Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

నడుము నొప్పి 11656...India


33 సంవత్సరాల వ్యక్తి 2022 ఫిబ్రవరిలో మెట్లపై నుంచి జారిపడిన తరువాత,  రెండేళ్లుగా నిరంతర నడుము నొప్పితో బాధపడుతున్నారు. ప్రతిరోజూ మోటార్‌సైకిల్‌పై ఉద్యోగానికి వెళ్లడం లేదా శారీరక శ్రమ చేయడం వల్ల నొప్పి మరింత తీవ్రమయ్యేది. వైద్య పరీక్షల్లో వెన్నెముక స్వల్పంగా స్థానభ్రంశం చెందడంతో నరంపై ఒత్తిడి ఏర్పడినట్లు నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు, నొప్పి ఎక్కువైనప్పుడు మాత్రమే 4 నుండి 5 రోజులపాటు ఫిజియోథెరపీ చికిత్స తీసుకునేవారు. దాని వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగేది. ఆయుర్వేద నూనెతో మర్దన చేయించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన స్వల్ప ప్రయోజనం కలిగినప్పటికీ, నొప్పి పూర్తిగా తగ్గలేదు. అయితే, ఆయన నొప్పి నివారణ మాత్రలను తీసుకోవడం మాత్రం నివారించారు.

ప్రాక్టీషనర్ని కలుసుకోవడానికి కొద్దిరోజుల ముందు, తీవ్రమైన నొప్పి కారణంగా ఆయన మరోసారి నాలుగు రోజుల ఫిజియోథెరపీ చికిత్సను పూర్తిచేశారు. ఎప్పటిలాగే, నొప్పి కొంత తగ్గినప్పటికీ పూర్తిగా తగ్గకుండా అలాగే కొనసాగింది. ఆ తరువాత అన్ని రకాల చికిత్సలను నిలిపివేయాలని నిర్ణయించుకుని, 2024 మార్చి 19న ప్రాక్టీషనర్ని సంప్రదించగా, ఆయనకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది::

#1. CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine...BD ఆవాల నూనెలో తయారుచేసి, బాహ్యంగా రాసుకోవడానికి

#2. CC10.1 Emergencies + #1...TDS

చికిత్సలో పురోగతి:

3 ఏప్రిల్ 2024: నొప్పి 30% తగ్గింది.

11 ఏప్రిల్ 2024: నొప్పి 60% వరకు తగ్గింది; ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎక్కువ దూరం మోటార్‌సైకిల్ నడపగలిగారు.

16 జూన్ 2024: నొప్పి పూర్తిగా నయమైంది!

23 జూన్ 2024: రోగి స్వయంగా మందులు తీసుకోవడం నిలిపివేశారు.

2025 అక్టోబరు నాటికి, ఆయనకు నొప్పి తిరిగి రాకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.