Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 4 సంచిక 6
November/December 2013
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

మీరు మొత్తం మెట్లను చూడలే నప్పుడు (దారి సుగముగా లేనప్పుడు) మన విశ్వాసమే మొదటి అడుగు వేయిస్తుంది ... మార్టిన్ లూథర్ కింగ్

మనం అనుకున్న అంతర్జాతీయ సదస్సుకు సన్నాహాలు ప్రారంభించడమే ఆ మొదటి అడుగు. 4 నెలల క్రితం మనం మొదటి వైబ్రియానిక్స్ సమావేశానికి సన్నాహాలు ప్రారంభించినప్పుడు ఇది ఎంతో కష్టమైన పని అనిపించింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన  చికిత్సానిపుణులందరి నుండి సమాచారాన్ని సేకరించడం నిజంగా ఒక సవాలు. ఏదిఏమైనప్పటికీ “భవిష్యత్తులో పుట్టపర్తిలో అంతర్జాతీయ సమావేశం ఉంటుంది” అని 2007 ఏప్రిల్లో స్వామి మనకు చెప్పినట్టుగా ఆయన దైవిక మాటలు మనలను ముందుకు అడుగు వేసేలా చేశాయి.  గత కొన్ని నెలలుగా మీ నుండి మాకు ఎన్నో ఈ మెయిల్స్ వచ్చాయి- చాలా అద్భుతమైన కేస్ హిస్టరీ లు, సమాచార దాయకమైన వ్యాసాలు, ఫోటోలు మరియు రోగుల టెస్టిమోనియల్స్  ఎంతో బాగున్నాయి.

ఈ విధమైన అద్భుతమైన సమాచార ప్రవాహము, మా అభ్యాసకుల ఉత్సాహము, విజయవంతమైన సమావేశం ఏర్పాటు చేయడానికి  మాకు మీ అందరి సంపూర్ణ హృదయపూర్వకమైన మద్దతు ఉంది అని భరోసా ఇచ్చింది. మీ వద్ద విషయ పరంగానూ సేవా పరంగానూ మాకు  ఎంతో అందించాలని భావిస్తున్న సమాచారము ఉన్న విషయం నాకు తెలుసు. మీ నుండి  సమర్పణలను   స్వీకరించడానికి అక్టోబర్ నెల చివరి గడువుగా నిర్ణయించినప్పటికీ ఇంకా మీ నుండి సహకారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇట్టి నిష్కాపట్య త మీరు మాతో పంచుకొనే మీ విలువైన అనుభవాలు మన వైబ్రియానిక్స్ యొక్క భవిష్యత్ అభివృద్ధికి  ఎంతో ప్రధానం అని గుర్తుంచుకోండి. మీరు ఇప్పటికే సమావేశంలో ఇతర అభ్యాసకులతో పంచుకోవాలనుకుంటున్న  అత్యుత్తమ కేసులు లేదా సమాచారం ఉంటే దయచేసి దానిని పంపండి. మీ నుండి లభించే సమాచారం, మీ ఆలోచనలు, అనుభవాలు మరియు అత్యుత్తమ కేసు చరిత్రలను పంచుకోవడానికి  ఈ సమావేశం ఒక చక్కని వేదిక కనుక సీనియర్ అభ్యాసకులు మీ ఇన్ పుట్ ను సాధ్యమైనంత తొందరగా పంపాలి, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 30 మించకూడదని గమనించండి. మీ నుండి లభించిన వాటిని మేము వీలైనంతవరకూ పేపర్ల రూపంలోగానీ  మరియు సమావేశం కోసమే సంకలనం చేస్తున్న పుస్తకములో గానీ చేర్చడానికి ప్రయత్నిస్తాము. అయితే ఇప్పుడు చేర్చలేనివి భవిష్యత్తులో వార్తా లేఖలలో  ప్రచురింప బడతాయి.

మాకు ఇంకా అనేక రకరకాల పనుల గురించి, వనరుల గురించి, అందించ దలచిన సహాయం  గురించి ఆఫర్లు వచ్చాయి.  ఇంకా చేయవలసింది ఎంతో ఉంది అని చెప్పటం ఒక సాధారణ విషయమే. మన ప్రియతమ సాయి మాతను సంతోష పెట్టడానికి మరియు మన సాయి వైబ్రియానిక్స్ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు విభిన్న నేపథ్యాల నుండి చాలామంది ప్రజలు పూర్తి సామరస్యంతో కలిసి పనిచేయడం నిజంగా హృదయాన్ని ద్రవీభవింప చేస్తోంది.  

 అభ్యాసకులు అందరూ ఈ కాన్ఫరెన్స్ నిమిత్తము భౌతికంగా పుట్టపర్తి రావడానికి తమ సుముఖతను తెలియజేస్తూ ఈ విషయంలో సానుకూలంగా స్పందించి నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశం సందర్భంగా మాకు మీ అందర్నీ చూడాలని ఎంతో కోరికగా ఉన్నప్పటికీ ప్రజల జీవితాలను పరిమితం చేసే అంశాలను అర్థం చేసుకుంటున్నాము. కనుక మీరు మీపని మరింత ఉత్సాహంతో చేయటానికి అంతర్ముఖులై స్వామి మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలు పొందాలని అందరినీ  కోరుతున్నాను.

పూర్తిగా భిన్నమైన విధానంలో వరుసగా రెండవ సంవత్సరం నడుస్తున్న బెంగళూరులో జరిగిన “హీల్ యువర్  క్యాన్సర్” కు మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ చేరిన కొంతమంది ప్రముఖ క్యాన్సర్ నిపుణులు మరియు ప్రత్యామ్నాయ చికిత్సకులు క్యాన్సర్ చికిత్సకు సంపూర్ణమైన విధానం పై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సదస్సును ప్రారంభించిన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి  గారి ప్రోత్సాహకరమైన ప్రసంగంలో క్యాన్సర్ చికిత్సకు వివిధ పద్ధతులను సమగ్రపరచడం గురించి చెప్పారు. బెంగళూరు నుండి అనుభవజ్ఞులైన మన ఇద్దరు అభ్యాసకుల ప్రదర్శనకు మంచి ఆదరణ లభించింది.

లండన్ లోని సౌతల్ పార్క్ లో యూనిటీ ఆఫ్ ఫెయిత్స్ ఫెస్టివల్ వ్యవస్థాపకులు ఈ సంస్థ ప్రారంభించి రెండవ సంవత్సరం నడుస్తున్న సందర్భంగా వైబ్రియానిక్స్ అవగాహన మరియు వైద్య శిబిరం నిర్వహించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. 11 మంది అభ్యాసకులు పాల్గొని 123 మంది రోగులకు చికిత్స చేశారు. చిన్న ఉపన్యాసాలు మరియు వీడియో ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్నాయి చాలామంది ఈ కార్యక్రమంపై ఆసక్తిని చూపించి  మన ఫ్లై యర్ ను  కూడా  తీసుకెళ్లారు.

బాబా వారి 88వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఈ 5 వ సంవత్సరం కూడా మూడు రోజులపాటు ఏర్పాటుచేసిన వైబ్రియానిక్స్ వైద్య శిబిరంలో ముగ్గురు అభ్యాసకులు పాల్గొని 719 మంది రోగులకు చికిత్స చేసారు. ఇటువంటి సేవలు మరిన్ని చేయడానికి అవకాశాలు ప్రసాదించాలని స్వామి వారిని కోరుకుందాం.

ఫ్రేమతో సాయి సేవలో మీ

జిత్  కె అగర్వాల్

పిల్లి పాదమునకు గాయం 01644...USA

సుమారు నాలుగు సంవత్సరాల వయసు కలిగిన అభ్యాసకుని ఆడ పిల్లి ఇంటికి వస్తూ తన ఎడమ పాదము పై బరువు మోపకుండా పైకెత్తి కుంటుకుంటూ వచ్చింది. పిల్లి జుట్టు మీద కొన్ని రక్తపు చుక్కలు కూడా ఉన్నాయి. ఆ పిల్లి బద్ధకంగా కనిపించింది మరియు బంతివలె (ముడుచుకొని)పడుకో పెట్టాలని ప్రయత్నించింది. రక్తంఎక్కడ వచ్చిందో అభ్యాసకునికి కనపడలేదు కనుక సాయిరాం హీలింగ్  వైబ్రేషన్ మిషను తో పిల్లి చిత్రాన్ని రేమిడి వెల్ లో ఉంచి:

NM20 Injury నివారణ నిరంతరంగా రెండు రోజులపాటు ప్రసారం చేసారు.  

అభ్యాసకుడు మరొక నివారిణి కింది విధంగా తయారు చేశారు:

CC1.1 Animal tonic + CC10.1 Emergency + CC20.7 Fractures + CC21.11 Wounds & Abrasions

ఈ మిశ్రమాన్ని నీటితో తయారుచేసి పిల్లి తాగే గిన్నెలో రెండు రోజులు ఉంచారు. రాత్రి సమయంలో పిల్లి ఆ నీటిని  తాగుతుందో లేదో అభ్యాసకుడికి తెలియదు కానీ అది ఎంతో కొంత నీరు తాగింది. మరుసటి రోజు ఉదయం పైకి లేచి దాని పాదంపై పూర్తి బరువు పెట్టి నడవసాగింది అంతేకాక దాని బెస్ట్ ఫ్రెండ్ 72 పౌండ్ల కుక్కతో ఏమీ జరగనట్టే ఆడుకోవడం ప్రారంభించింది.

 

కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ 11476...India

46 ఏళ్ల మహిళకు కంప్యూటర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్(ప్రధాన నరము ప్రెస్ అవడం వలన మణికట్టువద్ద ఏర్పడే నొప్పి) వ్యాధి ఏర్పడింది. నాలుగు నెలలుగా ఆమెకు మడి కట్టు చేతులు మరియు వేళ్లలో నొప్పి బాగా ఉంది. మణికట్టు నొప్పి చాలా తీవ్రంగా ఉండడంతో దానితో సరళమైన పనులను చేయడంలో కూడా ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది. ఐతే ఆమెకు మధుమేహం కూడా ఉండడంతో దానికోసం కాంబో చేర్చబడింది.

CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS

  ఆమెకు క్రమంగా నొప్పి తగ్గిపోయే వరకూ మూడు నాలుగు వారాలు పై రెమిడీ  తీసుకున్నారు. ఆమె కంప్యూటరుతో పని చేయడం కొనసాగిస్తున్నప్పటికీ నొప్పి తిరిగి రాలేదు.

 

గింజలకు అలెర్జీ మరియు తీవ్రమైన పొడి చర్మపు సమస్య 02802...UK

ఒక అంధ పాఠశాలలో నివసిస్తున్న 18 సంవత్సరాల యువకుడు సెలవుల్లో ఇంటికి వచ్చాడు. అతనికి గింజలు తింటే పడదని ముఖ్యంగా బాదంపప్పు ఎలర్జీ ఉండడం వలన అది తింటే కడుపు నొప్పి, వాంతులు వస్తాయని అతని తల్లి అభ్యాసకుడిని పిలిపించి చెప్పారు. ఆ అబ్బాయి ప్రతీరోజూ క్రీమ్ తప్పకుండా ఉపయోగించాల్సిన అవసరం కలిగినటువంటి పొడి చర్మం కలిగి ఉన్నాడు. అతనికి ఈ క్రింది రెమిడీ పోస్టు ద్వారా పంపబడింది:   

CC4.10 Indigestion + CC 7.1 Eye tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC21.1 Skin tonic…OD మెల్లిగా TDS కు పెంచడం

పై రెమిడీ తీసుకున్న ఒక నెల తర్వాత తల్లి అభ్యాసకుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఫోన్ చేసారు. తన కుమారుడు ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా బాదంపప్పు తినగలుగుతున్నాడని చెప్పారు. కాబట్టి మోతాదు తగ్గించి OD గానే ఇవ్వమని అభ్యాసకుడు సలహా ఇచ్చారు. అయితే తన అబ్బాయి మొదటి నుండి OD గానే  తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అలాగే అబ్బాయి చర్మం కూడా అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగుగా ఉంది!

ముఖం మీద దద్దుర్లు 02802...UK

47సంవత్సరాల మహిళ ఒక సంవత్సరం నుండి ముఖం మీద దద్దుర్లతో బాధపడుతున్నారు. ఇది రోసేసియా అని నిర్ధారించబడింది. ఇది ముఖంపై వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఈ దద్దుర్లు ఎరుపు నేపథ్యంలో కనిపిస్తాయి. ఈ కేసు విషయంలో రోగి గడ్డం చుట్టూ ఇవి ఏర్పడ్డాయి. అనేక రకాల యాంటీ బయోటిక్స్ ఇవ్వబడ్డాయి కానీ మెరుగుదల లేదు. ఆమె ఆరు నెలల పాటు మూలికా వైద్యుని చేత చికిత్స కూడా చేయించుకుంటూ  నియమితమైన ఆహారాలే (పథ్యం) తీసుకున్నారు. ఆమె గోధుమలు లేదా పాల ఉత్పత్తులు కూడా తీసుకోవడం లేదు ఎందుకనగా కొన్ని ఆహార పదార్థాల విషయంలో ఆమెకు ఎలర్జీ ఉందని ఆమె భావించారు. మూలికా వైద్యం వలన ఆమె పరిస్థితి మెరుగుపడలేదు.  ఆమెకు ముఖం మీద దద్దుర్లు మరియు దానికి గల కారణం నిమిత్తం   మరియు ఆమె ఎదుర్కొనే ఒత్తిడి మరియు కాలేయ బలహీనత కోసం క్రింది రెమిడీ సూచించ బడింది:

CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin infections

 రెండు వారాల్లో తిరిగి  రిపోర్టు చేయవలసిందిగా ఆమెకు సూచించారు. అయినప్పటికీ ఆమె రెండు నెలల తర్వాత మాత్రమే రీఫిల్ కోసం అభ్యాసకుని చూడటానికి వచ్చారు. ఎందుకంటే ఆ రెమిడీ తీసుకున్న వెంటనే చర్మం మెరుగుపడటం ప్రారంభించి క్రమంగా 75%మెరుగుపడిందని చెప్పారు. ఆమె ఇప్పటికీ చికిత్స కొనసాగిస్తునే ఉన్నారు.

 

సక్రమంగారాని పీరియడ్లు 11386...India

24 సంవత్సరాల మహిళ తనకు ఋతుస్రావం సకాలంలో రాని సమస్య నిమిత్తం అభ్యాసకుని వద్దకు చికిత్స కోసం వచ్చారు. కొన్నిసార్లు ఋతుస్రావం మూడు నెలల వరకూ కూడా రాదు.  ఆమెకు అండాశయంలో కణుతులు ఉన్నాయని డాక్టర్ గుర్తించి స్టెరాయిడ్స్ ఇచ్చారు. దీని ఫలితంగా ఆమె బరువు పెరగడం మరియు ముఖం మీద వెంట్రుకలు రావడం ప్రారంభించాయి. ముఖం మీద జుట్టు మరియు బరువు పెరగటం ఆమెకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఆమెకు వైబ్రియానిక్స్ వైద్యం ఏమైనా సహాయం చేస్తుందని భావించి చికిత్సకోసం అభ్యాస కుని వద్దకు వచ్చారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC8.1 Female tonic…TDS

 మూడు నెలలలో ఆమెకు ఋతు చక్రం సక్రమంగా రావడం ప్రారంభించింది. ఆమె ముఖం మీద ఉన్న అనవసరమైన వెంట్రుకలు మరియు  అధికబరువు కూడా పూర్తిగా తగ్గిపోయింది.

 

శ్వాసకోశ, సైనస్ & గొంతు ఇన్ఫెక్షన్ 01176...Bosnia

75 సంవత్సరాల మహిళ తీవ్రమైన గొంతు నొప్పి దుర్భరమైన దగ్గు మరియు ఎర్రబడిన సైనస్ నిమిత్తం అభ్యాసకుని వద్దకు వచ్చారు. గత ఎన్నో రోజులుగా ఆమెకు ఈ లక్షణాలు ఉన్నాయి. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:

#1. NM36 War + NM70 CB9 + NM71 CCA + NM113 Inflammation…TDS

#2. SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM40 Throat…TDS

వారం తర్వాత ఆమెకు కేవలం 20 శాతం ఉపశమనం కనిపించింది. కనుక అంతకుముందు మరి ఏదైనా అనారోగ్యం ఉందా అని అభ్యాసకుడు ఆమెను అడిగారు. రోగికి 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్కాబీస్(గజ్జి) ఉందని, గత 40 ఏళ్లుగా క్రమం తప్పకుండా బ్రాంఖైటిస్ వస్తూ ఉంటుందని, సైనస్ సమస్య 20 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. అనారోగ్య పరిస్థితుల్లో అలోపతి వైద్యులు ఆమెకు అనేక రకాల యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. వీటిలో చాలా రకాల మందుల వలన ఆమెకు  అలర్జిక్ ప్రతి చర్యలు (రియాక్షన్స్)కూడా ఉండేవి. ఈ కారణంగా ఆమె వైబ్రియానిక్స్  చికిత్స తీసుకోవడానికి సన్నద్ధమయ్యారు.

గతంలో తీసుకున్న రెండు రెమిడీలు రోగికి పెద్దగా సహాయం చేయకపోవడం మరియు ఆమె సమస్యలు గజ్జి (చర్మవ్యాధి) తో ప్రారంభం కావడం కారణంగా ఆమెకు సోరినం మియాజం ఇవ్వబడింది:  

  1. SR250 Psorinum 10M, 1M, 200C, 30C and 6Cఒక్కొక్క పొటెన్సీ కి ఒక్క క్క మోతాదు చొప్పున 1 గంట వ్యవధిలో 10M ఎక్కువ పోటెన్సీ తో ప్రారంభించి క్రమం గా తగ్గించుకుంటూ రావటం

ఒకరోజు తర్వాత లక్షణాలు తీవ్రం అయ్యాయి కానీ తర్వాత రెండు రోజులలో ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది. మూడు రోజుల తర్వాత ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:   

  1. SR294 Hepar Sulph 10M, 1M, 200C, 30C, and 6C  పైన పేర్కొన్న విధంగానే ఒక్కొక్క పొటెన్సీకి ఒక మోతాదు మాత్రమే

రెండు రోజుల తర్వాత క్రింది రెమిడీ ఇవ్వబడింది: 

    3. SR318 Thuja 10M, 1M, 200C, 30C మరియు 6C పైన పేర్కొన్న విధంగానే దీనిని కూడా తీసుకోవాలి. ఐదు రోజుల తర్వాత ఆమెకు చాలా మెరుగ్గా అనిపించింది. దాదాపుగా దగ్గు తగ్గిపోయింది. గొంతు నొప్పి కూడా లేదు. సైనస్ బ్లాక్ అవడం కూడా తగ్గిపోయింది. ఊపిరితిత్తుల నుండి పిల్లికూతలు వంటివి కూడా వేగంగా తగ్గిపోయాయి. మరో వారంలో ఆమె 90 శాతం కంటే ఎక్కువగా స్వస్థత పొందారు.

ఇన్ఫ్లూయెంజా (విషపడిశము) 01361...USA

ఇటువంటి అవాంఛనీయ అనారోగ్య సంకేతాలతో రోగులు వచ్చినప్పుడు వెంటనే NM79 Flu Pack ఇవ్వమని ఈ అభ్యాసకుడు అభ్యాసకులందరినీ కోరుతున్నారు. ఈ మిశ్రమంతో తను మరియు తన శ్రీమతితో పాటు మొత్తం 8 మందికి విజయవంతంగా మరియు త్వరగా తగ్గిపోయిందని పేర్కొంటున్నారు.

108CC బాక్స్ కలిగి ఉన్నవారు CC9.2 Infections acute  లో NM79 Flu Pack. 

 ఉంటుంది కనుక దీనిని వాడవలసిందిగా కోరుతున్నారు.  

ప్రశ్నలు సమాధానాలు

1. ప్రశ్న: శిక్షణా తరగతులలో మేము రోగులకు ఒకేసారి రెండు లేదా మూడు కంటే ఎక్కువ కోంబోలు ఇవ్వకూడదని బోధించారు. కానీ వార్తాలేఖలలో 3 లేదా 4 సీసీలు ఇవ్వబడుతున్నాయి అని కనుగొన్నాను. రోగులకు మూడు లేదా నాలుగు CC లు  ఇవ్వడం సరైనదేనా  దయచేసి స్పష్టం చేయండి.  

    జవాబు: ఎన్నికోంబోలు ఇవ్వవచ్చు అనేదానిపై కఠినమైన నియమం ఏదీ లేదు. కొత్త వైద్యులు ఒక సీసాలో మూడు కంటే ఎక్కువ CCలు వెయ్య కూడదని సిఫార్సు చేయబడింది. మీరు ఒక సమయంలో ఒక దీర్ఘకాలిక వ్యాధికి (మరియూ ఏదైనా సంబంధిత సమస్యలు) మాత్రమే చికిత్స చేయవలసి ఉంటుంది కనుక మీరు ఒక్క సీసా  మాత్రమే ఇవ్వాలి. అయినప్పటికీ ఈ క్రింది కోంబో లను ఏఇతర కోంబోల తోనైనా  కలపవచ్చు: CC10.1, CC12.1 (లేదా CC12.2), CC15.1 మరియు CC17.3. అనుభవం మరియు విచక్షణతో ఒక అభ్యాసకుడు నాలుగు కంటే ఎక్కువ కోంబోలను మిళితం చేయవచ్చు.

_____________________________________

2. ప్రశ్న: నేను ఇప్పటివరకూ ఉపయోగించని కొన్ని కోంబోలలో ఆల్కహాల్ స్థాయి తగ్గిందని గమనించాను. అది ఆశించదగినదేనా?

    జవాబు: ఆల్కహాల్ అణువులు పలచగా ఉంటాయి.  బాటిల్ సరిగ్గా మూసివేసినప్పటికీ అవి చాలా వేగంగా ఆవిరై పోతాయి. అది ఆశించదగ్గ పరిణామమే. కొంత మంది అభ్యాసకులు CC బాక్సు చుట్టూ ఫోయిల్ తో చుడతారు, లేదా మరో బాక్సులో ఉంచుతారు, లేదా దానిపైన బరువు ఉంచుతారు. కనుక మీకు ఏది బాగా పని చేస్తుందో దానిని ఉపయోగించండి. సీసాలు క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ పూర్తిగా ఆవిరి అవ్వకుండా చూడండి.  

_____________________________________

3. ప్రశ్న:  రోగి యొక్క కేస్ షీట్లో రెమిడీ వివరాలను నమోదు చేయకపోతే ఔషధం యొక్క ప్రభావం తగ్గుతుందా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే  కొన్నిసార్లు మా కుటుంబ సభ్యుల కోసం హడావిడిగా వెంటనే రికార్డు చేయడానికి వీలు లేని పరిస్థితిలో ఏదో ఒక ఔషధాన్ని సూచించవచ్చు. లేదా ఒక్కొక్కసారి పేషంటు వచ్చినప్పుడు  అధికారికముగా అపాయింట్మెంట్ ఇవడానికి సమయం ఉండదు. తర్వాత వివరాలు నమోదు చేసినప్పటికీ పరిహారాన్ని పంపిణీ చేసే సమయంలోనే నమోదు చేయాలనే పట్టింపు ఏమైనా ఉందా? అసలు కేస్ షీట్ తయారు చేయడం చట్టపరమైన కారణాల కోసం మాత్రమేనా? 

    జవాబు:  లేదు, ఔషధం యొక్క ప్రభావం ప్రభావితం కాదు. ఒకవేళ రోగితో మీ మొదటి అపాయింట్మెంట్ లో అతను మీతో ఉన్నప్పుడు ఆవ్యక్తి వివరాలను రికార్డు చేయడానికి సమయాన్ని కేటాయించండి. రికార్డులు కేసుకు సంబంధించిన వివరాలు పొందడం కోసం మాత్రమే కాదు, చాలా కాలం గడిపిన తర్వాత ఇలాంటి కేసును మనము చికిత్స చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్ట సందర్భంలో అప్పుడు ఏమి ఇవ్వబడింది గుర్తు లేకపోవచ్చు. అలాగే ఏదైనా కేసు అసాధారణ కేసయితే దానిని ప్రచురణ కోసం      పూర్తి వివరాలు అవసరం కావలసి ఉంటుంది.

_____________________________________

4. ప్రశ్న: రెమిడీ సూచించే సమయములో వైద్యుడి శారీరక మరియు మానసిక ఆరోగ్యం అనేది ప్రధానమైన అంశమేనా?  మనము జ్వరము లేదా జలుబుతో లేదా పార్శ్వపు నొప్పితో బాధపడుతూ రోగులకు రెమిడీలు సూచించవచ్చా? మనం ఒత్తిడికి గురైనప్పుడు లేదా నిరాశాజనకంగా వున్నప్పుడు సూచించడం సరైనదేనా? మనం ఇచ్చే  ఔషధము సూక్ష్మ శక్తుల చేత  ప్రభావితం అవుతుంది కనుక నేను ఇలా అడుగుతున్నాను. కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో పంపిణీ చేసే ఔషధం పై విశ్వాసం పెంపొందించడానికి మీ సమాధానం సహాయపడుతుంది.   

    జవాబు: వైద్యుడు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం మంచిది. మీకు బాగా లేనప్పుడు కూడా రెమిడీ ఇవ్వవచ్చు ఐతే a.  రెమిడీ సూచించే టప్పుడు మీరీ అంటువ్యాధి గ్రస్థులు కాకుండా ఉండాలి. b మీరు స్పష్టంగా ఆలోచించగలిగేలా ఉండాలి. c. వైద్యం ప్రారంభించే ముందు మీరు స్వామి ప్రార్థన చేసి స్పష్ట మైన మనసుతో ఆయన మార్గదర్శకత్వం మరియు సహాయం మీకు అందించమని కోరగలిగేలా ఉండాలి. జలుబు దగ్గు వంటి తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు విచక్షణా శక్తిని ఉపయోగించడం చాలా ముఖ్యం. వైబ్రియానిక్స్ సేవలో ఉన్నప్పుడు అభ్యాసకులు తరచుగా తన సహాయం కోరి వచ్చిన రోగులకు  సేవ చేసేటప్పుడు తన వ్యక్తిగత సమస్య లన్నింటినీ అధిగమిస్తారు!    

 _____________________________________

5. ప్రశ్న:  ఈ ప్రశ్న నిజంగా సిల్లీ గా ఉండవచ్చు కానీ కొన్నిసార్లు నేను బాటిల్ యొక్క   మూత లో ఉన్న వైబ్రియానిక్స్ గోళి మా పాప నోటి లో వేయడానికి మెట్లకింద వెతుకుతూ ఉంటాను. ఎక్కువసేపు మూత తెరిచి ఉన్నట్లయితే కంపనాలు ఆవిరై పోవడము లేదా అదృశ్యమవడము జరుగుతుందా?  

   జవాబు:  లేదు, ఏ ప్రశ్న సిల్లీ ప్రశ్న కాదు.  కంపనాలు గోళీలలో అలాగే   పొందుపరచబడి ఉంటాయి.    

_____________________________________

6. ప్రశ్న:   అడల్ట్ మరియు చైల్డ్ టానిక్ రోగనిరోధక శక్తిని మరియు రోగిని తిరిగి ఆరోగ్యానికి తీసుకువచ్చే అన్ని వ్యవస్థలను చక్క జేస్తుంది. ఐతే  ఏ వయసులో పిల్లవాడు అడల్ట్ టానిక్ తీసుకోవడం ప్రారంభించాలి?  

    జవాబు:   పిల్లలకు సంబంధించినదా లేదా పెద్దవారిదా ఏది ఉపయోగించాలి  అనేది వచ్చిన వ్యక్తి పై ఆధారపడి ఉంటుంది.  పిల్లలు శారీరకంగా పెద్దవారిగా కనిపిస్తూ ఉన్నప్పుడు అడల్ట్ టానిక్ సూచించాలి. చాలా మందికి 16-18 సంవత్సరాలు అడల్ట్  టానిక్ ఇవ్వడానికి తగిన వయసు. మీకు ఇంకా తెలియకపోతే CC12.1 Adult tonic మరియు CC12.2 Child tonic. కోసం ఉపయోగించిన కార్డులను చూడండి మీకు తెలిసిన మరియు రోగి గురించి గమనించిన వాటి ఆధారంగా  అనుభవంతో రెమిడీ సూచించండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రెండు రెమిడీలలో శక్తి  అవసరము మేరకు మాత్రమే పనిచేస్తుంది.

_____________________________________

7. ప్రశ్న: నేను ఒక కొత్త అభ్యాసకుడిని మరియు సహాయ పడడానికి ఆసక్తిగా ఉన్నాను. రోగిని మొదటిసారి కలిసినప్పుడు ఏవైనా చిట్కాలు ఉన్నాయా?

    జవాబు: శిక్షణ మరియు క్రమగా పెరుగుతున్న అనుభవం ఆధారంగా మీ అంతర్దృష్టి ఉపయోగించండి. వినండి, ప్రేమించండి మరియు పంపిణీ చేయండి. మీ సమావేశానికి ముందు ప్రార్థించండి మరియు మిమ్మల్ని మీరే కేంద్రీకరించుకోండి. నెమ్మదిగా  ప్రశాంతంగా ఉండండి.  అవతల వ్యక్తి చెప్పింది పూర్తిగా వినడం చాలా ముఖ్యం.  మీరు వారికి ఏ రెమిడీ ఇవ్వబోతున్నారో లేదా మీరు ఏ ప్రశ్నలను అడగాలనుకుంటున్నారో ఆలోచిస్తూ అక్కడ కూర్చోవద్దు.  మీరు అలా చేస్తే, వారు చెప్పేది పూర్తిగా వినడం లేదని అర్ధం. అవతలి వ్యక్తితో హడావిడిగా ఉండకండి.  వారి ఆరోగ్యానికి సంబంధించి మీరు విన్న అతి ముఖ్య విషయాలను వారికి తిరిగి చెప్పండి, తద్వారా మీరు విన్నట్లు వారికి అర్ధమవుతుంది.

 వచ్చినవారు తమ వ్యక్తిగత జీవితం, సంబంధాలు, ఆర్థిక విషయాల గురించి చాలా వివరంగా చెప్పబోతూ ఉంటే సున్నితంగా ఆపి వారు మిమ్మల్ని చూడటానికి వచ్చిన అసలు కారణం వివరించమని కోరండి. సంభాషణ యొక్క దిశను నియంత్రించండి, తద్వారా మీరు మీ రికార్డులకు అవసరమైన వాస్తవాలను పొందండి మరియు ప్రేమతో ప్రతిదీ పూర్తి చేయండి. రెమిడీ పంపిణీ చేసేటప్పుడు, రోగికి అవి ఎలా తీసుకోవాలో వివరించండి, మరియు మీరు వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారని నిర్ధారించుకోండి. మొదటి అపాయింట్‌మెంట్‌ను సుమారు 45 నిమిషాలు వరకూ కొనసాగించండి.  కొన్నిసార్లు అది సాధ్యం కాదు కానీ నిర్ధిష్ట లక్ష్యంగా ఆ సమయ వ్యవధి ఉంటుంది.  తదుపరి అపాయింట్‌మెంట్‌ లో చర్చను కొనసాగించండి.

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు

 “మనం చిరునవ్వు నవ్వితే మనలో ప్రేమ వెల్లువై ప్రవహిస్తుంది.”\

-సత్య సాయి బాబా మూడవ యువజన కాన్ఫరెన్స్ 2007 జూలై  

 

 

కొన్నింటిని నా పని అనీ మరికొన్నిటిని అతని పని వర్గీకరించ వద్దు అన్ని చర్యలు దేవునికి నైవేద్యంగా చేయండి

-సత్య సాయి బాబా రేడియో సాయి 2013 సెప్టెంబర్ 18

 

 

మీ ప్రతీ మాటను ప్రేమతో నింపండి, మీ ప్రతి చర్యను ప్రేమతో నింపండి, మీ నాలుక నుండి ఉద్భవించే పదం కత్తిలాగా గుచ్చకూడదు, బాణం లాగా గాయ పరచకూడదు, సుత్తిలా కొట్ట కూడదు. అది తేనెలా మధుర మైనదిగా, సలహా రూపంలో అందించే వేదాంత జ్ఞానముగా, శాంతి మరియు ఆనందం విరబూయ గలిగే దివ్య పధంలా ఉండాలి...    ప్రేమ కోసమే ప్రేమ, భౌతిక వస్తువుల కోసమో ప్రాపంచిక కోరికలు నెరవేర్చుకోవడం కోసమో దాన్ని ఉపయోగించవద్దు... ప్రతీ ఒక్కరిని- అతను ఎవరైనా కావచ్చు-ప్రేమతో కూడిన కరుణతో వ్యవహరించండి. నిర్మాణాత్మక కరుణ మానవాళి యొక్క ఆకస్మిక ప్రతిచర్యగా మారాలి.''

- శ్రీ సత్య సాయి బాబా సత్య సాయి స్పీచ్ 9:1- 1669 జూలై 29 9:16, 9:16, July 29, 1969 

ప్రకటనలు

నిర్వహింప బోయే శిబిరాలు

  1. ఇండియా  పుట్టపర్తి : AVP వర్క్ షాప్  24-28 నవంబర్ 2013, సంప్రదించ వలసిన వారు వెబ్సైట్  [email protected]

  2. ఇండియా కేరళలో ని కాసరగోడ్: AVP వర్క్ షాప్  జనవరి  2014, సంప్రదించ వలసిన వారు రాజేష్ రామన్ వెబ్సైట్ [email protected] oలేదా ఫోన్ నంబరు  8943-351 524 / 8129-051 524.

  3. ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్  28 జనవరి - 1 ఫిబ్రవరి 2014, సంప్రదించ వలసిన వారు వెబ్సైట్ [email protected]

శిక్షకులకు ఏదైనా వర్క్ షాప్ కు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే వివరాలను [email protected] కు పంపండి

అదనపు సమాచారం

సాయి వైబ్రియానిక్స్  వార్తాలేఖల ద్వారా ప్రచురించే ఈ సమాచారము విద్యా సంబంధ మైన సమాచారమునకే తప్ప దీనిని వైద్య సలహా గా భావించరాదు. ప్రాక్టీషనర్లు పేషంట్ లను సరియైన వైద్య సమాచారము కోసము మరియు ప్రత్యేక వైద్య సలహాల నిమిత్తము వారి డాక్టర్లను సంప్రదించమని చెప్పవలసిందిగా సూచన

విత్తనాలు తినడం వలన చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు   

విత్తనాలు చిన్నవి కావచ్చు కానీ అవి ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్లు మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలతో కూడి ఉంటాయి.    

విత్తనాలు అన్నీ కూడా వేరువేరు పరిమాణాలు ఆకారాలు మరియు రంగుల్లో లభిస్తాయి. ఒక మొక్క ప్రతీ విత్తనాన్ని ఉత్పత్తి చేయడానికి దానిలో ఎక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు, ముఖ్యమైన నూనెలు మరియు నిద్రాణమైన ఎంజైములు నింపడానికి ఎంతో శ్రమిస్తుంది. విత్తనంలో జీవనం ఉంటుంది. ఇది సజీవముగా ఉన్న ఆహారమే. పచ్చి గింజలను తిని వాటిద్వారా పోషకాలను పొందడం సాధ్యం కాదు. చాలా విత్తనాలు తినదగినవి మరియు మానవులకు కావలసిన కేలరీలలో ఎక్కువ భాగం విత్తనాల నుండి ముఖ్యంగా కాయధాన్యాలు మరియు గింజల నుండి లభిస్తాయి. విత్తనాలు చాలా వంటనూనెలు అనేక పానీయాలు మరియు సుగంధ ద్రవ్యాలు మరియు కొన్ని ముఖ్యమైన ఆహార సంకలనాలను కూడా అందిస్తాయి. వేరు వేరు విత్తనాలలో బీజ పిండము లేదా బీజ పోషకము ఆధిపత్యం వహించి అనేక పోషకాలు అందిస్తుంది.

ఎంపిక మరియు నిల్వ  

విత్తనాలను తరచూ పెద్ద మొత్తంలో పొట్టుతో గాని పొట్టు లేకుండా గాని  విక్రయిస్తారు. మీరు కొన్న విత్తనాలు తాజాగా ఉన్నాయనీ నిర్ధారించుకోండి. కొవ్వు అధికంగా ఉన్నందున ఒక్కొక్కసారి ఇవి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత, కాంతి, తేమకు గురైతే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కనుక మీరు ఒకసారి విత్తనం యొక్క పైపొట్టును వాసన చూడడం ద్వారా అవి తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. పొట్టుతో ఉన్న విత్తనాలను చల్లగాను పొడిగానూ ఉన్న ప్రదేశంలో నిల్వ చేస్తే అవి ఎక్కువ నెలలు నిల్వ ఉంటాయి. విత్తనములోని పప్పు( పొట్టు తీసినవి)కొంచెం తక్కువ కాలం నిలవ ఉంటాయి.    

తయారీ మరియు సేవించే చిట్కాలు

  విత్తనాల నుండి పోషణ పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది, వాటిని పచ్చి గా తినడం. అవి వేడికి గురైన తర్వాత విషపూరిత పదార్థాన్ని ఉత్పత్తి చేసి విటమిన్లు, ఖనిజ లవణాలు, మరియు ముఖ్యమైన నూనె ప్రొఫైల్ లేకుండా చేయబడతాయి. ఒక విత్తనాన్ని వేయించిన తర్వాత దాని వర్గీకరణ సజీవం నుండి నిర్జీవంగా (చనిపోయిన ఆహారంగా) మారుతుంది. వేయించిన తర్వాత వాటి పోషకాలను సజీవంగా నిలుపుకో గల విత్తనం ఈ భూమి మీద లేదని గుర్తుంచుకోవాలి. కనుక విత్తనాలను సహజంగా లేదా పచ్చివిగానే తినాలని  ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఉప్పులేని విత్తనాలను ఎన్నుకోండి. పూత లేదా కాల్చిన విత్తనాలను చక్కెర పూసిన విత్తనాలను నివారించండి

విత్తనాల్లో అధిక కొవ్వు పదార్థం ఉన్నందున మీరు వాటిని అతిగా తినకూడదు. ఐతే విత్తనాలను తృణధాన్యాలను కలిపి ట్రైల్ మిక్స్ లేదా మిశ్రమంగా కానీ లేదా స్వయంగా కూడా తినవచ్చు. విత్తనములపై పొట్టును పండ్లు, కూరగాయలు, పాస్తా, లేదా సలాడ్లపై చిలకరించడం ద్వారా వాటికి క్రంచీ ఆకృతి మరియు రుచిని అందిస్తుంది. నువ్వులను కొన్ని రకాల పదార్ధాలపై ముఖ్యంగా రొట్టెలు, రోల్సు, సలాడ్లు మరియు వేపుళ్ళకు పైన చల్లినట్లైతే అవి చూడడానికి ఎంతో  ఆకర్షణీయంగా ఉంటాయి.  

   ఆరు రకాల విత్తనాలు:  గుమ్మడికాయ,  నువ్వులు,  పొద్దుతిరుగుడు, అవిశ, జనపనార, చియా   

1. గుమ్మడికాయ విత్తనాలు  

గుమ్మడికాయ గింజలు రుచికరమైనవి మరియు ఆరోగ్యకరమైనవి. గుప్పెడు గుమ్మడికాయ గింజలు రుచి కరమైన స్నాక్స్ గా ఉపయోగ పడతాయి.  .

గుమ్మడి కాయ విత్తనాలతో ఆరోగ్య ప్రయోజనాలు  

గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం ఖనిజ లవణానికి చక్కని ఆధారము. ఇది రక్తపోటును తగ్గించి ఆకస్మికముగా గుండె ఆగిపోవడం, గుండెపోటు మరియు స్ట్రోక్ ను నివారించడంలో సహాయపడుతుంది. ఈ విత్తనాలు రోగనిరోధక శక్తి, కణాల పెరుగుదల మరియు విభజన, నిద్ర, మానసిక స్థితి, ఇంద్రియాలైన నాలుక,ముక్కు, చెవి,కన్ను, మరియు చర్మ ఆరోగ్యం నియంత్రణకు, ఇన్సులిన్ నియంత్రణకు, పురుషులలో లైంగిక సామర్ధ్యానికి ఉపయోగపడే జింకు ధాతువుకు చక్కని మూలము. ఇది బోలు ఎముకల వ్యాధి నివారణకు కూడా తోడ్పడుతుంది. ఇతర ముడి గింజలు మరియు విత్తనాలు మాదిరిగా ఇవి మొక్కల ఆధారిత  ఒమేగా-3 (alpha-linolenic acid లేదా ALA) యొక్క ఉత్తమ వనరులలో ఒకటి. గుమ్మడికాయ విత్తనాలు ఇన్సులిన్ నియంత్రణకు సహాయపడతాయని మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మధుమేహ సమస్యలను నివారించడంలో తోడ్పడతాయని  అధ్యయనాలు సూచిస్తున్నాయి.   

గుమ్మడికాయ విత్తన నూనెలో సహజమైన ఫైటో ఈస్ట్రోజెన్లు పుష్కలంగా ఉన్న కారణంగా ఇది ప్రయోజనాకారియైన HDL కొలెస్ట్రాల్ గణనీయమైన పెరుగుదలకూ మరియు ఋతుక్రమం ఆగిన లేదా మెనోపాజ్ ఏర్పడిన తరువాత మహిళలలో కలిగే  లక్షణాలైన రక్తపోటు, వేడి ఆవిరులు(హాట్ ఫ్లాషెస్), తల నొప్పి, కీళ్ల నొప్పుల వంటి వాటిని తగ్గించడానికి తోడ్పడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నూనె కీళ్లవాపు చికిత్సలో వాపు నిరోధకంగా మరియు    యాంటీ ఇన్ఫ్లమేటరీ మందు ఐన ఇండో మెతాసిన్ (Indomethacin) పని తీరును కూడా ప్రదర్శిస్తుంది. అంతేకాదు పైఔషడం మాదిరిగా దుష్ప్రభావాలు మాత్రం ఉండవు. గుమ్మడి కాయ గింజల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యంగా ఆవిశ గింజలతో కలిపి తీసుకున్నప్పుడు గుండె మరియు కాలేయ ఆరోగ్యానికి ఎంతో  ప్రయోజనకారిగా ఉంటాయి. నిద్రించడానికి కొన్ని గంటల ముందు గుమ్మడికాయ గింజలను  కార్బో హైడ్రేట్ ఇవ్వగల  ఒక చిన్న పండు ముక్కతో  కలిపి తీసుకుంటే మీ శరీరానికి కావలసిన మెలటోనిన్  మరియు సెరోటోనిన్ ఉత్పత్తికి అవసరమైన ట్రిప్టోపాస్ ను అందించి రాత్రిళ్ళు  విశ్రాంతి పూరితమైన నిద్రను అందిస్తాయి.

  2.  నువ్వులు

నువ్వులను ప్రపంచంలో అత్యంత ఖనిజ లవణాల సంపద గల ఆహారంగా భావిస్తారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఐరన్, మాంగనీస్, జింక్, భాస్వరం, విటమిన్ బి1తో సహా అన్ని విటమిన్లు ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు సుమారుగా 100 కన్నా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్ధాలు కూడా తక్కువే. దీనిలో 3 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల డైటరీ ఫైబర్ మరియు 8 గ్రాముల కొవ్వు కలిగి ఉంటాయి. మరియు సిఫారసు చేయబడిన విలువలో నాలుగవ వంతు కాల్షియం మరియు ఇనుమును కూడా అందిస్తుంది.

  నువ్వు విత్తనాల అధిక ఆరోగ్య ప్రయోజనాలు  

నువ్వులలో రాగి అధికంగా ఉన్న కారణంగా ఇది కీళ్ళవాతవ, నొప్పి, మరియు వాపును తగ్గించి రక్తనాళాలకు నిర్మాణము, శక్తి, మరియు స్థితిస్థాపకతను అలాగే ఎముకలు కీళ్లకు కూడా శక్తిని అందిస్తుంది. నువ్వుల లోని మెగ్నీషియం ఉబ్బసం, స్ట్రోక్ మరియు మధుమేహ సంబంధిత గుండెజబ్బుల సందర్భాలలో రక్తనాళముల మరియు శ్వాసకోశాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. కోలన్ లేదా పెద్దప్రేగు క్యాన్సర్, బోలు ఎముకల వ్యాధి పార్శ్వపు నొప్పి  మరియు PMS లేదా బహిష్టుకు పూర్వ లక్షణాలు నివారణకు దీనిలో సమృద్ధిగా ఉండే కాల్షియం సహాయపడుతుంది.  నువ్వులలో అధికముగా ఉండే జింక్ కారణంగా క్రమం తప్పకుండా తింటే ఎముక ఖనిజ సాంద్రత మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  నువ్వుల గింజలలో ఉన్న ఫైటో స్టెరాల్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతాయి

 

3. పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దు తిరుగుడు విత్తనాలలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో ట్రిప్టోఫాన్ అధికంగా ఉండటం వల్ల ఇది మెదడుకు విశ్రాంతిని చేకూరుస్తుంది. ఈ విత్తనాలపైన ఉప్పు చల్లుకోవడం వలన అవి  మరింత రుచిగా ఉంటాయి.

  పొద్దు తిరుగుడు  విత్తనాల శక్తి  

పొద్దుతిరుగుడు విత్తనాలు గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ అందించే చక్కని వనరు. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు మరియు టైప్ 2 మధుమేహం  ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయి నిర్వహించడానికి సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉన్న జింక్, విటమిన్ E పోషకాలు ఆరోగ్యకరమైన కళ్ళు, జుట్టు, మరియు చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. మెగ్నీషియం నరాలు, కండరాలు మరియు రక్తనాళాలను శాంత పరచడానికి మరియు సెలీనియం నిర్విషీకరణకు,  క్యాన్సర్ నివారణకు సహాయ పడుతుంది.

పై పెచ్చుతో ఉన్న పొద్దుతిరుగుడు విత్తనాలు బరువు తగ్గడానికి లేదా నియంత్రణకు ప్రయత్నిస్తున్న వ్యక్తులకు స్మార్ట్ స్నాక్స్ గా మంచి ఎంపిక ఎందుకంటే ప్రతి విత్తనంపై ఉన్న పెక్కు తొలగించడం తినే ప్రక్రియను నెమ్మదింప జేస్తుంది. ఇతర విత్తనాల మాదిరిగా ఇవికూడా సున్నితమైన వ్యక్తులలో పార్శ్వపు నొప్పి మరియు IBS(ఇంటెస్టినల్ బోవెల్ సిండ్రోమ్) లేదా ప్రేగు రుగ్మతలను ప్రేరేపిస్తాయి

 

4. అవిశ విత్తనాలు

అవిసె గింజ యొక్క ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు దీనిలో సమృద్ధిగా ఉన్న ఆల్ఫా లినోలిక్ యాసిడ్ (ALA), డైటరీ ఫైబర్ మరియు లిగ్నన్స్ వలన కలుగు తున్నాయి. ముఖ్యమైన కొవ్వు ఆమ్లం ALA ఒక శక్తివంతమైన తాప నిరోధి, ఇది మంటను ప్రోత్సహించే బయో మార్కర్ అయిన C రియాక్టివ్ ప్రోటీన్ CRP యొక్క రక్త స్థాయిలను తగ్గించే కారకాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ALA మరియు లిగ్నన్స్ చర్యల ద్వారా అవిశ గింజలు కణితి పెరుగుదలను అడ్డుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిరూపించ బడింది. అవిసె గింజలలో కరిగేది మరియు కరగని పీచుపదార్ధము ఉంటుంది. అవిసె గింజల్లో ఉన్న ఈ ఫైబర్ ఆరోగ్యకరమైన ప్రేగు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలలో అర కప్పు వండిన ఓట్ గింజల పరిమాణం కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అవిశ గింజలలోని కరిగే ఫైబర్ రక్తములో  కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

పిండి చేసిన అవిశ మొత్తం విత్తనం కంటే ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. కాఫీ గ్రైండర్ లేదా బ్లెండర్ ఉపయోగించి అవిశగింజలను ఇంట్లో పొడి చేసుకోవాలి. అవిసె గింజల పొడిని  రిఫ్రిజిరేటర్ లో భద్రపరచి కొద్దిరోజుల్లోనే వాడాలి.

 

5. జనపనార విత్తనాలు

జనపనార విత్తనాలు ఒక అద్భుతమైన ఆహారం, ఒక సూపర్ ఫుడ్ కంటే ఎక్కువ మరియు ప్రతి ఒక్కరూ వారి ఆహారంలో  అద్భుతమైన ఈ చిన్న విత్తనాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. జనపనార విత్తనంలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాల్షియమ్,  భాస్వరం, ఒమేగా-3,ఒమేగా-6 మరియు రాగి వంటి వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజలవణాలు వంటి అనేకరకాలైన పోషక పదార్ధాలు నిండి ఉన్నాయి. అన్నిరకాల విత్తనాల మాదిరిగానే ఇవి మీ ఆహారంలో చేర్చడం సులభమే. వాటిని మొట్టమొదట ఆహారంలో చేర్చుకొనడానికి మీ అల్పాహారం, తృణధాన్యాలు,  కూర, స్మూతీస్ వంటకాలు మరియు సలాడ్ లలో ఒక టేబుల్ స్పూన్ జనపనార విత్తనాలను చేర్చడానికి లేదా ఏ పదార్ధము పైన ఐనా వాటిని చల్లుకొని స్వీకరించవచ్చు. మీరు కొద్దిరోజులలోనే వీటి ఆరోగ్య ప్రయోజనాలను గమనించడం ప్రారంభిస్తారు.  

  జనపనార విత్తనాల యొక్క శక్తి  

జనపనార విత్తనాలు నిజంగానే సూపర్ ఫుడ్ ఎందుకంటే ఇవి ఆకర్షణీయమైన పోషక పదార్ధాల జాబితాతో నిండి ఉన్నాయి. చక్కగా సంతులనము చేయబడిన 3 నుండి 1 నూనె నిష్పత్తిలోగల ఒమేగా-3 నుండి ఒమేగా-6 తో కూడిన ఈ గింజలు గామా లినోలిక్ ఆమ్లం యొక్క అద్భుతమైన మూలము.

 పది ముఖ్యమైన అమైనో ఆమ్లములను కలిగి ఉన్న ఈ విత్తనాలు 30 శాతానికి పైగా స్వచ్ఛమైన ప్రోటీన్ తో కూడి ఉండడము వలన ఇవి అద్భుతమైన రోజువారి ప్రోటీనుకు మూలముగా ఉన్నాయి. ఇవి 40% ఫైబర్ తో కూడి ఉంటాయి. ఇది భూమిపై ఉన్న ఏ రకపు ధాన్యం కన్నా అత్యధికం. దీనిలో వ్యాధి పోరాట ఫైటో స్టెరాల్స్ కూడా ఉంటాయి. అధ్యయనాలు జనపనార విత్తనాలు లేదా జనపనార పాలు కూడా గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయని మరియు అనేక అసహ్యకరమైన వ్యాధులకు వ్యతిరేకంగా పోషక సహాయాన్ని అందిస్తాయని తెలుపుతున్నాయి.   

6. చియా విత్తనాలు


 

చియా విత్తనాలు:  మెక్సికో మరియు గ్వాటిమాలా లో ఉద్భవించిన ఈ చియా విత్తనాలు అజ్టెక్ మరియు మాయన్ తెగలకు శక్తికి మరియు ఔషధాలకు ఉపయోగించే ముఖ్యమైన ఆహారము.  “చియా” అనే పదం మాయన్ భాషలో శక్తికి అర్ధం. ఈ విత్తనాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నమీదట ఇవి ఆహారంలో ముఖ్యమైన మరియు సరళమైన పదార్థంగా మారాయి.

ఈ చిన్ని విత్తనాలు ఫైబర్ ప్రోటీన్, పోషక నూనెలు, వివిధ యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాల్షియంతో నిండి ఉంటాయి. ఈ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడమే కాక  గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాగే బరువు తగ్గడాన్ని  ప్రోత్సహిస్తాయి. ఈ అద్భుతమైన విత్తనాలు  ఉత్తమమైన నాణ్యమైన ఫైబర్ కలిగి ఉంటాయి ఎందుకంటే వీటిలో 34% శుద్ధమైన ఒమేగా-3 నూనెలతో తయారు చేయ బడినాయి.  ప్రోటీన్, పోషక నూనెలు, వివిధ యాంటీఆక్సిడెంట్లు మరియు కాల్షియంతో నిండి ఉంటాయి.  చియా విత్తనాలు రక్తంలో చక్కెరను స్థిరీకరిస్తాయి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, అలాగే బరువు తగ్గడాన్ని పెంచుతాయి.  ఈ అద్భుతమైన చిన్న విత్తనాలు అధిక-నాణ్యత కొవ్వుల యొక్క అద్భుతమైన మూలం, ఎందుకంటే అవి 34% స్వచ్ఛమైన ఒమేగా -3 నూనెలతో తయారవుతాయి.  చియా విత్తనాలలో కరిగే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్‌ను స్థిరీకరిస్తుంది.  కరిగే ఫైబర్ పెద్దప్రేగును శుభ్రం చేయడానికి సహాయపడుతుంది, ఎందుకంటే ఇది పెద్దప్రేగు గుండా వెళుతున్నప్పుడు అక్కడి విషపదార్ధాలను గ్రహిస్తుంది.  చియా విత్తనాలలో లభించే ప్రోటీన్ అధిక నాణ్యత కలిగి విత్తనంలో  సుమారు 20% భాగము  కలిగి ఉంటుంది. ఇది అనేక ఇతర మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరుల కంటే ఎక్కువే. చియా విత్తనాలలో మొక్కల ఈస్ట్రోజెన్ ఉండదు, కాబట్టి అవి శరీరం యొక్క సహజ సమతుల్యతను అస్థిరము చేయవు.    

