Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 8 సంచిక 6
November/December 2017
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్కు నుండి

ప్రియమైన వైబ్రో అభ్యాసకులరా

భగవాన్ బాబావారి 92 వ జన్మదినోత్సవ సందర్భంగా మీతో ఇలా నా భావాలూ పంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.వారి దివ్యవాణి ఎంత అద్భుతమైన ఫలితం కలిగిస్తుందంటే కేవలం అది విన్నా చదివినా మనిషి యొక్క  సంపూర్ణ మూర్తిమత్వములో సమూలమైన  మార్పు వస్తుంది. మరి అటువంటి దివ్యమైన వైబ్రేషణ్  వైబ్రియోనిక్స్ రూపంలో వ్యాప్తి చేయడానికి స్వామి చేత ఎన్నుకోబడిన మనమెంత భాగ్యశాలురమో ఊహించండి. 

  ఇక ఈ సంచిక విషయానికొస్తే ఫ్రాన్సు దేశంలో వైబ్రియోనిక్స్ సేవలను విశేషంగా చూపుతూ ప్రస్తుత సంచిక లో ప్రేమ,సేవ భావాలతో అత్యంత ఉత్సాహంగా వినయంగా సేవలందిస్తున్న నలుగురు ప్రాక్టీషనర్ లపైన ప్రత్యేక  కథనం ఇవ్వబడింది.  ఇవి పాఠకులలో ఒక విధమైన ప్రేరణను కలిగించి జీవిత లక్ష్యం వైపు పురోగమింప చేస్తుందనడంలో అతిశయోక్తి ఏమీలేదు. కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైబ్రో ప్రాక్టీ షనర్లకు నా విన్నపం ఏమిటంటే మీరు కూడా ఈ వార్తాలేఖ చదివి ప్రేరణ పొంది మీ ప్రొఫైల్ లను కూడా మీమీ ప్రాంతీయ లేక మీదేశపు కోఆర్డినేటర్లకు పంపవలసిందిగా సూచన.   

 అలాగే  ఒక బాధాకరమైన విషయాన్నికూడా  మీ ముందుకు తీసుకువస్తున్నాను. మన ప్రియమైన సాయి సోదరి అన్నా 02554ఇటలీ   ఈ నెలలోనే స్వర్గస్తులయ్యారు. ఆమె తనకు వచ్చిన వ్యాధితో చాలా ధైర్యంగా ఎదుర్కోవడమే కాక చివరి క్షణం వరకూ పేషంట్ ల సేవ అడ్మిన్ సేవ చేస్తూనే తుది శ్వాశ విడిచారు. వైబ్రియోనిక్స్ కు వీరు అందించిన  సేవలు అత్యంత విశిష్ట మైనవి.  చాలా సంవత్సరాలు వీరు తన భర్తతో కలసి ఇటలీ కి జాయింట్ కోఆర్డినేటర్ గా పని చేసారు. ఇటలీ లో అనేక వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడమే కాకుండా  తమ మాతృ భాషలోనే వీటిని నిర్వహించడం ఒక విశేషం . వీరి అనుభవంలో విజయ వంతమైన అనేక  అద్బుతమైన కేసులు ఉన్నాయి. ఈ జన్మదినోత్సవం  సందర్భంగా ఆమె ఆత్మ స్వామిలో లీనం కావాలని మనసారా స్వామిని ప్రార్ధిస్తున్నాను.  

ఇక సంస్థాపరమైన విషయాలు చూసినట్లయితే మనమంతా కలసి పనిచేస్తూ సమన్వయంతో ముందుకు వెళుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉండి. రక్షణ విషయంలోనూ గోప్యత విషయంలోనూ మన రెండు వెబ్సైట్లు http://vibrionics.org  మరియు  https://practitioners.vibrionics.org. లలో కొన్ని మార్పులు తీసుకు వచ్చాము. ఈ మార్పులు వెంటనే అమలులోనికి వస్తాయి మీ పాత పాస్ వర్డ్ లు పనిచేయవు ( మీరు గత నెల లోనే పాస్ వర్డ్ సృష్టించు కొని వుంటే తప్ప)కనుక మీరు క్రొత్త వాటిని తయారుచేసుకోనవలసి ఉంటుంది. దీనికోసం ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఎంచుకొని దానిని క్లిక్ చేయడం, తర్వాత తెర పైన కనిపించే సూచనలను పాటించడం ద్వారా కొత్తది సృష్టించుకోవలసి ఉంటుంది. ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రెండు సైట్ లకూ ఒకే పాస్ వర్డ్ తాయారు చేసుకోవలసినదిగా సూచన .

మనందరికీ తెలుసు కాలము ఎవరికోసము ఆగదు.అందువలననే ప్రతీ క్షణం సద్వినియోగం చేసుకుంటూ వర్తమానం లోనే జీవించడం నేర్చుకోవాలి . నేను ఇలా ఎందుకంటున్నానంటే  ప్రపంచ జ్ఞానసంప్రదాయాల వివరణ ప్రకారం వర్తమాన కాలానికి మించి మరేది సాటి రాదు,కనుక ప్రస్తుత తరుణంలో విశ్వ శక్తులతో మనసును మమేకంచేసుకొని ఆ దివ్య శక్తులే మనద్వారా పనిచేసే లాగా చేసుకోగలగాలి.కనుక మనం చేసే సేవను సంపూర్ణ సమర్పణ భావంతో చేసినపుడు అట్టి దివ్య శక్తి మనలో ఇమిడీ కృతం అవుతుంది.  అప్పుడుమనం ఈ కాలాతీత మైన శక్తిదాయకమైన ఆత్మశక్తి తో సంలీనమై మన ద్వారా చేయబడే ప్రతీ సేవ,ప్రతీ చర్యా నిర్మాణాత్మకము గానూ,పరిపూర్ణమైనది గానూ ఉంటుంది. ఇదే వైబ్రియోనిక్స్ లో కానివ్వండి మరే ఇతర నిస్వార్ధ సేవలోగాని ఉన్న రహస్యం. ఇదే జీవిత పరమార్ధం.కనుక ఈ జన్మదినోత్సవ సందర్భంగా స్వామిని మనస్పూర్తిగా ప్రార్థించేదేమిటంటే మానవాళి అంతా స్వామి ప్రవచించిన  ‘’అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు ‘’ అనే సూత్రం ద్వారా ఒక్కటి కావాలని, అందరూ ఆనందంగా జీవించేలా  అనుగ్రహించమని కోరుకుంటూ ,

ప్రేమతో సాయిసేవలో తరించే మీ

జిత్ కె. అగ్గర్వాల్

లైమ్ వ్యాధి , బాల్యంలో ఏర్పడ్డ గాయం 03546...France

2017 మే 22 న 43 సంవత్సరాల వ్యక్తి లైమ్ వ్యాధి చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.వీరికి జ్ఞాపక శక్తి లోపము,తలపోటు,గొంతు నొప్పి మరియు కడుపు నొప్పి గత నలుగు సంవత్సరాలుగా ఉన్నాయి. వీరికి కీళ్ళ నొప్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే దానివలన వీరు ఇంట్లోనే ఉండిపోవలసి వస్తోంది. ఐతే రక్త పరీక్షలలో దీని విషయం ఏమీ తెలియలేదు కానీ డాక్టర్లు ఇది ఒక మానసిక రుగ్మత అని చెప్పారు.

ప్రాక్టీషనర్ పేషంటు ను తను ఇవ్వబోయే చికిత్స రెండు విధానాలలో ఉంటుందని సూచించారు. ఒకటి క్లెన్సింగ్  రెమిడి తీసుకోవడం ద్వారా వ్యాది లక్షణాలు ఉధృతమై తర్వాత వ్యాధి మెల్లిగా నెమ్మదిస్తూ  వస్తుందని చెప్పారు. ఎందుకంటే  బాల్యంలో ఇతను ఒక అక్కరకు రాని  శిశువుగా తల్లిదండ్రుల ద్వేషానికి గురి అవుతూ తరుచుగా దెబ్బలు తింటూ ఆత్మహత్యా యత్నాలు చేస్తూ ఉండేవాడని తెలిసింది. కనుక క్లెన్సింగ్ తగిన రెమిడి అని భావించి దానిని ఇవ్వడం జరిగింది.

# 1. CC17.2 Cleansing...TDS

ప్రాక్టీ షనర్ తనకు ప్రతీ రోజు ఎలాఉందో చెప్పమని పేషంటు ను కోరారు.మొదటి రెండు రోజులు వ్యాధి లక్షణాలు పెరిగి నట్లు అనిపించింది. ఐనప్పటికీ పేషంటు రెమిడి TDS గా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మరునాటి నుండి వ్యాధి తగ్గడం ప్రారంభమయ్యి 7 రోజులలో పూర్తిగా తగ్గిపోయింది.ఐనప్పటికీ డోసేజ్ మరో నలుగు వారాలు కొనసాగించారు.  

జూన్  27 న అతని బాల్యములోకలిగిన మానసిక గాయానికి చికిత్స చేయాలని భావించి ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు.

# 2. CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders...TDS 

తర్వాత రెండు వారాలు వీరికి శ్వాశ అందక పోవడం,అలసట తో పాటు నిద్రపోవడం చాలా కష్టంగా ఉండేది.ప్రాక్టీ షనర్ ఇది పుల్లౌట్ అని నచ్చచెప్పడం తో చికిత్స కొనసాగింప బడింది.అతి తక్కువ కాలంలోనే వ్యాధి లక్షణాలు అదృశ్య మయ్యాయి. 2017 అక్టోబర్లో  అతనికి పూర్తిగా తగ్గిపోవడంతో తన వైబ్రో అనుభవాన్ని ఆనందంగా పంచుకున్నారు.

కటి భాగంలో నడుము నొప్పి 03546...France

57సంవత్సరాల మహిళ  2017.జనవరి నుండి నడుమునొప్పి తో బాధ పడుతున్నారు .వీరికి  2011 మరియు 2016 లో నరాలకు సంబంధించిన కొన్ని సమస్యల వలన  తొడకు సంబంధించిన నరానికి శస్త్ర చికిత్సలు జరిగాయి. ప్రస్తుతం ఆమెకు ఉన్న  ప్రధాన సమస్య ఏమిటంటే  కటి ప్రాంతంలో వెన్ను దగ్గర తీవ్రమైన నొప్పి వస్తోంది. 8 నెలల పాటు ఏవో కొన్ని నొప్పి నివారించే నూనెలతో వైద్యం చేయించుకున్నా ప్రయోజనం కనిపించలేదు. ఈమెకు వేరే ఇతర సమస్యలేవీ లేవు.

2017 సెప్టెంబర్ 1 న వీరు ప్రాక్టీ షనర్ ను కలవగా వీరికి క్రింది రెమిడి ఇచ్చారు :

CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.4 Muscles & supportive tissue...6TD మూడు రోజులు అనంతరం TDS

 7 రోజుల తర్వాత వీరికి 70% నయంయ్యింది. రెండు వారాల తర్వాత నొప్పి పూర్తిగా అదృశ్యమయింది. ఆ తర్వాత ఆమె TDS  గా మరో వారం వాడి అనంతరం మెల్లిగా తగ్గిస్తూ  BD గా మరో వారము,చివరిగా OD గా 3 రోజుల పాటు వాడడం జరిగింది.

2017అక్టోబర్ నాటికి పేషంటుకు నొప్పి వంటి ఏ సమస్యా లేకుండా ఆనందంగా ఉన్నారు ,

ఎక్జిమా 11585...India

ప్రాక్టీషనర్ AVP శిక్షణ పూర్తి చేసుకున్నాక మొదటి పేషంటు వీరి యొక్క 16 సంవత్సరాల అమ్మాయే. సంవత్సరంనర నుండి ఈమె  రెండు కాళ్ళ పైనా తీవ్రమైన దురద నల్లని మచ్చలూ,సన్నని పొక్కులతో బాధపడుతున్నారు.   నల్ల మచ్చలు ఈమె తొడ భాగము నుండి చీలమండల వరకూ వ్యాపించాయి. ఈమె సంవత్సరకాలం పాటు హొమియోపతీ చికిత్స తీసుకున్నారు కానీ ప్రయోజనం కనబడలేదు. కనుక ఒక అలోపతి డాక్టర్ ను సంప్రదించగా దీనిని ఎక్జిమా అని గుర్తించి ట్యాబ్లెట్లు ఆయింట్మెంట్  వ్రాసారు. మూడునెలల పాటు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ వ్యాధి లక్షణాలు అలాగే కొనసాగాయి.ఐతే  అలోపతి చికిత్స వలన వ్యాధి మాత్రం ఇతర శరీర భాగాలకు వ్యాపించలేదు  2017 మార్చి 22 న అలోపతి మందులు ఆపివేసి ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :

#1. CC12.1 Adult tonic + CC21.3 Skin allergies + CC21.6 Eczema…TDS

#2. CC21.6 Eczema ను విభూతి మరియు కొబ్బరి నూనె లో కలిపి శరీరంపైన వ్యాధి ఉన్నచోట రాయడనికి ఇచ్చారు. ఒక వారంలో 25% మెరుగుదల కనిపించింది. దురద కొంచం తగ్గి మచ్చలు తగ్గుముఖం పట్టాయి. నాలుగు వారాలు గడిచేసరికి 100%  వ్యాధి నివారణ జరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో మచ్చలూ,పొక్కులూ, దురదా,పూర్తిగా తగ్గిపోయినందుకు అమ్మాయి చాలా ఆనందించింది. కుటుంబ సభ్యులంతా ఈమె శరీరము పైన వ్యాధి లక్షణాలు ఏమీ లేకుండడం చూసి చాలా ఆశ్చర్యపడ్డారు.

డోసేజ్ ను మూడు నెలల వ్యవధిలో  TDS నుండి  OD కి మెల్లిగా తగ్గించడం జరిగింది. OD గా  మరో నెల తీసుకున్న తర్వాత ఈమెకు వ్యాధి లక్షణాలు ఏమీ తిరిగి పునరావృతం కాకపోయే సరికి డోసేజ్ మరింత తగ్గిస్తూ  OW  గా మరొక నెల తీసుకోని అనంతరం పూర్తిగా మానివేసారు.

  2017 అక్టోబర్ నాటికి అమ్మాయి పైన పేర్కొన్న వ్యాధి లక్షణాలు ఏమీ లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంది.ఈ  అద్భుత నివారణకు ప్రాక్టీషనర్ ప్రియ భగవానునికి, వైబ్రియోనిక్స్ కు  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 

బాహ్య సర్పి మరియు అధికమైన వాంతులు 02802...UK

45 సంవత్సరాల మహిళ రెండు రోజులుగా జ్వరము తోనూ మరియు పై పెదవి ఎడమవైపు సర్పి వలన కలిగిన పుండ్ల తోనూ 2017. జూన్ 16 న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.ఆమె గొంతంతా మంట గా ఉండడమే కాక నాలిక పైన తెల్లని పూత కూడా వచ్చింది. క్రితం రోజు నుండి ఆమెకు వాంతులు కూడా బాగా ఔతున్నాయి.వీరికి వారం క్రితమే రొమ్ము భాగంలో వచ్చిన కణితి ని శస్త్రచికిత్స చేసి తొలగించారు.ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగియడమే కాక దానితాలుకు గాయం కూడా త్వరగానే తగ్గిపోసాగింది. మరి హఠాత్తుగా  ఇలా ఎందుకు వ్యాధి బారిన పడిందో ఆమె చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈ వ్యాధి వలన ఏమీ తినలేక నీరసపడ్డారు. జ్వరం నిమిత్తం పారాసిటమల్  తప్ప వీరు ఏమీ వేసుకోలేదు.ప్రాక్టీ షనర్ ఆమెకు క్రింది రెమిడి ఇచ్చారు : 

CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC8.3 Breast disorders + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC11.5 Mouth infections + CC11.6 Tooth infection + CC21.7 Fungus + CC21.8 Herpes...6TD

ఈ రెమిడి తీసుకునే సమయంలో పేషంటు మరే ఇతర మందులు తీసుకోలేదు. రెండు రోజుల లోనే పేషంటు కు 100% తగ్గిపోయినందుకు చాలా ఆనందించారు. క్రమంగా డోసేజ్ ను రెండు రోజులు TDS గానూ OD  గా మరో మూడు రోజులు తీసుకోని ఆపివేశారు  2017అక్టోబర్ నాటికి వీరికి ఈ వ్యాధి లక్షణాలు ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నారు. 

దీర్ఘకాలిక ఆస్తమా 11577...India

12 సంవత్సరాలుగా ఆస్తమా తో బాధ పడుతున్న  22-సంవత్సరాల యువకుడు 2016 మార్చి 5 న ప్రాక్టీ షనర్ ను సంప్రదించాడు. పగలు ఊపిరి తీసుకోవడానికి  పెద్దగా ఇబ్బందేమీ లేకున్నప్పటికీ రాత్రిపూట మాత్రం చాలా కష్టపడాల్సి వస్తోంది.  ఇంతేకాక  ఇతనికి జలుబు,దగ్గు వచ్చినప్పుడు మాత్రం వ్యాధి మరింత ఎక్కువై చాతీలో నొప్పి కూడా వస్తోంది. ఈ 12 సంవత్సరాలుగా అలోపతి మందులతో పాటు ఇన్హేలర్ కూడా వాడుతున్నప్పటికీ వ్యాధి అలానే ఉంటోంది. అలెర్జీ కలిగించే టటువంటి దుమ్ము,పుప్పొడి వంటివే తన వ్యాధిని ఎక్కువ చేస్స్తున్నాయని భావింప బడింది. ఇతనికి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :

CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack…TDS

రెమిడి ఇచ్చిన సందర్భంలో పేషంటు ఒక్క ఇన్హేలర్ తప్ప అలోపతి మందులేవీ వాడడం లేదు. రెండవ రోజున వ్యాధి బాగా ఎక్కువై రెండు వారాల పాటు కొనసాగింది. ఐనప్పటికీ పేషంటు రెమిడి తీసుకోవడం మానలేదు. మెల్లిగా వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి    కొంత మెరుగుదల కనిపించ సాగింది. 8 వారాల తర్వాత పేషంటు ను ఆశ్చర్య పరుస్తూ వ్యాధి 100% నివారణ అయ్యింది. మరో రెండు వారాలు రెమిడి తీసుకొని  తర్వాత మానివేసారు . ఐనప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉండసాగారు. ప్రస్తుతం ఇతనికి ఇన్హేలర్ తో పని లేకుండా పోవడమే కాక తిరిగి వ్యాధి లక్షణాలేమి తలెత్తకుండా ఆనందంగా ఉండసాగారు. 

మోకాలి నొప్పి 02799...UK

55 సంవత్సరాల వ్యక్తి గత 5 సంవత్సరాలుగా ఎడం మోకాలి నొప్పి తో బాధ పడుతున్నాడు.వీరు 2016.మే 29 న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. గతంలో వీరికి అనగా  2013 వ సంవత్సరంలో నిపుణుల చేత మోకాలిపై రంధ్రం చేసి శస్త్ర చికిత్స చేసారు కానీ దాని వల్ల ఏమీ ఉపయోగం కనిపించలేదు .వీరి మోకాలు వాచి ఉండి వంపడానికి వీలు లేకుండా ఉండి.ఏవయిన మెట్లు వంటివి  ఎక్కేటప్పుడు విపరీతంగా నొప్పి వస్తోంది.వీరు ప్రాక్టీ షనర్ ను సంప్రదించే నాటికి కేవలం కొన్ని అలోపతిక్ నొప్పి నివారణులను వేసుకుంటున్నారు. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :

#1. CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…QDS

#2. NM36 War + NM45 Atomic Radiation + NM113 Inflammation + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR324 X-Ray + SR348 Cortisone…QDS

వైబ్రో రెమిడి లు ప్రారంభించకముందే అలోపతిక్ మందులు మానేసారు. రెండు వారాల తర్వాత ఎడమ మోకాలి పైన ఉన్న వాపు పూర్తిగా అదృశ్యమయ్యి మోకాలు మామూలు గానే కనిపించ సాగింది.నొప్పి 75% తగ్గింది.   #1 మరియు  #2 యొక్క డోసేజ్ TDS.కు తగ్గించడం జరిగింది.నాలుగు వారాల తర్వాత అనగా  2016 జూన్ 16 నాటికి వీరికి 100% తగ్గిపోయింది. ఇప్పుడు ఏమాత్రం నొప్పి లేదు, కాలు మాములుగానే వంచ గలుగుతున్నారు.కనుక డోసేజ్ ను ఒక నెల  BD గానూ మరుసటి నెల OD గానూ తగ్గించు కుంటూ వచ్చారు ప్రస్తుతం వీరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉన్నారు. 

మూత్ర పిండాలలో రాళ్లు 03522...Mauritius

27 యువకుడు  రెండు సంవత్సరాల నుండి వెన్ను నొప్పి,అజీర్ణం,అసిడిటీ తో బాధపడుతున్నారు. తన తల్లి గతించిన తర్వాత ఇతనికి  ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి. దీని ఫలితంగా తను చేస్తున్న పని పైన ఏకాగ్రత నిలపలేక తరుచుగా సెలవు పెడుతూ ఉన్నారు. ఒక అలోపతి వైద్యుని సంప్రదించి మందులు వాడారు కానీ అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చాయి. ఒకసారి తీవ్రంగా వెన్ను నొప్పి రావడంతో 2014 డిసెంబర్ లో   హస్పిటల్ కి వెళ్ళగా కిడ్నీ లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. లితోట్రిప్సీ (పెద్ద రాళ్ళను ధ్వని కిరణాల ద్వారా పగలగొట్టడం) చేయించడం కోసం ఇతని పేరు వెయిటింగ్ లిస్టు లో పెట్టారు. ఐతే అప్పటి వరకూ నొప్పి తగ్గడం కోసం పారాసిటమల్, బ్రుఫెన్ ట్యాబ్లెట్లు  ఇచ్చారు.   మూడవసారి అపాయింట్ మెంట్ తర్వాత కూడా లితోగ్రాఫ్ ( అల్ట్రాసౌండ్  సూచి) ప్రకారం అతనికి ఇంకా రాళ్లు ఉన్నాయని లితోట్రిప్సీ చేయించుకోవలసిన లిస్టు లోనే పేరు ఉంచారు. దీనితో నిరాశ చెంది  2015,మే 27 న వీరు ప్రాక్టీ షనర్ ను సంప్రదించగా  వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :

CC4.10 Indigestion + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…TDS 

నెల రోజుల పాటు అలోపతి నొప్పి నివారినుణలతో పాటు  వైబ్రో రెమిడి లు వాడిన తరువాత  పేషంటు కు 50 శాతం తగ్గిందని తెలిపారు. ఇప్పుడు నొప్పి అప్పుడప్పుడూ మాత్రమే పెద్దగా తీవ్రత ఏమీ లేకుండా వస్తోంది. రెమిడి అలాగే కొనసాగించ సాగారు. మూడవ నెల అనంతరం వీరికి అజీర్ణ వ్యాధి అసిడిటీ పూర్తిగా తగ్గిపోవడంతో పాటు నడుము నొప్పికూడా పూర్తిగా అదృశ్యమయింది.ఆ సమయంలో తీసిన ఎకోగ్రఫీ లో మూత్ర పిండాలలో రాళ్లు కూడా లేవని రిపోర్టు వచ్చింది.వీరు అలోపతి నొప్పినివారిణులను పూర్తిగా ఆపివేసి వైబ్రో రెమిడి లను మాత్రము  మరో 6 నెలలు TDS గా కొనసాగించి తర్వాత మెల్లిగా  OD కి తగ్గించారు. 2017 అక్టోబర్ నాటికి పేషంటుకు నొప్పి గానీ కిడ్నిలో రాళ్లు గానీ ఎలాంటి సమస్యలు పునరావృతం కాలేదు ప్రస్తుతం వీరు రెమిడి ని OD గా కొనసాగిస్తూనే ఉన్నారు.

వైబ్రో అభ్యాసకుల వివరాలు 03527...France

ప్రాక్టీ షనర్ 03527ఫ్రాన్స్ వీరికి భగవాన్ బాబావారితో మొదటి సమాగమము 1995 లో కలిగింది . ఆ సందర్భంలో వీరు రెండు వారాలు ప్రశాంతి నిలయంలోనే గడిపారు. అదొక అద్భుతమైన అనుభవంగా వీరికి మనః ఫలకము మీద  ఉండిపోయింది. దశాబ్దాల తరబడి అనేక ప్రత్యామ్నాయ చికిత్సా విధానాల అభిరుచి పెంచుకున్నారు కానీ దేనిని పాటించాలనే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోన లేకపోయారు. వీరికి  అంతకు ముందే .మనవ దేహంలోని చక్రాలు,మెరిడియన్ ల విషయంలో అవగాహన ఉండడం తో ఈ ప్రత్యామ్నాయ చికిత్సా విధానంలో శిక్షణ తీసుకున్నారు. అంతేకాక అలోపతి మందుల యొక్కహానికరమైన దుష్పలితాలు, మరియు మూలానికి చికిత్స చేయకుండా రోగానికి చికిత్స చేసే ఈ లోపభూయిష్ట మైన విధానము పట్ల పూర్తి ఆగాహన ఉంది. ఎప్పుడయితే ఫ్రెంచ్ కోఆర్డినేటర్  01620 వైబ్రియోనిక్స్ గురించి చెప్పారో  వెంటనే ఈ విశ్వవ్యాప్త సార్వజనీనమైన విధానము పట్ల వీరు ఆకర్షితులయ్యారు. వైబ్రియోనిక్స్ వెబ్సైట్ ద్వారా ఈ విధానము పట్ల  అవగాహన పెంచుకున్నారు. అనంతరం తన కు వచ్చిన దీర్ఘకాలిక  కటి భాగంలో వెన్నుముక నొప్పికి రెమిడి తీసుకోవడం తో పాటు వైబ్రియోనిక్స్ శిక్షణకు కూడా నమోదు చేయించుకున్నారు. తనలో నిగూఢముగా ఉన్న సేవచేయాలనే తపన ,కోరిక స్వామికి తెలుసు కనుక ఈ విధంగా సానుకులమయ్యే పరిస్థితి కల్పించారని వీరి భావన. తను ప్రశాంతి నిలయం దర్శించుకున్న సమయం నుండే స్వామి తన హృదయ క్షేత్రాన్ని ప్రేమ బీజాలు మొలకెత్తడానికి ఇన్ని సంవత్సరాలుగా అనుకూలం చేస్తూ వచ్చారని అది ఇప్పుడు ఈ విధంగా ఒక అద్భుతమైన వైద్యవిధానము లో ప్రవేశించి సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించి తన కలను సాకారం చేసిందని భావిస్తున్నారు.   

వీరు తన వెన్ను సమస్య  ఎలా పరిష్కారమయ్యిందో ఆ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.  2014 జూన్ లో తీసిన స్కానింగ్ రిపోర్టు ప్రకారము వీరికి క్షీణిస్తున్న కీళ్ళు మరియు  L4-L5 ప్రాంతంలో జారిన వెన్ను పూసలు ఉన్నట్లు తెలిసింది.న్యూరో సర్జన్ ఆపరేషన్ చేయవలసి ఉంటుందని చెప్పారు. కానీ 2015 మే నెలలో వీరు  ప్రాక్టీషనర్ 01620 ఆధ్వర్యంలో వైబ్రో చికిత్స తీసుకోవాలని భావించారు. అదే సమయంలో AVP కోర్సు కు నమోదు చేయించుకొని 2015 జూన్ లో శిక్షణ పూర్తి చేసుకొని తనకు తానే మొదటి పేషంటు గా క్రింది రెమిడి తీసుకున్నారు :

CC18.5 Neuralgia + CC.20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS నీటితో

రెండు సంవత్సరాల తర్వాత తీసిన స్కానింగ్ ప్రకారము అతని వెన్నుముక క్షీణత పూర్తిగా పోయిందని నిర్ధారణ అయ్యింది. తనలో స్వస్థత చేకూరే క్రమం లోలోపల జరుగుతూనే ఉందని పూర్తి విశ్వాసంతో దీర్ఘకాలంగా వాడిన వైబ్రియోనిక్స్ మరియు స్వామి ప్రేమే తనను శస్త్ర చికిత్స చేయించుకోకుండా కాపాడాయని వీరికి  నమ్మకం ఏర్పడింది.

వైబ్రియోనిక్స్  ప్రాక్టీషనర్ ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం తో ఉండాలని పేషంట్లను చూసే సమయంలో కూడా అట్టి విశ్వాసం వ్యక్తపరచాలని అప్పుడే పేషంట్లలో ఒక చక్కని వైద్యుని దగ్గరికి వచ్చామనే నమ్మకం కలుగుతుందని వీరి ఉద్దేశ్యం.  అట్టి విశ్వాసం ఏర్పడినప్పుడే పేషంటు యొక్క మనసు మరియు  హృదయం లోనూ సమన్వయం ఏర్పడి త్వరగా వ్యాధి నయమవ్వడానికి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రోగం అనేది మానసిక భావోద్వేగ స్థాయిలోనే మొదలవుతుందని స్వామి చెప్పిన విషయాన్ని వీరు గట్టిగా సమర్ధిస్తారు. మన భూ గ్రహం యొక్క కంపించే స్థాయిలలో మార్పుల వల్లే ఎక్కువ శాతం ప్రజలు రోజు రోజు కు అస్థిరంగానూ, అవిశ్రాంతంగానూ, డిప్రెషన్ తోనూ.నిద్రలేమి తనం తోనూ   బాధ పడడంతో పాటు వారి దుర్భావాలకు కూడా లోనవుతున్నారని  వీరి భావన. దీని నిమిత్తం వీరు పేషంట్లకు తాము వేసుకునే మందులతో పాటు అదనంగా క్రింది రెమిడి లు సూచిస్తున్నారు :

మానసిక ప్రశాంతత కోసం :
CC15.1 Mental & Emotional tonic లేక  CC15.2 Psychiatric disorders, పేషంటు యొక్క వ్యాధి తీవ్రతను బట్టి ప్రతీ పది నిమిషాలకు ఒక డోస్  చొప్పున ఒకటి లేదా రెండు గంటలు పేషంటు పరిస్థితి మెరుగయ్యే వరకూ 

గాఢమైన నిద్రకోసం :
CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders

ఇంటర్నెట్ లో నేచురల్ రెమిడి ఫోరం ద్వారా తెలుసుకొని దీర్ఘకాలిక వెన్ను నొప్పి నిమిత్తం తన వద్దకు  వచ్చిన 28 సంవత్సరాల మహిళ యొక్క రోగ చరిత్రను  వీరు మనతో పంచుకొంటున్నారు. ఈమె ప్రాక్టీ షనర్ తో చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె యొక్క తల్లితో ఉన్న ఇబ్బంది కరమైన బాంధవ్యం వలన 6 నుండి 7 సంవత్సరాలు మానసిక వైద్యాలయమునకు పంపబడింది.అక్కడినుండి రాగానే దురదృష్ట వశాత్తూ ఈమెను తల్లి ఇంట్లోనుండి బయటకు నెట్టివేసింది.   హృదయ విదారక మైన ఆమె గాధ విన్న తర్వాత ప్రాక్టీ షనర్ పైన పేర్కొన్న రెండు రెమిడి లు ఇచ్చారు. 9 నెలల చికిత్స అనంతరం ఆమె ప్రాక్టీషనర్ తో ‘’నేను ఇంత మంచి స్థితిలో ఉంటానని కలలో కూడా ఉహించలేదని చెప్పింది.” 

ఈ ప్రాక్టీ షనర్ ఉద్దేశ్యంలో మనదగ్గరికి వచ్చిన పేషంట్లు ప్రాక్టీషనర్ చెప్పిన విషయాలు జాగ్రత్తగా విని అనుసరించగలిగితే అవి వారికి నయం చేసే మంత్రం వలె పనిచేసి  పేషంటు లో నిరంతరాయంగా వస్తున్న చెడు ఆలోచనల స్థానంలో మంచి ఆలోచనలు ప్రవేశపెట్టి వ్యాధి విముక్తి కలిగిస్తాయి.అటువంటి పాజిటివ్ అఫిర్మేషణ్  ఒకటి క్రింద ఇవ్వబడింది . ‘’ నా శరీరము, మనసు,నా ఆలోచనలు నన్ను ప్రక్కదారి పట్టించి నప్పటికీ నేను ఆనందంగానూ,పూర్తి ఆరోగ్యంగానూ ఉన్నాను.ఆధ్యాత్మిక పథంలో నేను తిరిగి పరిపూర్ణత పొందేవరకు ఏ శక్తి నన్ను ఆపలేదు’’.  పేషంటు యొక్క మతమేదయినా,నమ్మి కొలిచే దైవము ఎవరయినా,వారికి తమ ఆధ్యాత్మిక బాటలో ముందుకు సాగటానికి వారికి త్వరగా స్వస్థత చేకురడానికి, ఆధ్యాత్మిక సాధన అత్యవసరం  అనే రీతిలో తగిన సూచనలు ఇవ్వడం అత్యంత ప్రధానము.అని వీరి భావన.

ఈ క్రింది నొప్పి నివారిణి ని వీరు ఎంతో ప్రయోజనవంతంగా ఉపయోగించారు   : NM59 Pain + SR348 Cortisone + nosode of Doliprane (paracetamol)తరుచుగా  నీటితో ...అవసరం మేరకు లేదా నొప్పి తగ్గేవరకు. ప్రాక్టీ షనర్లు దీనిని అత్యవసర బాధానివారిణి గా ఎప్పుడూ తమ వెంట ఉంచుకోవడం మంచిది.మొక్కలు,జంతువులతో పాటు ఈ ప్రాక్టీ షనర్ ప్రయాణములో రుగ్మత,చాతి,మరియు నోటికి సంబంధించిన  ఇన్ఫెక్షన్ లు,మధుమేహము, వేరికోస్ అల్సర్,కేన్సర్ కణుతులు, రొమ్ముకు సంబంధించిన రుగ్మతలు,నరాల పీడన వల్ల రక్త స్రావము,మలబద్ధకం,మూత్ర పిండాల వ్యాధులు,అతిమూత్రం,రక్తప్రసరణ వ్యవస్థ,మూత్ర సంబధిత వ్యాధులు ఇలా అనేక రకరకాల వ్యాధులకు చికిత్స చేయడంలో అనుభవం గడించారు.  

అలాగే మరొక కేసు గురించిన సమాచారాన్ని ప్రాక్టీషనర్ మనతో ఇలా పంచుకుంటున్నారు. 63 సంవత్సరాల వ్యక్తి గత 6 సంవత్సరాలుగా మధుంహం తోనూ,మరియు అతని  18 వ సంవత్సరం నుండి ఎక్జిమా తోనూ బాధపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా  ఇతని ఎడమ కాలి  క్రింది భాగంలో పుండు కూడా ఉంది కానీ అలోపతి మందుల వల్ల అది నయం కాలేదు. 17 నెలల వైద్యం అనంతరం కూడా డాక్టరు రోజు విడిచి రోజు ఈ గాయానికి కట్టు కట్టడానికి ఒక నర్సు ను నియమించడం జరిగింది. ఈ పేషంటు   2015 అక్టోబర్ 8 న తన వద్దకు వచ్చే నాటికి రోజూ గాయం నుండి చీము కారుతూ ఉండడం ప్రాక్టీ షనర్ గమనించారు. ఇతనికి  క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది. 

CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies + CC21.11 Wounds and Abrasions...TDS నీటితో .

 గాయాన్ని వారం రోజులపాటు ప్రతీరోజూ కొల్లాయిడల్ సిల్వర్ నీటితో శుభ్రం చేయడం జరిగింది. అనంతరం: CC21.11 Wounds and Abrasions నీటితో కలిపి ఇవ్వబడింది.

అక్టోబర్ 24నుండి చీము కారడం ఆగిపోయింది.నవంబర్ 1న విజిటింగ్ నర్సు 50% వరకూ మెరుగయ్యిందని నిర్ధరణ చేసింది, (ఫోటో చూడండి). 50% వరకూ మెరుగయ్యిందని నిర్ధరణ చేసింది. , (ఫోటో చూడండి).

నవంబర్ 12వ తేదీన ప్రాక్టీ షనర్  పేషంటు కు మధుమేహానికి రెమిడి ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికి పేషంటు నోవోనార్మ్ అలోపతిక్ ట్యాబ్లెట్ లను వాడుతున్నారు . CC6.3 Diabetes పైన పేర్కొన్న రెమిడి లకు కలిపి రెండు నెలల తర్వాత  CC10.1 Emergencies ను విరమించడం జరిగింది. గత 6 నెలలు గా ఇతనికి రక్తంలో చెక్కర శాతం క్రమేణా తగ్గుతూ వస్తోంది.  అందువల్ల డాక్టర్ పేషంటు వేసుకునే నోవోనార్మ్ డోసేజ్  2016 మే నాటికి పూర్తిగా ఆపివేశారు. బహుశా వీరి బ్లడ్ షుగర్ ఇప్పటికీ నార్మల్ గానే ఉండవచ్చు కానీ పేషంటు ఇంకా రెమిడి TDSగా  తీసుకుంటూనే ఉన్నారు.   

కాలి  మీద గాయము (వెరికోజ్ అల్సర్  2017 ఫిబ్రవరి నాటికి పూర్తిగా తగ్గిపోయింది (ఫోటో చూడండి),

ఐతే 2017 మే వరకూ కాలి రంగు ఎర్రగానే ఉన్నప్పటికీ గాయాలు మాత్రం పూర్తిగా మానిపోయి మచ్చలు ఏర్పడ్డాయి.(ఫోటో చూడండి ) . 

కాలి మీద రాయడానికి నువ్వుల నూనె తో  CC3.7 Circulation + CC21.3 Skin allergies కలిపి ఇవ్వడం జరిగింది.   2016 ఆగస్టు లో తీసిన ఫోటో కాలు పూర్తిగా నయమయ్యినట్లు తెలుపుతోంది. 

 

2016 ఏప్రిల్ నుండి VP కొనసాగుతున్న వీరు SVP శిక్షణ తీసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.కారణం ఏమిటంటే పోటెం టైజర్ మిషన్ పొందడం ద్వారా రకరకాల వ్యాధులకు రెమిడి ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. గతంలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేసిన వీరు ఫ్రెంచ్ భాషా అనువాదకునిగా సేవచేసుకునే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నారు.  వార్తాలేఖలను అనువదించడమే కాక ఆ దేశపు కోఆర్డినేటర్ కు ఇతర అనువాద కార్యక్రమాలలోనూ వర్క్ షాప్ నిర్వహించే విషయం లోనూ  ఎంతో సహకారం అందిస్తున్నారు. వీరికి ఇవ్వబడిన (పెంద్యులం) లోలకం   స్వామికి సంపూర్ణ శరణాగతి చేసిన సందర్భంలో పేషంట్లకు వ్యాధి నిర్ధారణ చేయడానికి ,మరియు సరియయిన రెమిడి నిర్ధారణ చేయడానికి ఎంతో ప్రయోజన కారిగా ఉంటో0దని వీరి అభిప్రాయము.  

మనందరికోసం వీరు తమ మస్తిష్కపు జ్ఞాన భాండాగారము నుండి క్రింది పలుకులు అందిస్తున్నారు. ‘’ఈ అనంత విశ్వంలో మనం చిన్న రేణువు వంటి వారము .అందరూ ఒకరికొకరం అనుసంధానింప బడిన వారమే. ఈచిన్న రేణువు వ్యాధిగ్రస్థ మైతే దాని ప్రభావము విశ్వమంతటి పైనా పడుతుంది.కనుక ఎవరికీ వారే తమ స్థితిని సమతౌల్యం లో ఉంచుకొనడానికి ప్రయత్నించాలి అప్పుడు విశ్వమంతటా ఈ అన్యోన్య శాంతి సౌరభం పరిడవిల్లుతుంది.సమస్తలోకా సుఖినో భవంతు”.

వైబ్రో అభ్యాసకుల వివరాలు 03528...France

ప్రాక్టీషనర్  03528ఫ్రాన్సు   నేత్ర నిపుణులు గానూ,శ్రవణ సంబంధిత నిపుణులు,వ్యాపార వేత్త గానూ పనిచేసిన వీరు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరు మొదటి సారి 1985 లో ఆశ్రమాన్ని సందర్శించి ఆదివ్య ప్రేమలో ఓలలాడుతూ 4 నెలలు అక్కడే ఉండిపోయారు. ఇప్పటికీ కూడా అవి తన జీవితంలో మరువలేని ఆనందకరమైన రోజులుగా గుర్తు చేసుకుంటు ఉంటారు.  మొదటి సారి వైబ్రియోనిక్స్ తో అనుబంధం 2012 లో వీరికి  ఏర్పడిన  దీర్ఘకాలిక అలసట(పని వత్తిడి వలన) కు మందు తీసుకోవాలని వెళ్ళినపుడు కలిగింది.  నడవగలిగే స్థితి లేక ఒక స్నేహితురాలిద్వారా ఊతకర్రల సహాయంతో  వైబ్రో రెమిడి కోసం వెళ్ళిన ఈమె  వాటితో అవసరం లేకుండానే తిరిగి ఫ్రాన్స్ వెళ్ళగలిగే స్థితికి  రావడం నిజంగా ఒక విశేషమే !

వాస్తవానికి  వీరు రిటైర్ అవడానికి దగ్గరగా ఉన్నప్పుడు  తన దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యల కోసం ఎన్నో రకాల అలోపతిక్ మందులు తీసుకుంటున్నారు. అదే సమయంలో వీరు తన స్నేహితురాలు  ప్రాక్టీషనర్  01620 వద్దకు వెళ్ళి వైబ్రియో రెమిడి లు అలోపతి కన్నా అద్భుతంగా పనిచేస్తాయని వీటిని తీసుకున్న విషయం గుర్తు చేసుకుంటు ఆ విషయాన్నే మనతో పంచుకుంటున్నారు. అప్పట్లో వీరికి  బాగా ఇబ్బంది పెడుతున్న రెండు సమస్యలు  ఒకటి తన కుడి తొడ ఎముకకు ఏర్పడిన చీలిక,రెండు తన గుండెకు చేసిన శస్త్ర చికిత్సఅనంతర  సమస్యలు. కొన్ని నెలల అనంతరం వీరికి  మరొక ఎముకలో (ఎడమ తొడ )ఫ్రాక్చర్  ఏర్పడింది. ఇవన్నింటికీ వైబ్రో రెమిడి లే వీరికి సంజీవని గా మారాయి.  ఈ విధంగా వైబ్రో తో తనకు ఉన్న చికిత్సా అనుభవంతో ప్రాక్టీషనర్ కావాలని నిర్ణయం బలపడింది. విచిత్ర మేమిటంటే తన తొడ ఎముకకు చికిత్స తీసుకుంటూనే  2015  జూన్ లో AVP గానూ  2016.లో VP గానూ సర్టిఫికేట్ తీసుకున్నారు.

 ఈ ప్రాక్టీ షనర్  108CC బాక్సు తో చికిత్స చేసే సందర్భంలో అనేక విజయాలు చవి చూసారు. ముఖ్యంగా జంతువులూ,మొక్కలు విషయంలోనూ అలాగే మనుషులలో ఆందోళన, మాంద్యము.అనేక స్వల్పకాలిక ఆరోగ్య సమస్యలు ( త్వరగా చికిత్స మొదలు పెట్టినప్పుడు ఫలితం కూడా అంత త్వరగానూ వస్తోంది), ఖిమో థెరపీ వలన ఏర్పడిన దుష్పలితాలు.

దీర్ఘకాలిక సమస్యల విషయంలో మొదట వీరు పేషంటు వారానికి ఒకసారి CC17.2 Cleansing ( 100 మీ.లీ. నీటిలో 3 గోళీలు)తో ఇల్లంతా శుభ్ర పరుచుకోవాలని, వార్తాలేఖ లలో సూచించిన రీతిగా ఆహార అలవాట్లు మార్చుకోవాలని   సూచిస్తారు. వీరి ఉద్దేశ్యంలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని ముఖ్యంగా శరీరంలో నీటి నిలుపుదలను మెరుగు పరుస్తాయని,గుండె,లివరు,వంటి ముఖ్యమైన అవయవాల శక్తిని పెంచుతాయని, శరీరంలో ఆమ్ల స్థితిని సరియయిన స్థాయిలో ఉంచుతాయని, మత్తు పదార్ధాల దుష్పలితాలు తొలగిస్తాయని, హార్మోన్  సమతౌల్యాన్ని కాపాడతాయని,రోగనిరోధకశక్తిని పెంచుతాయని,అలాగే ఆత్మగౌరవాన్ని ,విశ్వాసాన్ని కూడా పెంచుతాయని వీరి భావన.   

అలాగే  ‘’వెల్ బీఇంగ్’’ అనే పేరుతో పిలిచే క్రింది రెమిడిని కూడా వీరు పేషంట్ లకు సూచిస్తూ ఉంటారు. CC3.1 Heart tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC8.1 Female tonic (or CC14.1 Male tonic) + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.2 Psychiatric disorders…TDS  నీటితో దీనికి అదనంగా ఆందోళన,వ్యాకులత,వంటివాటికి 2016 మే-జూన్ లో ప్రాక్టీషనర్  01180బోస్నియా   చే సూచించబడిన రెమిడి కూడా సూచిస్తూ ఉంటారు. 

కేన్సర్ కు అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులందరికీ  దీనిని తగ్గించే విధానాన్నిక్రింది విధంగా సూచిస్తున్నారు .ఈ విధానము పేషంట్ లను అలోపతి మందుల దుష్ప్రభావము నుండి కూడా కాపాడుతుంది. : CC2.1 Cancers-all + CC2.3 Tumours & Growths + remedy for specific part of the body…OD నాలుగు వారాలు తరువాత : CC2.1 Cancers-allనెలకు ఒకటి చొప్పున 6 నెలలు ,ఆ తర్వాత మూడునెలలకు ఒకటి చొప్పున ఒక సంవత్సరము చివరిగా సంవత్సరానికి ఒకటి చొప్పున 7 సంవత్సరాలు ఇలా వేసుకోవలసినదిగా సూచిస్తున్నారు. ఈ రెమిడి అమితమైన మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది ,ఐతే పేషంట్లు  సరియయిన ఆహారము తీసుకుంటూ చురుకుగా ఆనందంగా ఉంటూ తమ మాటలు,నడతలు ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలని వీరు సూచిస్తున్నారు..

అలాగే మరొక కేసు విషయంలో 62-సంవత్సరాల వయస్సుగల వృద్ధుడు మెడ దగ్గర లింఫ్ గ్రంధులo కేన్సర్ తో ఖెమో థెరపీ ప్రతీ 3 వారాలకొకసారి చేయించు కుంటున్నారు. అలా రెండు సార్లు చేయించిన తర్వాత దీని యొక్క దుష్ఫలితాల వల్ల వాంతులు,ఛాతిలో నొప్పి, చేతి మీద చర్మము తొలగించిన భాగంలో దురద ( చేయి కాలడం వలన 25 సంవత్సరాల వయసులో చర్మము గ్రాఫ్ట్ చేయబడింది) కలగసాగాయి.ఇదే సందర్భంలో వీరు రక్తం పలచన అవడానికి అలోపతి మందులు కూడా వాడుతున్నారు. లింఫోమా క్యాన్సర్  నిమిత్తం వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది.: CC2.1 Cancers-all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC4.2 Liver & Gallbladder tonic ఖిమో దుష్ఫలితాల నిమిత్తం : CC3.4 Heart emergencies + CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC4.1 indigestion tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections, రెండూ కూడా నీటితో …6TD ఖిమో చేయించుకున్న రోజు మరియు తరువాత రోజున, ఆ మరునాటి నుండి TDS.   ఈ విధంగా రెండు వారాలు వాడిన  తర్వాత ఛాతిలో నొప్పి పూర్తిగా పోయింది. మరుసటి ఖిమో సెషన్ లో వీరికి వాంతులు ,దురద ఇవేమీ కలుగలేదు. ఈ విధంగా పేషంటు మరో 4 సార్లు ఖిమో చేయించుకున్నప్పటికిని పైన పేర్కొన్న దుష్ఫలితాలు ఏవీకలుగలేదు. .

మరొక కేసు విషయంలో 68 సంవత్సరాల మహిళ క్షయ వ్యాధి నిమిత్తం వాడిన అలోపతి మందుల దుష్ప్రభావానికి గురయ్యి తన 4 వ సంవత్సరం నుండి బాధ పడుతూ ఉన్నారు.ఈమె లివరు చాలా వరకూ పాడయిపోయి ఎల్లప్పుడూ హెపటైటిస్ , జ్వరము, కీళ్ళనొప్పులు  వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. వీరికి 35 సంవత్సరాల వయసులో  పిత్తాశయం (గాల్బ్లేడర్ ) తొలగించబడింది. ఇలాంటి పరిస్థితి లో ఈమెకు 2015 నవంబర్ 11 క్రింది రెమిడి ఇవ్వబడింది. CC4 .2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.5 Spine. కేవలం  నాలుగు నెలల లోనే ఈమె లివరు 50%మెరుగు పడింది. ఆమె జీర్ణ వ్యవస్థ కూడా సహకరించడంతో మొదటి సారి తన జీవితంలో క్రిస్టమస్ విందును ఆస్వాదించ గలిగారు. ప్రస్తుతం వీరికి  CC4.1 Digestion tonic ను కూడా కలపడం జరిగింది. మరో రెండు నెలలలోనే ఈమెకు  లివరు వ్యాధి పూర్తిగా తగ్గిపోయి తనకు ఏది ఇష్ట మైతే అది తినగలిగే స్థితి ఏర్పడింది.

ఈ ప్రాక్టీషనర్  తన ఇంటి పెరడులో వర్షపు నీటికోసం అనేక గిన్నెలను ఉంచి వానిలో CC1.1 Animal tonic  వేస్తారు ప్రక్క ఇళ్ళనుండి అనేక పిల్లులు ఇక్కడికి వచ్చి ఆ నీరు త్రాగడం వలన అది టానిక్ లాగా పనిచేసి ఆరోగ్యంగా ఉంటున్నాయని చెపుతున్నారు.  

తనను వైబ్రియోనిక్స్ ప్రాక్టీ షనర్ గా సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు స్వామికి ఎంతో కృతజ్ఞత తెలియ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది తన జీవితానికి సాఫల్యత చేకూర్చినదని వీరి భావన. ఈ సేవ ఆమెను  పేషంట్లు చెప్పే విషయాలు ఓపికగా వినేలాగాను,వారిపట్ల సానుభూతి కురిపించేలాగాను మార్చివేసింది. చివరిగా వీరు తమ  సందేశాన్ని క్రింది విధంగా అందిస్తున్నారు., “మనం మన చుట్టూ ఉన్న వారిని ఏవిధమైన ప్రతిఫలము ఆశించకుండానే ప్రేమించగలగాలి, వారికి  మంచినే  అందించ గలగాలి. మనం ఎవరికీ ఏది చేస్తున్నా మనకు మనం చేసుకుంటున్నట్లే.  మనం ఇతరులకు మంచి చేస్తే భగవంతుడి హస్తాలలో ఒక దివ్య ఉపకరణము గా మారతాము అని గ్రహించాలి ”

వైబ్రో అభ్యాసకుల వివరాలు

ప్రాక్టీషనర్ 03556ఫ్రాన్సు , వీరు బెల్జియం దేశ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫ్రాన్సు ఉత్తర ప్రాంతమునకు చెందినవారు. 2017 జూన్ నెలలోనే వీరు AVP గా శిక్షణ తీసుకున్నారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలసిన తర్వాత వైబ్రియోనిక్స్ కుటుంబములో చేరవలసిన అవసరం వీరు గుర్తించారు. ఈ వ్యక్తే  ప్రాక్టీషనర్ లో రోగులకు,బాధార్తులకు హృదయపూర్వకంగా సేవ చేయాలనే కోరికకు బీజం వేసారు.అంతేకాకుండా వీరు ప్రాక్టీ షనర్ ను,శిక్షణా నిపుణుడు , ఫ్రెంచ్ కోఆర్డినేటర్ 01620, కు పరిచయం చేసారు. వీరి శిక్షణ లో ప్రాక్టీ షనర్ పేషంట్లను ప్రేమ,దయ లతో చికిత్స చేయాలని నేర్చుకున్నారు. ప్రాక్టీ షనర్ మాటల్లో చెప్పాలంటే ‘’ నాకు,నా కుటుంబానికి,నా చుట్టుప్రక్కల వారికీ వైద్యం చేయడానికి మెరుగైన,సరళమైన వైద్య విధానము నేర్చుకోవాలనే కోరిక వైబ్రియోనిక్స్ ద్వారా తీరింది.”

ప్రాక్టీషనర్ ఉంటున్న ప్రాంతంలో సూర్యరశ్మి చాలా తక్కువగానూ ,ఎప్పుడూ తేమగానూ,ఉండడంతో ఎక్కువ శాతము ప్రజలకు ఆత్మవిశ్వాసం తక్కువగాను,మానసిక మాంద్యం తోనూ ఉంటారు. అంతేకాక ఎక్కవ మంది విపరీతంగా అలోపతి మందులకు అలవాటు పడడంతో హానికరమైన దుష్పలితాలకు గురియయిన వారు కూడా ఎక్కువే. కొన్ని మందులు పనిచేయని పరిస్థితి కూడా ఏర్పడింది. కనుక  తను సేవచేసుకునేందుకు చక్కని అవకాశము గా ప్రాక్టీషనర్ భావించారు.  అవసరమైన వారికి  తగు సహాయము అందించి వారిబాధలనుండి నివృత్తి చేయడమే నిజమైన సేవ అనీ అదే నిజమైన గౌరవ మనీ వీరు భావించారు.  వీరి మాటల్లోనే చెప్పాలంటే ‘’ నేను వారిలో ఆశ అనే బీజాలను నాటి ప్రయోజనాత్మకమైన మార్గం వైపు మరలించాననే తృప్తిని పొందాను.”

కేవలం కొన్ని నెలలపాటు చేసిన సేవలో వీరు అనేక కేసులు ముఖ్యంగా జలుబు,విపరీతమైన అలసట,అలెర్జీ, బహువిధాలయిన స్స్కెలోరోసిస్ వ్యాధులు,కణుతులు,ముక్కులో గడ్డలు,పంటినొప్పులు,మెన్సెస్ నొప్పులు,వంటి కేసులకు అద్భుతంగా చికిత్స నందించారు.పెంద్యులం ఉపయోగించడంలో కూడా వీరు శిక్షణ పొంది యున్నారు కనుక ఏదయినా వ్యాధి కి  సరియయిన కొమ్బో నిర్ధారణ నిమిత్తం వీరు పెండ్యులం ఉపయోగిస్తారు .అలాగే జంతువుల విషయంలో కొమ్బో త్వరగానూ అద్భుతంగానూ పనిచేస్తున్నట్లు వీరికి అనుభవమయ్యింది.  వీరు శిక్షణ తీసుకున్న ప్రారంభంలో ఒక అలంకార ప్రాయంగా ఉండే కోడి పెట్ట కోడి పుంజుల చేత అనేక వారాలు చిన్నా భిన్నం చేయబడి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నదానిలాగా ఆహారం మానేసి కనులు మూసుకొని ఉండసాగింది.ప్రాక్టీషనర్ దీనికి  CC1.1 Animal tonic + CC15.1 Mental & Emotional tonic…BD నీటిలో కలిపి ఇచ్చారు.రెండు రోజుల లోనే ఇది ఆహారం తినడం ప్రారంభించింది.కొన్ని వారాలలోనే ఇతర కోడి పెట్టలతో కలసి తిరగ సాగింది. మరొక కేసు విషయంలో ఒక కోళ్ళ ఫారంలో 7 సంవత్సరాల వయసుగల కొన్ని కోళ్ళు గుడ్లు పెట్టడం మానేసాయి. ప్రాక్టీ షనర్ వాటికి  CC1.1 Animal tonic నీటితో కలిపి ఇవ్వడంతో ఆ కోళ్ళ ఫారం యజమాని రెమిడి ఇచ్చిన కోళ్ళు చక్కగా గుడ్లు పెడుతున్నాయని ప్రాక్టీషనర్ కు తెలిపారు.

7 సంవత్సరాల యార్క్ షైర్ జాతికి చెందిన ఆడకుక్కకు ఒకటవ సంవత్సరం నుండి ఆస్తమా మరియు గుండెలో సమస్యలు ఉన్నాయి.అంతేకాక కుక్క యజమాని దానిని  ఇంట్లో వదిలి వేయడంతో ఒంటరితనం కూడా అనుభవిస్తోంది. ఎప్పుడయినా మరీ ఇబ్బంది ఏర్పడినపుడు యజమాని దానికి  ఇన్హేలర్ సహాయంతో అలోపతి వైద్యం చేయించ సాగారు. 2017 మే నెలలో క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.

 CC1.1 Animal tonic + CC3.4 Heart emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections…BD నీటితో.

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు దీనికి ఆస్తమా  పరిస్థితి దయనీయంగా ఉంటుంది. కానీ దీనికి విభిన్నంగా రెండు రోజుల తర్వాత జ్వరం వచ్చినప్పటికీ ఆస్తమా పూర్తిగా మాయమయ్యింది. నెల తర్వాత సేకరించిన సమాచారము ప్రకారము దీనికి ఆస్తమా తిరిగి రాలేదని తెలిసింది.

ప్రాక్టీషనర్ తన పెరడులో ఉన్న కూరగాయల మొక్కల పైన కూడా వైబ్రో మందుల ద్వారా అద్భుత ఫలితాలు పొందారు. గత సంవత్సరం వీరికి ఒకే ఒక టమాటా దొరికింది ఎందుకంటే టమాటా మొక్కలన్నీ తెగులు వచ్చి  కాయలేదు..కనుక వీరు ఈ సంవత్సరం కొన్ని వారాల పాటు CC1.2 Plant tonic…OD ఇవ్వడంతో వీరికి 15 కేజీల చక్కటి రసం తో నిండిన టమాటా పంట లభించింది ! 

వీరి మాటలలోనే చెప్పాలంటే  “నేను హృదయంతో సేవ చేయగలగడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇలా చేస్తున్నప్పుడు వస్తున్న ఫలితాలు నా నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి.స్వామి దివ్య హస్తాలలో పనిముట్టుగా మారడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.”

వైబ్రో అభ్యాసకుల వివరాలు 03546...France

 ప్రాక్టీషనర్ 03546…France, ఉద్యోగ విరమణ పొందిన 67-సంవత్సరాల ఈ ప్రాక్టీషనర్ కు 1982.నుండి బాబావారి గురించి  తెలుసు.  2016,జూన్ నెల లోనే వీరు AVP గా శిక్షణ తీసుకున్నప్పటికీ వీరు వైబ్రియోనిక్స్ కు కొత్త కాదు. ప్రశాంతి ఆశ్రమంలో వీరి సహపాటి,క్రిస్టమస్ గీతాల గాయని ఐన , ప్రాక్టీషనర్02667యుకె , వీరికి జలుబుకు  వైబ్రో రెమిడి ఇచ్చినప్పటి నుండీ వైబ్రియోనిక్స్ గురించి తెలుసు. వీరు ప్రాక్టీ షనర్ కాక ముందు నుండే ప్రశాంతి నిలయం వెళ్లినప్పుడల్లా వీరి స్నేహితులకు  జలుబు నిమిత్తం వైబ్రో రెమిడి బాటిళ్ళు తీసుకువచ్చి ఇచ్చేవారు.  

ఇన్ని సంవత్సరాలుగా వైబ్రో చికిత్స గురించి తెలుసుకోకపోయినందుకు  ప్రాక్టీ షనర్ పశ్చాత్తాప పడుతున్నారు. ఐతే వీరు ఇప్పటివరకూ రోగ నిరోధానికి విభూతి పైనే ఆధారపడ్డప్పటికీ  2015 లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీరికి విపరీతమైన నొప్పి రావడంతో డాక్టర్ కి చూపించగా వీరి అండాశయం వద్ద పెద్ద కణితి ఉందని చెప్పారు.  దీనిని తొలగించడం కోసం  శస్త్ర చికిత్సకు ప్రయత్నించగా  డాక్టర్లకు ఈ కణితి కనబడలేదు. మరింత లోతుగా అధ్యయనం చేయగా ఈమె చిన్నప్రేగు బయట కణితి ఉందని ఇంకా గర్భాశయంలో చిన్న చిన్న గడ్డలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం మరొక సర్జెరీ చేయించుకోవలసిందిగా డాక్టర్లు సూచించారు. ఇదే సందర్భంలో దైవసంకల్ప వశాత్తూ వీరి మిత్రుడు పుట్టపర్తిలో మొదటి వైబ్రో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందుకోవడం జరిగింది. సర్జెరీ చేయించుకొనే ఆలోచనలో ఉన్న ఈమె ఆ ఆలోచన విరమించుకొని ఇది బాబా సంకల్పముగా భావించి  వైబ్రో చికిత్స కోసం పుట్టపర్తి వెళ్ళాలని అనుకున్నారు. పుట్టపర్తి లో ఉన్నప్పుడు వీరు చక్కగా కోలుకోవడం వలన మరో అనివార్య మైన శస్త్ర చికిత్స చేయించుకోకుండానే అద్భుతంగా కోలుకున్నారు. ఈ అనుభవం వీరిని హృదయపుర్వాకంగా డాక్టర్ అగ్గర్వాల్ గారి ఆధ్వర్యంలో వైబ్రియోనిక్స్ లో శిక్షణ తీసుకోవడానికి పురిగొల్పింది.ఐతే వీరికి ఆంగ్ల భాషా ప్రావీణ్యత లేకపోవడం వలన మొదట సాధ్యం కాలేదు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆశ్రమంలో ఉన్న ఒక ఫ్రెంచ్ కోఆర్డినేటర్ త్వరలోనే ప్రెంచ్ భాషలో శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నట్లు చెప్పడంతో ఎంతో ఆనందించారు.  

అలా తన కల సాకారం ఔతున్న ఆనందంలో ఫ్రాన్సు చేరుకున్నారు. ఆ సమయంలో గర్బవతి గా ఉన్న వీరికోడలిని సాధారణ కాన్పు నిమిత్తం వైబ్రో రెమిడి లు వేసుకోవలసిందిగా సూచించారు.ఎందుకంటే ఈమెకు మొదటి కాన్పు సిజేరియన్ అయ్యింది. ఈ ప్రాక్టీషనర్ ఊర్లో ఉంటున్న  30 ఏళ్ల అనుభవం గల మంత్రసాని వీరి కోడలికి సాధారణ కాన్పు కావడం చూసి ఇది భగవంతుడు చేసిన ఒక అద్భుతమైన లీల అని ఆశ్చర్య పోయింది. ఈ ఆనుభవం తో వీరి కోడలు పాలు రావడానికి కూడా వైబ్రో రెమిడిలు తీసుకోని 18 నెలలు తన రెండవ సంతానానికి పాలు ఇవ్వడం జరిగింది. మొదటి కాన్పు అనంతరం ఈమె కేవలం 15 రోజుల వరకూ మాత్రమే ఇచ్చి విపరీతమయిన నొప్పి రావడం తో తన బిడ్డకు పాలు ఇవడం మానేసారు.   

ఈ అద్బుత మైన లీలలు వీరిని వీరి కుటుంబం యావత్తూ (పిల్లలు,వారిపిల్లలు) వైబ్రియోనిక్స్ రాయబారులుగా మార్చివేసినవి. ఇప్పుడు వీరి యొక్క స్నేహితులు వారి పిల్లలు యాంటిబయోటిక్స్ కన్నా వైబ్రో రెమిడిలనే కావాలని కోరుతున్నారు.ఇప్పుడు వీరందరికీ  దంత చికిత్స తో పనిలేదు అత్యంత బాధాకరమైన బోవేల్ చికిత్సను నిస్సహాయంగా అనుభవించే అవసరమే లేదు.వీరంతా ఇప్పుడు ఆనందంతో ,నమ్మకంతో వైబ్రియానిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.అందుకే ప్రాక్టీషనర్ దృష్టిలో వైబ్రియానిక్స్ భగవంతుడుకి ,పేషంట్ లకు మధ్య అనుసంధానమేర్పరిచే ఒక దివ్య ఉపకరణం  

ప్రాక్టీ షనర్ పిల్లలలో చిగుళ్ళ మంటలు,,పేనుకొరుకుడు, జన్యు పరమైన ఎపిడెర్మో లైసిస్ బుల్లోసావ్యాధి,నత్తిగా మాట్లాడడం,జలుబు, కీటకాలు కుట్టినందువల్ల వచ్చే వ్యాధులు,శిశు వ్యాధులు,ఆందోళన,మానసిక రుగ్మతలు,క్యాన్సరు, అధిక పాళ్ళలో ఉన్న కొవ్వు గ్రంధులుగా ఏర్పడడం, అంటువ్యాధులు,వికారము,జీర్ణకోశ సమస్యలు,,జలుబు, అధిక బరువు,సోరియాసిస్,కణుతులు,తల వెంట్రుకల సమస్యలు,మధుమేహము,జుట్టు రాలిపోవడం,మూత్రపిండాల సమస్యలు, ప్రోస్త్రేట్  సమస్యలు, ఇటువంటి సమస్య లెన్నింటినో నయం చేసారు. ఐతే ఈ రెమిడి లను ఉచితంగా అందించడం వలన వీటి విలువ చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు అని ప్రాక్టీ షనర్ వాపోతున్నారు. ఫ్రాన్సు సోషలిస్ట్ దేశము అవడాన అక్కడి పౌరులు ఆరోగ్యము నిమిత్తము తమ సొంత సోమ్మేమీ ఖర్చు చేయరు. అందువలన ప్రభుత్వం ద్వారా అందే అలోపతి మందులు ఎక్కువగా వాడడం జరుగుతోంది. ఎప్పుడయితే ఈ మందుల దుష్ప్రభావము వలన సమస్యలు ఎదుర్కొంటారో అప్పుడే ఇతర ప్రత్యామ్నాయ వైద్యవిధానం వైపు దృష్టి సారిస్తారు.

వీరు శాకాహారి కనుక తన వద్దకు వచ్చే పేషంట్లకు కూడా దీని ఫలితాలు తెలుపుతూ  శాకాహారమే తినమని ప్రోత్సహిస్తారు. వైబ్రియానిక్స్ భవిష్యత్తులో అందరికీ ఆమోదయోగ్యమైన వరప్రసాదిని గా కొనియాడబడుతుందని వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి ఉదాత్తమైన ,ఉత్తమ మైన మార్గంలో తాను ఉన్నందుకు, ఉంచినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నారు.ఈ విధానము వలన  తన ఆలోచనా సరళిలో మార్పు వచ్చి దివ్యమైన .భవ్యమైన మార్గంలో ప్రయాణించ గలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పంచుకున్న కేసులు  :

ప్రశ్నజవాబులు

ప్రశ్న 1: నా పేషంటు వైబ్రియోనిక్స్ తనపైన ఉపయోగించుకొని అద్భుత ఫలితాలు పొందారు. గార్డెనింగ్ లో ఆమెకు అభిరుచి ఎక్కువ కనుక వైబ్రో మందులను తన పంటలకు ఉపయోగించుకోవడానికి  ప్లాంట్ టానిక్ కాకుండా తెగుళ్ల నివారణకు ఇంకా ఏవైనా రెమిడి లు ఉన్నాయా ?

జవాబు  1:ఔను  SR264 Silicea అనే దానిని తెగుళ్ల నివారణకు మరియు మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది.  వివారాల కోసం వార్తాలేఖ  2013-07 సంపుటము 4 సంచిక 4 ను  చూడండి..

________________________________________

ప్రశ్న 2: బ్రాడ్కాస్టింగ్ ద్వారా రెమిడి లు ఇచ్చినప్పుడు రిడక్షన్ విధానము వివరించండి.?

జవాబు 2: ప్రాక్టీషనర్  మాన్యువల్ లో ఇచ్చిన పధ్ధతి ప్రకారం నడుచుకోండి

________________________________________

ప్రశ్న 3: పిల్లలలో పుల్లౌట్ వస్తుందా ?

జవాబు  3: ఔను  ఎందుకంటే వారికి ఇచ్చిన వాక్సినేషన్ వలన హానికరమైన టాక్సిన్ లు వారిలో చేరి ఉంటాయి. 

________________________________________

ప్రశ్న 4: నా పేషంటు ఉపవాసంలో ఉన్నప్పుడు కూడా రెమిడి వేసుకోవచ్చా?

జవాబు  4: ఔను  తను యధావిధిగా డోసేజ్ ప్రకారం రెమిడి వేసుకోవచ్చు ఇలా చేయడం వలన  శరీరంలో ఉన్న హానికర పదార్ధాలు  త్వరగా బయటకు పంపబడతాయి. 

________________________________________

ప్రశ్న 5:   ప్రతీ పేషంటు కు మొదటి డోస్  నేనే స్వయంగా వేస్తాను. అదేవిధంగా మొదటిసారి వారి శరీరానికి ఏదయినా క్రీం రాసేటప్పుడు పేషంటు శరీరాన్ని తాకవచ్చా ?

జవాబు  5: లేదు. ప్రాక్టీ షనర్ ఏ పేషంటు శరీరాన్ని తాకరాదు పేషంటు  తనంతటతానే క్రీం రాసుకోవాలి. ఒకవేళ పేషంటు  చేతులు అందుకు సహకరించకపోతే పేషంటు తాలూకు దగ్గర బంధువులు,వారిని ప్రేమించేవారు ఆపని చేయవచ్చు. జార్ నుండి క్రీం తీసేటప్పుడు కూడా ఏదయినా ప్లాస్టిక్ గరిటె లాంటిది ఉపయోగిస్తే క్రీం కలుషితం కాకుండానూ వైబ్రేషణ్ పోకుండానూ ఉంటుంది. ఒకవేళ పేషంటుకు ఏదయినా అంటువ్యాధి ఉన్నట్లయితే   ఆ పేషంటు సంరక్షకుడు నేరుగా చేతులను ఉపయోగించకుండా చేతుల కు గ్లౌస్ వంటివి దరించ వచ్చు. 

________________________________________

ప్రశ్న 6: ఒక వార్తాలేఖ లో ప్రాక్టీషనర్ అరోమతా లేదా జుట్టు రాలిపోవడం ( అలోపిసియ) వ్యాధికి  CC11.2 రెమిడి ఇచ్చినా ఉపయోగం కలగక పోవడంతో పేషంటు వెంట్రుక తో నోసోడ్ తయారు చేసి ఇచ్చానని పేర్కొన్నారు. ఇలా  నోసోడ్ ఎలా తయారు చెయ్యాలో దయచేసి చెప్పండి. ?

జవాబు 6: నోసోడ్ తాయారు చేసుకొనడానికి సీనియర్ ప్రాక్టీ షనర్ ల వలెనే మీ దగ్గర కూడా  (SRHVP) ఉండాలి. కనుక మీరు సీనియర్ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించండి. SVP స్థాయికి  ఎలా చేరాలో తెలుసుకోవడానికి వివరాలకోసం మీ స్టేట్ లేదా దేశపు కోఆర్డినేటర్ ను సంప్రదించండి. ఒకవేళ మీకు రెమిడి కావాలనుకుంటే మీ ప్రాంతంలో ఉన్న సీనియర్ ప్రాక్టీషనర్ ను సంప్రదించండి. 

________________________________________

ప్రశ్న 7:   SRHVP లో రెమిడి తయారు చేసే టప్పుడు గానీ గోళీల బాటిల్ ను 8 ఆకారంలో ఊపేటప్పుడు గానీ  ప్రత్యేకంగా నిర్దేశించిన మంత్రం గాయత్రీ గానీ లేదా మరేదయినా మంత్రం ఉందా ?

జవాబు 7: లేదు మీరు ఏ ప్రార్ధన ఐనా లేదా మీకు నచ్చిన ఏ మంత్ర మైనా జపించ వచ్చు. ఐతే దృష్టి ని మాత్రం హృదయ వాసి ఐన భగవంతుడి పైన లగ్నం చేయండి.

________________________________________

ప్రశ్న 8: ఎక్కువ సార్లు కాఫీ త్రాగే అలవాటు ఉన్నవారు కెఫీన్ లేనట్టి కాఫీ ని త్రాగడం సరయినదేనా  .

జవాబు 8: కాఫీ త్రాగడంలో అసలు సమస్య దానిలో ఉన్న కెఫీన్ గురించి కాదు దానిలో ఉన్న రేడియేషన్ . వాస్తవానికి  మనం నిత్యమూ తీసుకునే ఆహార పదార్ధాలయిన అరటిపండు,క్యారెట్లు ఆలుగడ్డలు,లిమా బీన్ ,బ్రెజిల్ నట్ (దీనిలో మరింత ఎక్కువ) వీటిలో పొటాసియం ,రేడియం ఎక్కువగా ఉండడమేకాక రేడియో ధార్మికంగా కూడా ఉంటాయి. నిజం చెప్పాలంటే మానవ శరీరం కూడా తక్కువ మోతాదులో రేడియో ధార్మికంగానే ఉంటుంది. గతంలో హొమియోపతీ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని కాఫీ వద్దని చేప్పేవాళ్ళము. కానీ ప్రస్తుతం పావు శతాబ్దానికి పైగా వైబ్రో తో అనుబంధం ఏర్పడి ఎందరో ప్రాక్టీషనర్ల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక   రేడియేషన్ కి సంబంధించినంత వరకూ ఒక అరటి పండు ఎంతో ఒక కప్పు కాఫీ కూడా అంతే . మనం రెమిడి తీసుకునే సమయంలో 20 నిమిషాల వ్యవధి పాటించి నంతవరకూ  కాఫీ త్రాగడం వలన ఇబ్బందేమీ లేదు. 

.________________________________________

ప్రశ్న 9: కామన్ కొమ్బో బాక్సు నుండి ఒక్క చుక్క రెమిడి ని దాదాపు 60 గోళీలు ఉన్న బాటిల్ లో వేస్తాము. నా ఉద్దేశ్యం లో పైనున్న 10 గోళీలు ఈ రెమిడి చుక్కను పిల్చుకుంటాయి. మనం ఎంత 8 ఆకారంలో బాటిల్ ను తిప్పినప్పటికీ మిగతా 50 గోళీల పరిస్థితి ఏమిటి ?

జవాబు 9: ఆలోచన పరంగా చెప్పాలంటే  మీరు సరిగానే చెప్పారు.ఒక్క రెమిడి చుక్క అన్ని గోళీలను చేరదు. ఐతే ఈ రెమిడి పీల్చుకున్న గోళీలు మిగతా గోళీలను తాకినపుడు అవి కూడా వైబ్రేషణ్ గ్రహిస్తాయి. 

 

దివ్య వైద్యుని దివ్య వాణి

“పశు పక్షి మృగాదులకు  మానవుని వలె గుండెజబ్బులు,జీర్ణ సమస్యలకు గురికావు. కారణం ఏమిటంటే అవి ప్రకృతిలో సహజంగానే లభించే పదార్ధలము తీసుకొనుచుండగా మానవుడు రుచికి బానిసఅయ్యి వండిన,వేపిన పదార్ధాలు తీసుకుంటూ ఉంటాడు.ఈ నాటి మానవుడు రకరకాల కృత్రిమ పదార్ధాలు ,మత్తు పదార్ధాలు,మద్యము వంటి ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాలు తీసుకుంటూ ఉన్నాడు. అలాగే పశుపక్షిమృగాదులు సహజమైన జీవనవిధానము అవలంభిస్తూ ఉంటె మానవుడు కృత్రిమ జీవన విధాను ద్వారా ఆరోగ్యానికి పాడుచేసుకుంటున్నాడు. ఆహారము విషయంలో మితము హితము పాటించి నపుడే మానవునికి వ్యాధులు దూరమయి చక్కని ఆరోగ్యము చేకూరుతుంది. యావత్తు సృష్టి నుండి మానవుని వేరుచేసేది అతనికి దైవము ప్రసాదించిన విచక్షణ అనే అద్బుత గుణమే. కనుక ఆహార విహరాదుల విషయంలో ఈ విచక్షణ,వివేకము ఉపయోగించి  సంపూర్ణమైన ఆరోగ్యంతో జివించ గలగాలి..”                                                                                                                                            …సత్యసాయిబాబా , “ఆహారము. గుండె మరియు మనసు ” అవతార వాణి , 21 జనవరి 1994 
http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf

 

“మనిషి ఇతరుల చేత సేవింప బడే దానికన్నా ఇతరులకు సేవ చేసే టందుకు ఎప్పుడూ సంసిద్ధుడయి ఉండాలి. మనకన్నా ఉన్నత స్థితి లో ఉన్న వారిని సేవించడం చాలా ఉత్తమం. మనకు సహాయకులుగా ఉన్న వారి విసయంలో వారి సేవలను అజమాయిషీ చేయవచ్చు .కానీ మనతో సమానస్థాయిలో ఉన్న వారి విషయంలో ఇది కూడదు.అలాగే నిరుపేదలకు,నిస్సహాయులకు,ఏ విధమైన ఆసరా లేనివారికి సేవచేయడం అత్యుత్తమమైన సాధన..”                                                                                                                                                        

...సత్యసాయిబాబా , “సేవచేయడానికే జన్మ   ” దివ్య వాణి ,  19 సెప్టెంబర్ 1987 
http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf

ప్రకటనలు

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహింప బోనున్న సదస్సులు

  1. ఇండియా  పుట్టపర్తి : SVP వర్క్ షాప్   24-28 నవంబర్ 2017, సంప్రదించవలసిన వారు హేమ వెబ్సైట్ [email protected]
  2. ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్   17-24 ఫిబ్రవరి 2018, సంప్రదించవలసిన వారు లలిత ,వెబ్సైట్  [email protected] లేక ఫోన్ నంబరు 8500-676 092
  3. ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్   22-26 జూలై 2018, సంప్రదించవలసిన వారు లలిత ,వెబ్సైట్  [email protected] లేక ఫోన్ నంబరు 8500-676 092
  4. ఇండియా  పుట్టపర్తి: AVP వర్క్ షాప్   18-22 నవంబర్  2018, సంప్రదించవలసిన వారు లలిత ,వెబ్సైట్   [email protected] లేక ఫోన్ నంబరు  8500-676 092
  5. ఇండియా  పుట్టపర్తి: SVP వర్క్ షాప్   24-28 నవంబర్ 2018, సంప్రదించవలసిన వారు  హేమ వెబ్సైట్ [email protected]

 

అదనముగా

ఆరోగ్య చిట్కాలు

జీవితాంతం సాధారణ రక్తపోటు (BP)తో జీవించడానికి సులువైన మార్గాలు!

1. ప్రధానమైన బి.పి .యొక్క నిర్మాణము  1-5 : మన గుండె కొట్టుకున్న ప్రతీసారి అది ప్రాణవాయువు తో కూడిన రక్తాన్ని ధమనుల లోనికి సరఫరా చేస్తుంది. సహజంగా అప్పుడు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది దీనిని సిస్టోలిక్ ప్రెజర్ అంటారు.అలాగే రెండు హృదయ స్పందనాలకు మధ్య విరామం లో రక్తపోటు తక్కువ ఉంటుంది దీనిని డయాస్టోలిక్ ప్రెజర్ అంటారు.  మన దేహంలో గుండె, రక్తనాళాలు,మూత్ర పిండాలు,రక్తపోటు ను సమ స్థితిలో ఉంచేందుకు పరస్పరం సహకరించుకుంటూ  ఉండే యంత్రాంగం ఉండి దేహానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. ఇట్టి సరఫరా లేకపోతే శరీర మనుగడకు కావలసిన ప్రాణవాయువు అందదు.

బి.పి. ని సాధారణంగా సంఖ్యా పరంగా సిస్టోలిక్ ముందు దానికింద డయాస్టోలిక్ ఉండేవిధంగా సూచిస్తారు. సాధారణ అవగాహన కోసం 120/80 (mm of Hg) ని సాధారణ రక్తపోటు అంటారు.ఔషద పరంగా వాడుకలో 119/79 ని సాధారణ రక్తపోటు గా వ్యవహరిస్తారు.140/90 అంతకంటే ఎక్కువ ను అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అంటారు. సిస్టోలిక్ 120 నుండి 139 మధ్య,డయాస్టోలిక్ 80 నుండి 89 మధ్య ఉంటుంటే దీనిని ప్రాధమిక రక్తపోటు అని దీని పట్ల మందే జాగ్రత్త పడకపోతే ఇదే హై బి.పి. గా పరిణమిస్తుంది. 

అధిక రక్తపోటు రక్తము యొక్క వత్తిడి రక్త నాళాల పైన అధికముగా ఉన్నప్పుడు కలుగుతుంది. ఇది గుండె పైన వత్తిడి కలిగించి అధిక శ్రమకు గురి అయ్యేలా చేసి హార్ట్ ఎటాక్,మూత్రపిండాలు పనిచెయ్యక పోవడం, దృష్టి లోపము కలిగేటట్లు త్వరగా నివారణ చేపట్టక పొతే  చివరికి మరణము కూడా పొందేలా చేస్తుంది. అలాగే ఇది మన ప్రజ్ఞా పాటవములను క్షీణత పొందేలా చేయడం.చిత్తవైకల్యము,మెదడు క్షీణత (అల్జిమిర్స్ డిసీజ్) పొందేలా కూడా చేస్తుంది.

2. హై బి,పి.లక్షణాలు 3-12: అధిక రక్తపోటుకు సంబంధించినంత వరకూ ఒక ప్రమాదకరమైన అంశము ఏమిటంటే అది తమలో ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు.ఎందుకంటే దీనికంటు  ప్రత్యేకమైన వ్యాధి లక్షణాలేమి ఉండవు. ఐతే ప్రాధమిక స్థాయిలో ఉన్నప్పుడు మన తలను క్రిందికి వంచినపుడు మైకము లాగా అనిపిస్తుంది.  అందరూ అనుకున్నట్లు తలపోటు రావడం,ముక్కువెంబడి రక్తం కారడం ఉండకపోవచ్చు. ఐనా వ్యాధి లక్షణాలు బయట పడేదాకా వేచిఉండడం జీవితంతో ఆడుకోవడమే. కొన్ని వ్యాధి లక్షణాలు ఏమిటంటే విపరీతమైన తలపోటు,మసకబారిన దృష్టి,విపరీతమైన అలసట.అయోమయం,శ్వాశ తీసుకోవడంలో ఇబ్బంది,ఛాతీలో నొప్పి,అస్తవ్యస్తమైన హృదయ స్పందన.ఛాతిలో,మెడ,చెవులలో పోటు,ఒక్కొక్క సారి శరీరంలో అంతర్లీనంగా ఉన్న వ్యాధి లక్షణం మేరకు మూత్రంలో రక్తము జారీ అవడం ఇటువంటి వన్నీ బి.పి.ని అనుమానించే టందుకు ఆస్కారం కలిగించేవే. బి.పి. ని మౌనంగా చంపేసే వ్యాధిగా ముద్ర వేసినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నివారించవచ్చు .

3. అధిక రక్తపోటుకు అనుమానింప దగిన కారణాలు 3-13: అధిక రక్తపోటు సాధారణంగా వయసు పెరగడం బట్టి వచ్చే వ్యాదని భావిస్తూ ఉంటారు కానీ అనేక అధ్యయనాల ప్రకారం ఇది సంవత్సరాల తరబడి మాంసాహార సేవనము,నూనెలు,నిల్వ చేసిన ఆహారము అరియు అధికమైన ఉప్పు తీసుకోవడం వలన కలుగుతుందని సూచిస్తున్నాయి. కొవ్వుతో కూడిన పలకాలు రక్తనాళాల గోడలకు పేరుకుపోవడంతో కొంత కాలము తర్వాత రక్తనాళాలు ఇరుకుగానూ బిరుసుగాను  ఐపోయి  వాటి సాగుడు గుణాన్ని కోల్పోతాయి ఇది  అనూహ్యంగా రక్తపోటు పెంచేందుకు పరోక్ష సహాయకారి ఔతుంది .  

స్టార్చ్ ఎక్కువగా ఉన్న పదార్ధలయిన రొట్టె, పాస్తా ముద్ద  మొక్కజొన్న,అన్నము,ఆలుగడ్డలు  ఇటువంటివి రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని పెంచుతాయి. ఇవీ శరీరంలోని సోడియం శాతాన్ని పెంచి మెగ్నీషియం ను బయటకు పంపిస్తాయి. దీనివలన రక్తనాళాలు నొక్కివేయబడి నట్లుగా అయ్యి రక్తపోటును పెంచుతాయి. ఇతర కారణాలను పరిశీలిస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం,చిన్నతనంలో పోషకాహార లోపము, ధ్వని,తరుచుగా గాలి కాలుష్యానికి గురికావడం(దీని వలన సీసము కూడా ఎక్కువపాళ్ళలోనే శరీరంలో చేరుతుంది),ధూమపానము,మద్యపానము,నిద్రలేమి, జన్యు పరంగానో ఇతరకారణాల వలన గుండెజబ్బు,మధుమేహము ఉన్న వారితో చేరి ఉండడం, ఊబకాయము, శారీరక శ్రమ లేకపోవడం ,అధిక బరువు ఇంకా వీటితోపాటు మానసిక ఆందోళన,వత్తిడి, ఇవన్నీ కారణమవుతాయి.దురదృష్టవశాత్తూ గతంలో డాక్టర్లు ఈ ప్రధాన కారణాలను విస్మరించారు. 

4 . బి.పి. యొక్క తప్పుడు సూచి కంగారు పెడుతుంది. 3,11,16 : రక్తపోటు యొక్క కొలత రోజు రోజు కు ఇంకా చెప్పాలంటే గంటగంటకు మారుతూ ఉంటుంది . కనుక ఇది ఒక్కొక్కసారి ఎక్కువ సూచిస్తున్నప్పటికినీ  కంగారు పడవలసిన అవసరం లేదు. కనుక బి.పి. చూపించుకునే ముందు ఎవరయినా సరే ప్రశాంతంగా ఉండగలగడం లేదా దీర్ఘంగా శ్వాశ తీసుకోవడం ఇలా చేయడం వలన బి.పి. రీడింగు తప్పుగా చూపబడే ఆస్కారం ఉండదు. మొదటి సారి తీసుకున్న కొంత విరామం తరవాత రెండవసారి తీసుకోవడం వలన సరియైన రీడింగు చూపబడే ఆస్కారం ఉంటుంది. ఆందోళన, చొక్కా మడత సరిగా లేకపోవడం,చేతిని సరియయిన స్థితిలో (శరీరానికి లంబకోణంలో చెయ్యి ఉండాలి)ఉంచకపోవడం ఇవన్నీ మన బి.పి ని 10%ఎక్కువ చూపించే ఆస్కారం ఉంది . రెండు చేతుల నుండి కూడా బి.పి రీడింగు తీసుకోవడం మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఒకవేళ ఇలా తీసుకునప్పుడు ఈ రెండు రీడింగుల మధ్య వ్యత్యాసము ఎక్కువగా ఉంటే రక్తప్రసరణ వ్యవస్థలో సమస్యలు ఉన్నట్లు భావించాలి. అలాగే శరీరము యొక్క వివిధరకాల భంగిమలు కూడా (కూర్చోవడంలో గానీ విశ్రాంతి తీసుకోవడంలో గానీ )బి.పి. రీడింగు లో వ్యత్యాసాన్ని సూచిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  

బి.పి. దీర్ఘకాలికంగా ,స్థిరమైన విధంగా ఎక్కువ రీడింగు చూపిస్తూ ఉంటేనే అనారోగ్య సమస్యలు ఉత్పన్న మవుతాయి తప్ప మరోవిధంగా కాదు. కొన్ని వారాల వ్యవధిలో కనీసం మూడు హై బి.పి.రీడింగు లను సూచిస్తే అప్పుడు బి.పి. గురించి ఆందోళన చెందాలి కానీ  మరో విధంగా భయపడవలసిన అవసరం లేదు. ఐతే బి.పి.కి సంబంధించినతవరకూ ఏదయినా అసౌకర్యము ఏర్పడితే వెంటనే చూపించుకోవడం ఉత్తమం. అలాగే ఇంట్లోనే బి.పి.ని చెక్ చేసుకునేందుకు వీలుగా దానికి సంబంధించిన ప్రమాణాలు,విధానము ప్రతీ ఒక్కరు తెలుసుకోవడం ఉత్తమం. 16.

5. హై  BP మనలను అప్రమత్తులను చేస్తుంది 3,13అధిక రక్తపోటు అనేది మన శరీరంలో రక్తనాళాలు దెబ్బతిన్నాయని,రక్త ప్రసరణ వ్యవస్థ అనారోగ్యకరంగా ఉన్నదనీ ఆలశ్యం చేయకుండా దీనిని ఎదుర్కోవాలనీ తెలపడానికి ఒక సూచన. ఇది వ్యాధి కాదు కానీ శరీరము లోపల ఉన్నఅనారోగ్య  సమస్యను ప్రకటించే ఒక సూచన వంటిదే.ఐతే దీనికి కొందరు మందులు వాడడం ప్రారంభించి బాహ్యంగా ఉండే లక్షణాలు తొలగాగానే ప్రశాంతంగా ఉంటారు కానీ లోలోపల అది వృద్ధి ఔతునే ఉంటుంది.  

6. అధిక రక్తపోటు యొక్క సూక్ష్మ అంశాలు 17-18,41ఇన్ఫెక్షన్ వలె రక్తపోటు బయట నుంచి వచ్చేది కాదు. శరీరము లోపలే సృష్టింపబడుతుంది . మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది శరీరములోని  ప్రతీ కణము ఆరోగ్యము గా జీవింప బడేలా సృష్టింప బడితే మరి రోగము అనేది ఎందుకు వస్తుంది. అనగా ప్రాధమిక స్థాయిలో అనగా కణము స్థాయిలోనే ఏదో సమతౌల్యము  దెబ్బతిన్నది అని భావించ వలసి వస్తుంది. ఏవిధంగా ఐతే సమస్య శరీరము లోపలే సృష్టింపబడిందో దాని పరిష్కారము కూడా లోపలే ఉందని గ్రహించాలి. ఆధ్యాత్మిక గురువులు,మతగ్రంధాలు ప్రకారము మన శరీరం లోనే ఒక ప్రత్యేక విభాగము ఇట్టి కణాలను బాగుచేయడానికి మరియు తిరిగి ఆరోగ్యము సంతరించుకోవడానికి పని చేస్తూ ఉంటుంది.  ఐతే ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహజ సిద్ధమైన శరీరము-మనసు-శ్వాస ,ఆహారము ఉండాలి తప్ప కృత్రిమ పద్ధతులు,మందులు ఇవి శరీరములో ఉండవలసిన ఖనిజ లవణాలు ఇటువంటి వన్నింటిని బయటకు పంపడం వలననే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.  సాయివై బ్రియానిక్స్ రెమిడిలు రక్తంలో చెక్కర శాతాన్ని సమపాళ్ళలో ఉంచడం ద్వారా బిపి.ని తగ్గించడం ద్వారా ఎంతో మంది డాక్టర్లకు  తమ పేషంట్లు మందుల మీద అధారపడడం నిరోధించాయి.

7. లో బి.పి. 19-20: 90/60 లేదా అంతకన్నా తక్కువ గా రక్తపోటు యొక్క రీడింగు సూచిస్తూ ఉంటే అది లో బి.పి. లేదా హైపో టెన్షన్ ను సూచిస్తుంది. వ్యాధి లక్షణాలు లేకుండా కేవలం రీడింగు మాత్రమే లో బి.పి. ని సూచిస్తూ ఉంటే అది వ్యాధి కాదు అని గ్రహించాలి.కొంతమందికి ఈ రీడింగు ఏ లక్షణాలు చూపకుండా  90/50 కూడా ఉండవచ్చు. అంతేకాక  హై బి.పి. తో ఉన్నవారు కూడా అనగా 100/60. ఉన్నవారు కూడా లో బి.పి.ని పొందేఅవకాశం ఉంది.  ఐతే హైబి.పి. వలె కాకుండా లో బి.పి. లో రక్త నాళాలలో రక్త ప్రవాహము నెమ్మదిగా ఉంటుంది .ఐతే ఇది మరీ నెమ్మదిస్తే అత్యంతమౌలికమైన మెదడు,గుండె,మూత్రపిండాలు,వంటి వాటికి  ప్రాణవాయువు మరియు పోషకాల సరఫరా మందగించడం వలన అది తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ ఈ అవయవాల పనితీరును పాడుచేసే అవకాశం ఉంది.  

8. లో బి.పి. కి కారణాలు మరియు దాని లక్షణాలు 19-20ఎవరికైనా సరే జ్వరం వచ్చినప్పుడూ,నీళ్ళవిరోచనాలు, వాంతులు, స్త్రీల కయితే నెలసరి సమయాల్లో ఎక్కువగా రక్తం పోయినప్పుడు ఇటువంటి సందర్భాలలో సాధారణంగా లో బి.పి. ఏర్పడుతూ ఉంటుంది తర్వాత తగ్గిపోతూ ఉంటుంది కనుక దాని గురించి అందోళన అవసరం లేదు.  మనం చేసే పనిని బట్టి, ఆందోళన,వాతావరణ మార్పులు,ఆహారము,జీవన విధానము వీటన్నిటి  వలన రక్తపోటు సాధారణంగా మారుతూ ఉంటుంది.  ఐతే స్థిరంగా లో బి.పి కనుక రికార్డవుతూ  ఉంటే దానికి కారణం గుర్తించి వెంటనే నివారణ చేపట్టాల్సిందే. సాధారణంగా జన్యు పరంగానూ,వయసును బట్టి, మనం తీసుకునే మందుల ప్రభావము,అనార్ద్రత ,పోషక విలువలు లేని ఆహారము,గుండె పనితీరు, నరాలకు సంబంధించిన రుగ్మతలు,హార్మోన్ లోపము,గాయము లేదా షాక్ తినడము వీటివలన లో బి.పి. ఏర్పడుతూ ఉంటుంది. అలాగే

తల వాలిపోతూ ఉండడం,కండ్లు తిరగడం,తలపోటు,మూర్చ పోవడం,నీరసం,అస్పష్టమైన దృష్టి,ఆందోళన, గుండెదడ, స్థిమితంగా లేకపోవడం,దాహంగా ఉండడం, లేచినప్పుడుగానీ  ,కూర్చున్నప్పుడుగానీ లేదా శరీర భంగ

గిమ మార్చుకున్న సమయంలో గానీ  వికారము అనిపిస్తే  మెదడుకు సరిపడినంత రక్తం అందడంలేదని  దానికి తగివిధంగా ప్రతిస్పందించాలని సూచన. 

9. సహజ సిద్ధంగా BP ని నార్మల్ గా ఉంచుకునే విధానము 3,21-40:
(i) సోడియం ను మరియు సోడియం తో కూడిన పదార్ధాలను (ఎక్కువ ఉప్పు ఉన్న ఏ పదార్ధన్నయినా) దూరంగా ఉంచండి .
సోడియం   మనశరీరంలో ద్రవ పదార్ధాలు,సమపాళ్ళలో ఉంచడానికి,కండరాలు,నరాలు చక్కగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. కానీ ఎక్కువ పాళ్ళలో ఈ సోడియం తీసుకుంటే ఇది  రక్తంలో నీటి శాతాన్ని పెంచి తద్వారా ఘనపరిమాణం పెరగడంతో బి.పి.కూడా సహజంగానే పెరిగిపోతుంది.  సోడియం  యొక్క ప్రధానమైన ఆధారము సాధారణ ఉప్పు. ఇది రొట్టెలు, పిండి వంటలు,వెన్న,ఫాస్ట్ ఫుడ్,సాస్ లు,సలాడ్ లు, మసాలాలు,పచ్చళ్ళు, వండిన ఆహారంలోనూ ఇది ఉంటుంది. మనకు కావలసిన సోడియం పళ్ళు,కూరగాయలు, పాలఉత్పత్తులూ, పప్పుధాన్యాలు లో ఉంటుంది కనుక సోడియం  ఎక్కువ తీసుకుంటున్నామనే భయం ఏమీ లేకుండా వీటిని తీసుకోవచ్చు.  

