Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 8 సంచిక 4
July/August 2017
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన చికిత్సానిపుణులకు,

ఈ గురుపూర్ణిమ(శిష్యుడు గురువును పూజించే పౌర్ణమి దినము)పర్వదిన సందర్భాన మీతో ఇలా నా భావాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమములు చేపట్టారు. అవి డ్రామాలే కానివ్వండి, డ్యాన్సులే కానివ్వండి, సేవాకార్యక్రమాలే కానివ్వండి ఇవన్నీ కూడా మన సద్గురువును ప్రసన్నం చేసుకొనే దానిలో భాగంగాను వారి అడుగుజాడలలో నడుస్తూ వారి సందేశాన్ని ఆచరణాత్మకంగా నిరూపించడానికి ఉద్దేశించినవే. నా పరిశీలనలో నేను గమనించినదేమంటే స్వామి తమ భౌతిక దేహం వీడినప్పటినుండీ వారు ఏ మిషన్ కోసం తమ జీవితమును అంకితం చేసారో అట్టి సేవాకర్యక్రమాలు అదే ఉత్సాహంతోను, అంకితభావం తోనూ వెయ్యింతలు గా పెరిగిపోతూ వచ్చాయి. అదేవిధంగా వారు ప్రారంభించిన వైబ్రియోనిక్స్ మిషన్ కూడా అలాగే విస్తరిస్తూ ఉన్నదని చెప్పడానికి నాకెంతో ఆనందంగా ఉన్నది.

నా పరిశీలనలో తెలిసిన విషయం ఏమిటంటే ఇటీవల మన వార్తాలేఖలలో అత్యంత క్లిష్టమైన కేసుల గురించి వైబ్రియో రెమిడిలద్వారా అవి నయమైన తీరు గురించీ, మొక్కలు, జంతువుల పైన విస్తరిస్తున్న పరిశోధనలు గురించి చక్కటి అంశాలు ప్రచురితమవుతున్నాయి. భవిష్యత్తులో వైబ్రియోనిక్స్ స్వర్ణయుగం రానున్నదనే భావన నాలో స్వాప్నికమవుతున్నది.

ఈ మధ్యనే మన స్పానిష్ అనువాదకుడు స్వర్గస్తులయ్యారు. ఆ భర్తీ నింపడానికి నేను అడిగిందే తడవుగా ఇద్దరు చికిత్సా నిపుణులు ప్రాక్టీషనర్ 01001 మరియు  ప్రాక్టీషనర్ 00423 స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అతి తక్కువ సమయంలో రెండు వార్తాలేఖలను అనువదించడమే కాక అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా త్వరగా పూర్తిచేసే దిశలో ముందుకు వెళుతున్నారు. భారత దేశంలో కూడా ఎందరో అనువాదకులు వార్తాలేఖ లనే కాక వైబ్రియోనిక్స్ పుస్తకాలన్నీ కూడా తెలుగు, మరాఠీ, హిందీ వంటి  భాషలలోనికి అనువదిస్తూ ఉన్నారు.

మన కర్ణాటక కోఆర్డినేటర్  10776 ఇటివలే  వైట్ ఫీల్డ్ SSIHMS లో మన వైబ్రియోనిక్స్ క్లినిక్ నిర్వహించడం పై వారు పంపిన  సమాచారాన్ని మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది మార్చ్ 2 వ తేదీన న్యూరో పేషంట్ విభాగం నుండి ప్రారంభమయ్యింది. దీనిని ఐదుగురు అంకిత భావం గల వైబ్రో నిపుణులు రొటేషన్ పద్ధతి పైన వారానికి మూడు సార్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొచ్చే పేషంట్ల సంఖ్య కూడా కేవలం నోటి మాట ద్వారానూ, ఇంకా రిఫెరెన్సు ద్వారానే క్రమంగా పెరుగుతోంది. మరొక  హృదయానందకరమైన విషయం ఏమిటంటే డాక్టర్లు కూడా ఎంతో విశాల హృదయంతో మన వైబ్రో వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను సిఫార్సు చేస్తూ తమ పేషంట్లను మన చికిత్సా నిపుణుల వద్దకు పంపడం ఒక శుభ పరిణామం. ఇటీవల నేను అమెరికా లోని సత్యసాయి సేవా సంస్థల శిబిరానికి వెళ్ళినప్పుడు ఇటువంటి వాతావరణమే కనిపించింది. అక్కడకు వచ్చిన అసంఖ్యాక డాక్టర్ల బృందంతో మాట్లాడినప్పుడు  వారి విశాలమైన భావాలు, వైబ్రియోనిక్స్ పట్ల వారికున్న అభిరుచి గురించి స్వామి యొక్క ప్రేమే కృత్య రూపంలో ఎలావ్యక్తమవుతున్నదో తెలుసుకొనే అవకాశం కలిగింది.

ప్రియమైన సోదరి సోదరులారా స్వామి ఎప్పడూ ఇలా అనేవారు. ” పని, ఆరాధన, జ్ఞానము ఇవన్నీ సేవతోనే ప్రారంభమవుతాయి. సేవ ఎటువంటిదైనా ప్రేమ తోనూ దైవ భావన తోనూ చేస్తే అది పూజ (ఉపాసన)గా మారిపోతుంది ”. 1999 మార్చి 14 నాటి శ్రీవారి దివ్యవాణి. కనుక ఇప్పటినుండి మనం శ్రీవారి అడుగు జాడలలో నడుస్తూ వైబ్రియోనిక్స్ ను మన జీవితంలో ఒక  భాగం చేసుకునేలా ప్రతిన బూనుదాం. దీనిలో భాగంగా మీ నుండి నెలవారీ రిపోర్టులు, మీ అనుభవాలు, కేస్ హిస్టరీల(రోగ చరిత్రలు)పరంపర నియమ బద్ధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. మన సంస్థ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలకు స్వచ్చంద సేవకుల అవసరం ఎంతో ఉంది. కనుక మీమీ పరిధిలోని రాష్ట్ర లేదా జాతీయ సమన్వయ కర్తను ఇట్టి అవకాశల కోసం సంప్రదించండి లేదా  [email protected]. కు వ్రాయండి.

సాయి సేవలో మీ

జిత్ కె అగ్గర్వాల్

1. శ్వాస సంభందిత ఇన్ఫెక్షన్, అలెర్జీ 02308...Slovenia

2016 మే 20 వ తేదీన ఒక తల్లి తన 7 సంవత్సరాల కుమారుడిని శ్వాశకోశ వ్యాధుల నిమిత్తం చికిత్సా నిపుణుడి వద్దకు తీసుకొని వచ్చింది. ఈ బాబుకి 9వ నెలనుండి శ్వాశనాళముల వాపు (bronchitis) వ్యాధితో బాధ పడుతూ ఉన్నాడు. ఇంకా ఈ అబ్బాయిని  న్యుమోనియా, టాన్సిల్స్, అస్తమా, దడ దడ ధ్వని వచ్చే దగ్గు, డస్ట్ అలెర్జీ ముదలగు వ్యాదుల నిమిత్తము ప్రత్యేకించి శీతాకాలంలో అనేక సార్లు హాస్పిటల్ చుట్టూ తిప్పవలసి వచ్చేది. 2015-16 లో అనేక వైరల్ వ్యాధుల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకెళ్ల వలసిన అవసరం ఏర్పడింది. బాబు తల్లి రాబోయే శీతాకాలంలో ఇంకెంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధపడాలో అని భయపడ సాగిందట. బాబు అస్తమా మరియు అలెర్జీ నిమిత్తం ‘’ఫ్లిక్సోటైడ్, వెంటోలిన్ మరియు సింగులర్ మందులు వాడుతూ ఉండేవాడు. బాబును చికిత్సా నిపుణుడి వద్దకు తీసుకొని వచ్చేనాటికి వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేకపోయినప్పటికీ క్రింది రెమిడి ఇవ్వబడినది: 

#1. CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic...TDS

వారం తరువాత బాబు తల్లి చెప్పిన విషయం ప్రకారం మందు ఇచ్చిన రెండు రోజులు మాత్రం బాబు విపరీతంగా దగ్గాడని(బహుశా పుల్లౌట్ వల్ల కావచ్చు)కానీ ఆ తర్వాత చక్కగా ఉన్నాడని చెప్పింది. డోసేజ్ ని BD కి తగ్గించడం జరిగింది. తరువాత వారము లో 5 రోజుల పాటు బాబుకు కఫంతో కూడిన దగ్గు వచ్చిందట. వాళ్ళ డాక్టర్ మందులన్నీ మానేసి ఫ్లెక్సిటోడ్ మాత్రం రోజుకు ఒక్కసారి వేసుకోమని చెప్పారట. జూలై 1 నాటికి బాబుకు తగ్గిపోవడంతో  రెమిడి #1 కూడా OD కి తగ్గించడం జరిగింది. ఆగస్ట్ లో దీనిని  3TW కి తగ్గించడం జరిగింది. 

నవంబర్ మొదటి వారంలో ఇతనికి వ్యాధి లక్షణాలు తిరిగి కలిగాయి. ఇతనికి దగ్గు రావడంతో డోసేజ్ ని TDS కి పెంచి అతనికి స్వస్థత చేకూరగానే తిరిగి మెల్లిగా OD కి తగ్గించడం జరిగింది.

2017 జనవరి 28 వ తేదీన అనగా 3 నెలల తర్వాత అతనికి మరలా దగ్గు వచ్చింది. ఇదే సమయంలో బాబు తల్లి యొక్క   సోదరునికి కూడా జలుబు చేసింది. కనుక ఒక కొత్త కొమ్బో ఇవ్వడం జరిగింది.

#2. CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic...TDS

రోగి పరిస్థితి కొంచెం మెరుగయ్యాక  డోసేజ్ ODకి తగ్గించబడింది. రోగికి ఎప్పుడు దగ్గు వచ్చినా వెంటనే  #2 డోస్ రిలీఫ్ ఇస్తూ ఉండేది. ఐతే చాలాకాలంగా ఈ శ్వాశ సంబంధితమైన వ్యాధి ఉన్నందున ఆ తల్లి ఫ్లిక్సిటోడ్ ను #1 తో పాటుగా OD గా ఇవ్వసాగింది. చాలా సంవత్సరాల తర్వాత 2016-17 సంవత్సరంలో శీతాకాలం బాబుకు ఆనందకరమైందిగా మారిపోయింది. 2017, మార్చి లో బాబు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాడని ఆమె చెప్పింది.

మూత్రం జారీలో మంట 02308...Slovenia

2016 జూన్ 21 న 74-సంవత్సరాల వృద్ధ మహిళ నాలుగు రోజులుగా మూత్రం జారీ చేయునపుడు మంట వస్తోందనే కారణంతో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. బహుశా మానసిక సంబంధమైన వత్తిడి దీనికి కారణం కావచ్చు. అలోపతిక్ డాక్టర్ ఇచ్చిన యాంటీ బయోటిక్ మందులు మూడు రోజులు వాడినప్పటికీ ఏమాత్రం గుణం కనిపించలేదు. గతంలో ఆమెకు వైబ్రో రెమిడిల ద్వారా వ్యాధి నయమైన అనుభవంతో చికిత్సా నిపుణుడిని సంప్రదించగా వారు క్రింది రెమిడి ఇచ్చారు: 

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.3 Incontinence...ప్రతీ 20 నిమిషాలకు ఒక డోస్ చొప్పున 2 గంటల వరకు

మరునాటికి నొప్పి తగ్గిపోయిందని ఆమె చెప్పడంతో ముందటి డోస్ మరొక నాడు కొనసాగించి అనంతరం మెల్లిగా QDS కు ఆ తర్వాత నెమ్మదిగా BDకి తగ్గించడం జరిగింది. వైద్యం మొదలు పెట్టిన 6-7 రోజుల తర్వాత పేషంట్ కి పూర్తిగా తగ్గిపోవడంతో మరో రెండు రోజులపాటు OD గా ఇచ్చి అనంతరం ఆపివేయడం జరిగింది. 

 2017 మే 27 వ తేదీన వ్యాధి తిరిగి రావడంతో ఆమె డాక్టర్ గారికి చూపించుకోకుండా ప్రాక్టీషనర్ ను వెంటనే రావలసిందిగా కబురు పెట్టారు. అంతకు ముందు ఇచ్చిన డోసేజ్ తిరిగి ఇవ్వబడింది. ఒక్కరోజులోనే వ్యాధి తగ్గుముఖం పట్టడమే కాక రెండు వారాలలో ఆమెకు 100% నయమయ్యింది. ఆమె ఈ రెమిడిని OD ప్రివెంటివ్ డోసేజ్ గా ఎక్కువ కాలం తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

2012 జనవరి నుండి ఈ పేషంటు వైబ్రియోనిక్స్ మందులు అజీర్నము, తలతిరుగుట, నిద్రలేమి, గోరుచుట్టు(నెయిల్ ఫంగస్) బి.పి, ఫ్లూ, వెన్నునొప్పి, వంటి ఇతరత్రా వ్యాధులకు తీసుకుంటూ ఉన్నారు. అంతేకాక చికిత్సానిపుణుడి సూచన పైన తన ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు చేసుకున్నారు.

సూర్య రశ్మి మరియు తల నూనె కు సంబంధించిన ఎలెర్జి 11422...India

2016 జూన్ 11 వ తేదీన ఈ చికిత్సా నిపుణుడు తన సాధారణ సందర్శన లో భాగంగా ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు 60 ఏళ్ల వృద్ధుడు తాను 20 ఏళ్ళుగా తలనొప్పి తో బాధ పడుతున్నానని ఎండలోకి వెళితే చాలు భరింపరాని తలనొప్పి వస్తోందని తలకు టోపీ పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పాడు. దీని కారణంగా ఎండ లోనికి వెళ్ళడమే మానుకున్నాననీ తలనొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు నొప్పి నివారిణి వేసుకుంటానని చెప్పారు. ఇంతే కాకుండా ఇతనికి తలలో దురద కూడా వస్తోందని బహుశా ఎండలోకి వెళ్ళినప్పుడు బి.పి పెరగడం వల్ల ఇలా జరుగుతుందేమోనని భావించానని చెప్పాడు. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:

#1. CC3.3 High Blood Pressure (BP) + CC3.7 Circulation + CC11.3 Headaches + CC11.4 Migraines + CC21.3 Skin allergies…TDS

నెల రోజుల్లోనే అతని తలనొప్పి, తల దురద తగ్గిపోయాయి. జూన్ 17 నాటికి తిరిగి ఈ ఇబ్బందులు తలెత్తలేదు.

 2017, మార్చి 18 వ తేదీన ఇతను మరో సమస్యను ప్రాక్టీషనర్ దృష్టికి తీసుకు వచ్చారు. గత 6 నెలలుగా తలకు నూనె రాసిన ప్రతీసారీ తలపైన కురుపులు వస్తున్నాయి. దీని నిమిత్తము ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు.

#2. CC21.2 Skin infections + CC21.3 Skin allergies…6TD, ఇది పైన పూతకు కూడా ఇవ్వబడింది.

రెండు వారాలు తర్వాత అనగా 2017 ఏప్రిల్ 3 నాటికి అతనికి 50% తగ్గిపోయింది. కనుక డోసేజ్ ను TDS కు తగ్గించడం జరిగింది. ఏప్రిల్ నెలాఖరుకు అతనికి 100% తగ్గిపోయింది. 2017 మే వరకూ మందులు వాడారు ఇప్పటివరకు తిరిగి ఆ ఇబ్బందులు తలెత్తలేదు.

క్లోరిన్ వలన వచ్చే ఎలర్జీ 11422...India

2015 ఆగస్టు 8 వ తేదీన 21 సంవత్సరాల యువ ప్లంబరు కళ్ళు నొప్పి, తలపోటు, మసకగా ఉండే దృష్టి ఈ సమస్యలతో ప్రాక్టీ షనర్ వద్దకు వచ్చారు. గత రెండు సంవత్సరాలుగా స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేయడానికి క్లోరిన్ ను ఏ ఇబ్బంది లేకుండా వాడుతున్నాడు. కానీ గత రెండు నెలలుగా ఈ క్లోరిన్ వాడుతున్నప్పుడు పైన పేర్కొన్న ఇబ్బందులు వస్తున్నప్పటికీ గత రెండు రోజులుగా బాధలు భరింపరానివిగా ఉండేసరికి ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ప్రాక్టీ షనర్ ఈ యువకుడు వాడుతున్న క్లోరిన్ ను కొంత శాoపిల్ తీసుకురమ్మని చెప్పి దాని ద్వారా క్రింది నోసోడ్ తయారు చేసి ఇచ్చారు:

Potentised chlorine 200C…TDS 

కొంత కాలము పాటు క్లోరిన్ కు దూరముగా ఉండమని చెప్పడంతో ఈ యువకుడు తన యజమాని అనుమతి తో నెలవరకూ దానిని ముట్టలేదు.

నెలతరువాత ప్రాక్టీ షనర్ తో ఈ నెల రోజులలో రెండుసార్లు మాత్రమే కంటినొప్పి, తలపోటు వచ్చాయని కళ్ళ మసకలు మాత్రము  ఒక్కసారి కూడా రాలేదని యువకుడు చెప్పాడు. మరో రెండు వారాలు రెమిడిని కొనసాగించమని చెప్పడంతో తిరిగి పనిలోకి వెళుతూనే మందులు వాడసాగాడు. ఐనప్పటికీ క్లోరిన్ తో మునుపటి ఇబ్బందులు ఏమీ తలెత్తలేదు. ప్రస్తుతం ఏ ఇబ్బందులు లేకుండా తన పనిని కొనసాగిస్తున్నారు.

5. ఆధార కణజాలపు శోధము (సెల్యు లైటిస్) 11422...India

71-సంవత్సరాల వృద్ధుడు  2016 జూన్ 16 వ తేదీన తీవ్రమైన జ్వరము మరియు వళ్ళునొప్పులతో పుట్టపర్తిలో ఉన్న జనరల్ హాస్పిటల్లో చేరారు. రక్త పరీక్షల ద్వారా అతనికి డెంగ్యు జ్వరమని నిర్ధారించి దానికి తగ్గట్టుగా వైద్యం చేసారు. మూడు రోజుల తర్వాత జ్వరము తగ్గింది కానీ అతని ఎడమ కాలి చీలమండ వద్ద ఎరుపు రంగుతో వాపు తోపాటు తాకితే ప్రాణం పోయేలా అనిపించే విధంగా నొప్పి కూడా కలగసాగింది. మరునాటికి అతనికి ఈ వాపు మరియు నొప్పి మోకాలి నుండి పాదం వరకు వ్యాపించింది. ఇది సెల్యులైటిస్ వ్యాధిగా నిర్దారింపబడి దాని నిమిత్తం యాంటీ బయోటిక్స్ మందులు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత పేషంటు ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు షిప్టు చేసారు, ఎందుకంటే పేషంటుకు  విపరీతంగా వచ్చిన తలపోటుతో పాటు తెలివి కూడా తప్పి పోవడం జరిగింది. ఐతే ఇక్కడి చికిత్స వల్ల మతిభ్రమణము రెండు రోజుల్లో తగ్గిపోయినా పేషంటుకు కాలిలో వాపు, చీము ఏర్పడ్డాయి. కాలికి బిగుతుగా కట్టు కట్టి కాలు కొంచం ఎత్తుగా పైకి ఉండేటట్లు ఉంచబడినది. రెండు రోజుల తర్వాత పేషంటు కు ఆపరేషన్ చేసి చీము తీసివేయాలని, చర్మము గ్రాఫ్టింగ్ చెయ్యాలని డాక్టర్ చెప్పారు. జూన్ 29వ తేదీన ఇది వినగానే పేషంటుకు  నిస్త్రాణంగా అయిపోయి బి.పి డౌన్ అయిపొయింది. అందువల్ల డాక్టర్లు పేషంటును మరో రెండు రోజుల పర్యవేక్షణలో ఉంచి శస్త్ర చికిత్సను జూలై 1 వ తారీకుకు వాయిదా వేసారు.

29 వ తేదీ రాత్రి వీరి కుటుంబ సభ్యులు ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. సమయం లేకపోవడం వల్ల డాక్టర్లను సంప్రదించకుండానే మరునాటి ఉదయం ఈ నోసోడ్ ను ఇచ్చారు:

Blood nosode 200C…TDS 

రెండు గంటలలోనే కాలివాపు  తగ్గి పోవడంతో వేసిన బ్యాండేజ్ వదులుగా అయిపోయింది నొప్పి కూడా తగ్గిపోయింది. రోగులను చూడడానికి  రౌండ్ లకు వచ్చినప్పుడు కాలివాపు 80% తగ్గిపోవడం చూసి డాక్టర్ చాలా ఆశ్చర్య పోయారు. ఐతే కాలి మడమ వద్ద కొంత వాపు, చీము ఉన్నాయి. ఎరుపురంగు కూడా చాలావరకు తగ్గిపోయింది. శస్త్రచికిత్స చేసే నిపుణుడు కూడా దీనిని చూసి ఇది నిజంగా ఒక మిరకిల్ అని చెపుతూ అతని కుటుంబ సభ్యులకు అనందం కలిగించే రీతిగా ఆపరేషన్ కూడా అవసరం లేదని చెప్పారు. అదేరోజు సాయంత్రం ఇచ్చిన నోసోడ్ తో పేషంటు ఆరోగ్య విషయంలో మరికొంత మెరుగుదల కనిపించింది. మరో రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి జూలై 2వ తారికున పేషంటును డిశ్చార్జి చేసారు. మొదట నడవడం కొంత కష్టంగా అనిపించినా త్వరలోనే పేషంటు తన నిత్య కృత్యాలకు అలవాటు పడిపోయారు.

ఆసుపత్రి వర్గాలు పేషంటుతో తగినంత విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే దుమ్ము, ధూళిలకు ఏమాత్రం లోనైనా సెల్యులైటిస్ తిరిగి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నోసోడ్ ను 2016 డిసెంబర్ వరకూ TDS గానూ దీనిని క్రమంగా తగ్గించుకుంటూ 2017 మార్చి 31 తేదికి పూర్తిగా మానివేసే నాటివరకు OW గానూ వాడడం జరిగింది. ఇప్పుడు పేషంటు ఎంత ఆనందంగా ఉన్నారంటే తనకు తెలిసిన వారు ఎవరైనా ఆరోగ్య సమస్యలతో కనిపిస్తే మీరు వైబ్రియో మందులు వాడండి తగ్గిపోతుంది అని సలహా ఇస్తున్నారు.

  ప్రస్తుతం పేషంటు కాలినొప్పి పూర్తిగా తగ్గిపోవడమే కాదు తనకు ఏ ఇతర సమస్యలు వచ్చినా వైబ్రియోనిక్స్ మందులే వాడుతున్నారు. 

 

చేతి వేళ్ళకు పక్షవాతం 03554...Guyana

2016 అక్టోబర్ 21 న 62-సంవత్సరాల మహిళ ఎడమ బొటనవేలుకు వాపు మరియు భరించరాని నొప్పి తో 5 నెలలు గా బాధ పడుతూ చికిత్సా నిపుణుని వద్దకు వచ్చారు. ఈ వాపు మెల్లిగా చెయ్యంతా వ్యాపించింది. ఆమె డాక్టర్ ను సంప్రదించగా అతను బొటనవేలుకు కన్నం పెట్టి దూది పెట్టాడు దానివల్ల నొప్పి నుండి కానీ వాపు నుండి కానీ నివారణ జరగలేదు. మరొక డాక్టర్ను సంప్రదించగా వేలికి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఆపరేషన్ చేసి మునపటి డాక్టర్ లోపల ఉంచిన దూదిని తొలగించే సరికి చీము ధారగా వచ్చేసింది. నొప్పి నివారణ టాబ్లెట్లు ఇవ్వడం వల్ల వాపు నొప్పి కూడా తగ్గింది కానీ మూడు వేళ్ళకు స్పర్శ జ్ఞానం పోయింది. ఆమె తన వేళ్ళను  మూయలేదు తెరవలేదు. 

ఈ పేషంటుకు చాలా సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పి కూడా ఉంది. డాక్టరు మోచిప్పలను మార్చే శస్త్ర చికిత్స చేయాలనీ కూడా చెప్పారట. ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది.

#1. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis…TDS in water

మూడు రోజులలో ఆమె వేళ్ళకు స్పర్శ జ్ఞానం తెలిసింది.రెండు వారాలలో 75% మెరుగుదల కనిపించి వేళ్ళను ముడిచి తెరవడం కూడా చేయగలిగింది. ఆ తర్వాత ఆమెకు క్రింది విధంగా రెమిడి వేరువేరుగా ఇవ్వబడింది.

చేతికి :
#2. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia…TDS

మోకాళ్ళ నొప్పికి :
#3. CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS
 2017 జనవరి 10 కల్లా వేళ్ళకు పూర్తి స్పర్శ కలిగింది. దీనితో  #2  OD గా తగ్గించడ మైనది. మే మొదటి వారానికి మందు తీసుకోవడం పూర్తిగా ఆపివేయడం జరిగింది. జూలై నెల లో కూడా వ్యాధికి సంభందించిన చిహ్నలేమి కనపడలేదు. ఐతే వేళ్ళను ఎక్కువగా ఉపయోగించ వలసివస్తే స్వల్పంగా నొప్పి అనిపించేది అలాగే మోకాళ్ళ నొప్పి కూడా 50% తగ్గిపోయింది. ఇక శస్త్ర చికిత్స కూడా అవసరం పడనందున ఆమె #3 నొప్పి పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఎసిడిటీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆర్థరైటిస్ 03552...Qatar

2016, జూలై 21 వ తేదీన  73 సంవత్సరాల వృద్ధుడు అనేక దీర్ఘకాలికమైన వ్యాధుల నిమిత్తం ప్రాక్టీషనర్ను సంప్రదించారు.30 సంవత్సరాలుగా గుండెమంట, ఎసిడిటీ తోబాధపడుతూ ఉన్నారు దీనికి యంటాసిడ్ మాత్రలు వేసుకుంటూనేఉన్నారు. అలాగే వీరికి 15 ఏళ్లుగా కాళ్ళకు దురదలు ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎర్రగా ఉన్నాయి. దీని నిమిత్తం డాక్టర్ వద్ద 12 ఏళ్లుగా మందులు కాళ్ళకు ఆయింట్మెంట్ వ్రాస్తూనే ఉన్నారు. ఇంతేకాక వీరు గత 5 సంవత్సరాలుగా కీళ్ళనొప్పులు ముఖ్యంగా మోకాళ్ళు మరియు భుజం  నొప్పితో బాధ పడుతూ 3 సంవత్సరాలుగా మందులు వాడుతున్నారు. ఇంత కాలంగా ఈ అన్ని రకాల వ్యాధులకు మందులు వాడుతున్నా కొంచం కూడా మెరుగవలేదు. చివరికి వారు ఈ ఎసిడిటీ తరుచుగా తాను చేసే ప్రయాణములవల్ల, సమయ పాలన పాటించకుండా తినే ఆహారపు అలవాట్ల వల్ల అని భావించారు. అలాగే కీళ్ళనొప్పులు జన్యుపరమైనవి గా కూడా తెలుసుకున్నారు.
ప్రాక్టీ షనర్ క్రిందిరెమిడీలనువీరికిఇచ్చారు:       

ఎసిడిటీమరియుమోకాళ్ళనొప్పులకోసం:
#1. CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS in water

 ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం :
#2. CC21.3 Skin allergies + CC21.7 Fungus…TDS in water

వీరు వైబ్రియోమందులతో పాటు అలోపతీమందులను కూడాతీసున్నారు. వారం తర్వాత వీరికి అసిడిటీ మామూలు కంటే బాగా పెరిగిపోయింది కానీ కాళ్ళ దురదలు 30% ,కీళ్ళనొప్పులు 50% వరకు తగ్గాయి. ఐతే నెల తరువాత మాత్రం ఎసిడిటీ 50% తగ్గగా కాళ్ళ దురదలు కీళ్ళనొప్పులు 80% శాతం వరకు తగ్గాయి.  

మరో రెండువారాలలో వీరికిఎసిడిటీలో 75% మెరుగదల కనిపించింది. కాలిదురద పూర్తిగా తగ్గింది. కనుక వీరుఫంగల్ ఇన్ఫెక్షన్నుంచి పూర్తిగాకోలుకున్నట్ట్లుభావించారు. మోకాళ్ళనొప్పులు 90% తగ్గిపోయాయి .అలోపతీ డాక్టర్ను సంప్రదించియాంటీఫంగల్  డోసేజ్ మరియు నొప్పినివారణలను తీసుకోవడం పూర్తిగా మానివేసారు.   

రెండు నెలలకు అతనికి ఎసిడిటీ విషయంలో 90% మెరుగుదల కనిపించింది కానీ కీళ్ళ నొప్పులు మాత్రం అలాగే ఉన్నాయి. కడుపులో మంట తగ్గడం చేత యాన్టాసిడ్ మాత్రలు కూడా తగ్గించారు. #2నెలవరకు ODగానూ దీనిని మెల్లిగా తగ్గించుకుంటూ  OW గా ఇచ్చిన గోళీలు అయిపోయినంత వరకు వాడవలసినదిగా సూచన చేయ నయినది.

మూడు నెలలు గడిచే సరికి స్వల్పంగా ఉన్న ఎసిడిటీ మరియు కీళ్ళనొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి.నవంబర్ చివరినాటికి నవంబర్ చివరినాటికి  #1 ను OD గా నెల వరకూ అనంతరం మెల్లిగా తగ్గించుకుంటూ OW మెయింటనెన్సు డోస్ గా తీసుకోవలసిందిగా సూచింపబడింది.

2017 జూలై నాటి వరకూ  #1ను OW. తీసుకున్నారు. ప్రస్తుతం యాన్టాసిడ్ లు తీసుకోవడం పూర్తిగా మానేసారు. ఎప్పుడయినా మసాలాలతో కూడిన భోజనం చేసినపుడు స్వల్పంగా మంట అనిపిస్తే ఒక యాన్టాసిడ్ ను వాడడం చేస్తున్నారు.అలాగే ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది.ఎప్పుడయినా వాతావరణ మార్పులకు ప్రయాణ బడలికలకు మోకాలి నొప్పి వచ్చినప్పుడు నొప్పి నివారిణి వేసుకుంటారు.

పార్శ్వపు నొప్పి 03552...Qatar

2016 సెప్టెంబర్ 5 వ తేదీన 27-సంవత్సరాల మహిళ ఐదు  సంవత్సరములుగా  తరుచుగా వచ్చే పార్శ్వపు నొప్పి తో(కనీసం నెలకు ఒకసారి) బాధపడుతూ చికిత్సా నిపుణిడిని సంప్రదించారు. ఆమెకు ముక్కు మృదులాస్థి వంకరగా ఉంది మరియు దాని నిర్మాణము కూడా పలుచగా ఉన్నది. ఆమెకు తరుచుగా తలపోటుకు కారణ మవుతున్న శ్లేష్మపొరనుండి వచ్చే పిలకలకు సంభందించి A CT స్కానింగ్ రిపోర్టు నెగిటివ్ గా వచ్చినది. వారసత్వ పరంగా కూడా ఈమె తండ్రి చెల్లెలికి ఈ వ్యాధి ఉన్నది. ఆమె మానసికమైన ఒత్తిడికి లోనైనా, బాగా ప్రకాశవంతంగా ఉన్న వెలుగును చూసినా, ఏవైనా అరుపులు, శబ్దాలు విన్నా ఈ నొప్పి వచ్చేస్తుంది. ఆమె నొప్పి వచ్చినప్పుడల్లా సాధారణంగా పారాసిటమల్ టాబ్లెట్ వేసుకుంటూ చీకటి గదికి పరిమితమయి పోయేది. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది.

CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest Infections chronic…TDS ఈ డోస్ ను  నొప్పి వచ్చినప్పుడల్లా ప్రతీ 10 నిమిషాలకు ఒక  డోస్ చొప్పున నొప్పి తగ్గేవరకు వేసుకోవలసిందిగా సూచింపబడింది. ఇంతేకాకుండా ఆమెకు ముక్కు వంకర ఉండడంతో శ్వాశకు ఇబ్బంది ఏర్పడుతున్నందున   CC19.3 Chest Infections chronic కూడా జత చేయడం జరిగింది.

రెమిడి తీసుకున్న మొదటి వారము నొప్పి తీవ్రత కొంత మందగించిందని ఆమె చెప్పారు. తరువాత మూడు వారాల వరకు మరలా నొప్పి రాలేదని ఆమె చెప్పారు. అంతేకాక రెండు నెలలవరకూ ఆమె పెళ్ళిళ్ళ నిమిత్తమో, పని నిమిత్తమో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నా కూడా నొప్పి కలగలేదని చెప్పారు. కనుక 3 నెలల తర్వాత డోసేజ్ BD కి తగ్గించడం, మరో మూడు వారాలు OD గా తీసుకోవడం తరువాత మానివేయడం జరిగింది. 

 2017 జూలై నాటికి  ఎప్పుడయినా బాగా శ్రమతోనో వత్తిడి తోనో కలిగే సాధారణ తలనొప్పి తప్ప పార్శ్వపు నొప్పి మాత్రం మరలా రాలేదని పేషంట్ చెప్పారు. 

 

దీర్ఘకాలిక ఎలర్జీ మరియు మలబద్దకం 11578...India

2016 ఏప్రిల్ 11 వ తేదీన, 35-సంవత్సరములమహిళ 8 సంవత్సరములుగా దగ్గుతో ఇబ్బందిపడుతూ చికిత్స నిమిత్తం ప్రాక్టీషనర్ను సంప్రదించారు. వీరికి డస్ట్ ఎలర్జీ ఉండడంతో ప్రతీరోజూ ఉదయం నిద్రలేవగానే నిరంతరాయంగా దగ్గువస్తుండం వలన ఛాతీలో నొప్పి వస్తోంది. వీరికిమలబద్దకం సమస్య సంవత్సరం నుంచి బాధిస్తూ ఆసనము వద్ద నొప్పికలగజేస్తోంది. ఆమె ఏ విదమైన వైధ్య సహాయం తీసుకోలేదు.

 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :

 దీర్ఘకాలికమైన దగ్గుకు :
#1. CC9.2 Infections acute + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies...TDS

మలబద్ధకానికి :
#2.  CC4.4 Constipation + CC4.10 Indigestion + CC12.1 Adult tonic...TDS

రెండు వారల తరువాత  ఆమెకు వ్యాధి లక్షణాలన్నింటి యందున  దాదాపు 100% మెరుగుదల కనిపించింది. ఉదయమే ఆమెను బాధించే దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. అలాగే మలబద్ధకం సమస్య మరియు దాని నుండి ఉత్పన్నమైన పురీషనాళము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆమె #1 మరియు #2 మరో రెండు వారాలు తీసుకున్నారు. ఆ తరువాత పేషంటు తనకు పూర్తిగా ఆరోగ్యము చేకూరినందువల్ల రెమిడి లు తీసుకోవడం మానివేసారు.  

సంపాదకుని వ్యాఖ్య :
ఈ పేషంటు బహుశా ఊరునుండి వెళ్ళిపోయినందువల్ల కావచ్చు వీరి ఆరోగ్యం గురించి ఇటీవల కాలంలో ఏ సమాచారము లేదు

తీవ్రమైన అస్తమా 11581...India

32-సంవత్సరాల మహిళను తీవ్రమైన అస్తమా వల్ల ఊపిరి అందకపోవడంతో 2016 సెప్టెంబర్ 16 న హాస్పిటల్ కి తీసుకెళ్ళడం జరిగింది. ఈమెకు చిన్నప్పటినుండి ఈ వ్యాధి ఉండడంతో పాటు ఇస్నోఫిలియ కౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉండడం తో ఆమె ఇన్హేలర్ ఉపయోగించేవారు. ఈ విధంగా 10-15 సంవత్సరాలుగా అస్తమా వల్ల పెద్దగా ఇబ్బందేమీ లేదు కానీ ఎప్పుడయినా వాతావరణం తేమగా ఉన్నప్పుడు ఆమెకు జలుబు దగ్గు వస్తూఉండేవి. ఐతే గత రెండు నెలలుగా ఈమెకు తరుచుగా జలుబు చేస్తూ ఆకుపచ్చని కళ్ళే తోపాటు ఊపిరి తీసుకునేటప్పుడు గరగర శబ్దం కూడా వస్తోంది. 

హాస్పిటల్లో ఈమెను డాక్టర్ చూసినప్పుడు ఊపిరి అందకపోవడము, గొంతులో గరగర శబ్దంతో చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. డాక్టర్ ఆమెకు 5 రోజులవరకూ యాంటిబయోటిక్స్ వాడమని చెపుతూ 5 రకాల మందులను వ్రాసారు. ఈ 5 రోజులలో ఆమెకు తగ్గక పొతే అస్తమా కలిగినప్పుడల్లా నెబ్యులైజెర్ ఉపయోగించ వలసి వస్తుందని డాక్టర్ చెప్పారు. ఆమె మందులు తీసుకోకుండా ప్రాక్టీ షనర్ ను సంప్రదించడంతో ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.

#1. CC10.1 Emergencies…ప్రతీ 10 నిమిషాలకు నీటితో

#2. CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack + CC19.6 Cough chronic…6TD

ఈమె అలోపతిక్ మందులు ఏమీ తీసుకోకుండా కేవలం వైబ్రో రెమిడి లనే తీసుకున్నారు.

ఒక గంట తర్వాత గొంతులో గరగర ఆగిపోవడంతో #1 ను ఆపివేయడం జరిగింది. ఆ రాత్రి ఈమెకు హాయిగా నిద్రపట్టింది. రెండు రోజులలో ఆమెకు వచ్చే కళ్ళె రంగు ఆకుపచ్చ నుండి పసుపు పచ్చకు మారిపోయి వ్యాధినుండి 60% మెరుగుదల కనిపించింది. మూడవ రోజుకల్లా #2 ను క్రింది విధంగా మార్చారు:

#3. CC8.1 Female tonic + CC9.2 Infections acute + #2...6TD

వారం తర్వాత ఆమెకు వ్యాధి నుండి 100% నివారణ కలగడంతో #3 TDS గా రెండువారాలు, BD గా మరొక వారము OD గా నాలుగు వారాలు చివరిగా OW ప్రివెంటివ్ డోసేజ్ గా తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది. చివరిసారిగా 2016 డిసెంబర్ 8 వ తేదీన ఈమె ప్రాక్టీషనర్ ను కలిసినపుడు తనకు పూర్తిగా నయంయ్యిందని ఒక్కసారికూడా వ్యాధివల్ల ఇబ్బంది కలగలేదని చెప్పడంతో మరొక నెల డోసేజ్ ను OW గా తీసుకోమని సూచించడం జరిగింది. 

