ప్రాక్టీషనర్ల వివరాలు 11210...India
ప్రాక్టీషనర్11210 వీరు భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల అగ్రగామియైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఈమె తల్లిదండ్రులు 60వ దశకం ఆరంభం నుండి సత్యసాయిబాబావారి విశ్వసనీయమైన భక్తులు. ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు సమితి కార్యక్రమాల్లో మరియు ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గ్రామ వైద్య శిబిరాలలో సమితి సభ్యులు చేస్తున్నసేవలు చూస్తూ ప్రజల బాధలను తగ్గించడానికి ఈ సేవలో భాగంకావాలని ఆమె ఆకాంక్షించారు.అయితే ఆమెకు వైద్య నేపథ్యం లేనందువలనఇది సుదూరకల అని ఆమె భావించారు.2010లో వైట్ ఫీల్డ్ లోని బృందావనంలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొనడానికి ఆమెకు భగవంతుడు పంపినట్లుగాఒక అవకాశం రావడంతో AVPగా మారారు మరి రెండు సంవత్సరాల తర్వాత VP కూడా అయ్యారు, ఆ విధంగా ఆమె కల నిజమైంది. రోగుల బాధలను తొలగించాడానికి స్వామి తనను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారనే పూర్తి అవగాహనతో మొదట తన సమితిలోను ఆ తర్వాత బృందావనం ఆశ్రమంలోని రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఆమె గత పది సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇలా ప్రాక్టీస్ చేస్తూనే నెలవారి గ్రామీణ వైద్య శిబిరాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆమె వైట్ ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో2017లో వెల్నెస్ క్లినిక్ ప్రారంభమైనప్పటి నుండి సేవలు అందించారు.వార్తాలేఖ సంపుటి 11-సంచిక 6 అనగా 2020 నవంబర్- డిసెంబర్ లో ప్రొఫైల్ఇవ్వబడిన ప్రాక్టీషనర్11597 ద్వారా 2019 జులై నుండి ఆమె ప్రతీ సోమవారం క్రమం తప్పకుండా సహాయం పొందుతున్నారు.
ఈ ప్రాక్టీషనర్దీర్ఘకాలిక సోరియాసిస్,ల్యుకోడెర్మా, తామర మరియు గోళ్ళలోఫంగల్ఇన్ఫెక్షన్ వంటి చర్మవ్యాధులకు విజయవంతంగా చికిత్స చేశారు.10 సంవత్సరాలుగా మొత్తం శరీరమంతా సొరియాసిస్ తో బాధపడుతున్నమహిళ ఉదంతాన్ని మనతో పంచుకుంటూదీనికోసం ఆమె CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis for oral intakeఇచ్చారు. చికిత్స ను వేగవంతం చేయడానికి బాహ్యంగా చర్మం పై పూతగా రాయడానికి స్వచ్ఛమైన పెట్రోలియం జెల్లీ మరియు కొబ్బరి నూనె మిశ్రమానికి ఈ కొంబోనుజోడించడం ద్వారా ఒక లేపనం తయారు చేశారు.రోగి నుండి క్రమం తప్పకుండా పొందిన ఫీడ్ బ్యాక్ బట్టి మొదటి 6 నెలల వరకూ మెరుగుదల నెమ్మదిగా ఉన్నప్పటికీ చర్మం యొక్క అసలు రంగు కాళ్ళు చేతులపై కనిపించడం ప్రారంభమయింది. చికిత్సను కొనసాగించడానికి రోగికి ఇది ఎంతో ప్రోత్సాహం ఇవ్వడంతో మరో ఐదు నెలల్లో పూర్తిగా మామూలు స్థితికి రావడం భగవంతుని వరంగా ఆమె భావించారు. అదనంగా ఈ ప్రాక్టీషనర్ఉబ్బసం, మద్యపాన ధూమపాన వ్యసనం,రొమ్ములలో గడ్డలు, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు మరియు గ్యాంగ్రీన్వంటి కేసులకు విజయవంతంగా చికిత్స అందించారు.తన సుదీర్ఘకాల వైబ్రియానిక్స్అనుభవంతో ప్రతీరోగితోనూ హృదయపూర్వకమైన సంబంధాన్ని పెంపొందించుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆమెతెలియజేస్తున్నారు. ఇతర ప్రాక్టీషనర్లకుఆమె ఇచ్చే సలహా ఏమిటంటే రోగి యొక్క చరిత్ర ఓపిగ్గా వినడం మరియు వారికి సలహా అవసరమైనప్పుడు ఫోనులో వారికి అందుబాటులో ఉండాలని పేర్కొంటున్నారు. స్వామి, రోగి మరియు ప్రాక్టీషనర్మధ్య ఏర్పడే దివ్య త్రికోణం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ఆమె నేర్చుకున్నారు. రోగుల పట్ల ఆమె ప్రేమపూర్వక వైఖరి సత్ఫలితాలు సాధించిందనడంలో అతిశయోక్తి లేదు. అనారోగ్యంతో మరియు మానసికంగా,భావోద్వేగ పరంగా బలహీనంగా ఉన్న రోగులను చూసి ఆమె ఎంతో వినయంగా తన యొక్క పూర్తి స్థాయిలో వారికి సేవ చేయడానికి పూనుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది “కేవలం స్వామి మాత్రమే ఈ సేవకు మార్గనిర్దేశం చేసి రోగిని స్వస్థత పరిచేవారుకనుక అహంకారం మచ్చుకుకూడా మనసులోకి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకూడదు”
పంచుకున్న కేసు: