Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 11 సంచిక 2
March/April 2020
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన వైబ్రియో అభ్యాసకులారా,

పుట్టపర్తి లో జరుగుతున్న మహా శివరాత్రి వేడుకల సందర్భంగా మీకు ఈ విధంగా వ్రాస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది, ఇక్కడ ఈ ఆనందకరమైన పండుగను ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని చేకూర్చేవేద పఠనం మరియు పారవశ్యం కలిగించే 12 గంటల నిడివి గల అఖండ భజనతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మన దివ్య గురువు ఏమన్నారంటే సంవత్సరానికి ఒకసారి శివరాత్రి గురించి కేవలం తలుచుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ప్రతీ నిమిషం, ప్రతీరోజు, ప్రతీరాత్రి దివ్యత్వం గురించే తలుస్తూ మీ సమయాన్ని పవిత్రం చేసుకోవాలి, ఎందుకంటే వాస్తవానికి ఆ కాలగమన సూత్రము శివ తత్వమే. ఆ శివుడు మీరే కనుక మీ నిజ తత్వం ఐన అట్టి శివ తత్వ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి మరియు గుర్తించడానికి ప్రయత్నించండి. …శ్రీ సత్య సాయి బాబా, శివరాత్రి దివ్యవాణి, 1985 ఫిబ్రవరి 17. ఇది చాలా సరళంగా అనిపించినా, మన ప్రతీ క్షణం/ ప్రతీ శ్వాసను ఆధ్యాత్మికమయం చేయడానికి స్వామి సూచించిన అత్యంత శక్తివంతమైన సందేశం. ఈరోజు ప్రపంచం అనేక రంగాల్లో గందరగోళ స్థితిలో భయాందోళన మధ్య  ముఖ్యంగా కరోనా వైరస్ లేదా COVID-19(WHOప్రపంచ ఆరోగ్యసంస్థచేత పేరు పెట్టబడినది) అనే మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమవుతోంది. ఈ వైరస్తో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో మనం తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి ఈ సంచికలోని “అదనంగా”అనే విభాగంలో ప్రత్యేక కథనం ఇవ్వబడింది. నా ఆలోచన ఏమిటంటే ఆధ్యాత్మికమగా మన జీవితాలను చార్జింగ్ చేసుకుంటూ మన బాహ్య మరియు అంతర్గత ఇంద్రియాల ద్వారా మనం తీసుకునే వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం ఒక గొప్ప విటమిన్ సేవించడం వంటిది మాత్రమే కాక మనం తీసుకునే ఒక ప్రభావితమైన ముందస్తు చర్య వంటిది. కనుక మన అభ్యాసకులు అందరూ ఈ సంచిక చివరలో సూచించిన విధంగా భద్రతా చర్యలు పాటించవలసిందిగా నావిన్నపము మరియు అభ్యర్థన.

మన వార్తా లేఖసంపుటి 9 సంచిక 2 (మార్చి ఏప్రిల్ 2018 )లో,  ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణలో ఉత్తమ పద్ధతుల ఆధారంగా ఒక అధికారిక సంస్థను రూపొందించడం మరియు అమలు చేయడం ఇంకా దానిని విస్తృతపరచాలనే ఉద్దేశ్యంతో సంక్షిప్తంగా వివరించడం జరిగింది. నేను ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛంద సేవకులు తమ ఉన్నతి కోసం ప్రతిస్పందించడం, ఇప్పుడు అటువంటి ప్రామాణిక ఆపరేటింగ్ నిర్మాణాత్మక విధానాలు SOP(Standard Operating Procedure) తో కూడిన సంస్థ నిర్మాణము చేపట్టడం జరిగిందని తెలపడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం 9 ప్రధాన విభాగాలతో నిర్మాణాత్మక మరియు క్రియాశీలక సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి ఏమిటంటే : కార్యకలాపాలు మరియు వ్యూహాలు(ఆపరేషన్స్&లాగిస్టిక్స్), ప్రవేశములు, విద్య, శిక్షణ మరియు ప్రమోషన్లు; పరిశోధన మరియు అభివృద్ధి; వార్తాలేఖలు; ఐ‌ఏ‌ఎస్‌వి‌పి(IASVP); ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ; ఆడియో విజువల్స్; మరియు ప్రచురణలు. ప్రతీ ఒక్క విభాగము దాని నిర్వహణ కోసం అనేక విషయాధారిత విభాగాలుగా ఏర్పడ్డాయి. ఇది ఇప్పటికే అభ్యాసకుల కోసం అనేక అడ్మిన్ సేవా(నిర్వహణా బాధ్యతలు) అవకాశాలను కల్పించింది. దీని విస్తరించే కొద్దీ, మనకు e- కోర్సు నుండి SVP స్థాయి వరకు అన్ని స్థాయిలలో ఎంతో మంది టీచర్స్ (మరియు మెంటర్స్) కావలసి ఉంటుంది. వార్తా బృందానికి సమాచారాన్ని అందించగల రచనా నైపుణ్యం ఉన్నటువంటి అభ్యాసకులు మరియు ఆడియో విజువల్ విభాగము కోసం సమాచారం సంగ్రహించగల అభ్యాసకుల అవసరం ఎంతైనా ఉంది. ఇట్టి సేవ కోసం స్వచ్ఛందంగా పాల్గొనే వారందరికీ మేము పూర్తి శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందిస్తాము.

మా అభ్యాసకులు వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్నసాయి వైబ్రియానిక్స్ వైద్య శిబిరాల ద్వారా పెద్ద సంఖ్యలో రోగులు ప్రయోజనం    పొందుతున్నారు. ఐతే ఉన్నత ప్రమాణాలు గల చికిత్సను అందించడమే కాకుండా ఎక్కువమంది రోగులు ఈ వైద్యం వలన లబ్ధి పొందాలి అనేదే మా సంకల్పం. ఈ కార్య కలాపాలను రికార్డు చేస్తూ ఇటువంటి క్యాంపుల యొక్క అనుభవాలు మిగతా అభ్యాసకులకు కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా పంచుకోవాలని అనుకుంటున్నాము. దీని కోసం, క్యాంపుకు సంబంధించిన చక్కటి ఫోటోలతో పాటు దాని గురించి క్లుప్తంగా వివరాలు కూడా రాసి పంపించండి. అభ్యాసకులు ఈ విధంగా చేయగలిగితే అది ఎంతో ప్రశంసనీయం.

IASVP సభ్యులలోతమ ఐ.డి.కార్డులను రెన్యువల్ చేయించుకోవటంలో కొంత సందిగ్ధత ఉంది. దయచేసి ఒక విషయం గమనించండి, మీకు రెన్యువల్ చేయించుకోవాలని నోటిఫికేషన్ అందిన వెంటనే మన ప్రాక్టీషనర్ వెబ్సైట్లోకి వెళ్లి దానిలో ఉన్న నిబంధనలను చదవడం తప్పనిసరి (కారణం ఏమిటంటే ఈ నిబంధనల విషయంలో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఎన్నోమార్పులు జరుగుతూ ఉన్నాయి) అంతేకాక దిగువన ఉన్న సబ్మిట్ బటన్ నోక్కే ముందు క్రింద ఇవ్వబడిన చెక్ బాక్స్ ను తప్పనిసరిగా టిక్ చేయాలి.

దీనిని ముగించే ముందు, మనమందరము ప్రతి రోజు కొన్ని నిమిషాలు ప్రార్థన లో గడపాలని, మన కరుణ, ప్రేమ, నయం చేసే శక్తిని ఈ భూమాతకు మరియు కోవిడ్ 19 వైరస్ బారిన పడిన వ్యక్తులకు చేరి దాని నుండి విడుదల కావాలని కోరుకుంటూ చివరిగా మన ప్రభువు యొక్క గొప్ప జ్ఞానోదయం కలిగించే సందేశంతో ముగించాలి అనుకుంటున్నాను.“ప్రజలు ప్రపంచాన్ని ప్రేమ దృష్టితో చూసినప్పుడు, అట్లు చూచిన వారికి శాంతి లభిస్తుంది. అన్ని వ్యాధులు నయమవుతాయి. చాలా వ్యాధులకు వాటి మూలము మనసులోనే ఉంటుంది. ప్రతిదానికి మనసే ఆధారం. ఒక వ్యక్తి తనలో ఏదో తప్పు జరిగిందని భావించినప్పుడు, అది అనారోగ్యంగా పరిణమిస్తుంది. కనుక ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన మనస్సు అవసరం .

“ప్రేమతో రోజును ప్రారంభించండి, ప్రేమతో రోజును గడపండి, ప్రేమతో రోజును ముగించండి అదే దేవుని చేరే మార్గం. ఇట్టి ప్రేమను పెంపొందించుకున్నప్పుడు వ్యాధి మీ దరిచేరదు... సత్యసాయిబాబా శివరాత్రి ఉపన్యాసం, 1985 ఫిబ్రవరి 17.

ప్రేమ పూర్వక సాయి సేవలో

మీ జిత్ కె అగ్గర్వాల్

అతిసారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 03542...UK

2019 ఆగస్టు 22న, ఒక సెలవు రోజు అభ్యాసకుడు ప్యారిస్ లో ఒక హోటల్ లో ఉన్నప్పుడు, అదే హోటల్లో అనారోగ్యంతో ఉన్న 75 ఏళ్ల మహిళ భర్త అర్ధరాత్రి అభ్యాసకుని సహాయం అర్ధించడం జరిగింది. ఆమెకు ఉదయం నుండీ కడుపులో తిమ్మిరి, విరోచనాలు, తలపోటు మరియు ఛాతీలో రద్దీ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని అయితే ఆమె హాస్పిటల్ కి వెళ్లడానికి ఇష్టపడలేదని రోగి భర్త తెలిపారు. అభ్యాసకుడు వెంటనే తనవద్దనున్న వెల్నెస్ కిట్టు నుండి క్రింది రెమిడీ ఇచ్చారు:

అతిసారం కోసం :
#1. Eat Well + Emergency… ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఒక గంట వరకూ, అలాగే ఒక గంట విరామం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నిమిత్తం :
#2. Breathe Well… #1 వలే అదే మోతాదు

 ఉదయానికల్లా రోగికి చాలా వరకూ ఉపశమనం కలిగింది. ఆమెకు తిమ్మిరి, తలనొప్పి, విరేచనాలు, శ్వాసలో ఇబ్బంది విషయంలో 75% మెరుగుదల కనిపించింది. రోగి పూర్తిగా కోలుకోవడంతో, మోతాదు 25 ఆగస్టు నాటికి TDS, మరో రెండు రోజుల తరువాత OD కి తగ్గించి, ఆగష్టు 29న నిలిపి వేయడం జరిగింది. ఆ తర్వాత వారికి ఉన్న కొన్ని సెలవలలో రోగి ఉల్లాసంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ కృతజ్ఞతతో ఆ జంట ఇప్పటికీ అభ్యాసకుడుతో సన్నిహితంగా ఉంటున్నారు.

108 సిసి బాక్స్ ఉపయోగిస్తుంటే, ఇవ్వండి: సిసి 4.6 డయేరియా

పెద్ద ప్రేగులో తిత్తులు మరియు ప్రేగుశోధ 03542...UK

మలేషియాకు చెందిన 53ఏళ్ల మహిళకు గత రెండు సంవత్సరాలుగా కడుపులో తిమ్మిరి మరియు రోజుకు కనీసం ఆరు సార్లు మల విసర్జనకు వెళ్లడం జరుగుతూ ఉండేది.  దీన్ని 2018 జులై నాడు కొలైటిస్ లేదా పెద్దప్రేగుశోధఅనీ; అలాగే కొలొనో స్కొపీ ద్వారా పెద్ద ప్రేగులో తిత్తులు మంట ఉన్నట్టు వెల్లడైంది.  వారి యొక్క ఫిజిషియన్ సూచనమేరకు, ఆమె తీసుకుంటున్నఆహారము విషయంలో సమూలంగా మార్పు తెచ్చి, ఓట్స్ ఆపివేసి, ప్రోబియో టిక్స్ తీసుకోవడం ప్రారంభించారు. 2018 డిసెంబర్ 13 న, పుట్టపర్తిలో అభ్యాసకుని ఆమె కలిసినప్పుడు, ఆమెకు పొత్తికడుపులో నిరంతరాయంగా నిస్తేజమైన నొప్పి మరియు ఆమె రోజుకి మూడుసార్లు మలవిసర్జన చేస్తున్నట్లు చెప్పారు. ఆమె ఎటువంటి మందులు తీసుకోలేదు. ఆమెకు 2018వైబ్రియానిక్స్ పుస్తకం ప్రకారం ఈ క్రిందనివారణ  ఇవ్వబడింది:

NM1 Amoebic Dysentery + NM2 Blood + NM36 War + NM80 Gastro + NM113 Inflammation + OM6 Colon + SR221 Heart Chakra + SR223 Solar Plexus Chakra + SR285 China Off + SR340 Aloe Socotrina + SR415 Terebin + SR473 CN10:Vagus + SR481 Colon Total...TDS

 2018 డిసెంబర్ 27న, పేషెంట్ మలేషియా నుండి మాట్లాడుతూ గత వారం రోజులుగా ఆమెకు కడుపులో నొప్పి లేదని మరియు సాధారణ స్థాయిలో రోజుకి ఒకటి లేదా రెండు సార్లు మలవిసర్జనకు వెళుతున్నట్లు తెలిపారు. మోతాదును అదే క్రమంలో కొనసాగించాలని అభ్యాసకుడు ఆమెకు సూచించారు. ఒక నెల తర్వాత అది క్రమంగా గా తగ్గించబడి 2019 ఫిబ్రవరి నాటికి నిలుపుదల చేయబడినది. 2020 జనవరి నాటికి, ఆమెకు రోగ లక్షణాలు ఏమి పునరావృతం కాలేదని నిర్ధారించబడింది.

 108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లయితే: CC4.6 Diarrhoeaఉపయోగించండి.

 

అస్పష్టమైన దృష్టి మరియు మైకము 01001...India

38-సంవత్సరాల మహిళకు గత 3 నెలలుగా రోజుకు అనేకసార్లు అస్పష్టమైన దృష్టి మరియు అప్పుడప్పుడు మైకము కలుగుతున్నాయి. పనిలో ఒత్తిడి మైకము యొక్క తీవ్రతను మరింత తీవ్ర పరుస్తోంది. ఆమె వైద్యుడు న్యూరాలజిస్ట్ సంప్రదించమని సూచించాడు, అయితే ఆమె న్యూరాలజిస్ట్ ను సంప్రదించకుండా, బదులుగా, 2018 డిసెంబర్ 5న అభ్యాసకుని సంప్రదించారు.

ఆమెకు క్రింది నివారణ ఇవ్వబడింది:
NM44 Trigeminal Neuralgia + NM109 Vision + NM22 Liver + SM39 Tension…TDS నోటిలో వేసుకొనడానికి మరియు స్వేద జలం (డిస్టిల్ వాటర్) లో కంటి  చుక్కలుగా …BD 

నెల రోజుల తర్వాత, రోగి యొక్క లక్షణాల్లో 50% మెరుగుదల కనిపించింది. ఆమె ఇప్పుడు కొంచెం స్పష్టంగా చూడగలుగుతున్నారు, అస్పష్టం గా కనిపించడం తగ్గింది మరియు పని ఒత్తిడి వలన మైకం కూడా పెరగలేదు. ఆరు వారాల తర్వాత 2019 ఫిబ్రవరి 20 నాటికి, వంద శాతం మెరుగుదల కనిపించింది. కంటి చుక్కలు ఆపివేసి నోటి ద్వారా మోతాదుని ODగా ఆరు నెలలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత దాన్ని 3TWకి తగ్గించారు. 2020ఫిబ్రవరి నాటికి, ఆమె రోగ లక్షణాలు పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నారు అయితే మోతాదు మరింత తగ్గించడానికి ఆమె సుముఖత చూపలేదు.

 108CC బాక్సు,ఉపయోగించే టట్లయితే : CC7.1 Eye tonic + CC15.1 Mental & Emotional tonic ఇవ్వడం మంచిది.

 

కాలి మీద బాధాకరమైన వ్రణము 01001...India

అభ్యాసకురాలి 49 సంవత్సరాల వయస్సు గల భర్తకు కాలి మీద ఎర్రబడిన పుండు ఉండేది. ఇది 15 రోజులుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అది చూడటానికి చిన్న బంతి లాగా ఉండి చీము ఉంది.

2019 ఫిబ్రవరి 2న క్రింది రెమిడీ ఇవ్వబడింది:

NM16 Drawing…6TD లోపలికి తీసుకొనడానికి మరియు బాహ్యంగా ఆలివ్ ఆయిల్లో మొదటి రోజు మాత్రమే రాయడానికి BD 

మొదటి రోజు రెండవ మోతాదు తీసుకునేటప్పుడు రోగికి ఎంతో ఉపశమనం కలిగింది. అతనిని ఆశ్చర్యానికి గురిచేస్తూ పుండు  అదృశ్యమై, కేవలం ఒక సన్నని రంధ్రం మాత్రం ఉంది. తన పాంటు లో కొంత భాగం తడిగా ఉండటం చూసి చీము విడుదలైందని తెలుసుకున్నారు. మరుసటి రోజు చర్మం చక్కగా అక్కడ అసలు ఏమీ లేనట్టుగా ఉంది. మోతాదు మూడు రోజులుTDS గా అనంతరం రెండు రోజులు ODకి తగ్గించి 2019 ఫిబ్రవరి 7న ఆపివేయబడింది. ఫిబ్రవరి 2020 నాటికి రోగ లక్షణాలు పునరావృతం కాకుండా చక్కగా ఉంది.

108CC బాక్స్ ఉపయోగించే వారు : CC21.11 Wounds & Abrasions ఇవ్వవచ్చు.

శీతాకాలపు దద్దుర్లు 02870...USA

63 ఏళ్ల మహిళ దాదాపు 15 సంవత్సరాలుగా ప్రతీ శీతాకాలంలోనూ తన వీపు భాగంలో ఎరుపుదనం మరియు దురదతో కూడిన దద్దుర్లతో బాధపడుతోంది. ఇది ఆమె వెనుక భాగం నుండి ఛాతీ క్రింద ఉదర ప్రాంతానికి వ్యాపించింది. అక్కడ చర్మం మృదుత్వం కోల్పోయి చాలా గట్టిగా పీటలాగా మారిపోయినట్లు అనిపించింది. ఆమె నివసించే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏక అంకె స్థాయికి సింగిల్ డిజిట్ (ఫారన్ హీట్ మానంలో)కి పడిపోయినప్పుడు దురద ప్రారంభమవుతుంది. కొన్ని సమయాల్లో ఈ లక్షణాలు శరదృతువు చివర్లో (సెప్టెంబర్) లేదా శీతాకాలం ప్రారంభంలో మొదలవుతాయి. అలాగే ప్రతీ జూన్ లో ఉష్ణోగ్రత పెరగడంతో దద్దుర్లు మాయమైపోతాయి 2015 సెప్టెంబర్ 3వ తేదీన రోగి ప్రాక్టీషనర్ ని సందర్శించే నాటికి, ఆమె మందులేవీ తీసుకోవడం లేదు.

ఆమెకు క్రింది నివారణ ఇవ్వబడింది
CC12.1 Adult tonic + CC21.1 Skin tonic + CC21.6 Eczema + CC21.10 Psoriasis…TDS

6 వారాల తర్వాత, అనగా 2015 అక్టోబర్ 20 నాటికి, రోగి తన చర్మంపై దద్దుర్లు లేవని చర్మం గాజు వలె నునుపుగా మృదువుగా ఉందని తెలపడంతో మోతాదును BD కి తగ్గించారు కానీ పది రోజుల తర్వాత, మరలా దురద ఆమె వెనుక భాగంలో పెరిగినట్లు ఫిర్యాదు చేయగా, మోతాదు తిరిగి TDSకు మార్చబడటంతో ఉపశమనం ప్రారంభమైంది.

2016 మార్చి13 వ తేదీన, రోగి 2015-16 శీతాకాలములో తనకు ఎటువంటి దద్దుర్లు రాలేదని, దురద కూడా లేదని గత నాలుగు నెలలుగా 100% ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. కనుక మోతాదును నెల పాటు ODకి తగ్గించారు. రోగ లక్షణాలు పునరావృతం కాకపోవడంతో మోతాదు క్రమంగా 3TW, 2TW, చివరిగా OW స్థాయికి మూడు నెలల్లో తగ్గించి ఆపివేయడం జరిగింది. ఏడు నెలల తర్వాత, 2017 ఫిబ్రవరి లో రోగి తనకు 2016-17 శీతాకాలంలో కూడా రోగ లక్షణాలు ఏమీ పునరావృతం కాలేదని తెలిపారు. పేషెంట్ ఆ ప్రాంతం నుండి వెళ్లిపోవడంతో, ఎటువంటి సమాచారం పొందలేకపోయారు.

చర్మము పై ఇన్ఫెక్షన్ 11563...India

 27-సంవత్సరాల మహిళకు గత ఆరు నెలలుగా కాళ్ళపై మరియు చేతులపై ముఖ్యంగా ఎడమ ముంజేతి ప్రాంతంలో (ఫోటో చూడండి) దద్దుర్లు వ్యాపించాయి. దురద చాలా తీవ్రంగా ఉండడంతో దీని కారణంగా రోజుకు 2-3 గంటలు మాత్రమే నిద్రపో గలుగుతున్నారు. ఆమె వైద్యుని సంప్రదించ లేదు కానీ అనేక గృహ నివారణలు ప్రయత్నించారు కానీ ఉపశమనం కలగలేదు. 2018 ఏప్రిల్ 15న ఆమె అభ్యాసకుని సంప్రదించగా క్రింది నివారణ ఇచ్చారు:
#1. CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions…6TD 
#2. CC12.4 Autoimmune diseases + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions…QDS 
ఆలివ్ నూనెలో బాహ్య అనువర్తనం కోసం.

పన్నెండు రోజుల తర్వాత దద్దుర్లు 50% మరియు దురద 75% మెరుగు పడినట్లు ప్రస్తుతం ఆమె చక్కగా నిద్రపో గలుగుతున్నట్లు తెలిపారు. #1 మరియు #2 మోతాదులు TDSకి తగ్గించబడినవి. మూడు నెలల తర్వాత అనగా ఆగస్టు 4న, ఆమె వ్యాధి లక్షణాలు 90% మాయమయ్యాయి( ఫోటోలు చూడండి) కనుక పై రెండు మోతాదులనూ రెండు వారాల వరకూ BDకి అనంతరం ODకి తగ్గించబడింది. రెండవ సందర్శనలో, రోగి తనకు ఫైబ్రాయిడ్లు మరియు పిసిఒడి ఉన్నట్లు అలాగే అధిక రక్తస్రావం తోపాటు కడుపులో నొప్పి కూడా వస్తున్నట్లు తెలిపారు.

కనుక అదనంగా ఆమెకు క్రింది నివారణ ఇవ్వబడింది:
#3. CC8.7 Menses frequent + CC10.1 Emergencies + CC12.1 Adult tonic… ప్రతీ గంటకు ఒక మోతాదు చొప్పున మొదటి రోజు తరువాత 3 రోజులు 6TD తరువాత TDS.

2018 అక్టోబర్ 9 నాడు ఆమె తదుపరి సందర్శన నాటికి ఆమె ఋతుక్రమ అధిక రక్తస్రావం ఆగిపోయింది, కానీ దానితో పాటు నెలసరి ఋతు స్రావాలు కూడా ఆగిపోయాయి. ఆమె చర్మం మరింత మెరుగు పడింది, ఇప్పుడు #3 ను క్రింది రెమిడీతో భర్తీ చేయడం జరిగింది:
#4. CC8.8 Menses irregular + CC10.1 Emergencies + CC12.1 Adult tonic…TDS

2018 నవంబర్ 2 నాటికి, ఆమె చర్మపు స్థితి సాధారణమైంది, కానీ అధిక రక్తస్రావంతో పాటు వెన్ను మరియు కడుపులో నొప్పి  ప్రారంభమయ్యాయి. కనుక #4 ను క్రింది నివారణ తో భర్తీ చేయడం జరిగింది:
#5. CC20.2 SMJ pain + CC20.5 Spine + #3… ప్రతీ గంటకు ఒక మోతాదు మొదటి రోజు తరువాత 6TD మూడు రోజుల వరకూ అనంతరం TDS.

2018 నవంబర్ 14 నాటికి, ఆమెఋతు రక్తస్రావం ఆగక పోవడంతో  ఆమె అల్లోపతి ఇంజక్షన్లు తీసుకున్నారు. తరువాతి సందర్శనలో అనగా 2018 నవంబర్ 28న, ఆమె కాళ్లపై పొక్కులు ఏర్పడినట్టు తెలిపారు, #1 మరియు #2 ఆపివేసి క్రింది నివారణతో భర్తీ చేయడం జరిగింది.

#6. CC12.4 Autoimmune diseases + CC21.3 Skin allergies + CC21.10 Psoriasis…TDS ఎక్స్ట్రా విర్జిన్ నూనెలో బాహ్య అనువర్తనం కోసం

#7. CC12.1 Adult tonic + #6…TDS

డిసెంబర్ 9 వ తేదీన, ఆమె పాదంలో వాపుతో పాటు నొప్పి కూడా ప్రారంభ మయ్యింది. దీనితో  #6 మరియు #7 క్రింది నివారణతో భర్తీ చేయడమైనది:

#8. CC21.11 Wounds & Abrasions + #6…TDS in extra virgin olive oil for external application
#9. CC10.1 Emergencies + CC21.11 Wounds & Abrasions + #7…TDS

ఏమాత్రం మెరుగుదల కలుగక పోవడంతో, అభ్యాసకుడు నివారణలను సమీక్షించి 2018 డిసెంబర్ 27 న #8 మరియు #9 ని క్రింది రెమిడీతో భర్తీ చేసారు:

#10. CC12.4 Autoimmune diseases + CC21.2 Skin infections + CC21.6 Eczema + CC21.11 Wounds & Abrasions…BD in extra virgin olive oil & vibhuti for external application
#11. CC8.1 Female tonic + CC9.2 Infections acute + CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.6 Eczema… మొదటి రోజు ప్రతీ గంటకు ఒక మోతాదు తరువాత రెండు రోజుల వరకూ  6TD అనంతరం డిసెంబర్ 30 నుండిTDS 

2019 జనవరి 21 నాటికి ఆమె చర్మ స్థితిలో స్థిరమైన మెరుగుదల కనిపించింది. పొక్కులు వాపు పూర్తిగా తగ్గిపోయి, మచ్చలు మాత్రమే మిగిలాయి. #10 మరియు  #11 మోతాదు రెండు నెలలకు గాను OD కి తగ్గించ బడింది.

ఆమెకు పూర్తిగా తగ్గిపోయినట్లు భావించడంతో, 2019 మార్చి 15న నివారణలు తీసుకోవడం మానివేసింది. 2020 జనవరి నాటికి దురద, దద్దుర్లు, పొక్కులు ఏవీ పునరావృతం కాలేదు.

ఉదరంలో నొప్పి 11618...India

 47 సంవత్సరముల వ్యక్తి గత తొమ్మిది నెలలుగా పొత్తి కడుపుకు కుడివైపు మందకొడిగా ఉండే నొప్పి కలిగి ఉన్నారు. అతని యొక్క పని ఒత్తిడి వలన, వైద్యుడిని సంప్రదించ లేదు. 2019 ఆగస్టు 4 వ తేదీనాటికి గత రెండు రోజులుగా నిరంతరం నొప్పితో బాధపడుతూ అతను ముందుకు వంగినప్పుడు ఈ నొప్పి భరింప శక్యము కాకుండా ఉండే సరికి అభ్యాసకుని సంప్రదించారు. వీరు ఇతర మందులు ఏమీ తీసుకోలేదు. నొప్పి నివారణకు వీరికి క్రింద నివారణ ఇవ్వబడినది:
CC4.3 Appendicitis + CC4.10 Indigestion + CC10.1 Emergencies…6TD

మరుసటి రోజుకి, అతని నొప్పి యొక్క తీవ్రత 20 శాతం తగ్గింది. సరిగ్గా వారం తర్వాత, ఆగస్టు 11న, నొప్పి90% తగ్గిందని ఐతే ఈ నొప్పి వ్యాయామం సమయంలో మాత్రము స్వల్పంగా ఉంటోందని తెలిపారు. అందువల్ల, మోతాదు TDS కు తగ్గించబడింది. ఆగస్టు 19 నాటికి 100% ఉపశమనం కలిగినట్లు తెలపడంతో, మోతాదు ODకి తగ్గించబడింది. ఐతే 2019 ఆగస్టు 29 నాటికి పూర్తిగా తగ్గిపోవడంతో, నివారణలు తీసుకోవడము ఆపివేశారు. 2020 ఫిబ్రవరి నాటికి అభ్యాసకుడు ఆరాతీయగా, నొప్పి మరలా పునరావృతం కాలేదని పేషంటు తెలిపారు.

ఆమ్లత్వము, ఆహారపు అలెర్జీ 11618...India

58-సంవత్సరాల మహిళ గత ఎనిమిది సంవత్సరాలుగా కడుపు నొప్పి మరియు ఆమ్లత్వం తో బాధ పడుతున్నారు. ముఖ్యంగా ఆమె బఠానీ లేదా మషాలాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఈ బాధకలుగుతోంది. అల్లోపతి మందులు ఆమెకు  తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందించాయి. అవి ఆపిన వెంటనే రోగ లక్షణాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఆమె సాధారణంగా మషాలాలు, బఠానీలకు దూరంగా ఉండ సాగారు. 2019 ఆగస్టు నెలలో తిరిగి ఇబ్బంది ప్రారంభమైనప్పుడు ఆమె అల్లోపతి మందులు తీసుకోకుండా, మూడు రోజుల తర్వాత, వైబ్రియానిక్స్ చికిత్స తీసుకున్నారు.

2019 ఆగస్టు 13న ఆమెకు క్రింద నివారణ ఇవ్వబడింది:
CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD

3వ రోజు నాటికి, 60% ఉపశమనం పొందారు. మరొక వారం తర్వాత కడుపు ఉబ్బరం మరియు గ్యాస్టిక్ నొప్పి నుండి 80% ఉపశమనం పొందారు. దీంతో ఆగస్టు 23న మోతాదును TDS కి తగ్గించబడింది. 2019 ఆగస్టు 30న రోగికి 100% ఉపశమనం కలగడంతో, మోతాదును ODకి తగ్గించి 2019 సెప్టెంబర్ 10 నుండి పూర్తిగా ఆపివేశారు. చికిత్స ప్రారంభించిన తర్వాత క్రమంగా బఠానీ మరియు మషాలాలు ఆహారంలో తీసుకోవడం ప్రారంభించారు అయితే ఆమెకు ఎప్పుడూ ఈ సమస్య రాలేదు. 2020 జనవరి నాటికి, లక్షణాలు ఏమీ పునరావృతం కాలేదు..

నిద్రలేమి 03582...South Africa

 66-ఏళ్ల గృహిణి గత 17 సంవత్సరాలుగా నిద్రలేమితో బాధపడుతున్నారు. ప్రతీ రాత్రీ ఆవిడ మూడు గంటలు మాత్రమే నిద్రపో గలుగుతున్నారు. దీని వలన ఆమెకు నీరసం, చికాకు, మరియు మానసికంగా శారీరకముగా అలసట ఏర్పడుతున్నాయి. ఆమె సాధారణ ఇంటి పనులు కూడా చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నిద్రలేమికి ఆమె ఎటువంటి ఔషధం తీసుకోలేదు.        2019 సెప్టెంబర్ 19న ఆమె అభ్యాసకుని సందర్శించగా క్రింది నివారణఇవ్వబడింది:

CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders… నిద్రించడానికి అరగంట ముందు ఒకటి మరియు నిద్రకు ఉపక్రమించే ముందు మరొకటి, నిద్రించే సమయంలో మెళుకువ వస్తే అదనంగా మరియొక మోతాదు.  

ఆమె నిద్రించే విధానంలో క్రమంగా మార్పు వస్తూ ఒక వారం తర్వాత ఆమె లో 50% ఉపశమనం కనిపించింది. ప్రస్తుతం ఆమె ఐదు గంటల గాఢమైన నిద్రను అనుభవించ గలుగుతున్నారు. మరొక వారం తర్వాత, ఆమెకు 80% మెరుగుదల కనిపించింది. ఆమె ఉత్సాహభరితంగా శక్తివంతంగా ఉండటమే కాక ఇంట్లో చేయవలసిన నిత్య కార్యక్రమాలను యధావిధిగా ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నారు. మూడవ వారం ముగిసే నాటికి అనగా 2019 అక్టోబర్ 10 న, తనకు 100% ఉపశమనం కలిగినట్లుగా తెలిపారు. ప్రస్తుతం “పసిబిడ్డ వలె” నిద్రపోగలుగుతున్నానని నిద్ర లేచిన వెంటనే ఎంతో ప్రశాంతంగా ఉంటోందని తెలిపారు. ఆమెకు 8 నుంచి 9 గంటల నిద్ర పడుతుండటంతో, డిసెంబర్ 8 నాటికి మోతాదును 3TW, వారం తర్వాత 2TW ఆ తర్వాత OWకి తగ్గించి  2019 డిసెంబర్ 28న ఆపివేయడం జరిగింది. 2020 ఫిబ్రవరి 25 నాటికి ఆమెకు ఎటువంటి రోగ లక్షణాల పునరావృతం లేకుండా చక్కగా ఉన్నారు.

భయభ్రాంతుల నుండి విముక్తి 11601...India

11 ఏళ్ళ బాలికకు కాళ్ళు, ముఖ్యంగా తొడలు మరియు ఉదరం మధ్యలో భరించలేని నొప్పి వస్తూ ఉండడంతో గత మూడు వారాలుగా ఆమె పాఠశాలకు కూడా వెళ్లలేక పోయింది. యుక్తవయస్సు ప్రారంభం కావడం వలన ఇటువంటి లక్షణాలు తలెత్తాఏమో అనే భావనతో, ఆమె తల్లిదండ్రులు ఒక వైద్యుడిని సంప్రదించారు, అతడు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడు ఇచ్చిన అల్లోపతి మందులు ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు. దీంతో 2018 ఆగస్టు 3న తల్లిదండ్రులు పాపను చికిత్సా నిపుణుని వద్దకు తీసుకొని వచ్చారు.

సంప్రదింపుల సమయములో, అభ్యాసకుడి ప్రేమపూర్వక వైఖరి కారణంగా ఆ పాప నోరు తెరిచి మూడు వారాల క్రితం తనకు ఒక కల వచ్చిందని, దాని లో తెల్ల చీర ధరించిన ఒక మహిళ తన ముఖం మరియు తలపై గట్టిగా కొట్టి అదృశ్యమైందని చెప్పింది. మరుసటి రోజు ఉదయం నుండి, ఆమెకు భరింపరాని నొప్పి వచ్చి ఏడుస్తూ ఎంతో భయపడి పోయి రాత్రిపూట తన తల్లి కూడా తనతో పడుకోవాలని కోరుకుంది. ఇది విని పాప తల్లిదండ్రులు దీని గురించి తమకు ఏమీ తెలియనందుకు ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ విధంగా వారు చర్చిస్తున్న సందర్భంలో వీరి ఇంటికి రెండిళ్ళ అవతల ఇటీవలే ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం బయటకు వచ్చింది.                                                                                                                                        పాప యొక్క సమస్యకు కారణాలు గుర్తించి అభ్యాసకుడు ఈ క్రింది నివారణ ఇచ్చారు:
CC3.7 Circulation + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC15.2 Psychiatric disorders + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue … ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకూ అనంతరం  6TD

ఆమె తల్లిదండ్రులు పాపకు అల్లోపతి మందులు ఇవ్వడం మానేశారు. మూడు రోజుల తర్వాత, ఆగస్టు 6నాటికి, పాప యొక్క లక్షణాలలో 50% మెరుగుదల కనిపించి, ఆ పాప పాఠశాలకు తిరిగి వెళ్ళడం ప్రారంభించింది. మోతాదును TDSకు తగ్గించారు. ఒక వారం తర్వాత, ఆగస్టు 13న, నివారణ వలన పాపకు పుల్లౌట్  రావడంతో ఆమె చేతులు మరియు ముఖం మీద దద్దుర్లు వ్యాపించాయి. అయితే నివారణను యధావిధిగా కొనసాగించవలసిందిగా చికిత్సా నిపుణుడు సూచించారు. ఆగస్టు 20 నాటికి, ఆ పాప తన కాళ్ళలో అలాగే కడుపులో కూడా నొప్పిలేదని దద్దుర్లు కూడా దాదాపు తగ్గిపోయాయని చెప్పింది.