ఆధారములు :
http://healthyeating.sfgate.com
http://www.care2.com
http://www.joybauer.com
http://www.webmd.com
http://www.onegreenplanet.org
http://www.medicalnewstoday.com
http://recipes.howstuffworks.com
http://articles.timesofindia.indiatimes.com
http://www.foxnews.com
 http://www.emaxhealth.com
http://www.mensfitness.com
http://healthyeating.sfgate.com
http://www.gov.mb.ca
http://articles.mercola.com
http://www.whfoods.com
http://www.trueactivist.com

 

 

విటమిన్ B12: ఉపయోగాలు మరియు వ్యాధి నివారణ 

విటమిన్ B12ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క సాధారణ పనితీరు మరియు రక్తం ఏర్పడటములో కీలకపాత్ర పోషిస్తుంది. B కాంప్లెక్స్ కు చెందిన 8 విటమిన్లలో ఇది కూడా ఒకటి.  

  B12 విటమిన్ యొక్క విధులు ఏమిటి?

ఎర్ర రక్త కణాల అభివృద్ధి  

  B12 కి సంబంధించినంత వరకూ అందరకూ తెలిసిన విధి ఎర్ర రక్త కణాల అభివృద్ధి లో ఇది కీలక పాత్రను కలిగి ఉంటుంది. ఎర్ర రక్త కణాలు పరిపక్వత చెందుతున్నప్పుడు DNA ద్వారా అందించబడే సమాచారం అవసరం. B12 లేకుండా DNA సంశ్లేషణ మరియు ఎర్ర రక్తకణాల నిర్మాణానికి అవసరమైన సమాచారం కూడా లోప భూయిష్టంగా మారుతుంది. రక్త కణాలు ఆకారంలో పెద్దవిగా తయారై మరియు అసమర్థంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. దీనిని హానికరమైన రక్తహీనత అని పిలుస్తారు ఇది ఈ వ్యాసంలో తరువాత వివరించబడింది.

నాడీ కణాలను అభివృద్ధి చేయడం  

 B 12 యొక్క రెండవ ప్రధాన విధి నాడీ కణాల అభివృద్ధి లో పాల్గొనడం. B12 లోపము ఏర్పడితే నాడీ బాహ్య కణాలను మూసి ఉండే మైలీన్ షీత్ లోప భూయిష్టంగా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఈ విటమిన్ పరోక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ దీనిని సప్లిమెంటుగా ఇవ్వడం వలన వివిధ రకాల నాడీవ్యవస్థ రుగ్మతలను నొప్పి మరియు ఇతర లక్షణాలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుందని తేలింది.   

విటమిన్ B 12 యొక్క ఇతర పాత్రలు

  ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది ఆహారంలో ఒక భాగము. కణాల పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం శరీరం ద్వారా సరైన సైక్లింగ్ కోసం B12 పైనే ఆధారపడి ఉంటుంది. అమైనో ఆమ్లాలు అని పిలవబడే ప్రోటీన్ యొక్క అనేక ముఖ్య భాగాలు B12 లేనప్పుడు ఉపయోగపడ లేవు.  మాంసకృత్తులు  మరియు కొవ్వుల ప్రాసెసింగ్ లో ఒక దశ పూర్తి కావడానికి B12 అవసరం కాబట్టి దీని లోపము శరీరం ద్వారా కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వుల కదలికలను కూడా ప్రభావితం చేస్తుంది.  

   ఉపయోగాల పై దృష్టి

హానికరమైన రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది  

హానికరమైన రక్తహీనత అనేది శరీరం కొత్త ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయకుండా చేసే ఒక రకమైన స్థితి.  విటమిన్ B12 తీసుకోనట్లైతే  శరీరానికి ఈ పరిస్థితి ఏర్పడి ఆరోగ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది. విటమిన్ బి యొక్క సాధారణ మోతాదులను ప్రతీరోజూ గ్రహించడం ద్వారా ఈ పరిస్థితి  నిరోధించడానికి సహాయపడుతుంది.

మీ శరీరం యొక్క సహజ పెరుగుదలకు అభివృద్ధికి తోడ్పడుతుంది  

  మన శరీరంలో B12 యొక్క అత్యంత ప్రాథమికమైన విధి ఏమిటంటే  వయసు పెరిగే కొద్దీ అది మన శరీరం అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. పెరుగుదల  ఆగిపోయిన సందర్భంలో దానిని నివారించడానికి విటమిన్ B12 శరీరానికి అవసరమైన పోషణ అందిస్తుంది.

శక్తి స్థాయిలను నిర్వహిస్తుంది  

  మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు లేదా దీర్ఘకాలిక అలసటతో బాధపడుతున్నారనో కనుగొన్నట్లయితే మీ ఆహారంలో తగినంత విటమిన్ B12  లభించడం లేదని అర్ధం.  విటమిన్ B12 మీ శరీరానికి శక్తి నివ్వడానికి సహాయపడుతుంది.   

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది  

B12 తీసుకోవడం వల్ల మీ శరీరంలో హోమోసిస్టీన్ స్థాయిలు తగ్గుతాయి. హోమోసిస్టీన్ అనేది మీరు గుండె జబ్బులతో బాధ పడడానికి కారణ భూతమవుతుంది.   

మానసిక మరియు భావోద్వేగ స్థిరత్వానికి మద్దతు ఇస్తుంది    

మీ ఆహారంలో ఎక్కువ విటమిన్ B12 ను చేర్చుకోవడం మీ ఆరోగ్యానికి అలాగే మీ మెదడుకు కూడా మంచిది. వాస్తవానికి B12 మీ మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరిచి మీరు మానసికంగా స్థిరంగా ఉండటానికి సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

  విటమిన్ B12 ఎలా పనిచేస్తుంది  

విటమిన్ B12 ఇతర విటమిన్ల కన్నా భిన్నంగా పనిచేస్తుంది.  కడుపులో తయారయ్యే  ఇంట్రింసిక్ కారకము అనే అంతర్గత పదార్థం ఫ్రేగులలోనికి B12ను పీల్చుకోవడానికి వీలుకల్పిస్తుంది. ఈ కారకం జీర్ణక్రియ సమయంలో ఆహారం నుండి విడుదల అయ్యే విటమిన్ B12తో కలిసి పోతుంది. ఇంట్రింసిక్ కారకము లేని వ్యక్తులు చివరికి విటమిన్ లోపం యొక్క లక్షణాలను చూపుతారు.  

విటమిన్ బి12 లోపం యొక్క లక్షణాలు  

  విటమిన్ B12 లోపం రక్తహీనతకు దారితీస్తుంది. తేలికపాటి లోపం ఉంటే తేలికపాటి లక్షణాలు మాత్రమే కలిగిస్తుంది. రక్తహీనత తీవ్రతరం కావడంతో ఇది బలహీనత, అలసట,   తేలికపాటి తలనొప్పి, వేగవంతమైన హృదయ స్పందన, మరియు శ్వాస, పాలిపోయిన  చర్మము, నోటిపూత, తేలికగా గాయాల బారిన పడటం  లేదా చిగుళ్ళ నుండి రక్తస్రావం,   కడుపు నొప్పి, బరువు తగ్గడం, లేదా మలబద్ధకం వంటి లక్షణాలకు కారణం కావచ్చు. ఇతర లక్షణాలు చుండ్రు, పాదాలు మొద్దు బారినట్లు ఉండడం లేదా తిమ్మిరులు, నిరాశ, జ్ఞాపకశక్తి సమస్యలు, ప్రతిచర్యలు(రియాక్షన్లు) వంటివి ఏర్పడతాయి. ఈ లోపాన్ని సరిదిద్దకపోతే ఇది రక్త నాళాలను పాడుచేస్తుంది.   

  ఆహారము మరియు విటమిన్ B12  

  విటమిన్ B12 సాధారణంగా అన్ని జంతువుల ఆహారాలలో ( తేనె తప్ప) లభిస్తుంది. అనేక పుకార్లకు విరుద్ధంగా టెంపే (పులియ బెట్టిన సోయాబిన్ వేపించగా ఏర్పడే ఇండోనేసియా కూర), సముద్రపు నాచు, మరియు సేంద్రియ ఉత్పత్తులతో సహా విటమిన్ B12 కు నమ్మదగిన ధ్రువీకరించిన మొక్కల వనరులు లేవు. శాఖాహారులపై  1955 లో యు. కె. లో నిర్వహించిన తొలి అధ్యయనం ప్రకారం వీరిలో B12 లోపము ఎక్కువగా ఉన్న కారణంగా కొంతమంది నాడీ హాని మరియు జ్ణాపకశక్తి లోపము తో బాధ పడుతున్నారు. ఈ అధ్యయనముతో పాటు  అప్పటి నుండి శాఖాహారుల్లో విటమిన్ B12 లోపము గురించి నిర్వహించిన అనేక కేస్ స్టడీ లలో  మరియు ఇక్కడ వివరించిన అనేక ఇతర సాక్ష్యాలు ప్రకారం ప్రధాన స్రవంతి పోషకాహార సమాజంలో ఏకాభిప్రాయానికి దారి తీసాయి.  అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయము ప్రకారము అధిక శాకాహారుల యొక్క సరైన ఆరోగ్యానికి విటమిన్ B12 తో కూడిన బలవర్ధకమైన ఆహారాలు లేదా మందులు అవసరమును అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది.   

  •  పాలు, జున్ను, మరియు పెరుగు శాఖాహారులకు తగిన మొత్తంలో విటమిన్స్ అందిస్తుంది. వాస్తవానికి కేవలం ఒక కప్పు సాదా పెరుగు విటమిన్ B12 యొక్క రోజువారీ విలువలో సుమారు 25 శాతం అందిస్తుంది.  
  •   ఒక ఉడికించిన గుడ్డు సుమారు 0.7 mcg B12 విటమిన్ ను అనగా రోజువారీ సిఫారసు చేసిన భాగంలో 10% కలిగి ఉంటుంది
  •   B12 కలిగిన తృణధాన్యాలు, సోయా పాలు మరియు ఈస్ట్ సారాలు వంటి అనేక శాఖాహార పదార్ధాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
  • ఎక్కువ మంది శాఖాహారులు ఉన్నందున పాలవిరుగుడు పౌడరు ఇప్పుడు ప్రధాన స్రవంతి లోనికి ప్రవేశిస్తోంది. పాలవిరుగుడు పొడి రొట్టెలు మరియు స్మూతీలకు ఒక సాధారణ అదనఊపు ఆహారంగా ఉంటుంది, 100 గ్రాములు 2.5 μg విటమిన్ బి 12 లేదా DV (డైలీ వాల్యూ/రోజువారీ తీసుకోవలసినది)లో 42% అందిస్తుంది.
  • ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్  స్ప్రెడ్‌లు బ్రిటన్ మరియు ఐరోపాలో ప్రాచుర్యం పొందాయి. అలాగే యు.ఎస్. లో కూడా ప్రజాదరణ పొందడం ప్రారంభించాయి. ఇది ప్రోటీన్ యొక్క మంచి శాఖాహార వనరు మరియు దీనిలో చాలా విటమిన్ B12 ని కలిగి ఉంటుంది. వంద గ్రాముల ఈ పదార్ధంలో  0.5 μg (8% DV) విటమిన్ B12 ను అందిస్తాయి, అంటే ఒక టీస్పూన్‌కు 0.03 μg (1% DV).

 రోగ నిర్ధారణ 

  • ఎర్ర రక్త కణాల స్థాయిని కొలవడానికి మరియు వాటి రూపాన్ని తనిఖీ చేయడానికి ప్రామాణిక రక్త పరీక్షలు - విటమిన్ B12 లోపం ఉంటే, ఎర్ర రక్త కణాలు  పెద్దవి గానూ  మరియు అసాధారణంగా కనిపిస్తాయి.
  • B12 స్థాయిలను కొలవడానికి రక్త పరీక్షలు-ఈ పోషకాలలోని లోపాలను తనిఖీ చేయడానికి ఇనుము మరియు ఫోలేట్ స్థాయిలను కూడా కొలవవలసి ఉంటుంది.
  • మిథైల్ మెలోనిక్ ఆమ్ల స్థాయిని కొలవడానికి రక్త పరీక్ష - ఒక వ్యక్తికి B12 లోపం ఉన్నప్పుడు మిథైల్ మెలోనిక్ ఆమ్లం యొక్క రక్త స్థాయి పెరుగుతుంది.
  • అంతర్గత కారక (ఇన్ట్రిన్సిక్ ఫ్యాక్టర్)యాంటీబాడీ(ప్రతి రోధకలు) కోసం రక్త పరీక్షలు- ఇవి మీకు హానికరమైన రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడానికి యాంటీబాడీ స్థాయిల కోసం చేసే  ప్రత్యేక పరీక్షలు.  కడుపులో అంతర్గత కారకం లేని చాలా మందికి వారి రక్తంలో ఈ ప్రతిరోధకాలు ఉంటాయి.

 చికిత్స

 చికిత్స ద్వారా B12 లోపాన్ని సరిదిద్దడం జరుగుతుంది. B12 తీసుకోలేని వారికోసం క్రమం తప్పకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం అవసరం. మొదట ఇంజెక్షన్లు ఇచ్చినప్పుడు తీవ్రమైన లక్షణాలతో ఉన్న రోగికి ఈ పోషకంతో శరీర నిల్వలను పునరుద్ధరించడానికి మొదటి వారంలో ఐదు నుండి ఏడు ఇంజక్షన్ల వరకూ ఇవ్వవచ్చు. కొత్త ఎర్ర రక్త కణాల చురుకైన ఉత్పత్తితో ప్రతిస్పందన సాధారణంగా 48 నుండి 72 గంటలలో కనిపిస్తుంది. ఒకసారి B12 నిల్వలు సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత, లక్షణాలు తిరిగి రాకుండా ఉండటానికి ఒకటి నుండి మూడు నెలల వరకు ఒక్కొక్కటి చొప్పున విటమిన్ B12 ఇంజెక్షన్లు అవసరం.

 విటమిన్ B12 ను గ్రహించలేని వ్యక్తులు ఆరోగ్యకరమైన రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఇతర పోషకాలను (ఫోలిక్ యాసిడ్, ఐరన్ మరియు విటమిన్ సి) అందించే సమతుల్య ఆహారం తినడం కొనసాగించాలి. ఒక్కొక్కసారి ప్రజలు  ఇంజెక్షన్లకు బదులుగా B12 భర్తీ చేయడానికి నోటిద్వారా అధిక మోతాదులో B12 తీసుకోవచ్చు, కాని వైద్యుడు దీనిని నిశితంగా పర్యవేక్షించాలి.

పోషకాహార ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే విటమిన్ B12 లోపం చికిత్సకు సులభమైనది. నోటి ద్వారా B12 సప్లిమెంట్స్ తీసుకొని B12 ఉన్న ఆహారాన్ని జోడించడం ద్వారా ఈ పరిస్థితిని చక్క దిద్దవచ్చు.

 ఆశించిన వ్యవధి

 సరైన చికిత్సతో విటమిన్ B12 లోపం యొక్క లక్షణాలు కొన్ని రోజుల్లో మెరుగుపడటం ప్రారంభిస్తాయి. B12 సంబంధిత పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్న శాఖాహారులు మరియు ఇతర వ్యక్తులలో నోటి ద్వారా తీసుకొనే B12 సప్లిమెంట్ మరియు విటమిన్ B12 వినియోగాన్ని పెంచడానికి రూపొందించిన ఆహారం ఈ పరిస్థితిని నయం చేస్తుంది.   

మూలములు;
http:/ / en.wikipedia.org/ wiki/ Vitamin_B12
http:/ / ods.od.nih.gov/ factsheets/ VitaminB12-QuickFacts/
http:/ / www.livestrong.com/ article/ 256121-what-is-vitamin-b12-good-for/
http:/ / www.fitday.com/ fitness-articles/ nutrition/ vitamins-minerals/ the-benefits-of-vitamin-b12.html
http:/ / health.howstuffworks.com/ wellness/ food-nutrition/ vitamin-supplements/ vitamin-b-12-.htm
http:/ / www.veganhealth.org/ articles/ vitaminb12
http:/ / www.healthaliciousness.com/ articles/ Top-5-Natural-Vegetarian-sources-Vitamin-B12.php
http:/ / www.whfoods.com/ genpage.php?tname=nutrient&dbid=107
http:/ / www.drugs.com/ health-guide/ vitamin-b12-deficiency.html 

 

***ప్రాక్టీషనర్లకు సూచన ***

  1. మన వెబ్సైట్  www.vibrionics.org. దీనిలో ప్రాక్టీషనర్ పోర్టల్ లో లాగిన్ అగుటకు మీ రిజిస్ట్రేషన్ నంబరు కావాలి.
  2.  మీ ఇమెయిల్ ఎడ్రస్ మారినప్పుడు వెంటనే   [email protected] కు వీలయినంత తొందరగా తెలియజేయండి. ఈ విషయాన్ని ఇతర ప్రాక్టీ షనర్ లకు కూడా తెలియజేయండి. ఈ వార్తలేఖను మీ పేషంట్ లకు కూడా తెలియ జేయవచ్చు. వారికేమయినా సందేహాలుంటే మీ ద్వారా మన పరిశోధనా మరియు స్పందన విభాగానికి తెలియ జేస్తే తగు సమాధానాలు ఇవ్వబడతాయి. మీ సహకారానికి ధన్యవాదాలు

 .

 

 

  ఓం సాయి రామ్!