Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 11621...India


ప్రాక్టీషనర్ 11621…ఇండియా  వీరు 2014 నుండి SSSIHL బృందావనంలో బయో సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ప్రస్తుతం క్యాంపస్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. 1989లో స్వామి కోయంబత్తూరులోని పొడనుర్ సమితిని సందర్శించినప్పుడు వీరికి మొదటి దర్శనం లభించింది. ఇతను బాలవికాస్ బృందం ప్రదర్శించిన ఒక నృత్య నాటకములో భాగం కాగా ప్రదర్శన అనంతరం స్వామి విభూదిని సృష్టించి ఇస్తూ ఈ బృందం వారందరినీ  ఆశీర్వదించారు మరియు వారితో గ్రూప్ ఫోటో కూడా తీయించు కున్నారు. స్వామిపై ఎక్కువ దృష్టి లగ్నం చేయడానికి తన బాలవికాస్ గురువులచే ప్రేరణ పొంది స్వామి విద్యా సంస్థలలో విద్యార్థి కావాలని ఆకాంక్షించారు. 1996లో అండర్గ్రాడ్యుయేట్ గా స్వామి విద్యాసంస్థలో చేరి 2001 లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడం ద్వారా అతని కోరిక నెరవేరింది. ఆ తర్వాత 2008లో బెంగళూరులోని JNCASR నుండి డాక్టరేట్ పొందారు.

తను విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఈ ప్రాక్టీషనర్ సాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, భజనలు నిర్వహించడం, చిన్న చిన్న ఉపన్యాసాలు ఇవ్వడం సత్సంగాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో ఆనందించారు. ప్రస్తుతం తన యువ విద్యార్థులకు గురువుగా వారి కోసం అవగాహన కోర్సులు మరియు స్వీయ అభివృద్ధి కోసం వారాంతపు సెషన్లు నిర్వహిస్తూ ఆర్ట్స్ గ్యాలరీ స్వావలంబన బృందం మరియు డ్రామా సెట్ల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. బృందావనం హాస్టల్లో విద్యార్థులకు మామూలుగా ఇచ్చే అల్లోపతి చికిత్స పట్ల అసంతృప్తితో ఉన్న వీరు ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం స్వామిని ప్రార్థించారు. బృందావనంలో నెలవారీ వైద్య శిబిరంలో ఆయుర్వేద వైద్యుడు కేవలం ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే చికిత్స చేయగలరు, ఎందుకంటే ఈ సంప్రదింపుల నిమిత్తం కనీసం 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. ప్రాక్టీషనర్ ఈ పద్ధతిని స్వయంగా నేర్చుకోవాలని భావించారు. కానీ దీనిని పూర్తిగా అధ్యయనం చేయడానికి చాలా సంవత్సరాలు ఫుల్ టైం కోర్సుగా చేయవలసి ఉంటుంది. అలాగే హోమియోపతి చికిత్స చేయడానికి తగిన అర్హత గల వైద్యుల వీరికి లభించలేదు. 2 సంవత్సరాల ప్రార్థనల తరువాత మాత్రమే ఒక బృంద ధ్యాన సమావేశం అనంతరం ప్రాక్టీషనర్11595  బృందం లోని మరొక సభ్యుడికి మందుల గోళీలు ఉన్న చిన్న డబ్బాను అందించడం వీరు గమనించారు. ఇది స్వామి మార్గ నిర్దేశం చేసిన సాయి వైబ్రియానిక్స్ చికిత్సా పద్ధతి అని వారు తెలుసుకున్నారు. మరియు వీరిని నిజంగా ప్రభావితం చేసింది ఆ సభ్యుని యొక్క వ్యాఖ్య “సాయి వైబ్రియానిక్స్ మ్యాజిక్ వలె పనిచేస్తూ ఉండడం వలన నేను ఎల్లప్పుడూ వేగంగా కోలుకుంటాను”.  అంతేకాక ఆ ప్రాక్టీషనర్ ద్వారా కూడా ప్రోత్సహింపబడి అతను వెబ్సైట్ అన్వేషించారు. ప్రవేశ ప్రక్రియ స్వీకరించి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. e కోర్సు సమయంలో వైబ్రియానిక్స్ సమర్ధత గురించి వీరికి మొదటి అనుభవం చేకూరింది. పైన పేర్కొన్న ప్రాక్టీషనర్ వీరికి సంబంధించిన నిత్యం వేధించే తుమ్ములు, తరుచుగా కలిగే గొంతు ఇన్ఫెక్షన్ కోసం చికిత్స చేసినప్పుడు అది త్వరగా నయం కావడంతో తన విద్యార్థుల్లో చాలామందిని ఆ  తో ప్రాక్టీషనరుతో టెలిఫోన్ సంప్రదింపుల కోసం సూచించడమే కాక వారు అందించిన రెమిడిలను సేకరించి విద్యార్థులకు అందజేసేవారు.

2019 నవంబర్ లో పుట్టపర్తిలో తన AVP శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అదే రోజు మొదటి రెమిడి  CC1.1 Animal tonic + CC1.2 Plant tonic + CC15.1 Mental & Emotional tonic తయారుచేసి స్వామి ఫోటో ముందు నైవేద్యంగా సమర్పించి విశ్వ శాంతి కోసం స్వామిని ప్రార్ధించారు.  వీరి వైబ్రియానిక్స్ సేవ నాటకీయంగా ప్రారంభమైంది. వీరు వర్క్ షాప్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక గ్రామీణ మహిళ తన కొడుకు బైక్ నుండి రోడ్డుమీద పడిపోయి ప్రమాదానికి గురియవడాన్ని తన టాక్సీ నుండి గమనించారు. ఆమె పాక్షిక అచేతన స్థితిలో ఉండి రక్తస్రావం మరియు నొప్పితో మూలుగుతూ ఉంది. వెంటనే తన జేబులో ఉన్న అత్యవసర నివారణ (శిక్షణ సమయంలో తప్పనిసరి చేసిన ఒక నియమం మేరకు)ఆమెకు ఇచ్చారు ఆపై ఆమెను టాక్సీలో ఆస్పత్రికి తరలించారు ఈ విధంగా మొదటి రోగికి చికిత్స చేయడానికి ఆకస్మిక సేవా అవకాశం ఇచ్చినందుకు స్వామికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

  బృందావనానికి చేరుకున్న తర్వాత హాస్టల్లో విద్యార్థులతో తన ప్రాక్టీసు ప్రారంభించారు. అతి త్వరలోనే అనేక మంది విద్యార్థులు దీని గురించి తెలుసుకొని ప్రాక్టీషనర్ ని సంప్రదించడం ప్రారంభించారు. ఇది వీరిని ఎల్లప్పుడూ బిజీగా ఉండేలా చేయడంతో విద్యార్థులను వీరికి సహకరించడానికి ప్రోత్సహించి తద్వారా వారికి వైబ్రియానిక్స్ సేవలో భాగం పంచుకునే చక్కటి అవకాశం కల్పించింది. ఈ విధంగా 12 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి సీసాలలో కొంబోలను నింపడం మరియు వాటిని తగిన సూచనలతో పేషెంట్లకు అందజేయడం నేర్పించారు. అతిసారం, మలబద్దకం, మైగ్రేన్ తలనొప్పి, జ్వరం, దగ్గు మరియు జలుబు వంటి సాధారణముగా ఎదురయ్యే వ్యాధులకు పెద్ద మొత్తంలో రెమిడీలు తయారు చేసి అత్యవసర పరిస్థితిలో ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఈస్వచ్ఛంద సేవకులు టెలిఫోన్ ద్వారా ప్రాక్టీషనరును సంప్రదించి తగిన రెమిడీని రోగికి అందించడం ద్వారా ఈ సాధారణ వ్యాధుల చికిత్స క్రమబద్ధీకరిస్తారు.

2020 జనవరిలో జరిగిన వార్షిక క్రీడా వేడుకల కోసం విద్యార్థులందరూ పుట్టపర్తికి వెళ్లారు. డ్రామా సెట్స్ తయారు చేయడంలోనూ సుదీర్ఘమైన ప్రాక్టీస్ సందర్భంగానూ విద్యార్థులు తరచూ గాయాల పాలైనప్పుడు వైబ్రియానిక్స్ తో తయారుచేసిన నొప్పుల నివారణ కోంబో , CC3.7 Circulation + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures, వీరి మెంటర్ 11583.ను సంప్రదించి తయారు చేయడం జరిగింది. ఇది బాహ్య అనువర్తనం కోసం అవాల నూనెలో తయారు చేసి కండరాల తిమ్మిరి మరియు గాయాలకు ఉపయోగించబడింది. అలాగే నొప్పికి గురైన ప్రాంతముపై నీటిలో కరిగించి పిచికారీ చేయడానికి గోళిలను కూడా పంపిణీ చేశారు. ఈ కాంబో అప్పటినుండి మళ్లీ మళ్లీ ఉపయోగించబడింది మరియు ఇది ఎప్పుడూ విఫలం కాలేదు. చీలమండలో తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉన్న ఒక రోగి తెల్లవారుజామున 2 గంటలకు ప్రాక్టీషనరును సంప్రదించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో అటువంటి నొప్పి వచ్చినప్పుడు ఆమె పెయిన్ కిల్లర్ తీసుకునేవారు కానీ ఈ సారి స్ప్రే బాటిల్ తో తయారు చేసిన రెమిడి ఉపయోగించారు రెండు నిమిషాల్లో నొప్పి అదృశ్యమయింది. ఈ ఉపశమనం తో ఆమె ఎంతగానో ప్రభావితమై అప్పటినుండి నొప్పి నివారణ కోసం క్రమం తప్పకుండా స్ప్రే  ఉపయోగిస్తూ ఆలోపతి నొప్పి నివారణలు పూర్తిగా ఆపివేశారు. ఇదే కోంబో వృద్ధులైన ప్రాక్టీషనర్ తండ్రికి మోకాలు నొప్పికి మంత్రం లాగా పనిచేసి సత్వర ఉపశమనం ఇచ్చింది.

 ఈ ప్రాక్టీషనర్ తన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మరొక ముఖ్యమైన బాయ్స్ వెల్ బీయింగ్ కాంబో  తయారు చేశారు. మూడవ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉండి ఆత్మవిశ్వాస లోపంతో బాధపడుతున్న ఒక విద్యార్థి ఈ రెమిడీ తయారీకి స్ఫూర్తి. ఈ అబ్బాయి గిటార్ వాయించడంలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని 15 మంది సభ్యుల బృందంలో ఆర్కెస్ట్రా పోటీల్లో భాగంగా ఎంపికయ్యాడు కూడా. అయితే వేదికపై తనకు మొదటిసారి కావడంతో ఈ అబ్బాయి “నాకు ఈ ప్రోగ్రాం గురించి తలుచుకుంటేనే భయంతో చేతులు మరియు అరచేతులు చమటతో తడిసిపోతున్నాయి. ఈ పరిస్థితిలో గిటార్ వాయించడం నాకు చాలా కష్టం. నా తప్పిదం వల్ల మన బృందం మొత్తానికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు నా జుట్టును నిరాశ పరచడం నేను ఇష్టపడను. దీనిని నేను ఎలా పరిష్కరించడం” అని బాధ పడసాగాడు. ఈ ప్రోగ్రాం ఆదివారం జరగాల్సి ఉంది ఈ అబ్బాయి తన తీవ్రమైన భయ నివారణకు గురువారం నుండి CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic తో చికిత్స పొందాడు. ఆ తర్వాత అబ్బాయి ఎంతో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆ టీం గెలుపొందింది. వాస్తవానికి ప్రాక్టీషనర్ భావించిన బాయ్స్ వెల్ బీయింగ్ కాంబో.- CC4.1 Digestion tonic + CC12.1 Adult tonic + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic కు ఇది తొలి రూపము. దీనిని పరీక్షలకు ముందు, బృంద ప్రదర్శనకు ముందు, అబ్బాయిలు తరచుగా కోరేవారు. ఆ తర్వాత ఈ కాంబోను పెద్ద మొత్తంలో తయారుచేసి హాస్టల్ లో ఉన్న 28 గదులలో గదికి ఒక బాటిల్ చొప్పున ఉంచారు. రూమ్ లీడర్ ప్రతీ అబ్బాయి రోజు కనీసం ఒక సిప్ తీసుకోవడానికి వీలుగా నీటిలో రెమిడీ సిద్ధం చేస్తాడు.

2020 ఏప్రిల్ లో విద్యాసంవత్సరం ముగియడంతో విద్యార్థులు ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుఉన్నారు. కోవిడ్-19 అప్పటికే వేగంగా వ్యాపిస్తోంది. మన ప్రామాణిక ఇమ్యూనిటీ బూస్టర్‌ ను పెద్ద సంఖ్యలో తయారుచేసి వారి కుటుంబ సభ్యుల నిమిత్తం విద్యార్థులకు ఇవ్వబడింది. ఈ సందర్భంగా హృదయాన్ని ద్రవింపజేసే ఒక సంఘటనను వీరు గుర్తు చేసుకుంటున్నారు. జ్వరము, రుచి మరియు వాసన కోల్పోయి అనారోగ్యంగా కొవిడ్-19 లక్షణాలను కలిగి ఉన్న ఒక విద్యార్థి తండ్రికి ఇమ్యూనిటి బూస్టర్ బాటిల్ కొరియర్ చేసారు. ఆ తండ్రి హోమియోపతి చికిత్స తీసుకుంటూ ఉండగా దాన్ని ఆపి వేయమని విద్యార్థి సలహా ఇచ్చాడు. అతనుSOS అనగా ప్రతి పది నిమిషాలకు ఒక సిప్ చొప్పున రెండు గంటల వరకు ఆ రాత్రి తీసుకొని మరునాడు ఇదే మోతాదులో ఉదయం ఒక గంట వరకు తీసుకున్నారు. ఈ విధంగా 12 గంటలలో అతను పూర్తిగా కోలుకోవడమే కాక తన గదిలో ఉంచిన కర్పూర వాసన గుర్తుపట్టి కలిగారు. అబ్బాయి తల్లి కృతజ్ఞతతో ఈ కథంతా ప్రాక్టీషనర్ కు వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విధంగా ఇమ్యూనిటీ బూస్టర్ ఎంతో మందికి ఇవ్వగా వారు ఈ అనారోగ్యం బారిన పడకుండా తప్పించుకోగలిగారు. వైబ్రియానిక్స్ మానవాళికి ఇంకా తెలియని అనేక వ్యాధులకు చికిత్స చేయగలదని ప్రాక్టీషనర్ శిక్షణ సమయంలో తెలుసుకున్నారు. ఈ కోవిడ్ పరిస్థితుల్లో వారు దీన్ని స్పష్టంగా చూడగలిగారు.

లాక్ డౌన్ కాలంలో ప్రాక్టీషనర్ సీసాలు మరియు గోళీలు సేకరించి లేనప్పుడు స్థానిక ఇతర అభ్యాసకులు సరఫరాతో ముందుకు రావడంతో తన సేవ ఎప్పుడు ఆగలేదు. బోధన విర్ట్యువల్ ప్లాట్ ఫామ్ కి మారడంతో ఆ తరువాత  రెమిడీలను పోస్టు ద్వారా పంపడం ప్రారంభించి ఈ నాటికి కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తన సహ ప్రాక్టీషనర్ల సహకారంతో తన రోగులకు వారు ఉన్న ప్రాంతాలకు రెమిడీలు పంపగలుగుతున్నారు. అలాగే  తన కుటుంబము, స్నేహితులు మరియు సహచరులకు కూడా వైబ్రి యానిక్స్ పరిచయం చేశారు. 

 ఇతరుల యొక్క అనారోగ్య స్థితులను వారి ఇబ్బందులను దగ్గరగా చూసిన అనంతరం ఆరోగ్యం అనేది గొప్ప ఆశీర్వాదం అని ఈ ప్రాక్టీషనర్ అర్థం చేసుకున్నారు. అందుచేత ఆరోగ్యం విషయంలో సమగ్రమైన దృక్పథం కలిగి ఉన్నారు. తన ఆలోచనలు, మాటలుమరియు పనుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఇది అతని వ్యక్తిగత సాధనను తీర్చిదిద్దడానికి వీలు కల్పించింది. ప్రాక్టీషనర్ తన ఆత్మకు అనుగుణంగా జీవించినప్పుడు అతను దివ్యత్వానికి ఒక ఛానెల్ లాగా పని చేస్తాడనీ అప్పుడు అతను ఇచ్చే రెమిడీలు ఉత్తమంగా పని చేస్తాయని వీరు భావిస్తారు.

 ఈ ప్రాక్టీషనర్ మన 108cc పుస్తకం మొదటి పేజీలో ఉన్న స్వామి మాటలు “మీరు ప్రేమతో కోరబడినందున హృదయంతో సేవ చేయండి” అనే మాటలను తరచుగా మననం చేసుకోవలసిందిగా ప్రాక్టీషనర్లకు సిఫారసు చేస్తున్నారు. తద్వారా వైబ్రియానిక్స్ కు పునాది అయిన ప్రేమను ఆధారంగా చేసుకొని స్వీయ పరిశీలన చేసుకుంటూ సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ ప్రాక్టీషనర్ సాయి వైబ్రియానిక్స్ స్వామి ప్రేమతో తనకు ఇచ్చిన ప్రత్యేక కానుకగా భావిస్తున్నారు. ‘సాయి కేంద్రీకృత జీవితం’ కోసం తన భార్యతో కలిసి ప్రార్ధన చేస్తూ స్వామి విద్యార్థులకు శరీరము, మనస్సు, మరియు ఆత్మ యొక్క అన్ని అంశాలలో సేవ చేస్తూ వారిని పరిపుష్టి కలిగిన మంచి నాయకులుగా ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి కారకులుగా తయారు చేయడం లక్ష్యంగా కలిగి ఉన్నారు.  

పంచుకున్న కేసులు: