Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 1 సంచిక 2
November 2010
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన వైబ్రో సాధకులకు

మేము వైబ్రియానిక్స్ వార్తాలేఖ యొక్క ప్రథమ సంచిక విడుదల చేసినప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధకుల  నుండి చాలా బలమైన ప్రతిస్పందన మాకు లభించింది. మా ఈ కొత్త ప్రయత్నం మీ అందరికి ఉపయోగకరంగాను మరియు మీరు మెచ్చుకునే విధంగాను ఉందన్న విషయం తెలిసి మేము ఎంతో ఆనందిస్తున్నాము. US నుండి ఒక అభ్యాసకురాలు ప్రథమ సంచికలో ప్రచురింపబడిన, ఒక కేసులో ఉపయోగించిన మందుల వివరాలను చూసి, అదేవిధమైన రోగ లక్షణాలున్న ఒక రోగికి ఆమె అవే మందులని ఇవ్వడం ద్వారా సఫిలతాలు లభించాయని మాకు తెలియచేసింది. ఇటువంటి సఫలమైన కేసు వివరాలను మరియు అనుభవాలను నిరంతరం మీరందరు మాకు పంపుతూ ఉంటారని  ఆశిస్తున్నాము.

2010 సెప్టంబర్ 17న వైబ్రియానిక్స్ వార్తాలేఖ యొక్క ప్రథమ సంచికను మన ప్రియమైన భగవాన్ భౌతికంగా ఆశీర్వదించారన్న శుభవార్తని మీకు ఆనందంగా తెలియచేస్తున్నాను (ఫోటోను చూడండి). స్వామి వార్తలేఖను తమ దివ్య హస్తాలతో తీసుకొని, అందులో ఉన్న నాలుగు పేజీలను చూసి తమతో పాటు తమ నివాసానికి తీసుకు వెళ్ళారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వైబ్రో సాధకులు అందిస్తున్న సేవను స్వామి అంగీకరించి ప్రోత్సాహన అందచేసారు.

2007 సంవత్సరానికి  ముందు వైబ్రో అభ్యాసంపై శిక్షణ పొందిన సాధకులకు, సాయిరామ్ హీలింగ్ వైబ్రేషణ్ పోతంటైసర్ను ఉపయోగించే విధానంపై విశేష శిక్షణ ఇవ్వబడింది. మీరిచ్చిన ప్రతిపుష్టి ద్వారా, మీలో కొందరికి 108 కామన్ కాంబోలపై ఎరుక లేదని మేము గ్రహించాము. 900 రోగ లక్షణాలకు పైగా నయం చేయగల రెడీమేడ్ మందుల సమితులే, ఈ 108 కామన్ కాంబోలు. వీటిని ఉపయోగించడం మరింత సులభం. నూతన వైబ్రియానిక్స్ అభ్యాసకులకు వీటి ఉపయోగాన్ని పై శిక్షణ ఇవ్వబడుతోంది.

2008 మార్చ్లో భగవాన్ 108 కామన్ కాంబోల బాక్సును భౌతికంగా ఆశీర్వదించారు. దీని తర్వాత సాధకులు అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. ప్రతి నెల రిపోర్టును క్రమం తప్పక పంపిస్తున్న ప్రతియొక్క అభ్యాసకుడు/అభ్యాసకురాలు ఈ బాక్సును పొందడానికి అర్హులే. అర్హులైన సాధకులు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు ఈ బాక్సును మా వద్ద నుండి తీసుకోవచ్చని తెలుపుకుంటున్నాము.

ఎప్పటిలాగే ఈ వార్తలేఖను మరింత మెరుగు పరచడానికి మీరు మాకు పంపిచే విలువైన సలహాలను మరియు ఆలోచనలను మేము ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాము. మీరందరు మీ అభిప్రాయాలను లేదా ప్రశ్నలను పంపడానికి కొంత సమయాన్ని కేటాయించవలసిందిగా మా మనవి.

మీ నిరంతర ప్రేమను మరియు సహకారాన్ని ఆశిస్తున్నాము. మీరు చేస్తున్న గొప్ప సేవను కొనసాగించండి.

ప్రేమపూర్వకంగా సాయి సేవలో ఉన్న

జిత్ అగ్గర్వాల్

 

 

చిల్లుపడిన ఆంత్రం (ఎపెండిక్స్) 02733...India

ఒక 16 ఏళ్ళ యువకుడు, గత మూడు నెలలుగా తన ఉదరం కుడి భాగంలో నిరంతరమైన నొప్పి మరియు గ్యాస్ ఏర్పడడం సమస్యతో భాధపడేవాడు. ఒక అల్ట్రాసౌండ్ పరీక్షలో ఈ రోగి యొక్క ఆంత్రం తీవ్రంగా వాచిందని మరియు చిల్లుపడియుందని తెలిసింది. ఉదర కుడి భాగంలో ఒక గడ్డ ఉందని కూడా తెలిసింది. డాక్టర్ వెంటనే ఆపెరేషణ్ చేయాలని చెప్పారు కాని ఆర్ధిక సమస్యల కారణంగా తల్లి తండ్రులు ఆపరేషన్ చేయించడానికి నిరాకరించి ఒక వైబ్రియానిక్స్ సాధకుడిని సంప్రదించారు. ఈ రోగికి ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడ్డాయి:

CC4.3 Appendicitis + CC21.11 Abscess + CC3.1 Heart Tonic...6TD

ఆరు వారాల తర్వాత ఉదర భాగంలో ఉన్న గడ్డ మాయమైంది. ఆ రోగికి 75% వరకు నొప్పి తగ్గింది కాని గ్యాస్ ఏర్పడడం సమస్య అప్పుడప్పుడు ఉండేది. ఇతనికి ఈ విధంగా మందును మార్చడం జరిగింది:

CC4.3 Appendicitis + CC21.11 Abscess + CC4.10 Indigestion

ఒక నెల తర్వాత రోగికి నొప్పి 90% వరకు తగ్గినప్పడికి, గ్యాస్ సమస్య కొనసాగుతూనే ఉండేది. ఇతనికి బలం కోసం CC12.2 Children’s Tonic పైన ఇవ్వబడిన మందుతో  చేర్చి ఇవ్వబడింది. మరో నెల తర్వాత ఇతనికి నొప్పి పూర్తిగా తగ్గింది. గ్యాస్ సమస్య కొనసాగడంతో సాధకుడు ముందు ఇచ్చిన మందులో CC4.2 Liver and Gall Bladder Tonic  చేర్చి ఇచ్చారు.

రెండు నెలల తర్వాత ఇతనికి గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గడం కారణంగా ఈ యువకుడు చాలా ఆనందంగాను ఉత్సాహంగాను కనిపించాడు. వైబ్రో మందులు వేసుకోవడం,  మెరుగుపడిన తన ఆరోగ్యం స్థిరపడడం కోసం, ఈ యువకుడు కొంత కాలం కొనసాగించాడు.

 

గర్భస్రావము సమస్య 02763...India

నాలుగు గర్భస్రావాలుతో భాద పడిన ఒక మహిళకు ఈ క్రింద వ్రాసియున్న మందులు ఇవ్వబడినాయి: ఈమె మరొకసారి గర్భిణి అయిన వెంటనే ఈమెకు CC8.1 Female Tonic + CC8.2 Pregnancy  ఇవ్వబడింది. ఈ మందులను ప్రసవం వరకు వేసుకోవడంతో ఈమెకు ఒక ఆరోగ్యకరమైన శిశువు జన్మించింది.

బైపోలార్ వ్యాధి 02640...India

ఒక మనోరోగ వైద్యుడు తన పేషంట్లలో ఒకరైన ఒక 45 ఏళ్ళ వ్యక్తిని (ఈ వ్యక్తి అల్లోపతి వైద్యుడు) ఒక వైబ్రో సాధకుడు వద్ద పంపించారు. ఈ వ్యక్తి గత 25 ఏళ్ళగా బైపోలార్ వ్యాధితో భాధపడ్డారు. ఆ సమయంలో ఈ వ్యక్తి, మనోరోగ వైద్యుడు ఇచ్చిన పన్నెండు రకాల అల్లోపతి మందులు వేసుకునేవారు. వైబ్రో సాధకుడు ఈ వ్యక్తికి ఇచ్చారు:
CC15.2 Psychiatric Disturbances…TDS

CC15.6 Sleep Disorders ఈ రెండవ మందును ప్రతి రాత్రి ఏడింటికి మరియు తొమ్మిదింటికి వేసుకోమని రోగికి చెప్పబడింది.

మూడు నెలల తర్వాత మనోరోగ వైద్యుడు ఈ రోగి వేసుకుంటున్న రెండు అల్లోపతి మందులను తగ్గించాడు. మరికొన్ని నెలల తర్వాత, ఒకేఒక అల్లోపతి మందు తప్ప మిగిలిన మందులు నిలిపివేయబడ్డాయి. ఆ ఒక్క అల్లోపతి మందును అవసరమైనప్పుడు మాత్రమే వేసుకోమని చెప్పబడింది. ఇప్పుడు (ఒక సంవత్సరం తర్వాత) ఈ రోగి ఆరోగ్యకరంగా జీవిస్తున్నారని సాధకుడు తెలియచేసారు.

మెదడులో కణితి - గ్లైయోబ్లాస్తోమా మల్టిఫార్మస్ గ్రేడ్ 4 02749...New Zealand

ఒక 53 ఏళ్ళ వ్యక్తికి మెదడులో కణితి ఉండడం కారణంగా శస్త్రచికిత్స చేసారు. సర్జరీ తర్వాత శాస్త్ర నిపుణులు ఈ రోగి కేవలం మరో 14 నెలలు మాత్రమే జీవించి ఉంటాడని రోగియొక్క కుటుంభానికి తెలియచేశారు. రోగి మరియు అతని కుటుంభ సభ్యులు నిరాశ చెందకుండా ఒక వైబ్రో సాధకురాలని  సంప్రదించారు.ఆమె ఈ రోగికి ఈ క్రింద వ్రాసిన మందులను ఇచ్చింది:
CC2.1 Cancers - All + CC2.3 Tumours + CC12.1 Adult Tonic + CC18.1 Brain & Memory Tonic...TDS

ఇన్ఫెక్షన్ (అంటువ్యాధి) నివారణకై ఈ కింద వ్రాసిన మందును తీసుకోమని చెప్పబడింది:
CC9.2 Acute fever...OD ఇన్ఫెక్షన్ కలిగితే TDS తీసుకోమని చెప్పబడింది

ఈ రోగికి తాజా కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలు ,గోధుమ గడ్డి, బార్లీ గడ్డి, ఖనిజాలు, విటమిన్లు మరియు అవిసెగింజల నూనెతో పాటు పన్నీరు వంటి శాఖాహార ఆహారాన్ని తీసుకోమని సాధకురాలు సలహా ఇచ్చింది.

అదే సమయంలో ఈ రోగికి రేడియేషన్ చికిత్స కూడా ఇవ్వబడింది. దీనికారణంగా రోగికి బరువు తగ్గడం తప్ప మరే విధమైన దుష్ప్రభావాలు కలుగలేదు. సాధకురాలు రోగికి ఇచ్చిన మందులో CC4.1 Digestion Tonic…TDS చేర్చివ్వడంతో రోగి తిరిగి బరువు పెరిగాడు.

మూడు నెలల్లో ఈ రోగికి చాలా వరకు ఉపశమనం కలిగింది కాని తలస్సేమియా వ్యాధి కలిగించే ఒక రక్తవ్యాధి  కారణంగా ఇతని బ్లడ్ కవుంట్ ప్రమాదకరంగా తగ్గిపోయింది. అల్లోపతి డాక్టర్లు ఈ రోగికి రక్త మార్పిడి చేయించుకోమని సలహా ఇచ్చారు కాని CC3.1 Heart Tonic  రెండు సార్లు తీసుకోవడంతో రక్త మార్పిడి చేయించుకునే అవసరం తప్పింది!        

వైబ్రో చికిత్స తీసుకున్న పది నెలల తర్వాత, ఈ రోగి ఒక ఆశ్పత్రిలో రక్త పరిశీలన మరియు MRI స్కాన్ చేయించుకున్నాడు. పరిశీలన ఫలితాలను చూసి, చివరి దశలో ఉన్న ఒక వ్యాధి పూర్తిగా మాయమవ్వడం చూసి డాక్టరు చాలా ఆశ్చర్య పడ్డారు. ప్రతిరోజు ఈ వ్యాధిని నయం చేయమని మన ప్రియమైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారిని, రోగి, రోగి యొక్క కుటుంబ సభ్యులు మరియు సాధకురాలు ప్రార్థించారని సాధకురాలు ఉద్గాటించి చెప్పింది. ఆమె నివేదికలో ఈ విధంగా వ్రాసింది: "మానవుడు చికిత్సను అందిస్తాడు కాని నివారించే కర్త భగవంతుడే"

నల్లమందు వ్యసనం మరియు ఇతర సమస్యలు 02638...Iran

సంపాదకుని వ్యాఖ్యానం:
ఈ సాధకుడు కింద కేసులలో మరింత వివరాలను ఇవ్వలేదని విచారం వ్యక్తం చేస్తున్నాము

ఒక పేషంట్ ఏడేళ్ళ వయస్సు నుండి నల్లమందు వ్యసనానికి గురయ్యాడు. వైబ్రో మందు CC15.3 Addictions తీసుకున్న కొద్ది కాలానికి ఈ వ్యసనం నుండి విముక్తి పొందాడు.

మరొక పేషంటు మెడ మరియు భుజాల నొప్పితో ఎనిమిది నెలలు భాధపడింది. కండరాలు మరియు కీళ్ళకు సంభందించిన CC20.2 SMJ pain తీసుకోవడంతో ఈమెకు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.

అనేక సంవత్సరాలు తీవ్ర మైగ్రెను తలనొప్పితో భాదపడిన మరో రెండు పేషంట్లు CC11.4 Migraines క్రమం తప్పకుండ తీసుకోవడంతో, ఈ సమస్య నుండి విముక్తి పొందారు.

జవాబుల విభాగం

1. ప్రశ్న: హోమియోపతి మందులను తీసుకుంటున్న ఒక పేషంటుకు వైబ్రో మందులను ఇవ్వవచ్చా?

    జవాబు: హోమియోపతి వైబ్రో చికిత్సకు అనుకూలమైనదే కాని వైబ్రేషన్లు హోమియోపతి మందులను తటస్థీకరణ చేయవచ్చు. ఇందువలన పేషంటుకు హోమియోపతి మందుల ద్వారా ఉపశమనం కలుగుతున్నట్లయితే, ఆ పేషంటుకు వైబ్రో మందులు ఇవ్వరాదు. హోమియోపతి ద్వారా నయంకాని పేషంట్లకు, హోమియోపతి మందులు తీసుకోవడం ఆపమని చెప్పి, వైబ్రో మందులను ఇవ్వవచ్చు.

_____________________________________

2. ప్రశ్న: అల్లోపతి మందులు తీసుకుంటున్న సమయంలో ఒక పేషంటుకు వైబ్రో మందులను ఇవ్వవచ్చా?

    జవాబు: ఇవ్వవచ్చు. వైబ్రేషన్లు అల్లోపతి మందులకు అనుకూలమైనవి (కీమోతెరపితో సహా); కాబట్టి వైబ్రో మందులను అల్లోపతి మందులు వేసుకుంటున్న ఒక పేషంటుకు ఇవ్వవచ్చు.  పేషంటుయొక్క వ్యాధి లక్షణాలు నయమయ్యే కొద్ది పేషంటుయొక్క  అల్లోపతి మందుల యొక్క మోతాదును క్రమంగా తగ్గించుకోవాలి. పేషంటును ఈ విషయం పై సలహా కోసం అల్లోపతి డాక్టర్ను సంప్రదించమని చెప్పాలి.

_____________________________________

3. ప్రశ్న: మందును ఇవ్వడంలో నావల్ల ఏదైనా తప్పు జరిగితే చట్టపరంగా నా పరిస్థితి ఏమిటి?

    జవాబు: ప్రతియొక్క వైబ్రేషను కూడా సురక్షితమైనదే కాబట్టి, మీరు ధైర్యంగా మందులను ఇవ్వవచ్చు. ప్రేమతో సేవను అందించినప్పుడు భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రేమతో సేవను అందించడం చట్ట విరుద్ధమైన చర్య కాదు. మీరు ఒక డాక్టర్గా మీ పేషంట్లకు మందులను ఇవ్వట్లేదు. బాబా ప్రసాదమైన ఈ వైబ్రేషన్ల ద్వారా పేషంటు యొక్క శరీరంలో ఉన్న అనేక శక్తులలో సమతుల్యత ఏర్పడుతుంది. సందేహపరుల కోసం సీసా పైన "చక్కర గోలీలు మాత్రమే " అన్న పట్టిని అతికించాలి. 

_____________________________________

4. ప్రశ్న:   ఆల్గే యొక్క నీరు మరియు విటమిన్లు తీసుకుంటున్న ఒక పేషంటుకు ఈ వైబ్రేషన్లను ఇవ్వవచ్చా?

    జవాబు:  ఇవ్వవచ్చు.వైబ్రో చికిత్స సహజ ఆరోగ్య మరియు ఆహార పదార్థాలతో పాటు తీసుకోవచ్చు..

_____________________________________

5. ప్రశ్న:  వైబ్రో గోలీలలో వైబ్రేషన్లు ఎంత కాలం పాటు నిలిచి ఉంటాయి?

    జవాబు: గోలీలను భద్రపరచి ఉంచినట్లయితే వైబ్రేషన్లు మూడు నెలల పాటు నిలిచి ఉంటాయి. గోలీలను బలమైన అయస్కాంత క్షేత్రాలైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, దూరదర్శిని వంటి విధ్యుత్కరణ వస్తువుల నుండి దూరంగా ఉంచాలి.

_____________________________________

6. ప్రశ్న: వైబ్రో చికిత్సను అందించే సమయంలో సాధకుడు యొక్క భౌతిక మరియు మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యం? విచారంలోనో దు:ఖంలోనో ఉండగా సాధకుడు చికిత్సను అందించవచ్చా? సాధకుడు, జ్వరం, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలతో భాద పడుతుంటే మందులను ఇవ్వవచ్చా?

    జవాబు: చికిత్సను అందించే సమయంలో సాధకుడు మానసికంగాను మరియు శారీరికంగాను ఆరోగ్యంగా ఉండడం మంచిది. ఈ సేవను అందిస్తున్నప్పుడు సాధకునికి తన సొంత సమస్యలు తాత్కాలికంగా మర్చిపోయే అవకాశం కలుగుతుంది. చికిత్సను అందించే ముందు స్పష్టంగా ఆలోచించగలిగి మరియు స్వామిని ఆర్తితో సహాయం చేయమని ప్రార్థించ గలిగే మనస్థితిలో మీరు ఉన్నట్లయితే  మీరు పేషంటుకు మందులను తయారు చేసి ఇవ్వవచ్చు.

_____________________________________

7. ప్రశ్న:  నమోదు పత్రంలో పేషంటు యొక్క కేసు వివరాలను నమోదు చేయకపోతే, వైబ్రో మందు యొక్క శక్తి తగ్గి పోతుందా? కొన్ని సందర్భాలు: కుటుంభ సభ్యులకు జ్వరం లేదా జలుబు వంటి సమస్యలు వచ్చినప్పుడు (ఇటువంటి సాధారణ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే నమోదు చేయకపోవచ్చు), లేదా సాధకులకు నమోదు చేసే సమయం లేనప్పుడు లేదా పేషంటులకు కేసు వివరాలన్నీ చెప్పే సమయం లేనప్పుడు. కేసు వివరాలను, మందును ఇచ్చే సమయంలో కాకుండా తర్వాత సమయంలో వ్రాయవచ్చా?

    జవాబు: లేదు. కేసు వివరాలను నమోదు చేయని సందర్భంలో, మందు యొక్క శక్తి తగ్గదు. రికార్డులు ప్రతి యొక్క కేసును ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి. గతంలో మీ వద్ద వైబ్రో మందును పుచ్చుకున్న పేషంటు, అదే రోగ సమస్యతో తిరిగి మీ వద్దకు  వచ్చిన సందర్భంలో, మీరు అంతకముందు నమోదు చేసిన ఆ పేషంటు వివరాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా  విశిష్టమైన కేసు వివరాలను ప్రచురణ కోసం మాకు పంపేడప్పుడు, ఆ కేసు యొక్క పూర్తి వివరాలు ఉండడం చాలా ముఖ్యం.

ప్రధాన నివారణ కర్త యొక్క దివ్య వాక్కు

"దైవ నామం సర్వరోగ నివారిణి. దైవ నామాన్ని కన్నా తీయనిది మరొకటి లేదు. దైవాన్ని చేరుకునే అతి సులువైన మార్గం, దైవ నామాన్ని స్మరించడం. దేవుడుని మానవుడుని  ఏకగ్రీవముగా నృత్యం చేయించే శక్తి దైవ నామానికి ఉంది."
-సత్య సాయి బాబా

 

 

“సేవ ద్వారా మానవుడు సృష్టి యొక్క సమగ్ర ఐక్యతను చూడ గలుగుతాడు. మీ చుట్టూ ఉన్న దివ్యత్వాన్ని సేవ ద్వారా ఆరాధించడం, ధర్మాన్ని వ్యక్తము చేయడానికి అత్యంత సులభమైన మరియు ఫలవంతమైన మార్గం. మీ చుట్టూ జీవుల ఆకారాలలో ఉన్న దివ్యత్వానికి, మీ నైపుణ్యాలు, ప్రతిభ, సంపద మరియు శక్తిని అంకితం చేయండి. ఈ ధర్మశక్తి, దైవ కృపను మీపై కురిపిస్తుంది.”
-సత్య సాయి బాబా 

ప్రగటన

ఇండియాలో జరగనున్న వర్క్ షాపులు

కేరళ: 2010 డిసంబర్ 17 నుండి 19 వరకు, 21 వ AVP (అసిస్టెంట్ వైబ్రో సాధకులు) వర్క్షాప్  నిర్వహించబడుతుంది.

మహారాష్ట్ర: 2011 జనవరి 7 నుండి 9 వరకు 22 వ AVP వర్క్షాప్ మరియు 11 వ JVP (జూనియర్ వైబ్రో సాధకులు) వర్క్షాప్ నిర్వహించబడుతుంది.

అదనంగా

ఆరోగ్య చిట్కాలు

అధిక రక్తపోటు సమస్యకు వేడి కోకో ఒక "అధ్బుత ఔషధం" కావచ్చా? ఈ అమోఘమైన ఆవిష్కరణను ప్రశంసించిన హార్వర్డ్ పరిశోధకులు!


ఇటీవల అంచనాల ప్రకారం, అమెరికాలో దాదాపు ముగ్గురు వయస్కులలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉంది.  కానీ పనామా యొక్క కరేబియన్ తీరం వద్ద ఉన్న ద్వీపాల సమూహంలో నివసిస్తున్న కునా భారతీయులకు అధిక రక్తపోటు సమస్య లేనే లేదు. నిజానికి 60 ఏళ్ళ వయస్సు వచ్చిన కునా భారతీయుడి రక్తపోటు 110/70 మాత్రమే.

దీనికి కారణం వీరు ఉప్పు తక్కువగా తినడమా? లేదు. నిజానికి కునా భారతీయులు ఎక్కువగా ఉప్పు తింటారు. మరి దీని కారణం వారి జన్యువులా? కాదు. ఈ ద్వీపాల నుండి దూరం వెళిపోయిన కునా భారతీయులకు ఇతర ప్రదేశాలలో ఉన్న వ్యక్తుల వలె రక్తపోటు వచ్చే అవకాశముంది. అయితే ఇక్కడున్న వ్యక్తులకు రక్తపోటుకు "రోగనిరోధక" శక్తి ఎలా వచ్చింది? రక్తపోటు సమస్య లేనందు వలన ఈ వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోకు, డయాబెటిస్, కాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ.

ఈ ప్రదేశంలో ఉన్న కునా భారతీయులు ప్రతిరోజు ఐదు కప్పుల కోకో తాగుతున్నారని తెలిసి హార్వర్డ్ పరిశోధకులు  ఆశ్చర్యపోయారు. నిజమే, కోకో! కోకోలో ఉన్న ఫ్లావనాల్స్ అన్న పదార్థం, శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఉత్త్పత్తిని పెంచి గుండె, మెదడు మరియు ఇతర అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి అని అనేక పరిశోధనలలో నిర్ధారించబడింది. ఒక పరిశోధనలో కోకో, ఆస్పిరిన్ మాత్ర వలె రక్తం పల్చపర్చడానికి ఉపయోగపడుతుందని తెలిసింది.

అంతే కాదు. కోకోను ఉపయోగించి ఆర్టరీలలో( ధమనులు) ఏర్పడిన అడ్డగింపులు, కంజెస్టివ్ హార్ట్ ఫైల్యూర్ , స్ట్రోక్ , చిత్తవైకల్యం మరియు నపుంసకత్వం వంటి సమస్యలను నయంచేయవచ్చని, హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో ఒక ప్రొఫెసర్ చెప్పారు. మూలం: డైలీ హెల్త్ న్యూస్. 

మనము ఆలోచించవలసిన  ప్రతిపాదిత చట్టం  

UK ,యూరోప్ (2011 ఎప్రల్ నుండి ఈ చట్టము అమలుకి వస్తుంది) మరియు USA దేశాలలో ఆరోగ్యం మరియు ఆహార  పదార్థాలైన విటమిన్లు, మినరల్సు, మూలికలు ,ఆయుర్వేద మరియు ఇతర ప్రత్యామ్నాయ మందులు చట్ట విరుద్ధమైనవని ఒక ప్రతిపాదిత చట్టం యేర్పరచడము జరిగింది. ఇది ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఒక చట్టంగా మారింది.

వైబ్రియానిక్స్ మందులలో ఏ భౌతిక పదార్ధం లేకపోయినప్పటికీ, ప్రజల స్వేచ్చను పరిమితం చేసే ఇటువంటి ప్రతిపాదిత చట్టంపై మన వైబ్రో హీలర్లు తమ అసమ్మతిని వ్యక్తం చేస్తారని భావిస్తున్నాము. ఇధి చట్టంగా మారితే అనేక సహజ ఆరోగ్య క్లినిక్లు, ఆరోగ్య దుకాణాలు మరియు వ్యాపారాలు మూసివేయబడతాయి. అంతే కాకుండా ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం ఎటువంటి దుష్ప్రభావాలు కలుగచెయని ఇంత ఉత్తమమైన మందులను ఉపయోగించే అవకాశాన్ని కోల్పోతారు.

ఈ చట్టం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందవచ్చు కాబట్టి, ఈ విషయంలో తగిన రీతిలో వ్యవహరించే కొరకు వైబ్రో సాధకులకు, ఈ చట్టం గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు ఉందని మేము భావిస్తున్నాము. ఉదాహరణకు ఇది  చట్టంగా మారే ముందుగా UK సాధకులు, ఈ క్రింద ఇవ్వబడిన లింకులో ఉన్న అర్జీను (పెటిషణ్) సంతకం చేయవచ్చు.

http://www.ipetitions.com/petition/ joininghandsinhealth/#sign_petition

"జాయినింగ్ హాండ్స్ ఇన్ హెల్త్ " అన్న ఒక వీడియోలో, ఈ కొత్త ప్రతిపాదిత చట్టం యొక్క నేపధ్యాన్ని అందచేసారు:

http://www.grammasintl.com/html/ campaigns/jhih_videos.asp.

ఈ వీడియోలో డేమ్ జూడీ డెంచ్ వ్యాఖ్యాత. USAలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అనేక కాంగ్రెస్స్ అధికారులు మరియు సీనియర్ అధికారుల  

పై ఈ వీడియోలో రూపొందించబడింది. ఇది ప్రపంచవ్యాప్త శక్తిగల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలకు సంభందించినది. మీరు ఈ విషయం పై ఎరుక కలిగియుండడం అవసరం.

జన్యుపరంగా మార్చబడిన ఆహారాలు 

మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అత్యంత తీవ్రమైన మరో సమస్య జన్యుపరంగా మార్చబడిన ఆహారాలు. వీటిని GM లేదా GMO అని అంటారు. మన పేషంట్ల మరియు కుటుంభ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కొరకు మనము ఈ విధమైన ఆహారాలని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

 దివ్యమైన మన ప్రకృతి తల్లి మనకు రోగ నివారణకు ఉపయోగపడే అనేక మూలికలను మరియు మొక్కలను అందించడం ద్వారా, తన భిడ్డలమైన మనపై తన అపారమైన ప్రేమను చూపిస్తుంది. మన భూమిపై మరియు మన పర్యావరణంపై మనకున్న అనుభందాన్ని అనేక మంది "వెబ్ ఆఫ్ లైఫ్"( జీవిత అల్లిక) అని అన్నారు.

పెద్ద లాభాల కోసం విజ్ఞాన శాస్త్రాన్ని వ్యాపారాలలో ప్రయోగించడం జరుగుతోంది. ఇటువంటి వ్యక్తులు ప్రజలకున్న రోగాల చికిత్సకై విషపూరిత మందులను తయారు చేయడమే కాకుండా, ప్రజలను పౌష్టిక ఆహార సప్ప్లిమేన్ట్లను మరియు మూలికలను తీసుకోకుండా ఆపివేసి, మానవులు మరియు జంతువులు ఆహారంగా తీసుకొనే అనేక ధాన్య, పళ్ళ మరియు కూరగాయిల విత్తనాలలో జన్యు పరమైన మార్పులను చేస్తున్నారు.

జన్యుపరంగా మార్చబడిన ఆహారం సేవించడం మన ఆరోగ్యంపైన మాత్రమే కాకుండా, అనేక తరాల వరకు దాని దుష్ప్రభావం చూపుతుంది. వైబ్రో సాధకులు జన్యుపరంగా మార్చబడిన ఆహారాల గురించి మరియు వీటి ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం మంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధకులందరు వీటి ప్రమాదాల గురించి తెలుసుకుని, తమ స్నేహితులకు మరియు ఇరుగు పొరుగులో ఉన్నవారందరికీ తెలియచేస్తే, వారికి ఎంతో సహాయపడినవారవుతాము. అవగాహన శక్తివంతమైనది మరియు అజ్ఞ్యానం ప్రమాధకరమైనధి. మన ఆరోగ్య సంరక్షణ, మన కుటుంభ సభ్యుల ఆరోగ్య సంరక్షణ మరియు ఈ ప్రపంచంలో ఉన్న సోదరీ సోదరుల ఆరోగ్య సంరక్షణ కన్నా ప్రధానమైనది మరొకటి ఏముంటుంది? GM ఆహారంపై మరికొన్ని వివరాల కోసం: Google: జన్యుపరంగా మార్చబడిన ఆహారం.​ 

 

ఓం సాయి రామ్