(ii) సోడియం స్థానంలో పొటాసియం ను చేర్చుకోండి . 
పొటాసియం  కొబ్బరిననీటిలోను, పెరుగులోను,పుల్లని పండ్లలోనూ,అరటిపళ్ళు,దానిమ్మ పండ్లు, ఉసిరి కయలోను,జల్దారు పండ్లలోనూ ,ఎండుద్రాక్ష ,ఖర్జూరం  అల్బకరా పండ్లలోనూ,ఆకుపచ్చని కూరగాయలు,కేరట్లు,చిలకడ దుంపలు,టమాటాలు, బటానీలు ,చిక్కుడు  ఇంకా ధాన్యాలన్నింటిలోనూ ఇది లభ్యమవుతుంది. ఎక్కువ పొటాసియం కలిగిన పదార్ధాలు రక్త నాళాల గోడల పైన వత్తిడి తగ్గించి  బి.పి .ని నార్మల్ లో ఉంచడమే కాక రక్తం లో ఉన్న సోడియం ను సమతౌల్యం చేయడం ద్వారా  మూత్రం ద్వారా బయటకు పంపివేయబడుతుంది. అలాగే బి.పి. కి సంబంధించిన  అన్ని ఖనిజ లవణాలను సమపాళ్ళలో ఉంచి గుండె, మూత్రపిండాల సమస్యలను తగ్గిస్తుంది.   

(iii) మెగ్నీషియం&కాల్షియం,మరియు  B3, C, E, K, & D విటమిన్లతో అనుబంధ ఆహారము :
మెగ్నీషియం   మన శరీరంలో రక్తపోటు,రక్తంలో చక్కెర శాతము,ఎముకల పెరుగుదల వంటి అనేక వ్యవస్థల నియంత్రణలో సహాయకారిగా ఉంటుంది. ఇది ఆకుపచ్చని కూరగాయల లోనూ ధాన్యముల పొట్టు, పప్పు ధాన్యాల లోనూ లభిస్తుంది. కాల్షియం  రక్త పోటు నియంత్రణ కోసం రక్త నాళాలు బిగింపు,వదులు అవడంలో సహాయకారిగా ఉంటుంది. ఇది పాల ఉత్పత్తులూ,ముదురు ఆకుపచ్చని కాయగూరలలోను ,బాదాం,నువ్వులు, తోటకూర,గోంగూర,గసగసాలు వంటి వాటిలో సమృద్ధిగా లభిస్తుంది.

విటమిన్ B3 ఆకుకూరలలోను, ధాన్యాల లోనూ దొరికే  ఈ విటమిన్ రక్త కణాలను శక్తివంతం గాను, మృదువుగాను చేయడం వలన  గుండెజబ్బులు వచ్చే ప్రమాదాలను దూరం చేస్తుంది.  విటమిన్  C   ధమనులలో ఫలకాలు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇది అరటిపళ్ళు,అవోకడో పండు,జామ,పుచ్చకాయ,బెర్రీ పండు, నిమ్మ జాతి పండ్లు,రేగుపండ్లు ,క్యాబేజీ,బ్రోకలీ, టమాటాలు,ఆలుగడ్డలు, ఎర్రని పిప్పలి దుంపలు ఇవన్నీ అధిక మొత్తంలో C విటమిన్ కలిగి ఉంటాయి.   విటమిన్ E అనేది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బాదాం,హాజెల్ పండు గింజలు,పొద్దుతిరుగుడుగింజలు, ఆకుకూరలు,ధాన్యాలు,చిలకడ దుంపలు,అవకడో పండు,బొప్పాయి,మరియు నీలి బెర్రీ పండ్లలో సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ K1 అనేది రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది ఇది ఆకుపచ్చని కూరగాయలయినట్టి  పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు,వెల్లుల్లి, క్యాబేజీ,కాలిఫ్లవర్ లాంటి కూరగాయలు,తెల్ల ఉల్లిపాయలు, కొంత మేరకు పులియబెట్టిన డైరీ  ఉత్పత్తులూ, దోసకాయలు,మొలకెత్తిన విత్తనాలు, ప్రునె పండ్లు, తులసి  వీటిలో కూడా లభిస్తుంది. విటమిన్ K2  అనేది చిన్న ప్రేవుల గోడలవద్ద ఉన్న బ్యాక్టీరియా ద్వారా K 1 నున్దిఉత్పత్తి చేయబడుతుంది. K2 అనే విటమిన్ శరీరంలో కాల్షియం ను ఉండవలసిన స్థాయిలో ఉంచడంద్వారా ఎముకలకు పుష్టిని కలుగచేసి (ఆస్టియోపోరోసిస్ ) ఎముకల బోలుతనాన్ని నివారిస్తుంది.

విటమిన్ D అనేది శరీరంలో కాల్షియం ని గ్రహించడానికి అత్యవసరము. ఈ విటమిన్ ను సూర్యరశ్మి నుండి గ్రహించడం ఎంతో శ్రేయస్కరం. ఇండియా లో జరిపిన ఒక సర్వే ప్రకారము మధ్యాహ్నం  11 నుండి 2 గంటల వరకూ ఎండకు  గురయి నపుడు మన శరీరము అధిక మొత్తంలో విటమిన్ D౩ ని గ్రహిస్తుందని తెలిపింది.  ఒక సూచన ప్రకారము వారానికి రెండు లేదా మూడు సార్లు 20 నిమిషాల పాటు ఈ సమయంలో చేతులు,ముఖము,కాళ్ళకు ఏ ఆచ్చాదనా లేకుండా నిలబడితే మన శరీరానికి కావలసిన విటమిన్ D పూర్తిస్థాయిలో అందుతుందని తేలింది. సూర్యరశ్మి అందుబాటులో లేనివారు K2 ను సప్లిమెంటు గా తీసుకోవడమే ఉత్తమం .

iv) కెఫీన్ ( ఇది కాఫీ లో ఉంటుంది) తీసుకోవడం తగ్గించండి .ఎందుకంటే ఇది రక్తప్రసరణ వ్యవస్థను ఉత్తేజ పరిచి ఎడ్రినలిన్ వంటి హానికరమైన హార్మోన్ లను ఉత్పత్తి చేయడంతో అవి రక్తంలో కలిసి హృదయ స్పందనను  అలాగే రక్తపోటును కూడా పెంచుతాయి.  

(v) కొన్ని సరళమైన గృహ చిట్కాలను పాటించండి.

ఒక చెంచాడు తేనెను వేడి నీటితో తీసుకుంటే అది రక్తపోటును సమం చేస్తుంది.ఒక గ్లాసు సొరకాయ రసం రోజుకు రెండు సార్లు తీసుకుంటే అది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఆయుర్వేదం  ప్రకారం  అర చెంచా దాల్చిన చెక్క చూర్ణము ,లేదా  ఒక చెంచాడు ధనియాలు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయమే తీసుకుంటే  అది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. వెన్నుపూస పైన ఐసు ముక్కలతో మెల్లగా రాయడం వలన కూడా బిపి తగ్గితుంది. అలాగే ప్రధమ చికిత్స మాదిరిగా వెంటనే అధిక రక్తపోటును నియంత్రించడానికి ఉంగరపు వ్రేలును కొంచెం సేపు నొక్కడం ద్వారా .ఉపయోగం ఉంటుంది. 

(vi) బి.పి. నిమిత్తం కొన్ని నిర్మాణాత్మక సూచనలు

  • తగినంత నీరు త్రాగుతూ శరీరాన్ని ఆర్ద్రంగా ఉంచుకోవడం,శ్వాశ కు సంబంధించిన పద్ధతులు అనుసరించడం,యోగా,ధ్యానము వంటివి శిక్షణ పొందిన వ్యక్తి వద్ద నేర్చుకొని అనుసరించడం ద్వారా మనో శరీరాలను సమ స్థితిలో ఉంచవచ్చు.  అలగే ఏదయినా బృందంలో భాగమయ్యి కార్యక్రమాలు నిర్వహించడం, నిస్వార్ధ సేవలు చేయడం అలవాటుగా మార్చుకోవడం ద్వారా భావోద్వేగాలను ఆందోళన ను అరికట్టవచ్చు. మానవ జీవిత లక్ష్యాన్ని పదే పదే మననం చ్సుకోవడం ద్వారా  కూడా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది .
  • కంప్యుటర్ లో  వీడియో గేం ఆడే పిల్లలు  తరుచూ అశాంతికి గురి ఔతున్నరంటే వారు భవిష్యత్తులో రక్తపోటు సమస్యలు ఎదుర్కొంటారు. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను శారీరకంగా బయట అదే ఆటలను ఆడడం,అటువంటి కృత్యాలు నిర్వహించేందుకు ప్రోత్సాహ పరచాలి. అలాగే కృత్రిమంగా బాటిల్ తో పాలు త్రాగేవారికన్నా తల్లి పాలు త్రాగే పిల్లల లో రక్తపోటు సమస్యలు తక్కువ వచ్చే అవకాశం ఉంది .
  • శరీర బరువును అదుపులో ఉంచుకోండి BP ఉన్న కుటుంబ నేపథ్యం విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి.

చివరగా అసలు విషయం ఏమిటంటే మనం తీసుకునే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు42  అనగా ప్రకృతి సిద్ధంగా మన జీవన శైలిని మార్చుకోవడం, సహజ సిద్ధమైన సమపాళ్ళలోని ఆహారం, అప్పుడప్పుడూ పరీక్షల చేయించుకోవడం ద్వారా నిర్ధారించుకోవడం సమయానుకూలంగా చికిత్స చేయించుకోవడం ఇవి బి.పి. నుండి మనలను దూరంగా ఉంచుతాయి..

References and Links

  1. https://medlineplus.gov/highbloodpressure.html
  2. https://www.nhlbi.nih.gov/health/health-topics/topics/ms
  3. http://media.mercola.com/assets/pdf/ebook/high-blood-pressure-special-report.pdf
  4. https://wonderopolis.org/wonder/why-is-blood-pressure-important  
  5. http://www.heart.org/HEARTORG/Conditions/HighBloodPressure/AboutHighBloodPressure/What-is-HighBloodPressure_UCM_301759_Article.jsp#.Wd-xDCN97rk
  6. https://www.nhlbi.nih.gov/health/resources/heart/latino-hbp-html/learn
  7. http://www.heart.org/HEARTORG/Conditions/HighBloodPressure/UnderstandSymptomsRisks/What-are-the-Symptoms-of-High-Blood-Pressure_UCM_301871_Article.jsp#.Wd86WCN97rk
  8. https://www.webmd.com/hypertension-high-blood-pressure/guide/hypertension-symptoms-high-blood-pressure
  9. http://isha.sadhguru.org/blog/yoga-meditation/demystifying-yoga/is-honey-good-for-you/
  10. https://www.medicinenet.com/high_blood_pressure_symptoms_and_signs/symptoms.htm
  11. https://articles.mercola.com/sites/articles/archive/2016/11/30/how-to-lower-blood-pressure.aspx
  12. https://www.youtube.com/watch?v=Rjex2fLWWww
  13. https://www.drcarney.com/blog/entry/high-blood-pressure-a-symptom-not-a-disease
  14. http://onlinelibrary.wiley.com/doi/10.1111/j.1365-2702.2005.01494.x/abstract;jsessionid=68DE84D2914C89DEB51A0D9BD8415F1C.f02t01
  15. https://www.health.harvard.edu/blog/different-blood-pressure-in-right-and-left-arms-could-signal-trouble-201202014174
  16. http://www.heart.org/HEARTORG/Conditions/HighBloodPressure/KnowYourNumbers/Monitoring-Your-Blood-Pressure-at-Home_UCM_301874_Article.jsp#.WgAIuCN97e0
  17. http://isha.sadhguru.org/blog/video/handle-chronic-ailments-like-diabetes-hypertension/
  18. http://www.ishafoundation.org/us/blog/world-health-day-meditation-and-health/
  19. https://www.medicinenet.com/low_blood_pressure/article.htm
  20. https://www.webmd.com/heart/understanding-low-blood-pressure-basics#1
  21. https://www.livestrong.com/article/482968-what-is-the-rda-of-sodium/
  22. https://www.fda.gov/food/resourcesforyou/consumers/ucm315393.htm
  23. https://newsinhealth.nih.gov/2016/01/blood-pressure-matters
  24. http://www.heart.org/HEARTORG/Conditions/HighBloodPressure/MakeChangesThatMatter/How-Potassium-Can-Help-Control-High-Blood-Pressure_UCM_303243_Article.jsp#.WfGTFCN97v0
  25. https://www.drwhitaker.com/potassium-benefits-include-lower-blood-pressure
  26. https://www.health.harvard.edu/heart-health/key-minerals-to-help-control-blood-pressure
  27. https://articles.mercola.com/sites/articles/archive/2012/12/16/vitamin-k2.aspx
  28. http://www.nutritionalmagnesium.org/calcium-vitamin-k2-and-vitamin-d-must-be-balanced-with-magnesium/
  29. https://draxe.com/top-10-vitamin-k-rich-foods/
  30. https://www.vitamindcouncil.org/about-vitamin-d/how-do-i-get-the-vitamin-d-my-body-needs/
  31. https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/Decoded-How-much-sun-you-need/articleshow/51406650.cms
  32. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3897581/
  33. http://icmr.nic.in/ijmr/2008/march/0301.pdf
  34. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3942730/
  35. http://clinical-nutrition.imedpub.com/vitamin-d-deficiency-in-indians-prevalence-and-the-way-ahead.pdf
  36. https://articles.mercola.com/sites/articles/archive/2009/10/10/vitamin-d-experts-reveal-the-truth.aspx
  37. https://www.youtube.com/watch?v=498dM508orQ
  38. https://www.youtube.com/watch?v=KHNk-gIIMyc
  39. https://www.youtube.com/watch?v=loLgad2EMjs
  40. https://www.youtube.com/watch?v=x9Ui2tHOhXg
  41. https://www.sathyasai.org/organize/idealHealth.html
  42. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202012-05%20May-Jun.pdf
  43. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202012-07%20Jul-Aug.pdf
  44. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202014-01%20Jan-Feb-H.pdf
  45. http://vibrionics.org/jvibro/newsletters/english/News%202014-07%20Jul-Aug%20H.pdf

Om Sai Ram