సంపాదకుని వ్యాఖ్య :
ఈ ప్రాక్టీషనర్ CC8.1 Female tonic మహిళా రోగులలో వ్యాధినిరోధక శక్తి పెంచుతుందని తెలుసుకున్నారు.

ఉదరంలో తిమ్మిరులు 03542...UK

2016 నవంబర్ 20 వ తేదీన 8 సంవత్సరాల పాపకు భరింపరానిది నొప్పి రావడంతో పాప బాధను చూచి తట్టుకోలేక ఆమె తల్లి ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. పాపకు గతంలో ఇటువంటి నొప్పి ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం ఈ నొప్పికి మందులేమి తీసుకోలేదు. అసలు విషయం ఏమిటంటే ఆరోజు మధ్యాహ్నం పాల్గొనవలసి ఉండిన ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కోసం పాప కొన్ని నెలలుగా ప్రాక్టీసు చేస్తోంది. పాప పరిస్థితి దృష్ట్యా పాపకు క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…6TD

పాప వెంటనే కోలుకోవడమేకాక రెమిడీ ఉపయోగించిన కొద్దిగంటలలోనే డ్యాన్స్ ప్రోగ్రాం లోకూడా పాల్గొన్నారు. డోసేజ్  తరువాత రెండురోజుల వరకు TDS  కు తగ్గించి తరువాత విరామం ఇవ్వబడింది. 2017 జూలై నాటి వరకూ తెలిసిన సమాచారం ప్రకారము పాపకు ఈ వ్యాధి తిరిగి తలెత్తలేదు. 

  పేషెంట్ యొక్కతల్లి వ్యాఖ్యలు  :
  మొదటిడోస్ వేసుకోగానే అమ్మాయికి ఎంతో మెరుగనిపించింది. నేను ప్రతీ రెండుగంటలకు ఒకసారి రెమిడి వేయసాగాను. ఎంత అద్భుతం జరిగిందంటే అంత త్వరగా కోలుకోవడం నేను కనీసం కలలో కూడా ఉహించలేదు. ఆ తరువాత నొప్పిగానీ మరి ఏ ఇతర ఇబ్బంది లేకుండా మా అమ్మాయి ఆనందంగా ఉండగలిగింది . అంతేకాక  పూర్తిగా కోలుకొని యధా స్థితికి వచ్చేసింది అంటూ ఆ తల్లి వైబ్రియోనిక్స్ కు మరియు భగవంతుడికి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

సంపాదకుని వ్యాఖ్య :
ఇటువంటి ఎక్యుట్ కేసులలో ప్రతీ పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున రెండు గంటల వరకు ఇచ్చి తరువాత డోసేజ్ ను 6TD.కి తగ్గించ వచ్చు .

ప్రాక్టీషనర్ ప్రొఫైల్ 02308...Slovenia

ప్రాక్టీషనర్ 02308…స్లొవేనియా  వీరు స్లొవేనియా దేశానికి చెందిన సీనియర్ వైబ్రియో నిపుణులు. వైబ్రియోనిక్స్ పట్ల వీరి నిస్వార్ధ సేవ అంకిత భావం అసాధారణమైనది. వీరు మొట్టమొదట స్వామి గురించి ఎల్ జుబుల్జన ఆధ్యాత్మిక సంస్థ ద్వారా విన్నారు. అదే వీరిని 2001 అక్టోబర్ లో స్వామిని పుట్టపర్తిలో దర్శించుకొనేలా చేసింది. ఆమె తిరిగి తమ దేశం వచ్చేముందు చేసుకున్న చివరి దర్శనంలో స్వామి ఆమె వంక చూసిన దీర్ఘమైన చూపు ఆమెను రెండు రోజులు ఏడ్చేలా చేసింది. ఐతే ఆ చూపే అనేక సంవత్సరాలుగా ఆమె ఆందోళన, మానసిక వ్యధ, కొడుకును కోల్పోయిన శోకమునుండి దూరము చేసిందని భావిస్తోంది. ఇదే సందర్భంలో ఈమె చదివిన పుస్తకం ‘’ద పాత్ ఆఫ్ మాస్టర్స్’’ లో శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువే అతనిని వెతుక్కుంటూ వస్తాడని స్వామియే తన సద్గురువని తెలుసుకో గలిగారు ”.

2002 వ సంవత్సరం జూలై నెల గురుపూర్ణిమ సందర్భంగా ఆమె రెండవ సారి పుట్టపర్తి ని సందర్శించినప్పుడు వీరి వైబ్రియోనిక్స్ ప్రస్థానం మొదలయ్యింది. ఆమెకు నిస్వార్ధ సేవ చేయడానికి వీలున్న అవకాశాలు గురించి తెలుసుకోవాలనే తపన తీవ్రంగా ఉండేది. త్వరలోనే అనగా ఆమె ఆశ్రమం లో ఉన్న మూడవరోజున చైతన్య జ్యోతి సంగ్రహాలయం లో షిర్డీసాయి విగ్రహాల వద్ద సేవ చేసే అవకాశము లభించింది. అంతేకాకుండా అప్పుడు ప్రశాంతినిలయం లో సేవ పైన ప్రపంచ సదస్సు జరుగుతోంది. ఇది ఆమెకు ఒక అనుకోని అవకాశము. ఈ సదస్సు ఆమెకు  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధరకాల సేవలు సేవ సంస్థలు గురించి తెలపడంతోపాటు తాను 15 ఏళ్లుగా తమ ఊరికి రెడ్ క్రాస్ కార్యకర్తగా చేసిన సేవను గుర్తుకు తెచ్చింది.

ఈ సదస్సు లోనే ఎక్కువ సమయం కింద కూర్చునివున్న కారణంగా ఆమెకు నడుము నొప్పి మొదలయ్యిది. తనకు తెలిసిన మరో స్లోవేనియన్ దేశస్తురాలు వైబ్రియోనిక్స్ ట్రీట్మెంట్ తీసుకోవలసిందిగా సూచించినది. ఆ ట్రీట్మెంట్ ఆమెలో ఎంత ఉత్సుకతను రేపిందంటే వెంటనే  SRHVP ఉపయోగించే విధానము తెలుసుకొనడానికి పేరు నమోదు చేయించుకున్నారు. ఆమె గత సంవత్సరమే ఆంగ్లము స్లోవేనియా బోధించే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయినిగా ఉద్యోగ్ విరమణ పొంది ఉన్నందున డాక్టర్ అగ్గర్వాల్ గారు ఆమె భాషా ప్రవీణ్యమును చిన్న చిన్న ఆర్టికల్స్ ఆంగ్లము నుండి స్లొవేనియా కు తర్జుమా చేయుటకు వినియోగించ వలసిందిగా కోరారు. ఈ అంకురమే ఈ నాడు స్లొవేనియా చికిత్సా నిపుణులకు పుష్కలంగా వారి భాష లో వైబ్రో సాహిత్యం లభించడానికి కారణమయ్యింది.  

చేతిలో కావలసినంత సమయం సేవ చేయాలనే తపన ఉండడం తో వీరు పూర్తిగా వైబ్రియో సేవలో మునిగిపోయారు. ఈ సేవే వీరిని నశ్వరమైన ప్రాపంచిక వ్యవహారాలనుండి వ్యామోహములనుండి దూరం చేసి భగవత్ సంబంధమైన అమృతాన్ని చవి చూసేలా చేసింది. ఇలా ప్రతీ రోజు చేయడం ద్వారా మదర్ థెరిసా చెప్పిన సూక్తి ‘’ఇతరుల కోసం నాకోసం ప్రతిరోజూ సేవ చేయాలి’’ ఇది ఆమె ఆలోచనలు, మాటలు, చేతలు ఒకటవడానికి చక్కని సాధన గా ఉపయోగ పడింది.  

వీరి మూడవ పుట్టపర్తి సందర్శనం లో ఒక పరీక్షా కాలమును ఎదుర్కోవలసి వచ్చింది. 2002 డిసెంబర్ లో వీరు న్యుమోనియా తో హాస్పిటల్ లో చేరవలసి వచ్చింది. నెల తర్వాత ఆమె స్లొవేనియా వెళ్ళినప్పుడు తన బరువు 10 కేజీలు తగ్గిపోవడం తో పాటు చాలా నీరసంగా అయిపోయారు. తనకు దగ్గరలో ఉన్న ప్రాక్టీషనర్ 02264 వద్దకు వెళ్లారు కానీ రెమిడి లు తానే తయారు చేసుకున్నారు. తిరిగి తను కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ఐతే ఈ పరిక్షా కాలాన్ని ఆమె ప్రక్షాలనా కాలం గా భావించారు. బాధే బాబా బోధన గా భావించి సేవలోనే నిమగ్నమైనారు.

2008 లో బ్రెస్ట్ కేన్సర్ మూడవ స్థాయి లో ఉన్న ఈ ప్రాక్టీషనర్ తనకు తానే  వైద్యం చేసుకుంటున్నప్పుడు (అలోపతి వైద్యం తీసుకుంటూ) తన జీవితములో  ఒక అపూర్వ సంఘటన గా వీరు కేన్సర్ బారినుండి స్వామి దయతో అద్బుతంగా కోలుకోవడం  జరిగింది. అనంతరం వీరు ముంబాయి లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయి స్పిరిట్యువల్ ఎడ్యుకేషన్ లో మానవతా విలువల పైన జరిగిన సర్టిఫికేట్ కోర్సు లో కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు వర్కు కోసం ‘’ఆరోగ్యము మరియు మానవతా విలువలు’’ టాపిక్ ను వైబ్రియోనిక్స్ కు ప్రాముఖ్యత నిస్తూ తయారు చేసి సమర్పించారు.

వీరు తనవద్దకు వైద్యం నిమిత్తం వచ్చే పేషంట్లను స్వామినే పంపిస్తున్నారని భావిస్తారు. ముఖ్యంగా డిప్రెషన్ మరియు కేన్సర్ వ్యాధి గ్రస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఎందుకంటే  ఈ రెండు వ్యాధుల విషయంలో స్వామి తనకు నేర్పిన వ్యక్తిగత అనుభవాన్ని రంగరించి లోతైన అధ్యయనం చేసి రెమిడి ఇస్తూ ఉంటారు. గత 15 సంవత్సరాలుగా వైబ్రియో సేవతోపాటు స్వామి ఎల్ జుబుల్జన  సాయి సెంటర్ లో వీరికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అంతేకాక  వార్తాలేఖలను అనువాదం చేయడంద్వారా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నానని ఇతర చికిత్సా నిపుణుల అనుభవాల ద్వారా ఎంతో నేర్చుకునేందుకు అవకాశం కలిగిందని వీరు భావిస్తున్నారు.

సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి సేవాకార్యక్రమాలు మరింత వ్యాప్తి చేస్తూ పోయారు. వీరు పేషంట్లకు వైద్యం అందించే నిమిత్తం ప్రత్యేకమైన విధానమేమి అనుసరించరు కానీ వారిలో ప్రేరణ కలిగించడానికి కొన్ని ప్రత్యేకమైన సూక్తులు చెపుతూ ఉంటారు. ఉదాహరణకి ‘’ మనం ఎప్పటికీ ఉండాలనే భావనతోనే పనిచేద్దాం కానీ రేపే వెళ్ళిపోవలసి వచ్చినా సిద్ధపడే ఉందాం.’’ అంతేకాక వీరు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత  కమ్యునిజం ప్రబలంగా ఉన్న యుగోస్లేవియాలో పాఠశాల విద్య  నేర్చుకున్నారు కనుక ‘’అందరికోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ’’ అనే భావజాలం ఆమెలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది.

 ప్రాక్టీషనర్  02264 మరియు  ప్రాక్టీషనర్  00512 లు ఇచ్చిన సలహాలు, సూచనలు, అపూర్వ అనుభావల ద్వారా తనలో మార్పుకు దోహద పడినందుకు వారికి తన హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియ జేస్తున్నారు. 

పంచుకున్నకేసులవివరాలు:

ప్రాక్టీషనర్ ప్రొఫైల్ 11422...India

ప్రాక్టీషనర్ 11422…ఇండియా  వీరు సత్యసాయి సేవా సంస్థలో కీలక పాత్ర నిర్వహిస్తూనే  వై బ్రియోనిక్స్ కు చేసిన సేవ అనుపమానము. వీరు వైబ్రియోనిక్స్ పైన నిర్వహింపబడే అవగాహనా సదస్సులకు హాజరవుతూనే కొత్తగా AVP శిక్షణ తీసుకున్న వారికి మెంటరింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇటివలే వార్తాలేఖలకు వెల్ నెస్ పైన ఒక  చక్కటి డాక్యుమెంట్ కూడా వ్రాసారు. ఉన్నతమైన విద్యా ప్రావీణ్యాలను కలిగి ఉన్న వీరు 25 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థలో పనిచేస్తూ క్రమంగా కంపెనీ సెక్రెటరీ గానూ జెనరల్ మేనేజర్ గానూ భాద్యతలను నిర్వహించారు. 2014 ఏప్రిల్ లో ఉద్యోగ విరమణ పొందిన వీరు అప్పటి నుండి పుట్టపర్తి లోనే స్థిర నివాసము ఏర్పాటు చేసుకున్నారు.

ఈమె 1999 లో బాబావారి డిల్లీ సందర్శన సందర్భంలో వాలంటీర్ గా సాయిమార్గం లోకి ప్రవేశించారు. డిల్లీ సేవాదళ్ తో పాటు ప్రశాంతినిలయం సేవకు వెళ్ళినప్పటి నుండి భజనలు, మురికివాడల లో బాలవికాస్ చెప్పడం, వేదం చెప్పడం, స్టడీ సర్కిల్ నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. వీరు 2011 లో డిల్లీ సాయి సంస్థ వారు, అభిరుచి గల భక్తులు సాయి వైబ్రియోనిక్స్ లో శిక్షణ పొందడానికి పేర్లు నమోదు చేసుకోవలసిందిగా కోరినప్పుడు తమ పేరును సూచించారు. ప్రాక్టీషనర్ గా కావాలనే కోరిక తో ఉన్నప్పటికీ గుర్తింపు పొందిన సంస్థ నుండి శిక్షణ తీసుకోకుండా ఈ సేవ ఎలా నిర్వహించాలి ఇలా కొన్ని సందేహాలు ఆమెను పీడిస్తూ ఉండేవి. ఐతే డాక్టర్ అగ్గర్వాల్ గారి దగ్గర సందేహ నివృత్తి పొంది శిక్షణ తీసుకొని AVP కోర్సు పూర్తి చేసారు.

ఈ ప్రాక్టీషనర్ తన ఇంటిలోనూ, తను పనిచేసే ప్రదేశములోనూ, మరియు వీరికి దగ్గరలో ఉన్న మురికివాడలో ఉన్న బాలవికాస్ పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు అనువుగా ప్రతీ ఆదివారము పేషంట్లను చూడడం ప్రారంభించారు. మొదట పేషంట్లను చూసేటప్పుడు భయాందోళనకు లోనయ్యి కొంత ఇబ్బంది పడ్డా  ఈ సేవ వీరికి ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. ఒకసారి ఒక  పేషంటుకు చేసిన వైద్యం చక్కని ఫలితాన్ని ఇవ్వడంతో వీరికి నమ్మకం కలిగి భయం దూరమయ్యింది. ఒక 60 సంవత్సరాల వృద్ద మహిళ కాలి మడమలలో  నొప్పి మరియు  పాదంలో వాపుతో వీరిదగ్గారికి వచ్చారు. ఆమెకు CC20.3 Arthritis ను ఇచ్చారు. ఆ రాత్రి  ఆమెకు తీవ్రమైన పులౌట్ వల్ల విపరీతంగా నొప్పులతో బాధ పడ్డారు కానీ ఆశ్చర్యకరంగా తెల్లవారేసరికి నొప్పులు మడమ లో వాపు కూడా మాయమవడం  వీరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

2013 ఏప్రిల్ లో SVP శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత త్వరలోనే SRHVP  మిషన్ ద్వారా ఇచ్చే రెమిడిలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో తెలుసుకున్నారు. ఒక 30 సంవత్సరాల మహిళ  తన కవల సోదరుని పోగొట్టుకున్న బాధతో పక్షవాతం వచ్చి కుడి కాలు చెయ్యి పడిపోవడంతో 6 నెలల తర్వాత ప్రాక్టీషనర్ వద్దకు వచ్చారు. ఈ పేషంటుకు వీరు NM25 Shock ను ఇచ్చారు. మొదటి రోజు 3 డోసులు తీసుకున్న తరువాత ఆమెకు తలపోటు, జ్వరం, వాంతులు వంటి లక్షణాలతో తీవ్రమైన పులౌట్ వచ్చింది. దీనితో డోస్ ఆపివేయడం జరిగింది. వారం తర్వాత ఆమెను డోస్ తిరిగి ప్రారంభింప వలసిందిగా ప్రాక్టీషనర్ కోరారు. నెల తరువాత ఆమె తన పరిస్థితి గురించి వివరించినప్పుడు తన కాళ్ళు, చేతులు సాధారణ స్థాయికి వచ్చేసాయని చెప్పారు.

వైబ్రియో పైన  వీరికి ఉన్న అపారమైన నమ్మకం, సేవ చేయాలనే తపన ఉన్నప్పటికీ వీరి యొక్క వృత్తికి సంబంధించిన పనుల వల్ల వీరి ప్రాక్టీసు చాల మెల్లిగా నడిచేది. ఇంతేకాక ఇంట్లోనే కేన్సర్ పేషంటు ను చూసుకోవలసిన పరిస్థితి. 2013 నవంబర్ లోనే ఆపరేషన్ ద్వారా వీరి ఆరోగ్యం మెరుగు పడ్డప్పటికీ,  పనుల వత్తిడి అనే వల నుండి మాత్రం బయట పడలేకపోవడం చాలా విచారకరం. క్రియయోగం ప్రాక్టీసు మరియు వైబ్రియోనిక్స్ వల్ల మాత్రమే తాను త్వరగా కోలుకోగాలిగానని వీరు చెపుతున్నారు.

2014 ఏప్రిల్ నెలలో వీరు రిటైర్ ఐన తర్వాత తమ పూర్తి సమయాన్ని వైబ్రో  కార్యక్రమాలకే వెచ్చించ సాగారు. వీరు 2014,15 సంవత్సరాలలో టీచర్ ట్రైనింగ్ నేర్చుకున్నారు. ప్రస్తుతం వీరు AVP లకు శిక్షణ ఇవ్వడమే కాక సంవత్సరం నుండి క్రొత్త ప్రాక్టీషనర్ లకు మెంటరింగ్  కూడా చేస్తున్నారు. దీనికి అదనంగా ప్రతిరోజూ పేషంట్లను చూడడము వార్తాలేఖలకు అనువాదం వంటి అన్ని కార్యక్రమము లలో పాల్గొంటున్నారు.

ప్రాక్టీ షనర్ గా వీరు కొన్ని కొమ్బో రెమిడి లు ఎంపిక చేసిన రెమిడి లతో పాటు కలిపి వాడడం వల్ల అద్భుతంగ పనిచేస్తున్నట్లు తెలుసుకోగాలిగారు:

  • దీర్ఘకాలిక కండరాల నొప్పి: ఈ నొప్పి ఎదైనా ఆక్సిడెంట్ వలన కానీ హఠాత్తుగా కలిగిన కుదుపు వలన కానీ, బాల్యంలో ఏర్పడిన సమస్య వలన కానీ కలిగిన నొప్పి ఐనట్లయితే దానికి తగినట్లుగా ఇచ్చే రెమిడి (ఉదా. CC20.3 Arthritis మోకాళ్ళ నొప్పికి, CC20.5 Spine వెన్నునొప్పి కి లేక  CC18.5 Neuralgia నరాల సంబంధితమైన నొప్పికి) కానీ వీటితో పాటు  CC10.1 Emergencies + CC20.7 Fractures లను పైన పేర్కొన్న రెమిడి తో పాటు కలిపి ఇచ్చినట్లయితే ఫలితం త్వరగా లభిస్తుంది. మిగతా SMJ కేసుల విషయంలో CC17.2 Cleansing ను కలిపి నట్లయితే అద్భుతాలు కలుగుతాయి. దీనితో పాటు యువతులకు CC8.1 Female tonic ను పెద్దవయసు కలవారికి  CC20.6 ను మరియు CC8.6 Menopause ను మెనోపాజ్ స్థితి లో ఉన్న మహిళలకు ఇచ్చినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
  • తరుచుగావచ్చేతలపోటు: మాములుగా తలపోటుకు ఇచ్చే కొమ్బో తో పాటు అదనంగా  CC3.7 Circulation + CC4.10 Indigestion + CC17.2 Cleansing ఇచ్చినట్లయితే ఫలితం అద్భుతంగా ఉంటుంది.
  • కాలిన లేదా తెగినందున కలిగే గాయాలకు : ఈ క్రింద చెప్పిన రెండు డ్రాపర్ బాటిళ్ళను మీకు అందుబాటులో     ఉంచుకోండి : CC10.1 Emergencies + CC21.1 Skin tonic + CC21.4 Stings & Bites కాలిన గాయాలకు/లేక  CC21.11 Wound & Abrasions తెగిన గాయాలకు నీటితో కలిపి ఇవ్వాలి. కాలిన లేదా తెగిన గాయాలకు రెమిడి కలిపిన నీటిని ఒక నిమిషం పాటు ధారగా పోసి అనంతరం 5 నిమిషాలకు ఒకసారి అలా ఒక గంట సమయం ఆ తర్వాత అవసరం మేరకు దీనిని తగ్గిస్తూ రావాలి. ఇలా 24 గంటల కాలం చేయగలిగితే మరునాటికి కనీసం గుర్తు కూడా మిగిలకుండా గాయాలు మాయమవుతాయి. అవసరం మేరకు బాటిల్ లో నీరు నింపి బాగా కదపడంద్వారా రెమిడి భర్తీ చేసుకోవచ్చు.   

వైబ్రియోనిక్స్ ను ప్రాక్టీసు చేస్తూ ఉన్నప్పుడు మానవ దేహం యొక్క బాహ్య మరియు అంతర నిర్మాణము దానిలో ఉన్న సూక్ష్మ దేహాలు అవి సృష్టి కర్త ఐన భగవంతునితో అనుసంధానింప బడిన తీరు నిజంగా ఇది ఒక అద్బుత నిర్మాణము అనిపించేది. అంతేకాకుండా స్వామి అడుగడుగునా ఆమెకు తోడ్పాటును అందిస్తూ లోనున్న ఆత్మను తెలుసుకొనడానికి మరియు మరింతగా అంతర్ద్రుష్టిని పెంపొందించుకొనే దిశ వైపు నడిపిస్తున్నారని అంతేకాక ప్రతిరోజూ కూడా లోనున్న పరమాత్మ తో చేరికకు అడుగులు వేస్తున్నాన్నే అనుభవం వారు పెంపొందించు కోగలిగారు.

పంచుకున్న కేసుల వివరాలు :

  •  

జవాబుల విభాగం

ప్రశ్న 1: మన చెవులనుండి గులిమిని తీసే మార్గం ఏమైనా ఉందా నేను  CC5.1…TDS rక్రమం తప్పకుండా తీసుకున్నాను కానీ నా చెవులలో ఇంకా అవరోధాలున్నాయి ?

    జవాబు 1: మీరు ఉపయోగించిన రెమిడి సరయినదే కానీ దాన్ని కేవలం లోపలి మాత్రమే తీసుకున్నారు. దీనితో పాటు  CC5.1 Ear Infections కొన్ని చుక్కలు ఆలివ్ నూనెలో పోసి ఒక  పరిశుభ్రమైన డ్రాపర్ లోనికి కొన్ని చుక్కలు తీసుకొని మెత్తని పరిశుభ్రమైన గుడ్డతో చెవిరంధ్రపు ముందుభాగాన్ని తుడిచి చెవి గూబను పైకి పట్టుకొనిచెవిలోనికి డ్రాపర్ తో 2,3, చుక్కలు గులిమి ఉన్న ప్రాంతంలో వెయ్యాలి. ఈ ఆయిల్ బయటకు రాకుండా దూదితో వెంటనే చెవి రంధ్రాన్ని మూసివెయ్యాలి. ఇలా రోజుకు రెండు సార్లు(BD) చేస్తే కొద్ది రోజుల్లో గులిమి బయటకు వచ్చేస్తుంది.

________________________________________

ప్రశ్న 2: రెండవసారి వైద్యం కోసం రాని పేషంట్లకు నమ్మకం కలిగించే రీతిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి

    జవాబు  2: మాయొక్క అమెరికా మరియు కెనడా బృందాలు శిబిరాలలో చర్చించుకున్న అంశాలను బట్టి ఐదు విధములయిన చర్యలు చాలా ప్రయోజనాత్మకంగా ఉన్నట్లు ప్రాక్టీ షనర్ ల అనుభావల ద్వారా తెలియ వచ్చింది. పేషంట్లను ఫోన్ ద్వారా ఇమెయిల్ ద్వారా పదే పదే విసిగించ కుండా ఉండవలసిందిగా సూచన చేయబడింది. ఐతే ఈ రాకెట్ వేగంతో దూసుకుపోయే యుగంలో ఎప్పుడో ఒకసారి గుర్తుచేయడం అనేది ప్రయోజనాత్మక మైనదే. పేషంట్లను వార్తలేఖలను చదవమని ప్రోత్సహించడం శ్రేయోదాయకం. క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి:

a.  పేషంటు మూడునెలలవరకు చికిత్సానిపుణులతో ఉత్తరప్రత్త్యుత్తరాలు జరపకుండా ఉంటే ఆ పేషంటు యొక్క అభివృద్ధి తెలుసుకునే నిమిత్తం వారికి మెయిల్ పంపించవలసిందిగా సూచన. కారణ మేమంటే మాకు అందిన సమాచారం ప్రకారం చాలా సందర్భాలలో పేషంట్లు ఈ రెమిడి ల వల్ల చక్కని ఫలితం పొందినప్పటికీ తగ్గిపోయింది కదా పాపం ఆ ప్రాక్టీషనర్ ను ఎందుకు ఇబ్బంది పెట్టలిలే అని మౌనంగా ఉన్న సందర్భాలే ఎక్కువ.  

b.  మీ ఈమెయిలు కు రెండు నెలలకు ఒకసారి వచ్చే వార్తాలేఖ కార్బన్ కాపి మాదిరి మీ పేషంట్ లకు పంపిస్తూ మీరు పేషంట్లకే కాక వారి ఇంట్లో మొక్కలకు జంతువులకు మీవైద్యం అందుబాటులో ఉన్నదని తెలపాలి. అమెరికాలో ఉన్న ఒక ప్రాక్టీషనర్ తమ పేషంట్ల నిమిత్తం పెట్టిన ఒక నోట్ (సూచన )ను ఉదాహరణగా ఇక్కడ పొందుపరుస్తున్నాము.
ప్రియమైన మిత్రులారా సాయిరాం ,
పగలంతా పనితో అలసటకు గురిఅవుతూ రాత్రిళ్ళు ఆదమరిచి హాయిగా నిదురించే మీకు మీ కుటుంబానికి ఆనందానుభూతి  కలగాలనీ మీ గృహము శాంతి ప్రేమలతో  వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు ఉపయుక్తముగా ఉండేందుకు  గానూ సాయి వైబ్రియోనిక్స్ మే/జూన్ న్యూస్ లెటర్ లింక్ ను మీకు పంపిస్తున్నానుhttp://vibrionics.org/jvibro/newsletters/english/News%202017-05%20May-Jun%20H.pdfఇలా నేను పంపే ద్వైమాసిక మెయిల్ పట్ల మీకు అభిరుచి లేనట్లయితే దయచేసి  తెలియజేయండి దీనిని పంపడం ఆపివేస్తాను  

c.  పేషంటు యొక్కవ్యాధికి లేదా అట్టి లక్షణాలతో కూడిన వివరాలు వార్తాలేఖ లో ఉన్నట్లయితే దానిని వారికి మెయిల్చేయండి. దీని వల్ల పేషంటులు తమపైన ప్రత్యేక శ్రద్ధ కనబరచినందుకు ఎంతో ఆనందిస్తారు.      

d.   మీరు సెలవుల నిమిత్తం ఊరువెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితేకొన్ని వారాల ముందుగానే మీపేషంటుకు సమాచారంఇవ్వండి. ఇందువల్ల వారు తమ రెమిడి బాటిళ్ళ ను అవసరం మేరకు నింపి ఉంచుకుంటారు.

e.   ఎవరయినా పేషంటు నుండి 4-6 నెలలు సమాచార లోపం ఏర్పడితే ఇమెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ సంప్రదించడం మంచిది. ఆ పేషంటు తీసుకున్న రెమిడి ఎక్స్పయరి డేట్ ఐపోయింది కనుక తిరిగి కొత్తగా మందులు తీసుకోవలసిందిగా సూచించండి. ఈ సూచన చాలామంది ప్రాక్టీషనర్ లకు ప్రయోజనకారి అయ్యింది. 

________________________________________

ప్రశ్న 3:  శరీరం నుండి శస్త్రచికిత్స ద్వారా తొలగించ బడిన భాగానికి రెమిడి ఇవ్వవచ్చా?

    జవాబు  3: ఔను శరీరం లోని భాగమును తొలగించి నప్పటికీ దానికి సంభందించిన రెమిడి ఇవ్వవచ్చు. కారణమేమంటే ‘’ఫాంటమ్  ఫలితం ‘’ ప్రకారము  భౌతికంగా ఉన్న శరీరంలోని అంగాన్ని తొలగించినా సూక్ష్మ లేదా ఎతెరిక్ బాడీకి చెందిన భాగము కంటికి కనిపించనప్పటికిని తొలగించబడిన స్థానంలో తప్పనిసరిగా ఉంటుంది. మనమిచ్చే రెమిడి ఆ భాగానికి చెందిన చక్రాన్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా ఆ భాగాన్ని స్వస్థత చేకూరుస్తుంది.

________________________________________

ప్రశ్న 4:  నా స్నేహితుని యొక్క మూడేళ్ళ పాపకు ఏది తిన్నా ఎలెర్జి  వచ్చేస్తుంది. కనీసం పంచదార కూడా ఆమెకు పడదు. ఆమె తల్లి వైబ్రియో రెమిడి ప్రయత్నించాలనిభావిస్తున్నారు. కానీ  ఆ పాపకు  చెక్కెర పడక పొతే ఏరూపంలో రెమిడి ఇవ్వాలనేది నిశ్చయించు కోలేక పోతున్నాను.

    జవాబు 4: మొట్ట మొదట ఆ అబ్బాయి పంచదార తీసుకుంటే ఎటువంటి వ్యాధిచిహ్నాలను కనబరుస్తూ ఉన్నాడనేది తెలుసుకోవాలి. ఒకొక్కసారి పిల్లలు చెక్కెర పదార్ధాలు తినడం వలన హైపర్ యాక్టివ్ గా ఉన్నట్లయితే దానిని వ్యాధిగా పొరపాటుఫడుతూ ఉంటాం. ఈ కేసు విషయంలో అదే కనుక నిజమైతే నిరభ్యంతరంగా మన వైబ్రో పిల్స్ ఇవ్వవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క గోళిలో(ఒక డోస్) చాలా తక్కువ మోతాదులోనే చెక్కర ఉంటుంది. ఒకవేళ ఈ మోతాదునే నీటితో( సాధారణంగా మనం సూచించే విధానము)ఇచ్చినట్లయితే ఇక దానిలో చెక్కర అసలు లేనట్లే భావించాలి. ఒక వేళ డాక్టరు చెక్కెర తీసుకోవద్దని ప్రత్యేకంగా బాబుకు చెప్పి ఉంటే రెమిడి లను వారి కరికననుసరించి నీటిలో గానీ విభూతితో గానీ కలిపి ఇవ్వడం మంచిది. మన  శరీరములోని కణాలలోనూరక్తంలోనూ చెక్కెర ఒక భాగం కనుక వైబ్రియోనిక్స్ రెమిడిలను చిన్న చిన్న చెక్కెర గోళీల రూపంలో ఇస్తూ ఉంటాము. 

________________________________________

ప్రశ్న 5: దయచేసి నా రెమిడీబాటిల్ సెల్ఫోను లేదా కంప్యూటరు కు ఎంత దూరంగా ఉండాలో సూచించండి.

    జవాబు 5: మీరెమిడీబాటిల్నుకంప్యూటరు, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్, విమానాశ్రయంలో వాడే ఎక్సరే మిషన్ వంటి బలమైన ఎలక్ట్రో మాగ్నెట్ రెడీయేషన్ విడుదల చేసే ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి ఒక మీటరు లేదా మూడు అడుగుల దూరంలో ఉంచండి. రెమిడీ బాటిల్నుబాటిల్ ఫ్రిజ్లో కూడా పెట్టకూడదు. బ్యాటరీలు వైబ్రేషను పైన ప్రభావం కలిగించవు.

ప్రధాన వైద్యుడు యొక్క దివ్య వాక్కు

"జీవరాసులన్నిటిలోను మానవుడు మాత్రమే ప్రకృతిసిద్ధంగా దొరికే సహజమైన ఆహారాన్ని ఇష్టపడడు. మిగతా జీవరాసులన్నీ ధాన్యము, ఆకులు, రెమ్మలు, పండ్లు ఇవన్నీ ఏరూపంలో లభిస్తాయో అలానే తింటాయి. కానీ మనిషి మాత్రం రుచి కోసం ఉడకబెట్టడం, వేపించడం, వండడం, మిక్సీ పట్టడం, ఇలా అనేక పద్ధతులను ఉపయోగిస్తాడు. దీనివలన ఆహారపు పోషకవిలువలు తగ్గిపోవడం లేదా పూర్తిగా పోవడం జరుగుతుంది. విత్తనాలు వేపించినపుడు  అవి మొలకెత్తలేవు అనగా వాటిలోని ప్రాణశక్తిని అవికోల్పోయాయని అర్ధం. కనుక వండని ఆహార పదార్ధాలయిన మొలకలు వంటివి ఇంకా గింజలు పండ్లను తినడం మంచిది దేవతా మూర్తులకు అర్పించే  కొబ్బరికాయ చాలా సాత్విక మైనది, దీనిలో  తగినంత పాళ్ళలో ప్రోటీన్, కొవ్వు పదార్ధాలు స్టార్చ్ మరియు కనిజ లవణాలు వున్నాయి. ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పు లేదా మషాలాలు వుంటే అది రాజసికము (కోరికలు పెంచేది )ఔతుంది కనుక వాటిని దూరంగా ఉంచాలి. అలాగే ఎక్కువ కొవ్వు, పిండి పదార్ధాలు తీసుకోవడం తామసికము (సోమరితనం పెంచేవి). కనుక అవి శరీరము పైన ప్రభావితం కలిగించకుండా దూరంగా ఉంచడం మంచిది.."

-సత్యసాయిబాబా , “ఆహారము ఆరోగ్యము ” దివ్యవాణి  21 సెప్టెంబర్ 1979
 http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-31.pdf

 

"ప్రేమ లేని జీవితం అర్ధం లేనిది. ఎంతగా ప్రేమిస్తూ ఉంటే అంతగా అది పెరుగుతూ ఉంటుంది. వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల ఉన్నది వ్యామోహమా లేక నిజమైన ప్రేమ అన్నది యోచించాలి.  వ్యామోహము స్వార్ధము పైన ఆధారపడింది, కానీ ప్రేమ నిస్వార్ధ మైనది. ప్రేమ అనేది నీవు చేసిన మంచి పనుల నుండి వచ్చిన ఫలము. కనుక నిస్వార్ధ మైన సేవాకార్యక్రమాలలో పాల్గొనడంద్వారా పవిత్రమైన ప్రేమను అనుభవంలోనికి తెచ్చుకోవచ్చు.''.

-సత్యసాయిబాబా , “ప్రేమ ద్వారా సమానత్వము ”  11 డిసెంబర్ 1985నాటి ఉపన్యాసము
http://www.sssbpt.info/ssspeaks/volume18/sss18-28.pdf

 

ప్రకటనలు

నిర్వహిoచబోయే శిబిరాలు

❖ ఫ్రాన్స్  డోర్దోనే : రిఫ్రెషర్ సదస్సు మరియు  AVP వర్క్ షాప్ 16-17 సెప్టెంబర్ 2017 సంప్రదించ వలసినవారు డేనిఎల్ , వెబ్సైటు [email protected]

❖ యు.కె లండన్ : జాతీయ వార్షిక రిఫ్రెషర్ సదస్సు 2017,సెప్టెంబర్  17    సంప్రదించ వలసినవారు జేరం , వెబ్సైటు [email protected] లేక టెలిఫోన్ నెంబర్  020-8551 3979  

 యు.ఎస్.ఎ వాషింగ్టన్ డి.సి., డుల్ల్స్ ఎయిర్ పోర్ట్ దగ్గర  (IAD) : AVP వర్క్ షాప్ 2017 అక్టోబర్ 13-15 , సంప్రదించ వలసినవారి వెబ్సైటు [email protected]

❖ ఇండియా పుట్టపర్తి : AVP వర్క్ షాప్  18-22 నవంబర్  2017, సంప్రదించ వలసినవారు లలిత, వెబ్సైటు  [email protected] లేక టెలిఫోన్ నెంబర్  08555-288 377 

 ఇండియా  పుట్టపర్తి : SVP వర్క్ షాప్  24-28 నవంబర్  2017, సంప్రదించ వలసినవారు హెమ్  వెబ్సైటు  [email protected]

 

అదనంగా

ఆరోగ్య చిట్కాలు

ఎసిడిటీ ఉందా - ఐతే మొగ్గలోనే తుంచివేయండి !!

 1. ఎసిడిటీ అంటే ఏమిటి 1,2,3 

ఎసిడిటీ లేదా ఆమ్లత్వము అనేది మన కడుపులో అవసరానికి మించి ఆమ్లము తయారయ్యి అసౌకర్యానికి గురిచేయడం గా పేర్కొనవచ్చు. మన జీర్ణాశయం లో ఉన్న జీర్ణ గ్రంధులు ఆహారాన్ని జీర్ణం చేయడానికి వివిధ రకాల స్రావాలను ఉత్పత్తి చేస్తూ హానికరమైన బాక్టీరియా ను కూడా నశింప జేస్తూ ఉంటాయి. ఒక వయోజనుడయిన వ్యక్తి యొక్క జీర్ణాశయం రోజుకు 1.5. లీటర్ల జీర్ణ రసాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. జీర్ణాశయం లో ఉన్న మ్యుకస్ పొర ఉత్పత్తి చేసే బైకార్బోనేట్లు ఆమ్లము యొక్క తినివేసే స్వభావమును తటస్థీకరిస్తాయి. ఈ పొర జీర్ణాశయంలో ఎక్కువ ఆమ్లము ఉత్పత్తి ఐనా దానికి తట్టుకునే విధంగా దీని నిర్మాణం ఉంటుంది. ఆమ్ల గుణము కలిగిన ఆహారము తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డిహైడ్రేషన్ వల్ల, మానసిక వత్తిడి వల్ల ఎక్కువ ఆమ్లము ఉత్పత్తి అవడం ద్వారా ఈ స్వయం నియంత్రణ వ్యవస్థలో సమస్య వచ్చినప్పుడు అది లోపల ఉన్న మ్యుకస్ పొరను దెబ్బతీస్తుంది.

2. ఎసిడిటీ యొక్క లక్షణాలు3,4,9

కడుపులోగాని గొంతులో గానీ ఇంకా చాతిభాగం లోగాని చాతి క్రింది భాగంలోగానీ భోజనం చేసిన తర్వాత మంటగా అనిపించడం అసిడిటీ యొక్క సాధారణ లక్షణం. ఇతర లక్షణాలు చూసినట్లయితే ఆగకుండా ఎక్కిళ్ళు రావడం, నోటిలో పుల్లని రుచిగా అనిపించడం, పుల్లని తేనుపులు, బరువుగా అనిపించడం, తలపోటు, వళ్ళంతా వేడిగా అనిపించడం, ద్రవాహారము కడుపులోనుండి పైకి ఎగదన్నినట్లు అనిపించడం, ఒక్కొక్కసారి అన్నం అరగక పోవడం, కడుపులో వాయువు చేరిక ఈ లక్షణాలున్నట్లు అనిపిస్తే  లోపల అంతర్లీనంగా ఉన్నఅసిడిటీని అది సూచిస్తుంది.

అసిడిటీకి సంభందించి మరికొన్ని లక్షణాలు చూసినట్లయితే ఎప్పుడూ అలసటగ ఉండడం, ఊపిరి అందనట్లు అనిపించడం, తరుచుగా మూలుగుతూ ఉండడం, కొంచం దూరం నడవగానే కండరాలు నొప్పిగా అనిపించడం లేదా తిమ్మిరులు రావడం, ఊపిరి అందన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కణజాలంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడం అనేది అసిడిటీ ఉన్నవారికి సాధారణము  కనుక వీరు 20 సెకన్లకన్నా మించి ఉపిరిని ధారణ చేయలేరు. 

3. ఎసిడిటీ కి కారణాలు3,5,8

ఆహార సంబంధిత కారణాలుబాగా వేడిగా ఉన్న, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్ధాలు, వేపుళ్ళు, కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పదార్ధాలు, మిఠాయిలు, కల్తీ చేయబడిన, పులియ బెట్టిన పదార్ధాలు, కూల్ డ్రింకులు, నిలవ చేయడానికి రసయనాలు ఎక్కువగా వాడిన పదార్ధాలు, చాక్లెట్లు ఎక్కువగా తీసుకోవడం, వెల్లుల్లి, ఉల్లి, కాఫీ, టీ లు ఎక్కువగా తీసుకోవడం, అధికంగా తీసుకునే భోజనం, నిద్రించే ముందు తీసుకునే అల్పాహారం, మాంసాహారము, మద్యపానము.

ఇతర కారణాలలో చూసినట్లయితే వత్తిడి ప్రధమ స్థానం లో ఉంది. అధిక శ్రమ వలన భౌతిక పరమైన వత్తిడి ఇంకా తొందరపాటు, విచారము, భయము, కోపము, మొదలగు వాని వల్ల మానసికమైన వత్తిడి కలుగుచున్నవి. ఎసిడిటీ కేసులు ఎక్కువగా భావోద్వేగాలు ఎక్కువగా ఉండేవారికి, ఎప్పుడూ నెర్వస్ గా ఉండేవారి విషయంలోనూ నమోదవుతున్నాయి. ఇంకా ఎక్కువగా మొబైల్ ఉపయోగించే వారిలోనూ, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలోను కూడా మానసిక వత్తిడి ఎక్కువగా ఉంటోందని నిర్ధారణ అయ్యింది. ఇతర కారణాల విషయంలో ఎక్కువగా ఎండలో పని చేసేవారికి, ఆస్పిరిన్, ఇంకా మంటకు సంబంధించిన మందులు వాడే వారిలోనూ, మంచినీరు తక్కువ తాగేవారిలోనూ, ఎక్కువగా పొగ త్రాగేవారిలోను ఎసిడిటీ ఎక్కువగా ఉంటోందని నిర్ధారణ అయ్యింది.   

4. అసిడిటీ మరియు జీర్ణకోశ అసౌకర్యము ఒకటికావు.6

కొంతమంది తమ జీర్ణకోశ సంబధిత వ్యాధిని అసిడిటీ గా భావిస్తారు. సాధారణంగా వాయువు నోటినుండి మరియు పురీషనాళము నుండి బయటకు రావడం సహజము. ఐతే ఇది పెద్దవాళ్ళలో త్రేన్పుల రూపంలో చిన్నపిల్లలలో ఒకవిధమైన గాలి శబ్దము రూపంలోనూ వస్తుంది. ఇంకా మనం భోజనం చేసేటప్పుడు గాలి కూడా లోపలికి వెళుతుంది కనుక భోజనం పూర్తయిన  తర్వాత కూడా గాలి బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చే వాయువు పుల్లటి వాసనతో కూడినదయితే  అది అజీర్ణమును లేదా మలము పూర్తిగా విసర్జింప బడలేదనే విషయాన్ని తెలుపుతుంది. ఇలా వాయు సంబంధితమైన కొన్ని అంశాలు క్రమేణా ఎసిడిటీ అనే రుగ్మతకు దారితీస్తాయి.

5. ఆమ్లము పైకి ఎగదన్నడం4,5,7

సాధారణంగా ఆహారము అన్నవాహిక నుండి క్రిందికి ఆహార పటలము ద్వారా జీర్ణాశయం చేరుతుంది. ఇక్కడ ఉన్న గ్యాస్ట్రో ఎసోఫోగల్ స్పింక్టర్ అనబడే కొన్ని రకాల కండరాల సముదాయం ఒక రకమైన బంధకము వాల్వ్ వలె పనిచేస్తూ ఆహారాన్ని ఉదరము లోనికి పంపిస్తూ వెంటనే అది తిరిగి వెనకకు రాకుండా మూసుకుపోతుంది. ఎప్పుడయితే ఈ వాల్వ్ బలహీనమైనా పాడయి పోయినా ఇది ఆహారము తిరిగి అన్నవాహిక లోనికి రాకుండా నిరోదించలేక పోతుంది. దీనినే ఆసిడ్ రిఫ్లక్స్ అంటారు, ఇది ఒక సాధారణ సమస్య. 

దీనియొక్క ముఖ్య లక్షణం గుండెలో మంట అనిపించడం, చాతి ఎముకల వెనుక భాగంలో మంట గా అనిపించడం ఒక్కొక్కసారి ఇది గొంతు వరకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. వాస్తవానికి గుండె మంట అని పేరుకే పిలుస్తారు కానీ దీనికి గుండెకి ఏ సంభందము లేదు. ఐతే ఒక్కొక్క సారి ఈ బాధ గుండెనొప్పి మాదిరి గాతీవ్రంగా ఉంటుంది. తరుచుగా (అనగా వారానికి రెండు సార్లు)ఇది వస్తూ ఉన్నట్లయితే ఇది ఆంత్ర మూలానికి సంబధిత అల్సర్ గా ‘’గ్యాస్ట్రో ఎసోఫోగల్ రిఫ్లక్స్ డిసీజ్,GERD గా రూపు దిద్దుకుంటుంది.   పిల్లలలో తరుచుగా వచ్చే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అతిగా ఉంటున్న ఎసిడిటీ వల్లనే వస్తుంది. 

ఆసిడ్ రిఫ్లక్స్ అనగా ఆమ్ల ఉద్గారత అనేది ఆహార కుహరపు మూలము నుండి మెల్లిగా పొట్టలోని భాగాలకు అనగా ఉదరము లో ఉన్నఆహారపటలము దాటి చాతి మధ్య భాగమునకు చేరుతుంది. దీనివల్ల నోటి వెనుక భాగం లో పుల్లని రుచిగాను, గుండె లో మంటగాను, ఎదైనా మింగడానికి చాలా ఇబ్బందిగానూ లేదా ఛాతీ లో నొప్పి గానూ ఉంటుంది.

6. ఎసిడిటీ యొక్క విస్తృత శాఖలు4,7,10,11

ఎసిడిటీ అనేది అజీర్తికి దారితీస్తుంది, దీనివల్ల ఆహారము తినగానే పొట్ట పై భాగంలో అసౌకర్యము, మంట, నొప్పి ఇలాంటివి మొదలవుతాయి. ఇది ఒక జబ్బుగా పరిగణింపబడనప్పటికీ కడుపు ఉబ్బరం, వికారము, వాంతులు, త్రేనుపులు ఇలాంటి లక్షణాలన్నీ ప్రారంభమవుతాయి. జీర్ణాశయం లోని ఆమ్లాలు మ్యుకస్ పొరకు హాని కలిగించినపుడు అది చికాకు, కడుపులో మంట రూపంలో బయటపడుతుంది. ఇదే అజీర్ణముగా ఒక్కొక్కసారి గ్యాస్త్రిక్ సమస్యగానూ ఇబ్బంది పెడుతుంది. ఒక్కొక్కసారి ఈ లక్షణాలు రోజంతా బాధించే అవకాశం కూడా ఉంది. ఇంతేకాక గుండెమంట గా అనిపించడం కూడా అజీర్ణము యొక్క లక్షణం గా చెప్పవచ్చు.  

7. ఎసిడిటీ యొక్క గొలుసు కట్టు ఫలితాలు 8

ఇటలీ లోని బ్యారీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన ఒంట్లో పుట్టే కణుతులు, గడ్డలు వీటన్నిటికి మూలము ఎదైనా గానీ అవి రావడానికి ప్రధాన కారణం ఎసిడిటీ నే అని ఇదే క్యాన్సర్ కి దారితీస్తుందని కనుగున్నారు. డాక్టర్ కెలిచి మొరిషిత గారి ప్రచురణ వ్యాసం ‘’కేన్సర్ వెనుక దాగిన సత్యం’’ ప్రకారం మన శరీరము ఆమ్ల పదార్ధాలను, సాధారణంగా వ్యర్ధాలను మన రక్తం స్వల్పంగా క్షార యుతంగా ఉండడానికి జీవకణాలలోనే ఉంచుతుంది. ఐతే ఈ వ్యర్ధాలు కణాలను మరింత అమ్లయుతంగా హానికరంగా తయారుచేస్తాయి. దీని ఫలితంగా కణాలలో ఆక్సిజన్ స్తాయి పడిపోవడం ఇది శ్వాశ సంబంధిత స్రావాలను చివరకు DNA కూడా నాశనమవడానికి కారణ మవుతున్నది. ఎసిడిటీ వల్ల కొన్ని జీవకణాలు చనిపోతే మరికొన్ని అసాధారణంగా తయారవడమే కాక అసంఖ్యాకంగా పెరిగిపోతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం తరుచుగా జీర్ణాశయం నుండి ఆమ్లము పైకి ఎగచిమ్మడం అనేది అన్నవాహిక క్యాన్సర్ కు కారణమవడమేకాక దీనిని నిరోదించక పొతే క్యాన్సర్ గా పరిణమిస్తుంది.

