ప్రాక్టీషనర్ల వివరాలు 11217...India
ప్రాక్టీషనర్11217 ఒక గ్రాడ్యుయేట్ మరియుమాజీ వ్యాపార వ్యవస్థాపకులైన వీరు చిన్నప్పటినుండి స్వామి ఫోల్డ్లో ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నారు. 2009లో వీరి ట్రైగ్లిజరైడ్ స్థాయిచాలా ఎక్కువగా450 mg/dL (నార్మల్ స్థాయి<150 mg/dL) ఉందని మరియు అతని లిపిడ్ప్రొఫైల్ నియంత్రించడానికి వైద్యుడు అల్లోపతి మందులు సూచించిన సందర్భంలో వీరికి వైబ్రియానిక్స్ గురించి మొదట పరిచయం అయ్యింది. అదే రోజు సాయంత్రంభజన అనంతరం వీరు ప్రాక్టీషనర్ నుకలుసుకొని మొదట వైబ్రియానిక్స్ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. అతనికి CC4.2 Liver & Gallbladder tonic...TDS. ఇవ్వబడింది. మరుసటి నెల వైద్య పరీక్షలో అతని లిపిడ్స్ స్థాయి220 mg/dLకి పడిపోయింది.
2010లో బృందావనంలోసేవాదళ్ గా డ్యూటీ లో ఉన్నప్పుడు ఆశ్రమంలోనే జరగబోయే AVP కోర్స్ కోసం సంతకం చేసే అవకాశం వీరికి లభించింది.వర్క్ షాప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ బృందంలోని సభ్యులంతా తాము కొత్తగా పొందిన 108 సిసి బాక్స్ మరియు సర్టిఫికెట్ తో స్వామి ఆశీర్వాదం కోసం ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుడు అతని కిట్ చూసితన దీర్ఘకాలిక అనారోగ్యానికి ఔషధం కోరారు.అలా రైలులోనే తన మొట్టమొదటి సేవ మొదలైనది.
అప్పటినుండితన నివాసము, స్థానిక భజన కేంద్రాలు మరియు వైద్యశిబిరాలలో రోగులకు సేవలందిస్తూ రోజుకు సగటున ఇద్దరు ముగ్గురు రోగులకు చికిత్స అందించసాగారు. జిల్లా సేవా సమన్వయకర్తగా ఉన్న వీరు2011 నుండి 2013వరకు వైట్ ఫీల్డ్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డ్యూటీ లో ఉన్నప్పుడు తన వైబ్రియానిక్స్ బాక్సు తీసుకువెళ్ళిఅక్కడ సేవకులకు చికిత్స చేసేవారు.2013లో అతను శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యాలయంలో వైబ్రియానిక్స్పై ఒక ప్రదర్శన నిర్వహించగా ఎంతోమంది దీనికి హాజరయ్యారు. ఐతే 2014లో బృందావన్ ఆశ్రమంలో నెలరోజులపాటు సాధనా శిబిరం నిర్వహించినప్పుడు వైబ్రియానిక్స్వైద్య వ్యవస్థను దీనిలో చేర్చినప్పుడు ఇతని అభ్యాసానికి నిజమైన ప్రోత్సాహం లభించింది. రోగుల నుండి మరియు ఆశ్రమ అధికారుల నుండి చక్కని స్పందన రావడంతో ఆశ్రమంలో శాశ్వత వైబ్రియానిక్స్క్లినిక్ నిర్వహణకు పుట్టుక ఏర్పడింది. ఇది వారానికి ఏడు రోజులు పనిచేస్తుంది. అప్పటినుండిరోజు వారిగా 10నుంచి 15మంది సగటుతో వేలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారాంతాల్లో సహాయం చేయడానికి మరో ఇద్దరు ప్రాక్టీషనర్లువీరితో చేరుతూ ఉండేవారు.
ప్రాక్టీషనర్ తన అభ్యాసంలో అద్భుతమైన విజయాన్ని సాధించారు. అతని రోగుల్లో 60% మంది పూర్తిగా రోగవిముక్తి పొందినట్లు తెలియజేశారు. ఒక సందర్భంలో ఆశ్రమం యొక్క శాశ్వత వాలంటీరు కుమార్తె దుందుడుకు స్వభావం కోసం గత మూడు సంవత్సరాలుగా ఎన్నో రకాల చికిత్సలు తీసుకున్నా ఏమాత్రం ఫలితం కలగలేదు. గత ఆరు నెలల్లో అమ్మాయి పరిస్థితి మరింత దిగజారి ఆశ్రమంలోనే తన తల్లిని దుర్భాషలాడటం ప్రారంభించినప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. నిరాశతో ఉన్న కుటుంబ సభ్యులు ప్రాక్టీషనరును సంప్రదించగాCC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilitiesరెమిడీ ఇచ్చారు. ఇది ప్రారంభంలో ఆమె ప్రవర్తనను భరింపతగినదిగా చేయగా మరో మూడు నెలల్లో ఆమె తన సాధారణస్థితికి చేరి తన సేవా విధులు నిర్వహించడానికి తిరిగి చేరగలిగింది. మరొక సందర్భంలో అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న సాయి సంస్థ ట్రస్టీ యొక్క మహిళా బంధువు చంచలస్వభావం కలిగి లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉండేవారు. ఒకటిన్నర సంవత్సరాలు అన్ని చికిత్సలు విఫలమైన తర్వాతవైబ్రియనిక్స్ రెమిడీ CC18.2 Alzheimer's disease రోగికి రక్షణ అందించి చాలా తక్కువసమయంలోనే వారిలో మార్పు తీసుకొనివచ్చి ఇతరుల మాటలకు ప్రతిస్పందించడంతో పాటు ఇంటికే పరిమితమయ్యారు. మరొక సందర్భంలో మెదడు కణితికి శస్త్ర చికిత్స అనంతరం ఒక చిన్న పిల్లవాడి జ్వరం సాధారణ స్థాయికి రాకపోవడంతో సర్జన్లు అన్ని ప్రయత్నాలు చేసి ఆశలను కోల్పోయారు. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఆశ్రమానికి రాగా కేవలం రెండు మోతాదుల CC9.4 Children's diseases, తో జ్వరం తగ్గిపోయింది.
ప్రాక్టీషనర్ అభిప్రాయం ప్రకారం మానవుడు తప్ప అన్ని జీవులు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. ఔషధం లేదా శస్త్ర చికిత్స పై ఆధార పడకుండా తమ పూర్తి జీవిత కాలం గడుపుతాయి. అన్ని ఇతర జీవుల మాదిరిగానే మానవ శరీరం కూడా ఒక సంపూర్ణ యంత్రం. ఇది స్వస్థత మరియు పునరుత్పత్తి చేసుకోగల యంత్రాంగాన్ని కలిగి ఉంటుంది. మనము ప్రకృతి నియమాలను పాటించక పోవడం వలనఅసమతుల్యత పొందుతూ వివిధ వ్యాధులతో బాధపడుతున్నాము. వైబ్రియానిక్స్సమతుల్యతను పునరుద్ధరించడం ద్వారా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక అనే మూడు స్థాయిలలోనే కాక పర్యావరణ స్థాయిలో కూడా సంపూర్ణ సంరక్షణను పొందటానికి ఇది తనకు మద్దతు ఇచ్చిందని ఈ ప్రాక్టీషనరుభావిస్తున్నారు.
పంచుకున్న కేసు: