Vol 6 సంచిక 4
July/August 2015
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన అభ్యాసకులకు
గురు పూర్ణిమ
గురు పూర్ణిమ రావడంతో మనకు ఎంతో ప్రియమైన మన భగవాన్ శ్రీ సత్య సాయి బాబాగారి అపారమైన దివ్య ప్రేమ గుర్తుకొస్తుంది. ఈ పవిత్రమైన రోజున 2008 నుండి 2010 వరకు ప్రతి ఏడాది స్వామి సాయి వైబ్రియోనిక్స్ టీం సమర్పించిన కేక్ని కట్ చేసి వారి అపారమైన ప్రేమను కురిపించారు.స్వామి మన సమర్పణా భావనను అంగీకరించి మనకు నిస్వార్థ సేవ చేయడానికి ప్రేరేపించారు. నేను ఈ గురుపూర్ణిమ సందర్భముగా స్వామిని మేము చేసే ఈ సేవా కార్యక్రమము భక్తి శ్రద్ధలతో కొనసాగించేలా ఆశీర్వదించమని మనసారా ప్రాద్ధిస్తునాను.
స్వామిలో విలీనమైన ఒక ధన్యాత్మురాలు
సోదరి ఐవోన 01213..పోలాండ్ సాయి వైబ్రియోనిక్స్ సేవలో కీలక పాత్ర వహించారు. ఆమె ఈ నెల స్వామిలో విలీనం అయ్యారని అతి దు:ఖంతో తో తెలుపుకుంటున్నాను. తన ఆఖరి క్షణం వరకు రోగులకు తన నిస్వార్థ సేవను అందిస్తూనే వున్నారు. ఎల్లప్పుడూ మా గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు.
సాయి వైబ్రియోనిక్స్ ఒక అధ్యాయం
మేము సాంకేతిక విజ్ఞానం ద్వారా అన్ని ప్రాంతాలలో ఉన్నఅబ్యాసకులను మరి ఇంత దెగ్గర చెయ్యాలని నిర్ణయించుకున్నాము. వారి అభిప్రాయాలను,అనుభవాలను వాటి వల్ల వారు పొందిన జ్ఞ్యానాన్ని,సాంకేతిక విజ్ఞ్యానం ద్వారా ఒక చోట చేరుస్తే అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది.దీని వలన మనం చేస్తున్న ఈ వైబ్రియోనిక్స్ సేవ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇది చేయడం మూలంగా స్వామీ ఆశించిన విధంగా వైద్య సదుపాయాలు అందుపాటులో లేని వారికి మరియు అవసరమున్న వారికి అందేవిధంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న కేసు వివరాలు, అభ్యాసకుల అభిప్రాయాలు మరియు ఉత్తమ సలహాలు ఈ కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టడానికి గల మూల కారణాలు.
అభ్యాసకులకు ఆహ్వానం
ఆన్లైన్లో అసాధారణ కేసు వివరాలుతో పాటు సాధారణ కేసు వివరాలు కూడా నమోదు చేస్తే భాగుంటుంది అని కొందరు అభ్యాసకుల అభిప్రాయం. దీని వలన అబ్యాసకులుకి, రోగులకి మరియు వై బ్రిఒనిక్స్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారందరికి ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను.
ఈ యోచనలో అభ్యాసకులoదరు సులభముగా పాల్గొనవచ్చు. మీలో ఒక్కొక్కరిని మీ పేషెంట్ రికార్డు పుస్తకాలలో ఉన్న కేసులన్నీ పంపించడానికి నేను ఆధికారికంగా ఆహ్వానిస్తున్నాను. మీరు పపించిన కేసులన్నీ అందరికి ఉపయోగ పడేలా వార్తాలేఖ డేటాబేస్లో పొందుపరుస్స్తము. మీరు గతంలో మాకు పంపిన అసాధారణ కేసులు ఏమైనా వార్తాలేఖలో ప్రచురింపబడకపోయుంటే వాటిలో లుప్త వివరాల్ని చేర్చి ఈ కింద ఇవ్వబడిన ఈమెయిలుకు పంపవలెను [email protected].
సేవకు కృతజ్ఞ్యతలు
నిర్వహణ, ప్రచురణ, ఎడిటింగ్ మరియు సాంకేతిక విభాగములలో సేవ అందించడానికి ముందుకొచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ ప్రతిస్పందన చూసి నాకు చాలా ఆనందముగా ఉంది. అదే విధంగా ఇంకా ఎక్కువగా అభ్యాసకులు మరియు సహాయకులు ముందుకు రావాలని ఆశిస్తున్నాను.
ఈ విశేష ప్రచురణలో గ్రూప్ వివరాలు అందించిన మా జపనీస్ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్టున్నాము.
మీకు మరియు మీ కుటుంభ సభ్యులందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంట్టున్నాము.
సాయి సేవలో
జిత్ కే అగ్గర్వాల్
మలభాద్దకము మరియు గ్రహణ శక్తిలో బలహీనత 02779...Japan
ఒక 85 ఏళ్ల మహిళ గత రెండున్నర సంవత్సరాలుగా మలభాద్దకము మరియు మెదడులో స్ట్రోక్(ఆఘాతం) ప్రభావం వల్ల బాధపడుతూ ఉండేది. ఈ రోగ చికిత్సకై వైద్యుడు తనకు ఇచ్చిన మందులు వల్ల గొంతులో నొప్పి మరియు గుండెలో మంటా కలిగాయి. ఈమెకు నడవడం కూడా కష్టంగా ఉండేది. అక్టోబేర్ 22వ తేదిన ఈమె కుమార్తె వైబ్రియోనిక్స్ అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ రోగికి ఈ కింద రాయబడిన రేమడీలు (మందులు) ఇవ్వబడినాయి:
CC4.4 Constipation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.4 Brain stroke …TDS
అభ్యాసకుడు రోగిని నీరు ఎక్కువుగా త్రాగమని సలహా ఇచ్చారు. మూడు రోజులలో రోగికి పేగుల కదలికలు కొంత్తమేరకు మెరుగుపడ్డయీ. రెండు నెలల తర్వాత ఈ మహిళ పునర్వవస్థీకరణ కేంద్రానికి వెళ్లి వ్యాయాముము చేసుకో కలిగినది. ఈమె స్వయంగా అభ్యాసకుడికి కృతజ్ఞ్యతతో నిండిన లేఖలు రాసింది.మూడు నెలల చికిత్సానంతరము ఈ మహిళ 90% కోలుకున్నట్లుగా సమాచారం అందచేసింది.ఈమె ఇప్పుడు ఈ రేమడీలు రోజుకి ఒకమారు తీసుకుంటున్నది(OD). 2015 జులైలో ఈ మహిళ పూర్తిగా నయమై, ఆరోగ్యంగా ఆనందంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నది.
రోగి వ్యాఖ్యానం:
నేను ఈ మందుల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటున్నాను. ప్రొద్దున్న పూట ఎక్కువ నీరు తాగుతున్నాను. నేను నీటిలో విబూతి కలుపుకొని తాగుతూ ఉంటాను. బాబాని గురించి తెలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
డిప్రెషన్ , కీళ్ళ వాపు, ముక్కు నుండి రక్త స్రావము 02779...Japan
ఒక 75 ఏళ్ళ మహిళ తన భర్త చనిపోవడంతో మనసు క్రుంగి వ్యాకులత పడింది. కీళ్ళ వాపు వలన ఆమెకు నడవడం చాలా కష్టంగా ఉండేది. 2011 నవంబెర్ లో ముక్కులో రక్త స్రావము వల్ల ఈమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈమె స్నేహితురాలు ఈమెను ఒక వైబ్రో అభ్యాసకునితో పరిచయం చేసింది. ఈ మహిళకు ఈ కింద రాయబడిన మందులు ఇవ్వడం జరిగింది.
CC3.2 Bleeding + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS
ఈ మందులు తీసుకోవడం మొదలు పెట్టాక వారం రోజులలో ఈమెకు ముక్కునుండి నెత్తురు కారుట తగ్గిపోయింది. మూడు నెలల తర్వాత కీళ్ళవాపులు 60% తగ్గాయి కాని తనకు ధైర్యము ఉత్సాహము కలగటం లేదని అభ్యాసకునికి తెలియచేసింది. తను రోజు పాలు ఎక్కువ సార్లు తాగుతున్నట్లుగా చెప్పింది.అభ్యాసకులు ఈమెను పాలు తాగడం తగ్గించమని సలహా ఇవ్వడం జరిగింది. ఐదు నెలల తర్వాత ఈమె 80% నయం అయ్యింది. ఇప్పుడు(2015 జూలై) తను 95% కోలుకుంది. రోజుకి ఒక మారు మందు తీసు కుంటున్నది.
రోగి వ్యాఖ్యానము:
మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం మన ఆరోగ్యం పైన ఎంతగానో ఉంటుందని నాకు ఇప్పుడు తెలిసింది. నా కళ్ళు తెరిపించి నాకు చాలా మంచి విషయాలు తెలియ చేసిన వైబ్రో అభ్యాసకునికి నా కృతజ్ఞ్యతలు.
తల తిరుగుట(వేర్టిగో), ఫ్లూ జ్వరము 02779...Japan
ఒక 78 ఏళ్ళ మహిళ రెండు వారాలు తల తిరుగుట(వేర్టిగో) సమస్యతో భాధపడింది. ఆదే సమయంలో ఆమెకు ఫ్లూ జ్వరం రావడంతో కొంచం దూరం కూడా నడవలేక పోయింది.ఈ మహిళ, అభ్యాసకుడిని 2013 ఫెబ్ 13వ తేదిన సంప్రదించింది. ఈమెకు ఈ కింద రాయబడిన మందులు ఇవ్వడం జరిగింది.
CC9.2 Influenza + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo...TDS
ఒక్క వారం రోజులలోనే ఈమెకు పూర్తిగా నయమైంది. ఈమె మందుల్ని మరొక వారం, రోజుకి ఒక మారు చప్పున తీసుకుని ఆపివేసింది. తన వేర్టిగో సమస్య పూర్తిగా తగ్గినట్లుగా తెలియచేసింది.
రోగి వ్యాఖ్యానము:
నన్ను ఇంత తక్కువ కాలంలో పూర్తిగా నయం చేసినందుకు వైబ్రో అభ్యాసకునికి కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాను.ఈ మందులు ద్వారా సాయి ఆశీర్వాదాన్ని నేను పొందగలిగాను. నేను నా భర్త తో మృదువుగా మాట్లాడడం మరియు భజన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా స్వామికి కృతజ్ఞ్యతలు తెలుపకోవాలని అనుకుంటున్నాను.
మలభాద్దకము,తొడలు,కాళ్ళల్లో ఉబ్బు వ్యాధి (ఇడీమా) 02779...Japan
ఒక 45 ఏళ్ళ మహిళ విపరీతమైన మలభాద్దకము చాలా నెలలు గా బాదపడుతున్నది. దీనితోపాటు తొడలు, కాళ్ళలో ఉబ్బువ్యాది సమస్య కలగడంతో తను మటం వేసుకుని నేలమీద కూర్చోలేకపోయేది. 2011 జూలై 23వ తేదిన ఈమె అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ కింద రాయబడిన మందులు ఈమెకు ఇవ్వబడినాయి.
CC4.4 Constipation + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic...TDS
మందులు తీసుకున్న మూడు రోజులలోనే ఈమెకు ప్రేగులు కదిలి మలభాద్దకము పూర్తిగా నయమైంది. ఆపై మూడు రోజులకు ఈమెకు ఉబ్బువ్యాది తగ్గి సామాన్యంగా నేలమీద కూర్చోగాలిగింది.ఈమె ఇంకొక్క వారం ఈ మందుల్ని తీసుకుని ఆపివేసింది.
రోగి వ్యాఖ్యానము:
నేను ఈ మందుల్ని కృతజ్ఞ్యత భావం భావముతో తీసుకున్నాను.నాపై అల్లోపతి మందులు పని చెయ్యక పోయేసరికి ఈ చికిత్సా విధము నాకెంతో ఆశ్చర్యము కలిగించింది. నేను భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారిని స్వయముగా ఎరుగను, ఐనను నేను నమ్ముతున్న దైవంపై నాకు మరింత విశ్వాసం కలిగింది.
మూత్రపిండాల వైఫల్యం 00971...Japan
ఒక 64 ఏళ్ళ మహిళ తన మూత్రపిండాలలో వైఫల్యం కలిగే సంభావన ఉందని ఒక వైద్యుడు ద్వారా తెలుసుకోవడంతో 2014 ఆగష్టు 24వ తేదిన అభ్యాసకుడిని సంప్రదించింది. రక్త పరిశోదనలో తన క్రియాటినిన్ స్థాయి చాలా అధికంగా ఉందని తనకు డయాలిసిస్ ప్రక్రియ తప్పకుండా చెయ్యాలని తెలిసింది. ఈమెకు డయాలిసిస్ చేయించుకోవడం ఇష్టం లేదు. ఈమె ఎక్కువుగా తీసుకునే మాంసాహారం మరియు ఉప్పుని తగ్గించమని అభ్యాసకుడు సలహా ఇచ్చారు.ఈమె బలంలేని ఆహరం తీసుకోవడమే కాకుండా నీరు కూడా తక్కువుగా తాగేది. ఈమె ఇకనుండి నియమబద్ధముగా పుష్టికరమైన ఆహారాన్న మాత్రమే తీసుకుంటానని అభ్యాసకునికి మాట ఇచ్చింది. ఈమె తన తల్లి తండ్రుల్ని చిన్న వయసులోనే కోల్పోయింది. అంతేకాకుండా తనకు అత్తగారితో బాంధవ్యం సామరస్యంగా ఉండేది కాదు. దీనివలన ఈమె మానసికంగా వ్యాకులత చెందుతూ ఉండేది. క్రింద వ్రాసిన మందులు ఈమెకు ఇవ్వబడినాయి.
#1. NM12 Combination 12 + NM63 Back-up + NM83 Grief + SM2 Divine Protection + SR360 VIBGYOR…QDS for 3 days
#2. SM2 Divine Protection + CC12.1 Adult tonic + CC13.4 Kidney failure + CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing…TDS
#3. SM2 Divine Protection + CC4.1 Digestion tonic + CC4.4 Constipation + CC6.2 Hypothyroid + CC15.4 Eating disorders…TDS
సెప్టెంబర్ 22వ తేదిన చేసిన రక్త పరిశోధనలో క్రియాటినిన్ స్థాయి సాధారణ స్థాయికి తగ్గిన్నట్లుగా తెలిసింది. వైద్యుడు ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యమైందని అడిగితే "పధ్యం" అని సమాధానమిచ్చింది. ఈమె బరువుకూడా 5 కిలోలు తగ్గింది. ఈమె #2 మరియు #3 ఆరు నెలలుకు రోజుకు మూడుసార్లు తీసుకుంది.2015 జూలై 10వ తేదీకి ఈమె బరువు 10 కిలోలు తగ్గింది. తన జీవన విధానంలో మరియు దృక్పధంలో ఎంతో మార్పు కలిగిందని తను తెలియచేసింది. తను ఉత్సాహంగా మరియు ఆనందంగా ఉంది. ఈమె మందుల్ని రోజుకి ఒకమారు తీసుకుంటున్నది. పూర్తిగా నయమైనందువల్ల త్వరలోనే మందులు తీసుకోవడం మానేస్తుంది.
మూత్రపిండాలలో రాళ్ళు 00971...Japan
ఒక 62 ఏళ్ళ వ్యక్తి నీరసం మరియు మూత్రపిండాలలో రాళ్ళు సమస్యతో అభ్యాసకుడిని సంప్రదించారు. ఆయినకి శస్త్రచికిత్స చెయ్యాలని వైద్యుడు చెప్పడంతో చాలా భయపడ్డారు. ఆయిన కుమార్తె ఆయినను వైబ్రియోనిక్స్ తీసుకోవల్సిందిగా పట్టుబట్టడంతో వారు ఒక అభ్యాసకుడిని సంప్రదించారు. ఆయినకు క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి.
NM12 Combination 12 + NM21 KBS + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR276 Berberis 200C + SR280 Calc Carb 30C + SR285 China Off 6X + SR322 Urtica Urens + SR346 Cantharis + SR360 VIGBYOR + SR493 Gallbladder + SR501 Kidney… every 5 minutes for 2 hours
ఈ మందుల్ని రెండు గంటలు తీసుకోవడంతో ఈయనకు రోగ లక్షణములు తొలగిపోయాయి. వైద్యుడు మూత్రపిండాలలో రాళ్ళు తొలగిపోయాయని చెప్పారు.ఈయనకు మళ్లీ ఈ సమస్య రాలేదు.
ముక్కు దిబ్బడం 00971...Japan
ఒక 75 ఏళ్ళ మహిళ ముక్కు దిబ్బడంతో నాలుగేళ్ళు భాదపడింది.ఆమెకు ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఆసుపత్రి పరిశోదనలో ఆమెకు నాసికా పాలిప్స్ ఉన్నట్లు, అవి ఆమె ముక్కు రంధ్రములను అడ్డగించుచున్నట్లు తెలిసింది. వైద్యుడు శస్త్ర చికిత్స వెంటనే చేయించుకోమని సలహా ఇచ్చారు.కాని ఆమె తన భర్తని చూసుకోవాలి మరియు తను ఎల్లర్జితో భాదపడుతున్నందు వల్ల వేరే వైద్యం కోసం చూసింది. ఆకారణంగా ఆమె ఒక విబ్రోఅభ్యసకురిని సంప్రదించింది. ఈమెకు అభ్యాసకుడు ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చారు
NM12 Combination 12 + NM69 CB 8 + NM76 Dyspnoea + NM99 Sinus + SM2 Divine Protection + SM41 Uplift + SR318 Thuja + SR360 VIBGYOR + SR527 Sinus-Paranasal…6TD
పది రోజుల వైద్యం తర్వాత ,పరిశోదనలో నాసికా పాలిప్స్ తొలగిపోయినట్లు తెలిసింది.ఈ మహిళ వైబ్రియోనిక్స్ చికిత్సావిదానాన్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోష పడింది.ఈ సమస్య తీరినందు వల్లన ఈమెకు మోతాదు క్రమంగా 6TD నుండి TDS,OD,3TW మరియు OW వరకు తగ్గించబడింది. ఆపై పూర్తిగా మందులు ఆపివేశారు.
పానిక్ డిసార్డర్ (దిగులు), తరచుగా మూత్రవిసర్జన 02754...Japan
అభ్యాసకుడు ఇట్లు వ్రాసారు: నా స్నేహితుడు కుమార్తైన ఒక 30 ఏళ్ళ మహిళ తను హై స్కూల్లో ఉండగా తనని శౌచాలాయాన్ని వాడే అనుమతి ఇచ్చేవారుకాదు.దీనివలన మరియు ఇతర కారణాలు వలన ఈమె మనసులో బెదురు కలిగి స్కూల్కి వెళ్ళడం మానేసింది.తన కుటుంభ సభ్యలుతో కూడా మాట్లాడేది కాదు. తర్వాత తనకి పానిక్ డిసార్డర్ (దిగులు,అత్యంత భయం) సమస్య కలిగింది.ఈ మహిళతో నేరుగా మాట్లాడే ముందుగా నేను ఈమెకు ఫోన్ చేసి సాయి వైబ్రియోనిక్స్ గురించి చెప్పాను మరియు నన్ను సంప్రదించడానికి నిర్నితమైన సమయం(అప్పాయింట్మెంట్) ఏదో చెప్పాను. ఈమెకు మొదట నన్ను సంప్రదించడానికి రైల్లో అరగంట సేపు ప్రయాణం చేసి రావడం అసాధ్యం అనిపించింది.కాని తనకు అల్లోపతి మందులు వాడడం ఇష్టం లేనందువలన వైబ్రియోనిక్స్ మందులు కోసం తన తల్లిగారుతో 2009 ఫెబ్రవరిలో వచ్చింది. దారిలో ఈమె పలు మారులు రైలునుండి దిగి శౌచాలాయానికి వెళ్ళవలిసి వచ్చింది.
నాతో సంప్రదించుచుండగా ఈమె తనకు దిగులు, విరోచనాలు మరియు తరచుగా మూత్రవిసర్జన,మైగ్రేన్ తలనొప్పి,సంక్షోభం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపింది.నేను ఈమెకు ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చాను
#1. CC4.6 Diarrhoea + CC11.4 Migraines + CC13.3 Incontinence + CC15.2 Psychiatric disorders…TDS
ఈమె ఇంతకముందు మూలిక ఔషధం తీసుకుంటూ వుండేది. తనకిష్టమైతే ఆ ఔషధం తీసుకోవడం కొనసాగించవచ్చని చెప్పాను. ఒక నెల తర్వాత ఈమె తన భావాలను వ్యక్తీకరించడం మరియు తన ఇష్టా అయిష్టాలను తెలియజేయడం మొదలుపెట్టింది. ఈమెకు మానసిక సంక్షోభ సమస్య ఉండడంవల్ల నేను ఈమెను ఆక్షేపించాకుండా ఈమె చేసేవన్నీకేవలం చూస్తూ ఉన్నాను.ఈమె నన్ను సంప్రదించడానికి వచ్చినప్పుడల్లా నాకు ఈమెకు మందులు తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టేది. 2012 ఏప్రల్ నాటికి ఈ మహిళలో చాలా మంచి మార్పులు వచ్చాయి. ఈమె తన ఆలోచనలను,మాటలు మరియు చేతలను భాగా పరిశీలించడం మరియు విశ్లేషించడం మొదలుపెట్టింది. ఈ తరుణంలో ఆమెను ఆశావాదిగాను, తనను మరియు తన చుట్టూ ఉన్నవారిని అంగీకరించమని ప్రోత్సాహించాను. అంగీకరణ భావన తన స్వభావమును మెరుగు పరిచి తనకీ తన చుట్టూ ఉన్నవాళ్ళందరికీ ఆనందాన్ని కలుగజేస్తాయని యని చెప్పాను.#1 రేమేడి ఇవ్వడం ఆపి ఈ క్రింద వ్రాసిన రేమేడీలు ఈమెకు ఒత్తిడి మరియు భయం తగ్గడానికి ఇచ్చాను
#2. CC15.2 Psychiatric disorders + CC15.5 ADD & Autism…TDS for 5 months, then OD
2012 జూన్ నాటికి ఈమె తన కుటుంభాన్ని ఆదుకోవడానికి సహాయపడేంతగా బాగుపడింది. ఈమెకు భయము మరియు ఒత్తిడి బాగా తగ్గాయి. 2014 వసంతకాలంలో తనకు చాలావరకు నయమైందని రోజుకి ఒకమారు మందు తీసుకుంటున్నానని తెలియజేసింది. ఈ మహిళకు రోగ లక్షణాలన్నీ చాలావరకు నయమైనందువల్ల మరియు అభ్యాసకుని ద్రిష్టిలో రోగి స్వీయ ప్రేరణకు గౌరవమివ్వడం ప్రధానమైనందువలన ఈ రోగితో సంపర్కం ఇప్పుడు తగ్గిపోయింది.
హే జ్వరం 02754...Japan
ఒక 59 ఏళ్ళ మహిళ, ప్రతి వసంత కాలములో సెడార్ చెట్టు పుప్పొడి ఎలర్జీ వల్ల చాలా భాదపడుతూ ఉండేది. పలు మార్లు ఈమెకు విపరీతమైన గొంతు నొప్పి మరియు నాసికా కంజెషన్ వల్ల రాత్రి నిద్రలో ఆటంకం కలిగి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండేది. 2013 జనవరిలో అభ్యాసకుడు ఈమెకు మరియు ఈ సమస్యతో భాదపడుతున్న ఇతరలుకూ మందు తయారుజేసే నిమిత్తమై సెడార్ చెట్టు పుప్పొడిని సేఖరించారు.క్రింద వ్రాసిన మందు ఈమెకు మరియు ఇతరులకు ఇచ్చారు
Nosode of cedar pollen…TDS
నాలుగు నెలల తర్వాత ఈమెకు 90% నయమైంది. ఈమెకు ఇంకెప్పుడు నిద్రాభంగం కలగలేదు. ఈమెకు వసంతకాలమంటే ఒక మంచి భావన కలిగింది.ఈ క్రింద వ్రాసిన విధముగా ఈమె మందు తీసుకుంది
November & December…OD, January to April…TDS, May…OD.
ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్య 02754...Japan
ఒక 54 ఏళ్ళ మహిళ 2015 ఫెబ్రవరిలో ఒత్తిడి సమస్యతో అభ్యాసకుడిని సంప్రదించింది.ఈమె అంతకుముందు పనిచేస్తున్న కంపనీ దివాళా ఎత్తడంతో కొత్త ఉద్యోగంలో జెరింది.అక్కడ రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయటంవలన ఈమెకు ఒత్తిడి,గుండె దడ కలిగి నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఈమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇచ్చారు
ఒత్తిడి కొరకు:
#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilities…TDS
నిధ్రలేమికోరకు:
#2. CC15.6 Sleep disorders
ఈమె నిద్రపట్టడం కొరకై వైబ్రిఒనిచ్స్ మందులతో పాటు అల్లోపతి మందులు కుడా తీసుకుంటానని చెప్పింది. మార్చ్ నెలలో వత్తిడి 50% తగ్గినట్లుగా ఈమె తెలియజేసింది. కాని ఈమెకు రోజంతా పనిచేసి కుర్చీనుండి లేచేటప్పుడు తలదిమ్ము కలిగేది. ఈమెకు గుండెదడ సమస్య ఉండడంతో ఆందోళన పడింది. ఈ సమస్యలకోరకు #1 మందు ఆపి ఈ క్రింద వ్రాసిన మందుల్ని ఇచ్చారు
#3. CC3.1 Heart tonic + CC3.6 Pulse irregular + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilities + CC18.7 Vertigo...TDS
రెండు రోజుల తర్వాత ఈ రోగి అభ్యాసకునికి పంపిన ఒక ఈమైల్లో తన ద్రిష్టికోణంలో మార్పు కలిగిందని మునుపు కన్నా ఆనందంగా ఉన్నానని వ్రాసింది. 2015 జులైలో ఈమెకు 75% నయమైందని రిపోర్ట్ చేసింది. ఈమె మందుల్ని ఇప్పుడుకూడా కొనసాగిస్తోంది.
అభ్యాసకుని వ్యాఖ్యానం:
ఈ వైబ్రియోనిక్స్ వైద్యం ద్వారా అవసరమైన వారందరికీ సేవ చేయడానికి అమూల్యమైన అవకాశాలు ఇవ్వబడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పేషంట్లునుండి అనుకూలమైన రిపోర్ట్లు అందినప్పుడు మరింత ఆనందంగా ఉంటుంది.
స్ట్రోక్ 02901...Italy
అభ్యాసకుడు ఇట్లు వ్రాస్తున్నారు: 2013 డిసంబర్లో ఒక 81 ఏళ్ళ వృద్ధురాలు ఇస్కీమియా వల్ల మెదడులో గాయం ఏర్పడడంతో ఆస్పత్రిలో చేర్చపడింది. అక్కడ ఆమె స్పృహ కోల్పోయింది.ఆమె మెదడులో రక్త స్రావాన్ని ఆపడానికి శస్త్ర చికిత్స చేయాలనీ వైద్యులు నిర్ణయించారు. వైద్యుడు అనుకూలమైన ఫలితం లభించడానికి అవకాశం తక్కువని హెచ్చరించారు. వైద్యుడు అనుకూలమైన ఫలితం లభించడానికి అవకాశం తక్కువని హెచ్చరించారు.నేను వెంటనే ఈ క్రింద వ్రాసిన మందుల్ని బ్రాడ్కాస్ట్ చేయడం మొదలు పెట్టాను
CC18.4 Stroke + SM2 Divine Protection + SR271 Arnica 30C…continuously
ఈమెకు చేసిన శస్త్రచికిత్స సఫలమైనప్పటికీ రోగియొక్క వయసు మరియు శారీరిక పరిస్థితిని ద్రిష్టిలో పెట్టుకొని వైద్యులు ఆమె కోలుకోవడం కష్టమని చెప్పారు.కాని ఈమెకు వైద్యులు ఆశ్చర్య పడే విధంగా రెండే రోజులలో స్పృహ వచ్చింది. కాని మరో 24 గంటలలో ఈమెకు మరొకసారి స్ట్రోక్ రావడంతో వైద్యులు ఈమె ఈసారి కొల్కోవడం అసాధ్యమని నిరాశపూరితంగా చెప్పారు. ఈమె మాట కోల్పోయారు.
వైబ్రియోనిక్స్ బ్రాడ్ కాస్ట్ 24గంటలు కొనసాగింది. ఆరు రోజుల తర్వాత ఈమె స్పృహలోకి వచ్చి కొన్ని మాటలు మాట్లడగలిగింది. పది రోజుల తర్వాత ఈమెలో గ్రహణ శక్తీ వచ్చి కొద్ది రోజులలో ఆశ్పత్రినుంది డిస్చార్జ్ అయ్యింది. ఈమె తనంతట తానుగా నడవలేకపోయినా చాలావరకు కోలుకుంది. మా అమ్మగారైనా ఈమెకు ఆశ్పత్రినుండి తిరిగి వచ్చినప్పుడునుండి అవే వైబ్రియోనిక్స్ మందులు 12.1 అడల్ట్ టొనిక్ చేర్చి ఇవ్వడం జరుగుతోంది.
ఒక మైనాకు పునరుజ్జీవనం 10940...India
2015 జూలై 15వ తేదిన నేను ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నపుడు ఒక మైనాపక్షిని , పక్కన ఉన్న కాలువలో పడి ఉండ్డడం చూసాను. అది చలికి వణుకుతు బైటకి రాలేని పరిస్ధితిలో ఉంది. నేను ఒక లోట తీసుకొని, ఆ పక్షిని బైటకు తీసి దాన్నిపక్కనె ఉన్నగడ్డి మీద సురక్షితంగా పెట్టడానికి ప్రయత్నించాను కానీ అది కుదురుగా నిలబడే పరిస్ధితిలో లేదు,చలికి వణుకుతూ స్ఫ్రుహ తప్పి నేలకు ఒరిగినది. పక్షిని అక్కడే వదిలేసినా ,వెంటనే వైద్యం చేయకపోయినా అది బ్రతకడం కష్టమని ఆర్ధమైయ్యింది.
వెంటనే ఆ పక్షిని మా ఇంటికి తీసుకుని వెళ్లి కామన్ కాంబో కిట్ నుండి CC1.1 Animal టొనిక్ పక్షి ముక్కు మీద రెండు చుక్కలు వేసాను. ఒక క్షణంలో పక్షికి స్పృహ వచ్చింది.
పావు గంటలో మైనా కొంచం కధల సాగింది. పక్షికి బలం పెంచడానికి CC12.1 Adult tonicతో పాటు స్వామీ విబూతి పక్షి ముక్కుమీద పులివాను,వెంటనే ఈ పక్షి తన ముక్కుని వెడల్పుగా తెరచి తన రెక్కల్ని విరిచింది. ఈ పక్షికి పూర్తిగా బలం వచ్చినట్లుగా నాకు అనిపించింది. 45 నిమిషలు తర్వాత ఈ పక్షి మా ఇంటి ప్రాంగణంలో నడవడం మొదలుపెట్టింది. రాత్రి 9 గంటలుకి ఇది తన ఆహారాన్ని వెంబడించడం చూసాను. మరోక గంట తర్వాత ఈ మైనా నా స్కూటర్ కింద పడుకిని నిధ్రపోయ్యింది. ప్రొద్దున్నఈ పక్షి నాకింక కనబడలేదు. తన దారిని తాను వెళ్లిపోయింది.
అధికముగా ఉన్న లాలాజల స్రావం మరియు కోపం 02806...Malaysia
ఒక 19 ఏళ్ళ యువకుడు ఒక ఏడాదిపాటు అధికముగా ఉన్న లాలాజల స్రావం సమస్యతో భాధపడ్డాడు. ఈ తెలివైన వ్యక్తి ఒక సంతోషమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగలేదు.అందువలన ఇతనికి కోపం అధికముగా ఉండేది. ఇతను అభ్యాసకుడిని సంప్రదించడానికి ముందుగా అనేక వైద్య నిపుణుల్ని సంప్రదించి వైద్యం తీసుకోవడం జరిగింది. కాని ఏ వైద్యము ఇతనికి పనిచేయలేదు. 2014 ఆగస్ట్ 31న ఇతనికి క్రింద వ్రాసిన వైబ్రో మందులు ఇచ్చాను
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders…TDS
ఆరు వారాల తర్వాత ఈ వ్యక్తి తన రోగ లక్షణాలలో ఏ మార్పు లేదని తెలియజేసాడు.ఇతనికి CC 11.5 చేర్చి ఇచ్చాను
#2. CC11.5 Mouth infections + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders…TDS
ఈ మార్పుతో ఈ వ్యక్తికి 5 వారాలలో సమస్య 30% తగ్గింది. ఇవే మందులు కొనసాగించడంతో మరో 3 వారాలలో 50% తగ్గి, ఆపై 2 వారాల తర్వాత 70% నయమైంది. డిసంబర్ 28న ఈ వ్యక్తికి 12 వారాల చికిత్స తర్వాత రోగ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూలై 29కి ఇతను ఆరోగ్యంగా ఉన్నాడు.
సంపాధకుని వ్యాఖ్యానం:
దీర్ఘకాలిక కేసులలో మందులను హటాత్తుగా ఆపివేయకుండా మెల్లగా తగ్గించాలి.
అభ్యాసకుల వివరాలు 02779...Japan
2009లో నాకు సాయి వైబ్రియోనిక్స్ సేవలో ఒక అభ్యాసకుడవ్వడానికి అవకాశమొచ్చింది.నాకు అంతకముందు ప్రత్యామ్నాయ చికిత్సలు నేర్చుకోవాలని చాలా ఆశక్తిగా ఉండేది. నాకు ఇంత అమోఘమైన సరళమైన చికిత్సావిధానం నేర్చుకునే అవకాశం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.ఈ అమూల్యమైన చికిత్సా విధానం ద్వారా నాకు జపాన్లో మరియు ఇండియాలో సేవ చెయ్యడానికి చాలా అవకాశాలు లభించాయి.ఇండియాలో ఒక గ్రామ సేవకు వెళ్ళినప్పుడు 200 మంది పేషంట్లకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం కలిగింది.ఈ అనుభవం ద్వారా నేను నిస్వార్థ సేవలో లభించే ఆనందాన్ని మరియు సంతృప్తిని రుచి చూసాను.
నేను మతధర్మ శాస్త్రంలో ఒక విద్యార్థిని. అందువలన నేను మొదట్లో వైబ్రియోనిక్స్ దేవుడిచ్చిన వరంగా కాకుండా ఒక భౌద్ధిక ద్రిష్టికోణంతో చూసేవాడిని.
మూడేళ్ళ తర్వాత 2012లొ నేను మానసికంగా మరియు శారీరికంగా చాలా క్రుంగి ఉన్నపుడు ఈ సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకున్నాను.ఆ సమయంలో నేను రోజుకి ఆరు గంటలు ధ్యానం చేస్తూ ఉండేవాడిని.సేవ చేయకుండా వట్టి ధ్యానం మాత్రం చేయడం ఉపయోగకరం కాదని అందరు చెబుతుంటారు.కాని నాకు ఆధ్యాత్మిక వికాశాన్ని పొందాలన్న అత్యాశ ఉండేది.ఒక రోజు ఒక చోట సాముహిక ధ్యానంలో పాల్గొనడానికి వెళ్తుండగా నేను వ్యాకులపడి చంచలమైన మనస్సుతో ఇంటికి తిరిగి వెళిపోయాను. ఈ వ్యాకులత ఆపై నాలుగైదు నేలలుకైన తగ్గలేదు. నన్ను దేవుడు ఒక్కడు తప్ప ఇంకెవ్వరు కాపాడలేరని అనిపించింది. చాలా రోజులవరకు నాకు దేవుడిని తలుచుకోకపోతే ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించేది.నేను స్వామీ పటం ఒకటి నా చేతిలో పెట్టుకుంటేగాని పడుకోలేక పోయేవాడిని. ఈ నా పరిస్థితి మారడానికి అందరిలో సాయిని చూసుకోవడం ఒకటే మార్గమని నాకనిపించింది.అప్పటినుండి నన్ను సంప్రదించడానికి వచ్చే ప్రతి పేషంట్లోను సాయిని చూసుకోవడం మొదలు పెట్టాను. ఇంత సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించి నన్ను అనుగ్రహించినందుకు స్వామికి మనసార నా కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాను. నేను పొందిన ఈ అనుభవాలు వలన సేవపై మరియు చికిత్సా విధానంపై నాకున్న ద్రిష్టికోణం పూర్తిగా మారిపొయినది.
నాకు కలిగే అనుభవాలు మరియు నేను కలిసే వ్యక్తులందరూ కూడా నా గత జ్ఞ్యాపకాలు మరియు నా మనస్సులో దాగి ఉన్న విషయాలు చూపించే అద్దాలే. నిస్వార్థ సేవ మరియు ప్రేమ నా మనస్సును శుద్ధ పరచడానికి ఉన్న ఏకైక మార్గాలని నేను గ్రహించాను. బాహ్య ద్రిష్టితో కాకుండా అంతర్ద్రిష్టితో చూడాలని నేను తెలుసుకున్నాను.ఈ విధంగా ఏ విధమైన దురభిమానాలు లేన స్వచ్చమైన కాంతి నానుండి వెలువడడానికి వీలుపడుతుంది. "అన్నికూడను మీ మనస్సు యొక్క రియాక్షన్, రిఫ్లెక్షన్,రిసౌండ్ " అన్న స్వామీ భోధన ఈ సేవ చేయడం ద్వారా నేను అర్ధంచేసుకోగలిగాను. నేను ఎప్పటికి స్వామీ యొక్క స్వచ్చమైన సాధనంగా ఉండాలని కోరుకుంటూనాను.
జపాన్ దేశంలో ఉన్నత వైద్య వ్యవస్థతో కూడిన ఉన్నత ప్రమాణంలో ఆరోగ్య సంరక్షణ మరియు జాతీయ ఆరోగ్య భీమ మాకు లభిస్తున్నాయి. నా అభిప్రాయంలో అల్లోపతి మందుల దుష్పరిణామాలు తెలుసుకొని,సఫలమైన మరియు సురక్షితమైన వేరే వైద్య విధానాల్ని ఎన్నుకుంటున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. స్వామీ మనకి అందచేసిన ఈ మహత్తరమైన చికిత్సా విధానాన్ని జపాన్లో ఇంకా ఎక్కువగా అందరు అర్ధంచేసుకొని, అంగీకరించి మరియు ఉపయోగించాలాని నేను మనసార కోరుకుంటున్నాను.
సంపాదకుని వ్యాఖ్యానం:
ఈ అభ్యాసకుడు అనేక రకాల వ్యాదుల్ని స్వామీ దయతో విజయవంతంగా నయం చేసారు.పీహెచ్ డీ చేసి మనావతా విలువల శిక్షణలో నేతృత్వం వహించిన ఈ అభ్యాసకుని అన్య వివరాలు, 2014 జనవరిలో ప్రశాంతి నిలయంలో జరిగిన మొదటి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సమావేశం కార్యకలాపాల పుస్తకంలో పు.107-112లలొ ప్రచురింపబడింది. ఈ సంచికలో ప్రచురింపబడిన జపాన్ అబ్యాసకుల బృందం వివరాలన్నీ సేకరించి మాకు అందించినందుకు ఈ అభ్యాసకునికి మా కృతజ్ఞ్యతలు తెలుపుకుంటూన్నాము.
అబ్యాసకురాలి వివరాలు 00971...Japan
అభ్యాసకుడు 02779...జపాన్ ఇట్లు వ్రాస్తున్నారు.గత 13 ఏళ్ళగా ఈ సోదరి జపాన్లో ఒక ప్రాంతంలో అనేకమంది రోగులకు వైబ్రియానిక్స్ ద్వారా వైద్యం మాత్రమే కాకుండా చాలా ప్రేరణ మరియు తన నిస్వార్థ ప్రేమను కూడా ఇచ్చింది. ఈ విధంగా ఈమె వైబ్రియానిక్స్ సేవాకార్యక్రమంలో ఉన్నత రీతిలో తోడ్పడింది.ఈమె చేసిన సేవలలో కొన్ని మాత్రం వ్రాస్తున్నాను. స్వామీ ఈమెను డా.అగ్గర్వాల్ ద్వారా అభ్యాసకురాల్ని చేసారు.ఈ దివ్య సేవా కార్యక్రమంలో చేరడానికి ముందు ఈమె హోమియోపతి,ఆయుర్వేదము,బాచ్ ఫ్లవర్ రేమడీలు మరియు ఇతర ప్రత్యామ్నాయ చికిత్సా విధానాల్ని అభ్యాసించింది.
పూర్తిగా పరిశోధన చేసి ఒకక్క రోగికి సరిపోయే మందుల్ని(రేమడీలు) గుర్తించి ఓర్పుగా తయారు చేసి ఇవ్వడం ఈమెలో ఉన్న అతి ఉన్నత గుణాలలో ఒకటి.ఈమె అవసరమైన వారికి SRHVP యంత్రం ఉపయోగించి నోసోడ్స్ (మందు) తయారు చేసిచ్చే అవకాశాన్ని ఎపుడు వదులుకోదు. వీలయినంత ఎక్కువుగా అవసరమైన వాళ్ళందరికీ సేవ చేయాలన్నదే ఈమె కోరిక.ప్రతి ఏడాది ఈమె 300 రోగులకు కాలిక రేమడీలు (సీసనల్ మందులు)పంపిస్తూ ఉంటుంది.(ఏప్రల్లో ఎండ దెబ్బ మరియు సెప్టంబర్లో ఫ్లూ జ్వరం కొరకై ). ఈ పేషంట్లు సాయి వైబ్రియానిక్స్ చికిత్సలో నమ్మకంతో ఈమని సంప్రదించుతూ ఉంటారు.
ఈమెకు అర్దరాత్రి వేళ కూడా ఫోన్లు రావడం మామూలే. 2012 జూలై 15న ఒక మహిళ ఈమెకు తెల్లవార్జామున ఫోన్ చేసింది. ఈ అభ్యాసకురాలికి ఆ మహిళ మాట్లాడే విధానాన్ని బట్టి ఆమె స్ట్రోక్ తో భాద పడిందని గ్రహించింది.ఈమె వెంటనే ఆ రోగి ఉండే ప్రాంతంలోనే ఉంటున్న ఒక స్నేహితురాలికి సహాయం కోరుతూ ఫోన్ చేసింది.ఈ స్నేహితురాలు ఆమె పేషంట్ అవడ్డంతో ఆమె దెగ్గర CC10.1 Emergencies మందు బాటిల్ ఉంది.అభ్యాసకురాలు ఈ స్నేహితురాలను ఆ రోగికి CC 10.1 Emergencies పిల్స వేసి ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పింది.ఈ అభ్యాసకురాలు అదే రోజు మధ్యానం రైల్లో రెండు గంటలు ప్రయాణం చేసి రొగి ఉన్న ఆసుపత్రికి చేరుకుంది. ఆ రోగికి ఎడమవైపున పక్షవాతం వచ్చిందని తెలియగానే ఈ అభ్యాసకురాలు రోగి కుమార్తెకు తాను తయారు చేసిన మందునిచ్చి రోగి నాలుక కింద మందుండేలా వేయమంది. రెండు రోజుల తర్వాత ఈ రోగికి కొద్దిగా నయమై తనంతట తానుగా మందు వేసుకోగలిగింది. వైద్యులు ఆశ్చర్యపోయే విధంగా ఈమె అతి త్వరలో కోలుకుంది. నలభై రోజుల తర్వాత ఈమె ఇంటికి తిరిగి వచ్చింది.ఈమెకు మాట స్పష్టంగా రాకపోయినా తనంతట తానుగా నడవగలిగింది.ఎనిమిది వారాలు తర్వాత ఈ రోగి కొద్ది గంటలు ప్రయాణంచేసి తన భంధువు వివాహానికి వెళ్లాలని ఆశ పడింది. అభ్యాసకురాలికి ఫోన్ చేసి ఇది సాధ్యం అయ్యేలా చేయమని కోరింది.
అభ్యాసకురాలు ఆమెను మందులని క్రమం తప్పకుండా వేసుకోవాలని నీరు అధికంగా తాగాలని నూనెతో మస్సాజ్ చేయించుకోమని మరియు ముఖ్యంగా దేవుడిని ప్రార్థించమని చెప్పింది.అభ్యాసకురాలు నిర్ణిత సమయంలో ప్రతివారం ఒక సారి ఈమెతో కలిసి ప్రార్థన చేసేది.స్వామీ దయతో ఈ రోగి తను కోరుకున్నట్లుగా వివాహానికి వెళ్ళగలిగింది.
ఈ అభ్యాసకురాలు ప్రతి రోగిలోను దైవాన్ని చూసుకుంటోంది.ఈ మహత్తరమైన సేవలో పాల్గొంటున్నందుకు తనకి చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
అభ్యాసకురాలి కేసు పుస్తకం నుండి
ప్రతి ఏడాది సెప్టంబర్ నెలలో 300 పేషంట్లకి నేను ఈ క్రింద వ్రాసియున్న మందుల్ని పంపిస్తున్నాను. NM11 Cold + NM12 Combination 12 + SM2 Divine Protection + SR360 VIBGYOR…రోగ లక్షణాలు కనిపిస్తే ప్రతి 15 నిమిషాలకి ఒకసారి తీసుకోవాలి. ఆ తర్వాత రోజుకి మూడుసార్లు(TDS) తీసుకుంటే సరిపోతుంది.
ఈ మందుల్తోపాటు అధికంగా నీరు తాగాలని నేను పేషంట్లకు సలహా ఇస్తాను. ఫ్లూ జ్వరం నివారణగా ఈ క్రింద ఇవ్వబడిన మందుల్ని నేను పేషంట్లకి పంపిస్తాను. CC9.2 Infections acute + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…3TW. ఇది ఒక్క అద్భుతమైన నివారణ మందుగా పనిచేస్తుంది.ఈ మందుని తీసుకున్న వాళ్ళందరు ఫ్లూ జ్వరంనుండి తప్పించు
అభ్యాసకురాలి వివరాలు 02754...Japan
నేను 2008 సెప్టెంబర్లో పుట్టపర్తిలో ఉన్నసాయి బాబాగారి ఆశ్రమంలో ఉన్నపుడు సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నాను. నాకున్న ఒక ఆరోగ్య సమస్య గురించి చెబుతుండగా వైబ్రో అభ్యాసకుడైన ఒక భక్తుడు నన్ను వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవమని ప్రోత్సాహించాడు. నా సమస్య ఏమిటంటే ఫెబ్రవరి 15న మా ఇంట్లో ఉండగా నాకు విపరీతమైన తలనొప్పితో పాటు తలలో ఏదో పెలినట్లుగా శబ్ధమొచ్చింది.ఆ విపరీతమైన నొప్పివలన నాకు ఊపిరాడలేదు. నేను ఒకటి నుండి పది లెక్క పెట్టేలోపు నొప్పి తగ్గకపోతే ఆమ్బులన్స్ని పిలవాలని నిర్ణయించుకున్నాను.వెంటనే నా తలనొప్పి మటుమాయమయిపోయింది.ఈ సంగటన తర్వాత నేను నా స్నేహితురాలిని కలిశాను.ఆమెకు ఆధ్యాత్మిక విషయాల గ్రహనశీలత ఎక్కువ.ఆ రోజు నాకొచ్చిన విపరీతమైన తలనోప్పినుండి సాయిబాబా నన్ను కాపాడారని ఆమె నాకు చెప్పింది. నాకొచ్చిన తలనొప్పికి కారణం నా మెదడులో ఉన్న వేరికోస్ వీన్స్ అని తర్వాత నేను ఇండియాకు వెళ్ళినప్పుడు తెలిసింది. ఇదే నన్ను సాయి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవడానికి దారితీసింది. మందులు మొదలుపెట్టిన మూడు రోజులకి తలలో నాకున్న అసౌఖర్యం తొలిగింది. ఇంత త్వరగా నాకు నయమవ్వడంతో నేను చాలా ఆశ్చర్య పోయాను.స్వామికి నా మనసార నా కృతజ్ఞ్యతలు తెలుపుకున్నాను.
నాకు 2008 డిసంబర్లో మూడు నెలల వైబ్రియానిక్స్ చికిత్స పూర్తవ్వగానే డా అగ్గర్వాల్ని కలిసి అభ్యాసకులు శిక్షణ కొరకై దరఖాస్తు పత్రాన్ని ఇచ్చాను. ఇంగ్లిషు రానందువలన నాకు వైబ్రియానిక్స్ లో శిక్షణ పొందడానికి నా భాషలో అర్ధం చెప్పేవాళ్ల సహాయం కావలిసివచ్చింది. స్వామీ నాకు సహాయం చేయడానికి నలుగురు వ్యక్తుల్ని పంపారు.అందులో ఒకరు సీనియర్ అభ్యాసకుడు అవ్వడం విశేషం.
సాంప్రదాయక అల్లోపతి వైద్య విధానం జపాన్లో స్థిరంగా ఉన్నపటికీ, ఈ మధ్య ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని చాలా మంది కోరుకుంటున్నారు. ఆరోగ్యకరమైన మరియు ప్రయోజకరమైన జీవిత విధానాన్ని కోరుకునే వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. నన్ను సంప్రదించడానికి కొత్త పేషంట్లు ఇతరుల ద్వారా తెలుసుకొని వస్తున్నారు.
ప్రశ్న జవాబుల విభాగము
1. ప్రశ్న:మేము ఎక్కడికైనా ఎక్కువ సమయానికి(ఉదాహరణకి 3 నెలలు) వెళ్ళవలిసి వస్తే అపుడు పెశంట్లుకి చెప్పాలా? ధీర్గకాలిక రోగ సమస్యలుకి ఎన్ని బాటిల్స్ మందులివ్వాలి?లేక పెశంట్లుని వేరొక అభ్యాసకుడిని హీలర్ ఇన్ఫో ఈమెయిలు ద్వారా సంప్రదించమని చెప్పాలా?
జవాబు: మీరు ఎక్కువ కాలానికి ఎక్కడికైనా వెళుతుంటే పెషంట్లకి ఆ విషయం తెలియచేయడం మంచిది.పేషంట్లు మందుని నీళ్ళలో కలిపి తీసుకొమ్మని చెప్పండి.(200మిలి నీళ్ళలో 5 పిల్స్ కలపాలి). ఈ విధంగా చేసినప్పుడు ఒక బాటిల్ మందు రోజుకి మూడుసార్లు తీసుకుంటే మూడు నెలల వరకు సరిపోతుంది.పెశంట్లుకి వేరొక అభ్యాసకుడి సంపర్క వివరాలు ఇవ్వడం మంచింది.
________________________________________
2. ప్రశ్న: అప్పుడపుడు పేషంట్లు వాళ్ళ కుటుంభ సభ్యులకి మందులు కావాలని అడిగి మందులు తయారుచేసాక వచ్చి తీసుకోరు.మరికొద్ది మంది మందును తీసుకొని వాడకుండా ఉంచుకుంటారు లేదా వేసుకుని ఏ సమాచారము తెలియచేయరు. ఇటువంటప్పుడు ఒక అభ్యాసకునిగా నేను ఏమి చేయవలెను?
జవాబు: ఒక పేషంటు మరో వ్యక్తి కొరకై మందు అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి మీతో సంప్రదించినట్లయితేనే మీరు ఆ పేషంటుకి మందు తయారు చేయాలి.మీరు ఈ క్రింద వ్రాసిన మూడు కారణాలు కొరకు పేషంటుతో స్వయంగా సంపర్కం పెట్టుకోవాలి:1) పేషంటుకి వైబ్రియానిక్స్ మందులు కావాలా వద్దాయని కచ్చితంగా తెలుసుకోవడానికి 2) పేషంటుకి మొదటి డోస్ అభ్యాసకుడు స్వయంగా వేస్తే మంచిది.3) పేషంటుకి ఈ మందు వాడేడప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు స్వయంగా చెప్పడానికి. పేషంటు తనకున్నసమస్యల్ని తానే స్వయంగా వివరించితే మంచిది.
________________________________________
3. ప్రశ్న:కొంతమంది పేషంట్లు రెండు లేదా ఇంకా ఎక్కువ రకాల మందులు తీసుకుంటున్నపుడు మధ్యలో పది నిమిషాల సమయం చాలా అధికమని అంటున్నారు.వాళ్ళకి నేను మొదటి మందు తీసుకున్న వెంటనే మరో మందు తీసుకోవచ్చని చెప్పవచ్చునా?
జవాబు: రెండు విధముల మందులకి మధ్య పది నిమిషాల వ్యవధి అవసరం లేదు. మొదటి పిల్ నోటిలో కరిగిపోగానే రెండవ పిల్ వేసుకోవచ్చు.
________________________________________
4) ప్రశ్న:నేను పంపిన అసాధారణ (ఎక్స్ట్రా ఆర్డినరీ ) కెసు ప్రచురింపబడ్డ ఒక నెలరోజుల తరవాత ఆ పేషంట్ తన సమస్యకి సంభందించిన వేరే అంశాలలో కూడా మెరుగు కనపడింది.మరో ఐదు నెలల తరవాత ఈ పేషంటు ఆరోగ్యం మరింత మెరుగుపడిందని తెలిసింది.నేను ఈ కేసు వివరాలని తాజా మార్పులతో మళ్ళి పంపించాలా?
జవాబు: పెషంట్లో వ్యాధి సంభందించిన వేరే అంశాలలో మెరుగు ఏర్పడినందువలన మీరు ఈ కేసు మునుపటి సూచికతో పాటు కొత్తగా ఏర్పడిన మార్పులను పంపవలెను.(వార్తాలేఖ నెల మరియు ఏడాది)
________________________________________
5) ప్రశ్న: నేను అప్పుడప్పుడు వేర్వేరు ధీర్గకాలిక రోగ సమస్యలకి మందులన్నీ ఒకటే కవర్లో పెట్టి పంపిస్తాను.ఆ పేషంటుకి పుల్ అవుట్ లేకపోతే రెండవ మందుని కూడా తీసుకోవడం మొదలుపెట్టమని చెప్పవచ్చా?
జవాబు: పేషంటుకి పుల్ అవుట్ లేకపోయినా లేదా పుల్ అవుట్ పూర్తయిన తరవాత మొదటి సమస్యలో కొంతవరకు మెరుగు కనిపించాక రెండవ మందుని తీసుకోవడం మొదలు పెడితే మంచిది.
________________________________________
6. ప్రశ్న: ఒక పేషంటు తన మందుల్ని వేసుకోవడంలో క్రమం పాటించకుండా తన రోగ లక్షణాలు నయం కావట్లేదని మోర పెట్టుకుంటే నేను ఎలా స్పందించాలి?
జవాబు: మనమిచ్చే మొదటి మరియు ఆఖరి మందు ప్రేమ మాత్రమే. మందు తీసుకోవడంలో ఎంతుకు పేషంటు క్రమం పాటించలేకపోతున్నాడో అడిగి తెలుసుకోవాలి.పేషంటు ఇచ్చే సమాధానం ఓర్పుగా వినండి.క్రమం తప్పకుండా ఈ మందు వేసుకుంటే త్వరగా ఉపసమనం కలుగుతుందని ప్రేమగా చెప్పి పేషంటుని మందు రోజు వేసుకోనేలా ప్రోత్సాహించాలి.
________________________________________
7. ప్రశ్న:పాత పేషంట్లు ఫోన్లో సంప్రదించినప్పుడు సుమారు ఎంత సేపు వాళ్ళకి నేను ఇవ్వచ్చు?అప్పుడప్పుడు నేను వాళ్ళతో సంభాషణని ముగించాలాని ప్రయత్నిస్తే పేషంట్లకు నచ్చడంలేదు.
జవాబు: ఒకవేళ ఫోన్ సంపర్కం ఫాల్లో అప్ విసిటుకి భధులుగా అయితే ఆ పేషంట్కి మీరు 30 నిమిషాలు సమయం ఇవ్వవచ్చు.మీరు మీ సంభాషణని ఏ విధంగా మళ్లించాలంటే ఈ ముప్పై నిమిషాల సమయంలో ఆ పేషంటు తాను చెప్పవలసినదంతా చెప్పాక మీరు అతని ప్రశ్నలన్నిటిని ఓర్పుతో విని ప్రేమతో జవాబివ్వడానికి అవకాశం ఉండాలి. మీ సంభాషణ ప్రారంభంలోనే మీరు ఎంత సమయం ఆ పేషంట్ కి ఇవ్వగలుగుతారని చెప్పడం మంచిది.
________________________________________
8. ప్రశ్న:పేషంట్లని తపాలు పంపడానికయ్యే ఖర్చుని ఇవ్వమని అడగవచ్చునా?
జవాబు: పేషంట్లనుండి పైకము తీసుకోము అని మీరు ప్రమాణం చేసియున్నారు కనుక తపాలు పంపడానికి కావలసినంత పైకం మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోవడం మంచిది.ఒకవేళ తపాలు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటె మీరు పేషంట్లను తపాలా బిళ్ళలని మీకు పంపించమని అడగవచ్చు.
________________________________________
9. ప్రశ్న:ఒకవేళ పేషంట్ బహుమానంకాని పైకంకాని మనకివ్వాలని తీసుకొస్తే ఏం చేయాలి?
జవాబు: పేషంట్లకు చికిత్స ప్రారంభంలోనే మీరు బహుమానాలుకాని పైకంకాని తీసుకోరని ప్రమాణం చేసియున్నారని తెలియచేసుంటే కనుక ఇలాంటి సందర్భం రానే రాదూ.ఒకవేళ పేషంటు మీకు పైకం బహుమతిగా ఇవ్వాలని పట్టుబడితే ఆ పైకాన్ని విరాళముగా వేరే చోట ఇవ్వమని చెప్పచ్చు. ఒకవేళ పేషంటు మీకు బహుమతినిగాని లేదా అభిమానంతో మీకు ఉపకారం చేయాలని చూస్తే మీరు ప్రేమతో తిరస్కరించాలి. పేషంటుకి ఏదైనా ఉపద్రవం కలిగినట్లయితే అతనికి/ఆమెకి వచ్చిన మంచి ఆలోచనకు ధన్యవాదాలు తెలుపుకొని ఆ బహుమతిని ప్రేమతో తిరిగి ఇచ్చేయాలి. ఆ పేషంటు సేవ చేయడానికి మీకొక మంచి అవకాశాన్ని ఇచ్చి మీ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సహాయపడ్డారని చెప్పండి.
దివ్య వాక్కు
“అనారోగ్యానికి ప్రధాన కారాణాలు ఏమీ? ఈ భువిపైన వేర్వేరు జాతులుకి చెందిన లక్షలాది జీవులు నివసిస్తున్నాయి. జీవరాసులన్నికూడను ప్రక్రుతినుండి లభించే ఆహారాన్నే అలాగే తీసుకుంటాయి.ఈ విషయంలో మానవ జాతోకటే మినహాయింపు. ప్రకృతి అందించే స్వచ్చమైన ఆహారాన్ని అలాగే తీసుకోకుండా రుచి కొరకు కూరగాయిలిని ఉడికించి వేయించి మరియు ఇతర పదార్థాలన్నీ వాటిలో కలిపి భుజిస్తున్నారు. ఇటువంటి ప్రక్రియలు ద్వారా ఆహారంలో ఉన్న బలం మరియు జీవశక్తి నశిస్తోంది. ఇటువంటి ఆహారాన్ని భుజించడం వలన అనారోగ్యాలు వస్తాయి. పక్షులు మరియు జంతువులు ఇటువంటి నాసానముచేయు పద్ధతులు పాటించవు. ఇందువలన పక్షులకు మరియు జంతువులకు ఎటువంటి రోగాలు రావు”.
–సత్యసాయి బాబా “మంచి ఆరోగ్యం మరియు మంచితనం” దివ్యోపన్యాసం , 30 సెప్టంబర్ 1981,
http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf
“అహంకారాన్ని తొలగించడానికి సేవ ఒక గొప్ప సాధన.సేవచేసే వ్యక్తి మానవజాతి ఐక్యతను గుర్తించగలుగుతాడు. ఏ మానవుడైతే తన సమయాన్ని నైపుణ్యాన్ని మరియు తనకున్న శక్తిని సేవచేయడం కోసం కేటాయిస్తాడో అటువంటి మానవుడికి ఓటిమి భాద లేదా నిరాశ ఎప్పుడూ కలగవు. ఒక నిజమైన సేవకుడు అందరితోను మృదుమధురముగా సంభాషిస్తాడు. అతని హావభావాలు వినయముగలవిగా వుంటాయి. ఇటువంటి మానవుడుకి శత్రువుకాని, అలసటకాని, భయంకాని ఉండవు".
–సత్యసాయి బాబా, “ఆశ్పత్రులు మరియు ఆరోగ్యము” దివ్యోపన్యాసం, 28 ఆగుస్ట్ 1976,
ప్రకటనలు
❖USA శేఫర్డ్స్ టౌన్ ,WV : AVP వర్క్ షాపులు 2015 సెప్టంబర్ 11 నుండి 13 వరకు మరియు 2015 అక్టోబర్ 16 నుండి 18 వరకు మరియు స్వప్ వర్క్ షాపు 2015 సెప్టంబర్ 18 నుండి 20 వరకు. సంప్రదించవలసిన వ్యక్తి సూసన్ at [email protected].
❖UK లండన్: AVP వర్క్ షాపు 2015 ఆగస్ట్ 22 నుండి 23 వరకు మరియు రెఫ్రశర్ వర్క్ షాపు 2015 అక్టోబర్ 4వ తేదిన. దీని కొరకు సంప్రదించవలసిన వ్యక్తి జెరామ్ at [email protected], ఫోన్ నంబర్ 020-8551 3979
❖ ఇండియా,పూనే,మహారాష్ట్ర: రెఫ్రశర్ మరియు JVP వర్క్ షాపు 2015 అక్టోబర్ 10 నుండి 11వరకు. సంప్రదించవలసిన వ్యక్తి పద్మ at [email protected]
❖ఇటాలి పదువ వేనీస్: SVP వర్క్ షాపు 2015 అక్టోబర్ 16 నుండి 18 వరకు. సంప్రదించవలసిన వ్యక్తి మనోలిస at [email protected]
అదనంగా
2015 జూలై 11న హార్ట్ఫోర్డ్,CT,USAలో 108CCబాక్సుల రీచార్జి చేయు సెషన్(
USA , కెనడా సమన్వయకర్త01339…USA ఈ విధంగా రిపోర్ట్ చేస్తున్నారు : అర్హత పొందిన వ్యక్తులకి JVPలుగా(జూనియర్ వైబ్రో అభ్యాసకులు) శిక్షణ ఇవ్వబడింది. మిశ్రమాల(కాంబోస్) శక్తీ నిర్ధారించడానికి ఈ అభ్యాసకుల బాక్సులు రీచార్జి చేయడం జరిగింది. జూలై 11న 9 బాక్సులు రీచార్జి చేయబడినాయి. ఈ సెషన్లో అభ్యాసకుడు02867...USA.
వైబ్రియానిక్స్ ఉపయోగించి సాగుబడి చేసిన సేంద్రియ పొలం మీదొక ఒక ప్రధార్శననిచ్చారు.ఈ పొలంలో సాగుపడి చేయబడుత్తున్న కూరగాయిలు ఆరోగ్యకరంగాను మరియు బ్లాయిట్ సమస్య లేకుండా ఉంటున్నాయని తెలియచేసారు. మరొక అభ్యాసకుడు 02873...USA ఆ సెషన్లో కూడియున్న వాళ్ళందరికీ తను 108CC బాక్సుని పెట్టడానికి వాడుతున్న అల్యూమినియం పెట్టిని చూపించారు.ఈ పెట్టిని వాడడం వలన మిశ్రమాలు ఆవిరైపోవడం తగ్గిందని చెప్పారు.
మరొక రీచార్జి సెషన్ ఇదే ఏడాదిలో ఏర్పాడు చేసే ప్లాన్ ఉందని ప్రకటించారు
[గమనిక: 108CC బాక్సులు ప్రతి రెండేళ్ళకి ఒకసారి రీచార్జి చేయడం మంచిది. మిశ్రమాల శక్తిని మరొక ఏడాది వరకు కొనసాగించడానికి ప్రతి సీసాని అరచేతిమీద 9 సార్లు తట్టాలి.]
____________________________________________________________________________________________
2015 ఏప్రల్ 19న ఇల్ల్ఫోర్డ్, ఎస్సెక్స్,UK లో జరిగిన వైబ్రియానిక్స్ అభ్యాసకుల రెఫ్రెశర్ సమావేశం
ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం UK సమన్వయకర్త02822...UK చే రిపోర్ట్ చేయబడి మరియు అభ్యాసకుడు03513...UK చే సంకలనం చేయబడినది: 2015 ఏప్రల్ 19వ తేదిన రెఫ్రెశర్ వర్క్ షాపు జరిగింది. డా.జిత్ అగ్గర్వాల్ ఆయిన శ్రీమతిగారు హేమ సహాయంతో ప్రదర్శించిన ఈ వర్క్ షాపులో ముప్పై అభ్యాసకులు పాల్గొన్నారు. డా.అగ్గర్వాల్ ఆ వర్క్ షాపు వ్యవస్థాపకుడు మరియు UK సమన్వయకర్తయిన అభ్యాసకుడు02822...USA కి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ప్రాధాన్య విషయాల సారాంశం :
1.0 వైబ్రియానిక్స్ కి కొత్త గుర్తు చిహ్నం(లోగో)
సాయి వైబ్రియానిక్స్ కి ఇప్పుడొక కొత్త గుర్తు చిహ్నం ఉందని మరియు ఈ గుర్తు చిహ్నం ముద్రింపబడిన కరపత్రాలని త్వరలో అందరికి పంపబడుతాయని డా.అగ్గర్వాల్ ప్రకటించారు.
1.1 మాస్టర్ కాంబో(మిశ్రమాలు) కూడిక
మాకు కొత్త వివరాలు అందగానే వాటికి అనుగుణంగా మందుల్ని (రేమడీలు) మేము తాజా పరుస్తాము.ఉదాహరణకు 2015 ఏప్రల్ లో రెండు కొత్త రేమేడీలు మాస్టర్ బాక్సులో చేర్చపడ్డాయి. ప్రతి నెల క్రమముగా రిపోర్ట్ లు పంపించే అభ్యాసకులందరు ఈ కొత్త రేమేడీలుని మీ సమన్వయకర్తనుండి తీసుకోవడానికి అర్హులే.
1.2 108 కామన్ కంబో బాక్సు రీచార్జి
విధ్యుధయిస్కాంత వికిరణనం వలన మిశ్రమాల సాఫల్యం తగ్గుతుంది కాబట్టి ప్రతి రెండేళ్ళకి ఒకసారి అన్ని కంబో బాక్సుల్ని రీచార్జి చేయాలి
1.3 రేమడీలుకు(మందులు) CC10.1 Emergencies చేర్చడం
అభ్యాసకులంధిరిని వచ్చే మూడు నెలలకు రేమడీలకు CC10.1 Emergencies చేర్చమని సలహా ఇచ్చారు. కొంధరభ్యాసకులు ఈ మిశ్రమం చేర్చడం వలన చికిత్సలో సాఫల్యత పెరిగిందని రిపోర్ట్ చేయడంతో ఈ నిర్ణయానికి వచ్చాము. మీ స్పందనాంశం మాకు పంపవలెను.మూడు నెలల తరవాత దీని మూల్యనిర్ధారణ చేయబడుతుంది.
1.4 పేషంట్ల రికార్డులు వ్రాయుట మరియు పంపుట
అభ్యాసకులందరు ప్రమాణం చేసినట్లుగా ప్రతి నెల ఒకటో తారీఖున రిపోర్ట్ లను పంపించాలి.ప్రతి నెల పేషంట్ల రికార్డు మరియు వేరే వివరాల సారాంశ పత్రము విడిగా పెట్టుకుంటే మంచిది. నెల సారాంశ పత్రంలో పాత పేషంట్లు, కొత్త పేషంట్లు,జంతువులు మరియు మొక్కలకి విడివిడిగా నిలివు వరుస విభజన చేసుకొని ఉంచాలి. సంభందించిన వరుసలో పేషంటు పేరు, సంప్రదించిన తేది వ్రాయవలెను.ఈ విధంగా చేసిన పేషంట్ల వివరాలు మరోసారి చూడడానికి మరియు రిపోర్ట్ లు పంపించడానికి మీకు సులభంగా ఉంటుంది. దీంతోపాటు ప్రతి పేషంటుకి ఒక చెక్ లిస్టు ఉపయోగించడం మంచిది. దీనివలన పేషంటు ముఖ్య వివరాలన్నీ తీసుకోవడానికి సులభంగా ఉంటుంది.
1.5 రేమేడీలకు సూచిక చీటీ వ్రాయుట
ఒక చీటిలో మీ రికార్డు పుస్తకంలో వ్రాసియున్న పేషంటు సూచిక సంఖ్య వ్రాసి పేషంటుకు ఇచ్చే సీసా మీదఅతికించండి. ఆ చీటీ మీద రోగ లక్షణాలు కాని లేదా సమస్య పేరుకాని వ్రాయవద్దు.చీటీ మీద పేషంటు పేరుకూడా వ్రాయవచ్చును లేదా "హీలింగ్", "ఫీల్ బెటర్" వంటి మంచి పదాలు వ్రాయవచ్చును.”.
1.6 రేమడీలు తయారు చేయడం
నీటికున్న మధ్యస్దత గుణం వలన వైబ్రేషన్స్ మెమరీ నీటికి అధికంగా ఉంటుంది. ఇందువలన రేమడీలుని నిరంతరం నీళ్ళలోనే తయారు చేయడం మంచిది. అదొకటే కాకుండా నీటిలో రేమడీలు తయారు చేయడంవలన పిల్స్ ఎక్కువ రోజులవరకు వస్తాయి. ప్రాణాంతకమైన రోగాలున్న పెశంట్లుకి మనశ్శాంతి కలుగ చేయడం చాలా ముఖ్యం. సాయి వై బ్రియానిక్స్ రేమడీలు పేషంటు మనస్సుపైన పని చేసి ప్రశాంతతును సౌఖర్యాన్ని ఇవ్వడంతో పాటు కొంతవరకు రోగుల జీవిత కాలాన్ని కూడా పెంచుతాయి. ఒకొక్కసారి రేమడీయొక్క ప్రభావం మనకి బాహ్యంగా కనపడకపోయినా అంతర్గతంగా చాలా మార్పులను తీసుకువస్తాయి.
1.7 రేమడీలను కలుపుట
పేషంటుకి హితము కలుగుతుందంటే అనేక మిశ్రమాలను ఒక సీసాలో కలపడం ప్రస్తుతం మనం పాటించే విధానం.కాని ధీర్గకాలిక రోగాలకు మూలకారణాన్ని తెలుసుకొని వాటికి తగిన రేమడీను కలపడం చాలా ముఖ్యం.ఉదాహరణకు వ్యాధి నరాలకు సంభందిన్చినధయితే ఛ్ఛ్18.5 Neuralgia వేయడం చాలా ఉపయోగకరం.
1.8 నోసోడ్స్ ఉపయోగించడం
- నొప్పి తగ్గించడానికి డిక్లోఫెనాక్ వంటి నొప్పి తగ్గించే అల్లోపతి మందులియొక్క (పెయిన్ కిల్లర్స్) నోసోడ్స్ ఉపయోగించడం మంచిదని శ్రీమతి అగ్గర్వాల్ సలహా ఇచ్చారు. ఒక పెయిన్ కిల్లరియోక్క నోసోడ్ తీసుకున్నపుడు 25 ఏళ్ళగా ఉంటున్న ఒక నొప్పి వారం రోజులలో తొలగిందని ఒక అభ్యాసకురాలు తన అనుభవాన్ని పంచుకుంది.కీమోతేరపి యొక్క దుష్పరినామాలను నయం చేయడానికి SR559 Anti chemotherapy కార్డు ఉపయోగిస్తే మంచి ఫలితం లభిస్తుంది.30C మరియు CM పోతన్సీలలో పోతంతయిస్ చేయాలి. లేదా రక్తానిదో లేదా ఒక తలవెంట్రుకధో నోసోడ్ తయారుచేసి ఇవ్వవచ్చు.
- నొప్పి తగ్గించడానికి నోసోడ్ ఉపయోగించి చికిత్స చేస్తున్నపుడు వేరే రేమడీలు ఇవ్వకపోవడం మంచిది.
- ఏదైనా మందువలనో లేదా వేరే పదార్థం వలనో చర్మం మీద ధద్దుర్లుకాని మంటకాని ఉంటె అపుడు అదే మందుయొక్క నోసోడ్ తయారుచేసిస్తే ఆ రోగలక్షణాలు తొలగిపోవడానికి సహాయపడుతుంది.20 ఏళ్ళగా ఒక ఏంటి బయాటిక్ దుష్పరిణామం వలన ఒక పేషంటుకు దగ్గు వచ్చేది.ఆయొక్క ఏంటి బయాటిక్ నోసోడ్ తీసుకున్న ఒక వారంలో దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. చర్మం దురధగానో మంటగానో ఉన్నప్పుడు SR317 Sulphur ఇవ్వవచ్చు కాని దీని వలన పుల్ అవుట్ అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
1.9 పొగచుట్ట(సిగరెట్) తాగడం మరియు ఇతర దుర్వ్యసనాల చికిత్స
మత్తుమందు, మధ్యసారం,పొగాకు మొదలైన ధుర్వ్యసనాలుగల పేషంట్లకు నోసోడ్ తయారు చేసివ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. సిగరెట్ వ్యసనానికి సిగరెట్ నుండి చేసిన నోసోడ్ మూడుసార్లు (TDS) తీసుకోవాలి.దీనివలన లాలస తగ్గుతుంది. పెశంటును సిగరెట్ తాగడం ఆపమని చెప్పనక్కర్లేదు. ఒకవేళ పేషంటు భార్య తన భక్తకు ఈ వ్యసనాన్ని మాన్పించడానికి రేమడీ ఇవ్వమని అడిగితే మీరు ఇవ్వరాదు.పెశంటును స్వయముగా మిమ్మల్ని సంప్రదించమని చెప్పాలి.పేషంటు స్వయంగా వచ్చినప్పుడు అతనిని కౌన్సలింగ్ చేసి అతను సిగరెట్ వ్యసనం మానడానికి నిశ్చయంగా ఉన్నదా లేదాయని అడిగి తెలుసోకోవాలి.అతను నిశ్చయంగా ఉన్నట్లయితే ఒక పత్రం మీద ఈ క్రింద వ్రాసిన ప్రమాణాన్ని వ్రాయమని చెప్పండి"సిగరెట్ తాగడం నా ఆరోగ్యానికి హానికరమని నాకు తెలుసు. అందువలన ఈ వ్యసనాన్ని మానేస్తానని ప్రమాణం చేస్తున్నాను." పేషంటు ఈ పత్రాన్ని తన సిగరెట్ పాకెట్లో పెట్టుకోవాలి.ప్రతిసారి సిగరెట్ అందులోంచి తీసేముందు ఆ ప్రమాణాన్ని గట్టిగా చదవాలి.ఈ విధంగా చేసినప్పుడు సిగరెట్ తాగే వ్యసనం సులభముగా తొలగిపోతుంది.
2.0 డా.అగ్గర్వాల్ తో ప్రశ్న జవాబులు
2.1 ప్ర: ప్రతిసారి ఒక కొత్త పేషంటుకి మొదటి డోస్ దేవుడిని ప్రార్థిస్తూ నోటిలో వేయాలా?
జ: అవును.చికిత్స స్వామీ దీవెనలతోనే మొదలుపెట్టాలి. మొదటి డోస్ ను నీటిలోనో లేదా పిల్గానో అభ్యాసకుడు స్వయంగా పేషంటు నోటిలో వేయడం పద్ధతి.ప్రార్థన చేయడం వలన దైవంతో సంపర్కం ఏర్పడి దివ్యశక్తి పెశంట్లోకి అభ్యాసకుడు ద్వారా ప్రవహిస్తుంది.ఈ ప్రక్రియకి అభ్యాసకులు సాధనాలు మాత్రమే.అందరిని నయం చేసే వైద్యుడు స్వామియే.
2.2 ప్ర:భారతంలో దాదాపు అన్ని నగరాలలో నీరు శుద్ధీకరిణిలు(వాటర్ ప్యురిఫయర్) ఉపయోగిస్తున్నారు.వీటిలో UV కిరణాలతో నీటి శుద్ధీకరణ జరుగుతోంది.లాంటి నీటిని వై బ్రియానిక్స్ రేమడీలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చా?
పరిశుబ్రము అయిన తరవాత నీటిలో UV కిరణాలు ఉండవు. అందువలన ఇటువంటి నీటిని వైబ్రియానిక్స్ రేమడీలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. స్వచ్చమైన త్రాగునీటితో వై బ్రియానిక్స్ రేమడీలు తయారు చేయవచ్చు. ఇత్తడి పాత్రలో ఉంచిన త్రాగునీరైన రేమడీల తయారీకి ఉపయోగించచ్చు.
2.3 ప్ర: వైబ్రేషన్స్ పిల్ల్స్ లో ఎంత కాలం వరకు నిలచియుంటాయి. వైబ్రియానిక్స్ చేతి పుస్తకములో ఆరు నెలలు వరకు నిలచియుంటాయని ఉన్నదీ. కాని ఒక అభ్యాసకుడు వైబ్రేషన్స్ మూడు నెలలు మాత్రమే నిలచియుంటాయని చెప్పారు. ఈ విషయాన్ని వివరించమని కోరుతున్నాను?
జ: సాధారణంగా పిల్ల్స్ ని అనుకూలమైన శాంతమైన మరియు విద్యుత్ కిరణప్రసారం లేని పరిసరాలలో ఉంచినప్పుడు వైబ్రేషన్స్ పిల్ల్స్ లో ఆరు నెలల వరకు నిలచియుంటాయి.కాని పిల్ల్స్ ని వికిరణం ఉన్న ప్రాంతాలలో ఉంచినప్పుడు ఆ పిల్ల్స్ లో వైబ్రేషన్స్ రెండు లేదా మూడు నెలల వరకు మాత్రమే నిలచియుంటాయి.
2.4 ప్ర: ఒకవేళ ఒక పేషంటుకు ఆపుకోడానికి వీలుబడని మూత్రవిసర్జన సమస్య మరియు మలభాద్దకము ఉంటె ఆ రోగికి CC4.4 ఇవ్వడం వలన మూత్రం ఆపుకోలేమి సమస్య ఇంకా అధికమవుతుందా?
జ: మలబద్ధము మరియు మూత్రం ఆపుకోలేమి సమస్య ఉన్న పేషంటుకి CC4.4 ఇవ్వవచ్చు. పేగులు కదిలి కడుపు కాళీ అవడం వలన మూత్రాశయం పై ఒత్తిడి తగ్గుతుంది.
2.5 ప్ర: నాకు ఒక అభ్యాసకురాలు తను మిశ్రమాల సీసాలను ఆల్కహాల్తో నింపుతుండగా 'ఓం శ్రీ సాయి రామ్'అని 108 సార్లు జపిస్తానని చెప్పింది. ఇలా చేయడంవలన మిశ్రమాలు రీచార్జి అయ్యి వాటి శక్తీ ఇంకొంచం పెరుగుతుందని ఆమె చెప్పింది.మీరు ఈ విషయాన్ని నిర్ధారించగలరా?
జ: మిశ్రమాల సీసాలని ఆల్కహాల్తో నింపేడప్పుడు 108 సార్లు నామజపం అవసరం లేదు. [సంపాదకుడి వ్యాఖ్యానం:అభ్యాసకులు నామజపం లేదా ఇతర సాధనలు వలన తమ సేవా కార్యక్రమాలని కొనసాగించడం చాలా మంచి విషయం]
2.6 ప్ర: రేమడీని నీటిలో తీసుకున్నప్పుడు ఆ నీటిని మింగడానికి ముందు నోటిలో కొద్ది సేపటివరకు ఉంచాలా?
జ:అవును.వైబ్రో నీటిని మింగడానికి ముందు నోటిలో ఒక నిమిషం వరకు ఉంచాలి.
2.7 ప్ర: అల్లర్జీలు మరియు వ్యసనములునుండి నోసోడ్స్ తో త్వరగా ఉపశమనం కలుగుతుందని విన్నాము. AVP మరియు JVP నోసోడ్స్ తయారు చేయలేరు కాబట్టి 108మిశ్రమాల బాక్సుతో ఇదే స్పందన లభిస్తుందా?
జ:లేదు. కామన్ మిశ్రమాలతో నోసోడ్స్ వాడినప్పుడున్న స్పందన లభిస్తుందని మేము ఆశించట్లేదు.ఎందుకనగా నోసోడ్ చికిత్స ప్రత్యేకించి ఒక రోగ లక్షణాన్ని గురిగా చేసి పనిచేస్తుంది.అందువలన ఉపశమనం వేగంగా కలుగుతుంది.
2.8 ప్ర: సయాటికా సమస్యకి చికిత్స ఎలా చేయాలి?
జ:సయాటికా సమస్యకి CC18.5 Neuralgia ఒకటే సరిపోతుంది లేదా SR289 Drocera కూడను ఉపయోగించవచ్చు. మశీన్ని ఉపయోగించి 240 మరియు 242 కార్డ్స్ ని తయారు చేసి మూత్రపిండాల మరియు మూత్రాశ్రయ మరిదియన్ల సమీకరణ చేయడం సహాయపడుతుంది.
2.9 ప్ర: ఒక పేషంటుకి రక్తపోటు మందు వేసుకోవడం వలన కాళ్ళ దురద సమస్య వచ్చింది. ఈ సమస్య వైబ్రో రేమడీతో కూడా నయం కావట్లేదు.కొద్ది సంవత్సరాల క్రితం ఈ వ్యక్తికి రక్తపోటు ఉండడం వలన పెరిందోప్రిల్ మందు ఇవ్వబడింది.దీని వలన కాళ్ళ దురద మొదలవడంతో ఆ మందును ఆపి రామిప్రిల్ మరియు ఫెలిదోపిన్ మందులు ఇవ్వబడినాయి.అయినా దురద తగ్గలేదు.దీనితోపాటు ఈ పేషంటుకి చెవిలో టినీటస్(చెవిలో ఏదో శబ్దం వినపడడం) సమస్య మొదలయింది. ఈ సమస్య కూడను వైబ్రో రేమడీతో నయంకావడం లేదు.దురద మరియు టినీటస్ రామిప్రిల్,ఫెలిదోపిన్ మరియు పెరిండోప్రిల్ మందులు వలన కలిగే దుష్పరిణామాలు.ఈ పేషంటుకు ఎలా చికిత్స చేయవచ్చు?
జ:మూడు రకాల రక్తపోటు మందుల నోసోడ్లు తయారు చేసివ్వడం దుష్పరినామాలని తొలగించడానికి సహాయపడుతాయి.317 కార్డు దురద తగ్గడానికి ఇవ్వవచ్చు కాని ఈ కార్డు తీసుకోవడం వలన పుల్ అవుట వచ్చే సంభావ్యత ఉన్నందువలన చాలా జాగర్త వహించాలి.
3.0 డా.అగ్గర్వాల్ యొక్క సందేశం
డా.అగ్గర్వాల్ సాయి వైబ్రియానిక్స్ వైద్య సేవను సమాజానికి పరిచితం చేయడానికి అభ్యాసకులను ఆహ్వానించారు:
సాయి వై బ్రియానిక్స్ ఉచిత వైద్య సేవను ఇంకా ఎక్కువమంది ఉపయోగించడానికి ఈ వైద్య విధానాన్ని గురించి సమాజానికి తెలియచేయాలి. ఆశక్తిగల మీ కుటుంభ సభ్యులకి మీ స్నేహితులకి మరియు పేషంట్లకి వైబ్రియానిక్స్ వెబ్సైట్ www.vibrionics.org, "సాయి వైబ్రియానిక్స్ అంటే ఏమిటి?" అన్న వీడియో మరియు అంతర్జాతీయ సమావేశ పుస్తకం వంటి వైబ్రియానిక్స్ సంభందించిన సాధనములను సూచించి వాళ్ళందరికీ వైబ్రియానిక్స్ ని పరిచితం చేసి మీ వంతు సేవని మీరు చేయండి. ఆశక్తిగలవారికి వైబ్రియానిక్స్ వార్తాలేఖను పంపించండి. మీరు స్వయంగా వ్రాసిన విషయాలేవైన ఉంటె ఎవరితోనూ పంచుకోవద్దు.
సాయి వైబ్రియానిక్స్ గురించి సమాచారం తెలపమని మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానిస్తే మీరు ఉపయోగించడానికి వీలుగా మా దెగ్గర తాజా సమాచారాలు చేర్చబడ్డ పవర్ పాయింట్ ప్రదర్శన పేకేజీలు లభిస్తాయి.మీ ప్రదర్సనకి ముందుగా మీరు స్వయంగా వైబ్రియానిక్స్ గురించి వ్రాసియున్న విషయాలేమైన ఉంటె నాకు సరిచూడడానికి పంపవలెను. ఉక్లో సాయి వైబ్రియానిక్స్ నిర్వాహణ కార్యక్రమంలో సహాయపడడానికి అనేక మంది వాలంటీర్లు ముందుకొచ్చారు.గుజరాతి మరియు ఫ్రెంచ్ భాషలలో విషయాల తయారీ జరుగుతున్నది. ఆఖరిగా మీరందరు భగవంతుడుకి చేసే ఈ సేవకి ధన్యవాదాలు.ఎప్పటిలాగానే రోగులని నయం చేసేది స్వామియే మనము స్వామియొక్క సాధనములు మాత్రమేయని గుర్తుంచుకోవాలి.వైబ్రేషన్స్ యొక్క శక్తీ మరింతగా పెరగడానికి అభ్యాసకుని ప్రేమ విశ్వాసాలు ప్రధానమైనవి. వైబ్రియానిక్స్ సంభందించిన సమాచారాలన్నీ మీరు ఎప్పడికప్పుడు తెలుసుకోవడం మంచిది. వైబ్రియానిక్స్ చేతి పుస్తకాన్ని క్రమముగా చదువుతూ ఉండండి. ప్రతినెల వార్తాలేఖలో ఇవ్వబడిన సమాచారాన్ని తెలుసుకోండి. రోగాన్ని తొలగించడానికి తన మనస్సు మూల సాధనమని పేషంట్లకు గుర్తుచేస్తూ ఉండండి. సానుకూల నిర్ణయాలు తీసుకోవడం,అనుకూలమైన విషయాలను ఊహించుకోవడం (విజువలయిజేషణ్ టెక్నిక్లు) క్షమాగుణం,క్రుతజ్ఞ్యత పెంచుకోవడం వంటి మార్పులను చేయడం వలన వేగంగా స్వస్థతను పొందవచ్చు.
జై సాయి రామ్!