దురద మరియు నీరు కారే కనులు, కంటి శుక్లాల శస్త్ర చికిత్స అనంతర స్థితి 11629...India
50 ఏళ్ల మహిళా వ్యవసాయ కార్మికురాలికి 2 సంవత్సరాల క్రితం కుడి కన్నుకు కంటిశుక్లం కోసం ఆపరేషన్ చేయబడింది. కానీ ఆమె దృష్టి 25% నుండి 75% మాత్రమే మెరుగుపడింది. అంతేకాక తన పొలంలో పనికి వెళ్లినప్పుడు తీవ్రమైన ఎండకు మరియు ధూళికి గురి అయినప్పుడల్లా కంటిలో దురద మరియు కంటివెంట నీరు నిరంతరం నీరు కారుతూ ఉంటోంది. వైద్యులు సూచించిన ఫ్లూబిగాట్ మరియు అరా ఐడ్రాప్స్ ఉపయోగిస్తోంది, కానీ అవి ఆమెకు సహాయం చేయలేదు. క్రమంగా ఆమె ఎండకు లేదా ధూళికి గురి కాక పోయినా పై లక్షణాలు ఏర్పడడం ప్రారంభించాయి. ఇది ఆమె రోజు వారి పనికి ప్రతికూలంగా ప్రభావితం కావడంతో చాలా బాధ అనుభవిస్తూ ఉంది. 2020 మార్చి 9న ఆమె ప్రాక్టీషనరును సందర్శించినప్పుడు ఆమె కుడి కన్ను నిరంతరంగా నీరు కారుతోంది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC7.3 Eye infections + CC7.6 Eye injury…6TD మౌఖికంగా & డిస్టిల్ వాటర్ లో కంటిచుక్కలుగా TDS
ఆమె మెరుగుదల అనుభూతి చెందటం ప్రారంభించగానే మూడు రోజుల తర్వాత అల్లోపతి కంటి చుక్కలు తీసుకోవడం ఆపివేసారు. మార్చి 14 నాటికి నీరు కారడం 50% తగ్గింది. దురద స్వల్పంగా తగ్గింది ఐతే మొత్తంమీద కంటిచూపు కొంత మెరుగుపడింది. ఇప్పుడు మౌఖికంగా తీసుకొనే రెమిడీ కూడా TDS తగ్గించబడింది. ఏప్రిల్ 12న ఆమె దృష్టి పూర్తిగా సాధారణమైనదని మరియు కంటిలో దురద మాయమైందని కానీ కంటి నుండి నీరుకారడం ఇంకా స్వల్పంగా కొనసాగుతోందని తెలిపారు. మే మొదటి వారం నాటికి ఆమె అన్ని లక్షణాల నుండి విముక్తి పొందారు. ఎండ మరియు ధూళి ఉన్నప్పటికీ పొలంలో సాధారణంగా పని చేసుకోగలుగుతున్నట్లు తెలిపారు. మే 25న మౌఖికంగా మరియు బాహ్యంగా తీసుకొనే రెమిడీలు OD కి తగ్గించడం జరిగింది. 2021 మార్చి నాటికి ఆమె చక్కగా పనిచేసుకుంటూ రెమిడీ OD గా కొనసాగించసాగారు.