక సీనియర్ ప్రాక్టీషనరు సూచన మేరకు వైబ్రియానిక్స్వర్క్ షాప్ కు హాజరుకావలసినదిగాఆమె భర్త ప్రోత్సహించారు. మొదటి నుండీ కూడా వైబ్రియనిక్స్సమర్ధత గురించి ఆమెకు ఎప్పుడూ సందేహం లేదు. ఆమె తనశిక్షణ పూర్తిఐన మొదటి రోజే20సంవత్సరాల క్రితం ప్రమాదం కారణంగా జారిపోయిన C4-C6 డిస్కుల కోసం ఆమె తనను తాను చికిత్స చేసుకున్నారు. ఆమె వీపు మరియు మెడ లో నొప్పి కారణంగా ప్రతీ ఉదయం పక్క మీద నుండి లేవడం నరక ప్రాయంగా ఉండేవి. CC20.5 Spine తీసుకున్న రెండు రోజుల్లోనే ఆమె నొప్పి చాలావరకుతగ్గి పోయింది. అప్పటినుండి ఆమె కుటుంబం అల్లోపతి ఔషధాన్ని దాదాపుగా నివారించి వైబ్రియనిక్స్ రెమిడీలను మాత్రమే తీసుకొనసాగారు.
2013 ఆగస్టు నుండి ఆమె ప్రతీశనివారం సాయి గీతాంజలి సెంటర్లో సేవ చేయడం ఆమెకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది.వైబ్రియనిక్స్ సేవ చేస్తున్నప్పుడు దీర్ఘకాలిక రోగులు ప్రత్యేకించి 10 నుండి 20 సంవత్సరాల కాలపు అనారోగ్యాల నుంచి బయట పడడం గమనించినప్పుడు ఆమెకు ఎంతో ఆనందంగా ఉండేది. ఆమె కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఎంతో మంది వైబ్రియానిక్స్ నుండి లబ్ధిని పొందారు. 20 సంవత్సరాల నుండి మూర్ఛతో బాధపడుతున్న ఆమె బావ వైబ్రియానిక్స్తో పూర్తిగా నయంఅయ్యారు.
వెల్నెస్ క్లినిక్ బృందంలో చేరమని ఆహ్వానం వచ్చినప్పుడు ఆమె ఎంతో ఆనందించి అందుకు అవసరమైన విధంగా 2017 లో VP కోర్సు పూర్తి చేసి IASVP లో సభ్యురాలుగా మారారు.క్లినిక్ కు వచ్చే రోగుల సంఖ్యక్రమంగా పెరగడం ప్రారంభమైంది. గుండె వైఫల్యంతో బాధపడుతున్న చాలా మంది రోగులకుచికిత్స లేకపోవడంతోవారు వైబ్రియానిక్స్రెమిడిలద్వారా అనేక ప్రయోజనములను పొందుతూ ఉన్నారన్న విషయాన్ని ఈ ప్రాక్టీషనరుపురావలోకనం చేసుకుంటూ ఈ రోగులు రీఫిల్ కోసం ప్రాక్టీషనరుకు ఫోన్ చేస్తూ ఉండడంతో అవసరం మేరకు సుదూర ప్రాంతాలనుండి రీఫిల్ కోసం వచ్చే వారికి ఆమె క్రమం తప్పకుండా పోస్ట్ ద్వారా పంపుతూ ఉంటారు. ఇప్పటివరకూ ఆమె 1500 మందికి పైగా రోగులకు కీళ్ళనొప్పులు ఆర్థరైటిస్, మరియు హెర్పెస్వంటివివిధ రకాల వ్యాధులకు చికిత్స చేసి పూర్తి స్వస్థత చేకూర్చారు. అలాగేరోగిప్రాక్టీషనరుఇచ్చిన సూచనలను పాటిస్తూ రెమిడీలు తీసుకొంటే ఇతర వ్యాధుల విషయంలో కూడా సంపూర్ణ స్వస్థత సాధ్యమే అని భావిస్తున్నారు.
అనేక మందిని బాధలనుంచి నివారణ చేసేలా చేసినందుకు ఆమె స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది ఆమెలో అంతర్గత పరివర్తనకు దోహదపడిందని తెలుపుతున్నారు. ఈ సేవ కారణంగా ఆమె ఆందోళన లేకుండా మానసిక ప్రశాంతతతో ఉంటూ ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఒత్తిడికి గురి కాకుండా ఇది తనను బలోపేతం చేయడానికి స్వామి పరీక్షా మార్గంగా భావిస్తున్నారు. ప్రాక్టీషనర్లకు ఆమె ఇచ్చే సలహా ఏమిటంటే వైబ్రియానిక్స్ పైపూర్తి విశ్వాసం ఉంచి మన వంతు కృషి మనం చేస్తూ ఫలితాలను స్వామికి వదిలివేయాలి.
పంచుకున్న కేసు: