Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 00814...India


ప్రాక్టీషనర్  00814…క్రొయేషియా  వృత్తి రీత్యా ఫార్మసిస్ట్ ఐన ఈమె 40 సంవత్సరాల పని అనుభవం కలవారు. తను ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై ఆసక్తి కలిగి ఉన్నవారు కావడం మూలాన హోమియోపతిలో పూర్తి శిక్షణ పొందారు. 1989 లో “మ్యాన్ ఆఫ్ మిరకిల్స్” పుస్తకం చదివిన తర్వాత భగవాన్ బాబా వారి గురించి ఈమె తెలుసుకున్నారు. అప్పటినుండి ఆర్తిగా స్వామిని ప్రార్థిస్తూ ఉండడంతో స్వామి అనేక సందర్భాల్లో ఆమెకు కలలో కనిపించారు. ఆపైన 1991 లో ఆమె సాయి సంస్థలో క్రియాశీల సభ్యురాలై అప్పటి నుండి భజనలలో పాల్గొనడం ప్రారంభించారు. 1991 నుండి 95 వరకు క్రొయేషియాలో స్వాతంత్ర్య యుద్ధం అనేక కష్టాలను కలిగించింది. అదే సందర్భంలో సాయి సంస్థ ద్వారా సేవ చేయడానికి ఆమెకు విలువైన అవకాశాలను కూడా కల్పించింది. అంతేగాక ఆమె శ్రీ సత్య సాయి ఎడ్యుకేషన్ బాలవికాస్ టీచరుగా కూడా పనిచేశారు. 1994లో ఆమె మొదటి భారత పర్యటన సందర్భంగా వైట్ ఫీల్డ్ జనరల్ హాస్పిటల్ లో ఒక నెల రోజుల పాటు సేవ చేసే అవకాశం లభించింది.

1997లో పుట్టపర్తిని సందర్శించి నప్పుడు తోటి క్రొయేషియన్ ద్వారా సాయి వైబ్రియానిక్స్ గురించి మొట్టమొదటిసారి విన్నారు. సంక్షిప్త కోర్సు మరియు సూచనల అనంతరం  ఆమె అదే సంవత్సరంలో డాక్టర్ అగర్వాల్ గారి నుండి SRHVP యంత్రాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రెండు దశాబ్దాలలో వ్యాపారము మరియు గృహ కారణాల వల్ల ఆమె వైబ్రియానిక్స్ సాధన చేయలేకపోయారు.  ఆమె వైబ్రియానిక్స్ అభ్యాసాన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ బాబా తనను మరిచి పోలేదని స్పురింప చేసే బాబా వారి అద్భుత లీల అనుభవమయ్యింది. 2019 సెప్టెంబర్ లో నిర్వహిచిన క్రొయేషియా వైబ్రియానిక్స్ వర్క్  షాప్ రూపంలో మిసెస్&డాక్టర్ అగ్గర్వాల్ 20 సంవత్సరాల విరామం తర్వాత ఆమెకు రెండో అవకాశాన్ని అందించారు. దీనిని దైవానుగ్రహానికి సంకేతంగా ఆమె గుర్తించారు. ఆమె ఆన్లైన్ VP మరియు రిఫ్రెషర్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వర్క్ షాప్ కు హాజరై 108 CC బాక్సును అందుకున్నారు మరియు ఆమె అభ్యాసాన్ని తిరిగి ప్రారంభించినప్పటినుండి ఆమె వెనుకకు తిరిగి చూడలేదు.

 వర్క్ షాప్ నుండి ఇంటికి తిరిగి వచ్ఛేటప్పుడు ఆమె బస్ స్టేషనులో తన మొదటి రోగిని కనుగొన్నట్లు వివరిస్తున్నారు.  ఈమెను రిసీవ్ చేసుకోవడానికి బస్టాండ్ కు వచ్చిన ఆమె స్నేహితురాలు  సెలవులలో విదేశాలలో గడిపి వచ్చిన అనంతరం ఆమె మోకాలిలో అత్యంత బాధకారమైన నొప్పి ఏర్పడింది. ఒక నెలపాటు ఫిజియోథెరపీ తీసుకున్నా అది ఆమెకు సహాయం చేయలేదు. ఇది వినగానే అప్పటికప్పుడు తను కొత్తగా తీసుకున్న 108 సిసి బాక్స్ నుండి CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles and Supportive tissue, రెమిడి తయారు చేసి ఇచ్చి TDS గా తీసుకోమని చెప్పారు. మరునాటికే తన స్నేహితురాలి నొప్పి 50% తగ్గింది. ఇది ఇతర బహుళ అనారోగ్య సమస్యల కోసం తనను సంప్రదించడానికి ఆమె స్నేహితురాలిని ప్రేరేపించింది. తదనంతరం ఆమె అనేక మంది కుటుంబ సభ్యులతో పాటు సహోద్యోగులకు కూడా చికిత్స చేశారు.

అదే సంవత్సరం “లావెండర్ ప్రాజెక్ట్ ” కొత్తగా వచ్చింది. సహజంగానే ప్రజలు, జంతువులు, మరియు మొక్కలు పట్ల ఎల్లప్పుడూ కరుణ కలిగి ఉండే ఈ ప్రాక్టీషనర్ తను నివసిస్తున్న పట్టణంలోని పర్యావరణ ప్రాంతంలో 850 లావెండర్ పొదలు మరియు 100 ఆలివ్ చెట్లు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ ముఖ్యంగా లావెండర్ పొదలు ఆరోగ్య స్థితిలో లేవని గమనించారు. ఈ పొదలకు చికిత్స చేయడానికి మరియు జాగ్రత్తగా చూసుకొనడానికి అనుమతించాలని అభ్యర్థనతో స్థానిక ప్రభుత్వమును సంప్రదించారు. స్థానిక అధికారులు సంతోషంగా ఆమెకు అనుమతి ఇవ్వడమే కాకుండా ఈ ప్రాజెక్టులో అందుకు సహాయం చేయడానికి నలుగురు వాలంటీర్లను కూడా అందించారని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు!

ప్రాక్టీషనరు CC1.2 Plant tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.7 Fungus. రెమిడిని సిద్ధం చేశారు. మొదటి సందర్భంలో ఆమె ఒక లీటర్ నీటిలో 8 గొళీలను కరిగించారు. అట్టి ద్రావణాన్ని 50 లీటర్ల నీటికి చేర్చి ఈ బృందం రోజుకు ఒకసారి (బొమ్మను చూడండి) పిచికారి చేశారు. ఆ తరువాత ద్రావణాన్ని సులభంగా తయారు చేయడం కోసం  ఆమె పైన పేర్కొన్న ఒక్కొక్క కాంబోకు 8 చుక్కలు చొప్పున ఒక లీటరు నీటిలో వేసి అనంతరం యాభై లీటర్ల నీటిక జోడించారు. చికిత్స 2020 మార్చి 8న ప్రారంభమై మహమ్మారి కోవిడ్ లాక్ డౌన్ కారణంగా మార్చి 27న పనిని ఆపి వేయవలసి వచ్చే వరకూ మూడు వారాలు కొనసాగింది. ప్రాక్టీషనరు చాలా నిరాశకు గురయ్యారు కానీ ఆమె దాన్ని స్వామి సంకల్పంగా తీసుకున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసినప్పుడు ఈ బృందం తమ ప్రాజెక్టు పర్యావరణ ప్రాంతాన్ని సందర్శించి లావెండర్ పొదలు పూర్తిగా విరబూశి అవి ఎంతో ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు (ఫోటోలు చూడండి). ప్రాక్టీషనరు CC1.2 Plant tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.7 Fungus. రెమిడిని సిద్ధం చేశారు. మొదటి సందర్భంలో ఆమె ఒక లీటర్ నీటిలో 8 గొళీలను కరిగించారు. అట్టి ద్రావణాన్ని 50 లీటర్ల నీటికి చేర్చి ఈ బృందం రోజుకు ఒకసారి (బొమ్మను చూడండి) పిచికారి చేశారు. ఆ తరువాత ద్రావణాన్ని సులభంగా తయారు చేయడం కోసం  ఆమె పైన పేర్కొన్న ఒక్కొక్క కాంబోకు 8 చుక్కలు చొప్పున ఒక లీటరు నీటిలో వేసి అనంతరం యాభై లీటర్ల నీటిక జోడించారు. చికిత్స 2020 మార్చి 8న ప్రారంభమై మహమ్మారి కోవిడ్ లాక్ డౌన్ కారణంగా మార్చి 27న పనిని ఆపి వేయవలసి వచ్చే వరకూ మూడు వారాలు కొనసాగింది. ప్రాక్టీషనరు చాలా నిరాశకు గురయ్యారు కానీ ఆమె దాన్ని స్వామి సంకల్పంగా తీసుకున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసినప్పుడు ఈ బృందం తమ ప్రాజెక్టు పర్యావరణ ప్రాంతాన్ని సందర్శించి లావెండర్ పొదలు పూర్తిగా విరబూశి అవి ఎంతో ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు (ఫోటోలు చూడండి). స్థానిక అధికారులు చాలా సంతోషించి ఆలివ్ చెట్లకు కూడా మూడు నాలుగు నెలల వ్యవధిలోఇదే  చికిత్సను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టీషనరు తానింకా అనుభవ రాహిత్యురాలినే అని తనకు ప్రత్యేకమైన ఫార్ములా ఏదీ లేదని కేవలం కోంబోల తోనే లావెండరు పొదలకు చికిత్స చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆచరణాత్మకంగా ఈమె వైబ్రియానిక్స్ వార్తాలేఖలను చదవడం, ఇతర అభ్యాసకులను అనుసరించడం, మరియు ఆమె గురువు(మెంటర్) మరియు వైబ్రో సహచరులతో మాట్లాడడం ద్వారా ఆమె జ్ఞానాన్ని పొందుతున్నారు.  నిజమైన టీం వర్క్ చూడడం తన జీవితంలో ఇదే మొదటిసారి అని ఆమె పేర్కొంటున్నారు.

ప్రజలకు, జంతువులకు, మరియు మొక్కలకు  సహాయం చేయడంలో ఆమె పూర్తి సంతృప్తి అనుభవిస్తున్నారు మరియు సాయి వైబ్రియానిక్స్ సాధన తను ఒక ఫార్మసిస్ట్ గా పనిచేసిన అన్ని సంవత్సరాల అనుభవం కన్నా ఎంతో  ఎక్కువ సంతృప్తిని అందించిందని ఆమె పేర్కొంటున్నారు.

 

పంచుకున్న కేసులు