ఇంతేకాక ఆమ్లయుత వాతావరణము బ్యాక్టీరియ, వైరస్, ఫంగస్ వంటి పరాన్నజీవులకు అనుకూలమైన వాతావరణమును  సృష్టించి అవి పెరిగిపోవడానికి కారణ మవుతుంది. అలాగే గుండెజబ్బులకు, చెక్కర వ్యాధికి, బోలుఎముకల వ్యాధికి కూడా ఈ వాతావరణం సహకరిస్తుంది. ఎసిడిటీని నిరోధించక పొతే అది అధిక అమ్లతకు దారితీయడమే కాక జీర్ణాశయమార్గంలో ఉన్న రక్షణ కవచాన్ని పాడుచేసి పుండ్లు ఏర్పడడానికి, ప్రేవులు పాడయిపోవడానికి కారణమవుతుంది. ఈ విధంగా ఎసిడిటీ అనేది మన జీవన శైలిలో అనేక వ్యాధులకు ఒక వేదిక కావడమేకాక క్యాన్సర్ ని క్యాన్సర్ కూడా  కలిగిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

8. మీ ఎసిడిటీ స్థాయిని ఇలా తెలుసుకోండి1,9,12

మన దేహంలో ఉన్న అసిడిటీ స్థాయి తెలుసుకొనడానికి pH గురించి తెలుసుకొనడం ప్రధానమైనది. pH అనగా పొటెన్షియల్ ఫర్ హైడ్రోజెన్ అనగా ఇది మన శరీరంలో ఉన్న హైడ్రోజెన్ అణువుల సాంద్రతను తెలియజేస్తుంది. అసిడిటీ స్థాయి స్కేల్ పైన 0 నుండి 14 వరకు సూచింప బడుతుంది. pH స్థాయి 7 ఉండడం అమ్లత్వమును సూచిస్తుంది. 0 ఉండడం అతి ఆమ్లత్వాన్నిసూచిస్తుంది.pH 7 కన్నా ఎక్కువ ఉండడము క్షారత్వాన్ని,14 ఉండడం అతి క్షారత్వాన్ని సూచిస్తుంది . 7అనేది తటస్త స్థాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మన దేహంలో  pH స్థాయి 7.4 కు దగ్గరగా ఉండాలి అనగా తటస్థ స్థాయి నుండి కొంచం క్షారత్వం వైపు మొగ్గు చూపిస్తూ ఉండాలి. మన శరీరం ఈ pH  స్థాయి లో ఎక్కువ హెచ్చుతగ్గులు చూపిస్తూ ఉంటే మన శరీరంలో స్రవించే వివిధరకాల జీర్ణ రసాల పనితీరు దెబ్బతింటుంది. మనిషి శరీరంలోని రక్తం pH స్థాయి అతిదగ్గరగా అనగా 7.35 నుండి  7.45.వరకూ మాత్రమే ఉంటుంది.   

 pH స్థాయి మనం తీసుకునే ఆహారము, వత్తిడి, నిద్ర, హార్మోన్లు, ఇంకా ఇతర కారణాలవల్ల శరీరములో మారుతూ ఉన్నప్పటికీ ఆరోగ్యవంతమైన మానవునిలో ఉన్న లాలాజలం లో Phస్థాయి 6.5 మరియు 7.0.మధ్య ఉండాలి. దీనికన్నాతక్కువగా ఉండడం మనశరీరంలో అసిడిటీ కి గురి ఐనట్లు సూచిస్తుంది. జీర్ణాశయం మాదిరి కాకుండా (Ph స్థాయి 1-3 ) Ph స్థాయి 7 ఉండిన ఆహార పటలము ఎక్కువ ఎసిడిటీ వాతావరణము తట్టుకునే విధంగా నిర్మితమయి లేదు. Ph స్థాయి 4 కన్నా తక్కువ ఉన్నట్లయితే సహజంగా మనకు కడుపులో మంట మొదలవుతుంది. 

అసిడిటీ కి సంభందించి ఏ లక్షణాలు కనిపించినా వారు Ph స్థాయిని పరీక్ష చేయిచుకొని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. Ph స్ట్రిప్పులు ఫార్మసి షాపులలో లభిస్తూ ఉంటాయి. మన ఆహార శైలిని, జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఈ Ph స్థాయిని సమపాళ్ళలో ఉంచుకోవచ్చు .

9. అసిడిటీ నిరోధించుటకు సోపానాలు3,5,23,24

మన శరీరంలో ఆమ్ల, క్షార స్థితిని సమపాళ్ళలో ఉంచడానికి ఎంజయిములు చక్కగా స్రవించడానికి నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. నీటి యొక్క Ph దాని సహజ స్థితిలో 7 ఉంటుంది. మ్యుకస్ పొర ద్వారా ప్రవహించే నీరు దానిని సంరక్షించడమే కాక కొంత నీటిని ఆమ్లముయొక్క ప్రభావమునకు గురికాకుండా అవసరం మేరకు ఉపయోగించే దానికోసం  కొంత దాచి ఉంచుతుంది. ఎందుకంటే మ్యుకస్ లో 98% నీరు కాగా మిగతా 2% ఈ నీటిని పట్టి ఉంచే నిర్మాణము తో కూడిఉన్నది.

మనం తీసుకునే ఆహారము తాజా పళ్ళు, కూరగాయలు, సలాడ్లు, మొలకలతో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగానూ శరీరానికి  హితము చేకూర్చే విధంగానూ ఉండాలి. వండిన ఆహారము ఎప్పటికప్పుడు తాజాగా వండినది గానూ వీలయినంత తక్కువ మషాలలతోనూ ఉండాలి. ఆహారాన్ని నియమిత కాలమానము ప్రకారము శాంతియుతమైన ప్రార్ధనా పూర్వకమైన వాతావరణములో తినాలి. ఆహారాన్ని తొందరపాటుగా కాక నిదానంగా బాగా నమిలి మింగాలి. బుక్వీట్ మరియు చిరుధాన్యాలు తప్ప అన్ని ఆహార ధాన్యాలు నానబెట్టి  తినక పొతే ఇవన్నీ అసిడిటీ ని కలిగించేవే. టేబుల్ సాల్ట్ బదులుగా హిమాలయా రాతి ఉప్పు లేదా సహజంగా లభించిన సముద్రపు ఉప్పు వాడడం మంచిది.   

ప్రతీ రోజూ వ్యాయామము చేయడం సరిపడినంత నిద్ర పోవడం అత్యవసరం. ప్రతిరోజూ కొంత దూరం నడవడం యోగా చేయడం ద్వారా జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడమే కాక నిద్ర కూడా బాగా పడుతుంది. సహజంగా జరగవలసిన ప్రకృతి సిద్ధమైన క్రియలు, వాంతులు, అపాన వాయువు విడుదుల మలవిసర్జన ఇటువంటివాటికి ఆపుకోకుండా ఉండడం చాలా ముఖ్యం.

10. ఎసిడిటీ కి గృహవైద్యము 3,13-22

ఎసిడిటీని నిరోధించేందుకు డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ మందులు ఎక్కువ కాలం వాడడం వల్ల అనివార్యంగా ఇతర హానికరమైన ఫలితాలు (సైడ్ ఎఫెక్ట్ లు)వచ్చే అవకాశం ఉంది. కనుక మన ఇంటిలో దొరికే సాధారణ, ప్రకృతి సిద్ధమైన నివారణలను శీఘ్ర ఉపశమనము కోసమే కాక నివారణ నిమిత్తము కూడా ప్రయత్నించడం ఉత్తమమైన సాధన. ఐతే ఎవరూ కూడా అధికారికంగా పలానా మందు బాగా పనిచేస్తుందని చెప్పలేరు. కనుక ఎవరికి యోగ్యమైన నివారణను వారు అనుసరించడం మేలు. మన ఇంటిలోనే సులభంగా లభ్యమయ్యే  సుగంధ ద్రవ్యాలు, మూలికల వివరములు క్రింద ఇవ్వబడ్డాయి. వీటిగురించి పూర్తి వివరాలకోసం క్రింద ఇవ్వబడ్డ వెబ్సైటు లింక్ ను చూడగలరు.

  1. సుగంధ ద్రవ్యాలు  

 ఫిరంగి పండ్ల గింజలచూర్ణమునకు చిన్నమెత్తు నల్ల ఉప్పును జోడించిఇవ్వడం(మలబద్ధకం ఉన్నవారికి,అల్సర్ తో బాధ పడుతున్నవారికి ఇది పనికి రాదు )సోపుగింజలు, జీలకర్ర ల చూర్ణం, ప్రత్యేకంగా దీనిని ఫిరంగి గింజల పొడి కొంచం అల్లం రసం తో కలిపి తీసుకోవడం, సత్వర ఉపశమనం కోసం కొంచం యాలుకలు, లవంగాలను నోటిలో వేసుకొని కొరికి నోటిలోనే ఉంచుకొని  ఆ రసం మింగుతూ ఉండడం. ఇంతేకాక కొంచం పసుపు ను గోరువెచ్చని నీటిలో వేసుకొని సేవించడం. ఇవిఎసిడిటీ కి అనుభవ వైద్యాలు         

  1. మూలికలు

  ఎండిన చేమంతి పూవు రేకలు, పుదీనా, తులసి ఆకులతో చేసిన తేనీరు బాగా ఉపయుక్తంగా ఉంటుంది.

  1. పండ్లు,కూరగాయలు,మరియు పండ్ల రసాలు

అరటి పండు- పండిన /మిగల పండినది; ఆపిల్, అనాస, పుచ్చకాయ, బొప్పాయి, ద్రాక్ష: కేరట్, కేబేజీ జూస్, తాజా అల్లం రసం, దోసకాయ లేదా దాని జ్యూస్, అలోవిరా జ్యూస్, లేత కొబ్బరి నీరు మరియు దాని కొబ్బరి  

  1. ఇతర నివారణలు  

నానబెట్టిన బాదం నీళ్ళను త్రాగడం, కొత్తిమీర జ్యూస్ తో కలిపిన మజ్జిగ లేదా తాజా పెరుగు, ఉసిరికాయ పౌడర్ కానీ లేదా ఉసిరికాయ ను తినడం, నీటిలో మరిగించిన గంధపుచెక్క నీరు, ఫిల్టర్ చేయని వినిగెర్ కలిపిన సేంద్రియ ఆపిల్ రసం, బేకింగ్ సోడా మరియు నీరు కలిపిన నిమ్మరసమును బాధ భరింపరానిదిగా ఉన్నప్పుడు ఈ నిమ్మరసం లో వస్తున్న బుడగలు ఆగిపోక ముందే వెంటనే త్రాగేయాలి. (హై.బి.పి. ఉన్నవారికి, ఉప్పు తీసుకోవడం మానివేసిన వారు దీనిని తీసుకొన రాదు), చెక్కెర లేని చ్యుయింగ్ గమ్ము

11. ఎసిడిటీ మరియు సంబంధిత సమస్యలకు వైబ్రియోనిక్స్ రెమిడిలు25-27

మీరు SRHVP ని గానీ లేక108CC బాక్స్ గానీ ఏది ఉపయోగిస్తున్నా పేషంటు యొక్క రోగ లక్షణాలను బట్టి ఎన్నో రెమిడి లు ఉన్నాయి. వీటిగురించి ‘వైబ్రియోనిక్స్ 2016’మరియు ‘108 కామన్ కొమ్బోస్ ’పుస్తకాలలో చక్కని వివరణ ఉన్నది.

References and Links for Acidity (1-12) and Remedies (13-27):

  1. https://www.eno.co.in/what-is-acidity/
  2. https://en.wikipedia.org/wiki/Gastric_acid
  3. http://www.healthsite.com/diseases-conditions/acidity/001/
  4. http://www.healthline.com/health/gerd/acid-reflux-symptoms#overview1
  5. http://www.medicalnewstoday.com/articles/146619.php
  6. A Treatise on Home Remedies, Dr S Suresh Babu, Pustak Mahal Publication, India 2005
  7. http://www.webmd.com/heartburn-gerd/guide/what-is-acid-reflux-disease#1
  8. http://www.naturalhealth365.com/ph-oxygen-levels-dna-damage-stop-cancer-1383.html
  9. https://www.drdavidwilliams.com/proper-ph-balance
  10. http://www.webmd.com/digestive-disorders/digestive-diseases-gastritis#1
  11. http://newsnetwork.mayoclinic.org/discussion/distinguishing-between-bile-reflux-and-acid-reflux-can-be-difficult/
  12. https://simple.wikipedia.org/wiki/PH
  13. http://www.wholesomeayurveda.com/2017/03/16/ajwain-carom-seeds-benefits-acidity-indigestion/
  14. https://wikihomenutrition.com/home-remedies-acid-reflux/
  15. http://articles.mercola.com/home-remedies-heartburn-acid-reflux-ulcer.aspx
  16. https://www.youtube.com/watch?v=k5j-Zvjqnr0 Natural method to cure acidity - Baba Ramdev
  17. http://www.thehealthsite.com/diseases-conditions/10-home-remedies-for-acidity-that-really-work/
  18. http://www.thehealthsite.com/diseases-conditions/drink-coconut-water-to-get-quick-relief-from-acidity-and-heartburn-t915/
  19. http://www.ayushveda.com/homeremedies/acidity.htm
  20. http://www.homeremedyfind.com/12-remedies-for-acidity/
  21. http://everydayroots.com/heartburn-remedies
  22. http://easyayurveda.com/2014/12/11/sandalwood-benefits-how-to-use-side-effects-research/
  23. http://articles.mercola.com/sites/articles/archive/2009/04/25/news-flash-acid-reflux-caused-by-too-little-acid-not-too-much.aspx
  24. Water for Health, for Healing, for Life -- You are Not Sick, You’re Thirsty! by F. BatmanghelidjMD Warner Books 2003
  25. Sairam Healing Vibrations,108 Common Combos - 2011
  26. Soham Series of Natural Healing volume 3, Swami Narayani and Swami Ananda.
  27. Vibrionics 2016, A Practical Guide for the Users of Sai Ram healing Vibration Potentiser



ఓం సాయి రామ్