ప్రాక్టీషనర్ల వివరాలు 10776 & 12051...India
SSSIHMS వైట్ ఫీల్డ్ వెల్నెస్ సెంటరులో వైబ్రియానిక్స్ క్లినిక్
వైట్ ఫీల్డ్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోగలవెల్నెస్ సెంటరులో వైబ్రియానిక్స్సేవలో చురుకుగా పాల్గొన్న మన ప్రాక్టీషనర్లవివరాలను అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. 2017 ఫిబ్రవరి 23న ప్రారంభించినప్పటి నుండి వెల్నెస్ క్లినిక్ లో అంతర్భాగంగా ఉంది. దీన్ని వారానికి మూడు రోజులు ప్రాతిపదికన ఐదుగురు అంకితభావం గల ప్రాక్టీషనర్లు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో పేలవమైన ప్రతిస్పందన ఉంది కానీ రోగుల సంఖ్య నోటి మాట ద్వారా క్రమంగా పెరుగుతూ రావడంతో పాటు ఆసుపత్రి వైద్యులు ఈ ప్రత్యామ్నాయ చికిత్స వైపు ఆకర్షితులవడంతో వారే రోగులకు ఈ చికిత్సను రోగులకు సూచింప సాగారు.
ప్రాక్టీషనర్10776 2009లో బెంగళూరులో మొదటి వర్క్ షాప్ జరిగినప్పటి నుండి కర్ణాటక కోఆర్డినేటర్ గా ఉన్నారు మరియు కర్ణాటక లో అనేక శిక్షణ మరియు ప్రొఫెషనల్ వర్క్ షాపులను నిర్వహించడంలో మార్గదర్శకముగా ఉండడమే కాక వెల్ నెస్ సెంటరులో వైబ్రియానిక్స్క్లినిక్ ఏర్పాటులో ఆయన కీలకమైన పాత్ర పోషించారు.
ప్రాక్టీషనర్12051 సంపుటము 9 సంచిక2అనగా2018 మార్చి ఏప్రిల్ వార్తా లేఖలో వీరి ఫ్రొఫైల్ ప్రచురించబడినది. అప్పటినుండి ఆమె పని భారం చాలా రెట్లు పెరిగింది. 2020 మార్చిలో కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆమె కర్ణాటకలోని అన్నివర్చువల్ వర్క్ షాపులను నిర్వహిస్తూ మార్గ నిర్దేశం చేస్తున్నారు.ఈ వైబ్రియానిక్స్ క్లినిక్ తో అనుసంధానించబడిన కార్యకలాపాలుఅన్నింటికి ఆమె బాధ్యత వహిస్తున్నారు. క్రింద ఇవ్వబడిన ఐదు ప్రాక్టిషనర్ల వివరాలను వీరే సంకలనం చేశారు.