2018 ఆగస్టు 27న పాప తండ్రి తన పాపకు అన్ని లక్షణాలు నుండి పూర్తిగా ఉపశమనం లభించిందని; క్రమం తప్పకుండా పాఠశాలకు వెడుతూ పరీక్షల నిమిత్తం చక్కగా చదువుకుంటోందని తెలియజేశారు. మాత్రలు ఇచ్చిన డబ్బా ఖాళీ కాగానే తల్లిదండ్రులు తిరిగి చికిత్స నిపుణుడిని సందర్శించాలనే అవసరం లేదని అనుకున్నారు. 2020 ఫిబ్రవరి 15 నాటికి చికిత్స నిపుణునికి పాప తండ్రి కృతజ్ఞతలు తెలపడానికి ఫోన్ చేసినప్పుడు పాప పూర్తిగా సాధారణ స్థితికి చేరుకొని ఎంతో ఆరోగ్యంగా ఉందని తెలిపారు.

సంపాదకుని సూచన: అభ్యాసకుడు అవకాశం తీసుకోవడానికి ఇష్టపడక ఒకేసారి రోగ లక్షణాలకు మరియు రోగ కారణానికి చికిత్స చేయడాన్ని అభినందిస్తున్నాము. కారణం తెలియడంతో, CC12.2 Child tonic + CC15.2 Psychiatric disorders తో కూడా రోగ నివారణ చేయవచ్చు.

ప్రాక్టీషనర్ ప్రొఫైల్ 03542...UK

ప్రాక్టీషనర్ 03542…యు.కె. వీరు యు.కె లో నిర్మాణరంగ పరిశ్రమలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన నిర్మాణరంగ ఇంజినీరు. 2017ముందు వరకు వీరు ఒక అంతర్జాతీయ నిర్మాణరంగ సంస్థలో టెక్నికల్ డైరెక్టరుగా ఉన్నారు. బాల్యము నుండి ఆధ్యాత్మిక మార్గానికి మొగ్గు చూపిస్తూ ఉన్నప్పటికీ, వీరికి 42 సంవత్సరాల వయసు వచ్చే వరకు హృదయంలో ఒక రకమైన గందరగోళాన్ని అనుభవించారు.‘సత్య సాయి బాబా ద మ్యాన్ ఆఫ్ మిరకిల్స్’ పుస్తకం చదివిన తరువాత అదే సంవత్సరం జూన్ 1996లో వారు స్వామిని దర్శించారు. మొదటి దర్శనం లోనే అతనికి స్వామి మీద నమ్మకం కుదిరింది. ఈ దర్శనంతో ప్రేరణ పొంది వీరు తమ ఇంట్లోనే భజన చేయడం ప్రారంభించారు. క్రమేణా అది సాయి భజన కేంద్రంగా మారి ఇప్పటికీ అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ కేంద్రం అనేక సందర్భాల్లో స్వామి చేత ఆశీర్వదింపబడి విభూతి, అమృతము మరియు లింగము ఏర్పడడం వంటి లీలలు జరిగాయి. వీరికి చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలనే కోరిక నెరవేరే అవకాశం 2016 ఫిబ్రవరిలో ఒక యూట్యూబ్ వీడియో ద్వారా సాయివైబ్రియానిక్స్ వైద్యం గురించి తెలుసుకొన్నప్పుడు వచ్చింది. పదవీ విరమణ దగ్గరవుతున్న సందర్భంలో, వీరు మరియు వీరి శ్రీమతి వైబ్రియానిక్స్ లో చేరడం ఎంతో ఆనందాన్ని చేకూర్చింది. వీరు 2016 జూన్ లోAVP అయ్యారు. అదే సందర్భంలో ఆరు నెలలుగా దగ్గుతో బాధపడుతూ అల్లోపతి మందులు తీసుకున్నా ఉపశమనం కలుగలేదు. వీరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ, కేవలం రెండు మోతాదుల వైబ్రియానిక్స్ నివారణతో అతని దగ్గు అదృశ్యమైపోయి పునరావృతం కాలేదు. దీనితో వైబ్రియానిక్స్ మీద మరింత  ఆత్మ విశ్వాసంతో సేవ చేయడానికి నిర్ణయించుకున్నారు. 2018 నవంబర్లో SVP గా అర్హత పొంది, నెల తర్వాత, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు, భారతదేశం నుండి వీరి తెచ్చుకుంటున్నవిభూతి భరిణలో ఒక అందమైన శివలింగం వ్యక్తమయింది.

ఈ అభ్యాసకుడు ఇప్పటివరకు 170 మందికి పైగారోగులకు చికిత్స చేశారు. వారిలో కొంత మందికి గణనీయమైన ఉపశమనం కలుగగా చాలామందికి పూర్తి స్వస్థత చేకూరింది. చికిత్స చేసిన కేసులలో అధికరక్తపోటు, సిరలు ఉబ్బు, మలబద్ధకం, విరోచనాలు, వాంతులు, పెద్దప్రేగు శోథ, కాలేయం చెడిపోవడం, చెవి రుగ్మతులు, హైపోథైరాయిడ్, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియాసిస్, జలుబు, ఫ్లూ, పంటి నొప్పి, మూత్రపిండాల సంక్రమణ, నిద్రలేమి, ఒత్తిడి, నిరాశ, మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్, ఆస్త్మా, మరియు చర్మ వ్యాధులుఉన్నాయి. తన తోటలోని మొక్కలకు వైబ్రియానిక్స్ నివారణలను వాడడం ద్వారా పచ్చ ఈగలు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు దూరమయ్యాయి. 78 ఏళ్ల మహిళకు ఆమె ఎడమ కాలు స్నాయువులు రెండున్నర నెలలుగా నిరంతరం నొప్పితో ఇబ్బంది పెడుతూ అల్లోపతి మందులు వాడినప్పటికీ, ఉపశమనం కలగని కేసు విషయంలో వైబ్రో నివారణల ద్వారా అద్భుతంగా స్వస్థత పొందిన ఉదంతాన్ని అభ్యాసకుడు మనతో పంచుకుంటున్నారు. కలలో స్వామి మార్గదర్శకత్వం చేసిన సూచన మేరకు ఈ పేషంటు 2018 మే 17న అభ్యాసకుడుని సందర్శించారు. తన ఇంట్లో వారం వారం జరిగే భజన ప్రారంభించడానికి ముందు అభ్యాసకుడు రోగికి మొదటి మోతాదు ఇచ్చారు. భజన అనంతరం ఆమె తనను తాను నమ్మలేక ఆశ్చర్య ఆనందాలతో తనకు ఏమాత్రం నొప్పి లేదని పూర్తిగా నయమయ్యిందని చెప్పారు. అయితే నివారణ కొనసాగించాలని అభ్యాసకుడు ఆమెకు సూచించారు అయినప్పటికీ ఆమె ఒక నెల తర్వాత, నివారణ బాటిల్ వాడకుండా అలాగే తీసుకువచ్చి మొదటి మోతాదుతోనే ఆమె నొప్పులు పూర్తిగా అదృశ్యమవడంతో వాటిని వాడే అవసరం రాలేదని చెప్పారు. అది పునరావృతం కాలేదు!

అలాగే 30 ఏళ్ల టాంజానియాకి చెందిన వ్యక్తి, మెదడులో రక్తస్రావం కారణంగా తీవ్రమైన ప్రసంగ లోపం లేదా మాట రాక పోవడం, అవయవాల పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు మింగడానికి అసమర్థత ఏర్పడిన సంక్లిష్టమైన కేసు గురించి అభ్యాసకుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరి ఆరు నెలల చికిత్స తీసుకున్నప్పటికీ కూడా, అతని పరిస్థితి మెరుగుపడే సంకేతాలు కనిపించక పోవడంతో చాలా నిరాశాజనకమైన స్థితిలో 2019 ఫిబ్రవరి లో ఇంటికి తీసుకువచ్చారు. రోగి  కుటుంబసభ్యుల యొక్క అభ్యర్థన మేరకు 2019 మార్చి 22న, అభ్యాసకుడు SM12 Brain and Paralysis రెండు గంటల నిరంతరాయంగా బ్రాడ్ కాస్టింగ్ చేశారు (108CC బాక్సు ఉపయోగించేటట్లయితే CC18.1 Brain disabilities ఇవ్వవచ్చు). ఆ తర్వాత అభ్యాసకుడు రోగి యొక్క మూత్రాశయ ఇన్ఫెక్షన్, మధుమేహం, బిపి మరియు కొలెస్ట్రాల్ కు మందులు జోడించి బ్రాడ్ కాస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా చేసిన 1-3 నెలల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయిరోగి తన అవయవాలను కొద్దిగా కదిలించ కలిగే స్థితి ఏర్పడింది. అలాగే శ్వాస చక్కగా తీసుకోగలగడం, ఆహారం మింగ గలిగే పరిస్థితి ఏర్పడింది. మరొక ఆరు నెలల తర్వాత ఆ రోగి తన అవయవాలను బాగా కదిలించగలిగి స్వయంగా ఆహారం తినగలిగే స్థితి ఏర్పడింది. అయితే పూర్తి చైతన్యం ఇంకా కలగ వలసి ఉంది. ఈ కేసు నుండి ప్రేరణ పొందిన అభ్యాసకుడు, తరచూ బ్రాడ్కాస్టింగ్ ద్వారా చికిత్స పొందుతున్నారు.

వీరి యొక్క అనుభవంలో, ఆందోళన మరియు వత్తిడితో జీవించే వారికి CC15.1 Mental & Emotional tonic ను నివారణలకు చేర్చడం వల్ల రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటోంది. మరియు CC12.4 Autoimmune diseases  జోడించడం వలన ఇది దీర్ఘకాలిక అలర్జీలు, లైమ్ వ్యాది మరియు మలబద్ధకం వంటి వ్యాధుల నివారణను వేగవంతం చేసింది.

వీరి రోగులలో చాలామంది వైబ్రియానిక్స్ నివారణలను వారి రోగాలకు మాత్రమే కాకుండా ముందస్తు నివారణగా కూడా తీసుకుంటూ ఉంటారు. వీరు అల్లోపతి మందుల యొక్క దుష్ప్రభావాన్ని తొలగించడానికి వాటిని పోటెన్టైజ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ అభ్యాసకుడు తనతో ఎప్పుడు వెల్నెస్ కిట్టును తీసుకువెళుతూ తను ప్రయాణించేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మందికి చికిత్స చేయడం జరిగింది.

అభ్యాసకుడు తన ప్రతిరోగికి సంప్రదింపుల విషయంలో తగిన సమయం కేటాయించి శ్రద్ధతో మరియు కరుణ, ప్రేమలతో వారి వివరాలు వింటారు. ఇదివారు అందించిన సేవలకు విలువ నిచ్చి హృదయపూర్వకంగా చేయవలసిన, చేయకూడనివి శ్రద్ధగా వారు అనుసరించేలాచేస్తుంది. సాయి వైబ్రియానిక్స్ తనను సానుభూతి వ్యక్తంచేసే వ్యక్తిగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వీరు తన అంతరాత్మ అయిన దైవం మార్గనిర్దేశం మేరకు ప్రతీరోగితో వ్యవహరిస్తూ ఉంటారు. వీరు స్వామి నుండి అనేక విధాలుగా అనుగ్రహం పొందినందుకు కృతజ్ఞత వ్యక్తంచేస్తూ వైబ్రియానిక్స్ విషయంలో ముఖ్యంగా యు.కె. లో దీని అభివృద్ధికి తనవంతు పాత్రను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

పంచుకున్న కేసులు :

ప్రాక్టీషనర్ ప్రొఫైల్ 01001...Uruguay

ప్రాక్టీషనర్ 01001...ఉరుగ్వే ఇద్దరు చిన్న పిల్లలకు మాతృమూర్తి అయిన ఈ అభ్యాసకురాలు సహజ సౌందర్య సాధనాలకు సంబంధించిన ఒక చిన్న వ్యాపారమును నడుపుతూ ఉన్నారు. 2017 మార్చి- ఏప్రిల్ వార్తాలేఖలో ప్రచురింపబడిన వీరి యొక్క ప్రొఫైల్ భగవాన్ సత్యసాయి బాబా మరియు వైబ్రియానిక్స్ వైపు వీరి అద్భుత ప్రయాణం గురించి తెలుపుతుంది. గత మూడు సంవత్సరాలుగా ఆమెకు వ్యాపార పరంగా మరియు దేశీయ సవ్వాళ్ళు ఉన్నప్పటికీ వైబ్రియానిక్స్ కోసం గణనీయమైన సమయాన్ని కేటాయించారు. ఈ అభ్యాసంరాలి రెండవ బిడ్డ సంవత్సరం వయస్సు కలిగి ఉన్నప్పటికీ  వీరు SVP ఈ కోర్సు పూర్తిచేసుకుని, దీనికి అనుగుణంగా భారతదేశంలో 2018 నవంబర్ లో జరిగిన SVP వర్క్ షాప్ లో స్కైప్ ద్వారా పాల్గొన్నారు. ఆ సమయంలో అలర్జీ కారణంగా ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐదు రోజులూ  రాత్రంతా మేలుకొని (ఆ దేశం యొక్క టైమ్ జోన్ భారతదేశానికి 8:30 గంటలు వెనుకగా ఉంటుంది)శిక్షణ పూర్తి చేసుకొని SVP గా అర్హత సాధించారు.

SVP గా విజయవంతంగా శిక్షణ ముగించుకున్న తర్వాత, శిశువులలో రిఫ్లెక్స్, మధుమేహం, హైపర్ మెట్రోపియా, అండాశయ తిత్తులు, నోటిపూత, రోగ నిరోధక శక్తి లోపం, పిల్లలలో భయాలు, మ్రింగలేకపోవుట మరియు నిద్ర రుగ్మతలు వంటి విభిన్న పరిస్థితులతో ఉన్న40 మంది రోగులకు చికిత్స చేశారు.

ఈ చికిత్సా నిపుణురాలు వైబ్రియానిక్స్ ద్వారా నివారణ పొందిన తన సొంత కేసుని మనతో పంచుకుంటున్నారు. ఆమె రుతుక్రమంలో సమస్య వల్ల పొత్తికడుపులో పునరావృత నొప్పి వస్తూ ఉండేది. 2019 ఫిబ్రవరి 1న తీసుకున్న అల్ట్రాసౌండ్ రిపోర్టు ప్రకారం, ఆమె ఎడమ అండాశయంలో 6.07 cm x 4.09 cm పరిమాణం కలిగిన తిత్తి ఏర్పడింది. ఇది ఆమెకు ఎంతో ఆందోళన కలిగించసాగింది ఎందుకంటే 1999లో ఇటువంటి కారణంగానే ఆమె ఎడమ అండాశయంలో సగ భాగం మరియు కుడి అండాశయము పూర్తిగా తొలగించబడ్డాయి. అభ్యాసకురాలు ఆపరేషన్ చేయించుకోకుండా ప్రత్యామ్నాయ వైద్య చికిత్స ద్వారా తగ్గించుకుందామని ప్రయత్నం సాగిస్తుండగా ఆమె డాక్టరు నాలుగు నెలల్లో పరీక్షలు పునరావృతం చేయాలని తిత్తి యొక్క పరిమాణం తగ్గకుంటే శస్త్ర చికిత్స చేసి తొలగించుకోవాలని సూచించారు. మర్నాటి నుండి ఆమె CC2.3 Tumours & Growths+CC8.4 Ovaries & Uterus...TDS తీసుకోవడం ప్రారంభించారు. మొదటి మోతాదు తీసుకోగానే ఆమెకు ఎంతో ఉపశమనం కలిగింది.  తదుపరి రుతుక్రమ కాలం లో ఏ మాత్రం నొప్పి కూడా లేదు. రెండు వారాల తర్వాత, ఆమె అంతరాత్మ పిలుపుమేరకు మిగిలివున్న ఎడమ అండాశయాన్ని కాపాడుకోవడం కోసం ఒక ఈజిప్షియన్ ఆక్యుపంచర్ విధానాన్ని వైబ్రియానిక్స్ నివారణలతోపాటు పది వారాలు ఉపయోగించారు. 2019 జూలై 1న, రెండోసారి అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించినప్పుడు ఆమెకు తిత్తి అదృశ్యమై పోగా ఎడమ అండాశయం పూర్తి ఆరోగ్యంగా ఉంది. కనుక ఆమె రెండు వారాల పాటు మోతాదు BD కి తగ్గించారు మరియు 2019 జులై 16 నుండి తన అండాశయ ఆరోగ్యం కోసం OD నిర్వహణ మోతాదుగా తీసుకుంటున్నారు.

ప్రయోగాలు చేయడం పట్ల అత్యంత ఉత్సాహం కనపరిచే ఈ అభ్యాసకురాలు, తన వంట ఇంట్లో ఉన్న బొద్దింకల పీడ వదిలించుకోవడానికి CC1.1 Animal tonic+CC17.2 Cleansing స్ప్రే చేయగా 24 గంటల్లో వాటిపీడ వదిలి పోయింది. తన పేషంట్లతో నిరంతరంసంబంధ బాంధవ్యాలతో ఉండటమే కాకుండా వీరువైబ్రియానిక్స్ పరిపాలనా బాధ్యతలను కూడా తీసుకున్నారు. మరొక అభ్యాస కుని సహాయంతో, వార్త లేఖలను స్పానిష్ భాషలోకి అనువదించారు, అలాగే  స్పానిష్  మాట్లాడే దేశాలలోని అభ్యాసకుల డేటాబేస్ సమీకరించే బాధ్యతను కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా, కొన్ని సంవత్సరాలుగా నిద్రాణమైన స్థితిలో వైబ్రియానిక్స్ గురించి ఏమీ చేయలేని స్థితిలో ఉన్న వారిని ప్రేరేపించి తిరిగి వారు ప్రాక్టీస్ ప్రారంభించేలా కూడా చేశారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే, ఇటీవల తన పేషెంటు మరియు కొంతమంది అనువాదకుల సహాయంతో, వైబ్రియానిక్స్ గురించి అవగాహన కోసం “ఇంట్రడక్షన్ టు వైబ్రియానిక్స్”  అనే చిన్న వీడియోను 13 భాషలలో రూపొందించారు.

ఈ అభ్యాసకురాలు తన పేషంట్లు అందరితో వారి సానుకూలతను చూస్తూ ఆనందంగా సంభాషించడానికి ప్రయత్నిస్తారు- వారి వివరాలు, వారి మంచితనం, వారి యొక్క ఆరోగ్యం ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టి వారితో ఆనందంగా సంభాషించడానికి ప్రయత్నిస్తారు తప్ప, వారి అనారోగ్యము, బాధలు వంటి వాటిపై దృష్టి పెట్టనివ్వరు. నివారణను పూర్తి నమ్మకంతో, ఫలితం ఎలా ఉన్నా,అది వారి జీవితంలో వెలుగు ఇస్తుందనే విశ్వాసంతో రోగులకు ఇస్తారు.

వైబ్రియనిక్స్ పవిత్రమైన దైవిక సాధనం అవ్వడంవల్ల గ్రహం యొక్క వైబ్రేషన్స్ పెంచడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదని, మనతో మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సామరస్యంగా జీవించడానికి దారి తీస్తుందని ఆమె భావిస్తున్నారు. ఇచ్చిన ప్రతి రెమెడీ జీవిలో (వ్యక్తి, జంతువు, లేదా మొక్క)కాంతిని తీసుకువచ్చి ప్రకాశించేలా చేస్తుందని ఆమె ఊహిస్తున్నారు.             మన భూగ్రహం చీకటినుండి వెలుగుకు, స్వార్ధం నుండి సంఘీభావానికి భయం నుండి ప్రేమ వైపు పరివర్తన చెందుతోంది. ఈ దివ్య సంకల్పంలో ఇతరులకు సేవ చేయడం ద్వారా, మనలను మనం ఉద్ధరించుకొంటూ, పరివర్తన  చెందే అవకాశం, మన వైబ్రేషన్ పెంచుకొనే అవకాశం మనకు అందిస్తూ వైబ్రియానిక్స్ తన పాత్రను తను పోషిస్తోంది. దీనిలో మన నిబద్ధత చాలా ముఖ్యం. మనం ఏ ప్రాంతం లో సేవ చేస్తున్నాము, ఎంతమంది పేషెంట్లను చూసాము అనే దానితో సంబంధం లేదు. ఈ బాధ్యతను ఎంత హృదయపూర్వకంగా నెరవేరుస్తున్నాము అనేదే ముఖ్యం అని పేర్కొంటున్నారు. ఇతర అభ్యాసకులకు వీరి సలహా ఏమిటంటే మనల్ని  సందర్శించే ప్రతీ పేషంటు యొక్క సందర్శననూ ఆస్వాదించాలి, ఎందుకంటే ప్రతీ రోగి వారిని స్వస్థపరచు కోవడం కోసమే కాదు, మనలో ఉన్న ఏదో ఒక ఒక సమస్యను నయం చేయడానికి వారు వస్తున్నారు అని భావన మనలో ఉండాలి. మన సమస్యను విప్పి చెప్పే దర్పణం వంటి వారే మన పేషెంట్లు అనే భావన మనలో ఉండాలి.

ఈరోజు అభ్యాసకురాలు 10 సంవత్సరాల క్రితం వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఏదైతే అయస్కాంతత్వం అనుభూతిని పొందారో అదే అనుభూతిని నేడు కూడా పొందుతున్నారు. వైబ్రియానిక్స్ ఇప్పుడు ఆమె జీవితంలో సేవ యొక్క ఆనందాన్ని అనుభూతిని ఆస్వాదింపజేసే ఒక సహజసిద్ధమైన విడదీయలేని అంశం.

పంచుకున్న కేసులు :

జవాబుల విభాగం

ప్రశ్న 1: కరోనా వైరస్ కోవిడ్-19 కోసం ముందస్తుగా ఉపయోగించే నివారణను సూచించండి. ఒకవేళ రోగి ఈ వ్యాధికి గురైనట్లు అనిపిస్తే  దానికి చికిత్స ఏమిటి?

    జవాబు 1: 108 cc బాక్స్ ద్వారా ముందస్తుగా ఉపయోగించే నివారిణి : CC9.2 Infections acute + CC9.4 Children's diseases + CC13.1 Kidney tonic + CC19.3 Chest infections + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic (for SRHVP ఉపయోగించే వారి కోసం: SR261 Nat Mur 30C + SR270 Apis Mel 30C + SR272 Arsen Alb 30C + SR291 Gelsemium+SR275 Belladonna 30C)…OW నివసిస్తున్నఏరియాలో వ్యాధి వ్యాపించ నట్లయితే OW, ప్రబలంగా ఉంటే ODగా తీసుకోవాలి ; రోగి వయసు మళ్లినవారు లేదా సంక్రమణ ఏర్పడే అవకాశం ఉన్నట్లయితేనూ ; విదేశాలకు వెళ్లబోతుంటే, విమానం ఎక్కే రోజున మరియు దాని ముందురోజున తీసుకోవాలి. ఎవరైనా వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనిపిస్తే, మోతాదు 6TDగా ఇస్తూ వెంటనే హాస్పిటల్లో అత్యవసర వైద్య చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించాలి. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే అలోపతి చికిత్స తో పాటు మద్దతుగా వైబ్రో చికిత్సను కూడా కొనసాగించాలి. ఇతర వివరాల కోసం “అదనంగా విభాగంలో “ ఇచ్చిన వ్యాసాన్ని చూడండి.

______________________________________

ప్రశ్న 2: నోసోడ్ తయారు చేసేటప్పుడు చేతికి గ్లౌస్ ఉపయోగించాలా ?

    జవాబు 2: ముందు జాగ్రత్త కోసం చేతికి గ్లౌస్ ఉపయోగించడం మంచిదే. ప్రారంభంలో రోగి తన శరీరము నుండి వెలువడే వ్యర్ధాలు అనగా మూత్రము, మలము, చీము వంటివి సీసాలో భద్రపరిచి తీసుకు వచ్చేటప్పుడు శాంపిల్ తీసుకున్నతర్వాత సీసా యొక్క బయట పక్కన శుభ్రంగా కడిగి తీసుకు రావాల్సిందిగా సూచించాలి. శాంపిల్ వెల్ కలుషితం కాకుండా ఉండటానికి లేదా అభ్యాసకునికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం, ప్లాస్టిక్ పేపర్ లో చుట్టి ఉదాహరణకు, పలుచని ప్లాస్టిక్ రేపర్ వంటి వాటిలో చుట్టి శాంపిల్ వెల్ లో ఉంచాలి.  రెమిడీ  తయారీ తరువాత దానిని పేషంటుకు తిరిగి ఇచ్చివేసి జాగ్రత్తగా పారవేయమని చెప్పాలి.

________________________________________

ప్రశ్న 3: లోహంతో చేయబడిన వైరుతో చుట్టబడి ఉన్న నా క్రిస్టల్ లాకెట్టునుSRHVP మిషన్ తో చార్జ్ చేయడం సాధ్యమేనా?

    జవాబు 3: లోహంతో చేసినవి ఏవీ కూడా SRHVP రెండు బావులలో ఉంచకూడదని మా అభిప్రాయం. ఒకవేళ మీ లాకెట్ ఇనుముతో చేసినది అయితే అది SRHVPలో ఉన్న ఐస్కాంతం పై కొంతకాలం తరువాత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ ఈ కేసు విషయంలోలాకెట్టు చుట్టూ ఉన్న లోహపు తీగ ప్రకంపనలను ప్రభావితం చేయవచ్చుకానీ SRHVP మిషన్ ను ప్రతికూలంగా ప్రభావితం చేయకపోవచ్చు.

______________________________________

ప్రశ్న 4: మనం సేవ చేసేటప్పుడు అహంకారం దొంగతనంగా ప్రవేశించకుండా చూడడము మరియు దాన్ని గుర్తించడం ఎలా?

    జవాబు 4: అహంకారం ఎప్పుడు ప్రవేశిస్తుందో, నిశ్శబ్దంగా మనపై ఎప్పుడు తిష్టవేసుకుని కూర్చుంటుందో మనకు తెలియకపోవచ్చు. కానీ ప్రతిరోజు భగవంతుని ప్రార్థనతో రోజు ప్రారంభించడం మరియు ఉదయం మొదటి రోగితో సంభాషించేటప్పుడు ప్రార్ధించడం, అలాగే ప్రతీ రాత్రీ క్రమం తప్పకుండా ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా, అహంకారమును ఏదో ఒక రోజు వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మనం చేసే ప్రార్థన హృదయపూర్వకంగా మనం కేవలం భగవంతుడు పనిముట్లు అనే భావనతో చేయాలి. 108 సిసి పుస్తకం పరిచయంలో ఇచ్చిన ప్రార్థనను గుర్తుచేసుకోండి: “మేము మీ ప్రేమ, కాంతి మరియు నయం చేసే శక్తి యొక్క స్వచ్ఛమైన వాహకాలుగా ఉండాలని తద్వారా ఈరోజు మా వద్దకు వచ్చే రోగులకు సహాయ పడాలని ప్రార్థిస్తున్నాము”. వైబ్రియానిక్స్ అనేది మన ఆధ్యాత్మిక సాధన కోసం నిర్దేశించిన ఒక చక్కని మాధ్యమం అనేది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మన మాన్యువల్ యొక్క శీర్షికలో ఇచ్చిన స్వామి సందేశం అలాగే 108 సిసి పుస్తకంలో ఇచ్చిన సందేశము, అహంకారం నుండి దూరంగా ఉండేలా చేస్తుంది. ఈ సందేశాన్ని మనం ప్రతిరోజూ చూసుకొని చదువుకునేలా ఎక్కడైనా అతికించుకోవడం ఉత్తమం. 

______________________________________

ప్రశ్న 5: రోగ నిర్ధారణకు ముందే అనుమానాస్పద క్యాన్సరుకు నేను చికిత్స చేయవచ్చా?

    జవాబు 5: అవును, వ్యాధి సోకుతుంది అనుకున్న అవయవానికి కావలసిన నివారణ ఎంపిక చేసి దాన్ని కూడా కలపవచ్చు. మన వైబ్రియానిక్స్ నివారణలకు ఉన్న గొప్పదనం ఏమిటంటే రోగ లక్షణాలు బాహ్యంగా కనిపించక ముందే ముందస్తు నివారణగా సూక్ష్మ శరీరముపై పని చేయడం ప్రారంభిస్తాయి. మన వార్తా సంపుటి 10 సంచిక 6 లో ప్రశ్నలు జవాబులు విభాగంలో 5 వ ప్రశ్నలో క్యాన్సరుకు ముందస్తు నివారణల గురించి ఇవ్వబడిన వ్యాఖ్యను చదవండి.

______________________________________

ప్రశ్న 6: థైరాయిడ్ సమస్యతో వచ్చిన రోగికి ఇది హైపో లేదా హైపర్అని తెలియనప్పుడు చికిత్స ఎలా చేయాలి?

    జవాబు 6: రోగనిర్ధారణ నివేదిక లేనప్పుడు, లక్షణాలు మరియు కారణాలు తెలిస్తే వాటి ద్వారా సరైన కోంబో ఎంపిక చేసుకోవచ్చు. మన వార్తాలేఖ సంపుటి 10 సంచిక 6 లో ఆరోగ్య చిట్కాలలో ఇచ్చిన థైరాయిడ్ వ్యాసం చదవండి.

______________________________________

ప్రశ్న 7: రోగికి మొదటి మాత్రను వేసేటప్పుడు బాటిల్ యొక్క మోత నాలుకను తాగడం లేదా అతడి లాలాజలం అభ్యాసకుని వేలి మీద పడటం వంటివి జరిగితే ఏం చేయాలి? 

    జవాబు 7: రోగికి మొదటి మాత్రను అభ్యాసకుడే నోటిలో వెయ్యాలి అయితే పైన చెప్పబడిన సంఘటనలు జరగకుండా కొంచెం దూరం ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ చేయి రోగి నాలుకకు తాకినట్లయితే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఒకవేళ ఆ మాత్రను కొంత దూరం నుండి వేయటం సాధ్యం కాకపోతే మాత్ర ఉంచిన మూతను రోగికి ఇచ్చి అతనినే/ఆమెనే వేసుకోమని చెప్పండి.

______________________________________

ప్రశ్న 8: ఉదయమే కర్పూరం పీల్చే అలవాటు ఉన్న ఒక రోగికి మనం ఇచ్చే వైబ్రియానిక్స్ నివారణలు  ప్రకంపనలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందా ?

    జవాబు 8: కర్పూరం యొక్క బలమైన వాసన వైబ్రియానిక్స్ నివారణల యొక్క ప్రకంపనలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని వాసన చాలా కాలం పాటు ఉంటుంది కనుకనే కీటకాలను దూరంగా ఉంచడానికి దీన్ని ఉపయోగిస్తారు. కనుక రోగి వైబ్రియానిక్స్ చికిత్స లో ఉన్నప్పుడు కర్పూరం వాసన పీల్చడం నిలిపివేయడం గానీ లేదా వైబ్రో మందులు తీసుకోవడానికి వాసన పీల్చడానికి మధ్య కనీసం ఒక గంట విరామం ఉండేలా చూడమనండి.

దివ్య వైద్యుని దివ్యవాణి

“తాజా ఆహారం మాత్రమే భుజించండి. ముందటి రోజు తయారుచేసిన పాచిపోయిన ఆహారాన్ని తినవద్దు. ఆహారం తయారు చేయడానికి చమురు అవసరమే కానీ డాక్టర్లు ఎక్కువ నూనె పదార్థాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెబుతారు. అయితే మన శరీరానికి కొలెస్ట్రాల్ కూడా అవసరమే. కనుక పూర్తిగా నూనె లేని  ఆహారం తీసుకోకండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి”.

-సత్య సాయి “బాబాసంపూర్ణ జ్ఞానం నుండి సంపూర్ణ ఆనందం” దివ్యవాణి, 1996 సెప్టెంబర్ 1
http://sssbpt.info/ssspeaks/volume29/d960901.pdf 

 

 

»మనం నిరంతరం ఇతరుల సేవలో నిమగ్నం అవ్వాలి. దానికోసమే దేవుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. శరీరాన్ని కేవలం తినడం తాగడంతోనే గడుపుతూ విలువైన సమయం వృధా చేయరాదు. భగవంతుడు శరీరాన్ని మనకు ఇచ్చింది ఇతరులకు సేవ చేయడం ద్వారా వారికి సహాయపడటం కోసం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మానవ సేవకు మించింది లేదు. మానవ సేవయే మాధవ సేవ. గొప్ప వారంతా మానవులకు సేవ చేయడం ద్వారా మాత్రమే తమ జీవితాలను పవిత్రం చేసుకున్నారు. అందువల్ల, మీరు కూడా కనీసం ఇప్పటినుండి అయిన సేవ చేయడం ప్రారంభించండి. భజన మరియు ఇతర సాధనాల కంటే సేవే అత్యుత్తమమైనది.” 

-సత్య సాయి, “బాబా మానవసేవయే మాధవసేవ” దివ్యవాణి, 2004 జనవరి1 2004
http://www.sssbpt.info/ssspeaks/volume36/sss37-01.pdf

ప్రకటనలు

నిర్వహింపబోయే సదస్సులు, శిక్షిణా శిబిరాలు

  • యు.ఎస్.ఎ. రిచ్మండ్ VA: AVP వర్క్ షాప్ 3-5 ఏప్రిల్  2020 సంప్రదించ వలసినవారు సుశాన్ వెబ్సైట్ [email protected]

  • ఇండియా ఢిల్లీ -NCRపునశ్చరణ సదస్సు 9-10 మే 2020 సంప్రదించ వలసినవారు డాక్టర్ సంగీతా శ్రీవాత్సవ వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 9811-298-552

  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 8-14 జులై 2020 సంప్రదించ వలసినవారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092

  • ఇండియా పుట్టపర్తి: 2018-19లలో SVPశిక్షణ పొందిన అభ్యాసకులకు ఫాలో అప్ వర్క్ షాప్ 16-17 జులై  2020 సంప్రదించ వలసినవారు హేమ్ వెబ్సైట్ [email protected]

  • యు.కె. లండన్ UK జాతీయ పునశ్చరణ సదస్సు 20 సెప్టెంబర్ 2020 సంప్రదించ వలసినవారు జెరమ్ పటేల్ వెబ్సైట్ [email protected]

  • యు.ఎస్.ఎ. రిచ్మండ్ VAAVP వర్క్ షాప్ 9-11 అక్టోబర్ 2020  సంప్రదించ వలసినవారు Susan వెబ్సైట్ [email protected]

  • ఇండియా పుట్టపర్తిAVP వర్క్ షాప్ 25 నవంబర్-1 డిసెంబర్ 2020 సంప్రదించ వలసినవారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092

  • ఇండియా పుట్టపర్తి: SVP Workshop 3-7 డిసెంబర్  2020 సంప్రదించ వలసినవారు  హేమ్ వెబ్సైట్ [email protected]

 * AVP మరియు SVP శిక్షణా శిబిరాలు ప్రవేశ ప్రక్రియ మరియు e-కోర్సు పూర్తి చేసుకొన్నవారికోసం మాత్రమే. పునశ్చరణ సదస్సులు ప్రస్తుతం అభ్యాసకులుగా ఉన్న వారికి ఉపయోగపడతాయి.

అదనంగా

 

1. ఆరోగ్య చిట్కాలు

కోవిడ్-19 – నివారణ మరియు సంరక్షణ

మనిషి మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు లోనవుతుంటాడు. అనేక మానవ సంబంధిత వ్యాధులు క్రమంగా పెరుగుతున్నాయి. కారణం ఏమిటంటే మనిషి తీసుకునే ఆహారం దైవ సృష్టి అనే గ్రహింపు లేకపోవడమే “ …శ్రీ సత్య సాయి బాబా1

1.    నావెల్ కరోనా వైరస్ అంటే ఏమిటి ?

corona_virus_painting.jpgకరోనా వైరస్ అంటే జంతువులకి మనుషులకి మధ్య వ్యాపించే వైరస్ల యొక్క పెద్ద సమూహం. వీటిలో చాలా వరకూ జంతువులలో ప్రబలంగా ఉన్నా మానవులకుఇంకా సోకలేదు. SARS-CoV (Severe Acute Respiratory Syndrome virus శ్వాస వ్యవస్థకు చెందిన తీవ్రమైన వ్యాధుల వైరస్) మొట్ట మొదటిసారి 2003 చైనాలో సివెట్ జాతి పిల్లుల నుండి మనుషులకు వ్యాపించిన ఈ వైరస్  కూడా ఒక రకమైన కరోనా వైరస్సే. MERS-CoV (Middle East Respiratory Syndrome మధ్య ప్రాచ్య శ్వాస వ్యవస్థ వ్యాధుల సముదాయం)2012 లో సౌదీ అరేబియాలో ఒంటెల ద్వారా వ్యాపించిన ఈ వైరస్ కూడా కరోనా వైరెస్సే. ఆఖరికి సామాన్యంగా అందరికీ వచ్చే జలుబు కూడా అంతగా హానికరం కాని ఇదే సముదాయానికి చెందిన వైరస్ వలన వస్తుంది.2,3,4,5.

ఎడమ పక్కనున్న బొమ్మ ఒక గణన జీవ శాస్త్రవేత్త అందించిన కరోనా వైరస్ కి సంబంధించిన పెయింటింగ్2

2019 డిసెంబర్లో, చైనాలో న్యుమోనియా కేసుల సమూహం ఏర్పడింది. దర్యాప్తులో ఇది ఒక తెలియని వైరస్ వల్ల సంభవించే వ్యాధి అని, ప్రాధమికంగా దీనికి ”2019 నావెల్ కరోనా వైరస్”(2019-nCoV) అని పేరుపెట్టడం జరిగింది. ఇది గతంలోమానవులలో కనిపించని ఒక కొత్త జాతివైరస్. 2020 ఫిబ్రవరి 11న ఐక్య రాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా నుండి ప్రబలుతున్న ఈ ప్రాణాంతక వైరస్ కి “కోవిడ్ -19” అని ప్రకటించి, ఇది ప్రపంచానికి ఒక “పెను ముప్పు”అని, ఐతే ప్రపంచం దీన్ని ఆపడానికి “వాస్తవిక అవకాశం” కూడా ఉందని సూచించింది. దీనిపై అధ్యయనాలు మరియు పరిశోధనలు కొనసాగుతున్నదున  ఈ వైరస్ గురించి ఇప్పుడు ఏదైతే వాస్తవం అని భావిస్తున్నామో అవన్నీ మారిపోయే అవకాశం కూడా ఉంది.3.4,5,6

చైనా నుండి వచ్చిన ఆధునిక వైరస్ ఇప్పుడు భూగోళం చుట్టుముట్టే ఒక మహమ్మారి అని ప్రపంచం లోని అనేక అంటువ్యాధులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరస్ “అన్నిదేశాలకు కాకపోయినా” చాలా దేశాలకు చేరుతుంది అని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. ఈ కొత్త వైరస్ ఎంత ప్రమాదకరమో ఎంత ప్రాణాంతకమే శాస్త్రవేత్తలకు ఇంకా తెలియకముందే అది విస్తృతంగా పెరిగిపోతూ వ్యాధికారక మానవుల నుండి ఇతరులకు సులువుగా వ్యాపించి పోతోంది. ఇది దీని కవల సముదాయాలైన సార్స్ (SARS)మరియు మెర్స్(MERS)అనే వాటి కన్నా కూడా వేగంగా ఇన్ఫ్లుఎంజా మాదిరిగా వేగంగా విస్తరిస్తోంది.7

2.   కరోనా వైరస్ COVID-19 యొక్క సాధారణ లక్షణాలు 

కరోనా వైరస్ యొక్క వ్యాధి లక్షణాలు ప్రారంభంలో, సాధారణ జలుబు లేదా ఫ్లూ మాదిరిగానే కనిపిస్తాయి. జ్వరం, పొడిదగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి, కండరాల నొప్పి, అలసట ఉంటాయి;  చాలా తక్కువ కేసులలో వీటితోపాటు కఫం తయారవడం, దగ్గుతో రక్తంపడడం (హెమో టైసిస్) మరియు అతిసారం కూడా ఉండవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఈ ఇన్ఫెక్షన్ కారణంగ న్యుమోనియా, శ్వాస వ్యవస్థను దెబ్బతీయడం, మూత్రపిండాల వైఫల్యం, చివరికి ప్రాణం కూడా తీస్తుంది. వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే ఈ వ్యాధి నిర్ధారణ చేయబడదు. ప్రయోగశాల పరీక్షల ద్వారా ఈ కొత్త రకపు వైరస్ ఉందా అనేది ధ్రువీకరించాల్సిన అవసరం ఉంది.3,4,5,8   ఈ వ్యాధి సోకిన వారిలో ప్రాధమిక దశలో ఏ ప్రత్యేక లక్షణాలు చూపడం లేదు. నివేదికల ప్రకారం ఈ కొత్త వైరస్ 14 రోజుల ప్రభావం చూపే కాలం లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ ను కలిగి ఉంటుంది, అయితే ఇది కొన్ని సందర్భాల్లో 27 రోజులు కూడా కావచ్చు. వ్యక్తి తనంత తానుగా ఈ వైరస్ ఉందో లేదో తెలుసుకోలేక పోతే, తన కఫం నమూనాను విశ్లేషణ కోసం పంపించి వ్యాధి నిపుణుల ద్వారా ఈ వ్యాధి ఉందో లేదో తెలుసుకోవలసి ఉంటుంది.8,9

3.   కోవిడ్-19 ఎలా వ్యాపిస్తుంది?

ఈ విషయంలో ఖచ్చితమైన గణాంకాలు నిర్ణయింపబడిన దాఖలాలు లేవు. ఐతే ఈ కొత్త వైరస్ సోకిన వ్యక్తుల దగ్గు లేదా తుమ్ముల వలన లాలాజలం లేదా తుంపర్ల ద్వారా ముక్కునుండి ఏర్పడే స్రావముల ద్వారా వారితో సామీప్యంగా వచ్చిన ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది. ఇది గాలివలన వ్యాపించే అంటువ్యాధి అని సూచించడానికి ప్రస్తుతం ఆధారాలు ఏమీ లేవు. ఇది వ్యాధి గ్రస్థులైన వ్యక్తుల చేతులు తాకిన కలుషితమైన ఉపరితల ద్వారా కూడా వ్యాపిస్తుంది.3,4,5

4.    రక్షణ చర్యలు

వ్యక్తిగతమైన పరిశుభ్రతా పద్ధతులు మరియు సాధారణ ముందస్తు నివారణ చర్యలు అనుసరించాలి, అవి:3-5,8,10-14

మీ చేతులు మురికిగా కనిపించక పోయినప్పటికీ ధారగా స్రవిస్తున్న (లేదా వేడి నీటితో) నీటితో సబ్బు ఉపయోగించి లేదా ఆల్కహాల్ ఆధారిత చేతులు రుద్దే సాధనం ద్వారా క్రమం తప్పకుండా చేతులను కడుగుకోవడం, చేతులపై కనిపించని వైరస్ ని దూరం చేస్తుంది.  డిస్పోజబుల్ టవల్ లేదా  చేతి రుమాలు పరిశుభ్రంగా ఉండాలి లేదా కడిగిన తర్వాత చేతులు తుడుచుకొనడానికి డిస్పోజబుల్ టవల్స్ ఉపయోగించవచ్చు.

దగ్గే టప్పుడు, లేదా తుమ్మే సమయంలో మీ అరచేతిని గానీ, టిష్యూ పేపర్ గానీ, రుమాలు, లేదా మాస్కు ఇలా ఏదో ఒక సాధనంతో అడ్డుపెట్టుకోవాలి. అట్టి టిస్యూ పేపర్, మాస్క్, లేదా గుడ్డను వెంటనే ఒక మూసి ఉన్న చెత్త బుట్టలోనికి వేసి మీరు ముట్టుకోదలిచిన లేదా పట్టుకోదలిచిన వస్తువులకు ఈ వైరస్ సోకకుండా ఉండటానికి చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి.

దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధిత రోగ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తుల నుండి ఒక మీటర్ (మూడు అడుగుల) దూరాన్ని పాటించండి. దగ్గు, తుమ్ము ఉన్నవారికి వైరస్ ఉన్నటువంటి చిన్న నీటి బిందువులు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అట్టివారికి మరీ దగ్గరగా ఉన్నట్లయితే వారి నుండి వచ్చే శ్వాసమీరు కూడా పీల్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి ఉన్న వ్యక్తిని ముట్టుకోవడం లేదా షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. జంతువులను అనవసరముగా తాకడం లేదా ముట్టుకోవడం వంటివి మానండి ఒకవేళ అలా చేయవలసి వస్తే తర్వాత వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వ్యాధికి గురైన లేదా అట్టి అవకాశం ఉన్న జంతువుల వ్యర్ధాలను తాకడం లేదా భూమిలోనికి స్రవించిన వాటి ద్రవాలను తాకటం మార్కెట్లో దొరికే అట్టి సదుపాయాలను లేదా జంతు ఉత్పత్తులను తీసుకోవడం వంటివి మానండి.

మీ చేతులతో మీ ముఖాన్ని, ముఖ్యంగా కళ్ళు, ముక్కు, నోటి ప్రాంతాన్ని తాకవద్దు, ఎందుకంటే మీకు తెలియకుండా మీ చేతులు వ్యాధిగ్రస్థమైన ప్రదేశాలను తాకి ఉండవచ్చు. డిజిటల్ పరికరాలు డిజిటల్ పరికరాలు మొబైల్, ల్యాప్టాప్, మౌస్, తలుపు మీద ఉండే నాబ్స్ మరియు హ్యాండిల్స్, తలుపులు మరియు కుర్చీలు, లిఫ్ట్ బటన్లు, మెట్ల పక్కనుండే బానిస్టర్లు, ముఖానికి వాడే మాస్కు యొక్క బాహ్య ఉపరితలంతో సహా ఇవన్నీ సాధారణంగా వైరస్ ను కొనిపోయే సాధకాలు.

అనారోగ్యం అనిపిస్తే ఇంట్లోనే ఉండండి మరియు ప్రయాణానికి దూరంగా ఉండండి. మీరు తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే సర్జికల్ మాస్క రంగు ఉన్నభాగం బయటకు కనిపించేలా ధరించండి. మీకు జ్వరము, దగ్గు, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్య సహాయం పొందండి.

మీరు కరోనా పేషంటు యొక్క సరక్షణ కోసం నియుక్తులై ఉండి ఒకే గదిలో ఉన్నప్పుడు మీ సంరక్షణ కోసం మాస్క్ ఉపయోగించండి కానీ దానిని నిర్మూలించి చేతులు శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మరిచిపోకండి. చేతులు శుభ్రంగా ఉంచుకోవడంఇంకా ఇతర ఆరోగ్య సూత్రాలు పాటించకుండా మాస్కు ఒక్కటే మనల్ని వ్యాధి నుండి దూరం చేయలేదు.8,10

ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సలహా మేరకు భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన సిఫారసు మేరకు నాసికా రంధ్రాలను సరళంగా మరియు హానికరమైన వైరస్ వంటి వాటి నుంచి దూరంగా ఉంచటానికి ప్రతి ఉదయము రెండు నాసికా రంధ్రాల్లో రెండు చుక్కల నువ్వుల నూనె వేయండి.11

ఈ క్రింద సిఫార్సు చేయబడిన మందులను ముందస్తు జాగ్రత్త కోసం ప్రతీరోజూ తీసుకోవాలి. విటమిన్ సి మూడు గ్రాములు విభజించిన మోతాదులో, విటమిన్ డి3 2000 IUs, మెగ్నీషియం: 400mg, జింకు;20mg, సెలీనియం: 100 mcg.14

5.   వైబ్రియానిక్స్ నివారణలతో చికిత్స

ఈ వైరస్ గురించి తెలిసింది చాలా తక్కువ. దీనికి నిర్దిష్టమైన మందులు లేదా వ్యాక్సిన్ ఇప్పటివరకు తెరపైకి రాలేదు. వైబ్రియానిక్స్   తో ఇంతవరకు ఎటువంటి కేసు చికిత్స చేయబడలేదు. ఇతరులకు నివారణ ఇచ్చేముందు ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఆ రోగి అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలని విషయం మనం ధృఢంగా చెప్పాలి. పేషంటుకు తగు విధంగా సూచనలు ఇస్తూనే, అభ్యాసకుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

సూచించబడిన నివారణలు:

108 CC బాక్స్ ఉపయోగించి ముందస్తు నివారణలు ఇచ్చే వారికోసం: CC9.2 Infections acute + CC9.4 Children's diseases + CC13.1 Kidney tonic + CC19.3 Chest infections + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic( SRHVPఉపయోగించే వారికోసం: SR261 Nat Mur 30C + SR270 Apis Mel 30C + SR272 Arsen Alb 30C + SR291 Gelsemium + SR275 Belladonna 30C)OW నివసిస్తున్న ఏరియాలో వ్యాధి వ్యాపించ నట్లయితే OW, ప్రబలంగా ఉంటే ODగా తీసుకోవాలి ; రోగి వయసు మళ్లినవారు లేదా సంక్రమణ ఏర్పడే అవకాశం ఉన్నట్లయితేనూ లేదా విదేశాలకు వెళ్లబోతుంటే విమానం ఎక్కే రోజున మరియు దాని ముందురోజు తీసుకోవాలి. ఎవరైనా వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనుమానాస్పదంగా ఉన్నట్లయితే, మోతాదు 6TDగా ఇస్తూ వెంటనే హాస్పిటల్లో అత్యవసర వైద్య చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించాలి. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే అలోపతి చికిత్స తో పాటు మద్దతుగా వైబ్రో చికిత్సను కూడా కొనసాగించాలి.

గోల్డెన్ ఫార్ములా( బంగారం లాంటి సలహా): రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సరైన జీవనశైలి, ఆహారం, స్వచ్ఛమైన గాలి లో వ్యాయామము, సూర్యరశ్మికి గురి కావడం, సమస్త జీవుల కోసం చేసే భగవత్ ప్రార్థనలు ఇవన్నీ ప్రయోజన కారులే. వ్యక్తిగత పరిశుభ్రతకు మరియు ముందస్తు నివారణ కు కట్టుబడి ఉండండి, అంతేకానీ భయపడవద్దు.

 

అధ్యయనం కోసం ఉపయోగించిన వెబ్సైట్లు :

  1. Health, Food, and Spiritual disciplines, Divine Discourse 8 October 1983, Sathya Sai Newsletter, USA, vol 8-4, Sathya Sai Baba Speaks on Food, Sri Sathya Sai Sadhana Trust Publication, December 2018, page55 
  2. Painted picture of novel coronavirus: https://www.forbes.com/sites/evaamsen/2020/02/10/what-does-a-coronavirus-look-like/#3f2c5d753c7f
  3. World Health Organisation site: https://www.who.int/health-topics/coronavirushttps://who.int/emergencies/disease/novel-coronavirus-2019
  4. Q&As on coronavirus: https://www.who.int/news-room/q-a-detail/q-a-coronaviruses
  5. Official statement on virus in China: https://www.youtube.com/watch?v=mgc_K2x-GKA
  6. https://www.who.int/dg/speeches/detail/who-director-general-s-remarks-at-the-media-briefing-on-2019-ncov-on-11-february-2020
  7. Coronavirus pandemic: https://www.nytimes.com/2020/02/02/health/coronavirus-pandemic-china.html
  8. Symptoms: https://www.dw.com/en/coronavirus-cold-or-flu-symptoms-how-to-tell-the-difference/a-52233885
  9. Incubation period: https://www.dw.com/en/how-long-is-the-coronavirus-incubation-period/a-52569944
  10. Protective measures against the new virus: https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public
  11. How to use masks: https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public/when-and-how-to-use-masks
  12. AYUSH site https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1600895
  13. Measures conveyed through music: https://www.youtube.com/watch?v=mP-mCfo4-f8
  14. Preventive supplements: https://www.peakprosperity.com/forum-topic/supplement-support-against-coronavirus

 

 

2. చెన్నైలో రెండు రోజుల పునశ్చరణ సదస్సు, ఇండియా, 2020 జనవరి

తమిళనాడుకు చెందిన 14 మంది అభ్యాసకులు (జూమ్ ద్వారా ఇద్దరితో సహా) పాల్గొన్న ఈ రెండు రోజుల సదస్సు అభ్యాపకురాలు11561 నివాసంలో కోర్సు టీచర్11422 ఆధ్వర్యంలో నిర్వహించబడింది. జూమ్ ద్వారా మరొక సీనియర్టీచర్ 10375(మోడల్ క్లినిక్కోసం) మరియు హేమ్ అగర్వాల్గారు (రోగ చరిత్రల నిమిత్తం) మరియు డాక్టర్ అగర్వాల్ గారు కూడా పాల్గొన్నారు. సదస్సు లోని ముఖ్యాంశాలు:

  • పాల్గొన్న ప్రతి ఒక్క అభ్యాసకుడు ఒక క్లిష్టమైన కేసును గురించి ప్రస్తావించగా సీనియర్ టీచర్ల మార్గదర్శకత్వంలో అది చర్చించబడింది. ఈ సెషన్ అనంతరం ఒక బహుళ దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన నిజమైన క్లినిక్ నిర్వహించబడింది

అనంతరం రోగ చరిత్రల యొక్క ప్రాముఖ్యత మరియు ప్రచురణ కోసం వాటిని ఉత్తమంగా ఏ విధంగా రూపొందించాలి అనేది కూడా చర్చింప బడింది. ఉత్తమమైన రోగ చరిత్ర రాయడంలో ఒక ప్రాక్టికల్ సెషన్ కూడా నిర్వహించబడింది.

క్లిష్టమైన కేసులను ఎలా పరిష్కరించాలోఎంతో విపులంగా డాక్టర్ అగర్వాల్ గారు వివరించారు. స్వామితో ఎల్లప్పుడూ స్తిరమైన నమ్మకంతో సంబంధం కలిగి ఉండాలని హృదయపూర్వకంగా వారికి శరణాగతి చేసి, మనం కేవలం వారి చేతిలో పనిముట్లు మాత్రమే అంతా చేసేది స్వామే అనే భావన ఎల్లప్పుడూ ఉంచుకోవాలి అని చెప్పారు. ఇదంతా చేస్తున్నప్పటికీ రోగికి నయం కాకపోతే, అది భగవంతుని సంకల్పంగానే భావించాలి. అనారోగ్యకరమైన జీవనశైలి రోగాలకు ప్రధాన కారణమని చెపుతూ, వారు అనుసరిస్తున్న “అనాసక్తత లేదా వైరాగ్యము ద్వారా స్వీయ స్వస్థత” (డిటాచ్మెంట్ బై సెల్ఫ్ హీలింగ్) వారు ఏ విధంగా సాధన చేస్తున్నారో తెలియజేశారు. అదేవిధంగా ఒక చెడు ఆలోచనను మంచి ఆలోచనతో ఎలా తొలగించుకోవాలో, ఉదాహరణకు, మన జీవితంలో స్వామితో మనం పొందిన అనుభవాలు లేదా జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వంటి చర్యల ద్వారా ఎలా సానుకూలంగా మార్చాలి అన్న విషయాలు వివరించారు. సాయి వైబ్రియానిక్స్ నూతన విధానాలపై తమ జ్ఞానాన్ని ఇనుమడింప జేసుకొన్న ఆనందంలో, సదస్సులో  పాల్గొన్నవారంతా బయలుదేరే ముందు తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ వైబ్రియానిక్స్ సేవకు పునరంకిత మవుతామని ఉద్ఘాటించారు.

 

3. పునశ్చరణ సదస్సు, బెంగళూరు, ఇండియా, 2020 ఫిబ్రవరి 8- 9

కర్ణాటకకు చెందిన 34 మంది అభ్యాసకులు హాజరైన రెండురోజుల అత్యంత పరస్పరాధారిత పునశ్చరణ సదస్సు, సీనియర్ టీచర్10375 ఆధ్వర్యంలో, బెంగళూరు బృందం వారిచే, మోడల్ క్లినిక్ మరియు కేస్ స్టడీలు ప్రత్యేక ఆకర్షణగా వైట్ ఫీల్డ్లోని బృందావనంలో ఏర్పాటు చేయబడింది. ఎంతోమంది అభ్యాసకులు తమ శిక్షణా కార్యక్రమం ఎన్నోయేళ్ల క్రితం చేసి ఉన్నందున తమ జ్ఞానాన్ని పునశ్చరణ మరియు నవీనీకరణ కోసమూ మరియు తమ అభ్యాసాన్ని తిరిగి ప్రారంభించడం కోసం శ్రద్దగా హాజరయ్యారు. ఈ సందర్భం కోసం నూతన సరళ సంక్షిప్త AVP కోర్సు ప్రత్యేకంగా రూపొందించబడినది. రోగ చికిత్సకు సంబంధించిన విభిన్న అంశాలు, మరీ ముఖ్యంగా, వైబ్రియానిక్స్ నివారణలు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఎలా సహాయ పడతాయి, మరియు కంటి, చెవి, నాసికా చుక్కలుగా ఈ నివారణలు ఎలా ఉపయోగించబడతాయి వంటివి చర్చించారు. రోగ చరిత్ర ఎలా వ్రాయాలి, పేషెంట్ రికార్డు నిర్వహణ వాటి ప్రాముఖ్యత, విజయవంతమైన కేసులను పాఠకులు చదువుకోవడానికి వీలుగా ప్రచురించడం వంటివి తెలియజేశారు.

కర్ణాటక సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నగేష్ దక్కప్ప తనకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ప్రత్యేక అతిథిగా ఈ సదస్సుకు రావడం అభ్యాసకులు అందర్నీ ఆనందింప జేసింది. వీరి ఉత్తేజకరమైన మరియు మనోబలాన్ని ఇనుమడింప జేసే ప్రసంగములో 2009లో బెంగళూరులో మొదటి వైబ్రియానిక్స్ వర్క్ షాప్ మరియు తదనంతర వర్క్ షాపులు నిర్వహించడానికి మరియు బృందావనంలో క్లినిక్ ప్రారంబించడానికి సహాయపడమని స్వామి తనను ఆదేశించిన విషయాలు గుర్తు చేసుకున్నారు.

డాక్టర్ అగర్వాల్ తమ స్కైప్ కాల్ ప్రసంగంలో అభ్యాసకులు అందరూ ఏకీకృత ఏకాగ్రత ద్వారా స్వామితో సంబంధాన్ని ఏర్పరుచుకొని వైబ్రియానిక్స్ ను స్వీయ పరివర్తన కోసం ఒక అద్భుతమైన సేవగా కొనసాగించమని సూచించారు. వైబ్రియానిక్స్ సేవ ఒక అద్వితీయమైన సేవని ప్రస్తుతం ప్రపంచమంతా ఎటువంటి దుష్ప్రభావాలు లేని ప్రత్యామ్నాయ సేవల వైపు ఆకర్షితు లవుతున్నారని తెలిపారు. అంతేకాక అభ్యాసకులు డాక్టర్లు కారు కనుక తమ సమయాన్ని మరియు ప్రయత్నాన్ని నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, ప్రేమతో రోగులను చూడటానికి కేటాయించాలని తెలిపారు.

 

 

 

 


ఓం సాయి రామ్